Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Essence of the Gītā
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
“గీత”
యొక్క
విలువను
తెలిసికొనవలెనన్న
మొదట
గీతపై
పూజ్యబుద్ధి
కలుగవలెను.
గీతకు
బహిరంగ
పరీక్షణము,
బాహ్య
నిరీక్షణము
అత్యవసరము.
గీత
యొక్క
భావార్థము
తెలిసికొన్న,
యెంత
గాంభీర్యమో
తెలియబడును.
ఉపనిషత్తులు
గోవులుగను,
అర్జునుడు
దూడగను,
పితుకువాడు
గోపాలుడుగను,
మంచి
బుద్ధి
గలవారలు
త్రాగువారుగను,
పవిత్ర
గీతామృతమే
పాలుగనూ,
ఆహా!
ఎట్టి
అగాధ
పరిశ్రమ!
ఇట్టి
పవిత్ర
పరిశ్రమ
మహాభారత
కాలమునకు
ఈవలదని
కొందరు
నుడువుదురు.
ఇది
సమంజసము
కాదు.
గీతా
గ్రంథ
రచన
విషయము
ఎటులున్ననూ,
దీని
తత్త్వము
మాత్రము
అనాదిది.
2
▾
Meaning
Keep
ఎటులన,
నాలుగవ
అధ్యాయమైన
జ్ఞానయోగములో
మొదట
మూడు
శ్లోకముల
తాత్పర్యమున
తెలియగలదు.
కృష్ణ
పరమాత్మ
ఈ
యోగమును
మొదలు
సూర్యునికి
బోధించినట్లును,
తరువాత
మనువునకు
అందించినట్లును,
మనువు
నుండే
ఇక్ష్వాకునకు
చేరినట్లును,
ఇట్లు
పరంపరగా
ప్రాప్తించుచున్నట్లు,
తానే
తెలిపెను
కదా?
కాన
ఇది
అనాది
గీత.
నేటిది,
ఆనాటిది
కాదని
గ్రహించవలెను.
గీత,
సాధనా
ప్రధాన
గ్రంథము.
సాధనను
పట్టుకొన్న
వాడు
తప్పని
సరిగా
సిద్ధిని
పొందును.
సాధనలందు
ఆగ్రహముండ
తగదు;
దురాగ్రహముండరాదు.
పట్టుదల
అత్యవసరము.
అయితే
మొండిపట్టుదల
పనికిరాదు.
గీతలో
ప్రతి
అధ్యాయమునను
సిద్ధియును
తోడ్తోడ
సాధనలును
చెప్పబడినవి.
3
▾
Meaning
Keep
మనుష్యుని
కల్పిత
బంధనల
నుండి
తప్పించి,
ముక్తిని
అందించి,
పూర్వపు
స్వతంత్రతకు,
ప్రసన్నతా
స్థితికి,
కొంపోవుటకు
గీతా
సందేశమను
నావ,
నరునకు
ఆధారమై
నిలచినది.
జనన
మరణ
చక్రానికి
మూలకారణమైన
వాసనాదుల
నుండి
కలుషితం
కాని
కార్యక్రమమును,
కర్మనూ
మానవునకు
గీత
బోధించుచున్నది.
అసలు
మానవుడు
ఈ
కర్మ
క్షేత్రమున
కాయమును
ధరించినది
కర్మాచరణ
కొరకే.
కర్మఫలము
కొరకు
కాదని
గీత
పదే
పదే
నిష్కామకర్మను
బోధించుచున్నది.
4
▾
Meaning
Keep
వాసనలే
కర్మల
యెడల,
ఫలముల
యెడల
ఆసక్తిని
కలిగించును.
కనుక
మొదలు
వాసనలను
నిర్మూలము
చేసికొనుటకు
గీతా
ప్రబోధము
మూలాధారమైయున్నది.
సమస్త
వేదార్థసార
సంగ్రహమే
గీత.
