Passage 5
Passages 1–13
భగవంతుడు చెప్పిన ప్రకారం “ధర్మమునకు హాని సంభవించినప్పుడంతయూ నిరాకారుడైన నేనే సాకారమున అవతరించి ధర్మమును ఉద్ధరింతును. సాధువులను కాపాడుదును” అన్న విషయమున కొంత సంశయమునకు స్థానమేర్పడినది. సామాన్య మానవులకు ధర్మము నశించునట్టిదనియు నిత్యమైనది, సత్యమైనది కాదనియు తలంచుటకు అవకాశమున్నది కదా!
పాఠకులారా! ఈ పవిత్ర ధర్మము ఎక్కడనుండి వచ్చినది? ఎందుకొరకు పుట్టినది? అనునది యోచించి విచారించిన, దాని రక్షణ యొక్క ప్రాధాన్యత బోధపడగలదు. భగవంతుడు తనసంకల్పముచే ఈ ప్రపంచమును సృష్టించి, దానికి అనేక వ్యవస్థలు కల్పించి, కల్పించిన వ్యవస్థలు క్రమము తప్పకుండుటకై చక్కని ధర్మనిబంధనలను వ్యాపింపజేసెను. ధర్మము అనగా “ధృ” అను సంస్కృత ధాతువు నుండి వచ్చినది. ధర్మమనగా ధరించునదని అర్థము. దేశమును, దేహమును కాపాడుటకై అందానందముల ననుగ్రహించుటకే ధర్మమను వస్త్రము భారత దేశమునకు భగవంతుడు కల్పిన పవిత్ర పీతాంబరము వంటిదే. వస్త్రము మాన మర్యాదలను కాపాడుటకే కాక, శీతల బాధలనుండి రక్షించుటకేకాక, అందమును కూడనూ అందించుచున్నది. మనదేహమునకు మర్యాద, మానమును కాపాడునట్టిదే ధర్మము. దేశ గౌరవము కూడనూ భగవత్ సంకల్పమయిన ధర్మధారణతో నిలబెట్టుకొనవలెనను సంకల్పమే ఈ ధర్మము యొక్క స్థితి. దేశమునకే కాక ఈ లోకమున సృష్టించిన ఒక్కొక్క వస్తువునకూ ఒక్కొక్క ధర్మమును వస్త్రముతో కప్పబడినది. ధర్మమనునది సమష్టి స్వరూపమేకాక వ్యష్టి స్వరూపమును కూడా కలిగియున్నది.
సృష్టికి మూలాధారమైన పంచభూతములను విచారించుడు; నీటికి చలన శక్తి, చలువ శక్తి సహజధర్మము; అగ్నికి దహన శక్తి, వేడి, ఇవి ధర్మములు. అట్లే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ధర్మము; మానవులకు మానవత్వమూ, పశువులకు పశుత్వమూ, ఇవి వాటి వాటి శక్తులను కోల్పోకుండా రక్షించునట్టి ధర్మ కవచములై యుండును. అగ్నికి దహన శక్తి, వేడి లేకుండిన దానిని అగ్ని అని ఎవ్వరైనా చెప్పుదురా? అగ్నికి తగిన స్వరూప స్వభావములు దాని ధర్మమును ప్రదర్శించును. అట్టి స్వరూప స్వభావములు నశించిన అగ్ని చచ్చినదనే అర్థము. అందువలననే అగ్ని, తన దహన శక్తిని కోల్పోవుటచే ప్రాణము లేనిదై శవస్వరూపమయిన బొగ్గుగా తయారయినది.
