Passage 12
Passages 1–24
నేడు, లోకమున గీతా ప్రచారకులు అధికమయి, పరమాత్ముని పవిత్ర పదములకు అర్థములు కల్పించి, సత్యార్థమును మరుగుపరచుచున్నారు. ఆయా ప్రచారకుల ప్రబోధనల ననుసరించి సమర్పించుకొనుచు ఎవరికీ తోచినట్లు వారు చిలుక పలుకులు పలుకుచున్నారే కాని, ఆచరణయందు అనుమాత్రమైన ప్రవేశింపక గొప్ప, గీతా ప్రచారకులను బిరుదులను తలభారముగా మోయుచున్నారు. ఇట్లు వారికి వారు కీడు చేసుకొనుటే కాక లోకమునకు కూడా అవిశ్వాసమును కలిగించుచున్నారు.
పరమాత్ముని పలుకులు ప్రతి ఒక్కటియును ఆచరణ రూపమైనవే కాని కేవలము ప్రచారరూపమైనవి కావు. నేడు, కలిమహాత్మ్యమో అన్నట్లు, దానికి విరుద్ధమైన మార్గమును లోకమునకు రుద్దుచున్నారు. పోనీ, వినువారలందైనా ఆ వివేకమున్నదా అని విచారించిన అది జీరోనే. సరే, చెప్పువారేమాత్రము ఈ గీతార్థమును అనుభవరూపమున ఆనందించుచున్నారా అని ఒక్కరైనా విచారించకున్నారు. వినువారును ఆచరించకున్నారు. వారు చెప్పే భావకూ, లోకము నడచు పోకడలకూ విరగబడుచున్నారే కాని గీత యొక్క భావాన్ని, చెప్పువారి ప్రవర్తనకు కొటికొక్కడైననూ కోరుతున్నారు.
ఒక్కొక్కరు చెప్పుచుండరు, గీత నాకు పూర్తి కంఠస్థము వచ్చునని, ఏ అధ్యాయమున ఏ శ్లోకమడిగిననూ, టక్కని చెప్పునంతటి అనుభవము కలదని! దీనిని విన్న, ఇట్టి పాండిత్యము చూచిన, నాకు నవ్వు వచ్చును. అనుభవమున అనుమాత్రము లేక అంతయూ కంఠస్థము వచ్చినగా కంఠమునకు బాధ తప్ప, మరేమి ఫలితముండదు. అందుచే “గ్రాంఫోన్ ప్లేటు” వలె వీరా ఒక ప్లేటుని చెప్పవచ్చును. ప్లేటు కెంతఫలమో, కంఠస్థము చేసినవారికి అంతే ఫలం. ఇన్ని శ్లోకములు కంఠస్థము రాకపోయిననూ, ఒక్క శ్లోకమును ఆచరణలో ఉంచిన అట్టివారు ధన్యులు.
అర్జునుడు కృష్ణపరమాత్మ చెప్పిన ప్రతి పదమును అనుభవమున నిరూపించినాడు. అందుకే కృష్ణుని అనుగ్రహమునకు పాత్రుడైనాడు.
ఈనాడు మహా పండితుడను వారు కూడనూ ఒక పదము నైననూ ఆచరణయందు అనుభవించుచున్నారా. ఇక పామరుల సంగతి ఎందులకు? ఒక్క మాటలో చెప్పవలెనన్న, నేడు గొప్ప గొప్ప పేరు ప్రతిష్ఠాతలు కలిగించుకొని ఎవరు మహా గీతోపన్యాసకులని తిరుగుచున్నారో, అట్టివారు కూడనూ గీతకు విరుద్ధముగా ప్రవర్తించుచున్నారు. భగవద్గీతకు గీతలు గీయుచు, ఎవరికివారు వారి బుద్ధికుశలతను, విద్యాకుశలతను ప్రదర్శించుచూ వారివారి భావగీతాలను, భగవద్గీతకు అంటించుచున్నారు. మచ్చునకు ఒకటి వినుడు.
