Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · Establishing the Practice of Dharma Is the Establishment of Dharma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
భగవంతుడు
చెప్పిన
చొప్పున
“ధర్మమునకు
హాని
సంభవించినపుడంతయూ
నిరాకారుడైన
నేనే
నరాకారమున
అవతరించి
ధర్మమును
ఉద్ధరింతును.
సాధులను
కాపాడుదును”
అన్న
విషయమున
కొంత
సంశయమునకు
స్థానమేర్పడినది.
సామాన్య
మానవులకు
ధర్మము
నశించునట్టిదనియు,
నిత్యమైనది,
సత్యమైనది
కాదనియు
తలంచుటకు
అవకాశమున్నది
కదా?
2
▾
Meaning
Keep
పాఠకులారా!
ఈ
పవిత్ర
ధర్మము
ఎక్కడ
నుండి
వచ్చినది?
ఎందు
కొరకు
పుట్టినది?
అనునది
యోచించి
విచారించిన,
దాని
రక్షణ
యొక్క
ప్రాధాన్యత
బోధపడగలదు.
భగవంతుడు
తన
సంకల్పముచే
ఈ
ప్రపంచమును
సృష్టించి,
దానికి
అనేక
వ్యవస్థలు
కల్పించి,
కల్పించిన
వ్యవస్థలు
క్రమము
తప్పకుండుటకై
చక్కని
ధర్మనిబంధనలను
వ్యాపింపజేసెను.
ధర్మమనగా
“ధృ”
అను
సంస్కృత
ధాతువు
నుండి
వచ్చినది.
‘ధర్మమ’నగా
ధరించునదని
అర్థము.
దేశమను
దేహమును
కాపాడుటకే
అందానందములను
అనుగ్రహించుటకే
ధర్మమను
వస్త్రము,
భారత
దేశమునకు
భగవంతుడు
కప్పిన
పవిత్ర
పీతాంబరము
వంటిది.
వస్త్రము
మాన
మర్యాదలను
కాపాడుటకే
కాక,
శీతల
బాధల
నుండి
రక్షించుటకేకాక,
అందమును
కూడనూ
అందిచుచున్నది.
మన
దేహమునకు
మర్యాద,
మానమును
కాపాడునట్టిదే
ధర్మము.
దేశ
గౌరవము
కూడనూ
భగవత్
సంకల్పమయిన
ధర్మధారణతో
నిలబెట్టుకొనవలెనను
సంకల్పమే
ఈ
ధర్మము
యొక్క
స్థితి.
దేశమునకే
కాక
ఈ
లోకమున
సృష్టించిన
ఒక్కొక్క
వస్తువూ
ఒక్కొక్క
ధర్మమను
వస్త్రముతో
కప్పబడినది.
3
▾
Meaning
Keep
ధర్మమనునది
సమష్టి
స్వరూపమేకాక
వ్యష్టి
స్వరూపమును
కూడా
కలిగియున్నది.
సృష్టికి
మూలాధారమైన
పంచభూతములను
విచారించుడు;
నీటికి
చలన
శక్తి,
చలువ
శక్తి
సహజధర్మము;
అగ్నికి
దహన
శక్తి,
వేడి,
ఇవి
ధర్మములు.
అట్లే
ఒక్కొక్క
దానికి
ఒక్కొక్క
ధర్మము;
మానవులకు
మానవత్వమూ,
పశువులకు
పశుత్వమూ,
ఇవి
వాటి
వాటి
శక్తులను
కోల్పోకుండా
రక్షించునట్టి
ధర్మ
కవచములై
యుండును.
అగ్నికి
దహన
శక్తి,
వేడే
లేకుండిన
దానిని
‘అగ్ని’
అని
ఎవరైనా
చెప్పుదురా?
అగ్నికి
తగిన
స్వరూప
స్వభావములు
దాని
ధర్మమును
ప్రదర్శించును.
అట్టి
స్వరూప
స్వభావములు
నశించెనా
అగ్ని
చచ్చినదనే
అర్థము.
అందువలననే
అగ్ని
తన
దహన
శక్తిని
కోల్పోవుటచే
ప్రాణము
లేనిదై
శవస్వరూపమయిన
బొగ్గుగా
తయారయినది.
