Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dhyāna Vāhini · Fixing the Mind on One Thing Is the Essence of Dhyāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
13.
మనసును
ఒకే
విషయముపై
నిలుపుటే
ధ్యాన
సారము
ధారణ
వలన
జ్ఞానము,
లోచూపు,
ఎఱుక,
భగవంతునితో
ఐక్యత
కలుగును
సాధనా
క్రమమును
కొద్ది
కొద్దిగా
అభ్యాసము
చేయుచు,
ఆ
అభ్యాసము
మధ్యన
విడువకుండిన,
ఆ
అభ్యాసమువల్ల
చంచలమైన
మనసు
అటు
ఇటు
పోయినపుడు
దానిని
ఒక
విషయమునందు
నిలుపవచ్చును.
అదే
ఏకాగ్రత
యనబడును.
దీనినే
తదేక
మనసు
అని
కూడ
అంటారు.
క్రొత్తగా
సాధన
ప్రారంభించు
వారలకు
ధారణ
చాల
విసుగుగా
కన్పించును.
అందు
కొంత
అభ్యాసము
కుదిరిన
తరువాత
దాని
అభ్యాసము
విడువరు.
ఆ
అభ్యాసము
చేయని
రోజున
వారల
కేమాత్రము
మనసుకు
శాంతి
యుండదు.
ధారణవల్ల
మనిషికి
దివ్యమైన
సంతోషము.
ధారణ
వల్ల
మిక్కుటమైన
జ్ఞానము,
లోచూపు,
ఎఱుక,
భగవంతునితో
నైక్యత
మొదలగునవి
గలుగును.
ఈ
శాస్త్రము
ముల్లోకములందును
ఆశ్చర్యకరమైనది.
2
▾
Meaning
Keep
మనస్సు
రెప్పపాటులో
ఎన్ని
చోట్లకో
పోవును.
ఎన్ని
కార్యములో
తలంచును.
తిరిగి
వచ్చును.
మనస్సు
ఊహింప
శక్యము
గాని
వేగముతో
పనిచేయును.
ఒక
వస్తువును
గ్రహించి,
దానిని
గురించి
కొంత
ఆలోచించి,
తక్షణమే
దానిని
వదలి
మరొక
విషయమును
ఆలోచించును.
ఒక
గిన్నె
నుండి
మరొక
గిన్నె
లోనికి
నూనె
ఏకధారగా
వేయునపుడు
ఉండెడి
అఖండ
ధారనే
ధారణయని
పిలువ
వచ్చును.
3
▾
Meaning
Keep
ధారణా
ధ్యానమే
క్షేమ
మార్గము
సాధకుడొక
విషయమునుండి
మరొక
విషయమునకు
భావము
మారునపుడు,
మనసును
సరియైన
మార్గములోనికి,
సరియైన
విషయములోనికి
తీసికొని
రావలెను.
ఇట్టిదే
ఆధ్యాత్మిక
సాధన
యనబడును.
దీనినే
ధారణా
ధ్యానమందురు.
అట్లుగాక
పైరెండును
యోచింపక,
అందులోనుండి
ఇందులోనికి,
ఇందులోనుండి
అందులోనికి
ఊరకే
మారుచుండిన,
అది
మర్కట
ధ్యానమందురు.
సాధకులకు
మర్కట
ధ్యానము
ప్రమాదకరము.
4
▾
Meaning
Keep
ధారణా
ధ్యానమే
క్షేమ
మార్గము.
ముఖ్యముగా
ధారణా
ధ్యానములో
మనస్సుయొక్క
ప్రయాణమును
తగ్గించి,
ఒక
విషయమునందే
నిలబెట్టును.
అట్టి
స్థితిని
విడువక
చాల
కాలము
సాధన
చేయవలెను.
అందలి
హాయికి,
ఆనందమునకు
మితి
లేదు.