ఇదే విధమున మానవునకు ప్రాణసమానమైన కొన్ని సహజ స్వరూప స్వభావములు కలవు. వాటినే శక్తులని కూడా అందురు. అవి వారిలో ఉన్నంత వరకే వాడు మానవుడనిపించుకొనును. అవి కోల్పోయినా వాడు మానవుడు కాలేడు. అట్టి ప్రాణసమానమైన శక్తులను అభివృద్ధి పరుచుకొనుటకు కొన్ని ఆచార విచారములు మానవునకు అత్యంత ప్రధానమైనయున్నవి. ఇట్టి ప్రధాన ఆధారమైన శక్తులను కాపాడుకొనుటే ధర్మమును కాపాడుకొనుట. ధర్మమనగా ఎక్కడ నుండో రాలేదు. ఎక్కడికో పోవుటలేదు. తన స్వభావమే ధర్మము. అట్టి స్వభావ శక్తిని కాపాడుకొనుట మానవునకు బరువైన, తన స్వభావమే తెలియని అమాయకుడనే భావించవలెను. ఒక్కొక్క వస్తువుకూ ఉన్న సహజశక్తిని కాపాడి, వాటిని అనుసరించి ప్రవర్తించుటే ధర్మ ప్రవర్తన. దాని హద్దులను అతిక్రమించి, ఇష్టమొచ్చినట్లు మారుట, అది అధర్మమని పిలువబడును. ఇట్టి భగవత్సంకల్పమైన సహజ శక్తులు కాలక్రమేణా పోషించువారు, ఆచరించువారు, అందించువారు, లోపించుటచే అది నశించినదని వ్యవహరించాలి కాని అది నశించునట్టిది కాదు. పంట పైరులో పిచ్చిగడ్డియైన తుంగ, గరిక మొలిచి పంటను పైకి రానీయక చేసినట్లు, సహజ శక్తియైన ధర్మమను పంటలో కల్పిత ధర్మములను పనికిమాలిన గడ్డిపోచలు పెరిగి నిజధర్మమును అణగద్రొక్కి అదృశ్యము చేయుటచే పిచ్చిగడ్డిని పెరికి అచ్చపు పంటను పైన పెరుగునట్లు చేయుటయే ధర్మ రక్షణ అనిపించుకొనును. ఈ కలిలో ధర్మము మాటలలో నిలిచినది కాని ఆచరణలో అదృశ్యమయినది. ధర్మము ఆచరణ యోగ్యమే కాని మాటల మ్యాజిక్‌కాదు; అని బాగా తెలుసుకొనవలెను. పలుకవలసినది సత్యము, ఆచరించవలసినది ధర్మము.
“సత్యం వద” “ధర్మం చర” అని మన భారత సంస్కృతిని అనాదికాలము నుండి, ఉపనిషత్తులు గొంతెత్తి గోలపెట్టుచునే యున్నవి. ఇట్టి పవిత్ర పదముల సారమును నేడు మరిచి ధర్మమును చెప్పుటలో ప్రవేశపెట్టిరి. ఇదే ధర్మానికి మొదటి సోపానము. చేయవలసినది మాని చెప్పుటకు దిగినది; దీనినే అధర్మమని కూడనూ అనవచ్చును. ఆచరణలో లేనిదానికి అంతబలము ఉండదు. మునసికి నీటిలో బలముండునట్లు ధర్మములకు ఆచరణయందే బలము కాని చెప్పుటయందు వాటికి తగిన బలము ఉండదు. సత్యమునకు చెప్పుటయందే బలముకాని ఆచరించుటలో అంత బలముండదు. బలమనగా ఇక్కడ రెండు విధములైన బలములు కలవు; పశుబలము, ధర్మబలము. మానవునకు ధర్మబలము బలము కాని, పశుబలము, బలమనిపించుకొనదు. భీముడున్నాడు; అతని బలము కేవలము దేహబలము మాత్రమే. అందువలన అతని బలము పశుబలమనే భావించవలెను. ప్రకృత ధర్మజుడుంటచే అతని బలము ధర్మబలమైనది. ధర్మజుడు ప్రకృతన ఉన్నంతవరకూ భీముని బలము ధర్మబలమే కాని పశుబలము కాదు. ధర్మ బలము వలననే పాండవులు రక్షింపబడిరి. కాని కేవలము పశు బలమే ఉండియుండిన పాండవులు ప్రారంభములోనే పరాభవమునకు యుండెడివారు. ధర్మజుడు లేని పాండవుల గతి యేమి? బలములుండి ఏకమయెదో యోచింపుడు! కౌరవులకు సర్వబలములుండనే నశించుటకు కారణమేమి? ధర్మ బలము లేదు. కనుకనే వారి సర్వబలములు పశుబలములై పోయెను. ఏనాడు ధర్మబలమును ధర్మజుడూ, భీముడూ అడవులపాలై పోయిరో ఆనాడే కౌరవ రాజ్యములో అధర్మము ప్రవేశించెను. కనుక ఇప్పుడు అడవులనందున్న ధర్మబలాలను గ్రామాదులందు చేరవలెను. అప్పుడే లోకము సుభిక్షమై శాంతి సంపదలాభివృద్ధి చెందగలవు. అధర్మ పరిపాలన బారినుండి తప్పించుకొని ధర్మ పరిపాలనలో మనము ప్రవేశము కావలెను. పంట పైరును రక్షించుటకే కలుపును తీసివేయ ప్రయత్నము అవసరము కాని, పనికి రాని గడ్డి పైరులు మొలిపించుటకు ఏ ప్రయత్నమూ అక్కరలేదు. అటులనే ఇప్పుడు పంట పైరైన సహజ ధర్మమును ఆచరణలోనికి తెప్పించుటకే సర్వ ప్రయత్నములా కావలెను.