4
▾
Meaning
Keep
ఇదే
విధమున,
మానవునకు
ప్రాణసమానమైన
కొన్ని
సహజ
స్వరూప
స్వభావములు
కలవు.
వాటినే
‘శక్తుల’ని
కూడా
అందురు.
అవి
వారిలో
ఉన్నంత
వరకే
వాడు
మానవుడనిపించుకొనును.
అవి
కోల్పోయెనా
వాడు
మానవుడు
కాలేడు.
అట్టి
ప్రాణసమానమైన
శక్తులను
అభివృద్ధి
పరచుకొనుటకు
కొన్ని
ఆచార
విచారములు
మానవునకు
అత్యంత
ప్రధానమైనవైయున్నవి.
ఇట్టి
ప్రధాన
ఆధారమైన
శక్తులను
కాపాడుకొనుటే
ధర్మమును
కాపాడుకొనుట.
ధర్మమనగా
ఎక్కడ
నుండో
రాలేదు.
ఎక్కడికో
పోవుటలేదు.
తన
స్వభావమే
ధర్మము.
అట్టి
స్వభావ
శక్తిని
కాపాడుకొనుట
మానవునకు
బరువైన,
తన
స్వభావమే
తెలియని
అమాయకుడనే
భావించవలెను.
ఒక్కొక్క
వస్తువుకూ
ఉన్న
సహజశక్తిని
కాపాడి,
వాటిని
అనుసరించి
ప్రవర్తించుటే
ధర్మ
ప్రవర్తన.
దాని
హద్దులను
అతిక్రమించి,
ఇష్టమొచ్చినట్లు
మార్చుట,
అది
అధర్మమని
పిలువబడును.
ఇట్టి
భగవత్సంకల్పమైన
సహజ
శక్తులు
కాలక్రమేణా
పోషించువారు,
ఆచరించువారు,
అందించువారు,
లోపించుటచే
అది
నశించినదని
వ్యవహరించిరి
కాని
అది
నశించునట్టిది
కాదు.
పంట
పైరులో
పిచ్చి
గడ్డియైన
తుంగ,
గరిక
మొలిచి
పంటను
పైకి
రానీయక
చేసినట్లు,
సహజ
శక్తియైన
ధర్మమను
పంటలో
కల్పిత
ధర్మములను
పనికిమాలిన
గడ్డిపోచలు
పెరిగి
నిజధర్మమును
అణగద్రొక్కి
అదృశ్యము
చేయుటచే,
పిచ్చిగడ్డిని
పెరికి
అచ్చపు
పంటను
పైన
పెరుగునట్లు
చేయుటయే
‘ధర్మ
రక్షణ’
అనిపించుకొనును.
ఈ
కలిలో
ధర్మము
మాటలలో
నిలిచినది
కాని
ఆచరణలో
అదృశ్యమయినది.
ధర్మము
ఆచరణ
యోగ్యమే
కాని
మాటల
మ్యాజిక్
కాదు;
అని
బాగా
తెలుసుకొనవలెను.
పలుకవలసినది
సత్యము,
ఆచరించవలసినది
ధర్మము.
5
▾
Meaning
Keep
“సత్యం
వద”
“ధర్మం
చర”
అని
మన
భారత
సంస్కృతిని
అనాది
కాలము
నుండీ,
ఉపనిషత్తులు
గొంతెత్తి
గోలపెట్టుచునే
యున్నవి.
ఇట్టి
పవిత్ర
పదముల
సారమును
నేడు
మరచి
ధర్మమును
చెప్పుటలో
ప్రవేశ
పెట్టిరి.
ఇదే
ధర్మగ్లానికి
మొదటి
సోపానము.
చేయవలసినది
మాని
చెప్పుటకు
దిగినది;
దీనినే
అధర్మమని
కూడనూ
అనవచ్చును.
ఆచరణలో
లేనిదానికి
అంత
బలము
ఉండదు.
మొసలికి
నీటిలో
బలముండునట్లు
ధర్మములకు
ఆచరణయందే
బలము
కానీ
చెప్పుట
యందు
వాటికి
తగిన
బలము
ఉండదు.