గీత 6వ అధ్యాయమున 10వ శ్లోకమున పరిగ్రహము మహాపాపమని తెలిపినది. నిజముగా గీతను ప్రమాణముగా విశ్వసించినవారు దానిని ఆచరించవలెను కదా! లేదు. ఈనాడు గీతా ప్రచారకులలో నూటికి తొంభైతోమ్మిది మంది పరిగ్రహించుచున్నారు. పరిగ్రహము ఏ రూపమున కాని అంగీకరించరాదు; పరిగ్రహమునకు హద్దులేదు. గీతా యజ్ఞమనీ, హారతి దక్షిణ అని, ప్రచార సంఘములయొక్క ఖర్చులనీ, గురు కానుకలనీ, ఎన్నో పేర్లు! ఇది కృష్ణుడు చెప్పలేదే! టికెట్లు తీసుకొని డ్రామా సినిమాలకు వెళ్లినట్లు నేడు గీతా ఉపన్యాసములు ఇచ్చి, దక్షిణ అను పేరుతో ఉపన్యాసములు అమ్ముచున్నారు.
ఇట్టి వారికి నిజముగా కృష్ణుని పవిత్ర వాక్యాలపై విశ్వాసముండిన, విరుద్ధముగా ఎందుకు నడుతురు? ఇది దోషమని తెలిసియుండినవారే ఎందుకు చేతురు? బహుశా, కలిలో చెప్పేవారలకు దోషముండదేమో! ఇట్టి ఆచరణ రూపము లేని ప్రచారములు ద్వారా నిదానముగా ప్రమోదము తెప్పించి, కడకు అవిశ్వాసమునకు గురిచేతురు. కేవలము ఆడంబర ప్రచారముగా రూపుదాల్చుచున్నది, నేటి గీతా ప్రచారము.
గీతా గ్రంథమునకిచ్చు గౌరవము విషయమున కీవకున్నారు. గీత, రామాయణ, భాగవత, భారత ఇత్యాది పవిత్ర గ్రంథరాజములను చూచిన తడవుగ, కన్నుల కద్దుకొని, తలపై నిడుకొని, పూజా గదులందు పీఠములపై నిడి పుష్పాక్షింతలు వేసి, కన్నులు మూసి, కొన్ని తీధారులు కాళ్ళ నమస్కరించువారలు వేలకు వేలు కలరు. కాని, వారు ఇచ్చు గౌరవము, వారు చేయు పూజ, అర్పించు వందనములు కేవలము కాగితములకే కాని, అందులోని భావములకు కాదు.
తలపై నుంచుకొనవలసినది గ్రంథము కాదు. అందులోని భావమును; చేయవలసినది గ్రంథమునకు కాదు పూజ, విషయమునకు; పీఠములపైన పెట్టుట కాదు, హృదయ పీఠమున ప్రతిష్ఠించవలెను. అట్లు చేసిననే గీత యొక్క సత్యము నిత్యమై, నిర్మలమై నిలుచును.
గీతా ప్రచారకులు కాని, గీతా పారాయణులు గాని విషయమునకు హృదయమున స్థానమిచ్చి, ఆచరణలయందు దానిని అందుకొని ఆనందమును పొందవలెనే గాని శ్లోకములు కంఠస్థము చేసిన కాని, గ్రంథమును పూజగదులందు పీఠములపై నుంచి పూజించుట వలన గాని, వాటిని కన్నులకద్దుకొని శిరస్సున దాల్చుట వలన గాని మనలోని మాలిన్యము మాయము కాదు. అట్టి కర్మలు మూర్ఖులు పైపై మాత్రమే కాని, మాలిన్యము పోదు.
పంచ భక్ష్య పరమాన్నములు పాత్రలో ఉంచి వాటిని కన్నుల కద్దుకొనినంత మాత్రమున, తలపై నిడుకొనినంత మాత్రమున కడుపు నిండదు కదా! ఇదియూ నట్టిదే. గీతా గ్రంథము భక్తి, జ్ఞాన, కర్మ, వైరాగ్యములను మధురామృతములను నింపుకొన్నది. దానిని తీసుకొని ఎవరు త్రాగుదురో వారే ధన్యులు. వారే నిజముగ గీతాపానము చేసినవారు. ఆకలికొన్న వానికి ప్రపంచమున పండిన ధాన్యమంతయూ చిక్కనక్కరలేదు; పట్టెడు అన్నము చిక్కిన చాలును. దప్పిగొన్నవానికి గోదావరి, కృష్ణానదులు పూర్తిగా అవసరము లేదు; గుక్కెడు నీరు చిక్కిన చాలును.