ధర్మాచరణ అభివృద్ధి అయిన అధర్మము తనంతటతానే నశించును. దానికి ప్రత్యేకించి ప్రయత్నము అవసరములేదు. కనుక ఇప్పుడు, ధర్మాచరణను స్థాపించుటే ధర్మస్థాపన. సూర్యుడస్తమించినాడన్న ఎంత అర్థమో, ధర్మము నశించినదన్ననూ అంతే అర్థము. సూర్యునకు అస్తమించుటనునది లేదు. కనిపించనంత మాత్రాన అస్తమించెనని తలంతురు. కాని, అది నశించునది కాదు. నశించునది సత్యమెట్లగును? ధర్మము సత్యముతో చేరినది కనుక అది నశించునది కాదు. అట్టి సత్యమైన ధర్మము మరుగునపడి కనిపించక అదృశ్యమైన దానిని దృశ్యమునకు తెప్పించుటే ధర్మస్థాపన. ఇప్పుడు కృష్ణపరమాత్మ చేయుచున్న పనియూ అదియే! అర్జునుని నిమిత్తమాత్రముగా ఉంచుకొని అదృశ్యమైన అనాది ధర్మకర్మలను ఆచరణలోనికి తెప్పించుచున్నాడు! దీనినే ధర్మోద్ధరణ అని అందురు. లేని దానిని ఉద్ధరించలేదు. ఉన్నదానినే ఉద్ధరించుచున్నాడు. ఇవి సామాన్యులచేత అయ్యేటటువంటి పని కాదు. కనుక సర్వాధారుడైన సర్వేశ్వరుడే కంకణముకట్టి సర్వశక్తిమయుడయిన అర్జునుని చేత యుందించుకొని అతని ద్వారా లోకమునకు బోధించుచున్నాడు. అర్జునుడు సామాన్యుడైన ఈ పవిత్ర ధర్మమును దేశమునకు అంత సులభముగ అందించలేడు. కనుక అర్జునుడు సామాన్యుడు కాదని తలంచవలెను. అతను అంతర్ బాహ్య శత్రువులను కూడా జయించినాడు. అట్టి దైవ శక్తికలవాడే ఈ శక్తివంతమైన ధర్మమును ఆచరణలో సాధించగలడే కాని శక్తిహీనులకు బోధించి ప్రయోజనముండదు. కృష్ణపరమాత్మ ఆలోచించే చక్కని చుక్కను నిర్ణయించుకొన్నాడు. అర్జునుని ప్రజ్ఞాజ్యోతిగా ఎన్నుకొన్నాడు. భగవంతునికి అర్జునిపై అంత కృపా ప్రసారము ప్రవహించివున్న, అతను సామాన్యుడు కాదని భావించక తప్పదు.
ఒకానొకప్పుడు కృష్ణపరమాత్మ అర్జునునితో సరదాగా మాట్లాడుతూ, (ఈ యోగములో సూచించిన దయారసము పాఠకులు చవి చూడుడు) “బావా! నీవు నాకు పరమ భక్తుడవు; అంతియే కాదు, ప్రాణమిత్రుడవు. నీబోటి మిత్రుడు నాకు మరొకడు లేడు; అందువలననే ఈ పవిత్రమైన ఉత్తమ రహస్యమును నీకు బోధించితిని” అని అన్నాడు. దీనిని అంతరార్థమెంత గాఢమయినదో యోచించుడు. లోకమున ఎందరో భక్తులమని వారికి వారు బిరుదులు కల్పించుకొనుచున్నారు. కాని, నీవు భక్తుడవు అని భగవంతుడు ఎవ్వరికి బిరుదు ఇవ్వలేదు. భగవంతుని హృదయమునుండి నీవు నా భక్తుడవు అను బిరుదును పొందినవాడు భక్తుడు కాని; భగవంతుని హృదయమును కరిగింపలేనివారు ఎంత భక్తుల మనుకొన్ననూ అది వారి అల్పతృప్తే కాని ఆత్మతృప్తి కాదు. నీవు నా భక్తుడవని బిరుదును సాధించినది ఒక్క అర్జునుడు మాత్రమే. అర్జునుడు ఎంతటి పవిత్ర హృదయముతో భగవత్ అనుగ్రహమునకు ఎంతటి అర్హుడో దీనితో తెలుసుకొనవచ్చును. భక్తులము భక్తులమని ఊరికే చెప్పుకొను జోలుమాటలు, జల్లుమాటలూ గాలిమాటలే. వారికి తిరుగు అంగీకారముండిన గదా భక్తులమటకు గురు! భక్తివలన అవిధేయత దూరమగును. అంత మాత్రమే కాదు. అందుకనే మిత్రుడవని కూడా కృష్ణపరమాత్మ ఉపయోగపెట్టినాడు. మిత్రత్వము వలన భయము ఉండదు. ఇవి ఒకదానికొకటి లేకపోయిన ఉత్తమ విద్యకు అధికారికాలేదు. కనుకనే భక్తి, మైత్రి రెండూ అన్యోన్యముగా నుండిన అనుగ్రహమునకు అధికారి కాగలడు.
