Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · Dharma Is the Basis of the Existence of All Beings
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
1
ధర్మం
జీవకోటి
మనుగడకు
ఆధారం
ఆత్మశాంతికి,
అఖిల
విశ్వశాంతికి
మానవులు
ధర్మదీక్ష
వహించవలెను;
ధర్మాచరణం
చేయవలెను.
ధర్మమయ
జీవనుడు
కానివాడు,
ఆత్మశాంతి
పొందలేడు,
హరి
ప్రీతి
కలిగించలేడు.
ధర్మం
ప్రపంచ
జీవకోటి
యొక్క
మనుగడకు
ఆధారభూతం,
సార్వకాలిక
సత్యం.
ధర్మమయ
జీవనము
తరుగైనపుడే
లోకం
కడగండ్లకు,
కల్లోలాలకు
గురి
అవుతుంది.
ధర్మజ్యోతి
ప్రకాశం
వెలుగొందని
స్థానములో,
శోకాంధకారం
క్రమ్ముకొంటుంది.
భగవంతుడు
ధర్మదేవత,
ధర్మప్రియుడు,
ధర్మపాలకుడు,
ధర్మస్థాపకుడు,
ధర్మస్వరూపుడు.
మన
వేద
శాస్త్ర
పురాణేతిహాసములు,
ధర్మ
ప్రాశస్త్యమును
గూర్చి
ప్రశస్తంగా
ఉద్ఘోషించుచున్నవి.
వివిధ
మతశాస్త్రాలలో
కూడా
వాని
వాని
పరిభాషల్లో
ధర్మప్రాధాన్యమును
ప్రబోధించినవి.
ధర్మనారాయణుని,
ధర్మస్వరూపుణ్ణి
ఆరాధించడము
ప్రతి
మానవునకూ
కర్తవ్యం.
ధర్మకర్మవాహిని
యేనాటికి
ఎండిపోయెడిది
కాదు.
అది
యొక్కడ
యొండిపోవునో
అక్కడ
సంపూర్ణ
వినాశనమే
ఫలితము.
అంతర్వాహినియైన
సరస్వతివలె
ధర్మకర్మ
అవ్యక్తముగా
లోన
జాలుగానైనా
ప్రవహిస్తుండబట్టే
ప్రపంచము
ఇంతవరకు
జీవించియున్నది.
ధర్మము
మానవకోటికే
కాదు,
పశుపక్షి
మృగాదులకు
కూడా.
అవి
కూడనూ
యథాశక్తి
ధర్మమును
నిర్వహిస్తూవుండును.
కాన,
ధర్మవాహిని
సువ్యక్తముగా,
సంపూర్ణముగా
ప్రవహించవలెను.
అప్పుడు
లోకము
సమస్త
సుఖములనూ
పొందుతుంది.
2
▾
Meaning
Keep
ధర్మతత్వ
విశేషములు
తగినంతగా
విదితములు
గాకపోవటము
చేతనే
ప్రపంచరంగంపై
అనర్థము
తాండవిస్తూ
వున్నది.
ధర్మహృదయమును
మానవులు
సక్రమరూపంలో
గ్రహించవలసివున్నది.
అయితే
ధర్మమంటే
ఏమి?
ధర్మతత్వమంటే
ఏమిటి?
ప్రతి
వ్యక్తి
ధర్మమును
సమాచరించ
వీలగునా?
సాధారణ
మానవులు
సైతము
ధర్మమును
ఆచరించిన,
లోకమున
సక్రమముగా
జీవించగలరా?
ఇత్యాది
విషయములు
ప్రతి
మానవునకునూ
వచ్చు
సందేహములే.
వాటినే
తెలుసుకొనవలెను.
అది
అత్యవసరము.
