Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · Sāttvika, Rājasika and Tāmasika Tendencies
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
“కృష్ణా!
ఇట్టి
దైవ,
దానవ
గుణములకు
జన్మాంతర
పుణ్యపాప
సంస్కారములే
కారణములని
తెలిపితిరి
కదా!
అట్టి
జన్మాంతర
పుణ్య
పాపముల
సంస్కారములను
తప్పించుకొన
వీలులేకున్న
అట్టివాని
గతి
యేమగును?
దానిని
తప్పించుకొని
ఉత్తమ
సంస్కారమును
పొందగల
మార్గములేమైనా
కలవా?
అట్లు
ఉండిన
వాటి
విషయమును
వివరించిన,
విని
తరించగలను”
అని
అర్జునుడు
ప్రజా
క్షేమమును
కోరి
అందరి
తరపున
ఆర్తుడై
ప్రార్థించాడు.
2
▾
Meaning
Keep
అందులకు
కృష్ణుడు,
మరుక్షణమే,
“బావా!
మార్గములు
లేకపోలేదు.
గుణములు
మూడు
రకములు.
ఒకటి
సాత్వికము,
రెండవది
రాజసికము,
మూడవది
తామసికము.
ఇవి
అంతఃకరణముపై
ఆధారపడియుండును.
అంతఃకరణము
ఆహారముపై
ఆధారపడియున్నది.
ఎట్టి
తిండిని
(ఆహారమును)
తిందురో
అట్టి
గుణములు
అలవడును.
ఎట్టి
గుణములు
కలుగునో
అట్లు
ప్రవర్తించగలరు.
కాన
జన్మాంతర
పుణ్య
పాప
సంస్కారములచే
కొన్ని
దైవ,
దానవ
ప్రవర్తనలు
కలిగి
యుండిననూ
ఈ
జన్మముననైననూ
అట్టి
దానవ
గుణములను
బలపరచు
ఆహార
విషయములు
అరికట్టి
సాత్విక
ఆహార
విషయములను
అభివృద్ధి
పరచుకొన్న,
తప్పక
యెట్టి
దానవ
సంస్కారములనైననూ
కొంత
మార్పు
చేసుకొనవచ్చును”
అని
చల్లని
విషయములను
ఉల్లమునకు
సోకునట్లు
మెల్లగా
తెలిపినాడు.
అర్జునుడు,
మానవునకు
అతిముఖ్యమైన
నిత్యానుభవముతో
లీనమై
ఇట్టి
ఉత్తమ
మార్గమొకటి
కలదని
విన్నంత
మాత్రమున
ఉప్పొంగి,
“మాధవా!
ఎట్టి
ఆహారములు
ఎట్టి
గుణములు
కలింగిచునో
తెలుపు”మని
ప్రార్థించెను.
3
▾
Meaning
Keep
చిరునవ్వుతో
చిందులు
త్రొక్కు
పరమాత్మ
వెంటనే
“బావా!
అన్న
దోషము
చేతనే
మనస్సు
కల్మషము
బొందుచున్నది.
కలుషితమైన
చిత్తమందు
ధర్మ
రహస్యము
ప్రకాశించదు.
ఎట్లన,
మలిన
జలముగల
పాత్రలో
ముఖబింబము
శుద్ధముగా
ప్రకాశించనట్లు
మాలిన్య
హృదయమున
దైవ
సాక్షాత్కార
ముదయించదు.
అర్జునా!
ఆహారము
చేతనే
మానవులు
దృఢగాత్రులగుచున్నారు,
నీతివంతులగుచున్నారు.
విరుద్ధ
ఆహారముచే
రోగగ్రస్తులూ,
అవినీతిపరులూ,
నీచులూ
అగుచున్నారు.
కాన
ఆహారమును
బట్టే
వాని
గుణములు
ఇట్టివని
చెప్పవీలగును”
అని
పలికెను.
4
▾
Meaning
Keep
“స్వామీ!
సాత్విక
ఆహారమెట్టిదో,
రాజసికాహారమెట్టిదో,
తామసిక
ఆహారమెట్టిదో
ప్రీతితో
అనుగ్రహించి
తెలుపు”
మన్నాడు
అర్జునుడు.
5
▾
Meaning
Keep
“అర్జునా!
సాత్విక
ఆహారము
మనస్సుకు,
దేహమునకు
బలము
చేకూర్చునదై
యుండవలెను.