పూర్వభాగమున
ప్రతిపాదించు
బహిరంగ
కర్మలగు
యజ్ఞ
యాగాదులను,
మానసిక
కర్మలగు
ఉపాసనలను
వివరించుచు,
సాధ్యమగు
జ్ఞాన
యోగమును
కూడా
ప్రతిపాదించినది.
వ్యక్తి
ఎంతటి
వాడైననూ,
ఎంత
విద్యావంతుడైననూ
భ్రాంతి
కలిగెనేని
దాని
వల్లనైన
దుఃఖము
అతని
ప్రవృత్తిని
ప్రతిబంధించి
తీరును.
మహావీరుడైన,
త్యాగియైన,
జ్ఞానియైన
అర్జునునికి
యుద్ధరూపమైన
మోహంచేత,
ఆ
మోహం
నిమిత్తంగా
గల
శోకం
చేతనూ
అతని
ప్రవృత్తి
ప్రతిబంధకమైనది.
అందు
దేహాత్మల
యొక్క
అవివేకము
వలన,
సమస్త
సంసార
ధర్మాలతో
ఈషణ్మాత్రమైన
సంబంధము
లేని
ఆత్మయందు,
మిథ్యాభూతమైన
సంసారము
యొక్క
సత్యత్వం,
ఆత్మ
ధర్మత్వం
మొదలగు
వాని
జ్ఞానరూపమైనది.
మొదట
మోహము.
ఇది
కేవలము
అర్జునునికి
మాత్రమే
కాదు
మానవ
కోటికందరికినీ
కలదు.
కనుక
సర్వప్రాణికి
సాధారణమైనది.
గీత
అనునది
సంసార
సాగరము
దాటుటకు
‘ఈత’యని
తలంచవలెను.
భౌతిక
ప్రకృతియందు
కల్పిత
నదులను
దాటుటకు
కాయమునకు
ఈత
యెట్టి
ఆధారమైనదో,
మానసిక
సంసార
సాగరమును
దాటుటకు
గీత
అంత
ఆధారమైనది.
5
▾
Meaning
Keep
అట్టి
పవిత్ర
గీత
సాక్షాత్
కృష్ణపరమాత్మ
ముఖారవిందము
నుండి
ఆవిర్భవించినది.
లేకున్న
అనేక
కోట్లమంది
దీనిని
శరణుజొచ్చెడివారు
కారు.
గీత
యొక్క
ఉపక్రమోపసంహారములందు
ఏ
విషయమును
గూర్చి
ప్రబోధము
చేయబడునో
అది
శాస్త్రము
యొక్క
ముఖ్యవిషయమై
యుండవలయును.
భగవద్గీత
ప్రథమాధ్యాయమున
ప్రథమ
శ్లోకమున
“ధర్మ
క్షేత్రే
కురుక్షేత్రే...”
అను
వాక్యము
కానవచ్చును.
ఇందులో
ధర్మ
శబ్దము
ప్రప్రథమమున
ప్రయోగింపబడినది.
గీత
యొక్క
పదునెనిమిదవ
అధ్యాయమున
చిట్టచివర
“యత్ర
యోగేశ్వరః
కృష్ణో...”
అను
శ్లోకమున
ఇదే
ధర్మ
శబ్దము
క్లుప్తముగా
బోధింపబడినది.
కావున
గీతాభిప్రాయము
“ధర్మమును
స్మరింపుడు,
ధర్మమును
ఆచరింపుడు”
అనునదే
స్పష్టమగుచున్నది.
“ధర్మ”
శబ్దమెంత
గంభీరమైనదో
చూడుడు.
6
▾
Meaning
Keep
వేయేల?
సకల
శాస్త్రములు
‘ధర్మ
స్వరూప
స్వభావా’దులను
నిర్ణయించుటయే
ప్రధానోద్దేశ్యము.
సకల
ధర్మములు
గీతయందిమిడి
యున్నవి.
దీనిలో
తత్వార్థము
బాగుగా
వివేచింపబడినది.
అర్జునుడు
‘జీవుడు’,
రథము
‘శరీరమే’,
ప్రబోధకుడు
కృష్ణుడు.