ఇక విజయమునకు దిగుదాము. కృష్ణపరమాత్మ, వాక్యమును పట్టిచూడు అర్జునునకు తలమోయలేనంతటి సంశయము ప్రారంభమాయెను. తనను అనేక విధముల పీడించిన మొదలిడెను. అర్జునునకే కాదు ఎట్టి మానవునికైనను ఇట్టి సంశయములు హృదయమున ఉద్భవించక తప్పదు. అందులోనూ అర్థము కాని ఆధ్యాత్మిక విషయములందు భగవత్ తత్వమునందు అంతరార్థము ఒకటి, బాహ్యార్థము మరొకటిగా నుండుటచే, సామాన్యులు బాహ్యార్థముననే ప్రధానముగా పాటింతురు. దీనికి అనుభవమైననూ ఉండవలెను, లేక అనుగ్రహబలమైననూ ఉండవలెను. కాని, రెండు లేనివారలకు ఇవి మరింత తికమకలు కలిగించును. సంశయము సామాన్యమైనది కాదు. “కంటిలోని నలుసు, చెవిలోని జోరీగ, చెప్పులోని రాయి, కాలిలోని ముల్లు ఏ విధముగా శాంతి లేకుండా చేయునో” అటులనే ఒంటిలోని సంశయము ఇంటిలోని పోరువలె హింసించును. ఇట్టి సంశయము ప్రజా ప్రతినిధిగా నిలిచిన అర్జునునకు కలుగుటలో అది ప్రజల సంశయముననే భావించవలెను. దీనిని మానవాతీతమైన మాధవుడే తీర్చగలడు కాని మానవ మాత్రులకు సాధ్యము కాదు. అందుకనే పరమాత్ముడైన కృష్ణుడు సిద్ధముగా వద్దనే యున్నాడు, సంశయము తీర్చి సంతోష పెట్టుటకు, అసలు సంశయమేమన.
ద్వాపర యుగాంతములో మొన్న మొన్న పుట్టినవాడు కృష్ణుడు, సూర్యుడేమో మనువునకూ ప్రాచీనకాలము వారు. వీరికి, యుగాంతములో పుట్టిన కృష్ణునికి ఎట్టి పొందికా చేరదే! వీరువురికి ఏమి సంబంధము? దేహసంబంధమును కొందవా! వారు అనేక తరముల క్రిందటి వారు. కృష్ణుడు నేటివాడు. అది ఏ మాత్రము చెల్లదు. ఈ యోగము కృష్ణుడు సూర్యునికెట్లు బోధించెను? అర్థము కాని నమ్మకములేని మాటలను విని ఊరకుండుట అవివేక లక్షణము కదా! అని అర్జునుని బాధ. నిమిష నిమిషమునకు విషము పరిణతికి జారుచుండెను. దానిని సర్వవ్యాపియైన పరమేశ్వరుడు కనిపెట్టి “బావా! ఏమి నీలో ఏదో బాధ కలిగినట్లున్నదే! తెలుపుమని” వీపు నిమురుతూ చిరునవ్వులతో శ్రీమాట్లు పెట్టెను.