అటులనే భగవదనుగ్రహమునకు అను ఆకలికొన్న వాడు గీతా ప్రవాహమును పూర్తిగా త్రాగనక్కరలేదు. ఒక్క శ్లోకమును ఆచరణలో ఉంచిన చాలును. అగ్నిపెట్టియందు అనేక పుల్లలుండును. మనకు అగ్ని కావలెనన్న, ఒక పుల్లను అంటించిన కావలసినంత అగ్నిని అభివృద్ధి చేసుకొనవచ్చును కదా! అన్ని పుల్లు గీసనక్కరలేదు. అటులనే, గీత అను పెట్టెలో ఏడువందల శ్లోకములను జ్ఞానాగ్ని పుల్లలున్నవి. ఇందులో ఒక శ్లోకమను పుల్లను అనుభవమున గీసిన చాలును.
గీతను ఈ విధముగా పవిత్ర వినియోగము చేయవలెను గాని దుర్వినియోగము చేయుట మహాదోషమగును. ఆచరణలేక పేరు ప్రతిష్ఠాతలు కొరకు గౌరవ మర్యాదలు కొరకు, ఆడంబరమును ప్రవేశ పెట్టిన, అది స్వార్థమే కాక భగవద్ద్రోహమగును. గ్రంథము నుండి గంధమును విషయమును తీయవలెను. పుస్తకమును కూడా మస్తకముగా మార్చవలెను, గాని మస్తకమును పుస్తకముగా మార్చరాదు.
రాళ్ళయందూ దేవుని చూడవలెను గాని దేవుళ్ళను రాళ్ళుగా చేయరాదు, చూడరాదు. అదే మన భారతీయులకు భగవంతుడందించిన మహాభాగ్యము. సముద్రమున పైపై అలల్లో వెలికిన ముత్యములు చిక్కవు. సముద్ర మధ్య భాగములో స్వాతివాన పడిన సమయంలో సముద్ర గర్భమున చేరి వెలికిన చిక్కును. ఇట్టి భగవదన్వేషణ సలుపువారే మన భారతీయులు.
ధర్మాచరణే దేవముగాను, దైవదర్శనమే హృదయముగాను తలంచి, చరించి, తరించువారు మన భారతీయులు పైపై పూతలకు, బాహ్యాడంబరములకు, భౌతిక అభివృద్ధులకూ బానిసలు కాదు. అంతర్ దృష్టితో ఆత్మాన్వేషణ సలుపునట్టి నిగూఢ హృదయులు. అట్టి పవిత్ర స్థితిగతులు కలిగిన భారతీయులు నేడు భౌతిక అభివృద్ధులకు ప్రాకులాడుట పైపై పూతలు పూయుట శోచనీయము. ధనార్జనకై గీతా ప్రబోధ చేయువారలకు దైవము దూరమే. సమర్పించుకొనుటకు అట్టి వారు అనేక కష్టాలు కల్పింతురు. వివిధ పాఠాలు వేయుదురు. కాని నిజమైన గీతా విశ్వాసులు గాని, గీతా దాసులు గాని దీనిని అంగీకరించరు.
ధర్మముకొరకు గీత కాని ధనము కొరకు కాదు. కృష్ణమందిరాలనియు, రామ మందిరాలనియు ఎన్నో కొన్ని, పేర్లు పెట్టుకొని మందిర నిర్మాణమును పేరుతో, ఆశ్రమముల నిర్మాణమును పేరుతో, గీతా ప్రచార నిర్వహణ పేరుతో, ధనమును ప్రోగుచేయుట కూడా భగవత్ విశ్వాసము కోల్పోవుటకు ఒక మార్గము. సర్వ వ్యాపియైన పరమాత్మకు కేవలము మందిర నిర్మాణము హాస్యాస్పదము. భగవత్ ప్రతిష్ఠకు హృదయ మందిరము ప్రధాన స్థానము.
అట్టి మందిరమును నిర్మించుటకు ప్రయత్నించక, మానవ కల్పిత మందిరములు మాత్రమే నిర్మించిన స్థిరమా! నిత్యసత్యమైన పరమాత్మకు శాశ్వత మందిరమే సార్ధకము కాని శిథిలమగు మందిరములు కావు.
