Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · Dharma-Discipline Is That Which Protects Through Chastisement
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
13
శిక్ష
నుండి
రక్షించునదే
ధర్మశిక్షణ
ధర్మము
పక్షపాతదూరమై,
న్యాయ
సత్యాచరణ
సంగతమై
యున్నది.
దానినే
మానవులనుసరించవలెను.
దానికి
విరుద్ధముగానెన్నడునూ
నడువరాదు,
కూడదు.
అది
సిద్ధింపవలెనన్న,
మానవులలో
ఒకరితోనొకరు
విరోధము
వదలి
పరస్పర
సమ్మతము
కలిగియుండవలెను.
అందువలన
లోకమునకు
సమస్త
సుఖములు
దినదినమునకు
వృద్ధియగుచుందును.
అపుడేవిధమైన
అశాంతి,
అనాచార,
అక్రమ,
అన్యాయములు
మానవులను
సమీపించలేవు.
దేనియందైనను
యథార్థ
జ్ఞానమును
కలిగియుండవలెను.
దానిని
నిత్యము
మీరు
వృద్ధిగావించుకొనవలెను.
తన్మూలమున
సంపూర్ణ
జ్ఞానులై
మీరు
నిత్యానందులగుదురు.
దీనికన్నింటికి
ధర్మకర్మలనే
అవలంబించవలెను.
పక్షపాత
రహితులు,
ధర్మాత్ములైయున్న
విద్వాంసులు
వేదానుకూల
సత్యధర్మములాచరింతురు.
అట్లే
నేడునూ
మానవులైన
అందరూ
ఆచరించవలెను.
ధర్మజ్ఞానము
ఈ
మూడు
తెరగుల
నేర్పడినది...
ఒకటి,
ధర్మాత్ములైన
విద్వాంసుల
శిక్షణ
కావలెను.
రెండవది,
వారికి
ఆత్మశుద్ధి,
సత్యమునెరుగు
కాంక్ష
కలుగవలెను.
మూడవది,
పరమేశ్వర
విదితమైన
వేదవిద్య
బోధపడవలెను.
ఈ
మూడునూ
సిద్ధించిన
మనుజునకే
సత్యము,
అసత్యము
యథార్థముగా
బోధపడగలదు.
ఈ
సత్యాసత్య
విచారము
సమముగా
నుండవలెను.
అందు
విరోధమేచందముననూ
రారాదు.
అందరూ
ఏకీభవించి
విచారము
చేయవలెను.
అప్పుడు
ఎవరేది
చెప్పుదురో
వేర్వేరుగా
వినవలెను.
2
▾
Meaning
Keep
అనంతరము
ఏది
ధర్మయుక్తమో,
సర్వులకూ
హితమగు
వచనమేదియో
దానిని
వేరుపరచి
ప్రచారమునకు
దానినే
తేవలెను.
ఇందుచే
సర్వులునూ
సమానముగా,
సుఖముగా
వృద్ధి
అగుదురు.
"సమితిః
సమానీ";
అందరికీ
సమానముగా
సమ్మానము,
జ్ఞానము,
విద్యాభ్యాసము,
బ్రహ్మచర్యాద్యాశ్రమములూ
నియతములై
యున్నవి.
కనుక
శ్రేష్ఠాతి
శ్రేష్ఠకార్యములు
సర్వులునూ
చేసి,
చేయించవలెను.
దుష్టగుణ
విసర్జన,
కాంక్ష
వికల్పము
–
జీవుడు
ఈ
రెండు
పనులూ
దేనితో
చేయునో
దాని
పేరు
మనస్సు.
సర్వదా
దానితో
పురుషార్థము
చేయుడు.
తన్మూలమున
ధర్మము
దృఢమగును,
అవిరుద్ధముగా
నిలుచును.
వెనుకటి,
ముందటి
కర్మలన్నింటిని
యథారీతిని
స్మరణకు
తెచ్చి
విచారము
చేయించునదే
చిత్తము.
ఇది
మీ
యందేకము
కావలెను.