సత్యమునకు
చెప్పుట
యందే
బలము
కానీ
ఆచరించుటలో
అంత
బలము
ఉండదు.
బలమనగా
ఇక్కడ
రెండు
విధములైన
బలములు
కలవు;
పశు
బలము,
ధర్మ
బలము.
మానవునకు
ధర్మబలము
బలము
కాని,
పశుబలము,
బలమనిపించుకొనదు.
భీముడున్నాడు;
అతని
బలము
కేవలము
దేహబలము
మాత్రమే.
అందువలన
అతని
బలము
పశుబలమనే
భావించవలెను.
ప్రక్కన
ధర్మజుడుండుటచే
అతని
బలము
ధర్మబలమైనది.
ధర్మజుడు
ప్రక్కన
ఉన్నంత
వరకూ
భీముని
బలము
ధర్మబలమే
కాని
పశుబలము
కాదు.
ధర్మ
బలము
వలననే
పాండవులు
రక్షింపబడిరి.
కాని
కేవలము
పశు
బలమే
ఉండియుండిన
పాండవులు
ప్రారంభములోనే
పరాభవమొంది
యుండెడివారు.
ధర్మజుడు
లేని
పాండవుల
గతి
యెన్ని
బలములుండీ
ఏమాయెడిదో
యోచింపుడు!
కౌరవులకు
సర్వబలములుండెనే
నశించుటకు
కారణమేమి?
ధర్మ
బలము
లేదు.
కనుకనే
వారి
సర్వబలములూ
పశుబలములై
పోయెను.
ఏనాడు
ధర్మబలమను
ధర్మజుడూ,
భీముడూ
అడవులపాలై
పోయిరో
ఆనాడే
కౌరవ
రాజ్యములో
అధర్మము
ప్రవేశించెను.
కనుక
ఇప్పుడు
అడవులనందున్న
ధర్మబలాలను
గ్రామాదులందు
జేర్చవలెను.
అప్పుడే
లోకము
సుభిక్షమై
శాంతి
సంపదలభివృద్ధి
చెందగలవు.
అధర్మ
పరిపాలన
బారి
నుండి
తప్పించుకొని
ధర్మ
పరిపాలనలో
మనము
ప్రవేశము
కావలెను.
పంట
పైరును
రక్షించుటకే
కలుపును
తీసివేయ
ప్రయత్నము
అవసరము
కాని,
పనికి
రాని
గడ్డి
పైరులు
మొలిపించుటకు
ఏ
ప్రయత్నమూ
అక్కరలేదు.
అటులనే
ఇప్పుడు
పంట
పైరైన
సహజ
ధర్మమును
ఆచరణలోనికి
తెప్పించుటకే,
సర్వ
ప్రయత్నములూ
కావలెను.
6
▾
Meaning
Keep
ధర్మాచరణ
అభివృద్ధి
అయిన
అధర్మము
తనంతటతానే
నశించును.
దానికి
ప్రత్యేకించి
ప్రయత్నము
అవసరములేదు.
కనుక
ఇప్పుడు,
ధర్మాచరణను
స్థాపించుటే
ధర్మస్థాపన.
సూర్యుడస్తమించినాడన్న
ఎంత
అర్థమో,
ధర్మము
నశించినదన్ననూ
అంతే
అర్థము.
సూర్యునకు
అస్తమించుటనునది
లేదు.
కనిపించనంత
మాత్రాన
అస్తమించెనని
తలంతురు.
ధర్మము
కూడనూ
అట్టిదే.
కనుపించనంత
మాత్రమున
నశించినదని
తలంతురు
కానీ,
అది
నశించునది
కాదు.
నశించునది
సత్యమెట్లగును?
ధర్మము
సత్యముతో
చేరినది
కనుక
అది
నశించునది
కాదు.
అట్టి
సత్యమైన
ధర్మము
మరుగునపడి,
కనుపించ
అదృశ్యమైన
దానిని
దృశ్యమునకు
తెప్పించుటే
ధర్మస్థాపన.
ఇప్పుడు
కృష్ణపరమాత్మ
చేయుచున్న
పనియూ
అదియే!