“ధియో
యోనః
ప్రచోదయాత్”
అను
గాయత్రీ
మంత్రమున
జెప్పబడిన
ప్రేరక
“బ్రహ్మయే”
కృష్ణపరమాత్మ;
“సారథి”.
కౌరవులు
అసుర
సంపత్తి
కలవారు.
పాండవులు
దైవ
సంపత్తి
కలవారు.
ఈ
సద
సద్గుణములకెల్లప్పూడా
ఘర్షణము
జరుగుచునే
యుండును.
అపుడు
ఆత్మ
స్వరూపుడగు
కృష్ణుడు
ధర్మపక్షమునే
వహించును.
కనుక,
కృష్ణుడు
మన
పక్షమున
కావలెనన్న
‘దైవీసంపత్తిని’
కలిగియుండవలెను.
ధర్మమెచ్చట
ఉండునో
భగవంతుడచ్చటనే
యుండును.
7
▾
Meaning
Keep
ఇందు
మూలమున
భగవంతుడు
సర్వవ్యాపి
కాదనరాదు.
పాలయందున్న
వెన్న
సర్వవ్యాపి
అయినప్పటికినీ
ఎప్పుడు
వాటిని
పెరుగుగా
తయారుచేసి
మధింతురో
అప్పుడు
సాక్షాత్
స్వరూపమున
ఒక
స్థానమున
కనుపించునటులనే,
ధర్మమును
పరిపక్వ
స్థానమున
పరమాత్ముడు
సాక్షాత్
స్వరూపమును
ధరించును.
“యతో
ధర్మస్తతో
జయః”
ధర్మమెచ్చటనున్నదో
జయము
అచ్చట
తప్పదు.
8
▾
Meaning
Keep
అర్జునుని
దృష్టి
కేవలము
దేహములపైన
ఉండుటచే,
“ఆత్మదృష్టి”ని
అనుగ్రహించుటకు
దేహ,
ఆత్మలను
విడదీయుటయే
సమస్త
సాధనల
యొక్క
లక్ష్యము.
దీనిని
బోధించు
నిమిత్తమే,
దీనిని
బోధించు
విషయమే
కృష్ణ
బోధ.
అర్జునుడు
సందేహముల
సూచించకున్ననూ
తానే
ఆ
సందేహములనుటంకించి
సమాధానమును
చెప్పెను.
“అర్జునా!
నీవూ,
నీకు
సంబంధించిన
బంధురాజులూ,
నీ
మూలమున
చచ్చెదరని
దుఃఖించుచుంటివి.
ధర్మములను
వల్లించితివి
కానీ,
పండితులు
చచ్చినవారి
కొరకును
బ్రతికినవారి
కొరకును
దుఃఖించరు.
ఏల
దుఃఖింపరందువా?
నీవు
దుఃఖించునది
దేహముల
కొరకు
కదా!
ఇదివరకటి
పూర్వము
దేహమునకు
జరిగిన
అవస్థలకు
(మార్పులకు)
దుఃఖించితివా?
శిశుత్వము
నుండి
బాల్యత్వము,
బాల్యత్వము
నుండి
కౌమారము,
కౌమారము
నుండి
యౌవనము,
యౌవనము
నుండి
వృద్ధాప్యము,
తరువాత
మరణావస్థ.
మరణము
కూడ
పై
అవస్థలలో
ఒక్కటి
కదా?
పై
నాలుగవస్థలకు
నీవేమాత్రము
దుఃఖించితివి,
ఈ
మరణావస్థకు
దుఃఖించుటకు?
ఏదీ
నీ
బాల్యమున
నీ
సోదరులతో
ఆటలాడిన
దేహము?
లేదు
కదా!
ఆనాడు
ధృష్టద్యుమ్నుని
కట్టి
తెచ్చిన
బాల్య
దేహము
నేడున్నదా?
కాని
ఆ
విషయము
నేటికి
కూడనూ
నీకు
జ్ఞాపకమున్నది
కదా?
అటులనే
నీ
దేహావస్థలు
మార్పులు
కలిగిననూ
“ఆత్మ”యైన
ప్రజ్ఞానము
ఏనాటికీ
అమృత
స్వరూపమును
కలిగి
యుండును.
