Passage 15
Passages 1–18
“కృష్ణా! ఇట్టి దైవదానవగుణములకు జన్మాంతర పుణ్యపాప సంస్కారములే కారణములని తెలిపితివి కదా! అట్టి జన్మాంతర పుణ్యపాపముల సంస్కారములను తప్పించుకొన వీలులేకున్న అట్టివాని గతి ఏమగును? దానిని తప్పించుకొన ఉత్తమ సంస్కారమును పొందగల మార్గము లేమైనా కలవా? అట్టు ఉండిన వాటి విషయమును వివరించిన, విని తరించగలను” అని అర్జునుడు ప్రజా క్షేమమును కోరి అందరి తరఫున ఆరాటై ప్రార్థించాడు.
అందులకు కృష్ణుడు మరుక్షణమే, “బావా! మార్గములు లేక పోలేదు. గుణములు మూడు రకములు. ఒకటి సాత్త్వికము, రెండవది రాజసికము, మూడవది తామసికము ఇవి అంతఃకరణముపై ఆధారపడియుండును. అంతఃకరణము ఆహారముపై ఆధారపడియున్నది. ఎట్టి తిండిని (ఆహారమును) తిందురో అట్టి గుణములు అలవడును. ఎట్టి గుణములు కలుగునో అట్టు ప్రవర్తించగలరు. కాన జన్మాంతర పుణ్య, పాపసంస్కారములచే కొన్ని దైవ దానవ ప్రవర్తనలు కలిగి యుండిననూ ఈ జన్మమున నైననూ అట్టి దానవ గుణములను బలపరచు ఆహార విషయములు అలక్షట్టి సాత్త్విక ఆహార విషయమును అభివృద్ధి పరచుకొన్న, తప్పక యట్టి దానవ సంస్కారములైననూ కొంత మార్పు చేసుకొనవచ్చును” అని చల్లని విషయములను ఉల్లమునకు సోకునట్లు మెల్లగా తెలిపినాడు. అర్జునుడు, మానవునకు అతిముఖ్యమైన నిత్యానుభవముతో లీనమై ఇట్టి ఉత్తమ మార్గమొకటి కలదని విన్నంత మాత్రమున ఉప్పొంగి “మాధవా! ఎట్టి ఆహారములు ఎట్టి గుణములు కలిగించునో తెలుపు”మని ప్రార్థించెను.
చిరునవ్వుతో చిందులు త్రొక్కు పరమాత్మ వెంటనే “బావా! అన్న దోషము చేతనే మనస్సు కలుషము బొందుచున్నది. కలుషితమైన చిత్తమందు ధర్మ, రహస్యము ప్రకాశించదు. ఎట్లన, మలిన జలముగల పాత్రలో ముఖబింబము శుద్ధముగా ప్రకాశించనట్లు మాలిన్య హృదయమున దైవ సాక్షాత్కార ముదయించదు. అర్జునా! ఆహారము చేతనే మానవులు దృఢగాత్రులగుచున్నారు, నీతివంతులగుచున్నారు. విరుద్ధ ఆహారముచే రోగగ్రస్తులా, అవినీతిపరులా, నీచులా అగుచున్నారు. కాన ఆహారమును బట్టే వాని గుణము ఎట్టివని చెప్పవీలగును” అని పలికెను.
“స్వామీ! సాత్త్విక ఆహారమెట్టిదో, రాజసికాహారమెట్టిదో, తామసిక ఆహారమెట్టిదో ప్రీతితో అనుగ్రహించి తెలుపు” మన్నాడు అర్జునుడు.
“అర్జునా! సాత్త్వికుల ఆహారము మనస్సుకు, దేహమునకు బలము చేకూర్చునదై యుండవలెను. అధిక తీపికాని, అధిక వేడికాని ఉండకూడదు. ఇంతయే కాక దాహమును కలిగించునట్టిదైనదిగా కూడనూ ఉండకూడదు. అన్నింటియందునూ మితమై యుండవలెను. కొంతమంది నీటితో ఉడికిన పదార్థములు రెండవ దినమున తినుచుందురు. అనగా ముందు దినము వండిన అన్నమును కూడనూ తినకూడదు.