అయితే ఒక స్థితికి వచ్చినంతవరకూ బాహ్య నిర్మాణ మందిరములు అవసరమే కాని, అనాదిగా మందిరములు అనేకములున్నవి కదా! వాటిని భద్రపరచుకొని, సద్వినియోగము చేసుకొన్న చాలదా! నూతన మందిరములు కట్టడము, సనాతన మందిరములు కొట్టడమూ, గొప్పని చంపి చెప్పులు దానము చేసినట్లున్నది! ప్రత్యేకించి నూతన మందిరములు కట్టక, శిథిలమైన సనాతన మందిరములను పునరుద్ధరణ చేయుట యెంతోయో లోక క్షేమము. ఆనాటి శాస్త్రోక్తమైన ధర్మ ప్రతిష్ఠలు మహా పవిత్రములు. అట్టి ధర్మమందిరముల శక్తియే మన భారతదేశము నేడు ఈ మాత్రమైననూ క్షేమముగా ఉండుటకు మూల కారణము.
ఆనాటి మహానీయులైన మహా బుషులు మహా తపస్సు ఆచరించి, సర్వసంగ పరిత్యాగులై, దేవములు సహితము శిరసు చేసుకొని. లోక క్షేమమును, దానికి తగిన ఆచరణ యోగ్యమైన కొన్ని నియమములను, నియమించి మనకందించిరి. అందించిన వాటినైననూ నేడు అనుభవించక, వాటికి నానార్థములు కల్పించి, ఎవరికీ తగినట్లు వారు నూతన పద్ధతులను ప్రవేశపెట్టుటచే అసలు సత్యము అడుగున పడిపోయినది. అట్టి పవిత్ర సత్యమును పైకి తీయుటకు ప్రయత్నించక నేడు లోకమున పెద్దలను వారు, గురువులను వారు సనాతన పద్ధతులనే అంగీకరించి వాటినే పోషించుచున్నారన్న ఏమని చెప్పవలెను?
ఇక భారతదేశము ధర్మక్షేత్రము, యోగక్షేత్రము, త్యాగక్షేత్రము ఎట్లు కాగలదు? అందులకే కాబోలు, అన్నపూర్ణ స్వరూపమైన మన భారతావని, నేడు అన్నమో అని అలమటవలసి వచ్చినది! ఏ పర్వతములయందు, ఏ గుహలయందు, ఏ పవిత్ర నదీ తీరములయందు, ఏ పుణ్య క్షేత్రములయందు “శివోహం, శివోహం” అని వినబడుచుండేదో అట్టి స్థానములందు నేడు “శవోహం, శవోహం” అని వింటూ ఉన్నాము. ఒకటేమి, అన్నింటియందూ నేడు మనదేశము ఆనందరహితమై, అశాంతిమయమై, స్వార్థస్వరూపమై, ఆడంబర ప్రదర్శనములతో అలరారుచున్నది. కాన, నేడు ఆచరణ రూపమైన ప్రచారములు అత్యవసరము. ఇది పామరుని మొదలు పరమహంస అని పిలువబడువారు వరకు తెలుసుకొనవలసిన విషయము. గీతా విషయమున మరింత శ్రద్ధవహించి, స్వయముగా పరమాత్ముని పలుకులుగా విశ్వసించి ఆచరించవలెను.
పలికిన మాత్రమున ప్రయోజనము లేదు. “యోగ క్షేమం వహామ్యహం” అను భగవంతుని పవిత్ర ప్రతిజ్ఞకు దిక్కంకణమునకు మానవులు, సాధకులు, అర్హులు కావలెను. భగవానుడు భక్త రక్షణ, అనగా యోగక్షేమము చూచుకొనలేదన్న, దానికి పూర్వము పరమాత్ముడు చెప్పిన పద్ధతిని మనము ఆచరించుచున్నామా? లేదా? అని విచారించిన మన అపోహాలలోని నిజానిజాలు సులభముగా తేలును. సాధకులట్లు విచారించుట లేదు వారికి అవసరమైన దానిని మాత్రము తీసుకొని దానికి సంబంధించిన ముందూ వెనుకా విచారించకున్న అది అనర్థమగును.