ఇదే
జ్ఞానుల
లక్షణము.”
9
▾
Meaning
Keep
“పోనీ,
ఇన్ని
దినములూ
కలిసి
మెలిసి
యుండు
దేహములు
కనబడకపోయిన
దుఃఖము
రాదా,
అని
అందువా?
అట్లు
దుఃఖించుటకు
పూనుకొనిన
ఎందరికని
దుఃఖింతువు?
సుఖదుఃఖములు
రాత్రింపగలు
వంటివి.
వాటిని
నిబ్బరించుకొనవలెను
కాని,
అవి
వలదన్న
పోవు,
రమ్మన్న
రావు.
ఈ
సుఖదుఃఖములు
దేహాభిమానులకు
సంబంధించినవి,
ఆత్మకు
లేవు.
వీని
బాధల
నుండి
తప్పించుకొనినవాడే
మోక్షమున
కర్హుడు”
అని
తెల్పెను.
ఇట్టి
బోధనలు
సలిపిన
మొదటి
అధ్యాయము
పేరు
“అర్జున
విషాద
యోగము.”
భగవద్గీతా
భవనమునకు
ఈ
అధ్యాయము
పునాది
లాంటిది.
పునాది
భద్రముగా
ఉండిననే
భవనమూ
భద్రత
వహిస్తుంది.
ఐదు
వేల
సంవత్సరములకు
పూర్వము
జరిగిన
ఈ
గీతా
భవనము
నేటికినీ
చెక్కుచెదరక
ఉన్నదంటే
ఆ
పునాది
యెంత
భద్రమైనదో,
దానిని
వేసిన
నిపుణుడు
ఎట్టివాడో,
ఎవరికి
వారే
యోచించవచ్చును.
10
▾
Meaning
Keep
కల్ల
కపటము
లేని
అర్జునునిలాగా
నిజాయితీతనంతో,
నిశ్చల
స్వభావముతో
భగవంతుని
శరణుబొందేందుకు
దారిజూపే
విషాదం
కూడా
ఒక
ఉపకారమే.
అదియూ
ఒక
యోగమే.
విషాద
యోగంతో
ప్రారంభమైన
గీత
‘సన్యాస
యోగము’తో
ముగిసింది.
గీతా
భవనమునకు
‘విషాద
యోగము’
పునాది
అయిన
‘సన్యాస
యోగము’
దీని
కట్టడముగా
తయారయినది.
“విషాద
యోగము”
గీతా
వృక్షమునకు
బీజమయిన,
“సన్యాస
యోగము”
ఆ
వృక్షము
యొక్క
ఫలముగా
అయినది.
ఇందులో
“అర్జునుడు
నిర్మల
స్వభావుడెట్లు?”
అని
కూడా
పాఠకులు
శంకించవచ్చును.
అసలు
అర్జునుడనగా
నిర్మల
స్వభావుడని
పేరు.
ఆ
పేరునందే
కలదు.
సార్థక
నాముడు
కనుక
నామార్థమే
స్వభావము.
స్వభావమూ,
నామమూ
ఏక
స్వరూపమును
ధరించినవాడే
అర్జునుడు.
అట్టి
నిర్మలుడు
కనుకనే
“కృష్ణ
పరమాత్మ”
సన్నిహితుడు
కాగలిగెను.
పరమాత్మ
అనుగ్రహమునకు
పాత్రుడు
కాగలిగెను.
నిమిత్తునిగా
నిలచి
లోకమున
కింతటి
అమృతమును
పంచగలిగెను.
11
▾
Meaning
Keep
గీతలో
కృష్ణపరమాత్మ
పలుమారులు
‘యోగమ’నే
పదమును
ఉపయోగించినప్పటికినీ,
‘యోగావస్థ’
లేక
‘సంయోగము’లో
జీవుని
పరిస్థితిని
వర్ణించి
చెప్పినప్పటికినీ,
సామాన్య
మానవులు
అర్థము
చేసుకొనిన
“యోగ”
పద
అర్థమునకునూ,
భగవానునిచే
చెప్పబడిన
“యోగ”
పద
అర్థమునకునూ
పూర్ణ
సంభావ్యము
కలదని,
గీతను
జాగ్రత్తగా
చదివిన
వారల
మనస్సులలో
ఒక
విధమైన
సందేహము
ఉదయించవచ్చు.