5
▾
Meaning
Keep
ఏదైన
ఒక
బల్ల
విషయమై
ధ్యానము
చేయునపుడు,
దానియొక్క
చెక్క,
దాని
సైజు
లేరీతిగా
తీర్చినది,
ఎట్లు
తయారు
చేసినది
జ్ఞప్తికి
తెచ్చుకొని,
వాటిని
గురించి
భావన
చేయవలెను.
ఇతర
విషయము
లేవియు
జ్ఞాపకము
రాకూడదు.
అప్పుడు
ఒక
మంచము
జ్ఞాపకమునకు
వచ్చిన,
బల్ల
పూర్తిగాదు.
మంచము
కాదు.
రెండు
లేక
పోవును.
భావనా
స్థితి
ఏక
రసముగా
నుండవలెను.
6
▾
Meaning
Keep
అట్లే
భగవత్స్వరూపమును
ధ్యానము
చేయునపుడు
ఏయే
అవయవములెట్లుండును,
ఏ
రూపమెట్లుండునని
వాటిని
మొదట
జ్ఞాపకము
తెచ్చుకొని
తరువాత
ఒకదానికి
నొకటి
అతికించుకొనుచు
ఆ
శరీరమును
పూర్తి
చేయవలెను.
ఒక్కొక్క
యంగము
చిత్రించవలెను.
కడకు
అన్నియు
స్వస్వరూపముగా
చేయవలెను.
ఇది
ధ్యానము.
7
▾
Meaning
Keep
ఇట్లు
చూడగా
చూడగా
ఒక
రూపము
వచ్చును.
ఆ
రూపమును
చూడగా
చూడగా
కడకదియు
మరుగయి
నిన్ను
నీవు
మరతువు.
దానినే
సమాధియందురు.
మానవుడు
అట్టి
సమయమున
ఒకే
భావము
కలిగియున్నప్పుడు
సవికల్ప
సమాధి
యనియు,
ఏ
భావము
లేకుండ
మనసు
ఖాళీగా
నుండిన,
రాజయోగ
శాస్త్రమందు
పతంజలి
దెలిపిన
భావ
నాశము
అనబడును.
8
▾
Meaning
Keep
మనసు
జడ
వస్తువయినా,
సూర్యుని
కెదురుగా
నీరు
పెట్టిన,
ఆ
నీరెట్లు
వేడెక్కునో
అట్లు
మనస్సు
కూడ
ఆత్మయను
అధిష్ఠానము
నుండి
ప్రకాశము
తీసికొని
చైతన్యముగా
కనిపించును.
వెనుకనుండి
బుద్ధి,
మనస్సునందు
ప్రతిఫలించును.
అజ్ఞాన
స్వరూపమైన
మనసు
యొక్క
మూలము,
బుద్ధియని
తెలియవచ్చును
(కలిగియుండినట్లు
కనిపించును).
ఇదియే
సరియైన,
నిజమైన
స్వరూపము.
మనస్సు
ఆత్మవలె
స్వయంప్రకాశము
గల
వస్తువు
కాదు.
దీని
కాంతి
వర్షాకాలమునందు
మిణుగురు
పురుగు
కాంతివంటిది.
ఆత్మ
సూర్యునకు
సూర్యుడు.
ప్రకాశమునకు
ప్రకాశము.
అదియే
పరంజ్యోతి.
అదియే
స్వయంజ్యోతి.
9
▾
Meaning
Keep
మనస్సును
స్వాధీనము
చేసికొన్న,
ఇంద్రియములు
స్వాధీనమునకు
వచ్చును
దేనిని
గురించి
ధ్యానము
చేయుదురో
దానిని
వదలి,
మనసు
వేరొక
దానిపై
పోనీయకూడదు.
ఎక్కడకు
పోయినను
నీవు
ధ్యానించు,
దానిపైననే
తిరిగి
త్రిప్పవలెను.
కడకు
కావలెనన్న
సర్వ
వస్తువులు
ధ్యానించు.
దానియందే
చేరును.
కాని
మొదటి
ఒక్క
రూపమునే
ధ్యానింపవలెను.
దినమొకటి
ధ్యానింపరాదు.
మార్చరాదు.