అర్జునుని
నిమిత్తమాత్రముగా
ఉంచుకొని
అదృశ్యమైన
అనాది
ధర్మకర్మలను
ఆచరణలలోనికి
తెప్పించుచున్నాడు!
దీనినే
“ధర్మోద్ధరణ”
అని
అందురు.
లేని
దానిని
ఉద్ధరించలేదు.
ఉన్నదానినే
ఉద్ధరించుచున్నాడు.
ఇది
సామాన్యులచేత
అయ్యేటటువంటి
పని
కాదు.
కనుక
సర్వాధారుడైన
సర్వేశ్వరుడే
కంకణముకట్టి
సర్వశక్తిమయుడయిన
అర్జునుని
చేతి
యందుంచుకొని
అతని
ద్వారా
లోకమునకు
బోధించుచున్నాడు.
అర్జునుడు
సామాన్యుడైన,
ఈ
పవిత్ర
ధర్మమును
దేశమునకు
అంత
సులభముగా
అందించలేడు.
కనుక
అర్జునుడు
సామాన్యుడు
కాడని
తలంచవలెను.
అతను
అంతర్
బాహ్య
శత్రువులను
కూడా
జయించినాడు.
అట్టి
దైవ
శక్తి
కలవాడే
ఈ
శక్తివంతమైన
ధర్మమును
ఆచరణలో
సాధించగలడే
కాని
శక్తిహీనులకు
బోధించి
ప్రయోజనముండదు.
కృష్ణపరమాత్మ
తలంచే,
చక్కని
చుక్కను
నిర్ణయించుకొన్నాడు.
అర్జునుని
ప్రజాప్రతినిధిగా
ఎన్నుకొన్నాడు.
భగవంతునికి
అర్జునునిపై
అంత
కృపా
ప్రసారము
ప్రవహించినదన్న
అతను
సామాన్యుడు
కాదని
భావించక
తప్పదు.
7
▾
Meaning
Keep
ఒకానొకప్పుడు
కృష్ణపరమాత్మ
అర్జునునితో
సరదాగా
మాట్లాడుతూ,
(ఈ
యోగములో
సూచించిన
దయారసమును
పాఠకులు
చవి
చూడుడు)
“బావా!
నీవు
నాకు
పరమ
భక్తుడవు;
అంతియే
కాదు,
ప్రాణమిత్రుడవు.
నీబోటి
మిత్రుడు
నాకు
మరొకడు
లేడు;
అందువలననే
ఈ
పవిత్రమైన
ఉత్తమ
రహస్యమును
నీకు
బోధించితిని”
అని
అన్నాడు.
దీని
అంతరార్థమెంత
గాఢమయినదో
యోచించుడు.
లోకమున
ఎందరో
భక్తులమని
వారికి
వారు
బిరుదులు
కల్పించుకొనుచున్నారు.
కాని,
“నీవు
భక్తుడవు”
అని
భగవంతుడు
ఎవ్వరికీ
బిరుదు
ఇవ్వలేదు.
భగవంతుని
హృదయము
నుండి
“నీవు
నా
భక్తుడవు”
అను
బిరుదును
పొందినవాడు
భక్తుడు
కాని;
భగవంతుని
హృదయమును
కరగింపలేనివారు
ఎంత
భక్తులమనుకొన్ననూ
అది
వారి
అల్ప
తృప్తే
కానీ
ఆత్మ
తృప్తి
కాదు.
“నీవు
నా
భక్తుడ”వని
బిరుదును
సాధించినది
ఒక్క
అర్జునుడు
మాత్రమే.
అర్జునుడు
ఎంతటి
పవిత్ర
హృదయముతో
భగవత్
అనుగ్రహమునకు
ఎంతటి
అర్హుడో
దీనితో
తెలుసుకొనవచ్చును.
“భక్తులము,
భక్తులమ”ని
ఊరికే
చెప్పుకొను
జొల్లుమాటలు,
జల్లుమాటలూ
గాలిలోని
మూటలే.
వారికి
తిరుగు
అంగీకారము
ఉండిన
గదా
భక్తులనుటకు
గుర్తు?
భక్తి
వలన
అవిధేయత
దూరమగును.
అంత
మాత్రమున
కాదు.