ధర్మమనగానే
సాధారణ
మానవులందరికీ
'దానాలు
చేయటము,
ఉచితముగా
సత్రములు
కట్టించడం,
వారి
వారి
వృత్తుల
ననుసరించి
ప్రవర్తించటము,
న్యాయమును
తేల్చటము,
మంచి
చెడ్డలను
వేరువేరు
పరచటము,
వాని
ఇష్టమొచ్చినట్లు,
మనసు
పోయినట్లు
పోవటము,
తన
సంతోష
సుఖములు
మాత్రమే
తాను
ఆశించటము,
వాటికి
తగిన
ఉపాయములు
పన్ని
తన
అభీష్టమును
నెరవేర్చుకొనటం,
ఇట్టివే
కదా
ధర్మాలంటే,'
అని
బహుజనుల
తలంపు.
ధర్మము
యొక్క
స్వచ్ఛ
స్వరూపం
గుర్తుపట్టలేనంతగా
మాసిపోయి
చాలా
కాలమయింది.
కాలగమనములో
మంచి
మంచి
స్థళములు,
వనములు
గడ్డముండ్లు
పెరిగి
మాసిపోవడం,
మంచి
మంచి
వృక్షములన్నియూ
కొట్టివేయబడి
వనముల
రూపు
మారిపోవడం,
లోకంలో
సహజముగా
ప్రతి
వ్యక్తి
చూచుచనే
యున్నాడు;
అది
కడకు
సహజమయినది.
మన
వేదశాస్త్ర
పురాణాదులలో
వర్ణింపబడిన
ధర్మము
విశేషము.
ధర్మతత్వము
యొక్క
రూపచిత్రములను
ప్రతి
మానవుడూ
తెలిసికొనవలెను.
అవి
అంతకంతకు
అపరిణత
హృదయముల
చేత,
పెడబుద్ధుల
చేత
అపార్థం
చేసుకోబడి
వికృత
రూపం
పొందినవి.
వాని
అంతస్సూత్రం
విస్మృతమైనది.
ఆకాశ
వర్ష
ధారలు
క్రిందికి
వచ్చి
వచ్చి,
భూవాసనలు
తగిలి
కలుషములయిన
విధముగా,
సనాతన
వైదిక
ఋషుల
దివ్య
భావ
ధారలు,
కర్మాచరణలు,
ఆచార
3
▾
Meaning
Keep
రహస్యములు
క్రమక్రమముగా
ప్రాకృత
పండితుల
జడబుద్ధులను
స్పృశించి,
వికృత
వికల
కలుష
రూపములు
ధరించినవి.
చిన్న
పిల్లలకు
పాఠాలు
అర్థము
కావటానికి
వాచక
పుస్తకముల
పైన
తత్సంబంధములైన
బొమ్మలు
వేస్తే
అమాయకపు
పిల్లలు
పాఠాల
బొమ్మలతోటే
ప్రొద్దుపుచ్చుకొనునట్లు,
గంభీరమైన
సత్యమును
సుగ్రాహ్యం
చేయటానికి
యేర్పరుపబడిన
కొన్ని
కొన్ని
స్థూల
కర్మకలాపాలను,
క్రమక్రమముగా
మూఢులు,
అమాయకులు
విభ్రాంతులై
సత్యమును
విస్మరించి
వికారపరిచారు.
పరిశుభ్రమయిన,
అందమయిన,
మంటపాలను
బాధ్యతలెరుగని
బాటసారులు
వికారం
చేసినట్లు,
తామసిక
ప్రవర్తనగల
వ్యక్తులు
వేద
మర్యాదలను
మాపి
లోకమునకు
వంచన
చేకూర్చుచున్నారు.
జగతిలో
ఇట్టి
ధర్మగ్లాని
ఏర్పడిన
ఒకానొక
ఆపత్సమయములో
ధర్మస్వరూపం,
అసుర
సమాజముచే
విపర్యయమొందిన
కాలమందు,
సురల
పిలుపు
వినబడి,
భగవంతుడు
ఆగమించి
హత్యాకాండంగా
మారిన
వేదధర్మకర్మలను
సత్యధర్మకర్మగా
మార్చి
లోకసంగ్రహం
చేశాడు.