మీరేకచిత్తులు
కావలెను.
ఈ
మనోచిత్తములు
రెండును
సకల
మానవ
సుఖయత్నమందు
నిలువవలెను.
ఈ
తీరున
సర్వులకుపకరించి
సుఖమొనగూర్చు
మనుష్యుడెవడో
అతని
యెడనే
ధర్మస్వరూపుడు
తాండవించును.
అట్టి
వానిని
భగవంతుడనుగ్రహించుటేగాక
ఐక్యమొనరించుకొనును.
ఎవ్వరికే
పదార్థమును
మీలో
మీరిచ్చిననూ,
తీసికొన్ననూ
ధర్మయుక్తముగ
నుండవలెను.
విరుద్ధ
వ్యవహారములు
సలుపరాదు.
ఇది
మీ
కర్తవ్య
ధర్మమని
ఎల్లవేళలా
ఆచరించవలెను.
మీకెంత
శక్తి
కలదో
దానినంతయు
ధర్మ
సంగతము
చేసి,
దిన
ప్రతిదినమునూ
వృద్ధిపరపుడు.
ధర్మాత్ముని
నడవడిక,
నిశ్చయము,
ఉత్సాహముతో
నిండి
యుండవలెను.
అట్టి
ధర్మముపై
శ్రద్ధ
ప్రధానాంగముగా
నుండవలెను.
ఏది
చేసిననూ
పరమేశ్వరుడు
సర్వత్ర
కనిపెట్టుకొని
యుండుననను
ఈశ్వరభీతి
కలిగియుండుట,
సత్యాచరణ,
ధర్మపరత్వము,
తద్విరుద్ధమగు
పాపాచరణలకెల్లవేళలా
భీతి
చెందుట,
ఇట్టి
గుణములు
కల
వస్తువు
పేరే
మనస్సు.
దీనినన్ని
విధముల
సకల
మానవ
హితము
వైపునకే
వినియోగింపవలెను.
3
▾
Meaning
Keep
ధర్మావలంబనమే
మీ
సుఖమును
వృద్ధిచేయును.
ఒకరి
యందొకరికున్న
విషమస్థితి
తొలగును.
పరుల
దుఃఖమును
చూచి
యుబ్బకుడు.
అది
నీకు
సుఖమనుకొనకుడు.
సకల
జనుల
సుఖింపజేసి
మీరు
సుఖింపజేసికొనుడు.
ఎల్లవేళలందూ
సత్యమునందే
ప్రీతి
నుంచవలెను.
అసత్య
మేవేళకానీ
ప్రియము
కాదు.
ప్రపంచమున
తిరస్కార
సత్కారములు
రెండున్నవి.
సర్వులూ
అసత్య,
అధర్మ,
అన్యాయములను
తిరస్కరింతురు.
సత్య,
ధర్మ,
న్యాయవృత్తుల
సత్కరింతురు.
సత్యము
ధర్మము,
అసత్యమధర్మము;
ఇవి
ప్రకట
గుప్త
లక్షణములు
కలవి.
అనృతమను
అన్యాయమున
కేనాటికిని
ఒడిగట్టుకొనకుడు.
ప్రత్యక్షాది
ప్రమాణములన్నిటిచే
పరీక్షించినది,
పరీక్షింప
దగినది
యగు
వేదవిహిత
ధర్మమున్నది.
అది
పక్షపాతరహితమైన
న్యాయరూప
ధర్మము.
అనుదినము
దాని
నాచరింప
మీకు
ప్రీతి
కలుగవలెను.
ఈశ్వరోపాసన
వేదవిహితంగానే
చేయవలెను.
జనులకు
తన్మూలమున
ధార్మిక
ప్రవృత్తి
యేర్పడును.
ఈశ్వరోక్తమగు
ఇట్టి
ధర్మమే
సర్వావలంబన
యోగ్యము.
ఎవ్వరు
తన
నడవడి
యందు
సత్యమునాచరణ
రూప
వ్రతముగా
సలుపుదురో
వారినే
దేవతలందురు.
