Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · Ātma-Dharma Is the Basis of All Dharmas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
2
ఆత్మ
ధర్మము
సమస్త
ధర్మములకు
ఆధారం
ధర్మమనునది
ఒక
హద్దునకు
కట్టుబడునది
కాదు.
ఒక
సమాజమునకు
కానీ,
ఒక
జాతికి
కానీ
సంబంధించినది
కాదు.
సమస్త
ప్రాణికోటికి
సంబంధమైనది.
అది
యేమి
చేసినను
ఆరని
అఖండ
జ్యోతి.
ధర్మజ్యోతి
స్వతంత్రమైనది.
మానవుడైన
అర్జునుని
ఒక
నిమిత్తముగా
నిలిపి,
కృష్ణుడు
గీతను
బోధించెను.
ఆ
గీత
నేడు
సమస్త
జీవులకూ
సంబంధించినదై
సంచరించుచున్నది.
ఆ
పవిత్ర
గీత
ఒక్క
జాతికనియు,
ఒక్క
మతమునకనియు,
ఒక్క
వర్ణమునకనియు
నియమింపబడలేదు.
మానవ
జాతికే
ఆ
మహోపదేశము
ప్రాణ
సమానమై
యున్నది.
ధర్మమనునది
అనేక
రూపముల
ధరణిని
తిరుగుచున్నది.
మను
ధర్మము,
వర్ణ
ధర్మము,
గృహస్థ
ధర్మము,
వానప్రస్థము,
సన్యాసము,
బ్రహ్మచర్యము
అని
అనేక
రీతులుగా
ఆచరించుచున్నారు.
అయితే
అవి
ఆచార
ధర్మములు
మాత్రమే
కానీ,
నే
తెలుపునది
అంతరార్థ
ధర్మము,
ఆత్మ
ధర్మము,
దైవ
ధర్మము.
పై
ఆచార
ధర్మములు
దేహ
ధర్మములు,
ప్రకృతి
ధర్మములు.
అయితే,
అట్టి
ధర్మములను
ఆచరించు
దేహమే
స్థిరము
కాదు.
ప్రకృతియే
సత్యము
కాదు.
ఇక
ఆ
ధర్మములు
స్థిరమా?
వాటి
సారము
సత్యమా?
అస్థిరమున
స్థిరమెట్లు
చిక్కును?
అసత్యమున
సత్యమెట్లు
కనుపించును?
స్థిరమునందు
స్థిరము,
సత్యమునందు
సత్యమే
లభించును
కానీ,
అంధకారమున
ప్రకాశము
చిక్కిన,
అంధకారమెక్కడుండును?
అట్లే
ప్రకృతి
సంబంధమైన
ప్రవర్తనములలోని
ధర్మము
మానవునకు
2
▾
Meaning
Keep
ప్రధానమైనను,
దానిని
ఆత్మార్థ
సంబంధమైన
ధర్మములతో
చేర్చి
అనుసరించిన,
అంతర్
బహిర్
దృష్టిలో
ఒకే
ఆత్మధర్మమును
అనుభవించవచ్చును
కదా!
యథార్థ
ధర్మమును
మరుగుపరచక,
ఆచార
ధర్మములతో
ఐక్యపరచిన,
ఆత్మధర్మమును
అవలీలగా
ఆచరించవచ్చును.
దేవుణ్ణి
రాయి
చేయటమే
యిప్పటి
దృష్టిలో
వున్న
ఆచారము.
కానీ,
అది
సత్యమెట్లగును?
రాయిని
దేవునిగా
తలంచటము
నిజధర్మము.
ఎట్లన,
లక్ష్యమును
దేవుని
సాకారరూపముపై
లగ్నపరచి,
ఆ
రూపమును
రాతిలో
నిర్మించిన,
రాయి
మరుగై
దేవుడు
సాక్షాత్కరించును
కదా!
అట్లే
యథార్థ
ఆత్మధర్మమును
లక్ష్యమునందుంచుకొని,
ప్రకృతి
సంబంధమైన
ఆచార
ధర్మకర్మలను
ఆచరించిన,
అంతరార్థము
మారదు
కదా!
ఆత్మధర్మము
ఆరదు
కదా?