ఇప్పటి
అంధత్వాన్ని
ఎవరు
తీసివేయగలరు?
మానవుడు
తనలోని
అరిషడ్వర్గములనే
పశువులను
సంహరించి
తన
పరిశుద్ధాత్మను
విశ్వేశ్వరునకు
సమర్పించుట,
అనేదే
ధర్మము.
బుద్ధుడు,
భగవంతుని
'ధర్మము'
అనే
పేరుతోను,
వేదమును
'విజ్ఞానము'
అనే
పేరుతోను
పిలిచి
వేదధర్మోద్ధరణం
చేశాడు.
అప్పుడు
వేదముల
పేరు
చెప్పిన,
ఆనాటి
సోమకాసురులాతని
బ్రతుకనివ్వరు.
అందుకనే
ఆయన
వేదహృదయమును
స్వీకరించి
ఆపద్ధర్మము
ననుసరించి
వేదశబ్దమును
పైకి
పలుక
లేదు.
కానీ,
ఆయన
వేదమయుడు,
దైవమయుడు!
బుద్ధుడే
నాస్తికుడైతే
ఆస్తికుడెవడు?
ఆయన
జీవితమంతా
ఒక
మహా
ధర్మం.
శంకరుడు
ధర్మకర్మపథ
వ్యతిరేకి
అని
కొంతమంది
తలంపు.
శంకరుడు
స్వార్థధర్మకర్మపథ
వ్యతిరేకి
4
▾
Meaning
Keep
మాత్రమే.
ఆయన
జ్ఞానచోదితమైన
సత్యధర్మకర్మను
లోకములో
ప్రకటితము
చేసిన
మహాచార్యుడు.
శంకరుని
ధర్మకర్మ
నిష్ఠను,
బుద్ధుని
వేదవిశ్వాసమును
గ్రహించటానికి
ఉన్నత
దృష్టి
అవసరము.
అట్టి
దృష్టి
లేని
వారికి
అపార్థముల
జాడ
తప్ప,
యథార్థముల
జాడ
తెలియదు.
ఎత్తైన
శిఖరము
యొక్కవలెనన్న
ఎత్తైన
నిచ్చెన
అవసరము
కదా?
తన
అహంకారమును,
తన
స్వార్థమును,
తన
పాశవిక
ప్రవృత్తిని,
తన
దేహదృష్టిని
బలిచేసి,
విశ్వాత్మయైన
పరమాత్మతో
సమైక్యమును
పొందడమే
ధర్మమందురు.
సమస్త
లౌకిక
విషయాల
యందు
ఔచిత్య
భంగముకాని
మాటలు,
హృదయద్రోహము
కాని
పనులు,
సమయస్ఫూర్తి
మార్పులు,
స్వార్థరహితమైన
నడకలు,
భగవత్
రతిగల
భావములు,
సత్యాన్వేషణము
–
ఇవియే
నిజ
ధర్మము.
"సర్వం
ఖల్విదం
బ్రహ్మ"
–
'ఇదంతా
బ్రహ్మమే'
అన్న
జ్ఞానాగ్నిలో
స్వార్థము,
కామములతో
కూడిన
సమస్త
లౌకిక
విషయాలను
సంపూర్ణముగా
ఆహుతిచేసి,
బ్రహ్మైక్యానంద
రసపాన
ప్రమత్తుడు
కావలెను.
అదియే
ధర్మకర్మ
పరమార్థము.
అజ్ఞానమను
అహంకార
మమకారములను
జ్ఞానవేదికపై
బలిచేసిన,
ధర్మమును
గూర్చిన
వేదాశయమిదే!
బ్రహ్మదృష్టితో
చేసి
బ్రహ్మైక్యానందశ్రీకి
దారితీసే
ప్రతి
నిస్వార్థకర్మ
కూడా
ఒక
ధర్మమే!
ఇట్టి
ప్రతి
ధర్మకర్మనూ,
బ్రహ్మజ్ఞాన
మహా
ధర్మ
సముద్రమున
సంగమించే
ఒక
పుణ్యవాహినియే.