ఈశ్వరుడు,
మనుష్యునియందెంత
సామర్థ్యమును
నిలిపెనో
యోచించుడు,
తిలకించుడు!
అంతటి
పురుషార్థ
మతడు
అవశ్యము
చేయతగియున్నది.
తదనంతరమీశ్వరసహాయ
మర్థింపవచ్చును.
మనుష్యుని
యందు
సమర్థత
నిలుపుటలో
ఈశ్వరోద్దేశ
మిదియే.
తన
పురుషార్థముచే
అవశ్యము
సత్యాచరణమొనర్పవలెను.
కొంత
సామర్థ్యమును
మనుష్యునకు
పరమేశ్వరుడు
ప్రసాదించినాడు.
ఎవ్వడైనా
కన్నులున్నవానికే
ఏ
వస్తువైనా
చూపగలడు
కానీ
కన్నులు
లేని
అంధున
కెవడు
చూపగలడు?
ఈ
చందముననే
మనుష్యులందెవడు
సత్యభావము
చేతను,
పురుషార్థము
చేతను
ధర్మము
సలుపగోరునో
వానికే
పరమాత్మ
సాయపడును.
బుద్ధి
వికసించు
సాధనములను
4
▾
Meaning
Keep
జీవునకు
పరమేశ్వరుడు
ఇచ్చియుండెను
కదా!
వానితో
సంపూర్ణముగా
జీవుడు
పురుషార్థము
చేసిన,
ఈశ్వరుడు
నూతన
సామర్థ్యము
నతనిపై
నిలిపి
కృపాదృష్టి
నుంచును.
ధర్మ
మెట్టిదని
తెలిసికొనవలెనని
మనుష్యునకెపుడు
కాంక్ష
పుట్టునో,
సత్యమపుడు
తెలిసిపోవును.
సత్యమందు
మానవునకు
శ్రద్ధ
కలిగినప్పుడే
ధర్మకర్మలను
ఆచరించగలడు.
సత్యముపై
విశ్వాసము,
శ్రద్ధ
లేనివానికి
ధర్మ
కర్మలు
భారముగా
తోచును.
సత్యాచరణే
దీక్ష.
ధర్మాచరణమే
మనుష్యుని
సత్కరించును.
జనులందరు
అవశ్యము
ధర్మలక్షణముల
గ్రహింపవలెను.
ఎందుకన,
పరమేశ్వరుడు
మనుష్యులందరినీ
పరమయత్నశీలురుగాను,
ధర్మాచరణయుతులుగాను
రచించెను.
బ్రహ్మను,
సత్యవిద్యను,
ధర్మాచరణమును
జనులు
సేవింపవలెను.
"సత్యేనానృతా",
సత్యమును
ప్రత్యక్షాది
ప్రమాణముల
చేత
సర్వులు
పరీక్షించవలెను.
"ఓజశ్చ",
ధర్మపాలన
యుక్తమగు
పరాక్రమము
గల్గియుండుట;
"తేజశ్చ",
భయరహితులై
అధీనులగుట;
"సహశ్చ",
సుఖ,
దుఃఖ,
హాని,
లాభ
పరివర్తనలయందు
హర్ష
శోకముల
త్యజించి,
సత్యధర్మములందు
దృఢమగుట,
దుఃఖ
నివారణ
నిమిత్తము
సహనము
పూనుట;
"బలంచ",
ఉత్తమోత్తమమగు
బ్రహ్మచర్యము,
తన్మూలమున
శరీరారోగ్యమును,
బుద్ధిబలమును
వృద్ధి
సలుపుట;
"వాక్చ",
సత్యవిద్యా
శిక్షణంది,
కోమలము,
ప్రియమగు
భాషణ
సేయుట;
"ఇంద్రియంచ",
జ్ఞానేంద్రియ
పంచకమును,
కర్మేంద్రియము
లైదింటిని
పాపప్రవృత్తి
దెసనుండి
మరలించి
వానిని
నిరంతర
సత్యప్రవృత్తము
జేయుట;
"శ్రీశ్చ",
సార్వభౌమ
రాజ్యపరికరము
సిద్ధము
చేయుట;
"ధర్మశ్చ"
వేదోక్తమగు
న్యాయము
నవలంబించి,
పక్షపాతము
వర్జించి,
సత్యమునే
సకల
కాలములందాచరించి,
అసత్యమును
విసర్జించుటే,
ధర్మము.