అట్టి
స్వాతంత్ర్యమైన,
సర్వవ్యాపకమైన,
సర్వభూతాంతరాత్మ
అయిన
సర్వేశ్వరుని,
సాకార
రూపమున,
ఒక
ఆకారమున
ఎట్లు
దర్శించగలుగుచున్నామో,
అట్లే
సర్వవ్యాపకమైన,
సర్వజనసమానమైన,
స్వాతంత్ర్య
స్వరూపమైన
ధర్మమును,
మనమాచరించు
భౌతికమైన
కార్యములందు
దర్శించుచు
ఆచరించుట
ఎందుకు
సాధ్యముకాదు?
సాధ్యము
కానటువంటి
నిరర్థక
కార్యములెన్నియో
సల్పి
అశాంతిననుభవించుటలేదా?
సార్థకమైన
ధర్మమునాచరించి
శాంతిని
పొందుట
సాధ్యము
కాదా?
నీవు
స్వతంత్రుడగుట
నీ
జన్మహక్కు
కానీ,
అస్వతంత్రుడగుట
కాదు.
స్వతంత్ర
స్వరూపమైన
ధర్మమును
ఆచరించినపుడే
నీవు
స్వతంత్రుడు
కానీ
లేకున్న
అస్వతంత్రుడే.
ధర్మము
స్వతంత్ర
స్వరూపమన్న
కొంతమంది
శంకింతురు.
ఇప్పుడు
లోకమనుకొను
దృష్టిలో
మాత్రం
నీవు
స్వతంత్రుడు
కావు.
స్వాతంత్ర్య
రూపము
సరిగా
తెలియకనే
ఒక
రకమైన
బానిసత్వమునకు
స్వాతంత్ర్యమనియు,
వేరొక
రకమైన
బానిసత్వమునకు
అస్వాతంత్ర్యమనియు
పేర్లు
పెట్టి
పిలుచుచున్నారు.
నిజమయిన
స్వాతంత్ర్యము
దేహభ్రాంతి
రహితమయిన
ఆత్మ
ధర్మమే.
ఈ
సత్యదృష్టిలో
బానిసతనము
నుండి
3
▾
Meaning
Keep
తప్పించుకొన్నవారు
అరుదు.
బానిసతనము
రూపములో
తేడా
తప్ప,
దేహదృష్టితో,
దేహతాదాత్మ్యంతో
చేసే
పని
అంతా
యేదో
ఒక
రకమయిన
బానిసతనమే.
దేహభ్రాంతే,
విషయేంద్రియ
కింకరత్వమే
అసలైన
బానిసత్వము.
దీనిని
తప్పించుకొన
గలవాడే
నిజమయిన
స్వతంత్రుడు.
అదే
నిజమయిన
ధర్మము.
అట్టి
ధర్మమును
దృష్టియందుంచుకొని
సంచరించువాడే
ముక్తపురుషుడు.
ముక్తపురుషులు
కావలెనన్న
వారెల్లరు
పై
ధర్మమును,
స్వాతంత్ర్యమును
పొందవలెను.
ఇట్టి
ధర్మమును
పొందకుండుటకు
మూలము
తనను
తాను
బానిసగా
చేసికోవటమే.
తనను
తాను
బంధించుకోనిదే
ఎవరూ
తనను
బంధించలేరు.
సర్వభూతాంతరాత్మయని,
పరమాత్ముడు
సర్వులయందూ
సమాన
స్వరూపుడుగా
నుండునను
విశ్వాసము
దృఢముగానున్న,
తనలోనున్న
పరమాత్ముడు
బానిస
యెట్లగునను
నిశ్చిత
జ్ఞానమును
నిరూపించును.
ఆత్మధర్మము
అతిదూరమగుట
వల్లనే
అట్టి
దృఢవిశ్వాసము
వారి
యందు
ఆవేశింపదు.
అట్టి
విశ్వాసము
ఆవేశింపనిదే
నిశ్చితజ్ఞానము
ప్రకాశింపదు.
అట్టి
నిశ్చితజ్ఞానమెపుడు
కలుగదో
వాడపుడు
అంధుడై,
అస్వతంత్రుడై,
అవస్థలకు,
అనర్థములకు
గురియగును.
అట్టి
వానిని
ధర్మ
దేవత
వరింపదు.
కాన,
మొదలు
స్వాతంత్ర్యుడు
కావటానికి
ప్రయత్నించవలెను.
దానికి
మునుపు,
ఆత్మధర్మముపై
అమిత
విశ్వాసము
కుదురవలెను.