10
▾
Meaning
Keep
ఏ
విషయములు
ఆలోచించినను
నీకిష్టములేని
విషయములను
గాని,
నిన్ను
బాధపెట్టు
విషయములను
గాని,
నీ
నమ్మకము
చలింపజేయు
విషయములను
గాని
తలంపరాదు.
లేకున్న
వాటిని
కూడ
క్రమక్రమేణ
మంచి
భావములుగా
దలంచి,
అందులో
నున్న
మంచిని
గ్రహింపవలెను.
ఈ
రీతిగా
ఇంద్రియములను
కూడ
స్వాధీనము
చేసికొనవలెను.
11
▾
Meaning
Keep
ఇంద్రియములు
స్వతంత్రించి
ఏ
పనియు
చేయలేవు.
ఇంద్రియములను
స్వాధీనపరచుకొనవలెనన్న,
మనస్సును
స్వాధీనము
చేసికొన్న,
ఇంద్రియములు
స్వాధీనమునకు
వచ్చును.
మనస్సును
వశము
చేసికొనక,
కేవలము
ఇంద్రియములను
జయించుటకు
కొన్ని
కఠిన
నియమముల
ననుసరింతురు.
అట్టివారు
అజ్ఞానులు.
అట్టి
వారికి
విషయముల
ననుభవించవలెననెడి
ఆసక్తి
లేక
కోరిక
పూర్తిగా
నశింపదు.
ఖజానా
కాపలావాండ్రెంత
జాగ్రత్తగా
కాపలా
కాస్తున్నప్పటికిని,
తెలివిగల
బందిపోటు
దొంగ
ఆశ్చర్యకరముగా
దోపిడీ
చేయును.
అదే
విధముగా
జ్ఞాని
వివేకము
గల్గి
ఇంద్రియములను
తన
స్వాధీనమునందుంచుకొనుటకు
గట్టి
ప్రయత్నము
చేయుచున్నను,
అపాయకరమైన
ఇంద్రియములు
మనస్సును
బలవంతపెట్టి
వాటివైపు
లాగికొని
పోవుచుండును.
12
▾
Meaning
Keep
ధారణకు
సాత్త్విక
గుణములు
కలిగియుండుట
ప్రధానము
చూడు!
విశ్వామిత్ర
మహర్షి
కఠినమైన
తపస్సు
నాచరించియు,
ఇంద్రుని
వలన
పంపబడిన
అప్సరసవల్ల
మనస్సు
కలవరపడి
లోబడిపోయెను.
కేవలము
బయట
తలుపులు
వేసి,
లో
తలుపు
వేసికొనక
నిద్రించిన,
తప్పక
అపాయము
కల్గును.
బయట
ద్వారము
మూసి,
లో
ద్వారము
కూడ
మూసియుంచిన
ఎట్టి
దొంగ
అయినా
లోపల
ప్రవేశించుటకు
కష్టమగును.
చెరుపును
చేయలేడు.
13
▾
Meaning
Keep
అట్లే
సాధకుడు
మొదట
తన
శరీర
భవనము
యొక్క
బహిర్ధ్వారములు
మూయవలెను.
అనగా
నింద్రియములను
అరికట్టవలెను.
తరువాత
విషయ
పరంపరలతో
నిండియుండిన
లోపలి
మనసును
శాంతి
వల్లను,
వైరాగ్యము
వల్లను
స్వాధీనము
చేసికొనవలెను.
అప్పుడు
నిజమైన
ఆనందమును,
ఆత్మ
స్వరూపమును
చూడగలరు.
14
▾
Meaning
Keep
అందు
నిమిత్తమే
కృష్ణుడిట్లు
నొకతూరి
అర్జునునితో
చెప్పెను.
“అర్జునా!
ఇంద్రియములను
అరికట్టువాడు
నాయందు
పూర్తిగా
నమ్మకము
కలిగియుండవలెను.”
ఇంద్రియము
లెప్పుడు
బహిర్గతములగుటకు
నాసక్తి
గలిగియుండును.
