Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Dharma Vāhini · The Importance of Temples
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
12
దేవాలయముల
ప్రాముఖ్యత
ప్రాచీనులు
దేవమందిరములను
విజ్ఞానమందిరములని
భావించేవారు.
అర్థయుక్త
సేవచేత
పరమార్థమునే
పొందుతామని
ప్రాచీనుల
తలంపు.
మానవుని
పరమ
సంస్కృతికి
దీనిని
ఒక
పాఠశాలగా
భావించేవారు.
గుడి
యెంత
పవిత్రంగా
వుంటే,
గుండె
అంత
నిర్మలంగా
ఉంటుందని
తలంచేవారు.
ఒక్కొక్క
ఊరియందు
ఆ
గ్రామ
ప్రజలెటువంటి
వారని,
ఆ
ఊరియందున్న
గుడి
గోపురాలను
పట్టే
ఊహించేవారు.
గుడిని
పవిత్రముగా
వినియోగించుకొనుచుండిన,
ఆ
పుర
ప్రజలు
పాపభీతి
కలిగి,
సద్వర్తన
కలిగియున్నారని
ప్రాచీనులు
తలంచెడివారు.
అట్టి
దివ్యజ్ఞాన
మందిరములను,
ఆత్మోపదేశ
ఆలయములను
నేడు
కేవలము
ఆదర్శప్రాయముగా
కూడనూ
పాటించక,
ఆ
ఏకాంత
ప్రసాద
మందిరములను
అవివేక
విహారమందిరములవలె
తయారు
చేయటము,
చీట్లు,
పేకలు
నిర్విఘ్నముగా
ఆడుకోవటము,
బొగ్గు
గీతలతో,
చదరంగపు
ఆటలతో
కలిపురుషుని
విహార
స్థళముగా
ఎన్నో
గుళ్ళు
నేడు
కనిపించుచున్నవి.
ఇదే
ధర్మ
విరుద్ధము.
దేవాలయము
గ్రామమునకు
హృదయమువంటిదిగా
భావించి,
దానికి
తగిన
పరిశుభ్రతలు,
పవిత్రతలు
కలిగించి,
ఆ
పవిత్ర
ఆలయమును
పరమాత్మ
సంచార
స్థళమువలె
తలంచి,
అందరికీ
ఈశ్వర
సేవానందములో
బాధ్యత
2
▾
Meaning
Keep
కలదని
అందరి
హృదయముగా
విశ్వసించిన,
ఆనాడు
మానవునియందున్న
మాధవత్వము
మాణిక్యము
వలె
ప్రకాశించును.
ఇదియే
దేవాలయములను
నిర్మించుటలో
సత్యము,
ధర్మము.
దేవాలయ
మందిరాలలో
మానవులకు
సత్య
వికాసములకు
కావలసిన
ఏర్పాట్లు
గ్రామాధికారులు
కానీ,
భక్తశ్రేష్ఠులుగానీ
చేయవలెను.
అప్పుడే
దివ్యతేజస్సు
యొక్క
ప్రభావము
మానవ
లోకమునకు
ప్రకాశించగలదు.
అంతేకాదు;
నేడు
ఆధునికులు
కొందరు
ఈ
గోపుర
నిర్మాణ
మేమిటి?
డబ్బు
"వేష్టు"
(waste)
అని
లెక్కింతురు;
అది
కేవలము
దూర
దృష్టి
లేని
దుండగుల
లక్షణమే
కానీ,
ఊర్ధ్వ
దృష్టి,
ఉన్నత
భావము,
ఉన్నత
గుణము
కాదు.
దాని
యథార్థమును
గమనించిన
యెంత
గూఢమై,
పవిత్రమై,
మార్గదర్శకమైయున్నదో
చూడుడు!
ఊరి
బైట,
అనగా,
గ్రామమునకు
ప్రక్కల,
మార్గమున
(వెలుపలి
భాగమున)
బాహ్య
కర్మకలాపములలో
సత్యమును
మరిచి,
దారి
తప్పిపోతున్న
పాంధులను,
"ఓయీ
మానవుడా!
శారీరక
మోహ
బద్ధుడవై,
అహంకార
మమకారివై,
అశాశ్వత,
అసత్య,
అనిత్య,
భౌతిక
సుఖములకు
బానిసవై
నీ
స్వరూపమైన,
నీ
జన్మహక్కైన
సత్య,
నిత్య,
నిర్మల,
నిస్వార్థమైన,
సర్వసుఖ
నిలయుడైన
నన్ను
మరచినావు.