కృష్ణుడు
కొన్ని
వేళల్లో
వైరాగ్యాన్ని
శ్లాఘించినాడు,
మరియు
అత్యున్నత
స్వాతంత్ర్యము,
పురుష
భేదము
లేని
దైవార్చన
వలననే
సంఘటితమని
సూచించినాడు.
12
▾
Meaning
Keep
భక్తి
వలన
సర్వోత్కృష్టమైన
స్థితిని
పొందుటకు
అనేక
మార్గములు
అర్జునునికి
విశదీకరించి
చెప్పెను.
అష్టమాధ్యాయమున
“రాజ
యోగము”ను
గూర్చి
ఒక
సంగ్రహ
వర్ణన
కలదు.
కాని
గీత
అంతయూ
రాజయోగముపై
నొక
గ్రంథమని
చెప్పబడజాలదు.
సమత్వము,
ప్రత్యేకత,
కర్మఫల
పరిత్యాగము,
శ్రీ
కృష్ణునికై
పూర్ణాత్మార్పణ,
ప్రకృతి
యొక్క
ప్రధాన
త్రివిధ
దాస్యముల
నుండి
విముక్తి,
సకార్య
నియమానుసరణ,
ఇవి
గీత
యొక్క
ప్రధాన
సత్యములు.
భగవానులు
వీటిని
అత్యుత్కృష్టమైన
విద్యలని,
అత్యంతాంతరంగిక
రహస్యములని
చెప్పెను.
గీత
విశ్వసమ్మత
వేదమగునని
మన
భారతీయుల
విశ్వాసము.
కాని,
గీత
యొక్క
నిజమైన
అర్థము
అందరి
చేతను
గ్రహించబడలేదు.
ప్రసిద్ధ
విద్వాంసులు,
అతి
నిశిత
బుద్ధిగల
లేఖకులు,
తీక్షణమైన
మనస్సుతో
కూడా
గీత
యొక్క
గూఢతాత్పర్యమును
చేపట్టలేకపోయిరి.
ఒక
వైపు
వ్యాఖ్యాన
కర్తలు,
గీతలోని
ఏక
స్థిత్యాంశమును,
వైరాగ్యముల
ఘనతను,
స్వాతంత్ర్యమునందు
ఇష్టముతో
చూపెట్టిరి.
మరియొక
వైపు
పాశ్చాత్య
వేదాంతమునందలి
నైపుణ్యతకు
సమకట్టి
యువ
మనస్సులకు
ప్రబోధించనారంభించిరి.
వైరాగ్యము
నిస్సంశయముగా
ఉత్కృష్ట
ధర్మమే
కాని
చాల
తక్కువమంది
దానిని
పాటించగలరు.
ఒక
మతము
విశ్వ
సమ్మతము
పొందవలెనంటే
ప్రతి
ఒక్కరు
తన
జీవితములోను,
తన
స్వకర్మ
విధానములోను,
సాక్షాత్తుగా
అనుభవించి
తెలిసికొన
గలిగేటటువంటి
వేద
విహిత,
శాస్త్ర
సమ్మతమైన
ఆదర్శములను
నియమములను
కల్గియుండవలెను.
13
▾
Meaning
Keep
“స్వధర్మము”ను
శౌర్యవంతముగా
నిర్వర్తించుటయనునది
సర్వోన్నత
ధర్మమేగాని,
“విధి”
అనగా
నేమి?
ఈ
సందిగ్ధ
సమస్యా
సంబంధమైన
మతమునకు,
నైతిక
విధానమునకు
మధ్య
అటువంటి
వివాదమొకటి
కలదు.
“గహనా
కర్మణో
గతిః”
కార్య
విధానము
సాంద్రమైనది,
క్లిష్టమైనది
అని
భగవానుని
వాచ.