సమయము చిక్కినదికదా అని అర్జునుడు “మాధవా! నీ మాటలు నాకు ఏమియూ బోధపడుటలేదు. అంతటితో మానక నన్ను విపరీత భావములలో ముంచి నీపై నున్న కాస్త విశ్వాసమును కూడా కోల్పోవునట్లు చేయుచున్నవి. కాని నా సంశయమును ప్రేమతో మన్నించి తీర్చవలెను. లేకున్న నే నిలువజాలను” అని చేతులు రెండూ పట్టుకొని ప్రార్థించినాడు.
గోపాలుడు సంతసమున సంశయమును తెలుపుమనెను. అప్పుడర్జునుడు “కృష్ణా! నీవు పూర్వము ఈ యోగమును సూర్యునకు ఉపదేశించినట్లును తదుపరి సూర్యుడు మనువునకు బోధించినట్లునూ తెలుపితివి. సూర్యుడా, మనువా ఏ కాలమువారలు! నీవే కాలమువాడవు? పోనీ, ఏ కాలమైననూ సరే! ఈ దేహముతోనే ఉపదేశించితివా? లేక మరొక దేహముతో ఉపదేశించితివా? ఈ దేహముతోనే ఉపదేశించితివని అందువా! అది నమ్మ వీలుకాదు. ఈ దేహము నాతో పాటు ఇంచుమించు మూడు నాలుగు సంవత్సరములు పెద్దవాడివే కాని అంతకంటే ముందువాడవు కాదు! నాకు తెలియక ఎప్పుడు ఉపదేశించితివి? సూర్యుడు చూతమా నీకంటే ఎన్నో వేల రెట్లు పెద్దవాడు! అది కాలము వాడు! ఊహించుటకు కూడనూ వీలుకానిది. బావా! నేనే కాదు. ఈ విషయమును ఎంతటి తెలివితేటలుగల వాడైననూ నమ్మడు. పోనీ, ఈ దేహమే కాదు! ఈ యుగమే కాదు! వేరొక యుగమా, వేరొక దేహమని అందువా? అది మరింత అతుకని మాట. ఏ జన్మమునందో చేసిన కర్మలు ఈ జన్మమున ఎట్లు జ్ఞాపకముండును? కాని ఉండునని నీవు ఒప్పుకున్నా, నీవలె నాకునూ గడచిన జన్మల కర్మలు జ్ఞాపకముండవలెను కదా! ఏదో దివ్య పురుషులకు మాత్రమే జన్మాంతర విషయము జ్ఞాపకముండునని శాస్త్రములు తెలిపినవి. కాని, సామాన్యులందరికీ ఉండ వీలులేదు కదా! పోనీ నీవు దివ్య పురుషుడవని నమ్మిననూ సూర్యుడు స్వయంగా దివ్య పురుషుడే! ఇద్దరు సమానమేనా! అదియునూ సరియని ఒప్పుకున్నా, సరిసమానమైన వారే కాని ఒకరికొకరు ఉపదేశించుకొనుట జరగదే! నీవు ఉపదేశించితివన్న, నీవు గురువు, సూర్యుడు శిష్యుడూ కావలెను గదా! అప్పడు నీవు సూర్యునికంటే గొప్పవాడుగా ఉండవలెను కదా! ఉండవు! గొప్పవాడవే, భగవంతుడవే అని విశ్వసించిన మరింత సంశయమునకు చోటు ఏర్పడును కదా! నీవు భగవంతుడవే అయిన సామాన్య మానవులవలె కర్మ పరతంత్రుడవై జనన మరణాది క్లేశములకు కట్టుబడుటెందులకు? నీవు బిడ్డగుల దేహముతో మానవాకారుడుగా సంచరించుట నీ నిరాకార సర్వ వ్యాపకత్వమునకు భంగము కాదా?
“అంతటి అనంత స్థానమైన సర్వవ్యాపకత్వము నుండి అల్పస్థానమునకు జారుటకు కారణమేమి? ఏమో కృష్ణా! ఎన్ని విధముల తలంచిననూ నాకేమి బోధపడుటలేదు! నీ మాటలు నీకే సరి; నా తల తిరుగుచున్నది. ఏదో సరియైన సమాధానము చెప్పి నన్ను అనుగ్రహించుము” అని ప్రార్థించెను.