అందుకనే
మిత్రుడవని
కూడా
కృష్ణపరమాత్మ
ఉపయోగపెట్టినాడు.
మిత్రత్వము
వలన
భయము
ఉండదు.
ఇవి
ఒకదానికొకటి
లేకపోయిన
ఉత్తమ
విద్యకు
అధికారికాలేదు.
కనుకనే
భక్తి,
మైత్రి
రెండూ
అన్యోన్యముగా
ఉండిన
అనుగ్రహమునకు
అధికారి
కాగలడు.
8
▾
Meaning
Keep
ఇక
విషయమునకు
దిగుదుము.
కృష్ణపరమాత్మ
వాక్యమును
పట్టిచూడ
అర్జునునకు
తలమోయలేనంతటి
సంశయము
ప్రారంభమాయెను.
తనను
అనేక
విధముల
పీడించ
మొదలిడెను.
అర్జునునకే
కాదు
ఎట్టి
మానవునకైననూ
ఇట్టి
సంశయములు
హృదయమున
ఉద్భవించక
తప్పదు.
అందులోనూ
అర్థము
కాని
ఆధ్యాత్మిక
విషయములందు
భగవత్
తత్త్వమునందు
అంతరార్థము
ఒకటి,
బాహ్యార్థము
మరొకటిగా
నుండుటచే,
సామాన్యులు
బాహ్యార్థమునే
ప్రధానముగా
పాటింతురు.
దీనికి
అనుభవమైననూ
ఉండవలెను,
లేక
అనుగ్రహబలమైననూ
ఉండవలెను.
కానీ,
రెండు
లేనివారలకు
ఇవి
మరింత
తికమకలు
కలిగించును.
సంశయము
సామాన్యమైనది
కాదు.
“కంటిలోని
నలుసు,
చెవిలోని
జోరీగ,
చెప్పులోని
రాయి,
కాలిలోని
ముల్లు
ఏ
విధముగ
శాంతి
లేకుండా
చేయునో
అటులనే
ఒంటిలోని
సంశయము
ఇంటిలోని
పోరువలె
హింసించును.”
ఇట్టి
సంశయము
ప్రజా
ప్రతినిధిగా
నిలిచిన
అర్జునునకు
కలుగుటలో
అది
ప్రజల
సంశయమనే
భావించవలెను.
దీనిని
మానవాతీతమైన
మాధవుడే
తీర్చగలడు
కాని
మానవ
మాత్రులకు
సాధ్యము
కాదు.
అందుకనే
పరమాత్ముడైన
కృష్ణుడు
సిద్ధముగా
వద్దనే
యున్నాడు,
సంశయము
తీర్చి
సంతోష
పెట్టుటకు.
అసలు
సంశయమేమన
——
9
▾
Meaning
Keep
ద్వాపర
యుగాంతములో
మొన్న
మొన్న
పుట్టినవాడు
కృష్ణుడు.
సూర్యుడునూ,
మనువునూ
ప్రాచీనకాలము
వారలు.
వీరికి,
యుగాంతంలో
పుట్టిన
కృష్ణునికీ
ఎట్టి
పొందికా
చేరదే!
వీరిరువురికీ
ఏమి
సంబంధము?
దేహసంబంధమను
కొందామా!
వారు
అనేక
తరముల
క్రిందటి
వారు.
కృష్ణుడు
నేటి
వాడు.
అది
ఏ
మాత్రమూ
చెల్లదు.
ఈ
యోగము
కృష్ణుడు
సూర్యునకెట్లు
బోధించెను?
అర్ధము
కాని
నమ్మకములేని
మాటలను,
విని
ఊరకుండుట
అవివేకి
లక్షణము
కదా!
అని
అర్జునుని
బాధ.
నిమిష
నిమిషమునకు
విషమ
పరిస్థితికి
జారుచుండెను.
దానిని
సర్వవ్యాపియైన
పరమేశ్వరుడు
కనిపెట్టే
“బావా!
ఏమి
నీలో
ఏదో
బాధ
కలిగినట్లున్నదే!
తెలుపుము”
అని
వీపు
నిమురుతూ
చిరునవ్వులతో
చీవాట్లు
పెట్టెను.