“కృష్ణా! నూనెలో నేతిలో ఉడికిన పదార్థములందును కదా! అట్టివి కూడనూ రెండవదినమూ, మూడవదినమూ నిలువబెట్టి తినుచుందురు కదా! వాటి విషయమెట్లు?” “బావా! అట్టి పదార్థములు అన్నమునకు, అనగా నీటిలో ఉడికిన వాటికి సంబంధము లేదు. కాని అవి కూడను దుర్వాసన వచ్చిన తరువాత తినుట మంచిది కాదు. దుర్వాసన రాక పూర్వమే తినుటలో తప్పులేదు. రజోగుణ ఆహారము పై చెప్పిన సాత్త్విక ఆహారములన్నింటికిని విరోధమై యుండును. అనగా అతి ఉప్పు, అతి కారము, అతి తీపి, అతి వేడి, అతి పులుపు, దుర్వాసన కొట్టు పదార్థములు, ఇవి అన్నియూ రజోగుణమును పెంపొందించజేయును”
“పరమాత్మా! తెలియక అడుగుచున్నాను, క్షమింపుడు. ఇంత మాత్రము ఆహారమార్పులు చేసినంత మాత్రమున గుణములు సాత్త్వికము కాగలవా? లేక ఇంకనూ ఈ ఆహారమునకు శుద్ధి చేయు మార్గములున్నవా? అట్టు ఉండిన కరుణించుము” అని అర్జునుడడిగెను.
“బావా అర్జునా! ఇంత సులభముగా గుణములు సాత్త్వికముగా మారుచుండిన లోకమున దానవగుణములు నిమిషమున నిర్మూలమయి యుండెడివి. దీనికి ఇంకనూ కొన్ని శుద్ధములు కావలసియున్నవి. మొదటిది వస్తుశుద్ధి, రెండవది పాత్రశుద్ధి, మూడవది వండువారి లేక వండించువారి శుద్ధి ప్రధానములు” అని ఇంకనూ క్రింది విషయములు చెప్పెను.
వస్తువులు మంచివిగానూ, శుద్ధముగానూ ఉన్నంత మాత్రమున చాలదు. ఆ వస్తువులు ఏ విధముగ లభించినవి? అవి లభించు మార్గమునందును అన్యాయము, అసత్యము, అక్రమము, అధర్మము ఉండియుండకూడదు. అట్టి మాలిన్యముతో ఆ వస్తువులు చేరి యుండకూడదు. లభించిన మార్గము కూడనూ శుద్ధమైనదై, సత్యమైనదై యుండవలయును. పాత్ర శుద్ధమైనదై చిలుము పట్టనిదై ఉండవలెను. వండువాడు కూడనూ శుద్ధమైన బట్టలతో, శుద్ధమైన హస్తములతో, శుద్ధమైన ప్రవర్తన కలిగి అనగా దుర్భాష, దుస్సంగ, దుర్బుద్ధులు, దుర్దృష్టులతో మాలిన్యమైనవాడుగా ఉండకూడదు. వంటచేయుచూ అతిపవిత్రమైన చింతనలు చేయక, విసుగు, కోపము, ద్వేషము మొదలగు భావములతో మాటలాడక, నగుముఖముతో విశ్వాస విధేయతలతో ప్రీతిగా వండుచుండవలెను. వండునంత వరకూ చెడ్డతలంపులు లేక ఉండవలెను. అట్టుకాక వండువాడు చూచుటకు శుద్ధముగా ఉండి, తన చింతనలు జారముపైనా, దుర్దతిపైనా ఉంచుకొని విసుగుతో ఇంకా పని పూర్తి కాలేదే అను కోపముతో చిటపటమని గొణుగుతూ చేసిన వంట సాధకులకు ఏకాగ్రత చేకూరదు. అంతటితో పాక ధ్యానమందు, జపమునందు వండువాడు తలంచిన దుష్టభావములు దృశ్యముగా వచ్చి నిలుచును. కాన వండువాడు కొన్నిమంచి నడవడికలు కలవాడై యుండవలయును. అట్టి వానినే విచారణ సలిపి నియమించుకొనవలయును. ఏదో మంచి రుచిగా వండువాడనియా, సులభముగా దొరికినాడనియా, చూచుటకు పరిశుద్ధముగా నున్నాడనియూ, ఈ పైపై పూతలను మాత్రమె చూడక, బయట వాని ప్రవర్తనలను కూడనూ జాగ్రత్తగా చూచుట చాల అవసరము. మనో నిర్మలము, పై చెప్పిన ఆహార శుభ్రతను పట్టి యుండును. మనో నిర్మల మొక్కటుండియూ ఉపయోగముండదు. దానికి దేహము, వాక్కు నిర్మలము కూడనూ అవసరము. వీటినే శారీరక, మానసిక, వాక్కు తపస్సని కూడనూ అందురు.