అప్పుడు ముని గోపాలుడు ముని ముని నవ్వులు నవ్వుచూ కాచిన కాలము సమీపించినదని సంతోషించి, “బావా! విను. లోకులు సూర్యోదయము సూర్యాస్తమయమని అనుటలో అర్థమేమి? అది కేవలము లోకుల దృష్టియందే కాని సూర్యుని దృష్టియందు కాదు. సూర్యుడు ఉదయించుటా లేదు, అస్తమించుటా లేదు, అవునా? కాదా? నేనునూ అంతే, నాకు జన్మమే లేదు. సామాన్య మానవుల దృష్టికి నేను అనేక కాయములను ధరించి అనేక జన్మలు ఎత్తినని తలంతురు. లోకోద్ధరణమునకు అవసరమొచ్చినప్పుడంతా ఒక కాయము ధరించి లోకమునకు రూపనామములతో గోచరించుచున్నా, ఎన్ని జన్మల విషయమైననూ నాకు జ్ఞాపకముండును. నేను సర్వజ్ఞుడను, సర్వశక్తుడను. నాకే కాదు, నీకు కూడనూ అంతా తెలియును. అయితే నీ జ్ఞానశక్తి అజ్ఞానముచే ఆవరించుటవలన నీకు తెలియజాలకున్నది. నేను జ్ఞానమయుడను. కనుక నాకు సర్వ వేళలయందునూ స్పష్టముగా తెలియుచుండును. బావా! సూర్యుడు అద్దములో అనిపించినంత మాత్రమున స్థానభంగురుడు కాని, అధికార భంగురుడు కాని అయ్యాడా? ఉన్నవాడు ఉన్నట్లే ఉండి అద్దమందు ప్రతిబింబించుచున్నాడు. అటులనే నేను కూడనూ ప్రకృతి అను అద్దమందు ప్రతిబింబించుచున్నంత మాత్రమున నా సర్వజ్ఞత్వమునకు, సర్వశక్తికి భంగము రాదు; లేదు. నేను జన్మరహితుడను. మానవ జన్మమునకు మునుపు చేసిన పుణ్య పాపకర్మలు కారణములగును. అయితే, అవతార జన్మలకు కూడనూ అవే కారణమని తలంతువేమో? కాదు, కాదు. మానవ జన్మ కర్మ జన్మ, నా జన్మ లీలా జన్మ. ప్రార్థనలు, సాధుసత్కర్మలే నా జన్మకు కారణము, దుష్టుల దుష్టకర్మలు, సజ్జనుల యొక్క సత్కర్మలే నా జన్మకు కారణము” అని కృష్ణుడుపదేశించెను.
1When Bhagavān declares, 'Whenever Dharma is harmed, I—though formless—take form, incarnate, raise Dharma again, and protect the sādhus,' a question may arise. Ordinary people may then imagine that Dharma itself is something that can truly perish and therefore is neither eternal nor true. 2Readers, consider carefully: from where has this sacred Dharma come, and for what purpose does it exist? Then the importance of protecting it becomes clear. Bhagavān created this world by His saṅkalpa, established many orders within it, and spread Dharmic laws so that those orders would remain in harmony. The word Dharma comes from the Sanskrit root dhṛ, 'to uphold, sustain, bear.' Dharma is that which upholds. The garment called Dharma is like a sacred pītāmbara given by Bhagavān to Bhārata: it protects the country and the embodied person, preserves dignity, gives protection, and also lends beauty. A garment does not merely cover modesty; it protects from cold and gives grace. In the same way Dharma preserves the dignity of the human being and the honour of a nation. Nor is Dharma only collective. Every created thing has been clothed with its own Dharma. Thus Dharma has both samaṣṭi, collective, and vyaṣṭi, individual, dimensions. 3Consider the pañca-bhūtas that support creation. Movement and coolness are natural Dharmas of water; heat and the power to burn are Dharmas of fire. Each thing has its own Dharma. Humanity is the Dharma of man; the nature of an animal is the Dharma of the animal. These function like protective armour that keeps each being from losing its characteristic power. If fire had neither heat nor the power to burn, who would call it fire? Its svarūpa and svabhāva reveal its Dharma. When those are lost, fire, as fire, is gone. Coal is what remains when that living fiery power is no longer manifest. 4In the same way, man has certain natural qualities as vital as life itself. These may also be called his powers. Only while they live in him does he deserve the name human. If he loses them, he has lost his humanity. Certain disciplines, reflections and ways of conduct are therefore essential for nourishing these life-giving powers. To preserve them is to preserve Dharma. Dharma has not come from somewhere else and it does not depart somewhere else. One's true svabhāva is Dharma. If a person feels that preserving his own natural divine qualities is a burden, it only shows that he has forgotten his own nature. Dharmic conduct means protecting the natural power present in each being and living in harmony with it. To violate its bounds and act merely as whim dictates is adharma. In the course of time, when those who cherish, practise and transmit Bhagavān's natural law become few, we say Dharma has 'declined.' But Dharma itself has not ceased to exist. It is like a true crop smothered by wild grass: artificial customs and useless growth can cover over the crop of natural Dharma until the real thing is hidden. Dharma-rakṣaṇa is the clearing away of those weeds so the true crop can rise again. In this Kali age Dharma remains much in speech but has become hidden in practice. Dharma is for living, not for verbal magic. Truth is to be spoken; Dharma is to be practised. 