“అనన్యాశ్చింతయంతోమాం, యేజనాః పర్యుపాసతే తేషాం నిత్యాభి యుక్తానాం,” అను ఈ మూడు అంగములను చేసుకొన్న, “యోగక్షేమం వహామ్యహం,” అను శిరస్సుకు విలువకాని కాళ్ళు, కడుపు, భుజము లేక ఒక తలను మాత్రమే గట్టిగ పట్టుకొన్న ప్రయోజనమేమి? ఇనుప పెట్టె దొంగలు తీసుకొని పోయిననూ పరవాలేదులే, తాళములు నా మూలలో ఉన్నవన్నట్లు యుండును. పెట్టెలోని వస్తువుల కొరకు కదా తాళములు అవసరము! వస్తువులు పోయిన తాళములు ఉండి ఉపయోగమేమి? అటులనే, అనన్య చింతన లేక, తన ఉపాసన జరపక, తననే శరణు పొందక, తన యోగక్షేమములు మాత్రము చూచుకొనలేదే అన్న ఎంత అజ్ఞానము! పరులను శరణు జొచ్చి, పరులను కొలుస్తూ అనన్య చింతనతో ఉండువాని యోగక్షేమము తానెట్లు చూచును? పోనీ, పరులయందు పరమాత్మ భావమునుంచి, సర్వకర్మలు భగవదర్పితమని అయిననూ తలంచిన, పరమాత్ముడు అనుగ్రహించును. ఆశ్రయించుట అన్యులను, ఫలితమాశించుట పరమాత్మను; ఇది అనన్య చింతన యెట్టగును? రాజు దగ్గర నౌకర్లు, ఆశ్రయించుట రాజును; అభిమానించుట సంసారమును. అభిమానము, ఆశ్రయము రెండునూ ఒక్కటి అయిన, అది శరణాగతమనబడును.
గీతా స్వరూపమునకు “అనన్యాశ్చింతయంతోమాం” అను శ్లోకము నాభివంటిది. భగవంతుని వాక్ పుష్పములను వ్యాసులవారు “గీత” అను హారముగా తయారు చేయుటలో ఈ శ్లోకమను హారమునకు అలంకారము నిచ్చు మధ్యకుచ్చుగా అమర్చినాడు. కాన గీతా రత్నహారమునకు ఈ శ్లోకము మధ్య మణులకుచ్చుగా అమరబడినది. అప్రమేయమైన ప్రాప్తిని అందించుటే యోగమనియు, అట్లు ప్రాప్తించిన దానిని సంరక్షించుకొనుటే క్షేమమనియు మరియొక అర్థము కూడను కలదు. ఇట్టి సంరక్షించుకొను సాధనలే అనన్య చింతనలు. అట్టి పరమాత్మ చింతనవలన మనస్సు యొక్క మాలిన్యము వీడును. అట్టి మాలిన్య రహితమైన మనస్సు కలిగియుండుటే భక్తునియొక్క లక్షణము. తన చూపులు తన ఆటలు, పాటలు, మాటలు అన్నియూ భగవత్ మయము అగుటయే భక్తుని చిహ్నములు, ఇట్టివారు “ప్రత్యేకించి యజ్ఞయాగాదులు కాని, దానధర్మాదులు కాని, క్షేత్రయాత్రలు కాని చేయలేకపోతిమే, అట్టి పవిత్ర కర్మలద్వారా పరమాత్ముని తృప్తి చేయలేకపోతిమే, పోనీ చేయుటకు శక్తి సామర్థ్యములైననూ పరమాత్ముడు ప్రసాదించలేదే!” అని విచారించనక్కరలేదు. పరమాత్ముడు ఇవి ఏనాడూ కోరలేదు. నిర్మల మనస్సు కలిగియుండి, ఏమి అందించిననూ తాను ఆనందముగా అందుకొనగలడు.
సత్పదార్థలను పదార్థములు, ఎంత పవిత్రమైన నైవేద్యానికిని, మనస్సనే పాత్ర మాలిన్యమై యుండిన, భగవచ్చింతన అను కళాయి పూయకుండిన సర్వ పదార్థములు విషమయమైపోవును. కాన, పాత్ర యొక్క పరిశుద్ధతే తాను ప్రధానముగా ఆశించును. అట్టి నిర్మల హృదయులు పరమాత్మకేమి అందించిరో పురాణ ఇతిహాసములలో చూడు; పిడికెడు అటుకులు కుచేలుడిచ్చెను. విదురుడు, ద్రౌపది ఏమి ఇచ్చిరి? చారెడు గంజి, బలుసు పత్రము. వీటి విలువెంత? లోకములో అర్ధపైసా అయిననూ చేయదు. అట్టివానికి పరమాత్ముడెంతటి ఫలితమును అందించెనో చూడు! పరమాత్ముని దృష్టి వస్తువుపై కాదు. భావశుద్ధిపై కాన భావమును పవిత్రముగా పాలించుడు.