మనస్సున ఎట్టి విచారమును పెట్టుకొనక సకల ప్రాణులకు ఎల్లప్పుడూ మేలుకోరుచుండవలెను. పరమాత్మను మననము చేయుచుండవలెను. ఇతర విషయములపై పరుగెత్తు చిత్తమును స్వాధీనమందుంచుకొని, పవిత్ర భావములను మాత్రమె మనస్సున కలిగియుండవలెను. ఇట్టి దానిని మనోతపమని అందురు.
ఇక శారీరక తపస్సు; పరోపకార కార్యములలో పాల్గొనుట, పరమాత్మ పూజ, భజన, ప్రదక్షిణ, ఆసన, బ్రహ్మచర్య, ప్రాణాయామములతో పవిత్రము చేయుట, దీనులకు రోగులకు సేవచేయుట, సదాచార ప్రవర్తనలతో దేహమును పవిత్రము చేయుట ఇత్యాది సత్కార్యల కొరకు దేహమును వినియోగించు కొనవలెను.
అతిభాష లేకుండుట, అసత్యములాడకుండుట, చాడీలు చెప్పకుండుట, పరులను దూషించకుండుట, కలినొక్కులాడకుండుట, మధురమైన పలుకులు మాధవస్మరణతో వాక్కును పవిత్రము చేయవలెను. ఇట్లు మనో వాక్కాయములను ఉత్తమమైన మార్గమున వినియోగించిన నిజమైన తపస్సునబడును.
ఇందులో ఏ ఒకటి పవిత్రము కాకపోయిననూ అనగా మనో తపస్సుగాని, శారీరక తపస్సు కాని, వాక్ తపస్సుకాని పవిత్రముగా లేకుండిన ఆత్మజ్యోతి ప్రకాశించదు. ఎట్లన, దీపము వెలిగించుటకు వత్తి, నూనె ప్రమిద యెట్లు అవసరమో, అటులనే దేహము-ప్రమిద, మనస్సు-నూనె, వాక్కు-వత్తి; ఈ మూడింటి సమ్మేళనమే జ్యోతి ప్రకాశమునకు మూలాధారము.
కొంతరు ఆస్తికులు దానధర్మాదులు కూడనూ దేవతతపస్సుగా భావింతురు. మంచిదే. అయితే దేశ కాల పాత్ర ననుసరించి కూడనూ దానము చేయవలెను. ఎట్లన యే ప్రదేశమున విద్యావిధానము లేక కష్టపడుచుందురో అచట పాఠశాలలను, ఆరోగ్యహీనులై రోగ పీడితులై బాధపడు ప్రదేశములందు ఆరోగ్య సౌకర్యములు కలిగించుట, అతివృష్టి అనావృష్టులచే అల్లాడు వారలకు ఆకలి దప్పులను తీర్చి ఆదుకొనవలెను. బ్రహ్మవిద్య, ధర్మ, ప్రబోధనలు, పరోపకార ప్రవర్తనలు, పాత్రము చూచి ఇవ్వవలెను. అట్టు విచారణ చేసి దేనియందు ఏ వ్యక్తి శక్తి హీనమై వ్యధనొందుచుందునో అట్టివానికి అవసరమైన దానిని ఇచ్చుట సాత్త్విక దానమని అందురు. “కృష్ణా! దానము ఎట్టు చేసిననూ దానమే కదా! అందులో సాత్త్వికము, రాజసికము, తామసికమని మార్పులా వేరే యున్నవా?”.