తదుపరి
ఆ
సత్యధర్మమునే
ప్రకృతి
ఆచారకర్మలపై
నిరూపించి
ఆచరించిన,
అట్టి
వాడు
ధర్మపురుషుడనియు,
ధర్మాచరణ
కలవాడనియు
తలంచవచ్చునే
కానీ,
కేవలము
దేహసంబంధమైన
అనిత్య
ధర్మములను
సత్యధర్మములుగా
పాటించిన
సార్థకము
కాదు.
రాళ్ళను
దేవుళ్ళుగా
భావించిన
యెంత
పవిత్రమో,
భౌతిక
ధర్మకర్మలయందు
సత్యధర్మములను
దర్శించిన
అంత
పవిత్రము.
దేవుళ్ళను
కూడను
రాళ్ళవలె
భావించి
నమస్కరించిన
యెంత
ఫలమో,
సత్యధర్మములను
వదలి
కేవలము
భౌతికధర్మకర్మలను
ఆచరించిన
అంతే
ఫలము.
సత్య
ధర్మములు
4
▾
Meaning
Keep
లేక
ఆచారధర్మములు,
ఆచార
ధర్మములు
లేక
సత్యధర్మములు
నిస్సారము.
ఈ
రెండు
అవినాభావ
సంబంధమై
ఆచరింపవలెను.
పై
ఉద్యోగికి
చిన్న
ఉద్యోగి
యొక్క
పనితో
ఎట్లు
అవసరమో,
చిన్న
ఉద్యోగికి
పెద్ద
ఉద్యోగి
యొక్క
ధన
సహాయముతో
అట్లు
అవసరము.
ఇపుడు
ఎవరు
ఎవరికి
బానిసలు?
ఎవరి
వాంఛలకు
వారే
బానిసలు.
బాహ్య
దాస్యభావము,
అసలు
సూత్రము
గుర్తించనంత
వరకు
ఎవరికీ
తప్పదు.
ఆత్మసూత్రం
గుర్తిస్తే
దాస్యభావం
తొలగుతుంది.
ప్రకృతి
ధర్మము
పరమాత్మ
ధర్మంతో
చేరుతుంది.
వేదాంతము,
ఆధ్యాత్మిక
శాస్త్రము,
ధర్మము
మానవుని
బానిసగా
కాక,
భగవంతునిగా
పనిచేయమంటుంది.
అపుడు
కర్మ,
కామ్యకర్మగా
గాక
ధర్మకర్మగా
మారుతుంది.
కేవలము
పనులు
మార్చుకొనుట
చేత
దాస్య
శృంఖలాలు
ఎవరికీ
తప్పవు.
విపర్యయ
దృష్టిని
మార్చుకోవడంచేత,
దేహదృష్టిని
దేవునిపై
త్రిప్పుకోవడముచేత
బానిసతనం
తప్పుతుంది;
ధర్మగుణము
హెచ్చుతుంది.
ఒకరు
ఉద్యోగము
చేయటము
బానిసత్వమనియు,
ఇంటిలో
కూర్చొనటము
స్వతంత్రమనియు
తలంతురు.
ఇవి
తెలివితక్కువ
మాటలు,
ఊహలు.
ఉద్యోగములో
నున్నప్పుడు
పై
ఉద్యోగికి
విహితంగా
నడవవలెను
కదా?
ఇంట్లోనూ
బంధుహితవర్తనం
తప్పదు
కదా?
పోనీ,
మిత్రులకడకు
పోయిన,
వారికి
కూడా
అనుకూలంగా
నడవడం
తప్పుతుందా?
చివరకు
తనకు
తాను
అనుకూలంగా
నడచుకోక
తప్పుతుందా?
ఇక
దాస్యబంధమను
బాహుపంజరము
నుండి
విడిపోగల
అవకాశమెక్కడ?
బాహ్యారూపవిధానాలలో
భేదమే
కానీ,
శారీరకదృష్టితో
కూడిన
జీవితమంతా
బానిసతనమే.
అందుకనే
ఒక
సమయములో
శంకరుడు,
"నరకమంటే
దేహాభిమానమే"
అని
అన్నాడు.
దేహాభిమానమే
దైవవిముఖత్వము
యొక్క
వేరొక
రూపం.
