Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Vṛtti of Śaraṇāgati
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
భగవద్గీత
యొక్క
మొదటి
అధ్యాయమును
“కృష్ణ
గీత”నుట
కంటే
“అర్జున
గీత”నుటలో
అందమున్నది.
శోక,
మోహా
వివశుడగు
అర్జునుడు,
అస్త్ర
శస్త్రములను
వదిలి
యుద్ధమునకు
విముఖుడై
రథముపై
కూర్చుని
రెండు
సేనల
మధ్య
నిలచి
అటు
ఇటు
రెండువైపుల
తెరపారచూచి,
తనవారలైన
వారినందిరినీ
పరికించి
మిక్కుటమగు
కనికరము
తన్నావేశింప
దుఃఖించుచూ
గాండీవము
చేతి
నుండి
జారవిడుచుచు,
నిలుచుటకు
త్రాణలేక,
మనస్సు
కలవరపడుచు,
పూర్వ
మీమాంసా
శాస్త్ర
సంబంధములైన
ధర్మకర్మాదులను
వివరించుచూ,
యుద్ధము
చేయనని
మిన్నకుండగా,
ఈ
వార్త
అంధరాజైన
ధృతరాష్ట్రునకు
సంజయుడు
తెలుపగానే
ఆ
అజ్ఞాన
రాజు
కొంత
సంతసించినాడు.
ఆశను
రేకెత్తించే
యుద్ధము
యొక్క
బాధ
తీరిందని
అనుకున్నాడు.
పాపము,
దూర
దృష్టి,
దివ్య
దృష్టి
లేని
ధృతరాష్ట్రుడు,
ఏ
శ్రమయు
లేకనే
కావలసిన
కార్యము
నెరవేరిందని
సంతసించినాడు.
2
▾
Meaning
Keep
కాని,
దివ్యదృష్టి
గల
సంజయుడు,
“పిచ్చి
రాజా,
ఏమి
నీకీ
వెర్రి
ఆనందము?
పరమాత్ముడే
పాండవుల
పక్షమువాడై
యుండగా
వీరి
ఆశలు
ఇంతటితోనే
ఫలించునా?”
అని
తనలో
తాను
తలంచి,
అర్జునుని
యుద్ధము
వలన
ముందు
రానున్న
భయానక
చిత్రాన్ని
తన
భావములో
చింతించుకున్నాడు.
కృపావేశంతో
అర్జునుని
గ్రుడ్లలో
నీరు
తిరిగింది.
చూపులు
సుడిగుండమున
పడినవి.
కనీ
వినీ
యెరుగని
దీన
పరిస్థితికి
తిరిగినాడు.
ఇట్టి
దృశ్యమును
చూచి
పరమాత్ముడైన
కృష్ణుడు
తాళలేకపోయినాడు.
మాటాడకుండా
ఉండలేకపోయినాడు.
అర్జునునికి
ఈ
రోగమునకు
కారణమేమని
చక్కగా
నాడిపట్టి
చూచినాడు.
ఈ
మోహవ్యాధి
స్థూల,
సూక్ష్మ,
కారణదేహముల
వరకూ
వ్యాపించినదని
కృష్ణపరమాత్మ
నిమిషములో
తెలుసుకున్నాడు.
అయితే
అర్జునునకు
ఆవేశించిన,
ప్రవేశించిన
“కృప”
నిజమైనది
కాదనియు,
(అట్లు
నిజమైనదే
అయి
ఉండిన
అది
దైవీ
సంపదకు
చేరియుందును)
అట్టిది
భగవంతుని
తిరస్కరించియుండెడిది
కాదని,
“కృప”
అను
బురఖాను
వేసుకొనివచ్చిన
“మమకార”మని
గ్రహించి
కృష్ణపరమాత్మ
దానిని
తిరస్కరించుటకు
పూనుకొనెను.
తరువాత
“కృపయా
విష్టం”
కృపచేత
ఆవేశింపబడినవాడంటూ
పదప్రయోగము
జరిగినది.