“బావా! లేకేమి? దానము చేయువారలలో ఎక్కువ మంది ప్రతిఫలాపేక్షచే చేయుచుందురు. కొంతమంది మాత్రమె భగవత్ కటాక్షమునే ప్రతిఫలాపేక్షగా భావించుచుందురు. భగవదనుగ్రహఫలమును కోరి చేయుదానము సాత్త్వికమే అగును. అట్టుకాక ప్రత్యుపకారము నాశించియో, పేరు ప్రతిష్ఠను పొందగోరియో, లేక పదిమంది దానవరుడని తలంచుటకై మెప్పునకు అందరిముందు యిచ్చి తదుపరి పరితపించుటయో, లేక మనః క్లేశమువలననో ఇచ్చిన దానము రాజసిక మందురు. సత్పాత్ర పూర్వకము కాక, తిరస్కారభావముతో దానమునకు తగని వ్యక్తికి కాని, స్థానమునకు కాని అనగా తిండి తీర్థములకు కొదువలేని స్థానమున అన్నదానము, తగని స్థానమే అగును. రోగులు వెళ్ళుటకు సాధ్యము కాని ప్రదేశములలో వైద్యాలయములు నిర్మించుట; వృథాయే అగును. కడుపు నిండుగా తిని కదలలేని వానికి అన్నము భుజభారమనిపించును. వానికి అవసరములేని దానిని వాడు పొందియూ దుర్వినియోగ పరచును. కాన ఇట్టి సార్థకము కాని దానములు తామసికమని అందురు”.
“బావా! దానమున జాగ్రత్తగా మెలగవలసి యుండును. ఊరకే అడిగిన వారందరికీ, తలచిన స్థానములన్నింటియందూ దాన ధర్మము చేయరాదు. అట్టు చేయతలచిన పై చెప్పిన రాజసిక, తామసిక, సాత్త్వికములలో దేనికి సంబంధించినదో యోచించి చేయవలెను సుమా! పేరు ప్రతిష్ఠలకు గాని, ఆడంబరములకు గాని, ప్రయోజనము కానివి కాని అయి ఉండకూడదు. అన్ని ప్రవృత్తుల యందునూ సాత్త్వికము చాలా పవిత్రము. అనగా దృష్టియందుకాని, శ్రవణమందుకాని, వాక్కులందుకాని సాత్త్వికమే ఉండవలెనని దీని భావము”.
యోగ్య చిత్తుడై తలవంచి వింటూ ఉండిన అర్జునుడు తలయెత్తి కృష్ణుని సుందర మోమును చూచుచూ, “స్వామీ! మనో సత్త్వము, వాక్ సత్త్వము, దేహ సత్త్వము, దాన సత్త్వము తెలిపితిరి కాని శ్రవణ సత్త్వము, దృష్టి సత్త్వము, తెలుపలేదూ! దయయుంచి వాటి పవిత్రతను గూర్చి సెలవిచ్చిన, ప్రయత్నమున ఆచరించగలను” అని ఆశాకిరణములు వెదజల్లు ముఖివర్చస్సుతో కృష్ణుని ప్రసన్నగుణట్లు ప్రార్థించినాడు. కృష్ణుడు చిరునవ్వులు చిందులాడ అర్జునిని భుజమున హస్తముంచి. “బావా! భగవదారాధకులను, భగవత్ చిత్రములను, భగవత్ స్వరూప శీలలను, సాత్త్విక మార్గమున ప్రవర్తించు సాధనలు సలుపు మహానీయులను చూచుట, అట్టివారి కథలను వినుట, వారల చిత్రములను, స్వరూపములను, ప్రతిమలను ఇంటియందుంచుకొనుట, ఇష్టదైవములైన చూపులు, శ్రవణములు సాత్త్వికములగును. విలాస దృశ్యములు, విలాస చిత్రములు చూచుట కాని, వాటిని గురించి వినుట కాని, ఆడంబరములతో అధికారుల వెంట తిరుగుట కాని, అట్టి వారలతో చేరిన చిత్రపటములు వరించుట కాని, అట్టి చిత్రములే ఇంటిలో ఎటుచూచినా ప్రదర్శించుట కాని, అనగా విలాస, ఆడంబర, అహంకార, అధికార చిత్రములు చూచుట కాని, పూజా గృహములందుంచుట కాని, రాజసిక మగును. ఇక దుర్మార్గ, దురాచార, క్రూర విషయములను వినుట కాని, చూచుట కాని, అట్టివారలతో సంభాషించుట కాని, అట్టివారి చిత్రములను ఇంటియందుంచుకొనుట కాని, భూతప్రేత, పిశాచారాధనలు కాని, తామసిక శ్రవణ దృశ్యములగును” అని పరమాత్మ ప్రేమతో బోధించెను.