1Today there are many who speak in the name of the Gītā, inventing meanings for Paramātma’s sacred words and obscuring their true import. Repeating one another’s interpretations like parrots, they enter hardly at all into Ācaraṇa, yet carry the title ‘Gītā preacher’ as a burden of prestige. In doing so they harm themselves and also sow disbelief in the world. 2Every word of Paramātma is meant for practice, not for mere publicity. Yet the opposite has become common: listeners rarely ask whether the speaker lives what he explains, and speakers themselves often do not taste the teaching in experience. Words move one way while life moves another. Very few demand that the interpreter’s conduct reflect the spirit of the Gītā. 3Some boast that the whole Gītā is committed to memory and that they can instantly recite any verse from any chapter. Such learning, without even a grain of lived experience, brings little more than strain to the throat. One may then resemble a gramophone record: it reproduces perfectly but does not realise. Blessed is the person who may not know hundreds of verses by heart but lives even one. 4Arjuna demonstrated in experience every word Kṛṣṇa Paramātma taught him. That is why he became fit for Kṛṣṇa’s Anugraha. 5If even those called great paṇḍitas do not embody a single teaching, what need is there to speak of the unlearned? Many celebrated Gītā lecturers act contrary to the text while displaying intellectual or scholarly cleverness, drawing their own lines across Bhagavad Gītā and attaching their personal songs of interpretation to it. Consider one example. 6The sixth chapter, tenth verse, warns that parigraha is a great fault. If one truly accepts the Gītā as pramāṇa, should one not live accordingly? Yet today, the text says, ninety-nine out of a hundred Gītā propagators accept parigraha. Acceptance is merely renamed: Gītā-yajña, ārati-dakṣiṇā, organisational expenses, guru-gifts, and many other labels. Kṛṣṇa did not teach this. As people buy tickets to dramas and cinemas, discourses on the Gītā are being sold under the name of dakṣiṇā. 7If such people truly have faith in Kṛṣṇa’s sacred words, why act against them while knowing the contradiction? Perhaps, the text says with deliberate sarcasm, there is no fault for the one who merely speaks in Kali Yuga! Propagation without Ācaraṇa slowly creates excitement and then gives rise to disbelief. The Gītā becomes outward display instead of lived transformation. 8The same problem appears in the honour shown to sacred books. Thousands press the Gītā, Rāmāyaṇa, Bhāgavata, or Mahābhārata to their eyes, place them upon the head, install them on a shrine, offer flowers, and bow. But often the reverence is offered to paper while the bhāva within the words is left untouched. 9It is not the physical book that must be enthroned on the head, but its bhāva in understanding. The worship belongs to the truth it teaches; the real pedestal is the heart. Only then does the truth of the Gītā remain living, pure, and enduring. 10Whether one is a Gītā preacher or a reciter, the teaching must be given a place in the heart and enjoyed through Ācaraṇa. Memorising ślokas, placing a book on a shrine, touching it to the eyes, or carrying it on the head does not by itself remove inner impurity. Without inward application these remain surface acts. 11A plate of delicious food does not fill the stomach because one touches it reverently to the eyes or places it on the head. One must eat. The Gītā is filled with the nectar of Bhakti, Jñāna, Karma, and Vairāgya; blessed are those who actually drink it. A hungry person does not need all the grain in the world—one handful of food is enough. A thirsty person does not need the entire Godāvarī or Kṛṣṇa River—a mouthful of water can quench thirst. 12So too, one who hungers for Bhagavān’s Anugraha need not swallow the entire stream of the Gītā at once. To put even one śloka into practice can be enough. A matchbox contains many sticks, but one lit match can kindle a great fire. The Gītā is a box of seven hundred sticks of Jñānāgni; strike even one against the surface of experience. 13This is the sacred use of the Gītā. To exploit it for name, prestige, honour, or display while neglecting Ācaraṇa is not only selfish but a betrayal of the teaching. Draw out the fragrance and meaning from the book. Let the book become living understanding in the head and heart; do not turn the head into a mere book-storage room. 14See God even in a stone; do not reduce God to a stone. This inward search is the great inheritance given to India. Pearls are not found by skimming surface waves; the diver enters the depths. The spiritual search too must go beneath surface appearance. 