కాబట్టి
అవి
అజ్ఞానిని
బాహ్య
వస్తువులవైపు
లాగుచుండును.
కాని
వివేకము,
వైరాగ్యము
గల
సాధకుడు
వాటి
బహిర్
వృత్తికి
ఆటంకము
కలిగించి,
ఇంద్రియముల
ఉద్రేకమునణచి,
బండి
తోలువాడు
గుఱ్ఱముల
పగ్గములు
పట్టినట్లు
వాటి
ఉద్రేకముల
నణగద్రొక్కును.
15
▾
Meaning
Keep
స్వాధీనమునందు
లేని
ఇంద్రియములు
చాల
నాశనము
చేయును.
అట్టివాడు
ఒక
సెకండయినను
ధ్యానము
చేయలేడు.
ధ్యాన
ధారణకు
ముఖ్యము
రూపము.
అది
ఏదుట
లేకపోయినను,
దానిని
చూచుటకు
నీకు
శక్తి
గలిగియుండవలెను.
సరియైన
ధారణ
యున్న
యెడల
అది
అంత
కష్టము
గాదు.
కొంత
మంది
మంచి
మార్గములను
అలవాటు
చేసికొనుటలో
శ్రద్ధ
వహించక
ధారణ
ప్రారంభింతురు.
అది
తెలివి
తక్కువ.
16
▾
Meaning
Keep
ధారణకు
సాత్త్విక
గుణములు
కలిగియుండుట
ప్రధానము.
మొదటినుంచి
మంచి
మార్గమందు
ప్రవర్తించి,
మనస్సును
పవిత్రపరచుకొనుడు.
తదుపరి
ధారణ
అభ్యసింపుడు.
మనస్సు
పవిత్రముగా
లేనిదే
ధారణ
వలన
నేమియు
ఉపయోగము
లేదు.
ఎందరో
మహనీయులు
ధారణ
మాత్రము
గలిగి,
అలవాట్లు
సరియయినవి
గాక
భ్రష్టులగుచున్నారు.
17
▾
Meaning
Keep
ధారణ
మనసున
కిష్టము
లేని
వస్తువుపై
నిలుపరాదు.
నిల్పినను
నిల్చుట
కష్టము.
సంతోషమిచ్చు
వస్తువుపై
మొదట
ధారణ
నిలుపవలెను.
పద్మాసనముపై
కూర్చుండి
నాసికాగ్రమున
దృష్టి
నిలుపవలెను.
మొట్టమొదట
నిమిషము,
మూడు
నిమిషములు,
ఆరు
నిమిషములు,
తరువాత
తొమ్మిది
నిమిషములు,
ఇట్లు
కొంత
కాలము
క్రమక్రమముగా
బలపరచి,
తొందరపడక,
తదుపరి
అర్ధ
గంట
వరకు
నిలుపవచ్చును.
నిర్బంధము
చేయరాదు.
నెమ్మదిగా
దృష్టిని
అభివృద్ధి
పరుచవలెను.
ఈ
అభ్యాసముతో
మనసు
స్థిరపడిన,
ధారణా
శక్తి
వృద్ధియగును.
ధారణ
కలుగుటకు,
ఏకాగ్రత
కలుగుటకు
కొంత
కష్టపడవలెను.
భగవంతునియందే
మనస్సుంచి
ఇంక
ఇతర
విషయములు
స్ఫురణకు
రానీయకూడదు.
ఈ
రీతిగా
తరచు
అభ్యసించడం
వల్ల
చివరకు
నీ
హృదయ
వాసియగు
ఆత్మయందు
దృష్టి
స్థిరముగా
నిల్చియుండును.
ఇదియే
ధ్యానియొక్క
గమ్యము.
ధ్యానము
యొక్క
పూర్ణ
ఫలము.
18
▾
Meaning
Keep
మనస్సు,
మనో
వృత్తులు
ఒకే
వస్తువుపై
స్థిరముగా
కేంద్రీకరించి
యుంచు
స్థితినే
ధారణ
యందురు
మొదట
ధారణ
అన్న
నేమో
తెలిసికొనవలెను.