అందు
వలన
నీవు
లోకానికే
దుఃఖాన్ని
కూర్చుకొంటున్నావు.
మిథ్యాప్రపంచ
మోహితుడవుకాకు,
సత్యమైన
పరమాత్మను
నమ్ము.
ఆ
వెలుగులలో
నడచు.
జీవిత
శాంతికి
ఇదే
మార్గము;
ఇదే
ధర్మము;
రా!
రా!
రా!
రా!"
అని
పిలుచుచున్న
గోపాలదేవుడెత్తిన
హస్తమువలె,
ఊరియందున్న
భవనములన్నింటికంటే
యెత్తైనదిగా
వుండి,
గోపురము
కనిపించును.
ఈ
ఉన్నత
భావముతో
చేర్చిన
గోపురములు
మానవుని
అధోదృష్టిని
తొలగించి
ఊర్ధ్వదృష్టిని
కలిగించును.
ఇదే
గోపురము
నిర్మించుటలోనున్న
ధర్మము.
ఇట్టి
పరమాశయములతో
గోపురములుండును.
ఇది
సత్యమైన
3
▾
Meaning
Keep
అనుభవ
ధర్మము.
అందులో
వున్న
అఖండ
జ్యోతియే
జీవకోటికి
శరణ్యము;
ఆ
అఖండ
జ్యోతిస్వరూపుని
స్మరింపచేయు
చిహ్నము.
ఇది
నిత్యశాంతిని
చేకూర్చే
మహాదీపము.
అదే
అంతర్ముఖత్వము;
అదే
బ్రహ్మనిష్ఠ;
అదే
హరిమయత.
అట్టి
దేవమందిరములు
ఎడారులలో
చలివేంద్రములవలె
అశాంతి,
దుఃఖ
బాధలతో
దారి,
తెన్ను
తెలియని
వారికి
ప్రశాంతి
మందిరములై,
సంతోష
సదనములై
నిలిచినవి.
కలిని
ఎదుర్కొన
నిల్చిన
నామ
పతాకమువలెనున్న
ఈ
మందిరముల
గోపురములకు
అందరూ
వందనములు
చేయవలెను.
అసలు
ఇన్ని
ఏర్పాట్లు
ఎందుకనియు,
ఇన్ని
నిర్మాణములు,
నీమములు
ఎందుకనియు
నవీన
మానవులు
కొందరు
మందమతులై
ప్రశ్నింతురు.
అట్టి
వారికి
అర్థము
కానివి
జవాబుగా
చెప్పిననూ
గ్రహించుకోలేరు.
విషయ
వాసనలే
ప్రధానమను
విషజ్వరము
దేహమందున్న
వానికి
ఎట్టి
మధుర
పదార్థము
పెట్టిననూ
చేదుగానే
రుచించును
గానీ
పదార్థము
యొక్క
యథార్థపు
రుచి
వానికి
తెలియదు.
ఆ
జ్వరము
నివారణ
అయిన
తరువాతనే,
సత్యరుచి
వానికి
గోచరమగును.
అట్లే,
ముందు
మానవ
జీవితము
యొక్క
ఆశయమేమి?
వారు
పొందవలసిన
స్థానమేమి?
కేవలము
పశుపక్షి
మృగాదులవలె
తిని,
త్రాగి,
నిద్రించి,
భోగభాగ్యములనుభవించి
కడకు
మరణించటమేనా?
కాదు,
కాదు.
ఆ
కారణమేమో,
తన
ధర్మమేమో
యోచించిన,
ఈ
పిచ్చి
ప్రశ్నలకు
మచ్చులు
లేకపోవును.
మానవ
జీవిత
గమ్యమే
బ్రహ్మ
సాక్షాత్కారము.
అట్టి
పరమేశ్వరానుగ్రహశ్రీని
పొందకుండా
ఏ
మానవుడైననూ
శాంతిని
పొందలేదు.
ప్రపంచ
వస్తుజాలములో
సుఖశాంతులకై
ఎంత
ప్రయత్నించిననూ,
కొంత
వరకు
సుఖమైననూ
లభించునుకానీ,
శాంతిమాత్రము
ఆ
వస్తు
జాలములందుండదు.
ఎందుకు
అట్టి
దానిని
ఆశ్రయించ
వలెనని
శంక
కలుగవచ్చును.
ఏనాటికైనా
ఆశ్రయించవలసిన
స్వస్థానమదే
కాబట్టి,
అంతకంటే
వేరు
గతి
లేదు.
అందుకై
దానిని
ఆశ్రయించవలెను.