15Indian spiritual culture, at its best, regards the practice of Dharma as sacred and seeks divine vision inwardly, rather than becoming enslaved to appearance and material display. It is therefore painful when the inward search is abandoned for show or when Gītā teaching becomes a means of earning money. A genuine servant of the Gītā does not accept such distortion. 16The Gītā is for Dharma, not for wealth. Raising money under the names of Kṛṣṇa temples, Rāma temples, āśrams, or Gītā-propagation can itself weaken faith if the inner purpose is lost. Paramātma is Sarva-vyāpī; His most important temple is the human heart. 17If that inner temple is neglected while only man-made structures are raised, what permanence is gained? The eternal Paramātma deserves the enduring temple of a purified heart, not merely buildings that will one day decay. 18External temples have their place until a certain stage is reached, but countless ancient temples already exist. Why not preserve them and put them to sacred use? To build new temples while destroying or abandoning the ancient ones is, the text says, like killing a great man and then donating his shoes. Rather than multiplying new structures for display, restoring dilapidated ancient temples can bring far greater Loka-kṣema. The dharmic consecrations established according to Śāstra by the great ones of earlier times are held here to be deeply sacred. 19The great ṛṣis and elders of earlier times are remembered here as people of Tapas and renunciation who established disciplines for loka-kṣema and handed them down for practice. When received traditions are not understood or lived, but are repeatedly reinterpreted to suit personal convenience, the original truth sinks out of sight. The task should be to recover that truth rather than multiply fashionable methods. 20How then can Bhārata remain Dharma-kṣetra, Yoga-kṣetra, and Tyāga-kṣetra? The text laments that Bhāratāvani, whose very form is Annapūrṇā, has come to cry out for food. In mountains, caves, sacred riverbanks and holy kṣetras where ‘Śivoham, Śivoham’ once resounded, today it says we hear ‘śavoham, śavoham’—“I am a corpse” in place of “I am Śiva.” The point is intentionally sharp: a culture of living inner realisation has become lifeless outward display. What is urgently required is propagation embodied in Ācaraṇa. 21Mere speaking is not enough. To be eligible for the sacred assurance ‘Yoga-kṣemaṁ vahāmyaham’, the sādhaka must examine whether he is observing the conditions Paramātma Himself stated. Before complaining that Bhagavān has not protected the devotee’s Yoga-kṣema, ask whether we have lived the discipline that precedes the promise. Taking only the phrase one wants while ignoring what comes before and after leads to misunderstanding. 22The promise is not a severed head without a body. ‘Ananyāś cintayanto mām… ye janāḥ paryupāsate… teṣāṁ nityābhiyuktānām’ are integral to ‘Yoga-kṣemaṁ vahāmyaham’. To demand the result without ananya-cintana, upāsanā, and śaraṇāgati is like boasting that the keys are safe after thieves have carried away the box they were meant to open. If one takes refuge elsewhere and invests one’s deepest attachment elsewhere, how is that Ananya-cintana? If, however, Paramātma is genuinely seen in others and all Karma is offered to Him, His grace is present there too. True Śaraṇāgati brings reliance and love into one centre. 23The verse beginning ‘Ananyāś cintayanto mām’ is again described as the central jewel in the Gītā’s garland. Yoga can mean the attainment of what has not yet been attained, and Kṣema the preservation of what has been attained. Ananya-cintana is the Sādhana that safeguards that divine attainment. Through Paramātma-cintana the stains of Manas fall away. The mark of the bhakta is such a purified mind, so that seeing, speaking, acting, singing—life itself—becomes Bhagavat-maya. Such a person need not grieve over being unable to perform elaborate yajñas, charities, or pilgrimages. Bhagavān does not demand display; with a pure Manas, whatever is offered is received with joy. 24However pure the external naivedya, if the vessel of Manas is dirty and not coated with Bhagavat-cintana, the offering is spoiled. Bhagavān seeks the purity of the vessel. Look at the Purāṇic examples: Kuchela offered only a handful of flattened rice; Vidura and Draupadī offered things of almost no worldly value. Yet Bhagavān received the bhāva. His eye is not on the price of the object but on Bhāva-śuddhi. Therefore guard and purify the feeling with which you offer.