ఏది
విధియో,
ఏది
కాదో,
ఏది
కర్మమో,
ఏది
కర్మము
కాదో
నిర్ణయించుటకు
మేధావులు
కలవరపడిరి,
పడుచున్నారు.
“కానీ
మీకు
ఆచరణయోగ్యమైన
మార్గమును
గుర్తించుటకు
ఎటువంటి
కష్టములూ
లేనటువంటి
జ్ఞానమును
నేను
తెలిపెదన”నెను.
ఆ
పరమ
రహస్యమూ,
పరమశ్రేష్టమూ
అయిన
పదమిది.
14
▾
Meaning
Keep
“మన్మనా
భవ
మద్భక్తో
మద్యాజీ
మాం
నమస్కరు
మామేవైష్యసి
సత్యంతే
ప్రతిజానే
ప్రియోఽసి
మే
॥
”
15
▾
Meaning
Keep
“సర్వధర్మాన్
పరిత్యజ్య
మామేకం
శరణం
వ్రజ
అహం
త్వా
సర్వ
పాపేభ్యో
మోక్ష
యిష్యామి
మా
శుచః
॥
”
(మోక్ష
సన్యాస
యోగము
65
&
66
శ్లోకములు)
16
▾
Meaning
Keep
తాత్పర్యము
–
కమ్ము,
మన్మనస్కుడవు,
మత్ప్రియుడవు,
మదారాధకుడవు.
కమ్ము,
నా
కొరకొక
త్యాగివి.
నాకు
నమస్కరించు.
నీవు
నా
దగ్గరకే
వచ్చెదవు.
ఇదే
నీకు
నా
బోధన,
నా
వాగ్దానము.
నీవు
నాకు
ప్రియుడవు.
త్యజించి
సర్వ
ధర్మములను
పొందుము.
నాతోనే
శరణ్యం.
దుఃఖించకు,
సర్వ
పాపముల
నుండీ,
కీడుల
నుండీ
నిన్ను
విముక్తుని
చేతును.
17
▾
Meaning
Keep
ఆహా!
సూక్ష్మముగా
ఈ
పై
రెండు
శ్లోకముల
భావము
“ఆత్మార్పణ”.
ఇది
చాలదా
తరించుటకు,
స్వామిని
రమించుటకు,
ముక్తిని
పొందుటకు?
“తన్మన”
అనగా
అతనిని
ప్రతి
జాతియందును
చూచుట,
అతనిని
సర్వదా
జ్ఞప్తియందుంచుకొనుట,
ఎరుకతో
నుండుట,
ఆనందములో
నుండుట.
“తద్భక్త”
అతనితో
అఖండమైన
భక్తి
ప్రేమలపై
నిర్మింపబడిన
ఏకత్వమును
విశదీకరించుట.
“తద్యాజి”
పెద్ద,
చిన్న
అన్ని
విధములైన
పనులనూ
పరమాత్మపై
అనగా,
“కృష్ణుని”పై
పరిత్యాగమువలె
అర్పణ
చేయుట,
ఆ
ఆనందమునకై
అహమును
కర్మ
ఫలమును
త్యజించి
ఎల్లవేళలలో
సత్యక్రమమైన
కర్మలలో
మునిగియుండుట
అని
తెలిపెను.
పరిపూర్ణార్పణము
చేయుటయనునది
మానవునకు
కష్టమైన
పనే.
కానీ
అతను
లేశమాత్రమైననూ
ప్రయత్నించినచో
భగవానుడే
అతనికి
తగిన
సర్వమును
విజయ
నిశ్చయమును
సూచించగలడు,
ప్రసాదించగలడు.
ప్రక్కతోడై
గురుడు,
రక్షకుడు,
స్నేహితుడు
కాగలడు.
“స్వల్పమప్యస్య
ధర్మస్య
త్రాయతే
మహతో
భయాత్”;
“ఈ
ధర్మములో
స్వల్ప
మాత్రమైననూ
సరే
మానవుని
మహా
భయము
నుండి
తొలగించును”.