భూమిమీద
ముండ్లు,
రాళ్ళు
అసలు
లేకుండా
ఎవరు
చేయగలరు?
చేయలేరు.
చెప్పులు
వేసుకొని
వాటి
బాధనుండి
తప్పించుకొన
ప్రయత్నించవలెనే
కానీ,
5
▾
Meaning
Keep
వేరు
మార్గముండదు.
వేదాంత
దర్శనము,
'సత్యదృష్టి
చేత,
స్వస్వరూప
బ్రహ్మదృష్టి
చేత,
సత్య
స్వాతంత్ర్య
ధర్మమును
పొందవచ్చు'నని
తెలుపుచున్నది.
బాహ్యపరివర్తనలు
తాత్కాలికోపశమనోపాయాలు
మాత్రమే.
'సర్వవిధ
దాస్యములకూ
సంబంధించిన
దేహమునకు
నేను
బానిసను
కాను;
ఈ
దేహము
నా
బానిస,
నేను
సర్వనియంతను,
ముక్తిస్వరూపుడను'
అనే
నిత్య
సత్
భావనలతో
ఎవడు
అహంభావాన్ని
కాల
రాస్తాడో,
అతడే
విముక్తుడు.
ధర్మములు,
అహంకార
బంధవిముక్తికి
దారితీసేవిగా
నుండవలెను.
ధర్మములహంకార
వికార
ప్రేరితాలు
కాకూడదు.
ఇదే
సూత్రము.
ఇదే
స్వాతంత్ర్యము.
ఒకడు
కొడుకు
దగ్గర
సుఖము
లేదని
కూతురు
దగ్గరికి
పోతాడనుకోండి.
ఇది
స్వాతంత్ర్యప్రాప్తికి
మార్గము
కాదు.
ఇవి
అహంకారమునకు
చేసే
రకరకపు
ఉపచారములు
మాత్రమే.
ఇంద్రియ
సుఖములకని
ఇల్లు
వీడుట
ధర్మము
కాదు.
ఈశ్వర
సుఖమునకు,
ఈశ్వరానందమునకు,
ఈశ్వర
చింతనకు
ఇల్లుకానీ,
మరేమైనా
సరే
విడువవచ్చును.
విముక్తిస్వరూపుడైన
పరమాత్మతో
సంయోగానుభూతి
పొందడమే
నిజధర్మము;
నిజమైన
విముక్తి.
అట్టివానిని
చెఱసాలలు
సహితము
బంధింపలేవు.
దేహానికి
బానిసలైన
వారిని
ఎండిన
పోచకూడా
కాలపాశమై
బంధిస్తుంది.
ఆత్మనిమగ్నత,
అంతర్ముఖత,
స్వస్వరూపనిష్ఠ,
బ్రహ్మజ్ఞానము
-
ఈ
నాలుగే
నిజమైన
ధర్మములు.
స్వాతంత్ర్యమును
ప్రసాదించునవి
ఇవియే.
ఈ
భౌతిక
దేహచరణలయందు
వేరు
పేర్లు
పెట్టబడి,
అంతర్
ధర్మమును
వీటియందిమిడ్చి
ఆచరించుటకై
సత్యము,
శాంతము,
ప్రేమ,
అహింస
అను
నాలుగు
రూపముల
ధరించి
చరించుచున్నవి.
ప్రతి
కార్యమందు,
ప్రతి
తలంపునందు,
ప్రతి
విషయమునందు
ఈ
నాల్గు
మహా
సిద్ధాంతములను
పాటించుటే
ఇప్పటి,
అప్పటి
ధర్మమునకు
సూత్రమగును.
నేటి
సత్య,
ప్రేమ,
శాంతి,
అహింసలు
ఆనాటి
ఆత్మ
నిమగ్నత,
అంతర్ముఖత,
స్వస్వరూపనిష్ఠ,
6
▾
Meaning
Keep
బ్రహ్మజ్ఞానము.
రెండింటియందూ
ధర్మము
ఒక్కటిగనే
యేకరూపమును
పొందవలెను.
అట్లుండిన
అది
ఆత్మధర్మమనబడును.
పై
ప్రవర్తనలను
పాటించదు;
రూపనామముల
యోచించదు.
చేతికి
వేసిన
సంకెళ్ళు
ఇనుపవైననేమి,
బంగారువైననేమి
చేతులను
బంధించినవి
కదా?