మనస్సు,
స్వస్వరూపమైన,
4
▾
Meaning
Keep
సర్వాధిష్ఠానమైన,
మూలకారణమైన,
సచ్చిదానందరూపమైన
పరమాత్మను
చేరకుండా
స్వాస్థ్యమును
పొందలేదు;
అన్యత్ర
శాంతిని
పొందలేదు.
భోగాలతో
కూడిన
భవనములుగానీ,
ధనరాసులుకానీ,
మరియే
లౌకిక
విషయాలు
కానీ,
స్వస్వరూపమైన,
స్వాత్మయైన
పరమేశ్వరుని
తెలిసికోకుండా,
పరమేశ్వరుని
శరణమును
పొందకుండా,
శాంతిని
ముమ్మాటికిని
కలిగించలేవు.
పోనీ,
అట్లు
సుఖశాంతులు
ప్రసాదించగలిగితే
ధన,
కనక,
వస్తు,
వాహనములు
కలవారందరూ
శాంతిగా
నుండవలెను
కదా?
అట్లున్నారా?
అంతే
కాదు,
విద్యాధికులు,
సౌందర్యవంతులు,
బలోపేతులందరూ
శాంతిగానున్నారా?
అట్లులేని
కారణమేమి?
సత్యానంద
విధానమైన
పరమేశ్వర
తత్త్వమును
విస్మరించుటమే;
భగవద్విస్మరణమే
నిజమైన
మరణము.
పరమేశ్వర
భక్తి
విశ్వాస
విహీనమైన
ప్రాపంచిక
జీవనమంతా
హేయమయినది.
అట్టి
ఆనందరసమును
పానము
చేయక,
విజ్ఞానమును
రవ్వంతయూ
పొందక
తరలిపోయినవాడు
నిజముగా
అతి
మందభాగ్యుడు.
మన
స్వస్వరూపం,
మన
సుఖ
నిధానం,
మన
మూలాధారం,
పరమాత్మనే.
అయితే,
ఇపుడు
మానవకోటి
దీనిని
విస్మరించినది.
పరమాత్మ
పరాయివాడైనాడు.
ప్రపంచము,
దగ్గర
బంధువైనది.
ఏమి
చిత్రము!
పరమేశ్వరాశ్రయములోని
ఆనందానుభూతిలో
లేక,
దైవభక్తి
అంటే,
దైవమందిరములంటే,
మహనీయులంటే,
పుణ్యనదీ
స్నానములంటే
గిజగిజలాడుతున్నారు.
లేశమైనా
ఈశ్వరభక్తి
రుచి
మరగినవాడు,
తన
విభ్రాంతిని
తెలిసికోగలుగుతాడు.
మానవుని
స్వస్థానము
పరమాత్మనే.
ఆ
స్థానమును
ఆశ్రయించడమే
శాంతి
కీలకము.
అట్టి
శాంతికి
మార్గములే
మందిర
నిర్మాణములు,
మందిర
దర్శనములు.
ఒకానొక
సమయమున
శ్రీరామచంద్రుడు
చిత్రకూటాశ్రమమున
పరిషన్మధ్యమందు
ఇట్లు
చెప్పెను;
"ప్రొద్దు
గుంకుతున్నది;
తెల్లవారుతున్నది.
తెల్లవారితే
కాంచన
వాంఛ,
ప్రొద్దు
మునిగితే
కామినీ
వాంఛ;
ఇదే
మానవుని
5
▾
Meaning
Keep
జీవితాదర్శమా?
మానవుడు
ఒక
దినము
గడుపుట
చేత
తన
అమూల్య
జీవితములో
ఒక
దినము
వృథాగా
గడచిపోయినదనీ,
తాను
మృత్యుగహ్వారం
లోనికి
సమీపిస్తున్నానని
తలపోయడు
కదా?"
చూడు,
ఈ
సందేశమెంత
స్మరణీయముగా
నున్నదో!
అందువలననే
మన
భారత
సంస్కృతి
అంతా
బ్రహ్మజ్ఞానమందే
కేంద్రీకృతం.
భ-రత
అంటే
భగవద్రతి
గల
దేశమని
సార్థక
నామము
వహించినది.
పాశ్చాత్యులు
ప్రాపంచిక
రహస్య
విషయావిష్కరణములలో
మహాత్యాగము
చేస్తే,
భారతీయులు
ప్రపంచ
మూలకారణమైన,
మానవ
శాంతికారణమైన,
పర
తత్త్వావిష్కరణములందు
ప్రాణములొడ్డి,
మహాత్యాగములాచరించినారు.
భారతీయుల
త్యాగము
శాశ్వత
విషయానికి.