10
▾
Meaning
Keep
సమయము
చిక్కినది
కదా
అని
అర్జునుడు
“మాధవా!
నీ
మాటలు
నాకు
ఏమియూ
బోధపడుటలేదు.
అంతటితో
మానక
నన్ను
విపరీత
భావములలో
ముంచి
నీపైనున్న
కాస్త
విశ్వాసమును
కూడా
కోల్పోవునట్లు
చేయుచున్నవి.
కాన
నా
సంశయమును
ప్రేమతో
మన్నించి
తీర్చవలెను.
లేకున్న
నే
నిలువజాలను”
అని
చేతులు
రెండూ
పట్టుకొని
ప్రార్థించినాడు.
11
▾
Meaning
Keep
గోపాలుడు
సంతసమున
సంశయమును
తెలువుమనెను.
అప్పుడు
అర్జునుడు
“కృష్ణా!
నీవు
పూర్వము
ఈ
యోగమును
సూర్యునకు
ఉపదేశించినట్లును,
తదుపరి
సూర్యుడు
మనువునకు
బోధించినట్లునూ
తెలిపితివి.
సూర్యుడూ,
మనువూ
ఏ
కాలము
వారలు!
నీవే
కాలమువాడవు?
పోనీ,
ఏ
కాలమైననూ
సరే!
ఈ
దేహముతోనే
ఉపదేశించితివా?
లేక
మరొక
దేహముతో
ఉపదేశించితివా?
ఈ
దేహముతోనే
ఉపదేశించితినని
అందువా!
అదీ
నమ్మ
వీలుకాదు.
ఈ
దేహము
నాతో
పాటు
ఇంచుమించు
మూడు
నాలుగు
సంవత్సరములు
పెద్దవాడివే
కాని
అంతకంటే
ముందు
వాడవు
కాదు!
నాకు
తెలియక
ఎప్పుడు
ఉపదేశించితివి?
సూర్యుడు
చూతమా
నీకంటే
ఎన్నో
వేల
రెట్లు
పెద్దవాడు!
ఆది
కాలము
వాడు!
ఊహించుటకు
కూడనూ
వీలుకానిది.
బావా!
నేనే
కాదు.
ఈ
విషయమును
ఎంతటి
తెలివితేటలుగల
వాడైననూ
నమ్మడు.
పోనీ,
ఈ
దేహమే
కాదు!
ఈ
యుగమే
కాదు!
వేరొక
యుగమూ,
వేరొక
దేహమని
అందువా?
అది
మరింత
అతుకని
మాట.
ఏ
జన్మముననో
చేసిన
కర్మలు
ఈ
జన్మమున
ఎట్లు
జ్ఞాపకముందును?
కాని
ఉండునని
నీవు
ఒప్పుకున్నా
నీవలె
నాకునూ
గడచిన
జన్మల
కర్మలు
జ్ఞాపకముండవలెను
కదా!
ఏదో
దివ్య
పురుషులకు
మాత్రమే
జన్మాంతర
విషయము
జ్ఞాపకమందుండునని
శాస్త్రములు
తెలిపినవి.
కానీ,
సామాన్యులందరికీ
ఉండ
వీలులేదు
కదా?
పోనీ,
నీవు
దివ్య
పురుషుడవని
నమ్మిననూ,
సూర్యుడూ
స్వయంగా
దివ్య
పురుషుడే!
ఇద్దరూ
సమానమేనా?
అదియునూ
సరియని
ఒప్పుకున్నా,
సరిసమానమైన
వార్లే
కాని,
ఒకరికొకరు
ఉపదేశించుకొనుట
జరుగదే!
నీవు
ఉపదేశించితివన్న
నీవు
గురువు,
సూర్యుడు
శిష్యుడూ
కావలెను
గదా?
అప్పుడు
నీవు
సూర్యునికంటే
గొప్పవాడుగా
ఉండవలెను
కదా!
ఉండనీ!
గొప్పవాడవే,
భగవంతుడవే
అని
విశ్వసించిన
మరింత
సంశయమునకు
చోటు
ఏర్పడును
కదా?