పాఠకులారా! గీతా స్వరూపమునకు ఈ విషయము గుండెవంటిది గానున్నది. అన్నగత ప్రాణమైన ఈ కాయమునకు అన్నమే (ఆహారమే) అధమ ఉత్తమ స్థానములు నందించుచున్నది. ఉత్తమగతిని పొందగోరువారు కేవలము సాధన నిష్ఠలే ప్రధానముగా పాటించుట లోకవిరాట్టే, “నాష్టా” నిష్ఠను చూడకుండుట అలవాటైనది. దీనిని పట్టి సాధన నిష్ఠకంటెను, నాష్టానిష్ఠ ప్రధానముగా తెలియుచున్నది. ఎట్టి మహానీయులైననూ, మహా మహా పండితులైననూ వేదాంత ప్రబోధ ప్రచారములనే ఆధారముగా తీసుకొని సాధనలు సలుపుకొనుచున్నారే కాని ఆహార నియమములను పాటించుటలేదు. ఈ కాలమున పదార్థశుద్ధి కాని, పాత్రశుద్ధి కాని, వండువారిశుద్ధికాని ఏ మాత్రమూ చూచుటలేదు. కడుపు నిండుట, ఆకలి తీరుటే ప్రధానముగా పాటించుచున్నారు. తెల్లవారగనే మొదటి ఆరాధన కాఫీ హోటల్లో ఇడ్డీసాంబార్ ఆత్మారామునకు నైవేద్యము. ఇట్టి తిండిపోతులకు ఏకాగ్రత యెట్లు కుదురును? పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థశుద్ధి కాఫీ హోటళ్ళలో ఎట్లు కుదురును? వాటిని విచారించు వారెవరు? వాటిని విచారించక ఆచరించుట చేతనే ఏకాగ్రత లేని వెర్రికేకలతో బుర్రలు చెరచుకొనుచున్నారు. చేయవలసినవి సరిగా చేసినప్పుడే రావలసిన పవిత్రత వచ్చును. కాని అసలు చేయుటలోనే చెడుపదార్థమైన, తీపి యెట్లువచ్చును ఎట్లు చిక్కును? నియమ విరుద్ధములైన ఆహార విహారములను గీత అతి తీవ్రముగా ఖండించినది. అది ఎక్కడా గమనించుటలేదు. దానిని ఎవరు ప్రధానముగా భావించుటలేదు. అందువలననే ఎక్కడ చూచిననూ పరిచువారే ప్రబోధించువారే యుండియూ దాని పవిత్రత ప్రపంచమున ఏమాత్రమునూ ఆచరణ రూపమున కనిపించుటలేదు. శ్లోకములు కంఠమున చేరుచున్నవి కాని వారి శోకములు కడుపును విడిచిపోకున్నవి. ఆహార విహారములు దోషరహితమైనప్పుడే ఆనందశాంతులు చేకూరును. అంధకారము, ప్రకాశము రెండునూ ఒకే స్థానమున ఉండుటకు వీలులేదు. అట్టు ఉండవు. కామునకు రామునకు పొత్తు కుదరదు. అవి నీరా, నిప్పా సంబంధము. ఒకచేతిలో భగవద్గీతకు సంబంధించిన గ్రంథము, మరోక చేతిలో వేడి వేడి కాఫీ, చాయ్, సిగరెట్, లేక బీడీ లేక నశ్యమో ఏదో ఒకటి ఉంచుకున్న భగవద్గీతకి మరి మనస్సునకు ఎదురు తిరుగక ఏమగును? ఇట్టివారు ఇంతటితో ఆగక ఏమి తిన్ననూ, ఎట్లు తిన్ననూ, ఎక్కడ తిన్ననూ సర్వమూ జ్ఞానాగ్నిలో దగ్ధమై భస్మమైపోవును అని తమ తమ తప్పులను కప్పిపుచ్చుకొనుచూ, చేదు పుచ్చకాయ తీర్థయాత్రలు చేసినట్లు కొందరు ప్రసంగ ప్రబోధయాత్రలు చేయుచుందురు. ఇట్టి వారి మిధ్యాచారమును చూచి విని మరింత నాస్తిక వాదన బలపడుటకు కారణమగుచున్నది. ఆహారమునే నిర్లక్షించలేని వారు ఇంద్రియములను మాత్రమెట్లు నిలువగలరు? ఆహారమునే అలక్ష్యలేనివారు ఇంద్రియములను నెట్టు కట్టివేతురు? దానిపైననే ప్రవేశపెట్టలేని బలము వీటిపై మాత్రము ఎట్లువచ్చును? దగ్గిన రావిపొదపు ముక్కు తుమ్మిన ఉండగలదా? ఉట్టికే ఎక్కలేని వాని స్థితి స్వర్గమున కెట్లు ప్రాకును? కాఫీ, బీడీ, నశ్యములనే మానలేనివారు కామక్రోధ లోభాదులను మానగలరా! మాలిన్యమునే త్యజించలేనివాడు మానసమును నిర్లిప్తించగలడా? కాన మొదట జీవన చాపల్యమును వదలిన గృహాచాపల్యము పోవును. కాలికి, కంటికి యెట్టి సంబంధమో జీవకూ, గృహమునకూ అట్టి సంబంధము కలదు.