పాశ్చాత్యుని
త్యాగము
క్షణిక
ప్రాపంచిక
విషయములకు.
భారతీయునిది
విజ్ఞానచర్య,
వేరొకనిది
అజ్ఞానచర్య.
ఒకరిది
తపస్సు,
మరొకరిది
తమస్సు.
అందుకనే
అనంత
కాలగర్భాలను
చీల్చుకొని
ప్రాచీన
ఋషుల,
మునుల,
యోగుల
తేజస్సు,
నేడు
మానవుల
ముఖరంగాలపై
నీడలు
నీడలుగా
గోచరించుచున్నది.
ఈ
కలి
కల్లోల
వాతావరణము
మధ్యలో
నేడు
మానవుల
ముఖరంగముపై
కనబడు
నిరాశ,
నిరుత్సాహ,
అశాంతులు
భారత
సంస్కృతిని
పరిహసించుచుండుటే
ధర్మనాశనమునకు
గుర్తు.
మానవ
హృదయాలపై
కప్పియున్న
'విషయ
వాసన'
అనే
తెరను
తీసికొను
విధానమును
తెలుపునవే
మందిరములు.
అందుకనే
త్యాగరాజు
"తెర
తీయగరాదా,
నాలో
మదమత్సరమను
తెర
తీయగరాదా!"
అని
తిరుపతి
దేవమందిరమందు
పాడెను.
అతను,
మాయ
తెరను
అనుగ్రహ
కిరణముల
ద్వారా
తెరచుట
వలననే,
"శివుడవో,
మాధవుడవో"
అని
దివ్యమంగళ
విగ్రహమును
వర్ణించగలిగినాడు.
ఆ
మధురానందమును
గ్రోలినాడు.
అట్టి
భగవన్మంత్ర
మథనము
చేతనే
వారి
హృదయకుండాలలో
జ్ఞానాగ్ని
జ్వలించినది.
6
▾
Meaning
Keep
ఈ
కలిలోనే
కాదు,
ఆ
కృతయుగ,
త్రేతాయుగ,
ద్వాపర
యుగములలో
సహితము
అతిముఖ్య
తరణోపాయము
మానవజాతికి
భగవన్నామ
సంస్మరణమే.
అట్టి
స్మరణ
స్థానమైన
మందిర,
ఆలయాల
సందర్శనమే.
అందులో,
దుర్వికార
నిలయమైన
కలిలో
నామస్మరణము,
మందిర
సందర్శనము
ప్రధాన
సాధన.
అందుకనే
గీతలో
కూడనూ
అజ్ఞాన
పశువధోదగ్రమైన
నామ
యజ్ఞము
నేనేయని
శ్రీకృష్ణ
భగవానుడు
తెలిపెను.
దుఃఖ
నివృత్తికి,
ఆనంద
ప్రాప్తికి
స్మరణ
మందిరములు
ప్రధానము.
ఆనంద
ప్రాప్తికి
స్మరణ,
స్మరణకు
మందిరము
శరణ్యము.
వాటికంటే
శ్రేష్ఠమైన
ఆనంద
మార్గములు,
సుందరమైన
మార్గములు,
అనుభవ
మార్గములు
వేరు
లేవు.
అందుకనే
వ్యాసులు,
పరమ
సులభమైన
భగవన్నామముండగా,
స్మరించటానికి
తమ
వశమై
జిహ్వాయుండగా,
ఎలుగెత్తి
దర్శించుచూ
కీర్తించుటకు
సుందర
విగ్రహుడై
ప్రతిష్ఠ
అయిన
మందిరములుండగా,
ఈ
నరులు
నరకములో
పడుటకు
కారణమేమో
అని,
విచారపడ్డారు.
అతని
మాటలు
స్వానుభవసిద్ధములైనవి.
తన
సాధనా
సారములలో
సారాంశమున్నది.
ఇంక
తులసీదాసు,
నిరంతరము
మందిరములలోనే
నివాసము
చేసి,
అతని
అనుభవమునెంత
చక్కగా
బోధించెనో
చూడు.
"అయ్యో!
భగవన్నామమును
మరచి,
దైవమందిరములు
వదలి,
అన్య
సాధనలయందూ,
అన్యమందిరములయందూ
శ్రమపడడం,
ముందట
వుంచుకొన్న
పంచభక్ష్య
పరమాన్నములను
వదలి,
మీ
యింటిలో
చేరెడు
పులినీళ్ళున్నవా
అమ్మా,
అని
అడుక్కొన్నట్లున్నది."