నీవు
భగవంతుడవే
అయిన
సామాన్య
మానవులవలె
కర్మ
పరతంత్రుడవై
జనన
మరణాది
క్లేశములకు
కట్టుపడుటెందులకు?
నీవు
ఐదడుగుల
దేహముతో
మానవాకారుడుగా
సంచరించుట
నీ
‘నిరాకార
సర్వ
వ్యాపకత్వము’నకు
భంగము
కాదా?”
12
▾
Meaning
Keep
“అంతటి
అనంత
స్థానమైన
సర్వవ్యాపకత్వము
నుండి
అల్పస్థానమునకు
జారుటకు
కారణమేమి?
ఏమో!
కృష్ణా!
ఎన్ని
విధముల
తర్కించిననూ
నాకేమీ
బోధపడుటలేదు!
నీ
మాటలు
నీకే
సరి;
నా
తల
తిరుగుచున్నది.
ఏదో
సరియైన
సమాధానము
చెప్పి
నన్ను
అనుగ్రహించుము”
అని
ప్రార్థించెను.
13
▾
Meaning
Keep
అప్పుడు
మువ్వ
గోపాలుడు
ముసి
ముసి
నవ్వులు
నవ్వుచూ
కాచిన
కాలము
సమీపించినదని
సంతసించి,
“బావా!
విను.
లోకులు
సూర్యోదయము,
సూర్యాస్తమయమని
అనుటలో
అర్థమేమి?
అది
కేవలము
లోకుల
దృష్టియందే
కాని
సూర్యుని
దృష్టియందు
కాదు.
సూర్యుడు
ఉదయించుటా
లేదు,
అస్తమించుటా
లేదు.
అవునా
కాదా?
నేనునూ
అంతే.
నాకు
జన్మమే
లేదు.
సామాన్య
మానవుల
దృష్టికి
నేను
అనేక
కాయములను
ధరించి
అనేక
జన్మలనెత్తితినని
తలంతురు.
లోకోద్ధరణమునకు
అవసరమొచ్చినపుడంతా
ఒక
కాయము
ధరించి
లోకమునకు
రూప
నామములతో
గోచరించిననూ,
ఎన్ని
జన్మల
విషయమైననూ
నాకు
జ్ఞాపకమందుండును.
నేను
సర్వజ్ఞుడను,
సర్వశక్తుడను.
నాకే
కాదు,
నీకు
కూడనూ
అంతా
తెలియును.
అయితే
నీ
జ్ఞానశక్తి
అజ్ఞానముచే
ఆవరించుట
వలన
నీకు
తెలియజాలకున్నది.
నేను
జ్ఞానమయుడను
కనుక
నాకు
సర్వ
వేళలయందునూ
స్పష్టముగా
తెలియుచుండును.
బావా!
సూర్యుడు
అద్దములో
అగుపించినంత
మాత్రమున
స్థానభంగురము
కాని,
అధికార
భంగురము
కానీ
ఏర్పడునా?
ఉన్నవాడు
ఉన్నట్లే
ఉండి
అద్దమందు
ప్రతిబింబించుచున్నాడు.
అటులనే
నేను
కూడను
ప్రకృతి
అను
అద్దమందు
ప్రతిబింబించుచున్నంత
మాత్రమున
నా
సర్వజ్ఞత్వమునకు,
సర్వశక్తికీ
భంగము
రాదు;
లేదు.
నేను
జన్మరహితుడను.
మానవ
జన్మమునకు
మునుపు
చేసిన
పుణ్య
పాపకర్మలు
కారణములగును.
అయితే,
అవతార
జన్మలకు
కూడనూ
అవే
కారణమని
తలంతువేమో?
కాదు,
కాదు.
మానవ
జన్మ
‘కర్మ
జన్మ’;
నా
జన్మ,
‘లీలా
జన్మ’.
ప్రార్థనలు,
సాధుకృత్యములే
నా
జన్మకు
కారణము,
దుష్టుల
దుష్కర్మలు,
సజ్జనుల
యొక్క
సత్కర్మలే
నా
జన్మకు
కారణము.”
Previous
←
Whoever One May Be, One Cannot Escape Doing Karma
Next
The Dharma of the (Śrī Kṛṣṇa) Avatāra
→