అధిక
ఉప్పుకానీ,
అధిక
కారముకానీ,
అధిక
పులుపుకానీ,
అధిక
తీపికానీ,
అధిక
వేడికానీ
ఉండకూడదు.
ఇంతియే
కాక
దాహమును
కలిగించునట్టిదై
కూడనూ
ఉండకూడదు.
అన్నింటియందునూ
మితమై
యుండవలెను.
కొంతమంది
నీటితో
ఉడికిన
పదార్థములు
రెండవ
దినమున
తినుచుందురు.
అనగా
ముందు
దినము
వండిన
అన్నమును
కూడనూ
తినకూడదు.”
6
▾
Meaning
Keep
“కృష్ణా!
నూనెలో
నేతిలో
ఉడికిన
పదార్థములుండును
కదా!
అట్టివి
కూడనూ
రెండవ
దినమూ,
మూడవ
దినమూ
నిలువపెట్టి
తినుచుందురు
కదా!
వాటి
విషయమెట్లు?”
“బావా!
అట్టి
పదార్థములకు
అన్నమునకు,
అనగా
నీటిలో
ఉడికిన
వాటికి,
సంబంధము
లేదు.
కాని
అవి
కూడనూ
దుర్వాసన
వచ్చిన
తరువాత
తినుట
మంచిది
కాదు.
దుర్వాసన
రాక
పూర్వమే
తినుటలో
తప్పులేదు.
రజోగుణ
ఆహారము
పై
చెప్పిన
సాత్విక
ఆహారములన్నింటికినీ
విరోధమై
యుండును.
అనగా
అతి
ఉప్పు,
అతి
కారము,
అతి
తీపు,
అతి
వేడి,
అతి
పులుపు,
దుర్వాసన
కొట్టు
పదార్థములు,
ఇవి
అన్నియూ
రజోగుణమును
పెంపొందింపజేయును”
7
▾
Meaning
Keep
“పరమాత్మా!
తెలియక
అడుగుచున్నాను,
క్షమింపుడు.
ఇంత
మాత్రము
ఆహార
మార్పులు
చేసినంత
మాత్రమున
గుణములు
సాత్వికము
కాగలవా?
లేక
ఇంకనూ
ఈ
ఆహారమునకు
శుద్ధి
చేయు
మార్గములున్నవా?
అట్లు
ఉండిన
కరుణించుము”
అని
అర్జునుడడుగగనే,
“బావా
అర్జునా!
8
▾
Meaning
Keep
ఇంత
సులభముగా
గుణములు
సాత్వికముగా
మారుచుండిన
లోకమున
దానవ
గుణములు
నిమిషమున
నిర్మూలమయి
ఉండెడివి.
దీనికి
ఇంకనూ
కొన్ని
శుద్ధములు
చూడవలసియున్నవి.
వినుము.
మొదటిది
వస్తుశుద్ధి,
రెండవది
పాత్రశుద్ధి,
మూడవది
వండువాడు
లేక
వండించువాని
శుద్ధి
ప్రధానములు.”
9
▾
Meaning
Keep
“వస్తువులు
మంచివి
గానూ,
శుద్ధము
గానూ
ఉన్నంత
మాత్రమున
చాలదు.
ఆ
వస్తువులు
ఏ
విధముగ
లభించినవి?
అవి
లభించు
మార్గమునందును
అన్యాయము,
అసత్యము,
అక్రమము,
అధర్మము
ఉండియుండ
కూడదు.
అట్టి
మాలిన్యములతో
ఆ
వస్తువులు
చేరి
యుండకూడదు.
లభించిన
మార్గము
కూడనూ
శుద్ధమైనదై,
సత్యమైనదై
యుండవలయును.
పాత్ర
శుద్ధమైనదై
చిలుము
పట్టనిదై
ఉండవలెను.
వండువాడు
కూడనూ
శుద్ధమైన
బట్టలతో,
శుద్ధమైన
హస్తములతో,
శుద్ధమైన
ప్రవర్తన
కలిగి
అనగా
దురభ్యాస,
దుస్సంగ,
…,
దుర్నడతలతో
మాలిన్యమైన
వాడుగా
ఉండకూడదు.
వంట
చేయుచూ
అతిపవిత్రమైన
చింతనలు
చేయక,
విసుగు,
కోపము,
ద్వేషము
మొదలగు
భావములతో
మాటలాడక,
నగుముఖముతో
విశ్వాస
విధేయతలతో
ప్రీతిగా
వండుచుండవలెను.