చూడు,
ఈ
విషయమెంత
అమోఘముగానున్నదో!
వేద
సంప్రదాయములలో
సహితము
భగవన్నామ
ప్రాశస్త్యం
శిఖర
స్థానమున
అలంకరింపబడియున్నది.
"ఓమిత్యేకాక్షరం
బ్రహ్మ"
అన్నారు
ఆర్య
ఋషులు.
భగవన్నామము
కాకుండా
కానీ,
భగవన్మందిరములు
లేకుండా
కానీ
యే
పూజ్యులు
తరించినారో
చూడుడు.
అసలు
గౌరాంగునకు
7
▾
Meaning
Keep
జగన్నాథమందిరమేకదా
శరణ్యం?
జయదేవునకు
రాధాకృష్ణ
మందిరమేకదా?
నందనారుకు
నిజరూపము
జూపినది
మందిరము
కాదా?
వల్లభాచార్య,
తుకారాం,
కబీర్,
నానక్,
మీరా,
రాధా,
రామానుజ,
మధ్వాచార్య,
శంకరాచార్య,
నామదేవ్,
తులసీదాస్,
త్యాగరాజు,
ఇత్యాది
మహా
పురుషులకు
దివ్య
దర్శన
ప్రాప్తియేకాక,
దివ్యజ్ఞానమును
ప్రసాదించినది
దైవమందిరములు,
కాదా?
వేయేల,
మొన్నమొన్నటి
వాడైన
రామకృష్ణ
పరమహంస,
రాణి
రాస్మణి
నిర్మించిన
కాళీ
మందిరమందే
కదా
తన
ఆనందముననుభవించి,
నిజస్వరూపమును
గుర్తించినది?
అట్టి
పవిత్ర
మందిరములను,
మందిర
ప్రాంగణములను
నేడు
అపవిత్రముచేసి,
వాటి
పవిత్రములను
తెలిసికొనలేని
వారై,
అనేక
అపోహలకు
చెడు
మార్గములకు
దారి
తీయుచూ,
తీయించుచూ
ఉండుట
అధర్మము
కాక
ధర్మమెట్లగును?
లోనా
లేక,
వెలుపలా
లేక,
ప్రకాశము
ఏ
రీతిగా
వారికి
ప్రాప్తించును?
బాహ్యచరణలైన
మందిరములూ,
మఠములూ,
స్మరణలూ,
పూజలూ
ఇత్యాదియూ,
అంతర్
సాధనయైన
ధ్యాన,
తప,
మననాదులునూ
లేక,
వారు
విజ్ఞానము,
తేజస్సు
నేరీతిగా
అనుభవించగలరు?
అందుకనే
ఒక
సమయములో
తులసీదాస
గోస్వామివారు
ఈ
క్రింది
రీతిగా
అనిరి:
"ఇంటి
లోపలా,
వెలుపలా
వెలుతురు
కావాలంటే,
గడపపైన
దీపము
పెట్టవలసివచ్చును.
అట్లే,
నీలోనూ,
నీ
వెలుపలనూ
శాంతి
ప్రకాశము
ప్రసరించవలెనంటే,
నీ
అంతర్బాహ్యరంగాలలో
శాంతి
తేజము
కావాలంటే,
నీ
జిహ్వాగ్రమనే
గడపయందు
నామమను
దీపమును
నిలుపుకో.
అయితే,
ఈ
దీపము
ఏ
గాలికీ,
వానకూ
ఆరునది
కాదు.
అంతేకాక,
ఆ
నామదీపము
తనకేకాక,
ప్రపంచమునకూ,
శాంతి
తేజమును
ప్రసాదించును."
ఆత్మకళ్యాణమునకు,
అఖిల
ప్రపంచ
కళ్యాణమునకూ
హరి
మందిరము,
హరి
నామములు
పరమోపాయము;
నామస్మరణ
చేయుటయే
ఒక
స్వరూప
8
▾
Meaning
Keep
దర్శనము.
అనగా
సాకారరూపము
అవసరము.
అట్టి
రూపము
కంటికి
నిండుగా
కనిపించుచూ,
ఆనందములో
మైమరపించు
స్థానములు
మందిరములు.
కాన,
మందిర,
ఆలయాలన్నీ,
సామాన్య
దృష్టిలో
అంత
ఘనత
లేకపోయిననూ,
ఆత్మార్థ
ధర్మమున
అమోఘ
సారము
కలదు.
Previous
←
Three Ages — Vedic, Upaniṣadic, Purāṇic
Next
Dharma-Discipline Is That Which Protects Through Chastisement
→