అట్లే
రూపనామములు
ఏవైననేమి,
ఆత్మతత్త్వమును,
ఆత్మధర్మమును
ఆచరించే
యేకార్యక్రమమైనా,
నిజధర్మమే
అగును.
ఇదే
శాంతి
సిద్ధిని
కలిగించును.
అట్లుగాక
అహంకార
సముద్ర
తరంగములు
మానవులను
ఇంట్లోకి
గుంజినా,
అరణ్యమునకు
నెట్టినా,
యెక్కడకు
నెట్టినా
బాధ
అనుభవింపక
తప్పదు
కదా?
పండుకొన్నంత
మాత్రమున,
పడగ
విప్పుకుండినంత
మాత్రమున
పాము,
పాము
కాకుండునా?
ఎట్లుండినా
పాము,
పామే.
ప్రకృతి
ఆచరణలలో
ఆత్మతత్త్వమును,
సత్యధర్మమును
ఇమిడ్చి
ఆచరించినంత
మాత్రమున
ధర్మము
మారునా?
మారదు.
ఎక్కడ
ఉన్ననూ
ధర్మము
ధర్మమే.
అట్లుకాక
కృత్రిమ
స్వాతంత్ర్యములు,
కృత్రిమ
ధర్మములు
(అనగా
వారి
వారి
అనుకూలతనుపట్టి
నియమించిన
క్రమ
శిక్షణలు)
సత్యధర్మములని
చాటిన,
అవి
సత్యధర్మములు
కానేరవు;
బానిసతనము
యొక్క
సంచలనావస్థలే.
జైలులోపడ్డ
వానిని
రక్షకభటులు
వెంటనుండి,
ఇటు
అటు
కదలనివ్వక,
కోర్టుకో
లేక
కూటికో
తీసికొనిపోయే
పద్ధతివంటివే
ఈ
కృత్రిమ
ధర్మములు.
ఇంతెందుకు,
హితుడు,
అహితుడు
అనుకోవటము
కూడను
పొరపాటే.
ఈ
భ్రాంతి
త్యాజ్యం.
ప్రేమ
స్వరూపుడైన
పరమేశ్వరుడే
నిత్యబాంధవుడు,
నిత్యసంభావ్యుడు,
నిత్యాశ్రయుడు,
నిత్యపోషకుడు,
నిత్యహితుడు.
దీనిని
గ్రహించి
అనుభవించటము
జ్ఞానమయ
ధర్మము,
ధర్మమయ
జీవనము.
ఈ
మూలసూత్రములను
విడచి,
బైట
మార్పుల
మీద
ఎక్కువ
ఆధారపడడం
వలన
లక్ష్యము
సిద్ధించుట
లేదు.
హరిరతి
చేత
జగద్రతి
నశించును.
పై
ఆకాశము
చూస్తూ
భూమి
కనుపించలేదన్న,
ఎట్లు
కనుపించును?
భూమిపై
చూస్తూ
7
▾
Meaning
Keep
కూడా,
ఆ
భూమిపై,
పై
ఆకాశ
ప్రతిబింబ
రూపమును
తెలిపించు
జలమును
ఆధారముగా
తీసికొన్న,
లోని
భూమి,
పై
ఆకాశము
రెండునూ
కనుపించును.
అట్లే,
ఆత్మతత్త్వమైన
సత్యధర్మమును
మానవులు
నడచుకొనవలెనన్న,
ప్రకృతిపై
ఆచరించు
కర్మలయందు,
సత్యధర్మముల
ప్రతిబింబమును
నిరూపించునట్టి
జ్ఞానమును
ఆధారముగా
తీసికొన్న,
ఆత్మ
ధర్మమును,
భౌతిక
ధర్మమును,
అనగా
హరిరతిని
జగద్రతిని,
రెండింటిని
అనుభవించవచ్చును.
అయితే
లక్ష్యాన్ని
మార్చకూడదు.
అనగా
భావాన్ని,
సారాన్ని
మార్చకూడదు.
రూప
నామములు
మారినను
మారవచ్చును.
ధర్మమునకు
రూప
నామములు
ప్రధానములు
కావు.
భావరాగములే
దాని
ప్రయోజనములు.
Previous
←
Dharma Is the Basis of the Existence of All Beings
Next
Any Action Offered to God Is Itself an Act of Dharma!
→