వండునంత
వరకూ
చెడ్డ
తలంపులు
లేక
ఉండువాడై
యుండవలయును.
అట్లుకాక
వండువాడు
చూచుటకు
శుద్ధముగా
ఉండి,
తన
చింతనలు
జూదముపైనా,
దుర్నడతపైనా
ఉంచుకొని
విసుగుతో,
ఇంకా
పని
పూర్తి
కాలేదే
అను
కోపముతో
చిటపటమని
గొణుగుతూ
చేసిన
వంట
సాధకులకు
ఏకాగ్రత
చేకూర్చదు.
అంతటితో
పోక
ధ్యానమందు,
జపమునందు
వండువాడు
తలంచిన
దుష్టభావములు
దృశ్యముగా
వచ్చి
నిలుచును.
కాన
వండువాడు
కొన్ని
మంచి
నడవడికలు
కలవాడై
యుండవలయును.
అట్టి
వానినే
విచారణ
సలిపి
నియమించుకొనవలయును.
ఏదో
మంచి
రుచిగా
వండువాడనియూ,
సులభముగా
దొరికినాడనియూ,
చూచుటకు
శుద్ధముగా
నున్నాడనియు,
ఈ
పై
పై
పూతలను
మాత్రమే
చూడక,
బయట
వాని
ప్రవర్తనలను
కూడనూ
జాగ్రత్తగా
చూచుట
చాల
అవసరము.
మనో
నిర్మలము,
పై
జెప్పిన
ఆహార
శుభ్రతను
పట్టి
యుండును.
మనో
నిర్మల
మొక్కటుండియూ
ఉపయోగముండదు.
దానికి
దేహము,
వాక్కు
నిర్మలము
కూడనూ
అవసరము.
వీటినే
శారీరక,
మానసిక,
వాక్కు
తపస్సని
కూడనూ
అందురు.”
10
▾
Meaning
Keep
“మనసున
ఎట్టి
విచారమును
పెట్టుకొనక
సకల
ప్రాణులకు
ఎల్లప్పూడూ
మేలుకోరుచుండవలెను.
పరమాత్మను
మననము
చేయుచుండవలెను.
ఇతర
విషయముల
పై
పరుగెత్తు
చిత్తమును
స్వాధీనమందుంచుకొని,
పవిత్ర
భావములను
మాత్రమే
మనసున
కలిగియుండవలెను.
ఇట్టి
దానిని
మనో
తపమని
అందురు.”
11
▾
Meaning
Keep
“ఇక
శారీరక
తపస్సు;
పరోపకార
కార్యములలో
పాల్గొనుట,
పరమాత్మ
పూజ,
భజన,
ప్రదక్షిణ,
ఆసన,
బ్రహ్మచర్య,
ప్రాణయామములతో
పవిత్రము
చేయుట,
దీనులకు
రోగులకు
సేవజేయుట,
సదాచార
ప్రవర్తనలతో
దేహమును
పవిత్రము
చేయుట
ఇత్యాది
సత్కర్మలచే
దేహమును
వినియోగించు
కొనవలెను.”
12
▾
Meaning
Keep
“అతిభాష
లేకుండుట,
అనృతములాడకుండుట,
చాడీలు
చెప్పకుండుట,
పరులను
దూషించకుండుట,
కఠినోక్తులాడకుండుట,
మధురమైన
పలుకులు,
మాధవ
స్మరణతో
వాక్కును
పవిత్రము
చేయవలెను.
ఇట్లు
మనో
వాక్కాయములను
ఉత్తమమైన
మార్గమున
వినయోగించిన
నిజమైన
తపస్సనబడును.”
13
▾
Meaning
Keep
“ఇందులో
ఏ
ఒకటి
పవిత్రము
కాకపోయిననూ
అనగా
మనో
తపస్సుగాని,
శారీరక
తపస్సు
కానీ,
వాక్
తపస్సు
కానీ
పవిత్రముగా
లేకుండిన
ఆత్మజ్యోతి
ప్రకాశించదు.
ఎట్లన,
దీపము
వెలింగించుటకు
పత్తి,
నూనె,
ప్రమిద
యెట్లు
అవసరమో,
అటులనే
దేహము-ప్రమిద,
మనస్సు-నూనె,
వాక్కు-పత్తి;
ఈ
మూడింటి
సమ్మేళనే
జ్యోతి
ప్రకాశమునకు
మూలాధారము.”