3
▾
Meaning
Keep
మనుష్యునకు
భూతప్రేతములు
ప్రవేశించినటుల
అర్జునునకు
“కృప
అనే
పిశాచము”
ఆవేశించినది.
కృష్ణపరమాత్మ
చెంతనే
యున్నాడు
కనుక
భయపడనక్కరలేదు.
సర్వ
భూతములకు
ప్రభువయిన
వాని
చెంత
ఏ
భూతములేమి
చేయగలవు?
“వైద్యోనారాయణో
హరిః”
అన్నట్లు,
అర్జునునకు
కృష్ణ
పరమాత్మయే
వైద్యుడయినాడు.
అర్జునుడెంతటి
అదృష్టవంతుడు!
దుఃఖమునందునూ
సరియైన
దుఃఖము
మంచి
ప్రాప్తినే
చేకూర్చును.
అర్జునుడు
దీనత్వము,
దుఃఖము
వలన
రెండవ
అధ్యాయములో
పదకొండవ
శ్లోకము
వరకూ
పిశాచి
పీడలో
పిరికివాడై
విలపించినాడు.
కనుక
రెండవ
అధ్యాయము
సాంఖ్యయోగమున
పదవ
శ్లోకము
వరకూ
“అర్జున
గీత”
అనియే
చెప్పవచ్చును.
పదకొండవ
శ్లోకము
నుండి
కృష్ణపరమాత్మ
యొక్క
అమృతోపదేశము
ప్రారంభమగును.
అక్కడి
నుండే
“భగవత్
గీత”
ప్రారంభము.
మొదటి
అధ్యాయమున
అర్జునునకు
పట్టిన
తమోగుణ
స్థితికి
పరాకాష్ట.
ఈ
తమోగుణ
స్వరూప
చర్యలను
సంజయుడు
ధృతరాష్ట్రునికి
తెలుపుచుండును.
ఈ
అధ్యాయమున
కృష్ణపరమాత్మ
యేమాత్రము
జోక్యము
కలిగించుకొనలేదు.
అన్నింటికీ
సాక్షీభూతునిగా
చూచుచుండెను.
ఎపుడు
అర్జునుడు,
నేనిక
యుద్ధము
చేయనని,
నా
చిత్తమందలి
ధర్మాధర్మ
వివేకము
నష్ట
భ్రష్టమై
పోయినదనియు,
నాకేమి
తోచుటలేదనియు
నాకు
ఏది
మేలో
నీవే
చెప్పమనియూ,
యుద్ధంమాని
కూర్చున్న
సమయమున
కృష్ణపరమాత్మ
ముందుకు
వచ్చి,
“అర్జునా!
స్వచ్ఛ
స్వభావము
కల
నీకు
ఈనాడు
ఇట్టి
సమయమున
ఈ
దరిద్రపు
పిరికితనము
ఎచ్చట
నుండి
వచ్చినది?
ఇది
నీకు
తగినది
కాదు”
అనిరి.
4
▾
Meaning
Keep
“అర్జునుడనగా
స్వచ్ఛమైన
స్వభావము
కలవాడని
కదా,
సమయ
సందర్భములను
యోచించక
ఈ
ఏడుపు
ఏమిటి?
యుద్ధమా
కుత్తుకపై
కూర్చున్నది,
యుద్ధమేఘములు
దట్టమైన
స్వరూపమును
ధరించి
ప్రతిధ్వనించుచు
చుట్టుముట్టుచున్నవి.
ఎదుట
నిలచిన
శత్రువులా,
ఎప్పూడా
అని
ఉర్రూతలూగుచున్నారు.
వారు
ఇంతవరకూ
మీపై
చూపిన
అన్యాయ,
అక్రమ,
అనాచారములా
లెక్కలేనన్ని.
అంతమాత్రముతో
పోక
ధర్మరీతిగా
మీకు
రావలసిన
రాజ్యమును
కూడా
మ్రింగివేయుటకు
సిద్ధముగానున్నారు.”