5From ancient times the Upaniṣads have cried out, 'satyaṁ vada—speak truth; dharmaṁ cara—live Dharma.' Today the essence of these sacred words is often forgotten, and people have begun merely talking about Dharma. That is the first fall. What should be done is neglected and what remains is discussion; that itself may be called adharma. What is not embodied in action has little strength. Just as certain creatures have strength only in their natural element, Dharma has strength in practice, not in speech alone. Satya expresses its strength through truthful speech; Dharma through right living. Here there are two kinds of power: paśu-bala, brute strength, and Dharma-bala, the strength of righteousness. For man, Dharma-bala is true strength; brute strength alone is not. Bhīma possessed immense bodily power. By itself it would be paśu-bala. But because Dharmaja stood at the centre of the Pāṇḍavas, Bhīma's strength became Dharma-bala. Dharma-bala protected the Pāṇḍavas. Had they possessed only brute force, they would have been defeated at the very beginning. What would the Pāṇḍavas be without Dharmaja? The Kauravas possessed every worldly kind of strength; why then were they destroyed? Dharma-bala was absent, so all their powers became merely brute powers. When Dharmaja and the Pāṇḍavas were driven into the forests, adharma entered the Kaurava kingdom. Therefore the Dharma-strength now hidden in the forests must return to villages and human society. Only then can peace, abundance and prosperity grow. We must move from the rule of adharma into the rule of Dharma. Effort is required to protect the crop by removing weeds; no effort is needed for useless weeds to grow by themselves. Likewise, every effort is now required to bring the natural crop of Dharma back into living practice. 6When Dharmic practice grows, adharma disappears by itself; no separate campaign against it is necessary. Therefore establishing the practice of Dharma is Dharma-sthāpana. To say 'the Sun has set' and to say 'Dharma has perished' are alike. The Sun does not truly cease to exist; it is only no longer visible from one place. Dharma too does not perish. How could what truly perishes be Satya? Dharma is joined to Satya and therefore cannot be destroyed. Dharma-sthāpana means bringing back into visibility and practice the true Dharma that has become concealed. This is precisely what Kṛṣṇa Paramātma is doing. Using Arjuna as nimitta, the occasion and instrument, He restores the ancient Dharmic actions that had become hidden. This is Dharma-uddharaṇa, the raising up of Dharma. One cannot raise what does not exist; one raises what is already there but obscured. Such work is not possible for ordinary capacity. Sarveśvara Himself therefore takes it up, placing the mighty Arjuna in His hands and teaching the world through him. If Arjuna were merely ordinary, he could not carry this sacred Dharma so effectively to the world. He had conquered both outer and inner enemies. Only one endowed with such divine strength can embody a Dharma of such power; merely preaching it to the powerless is of little use. Kṛṣṇa Paramātma chose His point of light well: He chose Arjuna as the lamp of Prajñā. The very flood of grace Bhagavān poured upon Arjuna tells us that Arjuna was no ordinary man. 7Once, speaking playfully with Arjuna—and the reader may taste the tenderness in this exchange—Kṛṣṇa Paramātma said, 'Dear one! You are My supreme bhakta; more than that, you are My life-friend. I have no other friend like you. That is why I have taught you this sacred and highest secret.' Reflect on the depth of this. Many in the world give themselves the title 'devotee.' But Bhagavān does not casually bestow the title, 'You are My bhakta.' The true bhakta is one who receives that recognition from Bhagavān's own heart. However loudly one calls oneself a devotee, if one's love does not move the heart of Bhagavān, it is merely self-satisfaction, not Ātma-tṛpti. Arjuna alone here receives the direct word, 'You are My bhakta.' From this we may understand the purity of his heart and his fitness for grace. Empty claims—'we are devotees, we are devotees'—are just words carried by the wind unless there is answering recognition from the Divine. Bhakti removes disobedience and separation. Kṛṣṇa also calls Arjuna His friend, because friendship removes fear. Bhakti and maitri—devotion and intimate friendship—together make one fit to receive this highest Vidyā and Bhagavān's grace. 