14
▾
Meaning
Keep
“కొందరు
ఆస్తికులు
దానధర్మాదులు
కూడనూ
దేహ
తపస్సుగా
భావింతురు.
మంచిదే.
అయితే
దేశ
కాల
పాత్రత
ననుసరించి
కూడనూ
దానము
చేయవలెను.
ఎట్లన,
యే
ప్రదేశమున
విద్యావిధానము
లేక
కష్టపడుచుందురో
అచట
పాఠశాలలును,
ఆరోగ్యహీనులై
రోగ
పీడితులై
బాధపడు
ప్రదేశములందు
ఆరోగ్య
సౌకర్యములు
కలిగించుట,
అతివృష్టి
అనావృష్టులచే
అల్లాడు
వారలకు
ఆకలి
దప్పులను
తీర్చి
ఆదుకొనవలెను.
బ్రహ్మవిద్య,
ధర్మ
ప్రబోధనలు,
పరోపకార
ప్రవర్తనలు,
పాత్రము
చూచి
ఇవ్వవలెను.
అట్లు
విచారణ
చేసి
దేని
యందు
ఏ
వ్యక్తి
శక్తి
హీనమై
వ్యధనొందుచుండునో
అట్టి
వానికి
అవసరమైన
దానిని
ఇచ్చుట
సాత్విక
దానమని
అందురు.”
“కృష్ణా!
దానము
ఎట్లు
చేసిననూ
దానమే
కదా!
అందులో
సాత్వికము,
రాజసికము,
తామసికమని
మార్పులూ
వేరే
యున్నవా?”
15
▾
Meaning
Keep
“బావా!
లేకేమి?
దానము
చేయువారలలో
ఎక్కువ
మంది
ప్రతిఫలాపేక్షచే
చేయుచుందురు.
కొంతమంది
మాత్రమే
భగవత్
కటాక్షమునే
ప్రతిఫలాపేక్షగా
భావించుచుందురు.
భగవదనుగ్రహ
ఫలమును
కోరి
చేయు
దానము
సాత్వికమే
అగును.
అట్లుకాక
ప్రత్యుపకారము
నాశించియో,
పేరు
ప్రతిష్ఠను
పొందగోరియో,
లేక
పదిమంది
దానపరుడని
తలంచుటకై
మెప్పునకు
అందరిముందు
యిచ్చి
తదుపరి
పరితపించుటయో,
లేక
మనః
క్లేశము
వలననో
ఇచ్చిన
దానము
రాజసిక
మందురు.
సత్కార
పూర్వకము
కాక,
తిరస్కార
భావముతో
దానమునకు
తగని
వ్యక్తికి
కానీ,
స్థానమునకు
కానీ
అనగా
తిండి
తీర్థములకు
కొదువలేని
స్థానమున
అన్నదానము,
తగని
స్థానమే
అగును.
రోగులు
వెళ్ళుటకు
సాధ్యము
కాని
ప్రదేశములలో
వైద్యాలయములు
నిర్మించుట
వృధాయే
అగును.
కడుపు
నిండుగా
తిని
కదలలేని
వానికి
అన్నము
భుజభారమనిపించును.
వానికి
అవసరములేని
దానిని
వాడు
పొందియూ
దుర్వినియోగ
పరచును.
కాన
ఇట్టి
సార్థకము
కాని
దానములు
తామసికమని
అందురు.”
16
▾
Meaning
Keep
“బావా!
దానమున
జాగ్రత్తగా
మెలగవలసి
యుండును.
ఊరకే
అడిగిన
వారందరికీ,
తలచిన
స్థానములన్నింటి
యందూ
దాన
ధర్మము
చేయరాదు.
అట్లు
చేయతలచిన
పై
చెప్పిన
రాజసిక,
తామసిక,
సాత్వికములలో
దేనికి
సంబంధించియున్నదో
యోచించి
చేయవలెను
సుమా!
పేరు
ప్రతిష్ఠలకు
గానీ,
ఆడంబరములకు
గానీ,
ప్రయోజనము
కానిది
కానీ
అయి
ఉండకూడదు.
అన్ని
ప్రవృత్తుల
యందునూ
సాత్వికము
చాలా
పవిత్రము.
అనగా
దృష్టియందు
కానీ,
శ్రవణమందుకానీ,
వాక్కులందుకానీ
సాత్వికమై
ఉండవలెనని
దీని
భావము.”
17
▾
Meaning
Keep
యేకాగ్ర
చిత్తుడై
తలవంచి
వింటూ
ఉండిన
అర్జునుడు
తలయెత్తి
కృష్ణుని
సుందర
మోమును
చూచుచూ,
“స్వామీ!