1Arjuna prayed on behalf of all seekers: “Kṛṣṇa, You said that Daivī and Āsurī tendencies arise from saṁskāras of puṇya and pāpa carried from earlier births. If one cannot simply escape those inherited saṁskāras, what is such a person to do? Is there a way to cultivate better saṁskāras and transform them? Please explain.” 2Kṛṣṇa immediately replied, “Bāvā, there are ways. The guṇas are three—Sāttvika, Rājasika, and Tāmasika—and they condition the Antaḥkaraṇa. The Antaḥkaraṇa is in turn deeply affected by āhāra. The food one takes helps cultivate corresponding tendencies, and one’s conduct follows those tendencies. Even where earlier saṁskāras have created Daivī or Āsurī inclinations, in this life one can weaken what nourishes Āsurī guṇas and strengthen Sāttvika āhāra and conduct; in this way the older pattern can be changed to some extent.” Arjuna was delighted that such a practical path existed and asked what foods foster which guṇas. 3Kṛṣṇa said gently, “Bāvā, defects in food can cloud Manas. In a polluted Citta the secret of Dharma does not shine, just as a face is not clearly reflected in dirty water. Through suitable āhāra the body becomes strong and conduct can become orderly; unsuitable āhāra contributes to illness, agitation, and degraded tendencies. Thus food has a real relation to guṇa.” 4Arjuna asked, “Swāmi, please tell me with love what Sāttvika, Rājasika, and Tāmasika āhāra are.” 5“Arjuna, Sāttvika food should strengthen both Manas and body. It should not be excessively sweet, excessively hot, nor such as to produce excessive thirst. Moderation is essential. Food cooked in water should be fresh; the text specifically cautions against eating stale cooked rice from the previous day.” 6Arjuna asked about foods cooked in oil or ghee and kept for later. Kṛṣṇa replied that the same rule is not mechanically identical for every preparation, but food that has become spoiled or foul-smelling should not be eaten. Rājasika food is marked by excess—too salty, too pungent, too sweet, too hot, too sour, or otherwise strongly irritating and stale-smelling. Such excess nourishes Rajas. 7Arjuna asked, “Paramātma, forgive my question. Can guṇa really become Sāttvika merely by changing food, or are there further forms of purification connected with āhāra?” 8Kṛṣṇa replied, “Bāvā, if it were that easy, Āsurī tendencies would disappear from the world in a moment. Three further purities are important: purity of the substance, purity of the vessel, and purity of the person who prepares or provides the food.” 9It is not enough that the ingredients look wholesome. One should consider how they were obtained: they should not be stained by injustice, falsehood, fraud, or Adharma. The means of acquisition should be clean and truthful. Vessels should be clean and free from contamination. The cook too should be clean in body, hands, clothing, conduct, speech, and thought. Food prepared amid anger, resentment, filthy speech, crooked intent, or mental agitation carries the atmosphere in which it was made. The text therefore asks for cheerful, respectful, loving preparation with pure thought. A cook should be chosen not merely for taste or convenience but also for character. Mental purity is connected with these conditions; Manas, body, and speech all require purification. These are also described as forms of Tapas—mānasika, śārīrika, and vācika. 10Mānasika Tapas is to refrain from brooding over harmful thoughts, to wish well to all beings, remember Paramātma, restrain Citta from running after unrelated objects, and cultivate sacred bhāvas. 11Śārīrika Tapas is to use the body for service and sacred action—paropakāra, worship, bhajan, pradakṣiṇa, āsana, brahmacarya, prāṇāyāma, care for the sick and needy, and sadācāra—so that the body itself becomes an instrument of purification. 12Vācika Tapas is to avoid excessive speech, falsehood, slander, gossip, abuse, and cruel words; to speak sweetly and purify Vāk through remembrance of Mādhava. When Manas, Vāk, and Kāya are all used in this noble way, that is true Tapas. 13If even one of these—mental, bodily, or verbal Tapas—is neglected, the Ātma-jyoti does not shine steadily through the personality. The image is again the lamp: body is the lamp-vessel, Manas the oil, Vāk the wick. Their harmonious purity allows the flame to shine. 