ఈ
ధర్మము
సర్వులకూ
ఉపకారమే
చేయును.
జన్మమందునూ
జన్మాంతరముననూ
ఆనందము
కలిగించును.
5
▾
Meaning
Keep
ధర్మమందు
ఈ
లక్షణములు
కలవు.
మనుష్యులందరును
ఈ
ధర్మలక్షణములను
గ్రహించుట
నేడు
ముఖ్యావసరము.
విద్య,
గుణము,
కర్మ,
సర్వోత్తమమైన
సద్గుణ
ప్రచారము
జరుపుట,
నిరంతరము
వీనిని
వృద్ధి
జెందించుట,
ఇవి
బ్రాహ్మణుని
లక్షణములు.
పై
గుణములను
ఎవరు
పోషింతురో
వృద్ధి
గావింతురో,
వారెవరైననూ
బ్రాహ్మణులే.
ఈ
హేతువున
సర్వోత్తమ
విద్యావంతుడై,
అర్హమైన
పనులు
సలుపునపుడే
లోక
వ్యవహారమునందు
బ్రాహ్మణుడుగా
నుండదగును.
బ్రాహ్మణాధికారమునకు
ఇవి
నిబంధనలు.
ఈ
నిబంధనలు
పాటించుటే
బ్రాహ్మణత్వమునకు
స్థానము.
అతడు
నిరంతరము
విద్యా
ప్రచారతత్పరుడై
యుండవలెను.
ఇంక
క్షత్రియ
లక్షణములన్న,
సకల
కృత్యములందు
దక్షత,
శూర
వీరత్వము,
ధైర్యము;
దుష్టుల
దండించి,
శ్రేష్ఠుల
పాలన
చేయుట.
ఈ
గుణములు
వర్ధిల్లజేయు
ఘనునకు
క్షత్రియాధికారమీయవలెను.
సకల
కార్యములను
సముచిత
గుణముల
చేత
నిర్వర్తించుచూ,
శ్రేయస్కరములైన
నీమములను
ఇంటియందేర్పరచి
లోకులకు
సకల
సుఖనిలయము
చేయ
ప్రయత్నించవలెను.
ఇంక
వైశ్యవర్ణలక్షణములను
వ్యాపారాది
వ్యవహారములు
చెల్లుటకు
నిరుపహత
గమనము
సాధించి,
రాకపోకలకు
భూగోళమధ్యమున
ప్రబంధము
నేర్పరుపవలెను.
సురక్షితముగ
దానిని
కొనసాగించవలెను.
ధనాది
పదార్థములు
ప్రపంచమున
వృద్ధిచేయు
ధర్మమే
వారల
లక్షణము,
వారు
"యశశ్చ",
సత్య
విద్యలను,
సత్య
వ్యాపారములను
(విద్యలను)
ప్రచారమందుంచుటకు
అసంఖ్యాకములైన
సదుపాయములను,
అనగా
పాఠశాలలు,
ఆరోగ్య
కేంద్రములు
నిర్మించుటకు
తోడ్పడవలెను.
యోగ్య
గుణపోషణలకు
ఆర్జించిన
ధనమును
అర్పించవలెను.
అందుమూలమున
లోకమున
సదాచారము,
ధర్మాచరణయు
పెరుగగలదు.
6
▾
Meaning
Keep
ఇక
శూద్ర
లక్షణమన్న
అప్రాప్త
పదార్థములను
పూర్వోక్త
ధర్మపద్ధతిని
సముపార్జింప
కాంక్షించవలెను.
తన్నిమిత్తము
సర్వదా
పురుషార్థము
(యత్నము)
చేయవలెను.