మనో
సత్త్వము,
వాక్
సత్త్వము,
దేహ
సత్త్వము,
దాన
సత్త్వము
తెలిపితిరి
కాని,
శ్రవణ
సత్త్వము,
దృష్టి
సత్త్వము,
తెలుపలేదు!
దయ
యుంచి
వాటి
పవిత్రతను
గూర్చి
సెలవిచ్చిన,
ప్రయత్నమున
ప్రవర్తించగలను”
అని
ఆశా
కిరణములు
వెదజల్లు
ముఖవర్చస్సుతో
కృష్ణుని
ప్రసన్నడగునట్లు
ప్రార్థించినాడు.
కృష్ణుడు
చిరునవ్వులు
చిందులాడ
అర్జునుని
భుజమున
హస్తముంచి,
“బావా!
భగవదారాధకులను,
భగవత్
చిత్రములను,
భగవత్
స్వరూప
శిలలను,
సాత్విక
మార్గమున
ప్రవర్తించు
సాధనలు
సలుపు
మహనీయులను
చూచుట,
అట్టివారి
కథలను
వినుట,
వారల
చిత్రములను,
స్వరూపములను,
ప్రతిమలను
ఇంటియందుంచుకొనుట,
ఇవ్విధములైన
చూపులు,
శ్రవణములు
సాత్వికములగును.
విలాస
దృశ్యములు,
విలాస
చిత్రములు
చూచుట
కానీ,
వాటిని
గురించి
వినుట
కానీ,
ఆడంబరములతో
అధికారుల
వెంట
తిరుగుట
కానీ,
అట్టి
వారలతో
చేరిన
చిత్రపటములు
వర్ణించుట
కానీ,
అట్టి
చిత్రములే
ఇంటిలో
ఎటు
చూచినా
ప్రదర్శించుట
కానీ,
అనగా
విలాస,
ఆడంబర,
అహంకార,
అధికార
చిత్రములు
చూచుట
కానీ,
పూజా
గృహములందుంచుట
కానీ,
రాజసిక
మగును.
ఇక
దుర్మార్గ,
దురాచార,
క్రూర
విషయములను
వినుట
కానీ,
చూచుట
కానీ,
అట్టి
వారలతో
సంభాషించుట
కానీ,
అట్టి
వారి
చిత్రములను
ఇంటియందుంచుకొనుట
కానీ,
భూతప్రేత,
పిశాచారాధనలు
కానీ,
తామసిక
శ్రవణ
దృశ్యములగును”
అని
పరమాత్మ
ప్రేమతో
బోధించెను.
18
▾
Meaning
Keep
పాఠకులారా!
గీతా
స్వరూపమునకు
ఈ
విషయము
గుండెవంటిది
గానున్నది.
అన్నగత
ప్రాయమైన
ఈ
కాయమునకు
అన్నమే
(ఆహారమే)
అధమ,
ఉత్తమ
స్థానముల
నందించుచున్నది.
ఉత్తమగతిని
పొందగోరు
వారు
కేవలము
సాధన
నిష్ఠలే
ప్రధానముగా
పాటించుట
లోక
పరిపాటై,
“నాష్టా”
నిష్ఠను
చూడకుండుట
అలవాటైనది.
దీనిని
పట్టి
సాధన
నిష్ఠకంటెను,
నాష్టా
నిష్ఠ
ప్రధానముగా
తెలియచున్నది.
ఎట్టి
మహనీయులైననూ,
మహా
మహా
పండితులైననూ
వేదాంత
ప్రబోధ
ప్రచారములనే
ఆధారముగా
తీసుకొని
సాధనలు
సలుపుకొనుచున్నారే
కాని
ఆహార
నీమములు
పాటించుటలేదు.
ఈ
కాలమున
పదార్థ
శుద్ధి
కానీ,
పాత్ర
శుద్ధి
కానీ,
వందువారి
శుద్ధి
కానీ
ఏ
మాత్రమూ
చూచుటలేదు.
కడుపు
నిండుట,
ఆకలి
తీరుటే
ప్రధానముగా
పాటించుచున్నారు.
తెల్లవారగనే
మొదటి
ఆరాధన
కాఫీ,
హోటల్లో
ఇడ్లీ
సాంబార్
ఆత్మారామునకు
నైవేద్యము.