వివిధ
ధర్మములూ
వివిధ
విధానాలలో
విశ్వాత్మను
ఆరాధించే
ప్రక్రియలే.
నిస్వార్థమైన
బ్రహ్మార్పణ
దృష్టిగల
ప్రతి
పుణ్యకర్మ
కూడా
బ్రహ్మధర్మమునకు
ఉపాంగమైన
ఒక
విశిష్టధర్మమే.
భారతీయ
జీవన
వ్యూహ
పరమార్థం,
జీవితమును
ఈశ్వర
ప్రీతికరమైన,
కళ్యాణమయమైన
ఒక
బ్రహ్మధర్మంగా
చేయడమే.
ప్రాచీన
ధర్మకర్మకలాపములను
మనము
సాంకేతికముగా
గ్రహించవలసియున్నది.
ఆధ్యాత్మిక
పరిభాషాజ్ఞానంతో
ఇపుడు
మనము
శాస్త్రాలను
సమీపించవలసియున్నది.
అపుడే
లోకము
శాస్త్రబోధలను
సరిగా
5
▾
Meaning
Keep
సందర్శింపగలదు.
చూడు!
ఒక
ఉపమానము
తీసికొందము.
పూర్వము
అనేకులు
యజ్ఞములు
సలిపెడివారు.
యజ్ఞములో
చేయవలసిన
పశుబలి,
మామూలు
ఈ
నోరులేని
అజ్ఞాన
పశువులను
బలిచేయడము
కాదు.
అవి
తెలియకుండానే,
ఒక
రకంగా
యజ్ఞజీవనం
చేస్తున్నవి.
చేయవలసిన
పశువధ,
ఈ
పశువధ
కాదు.
ఆధ్యాత్మిక
శాస్త్ర
పరిభాషలో
అసలు
పశువంటే
'జీవ
భావమని',
'శారీరక
దృష్టి'
అని,
'అహంకారమని
అర్థము.
జీవ
దశయే
పశుత్వము.
మనం
చూచే
పశువులు
అసలు
పశుత్వమునకు
ఉదాహరణములు
మాత్రమే.
ఇట్లే
ధర్మమునకూ,
అసలు
ఆధ్యాత్మిక
శాస్త్ర
పరిభాషలోని
అర్థము,
ఇప్పుడు
జరుగుచున్న
ధర్మకర్మముల
యొక్క
భావము
పై
యజ్ఞమును
పోలియున్నది.
పరమాత్మకు
పశుపతి
అనియూ,
గోవిందుడనియూ
పేర్లు
కలవు.
పశుపతి
అంటే
జీవులకు
అధిపతి
అని.
గోపాలుడన్నను
అదే
అర్థము;
జీవులను
పాలించువాడని;
గోవులను
కాయటమువలననే
గోపాలుడు
కాలేదు.
మామూలు
గోపాలనము
జీవపాలనమనే;
అసలు
గోపాలనము
ప్రకటించే
ఒక
ప్రదర్శన
చర్య
మాత్రమే.
భగవత్
తత్వమువలె,
భగవత్
శాస్త్రాలు
కూడా
గంభీర
అర్థవంతాలు.
జీవుడు
తన
ప్రకృతి
దృశ్యములను,
వాసనలను
విడచి
స్వస్వరూపమైన
దేవుని
పొందడమే
ధర్మాశయం.
గంభీర
విషయాలను,
వేదరహస్యాలను
ఆబాలగోపాలం
గ్రహించవలసి
వున్నది.
చూడు!
ఒక
ఉపమానము
తెలిసిన,
ప్రాచీన
ధర్మమెట్టిదో,
యిప్పటి
అర్థమెట్టిదో
మీకే
బోధపడగలదు.
శివదేవాలయములు
చూడని
భారతీయుడుండడని
తలంతును.
ఆ
దేవాలయములో
శివుని
కెదురుగా
ఒక
నందిని
చూతుము.