ప్రాప్త
పదార్థములనుచిత
రీతిని
రక్షింపవలెను.
రక్షిత
పదార్థముల
వృద్ధి
పరుపవలెను.
ఈ
పదార్థములను
సత్య,
విద్యా
ప్రచారమునకు,
సదాచార
సంపన్నులకు
పుష్కలముగా
వ్యయింపవలెను.
ఈ
విధమైన
చతుర్విధ
పురుషార్థములచేత,
ధన
ధాన్య
సమృద్ధి
సల్పి
మానవుల
సుఖమును
అభివృద్ధిపరచుచు
పోవలెను.
ఈ
చాతుర్వర్ణముల
వారునూ,
లోకధర్మ
సంరక్షణార్థమై
ఒక్కొక్క
వర్ణము
ఒక్కొక్క
కార్యాచరణనిమిత్తము
ఏర్పడినదిగా
భావించవలెను.
ఏయే
వర్ణాశ్రమ
ధర్మమునుపట్టి
ఆయా
వర్ణముల
వారు
వారి
క్రమమును,
నిబంధనలనూ
పాటించిన,
మొత్తము
లోక
క్షేమము
నిస్సందేహముగా
యేర్పడుటేగాక,
ఆత్మానందము
కూడనూ
ప్రాప్తించును.
అట్లుకాక
అందరూ
ఒక
వర్ణమునే,
అందరూ
ఒక
క్రమమునే,
నిబంధననే
పాటించవలెనని
భావించిన,
లోకరక్షణకూ,
లోక
క్షేమమునకూ
హాని
కలుగవచ్చును.
అందరూ
వ్యాపారమే
చేయువారుండిన,
ఇంక
వాటిని
తీసి
అనుభవించు
వారెవరు?
పోనీ,
అందరూ
సర్వోత్తమ
విద్యలనే
ప్రచారించువారుండిన,
వానిని
ఆచరించు
వారెవ్వరు?
అట్లుకాక,
అందరూ
శూరులై,
ధైర్యస్థైర్యములు
కలిగి
శిక్షణ,
రక్షణలందు
అధికారము
వహించిన,
ఇక
అనుభవించువారెవరు?
కాదన్న,
అందరూ
పదార్థములే
పండించి,
వాటిని
అభివృద్ధిపరచి
అనేక
విధముల
పోషించు
వారే
వుండిన
వాటిని
ఆశించు
వారెవ్వరు?
అందుకనే,
లోకసంగ్రహణార్థము
సత్యధర్మాచరణల
అంతరార్థమును
ప్రతి
మనుజుని
యందును
లయపరచి
చతుర్వర్ణముల
మార్గమున
లోక
కళ్యాణము
జరుపుచున్నాడు,
ఆ
పరమేశ్వరుడు.
7
▾
Meaning
Keep
వర్ణములనుపట్టి
వృత్తులని
భావింతురు.
కానీ,
అట్లు
కాదు.
వృత్తులనుబట్టి
వర్ణములు
పిలువబడినవి.
నేడు
చూతమా,
వృత్తులూ
లేవు,
వర్ణములూ
లేవు.
నేడొక
వృత్తి,
రేపొక
వృత్తి;
నేడొక
వర్ణము,
రేపొక
వర్ణము.
అందుకనే
లోకమున
అనేక
విధముల
అశాంతి,
అసౌకర్యములు
చెలరేగినవి.
అమోఘమైన
అంతర్ధర్మమును,
సత్యవ్రతమును,
సహన
దీక్షను
బాహ్యవృత్తులయందు
లగ్నపరచి,
ఆయా
వృత్తుల
వర్ణములను,
వాటి
నిబంధనలనూ
పాటించిన
అదే
సంతోష
భిక్ష,
శ్రీరామ
రక్ష.
లేకున్న
ఒకరితో
ఒకరికి
కక్ష,
దుర్భిక్ష.
లోకమునకొక
శిక్ష.
అట్టి
శిక్ష
నుండి
రక్షించునదే
ధర్మశిక్షణ.
Previous
←
The Importance of Temples