ఇట్టి
తిండిపోతులకు
ఏకాగ్రత
యెట్లు
కుదురును?
పాత్రశుద్ధి,
పాకశుద్ధి,
పదార్థశుద్ధి,
కాఫీ
హోటళ్ళలో
ఎట్లు
కుదురును?
వాటిని
విచారించు
వారెవరు?
వాటిని
విచారించక
ఆచరించుట
చేతనే
ఏకాగ్రత
లేదని
వెర్రి
కేకలతో
బుర్రలు
చెరచుకొనుచున్నారు.
చేయవలసినవి
సరిగా
చేసినప్పుడే
రావలసిన
పవిత్రత
వచ్చును
కానీ,
అసలు
చేయుటలోనే
చేదు
పదార్థమైన
రుచి,
తీపు
యెట్లు
వచ్చును?
ఎట్లు
చిక్కును?
ఆహార
విహారములందు
గీత
అతి
తీవ్రముగా
ఖండించినది.
అది
యెవ్వరూ
గమనించుటలేదు.
దానిని
ఎవరూ
ప్రధానముగా
భావించుటలేదు.
అందువలననే
ఎక్కడ
చూచిననూ
పఠించువారే
ప్రబోధించువారే
యుండియూ
దాని
పవిత్రత
ప్రపంచమున
ఏ
మాత్రమునూ
ఆచరణ
రూపమున
కనిపించుటలేదు.
శ్లోకములు
కంఠమున
చేరుచున్నవి
కానీ,
వారి
శోకములు
కడుపును
విడిచిపోకున్నవి.
ఆహార
విహారములు
దోషరహితమైనప్పుడే
ఆనందశాంతులు
చేకూరును.
అంధకారము,
ప్రకాశము
రెండునూ
ఒకే
స్థానమున
ఉండుటకు
వీలులేదు.
అట్లు
ఉండవు.
కామునకు
రామునకు
పొత్తు
కుదరదు.
అవి
నిప్పూ,
నీరూ
సంబంధము.
ఒక
చేతిలో
భగద్విషయ
సంబంధమైన
గ్రంథము,
మరొక
చేతిలో
వేడి
వేడి
కాఫీనో,
ఛానో,
సిగరెట్
బీడీనో
లేక
నశ్యమో...
ఎదురు
తిరుగక
యేమగును?
(రియాక్షన్)
ఇంతటితో
ఆగక
‘ఏమి
తిన్ననూ,
ఎట్లు
తిన్ననూ,
ఎక్కడ
తిన్ననూ
సర్వమూ
జ్ఞానాగ్నిలో
దగ్ధమై
భస్మమైపోవును’
అని
తమ
తమ
తప్పులను
కప్పిపుచ్చుకొనును.
చేదు
పుచ్చకాయ
తీర్థయాత్రలు
చేసి
వచ్చినట్లు,
కొందరు
ప్రసంగ
ప్రబోధ
యాత్రలు
చేయుచుందురు.
ఇట్టి
వారి
మిథ్యాచారమును
చూచి
విని
మరింత
నాస్తిక
వాదన
బలపడు
కారణమగుచున్నది.
ఆహారమునే
నిగ్రహించలేని
వారు
ఇంద్రియములను
మాత్రమెట్లు
నిలుపగలరు?
ఆహారమునే
అరికట్టలేనివారు
ఇంద్రియమలను
యెట్లు
కట్టివేతురు?
దాని
పైననే
ప్రవేశ
పెట్టలేని
బలము
వీటిపై
మాత్రము
ఎట్లు
వచ్చును?
దగ్గిన
రాలిపోవు
ముక్కు
తుమ్మిన
ఉండగలదా?
ఉట్టికే
యెక్కలేని
వాని
స్థితి
స్వర్గమున
కెట్లు
ప్రాకును?
కాఫీ,
బీడీ,
నశ్యములనే
మానలేనివారు
కామ,
క్రోధ,
లోభాదులను
మానగలరా!
మాలిన్యమునే
త్యజించలేని
వాడు
మానసమును
నిగ్రహించగలడా?
కాన
మొదట
జిహ్వా
చాపల్యమును
వదలిన
గుహ్యచాపల్యము
పోవును.
కాలికీ,
కంటికీ
యెట్టి
సంబంధమో
జిహ్వాకూ,
గుహ్యమునకూ
అట్టి
సంబంధము
కలదు.
Previous
←
Divine Wealth and Demonic Wealth
Next
The Mansion of the Gītā Is the Palace of Satya and Dharma
→