మనసును
ఒక
వస్తువుపై
నిలుపుట.
దీనినే
యోగ
శాస్త్రమందు
ధారణయందురు.
మనస్సు,
మనో
వృత్తులు
ఒక
వస్తువుపై
కదల
మెదలక
కేంద్రీకరించిన
స్థితి
ధారణ
యనబడును.
ధారణ
నుండియే
ధ్యానము
కుదురును.
ధారణ
యొక్క
ముఖ్య
లక్షణము
అచంచలత్వము.
దాని
శక్తి,
చంచలత్వమును
నశింపజేయుట.
దాని
రూపము,
కదలిక
లేక
యుండుట.
ఆనందమే
దాని
కారణము.
19
▾
Meaning
Keep
ధ్యానమునకు
నామమే
ముఖ్యావసరము.
త్వరలో
ఉత్తీర్ణత
దెచ్చి
యిచ్చునది
నామమే.
త్వరలో
అట్టి
నమ్మకము
కనిపించకుండినను
సరే,
నమ్మకము,
నామము
మాత్రము
మానరాదు.
మార్చరాదు.
అట్లుండిన
కొంత
కాలమునకు
తప్పక
జయమును
పొందగలవు.
ధ్యానమే
ఆధ్యాత్మిక
బలము.
భవరోగము
కుదిరించు
బలమైన
మందు.
కోపము,
గర్వము,
మమకారము,
ఇతరుల
తప్పులు
కనిపెట్టవలెనను
ఆసక్తి,
కృత్రిమ
బుద్ధి
యిత్యాది
గుణములు
ధ్యానమునకు
కఠినమైన
ఆటంకములు.
వాటిని
చేర్చరాదు.
ఇవి
మనసున
సూక్ష్మరూపమున
దాగియుండును.
ఇవి
సముద్రపు
అంతర్భాగమున
జలప్రవాహము
వలె
పనిచేయును.
20
▾
Meaning
Keep
సాధకుడు
సౌమ్యముతో
కూడిన
ప్రేమ
భావమును
నలవరచుకొనవలెను
సాధకుడు
స్వల్ప
విషయములందు
కూడ
త్వరగా
కోపించకూడదు.
అట్లుండిన
ధ్యానమందు
ఎంత
మాత్రము
వృద్ధి
గలుగదు.
అతడు
సౌమ్యముతో
కూడిన
ప్రేమ
భావము
నలవరచుకొనవలెను.
అప్పుడు
చెడు
అలవాట్లు
తప్పిపోవును.
చెడు
అలవాట్ల
నభ్యసించుటకు
కోపమే
ప్రథమ
పీఠము.
అది
యుండిన
ఏ
నిమిషమందైనను,
ఎట్టి
దానియందైనను,
ఏ
విధమైన
చెడ్డలైన
చేయవచ్చును.
కావున
మొదట
దానిని
రూపుమాపవలెను.
క్రమేణ
ప్రయత్నించవలెను.
21
▾
Meaning
Keep
సాధకులు
తన
తప్పులు
ఎవరైన
బయటపెట్టినప్పుడు
ఓపికతో
దానిని
సర్దుకొనుటకు
ప్రయత్నించి,
తన
తప్పును
తెలిపిన
వారికి
కృతజ్ఞులుగా
నుండవలెను.
కాని
తెలిపిరి
కదా
యని
వారిపై
కోపించరాదు.
అప్పుడు
మంచిని
ద్వేషించినట్లుగును.
మంచిని
ద్వేషించిన,
అలవడునవి
చెడుగా
నుండును.
కావున
మంచిని
ప్రేమించి,
చెడ్డను
వదలవలెను.
వాటిపైనను
ద్వేషముంచరాదు.
అట్టివాడు
ఆధ్యాత్మిక
జ్ఞానమునందును,
ధ్యానమునందును
వృద్ధి
బొందగలడు.
Previous
←
Rooting Out Impure Vāsanā: the Good Sign for Dhyāna
Next
The Growth of the Sāttvic Is Dhyāna
→