14Some also regard dāna and dharmic service as Tapas. That is good, but charity must be suited to deśa, kāla, and pātra. Where education is lacking, establish education; where sickness is widespread, provide health support; where drought, flood, hunger, or thirst afflict people, relieve those needs. Brahma-vidyā and dharmic instruction too should be given appropriately. To enquire what a person or place genuinely lacks and provide that needed help is Sāttvika dāna. Arjuna then asked whether charity itself also becomes Sāttvika, Rājasika, or Tāmasika. 15Kṛṣṇa replied, “Certainly. Many give with expectation of return; some seek only Bhagavān’s grace as the fruit. Giving for Bhagavad-anugraha, without worldly bargaining, is Sāttvika. Giving for repayment, fame, reputation, public approval, or with inner pain and reluctance is Rājasika. Giving without discrimination of pātra, place, and need—such as feeding where no hunger exists or building a hospital where the sick cannot reach it—may become purposeless and Tāmasika. What is unnecessary may be wasted or misused.” 16“Bāvā, therefore be careful in dāna. Do not give indiscriminately merely because someone asks or because a place presents itself. Consider whether the giving is Sāttvika, Rājasika, or Tāmasika. Let it not be for prestige, display, or useless expenditure. Sattva should guide every faculty—not only action but seeing, hearing, and speech.” 17Arjuna asked about Sāttvika seeing and hearing. Kṛṣṇa replied with affection: “To see Bhagavad-ārādhakas, sacred images and forms, noble people walking the Sāttvika path, and to hear their stories and keep reminders of such holy lives—these cultivate Sāttvika dṛṣṭi and śravaṇa. To dwell on luxury, vanity, display, power, and prestige, and to fill one’s surroundings with such images, is Rājasika. To seek cruel, degraded, frightening, or corrupt subjects, company, and forms of worship is Tāmasika.” 18Readers, this teaching is like the heart of the Gītā. The body, whose life depends upon food, is led toward higher or lower states by anna—by āhāra itself. Those who seek the higher state often make Sādhana-niṣṭhā their chief concern while neglecting “nāṣṭā-niṣṭhā,” discipline in what they eat. Even great scholars may devote themselves to Vedāntic teaching and spiritual practice while failing to observe the disciplines of food. In these times little attention is paid to purity of ingredients, purity of vessels, or purity of the one who cooks; filling the stomach and quieting hunger become the main concern. At daybreak the first “worship” may be an offering of idli and sambar to Ātmārāma in a coffee hotel. How can one-pointedness arise in such indulgence? How readily can pātra-śuddhi, pāka-śuddhi, and padārtha-śuddhi be assured there? When what ought to be done is done rightly, the corresponding purity can arise; if the very practice begins with what is impure, how can sweetness be expected from it? The Gītā strongly condemns disorderly āhāra and vihāra, yet this is often not treated as important. Thus teachers and preachers may be everywhere while the purity of the teaching is scarcely visible in actual conduct. Ślokas reach the throat, but sorrow does not leave the stomach. Ānanda and Śānti arise when āhāra and vihāra are free from such defects. Darkness and light cannot occupy the same place; Kāma and Rāma cannot keep company—they are like water and fire. With a book of the Bhagavad Gītā in one hand and hot coffee, tea, a cigarette, a bīḍī, or snuff in the other, how can the Gītā and the mind not stand opposed? Some go further, covering their own faults by saying that whatever is eaten, however and wherever it is eaten, will all be burnt to ashes in the fire of Jñāna, while they travel about giving discourses. Seeing such hypocrisy only strengthens unbelief. If one cannot discipline even food, how will the senses be restrained? If one cannot give up coffee, bīḍī, or snuff, how will Kāma, Krodha, and Lobha be abandoned? If impurity itself cannot be relinquished, how will Manas become unattached? First let the restlessness of one’s own life be given up; then the restlessness of the household can subside. The relation between jīva and the household is as the relation between foot and eye.