8Now consider Arjuna's next movement. Taking Kṛṣṇa's words seriously, a great doubt arose in him—so heavy that he could hardly carry it. Such doubts can arise in any human heart, especially concerning spiritual truths where the inner meaning differs from the surface meaning. Ordinary minds seize the outer sense. To penetrate within, one needs either direct experience or the strength of grace; without either, spiritual statements can create still greater confusion. Doubt is no small thing. As a speck in the eye, a buzzing insect in the ear, a stone in the shoe, or a thorn in the foot destroys peace, so doubt within can torment a person like conflict in his own home. Since Arjuna stands as the representative of humanity, his doubt is the doubt of humanity. Only Mādhava, who is beyond the human limitation, can fully resolve it. Kṛṣṇa Paramātma is already there, ready to remove it and restore joy. What, then, is the doubt? 9Kṛṣṇa was born, as it appeared, near the end of Dvāpara Yuga; Sūrya belongs to an age far before Manu. How can the two be brought together? What relation could exist between the ancient Sun and Kṛṣṇa, who appears now? If we take only bodily chronology, the statement seems impossible. Then how could Kṛṣṇa have taught this Yoga to Sūrya? To hear something one does not understand or believe and simply remain silent would itself be foolishness. This troubled Arjuna more and more. Sarvavyāpī Parameśvara saw the unease within him and, gently stroking his back with a smile, asked, 'Dear one, something seems to be troubling you. Tell Me.' 10Given the opening, Arjuna held Kṛṣṇa's hands and prayed: 'Mādhava! I cannot understand Your words. Instead of making things clearer, they are drawing me into strange ideas and may even shake the little faith I have. Please forgive my doubt with love and resolve it. Otherwise I cannot stand steady.' 11Gopāla happily asked him to state the doubt. Arjuna said: 'Kṛṣṇa! You said that long ago You taught this Yoga to the Sun and that the Sun later taught Manu. But in what age did Sūrya and Manu live, and in what age do You live? Did You teach it in this very body, or in another body? If You say in this body, I cannot believe it. This body is only a few years older than mine. When could You have taught Sūrya without my knowing? Sūrya is unimaginably older. And if You say, "Not this body, not this age—another birth, another body," the statement seems still harder to join together. How are deeds of an earlier birth remembered in this birth? Even if I accept that You remember them, should I not, like You, remember my own former births? Śāstra says that certain divine beings may remember earlier births, but ordinary people do not. Suppose I accept that You are a divine person—Sūrya himself is divine. If you are equals, why should one teach the other? If You taught him, You would be Guru and Sūrya disciple, which means You must be greater than Sūrya. And if I accept that You are indeed greater, even Bhagavān, another doubt appears: why should Bhagavān become dependent upon Karma like ordinary men, subject Himself to birth and death, and move in a five-foot human body? Does appearing in human form not contradict Your formless, all-pervading nature?' 12'Why should the Infinite, all-pervading One descend into such a small locus? Kṛṣṇa, however I think about it, I cannot understand. Your words may be clear to You, but my head is spinning. Give me a true answer and bless me.' 13Then the sage-like Gopāla smiled softly, pleased that the awaited moment had come. 'Dear one, listen. What do people mean when they say "sunrise" and "sunset"? Those expressions exist from the viewpoint of observers on earth, not from the Sun's own standpoint. The Sun does not really rise or set. Is that not so? I am the same. I have no birth. To ordinary human sight I appear to assume many bodies and take many births. Whenever the uplift of the world requires it, I assume a form and become visible through name and form. Yet I remember every such manifestation, for I am Sarvajña and Sarvaśakta. Not only I—you too, in truth, have passed through all this. But your power of knowledge is covered by ajñāna, and so you do not remember. I am of the nature of Jñāna; therefore all times are clear to Me. Dear one, if the Sun appears reflected in a mirror, does he thereby leave his place or lose his power? He remains exactly where he is and merely appears in the mirror. In the same way, when I am reflected in the mirror called Prakṛti, My omniscience and omnipotence are not diminished. I am birthless. Human birth comes because of puṇya and pāpa from previous Karma. Do not think Avatāra births arise from the same cause. Human birth is Karma-janma; My birth is Līlā-janma. The prayers and noble deeds of sādhus call Me; the evil actions of the wicked and the righteous actions of the good become the occasion for My manifestation.' Thus Kṛṣṇa taught.