వాటి
భావమేమని?
ఇప్పటి
అర్థము
ఈశ్వరుని
వాహనమైన
ఒక
కోడె
అనియు,
బసవణ్ణ
అనియు
తలంతురు.
కాని
ప్రాచీనకాలపు
యొక్క
శాస్త్రము
వేరు!
శివలింగం
'ఈశ్వర
ప్రతీకం'
అనియు,
నంది
'జీవ
ప్రతీకం'
అనియు
జీవేశ్వరులమధ్య
విభేదం
చూడగూడదనియు,
శివలింగానికీ,
నందికీ
మధ్య
యెవ్వరూ
పోకూడదనియు,
6
▾
Meaning
Keep
ఆలయాచారము!
నంది
శృంగ
మధ్యములో
నుంచి
శివలింగం
దర్శనం
చేయడం
మహాపుణ్యమని
ఇప్పటివారు
భావింతురు.
ఎందుకన,
యథార్థమయిన
అర్థమును
తెలియనివారగుటచే;
కానీ,
దాని
అంతరార్థము
అది
కాదు.
జీవునిలో
శివుని
దర్శించమనియే
పరమార్థము.
పశువు
పశుపతికి
వాహనము
అనగా,
అంకితమైనపుడు
నంది,
ఈశ్వరుడను
రెండు
రూపములు
రెండు
భావములు
కాక,
'నందీశ్వరుడ'ను
ఒకే
నామరూపములను
స్వీకరించును.
అప్పుడు
అది
ఆరాధనీయమవుతుంది.
పశువు,
ఈశ్వరార్పితమై
ధన్యత
గాంచటమే
ఆనాటి
యజ్ఞముల
యొక్క
యథార్థ
పారమార్థము.
కానీ,
ఈనాటికి
యే
రీతిగా
వాటి
మార్పులు
సంబంధము
లేనివిగా
మారినవి?
ఇట్లే,
ఆనాటి
ధర్మకర్మ
పారమార్థములు.
నేటి
అసత్య
ధర్మకర్మ
అర్థములు,
ఒకదానికొకటి
సంబంధము
లేనివై
యున్నవి.
లౌకిక
ధర్మకర్మలు
సహితము
పారమార్థ
సారముననుసరించే
యుండవలెను.
అపుడు
అమాయకపు
ప్రజలు
యథార్థమును
పాటించగలరు.
వివేకదృష్టి
లేనపుడు
వివేకమయ
కర్మ
కూడా
వినోద
కర్మగా
మారిపోతుంది.
ఒకానొక
సమయమున
ప్రహ్లాదుడు
కూడా
అని
వుండెను.
"అహంకార
పశువును
చంపటము
చాలా
కష్టము
కనుక,
దుర్బల
మానవులు
ఈ
నోరులేని
అజ్ఞాన
పశువుల
వెంట
పడడమే
యజ్ఞమనుకొనుచున్నారు".
ఇట్టి
జంతుబలి
తమోగుణ
సంబంధమయిన
పథం!
అహంకారబలి
సాత్త్వికగుణ
పూర్ణమయిన
దేవతల
పథం.
చూడు!
వీటి
అంతరార్థమెంత
గంభీరంగా
యున్నదో!
ఇట్లే
ప్రతి
ఒక్కటియూ!
ఆనాటి
పారమార్థము,
నేటి
పారమార్థమూ
సంబంధము
లేనివై
పెరిగినవి;
కొమ్మలు
విరిగినవి.
అట్టి
వృక్షములను
నేడు
వేర్ల
వరకు
పెరికిన,
నూతన
భావములు
నాటుటకు
సాధ్యము
కాని
సమయము
కనుక,
ఉన్న
చెట్లనే
సరియైన
మార్గమున
పెరుగునట్లు,
కనుపించునట్లు,
పారమార్థములు
స్మరించునట్లు
చేయవలెను.
Next
Ātma-Dharma Is the Basis of All Dharmas
→