ధర్మమును
ఆచరించుట
ఆనందకరమని,
సులభమని
కూడనూ
కృష్ణపరమాత్మ
తెలిపెను.
“మామేవైష్యసి”
(నా
దగ్గరకే
నీవు
వత్తువు)
అనగా
అతడు
నన్ను
తెలిసికొనును,
నా
లోనికి
వచ్చును,
నా
ప్రకృతిని
పొందును.
ఈ
పదములందు
“సాదృశ్యము”
భగవత్ప్రకృతి,
“సాలోక్య”
భగవానునితో
నివాసము,
“సాయుజ్యము”
భగవంతునితో
ఐక్యత
అనుభవములు
వివరించెను.
ఈ
పవిత్ర
గీత
దేవునిలో
నివసించుటను
వివరించెను.
18
▾
Meaning
Keep
ఇన్ని
జీవులలోను
దైవానుభవము
శాశ్వతమైనపుడు,
జ్ఞానేంద్రియములు
అతనిచే
చూడగలిగినపుడు,
వినగలిగినపుడు,
రుచి
తెలిసికొనగలిగినపుడు,
తాక
గలిగినపుడు,
ఆఘ్రాణించగలిగినప్పుడు
అతనిలో
ఒక
భాగమువలే
జీవుడు
ఈ
దేహమునందు
నివసించ
గలిగియున్నప్పుడు,
ఈ
దేహమునందే
దైవైక్యత
సాధించబడగలుగుటలో
సందేహమెందులకు?
ఈ
ధర్మము
యొక్క
లేశ
మాత్రాభ్యాసమైననూ
అభినవ
శక్తిని,
నిర్మలానందమును,
పూర్ణసౌఖ్యమును,
పవిత్రతను
ప్రసాదించును.
ఈ
“ధర్మము”
అసాధరణ
గుణములు
గల
వ్యక్తుల
కోసమని
సృజింపబడలేదు.
మానవకోటికి,
వివేకము
కలిగిన
ప్రతి
మానవునకూ,
భగవత్
రతిగల
ప్రతి
వ్యక్తికీ
ఈ
ధర్మ
సంబంధముతో
అతనిని
చేరగలడని
భగవానుని
వాచ.
మహా
పాపాత్ముడైననూ
సరే,
పరమాత్ముని
హృదయపూర్వక
పరితాపముతో
శరణు
పొందినచో
శీఘ్రముగా
పరిశుద్ధుడగును.
అందుచేత
ప్రతి
ఒక్కరూ
వారి
వారి
స్వధర్మమును
ఆచరించుటయే
జగన్నాధుని
ఆజ్ఞ.
వారి
వారి
దేశ
నాగరికతకు
పునాదియైన
ఆధ్యాత్మిక
తత్త్వమును
ఆశ్రయించి,
భౌతిక
దృక్పథమును
పారద్రోలి
భారతదేశమున
జనించినందుకు
భారత
నాయకుడైన
గోపాలుని
పలుకులు
గ్రోలినవారై,
ప్రతి
క్రియయందును,
ప్రతి
మాటయందును,
ప్రతి
వ్రాతయందును,
ప్రతి
భావమందును,
ప్రతి
కోరికయందును,
కడకు,
ఆరోగ్య
ఆహారములనందును,
దైవత్వము
తాండవింపజేయవలసియున్నది.
అప్పుడే
మన
భారత
జాతి
తమ
సనాతన
ధర్మస్వరూపమును
ప్రపంచమునకు
చూపి,
శాంతి
దూతయై
మానవజాతి
కంతకూ
వెలుగుజూప
గలదు.
సనాతన
ధర్మ
కర్మలే
(ఆధ్యాత్మిక
తత్త్వము)
చేబూనిన
ఎట్టి
క్లిష్ట
పరిస్థితులను
ఎదుర్కొనగల
“ఆత్మబలము”
చేకూరును.
అట్టి
ఫలమును
ప్రసాదించునదే
ఈ
పవిత్ర
గీత.
Next
The Vṛtti of Śaraṇāgati
→