5
▾
Meaning
Keep
“ఇంతవరకూ
మీరు
సత్యనిష్ఠకు
వైదొలగక
అనేక
కష్టాలపాలైతిరి.
వారిచ్చిన
నీమములు,
సమయములు
కూడనూ
గడిపితిరి.
కడకు
రాజీ
ప్రయత్నములా
వేరుగా
చెప్పనక్కరలేదు.
ఎంత
వరకూ
చూడవలెనో
అంతవరకూ
చూచితిమి.
అన్నియూ
నిష్ఫలమాయెను.
ఆ
దుర్మార్గ,
దురంహకార,
దురాచార
శీలుడైన
దుర్యోధనుని
కన్నులు
తెరిపించవలెనన్న
ఒక్క
యుద్ధము
తప్ప
వేరు
మార్గము
లేదు.
ఇది
నేటి
సంకల్పము
కాదు.
దీనికి
పూర్వము
పెద్దలు
అందరూ
చేరి
అన్ని
విషయములూ
యోచించి,
యుద్ధమనివార్యమని
నిర్ణయించిరి.
మీ
సోదరులును,
నీవును
అందులకు
సమ్మతించి,
మంచిదని
ఒప్పూకొంటిరి.
ఆనాటి
నుండి
యుద్ధమునకు
తగిన
ప్రయత్నములన్నియూ
జరుపుచునే
ఉన్నారు.
నీవునూ
అందులోనే
మునిగి
యుంటివి.
యుద్ధమునకు
ఈనాడు
సిద్ధమయి
వెనుకంజ
వేయుటకు
ఏమిటి
ఈ
పిరికితనము?
ఈ
యుద్ధము
హఠాత్తుగా
వచ్చిపడినది
కాదే!
కావలసిన
సామాగ్రి
ఎంతో
కాలము
నుండి
సేకరించితివే!
ఆనాడు
కాయలు,
కసురులు
తిని
కైలాసనాథుని
మెప్పించి
పాశుపతాస్త్రాన్ని
సంపాదించితివి.
దేవేంద్రలోకమునకు
పోయి
వారి
మెప్పుల
కుప్పవై
దివ్యాస్త్రములను
ఆర్జింతివి.
అరణ్యవాసం
గడచింది.
అజ్ఞాతవాసం
నడిచింది.
కౌరవుల
పాపం
పండినదని
తలంచితివి.
మీ
దుర్దశనిశకు
ప్రభాత
భేరి
మ్రోగింది.
ఇప్పూడేమిటి
నీకీ
దుర్దశ
పట్టినది?
ఈ
దౌర్భాగ్యము
ఏ
శాస్త్ర
నీతి?
నీదియా
ధర్మప్రాణమైన
క్షత్రియ
జాతి.
శౌర్య,
ధైర్య,
పరాక్రమ
బలములు
కలిగియూ
ఈ
దిక్కుమాలిన
వైరాగ్యము
ఏ
వైపునుండి
వచ్చినది?
బావా!
ఈ
పిరికి
ప్రవర్తన
నీకే
కాక
నీ
పూర్వీకులైన
ఆర్యపురుషులందరికీ
తీరని
తలవంపులు.
ఛీ!
చాలు!
చాలు!
సిగ్గులేని
ఈ
పిరికితనము
క్షత్రియులందరికీ
కళంకము.
క్షత్రియునకు
యుద్ధము
రాజబాట.
అసలు
క్షత్రియజాతికిది
స్వర్గమార్గము.
ఈ
సమయమున
యుద్ధమే
వద్దనిన
అపకీర్తుల
పాలగుదువు.
స్వార్జితమైన
ఆస్తి
నీకు
“విజయుడ”ను
బిరుదు.
యావజ్జీవిత
మంతయూ
ధారపోసి
సంపాదించిన
ఆ
కీర్తిని
మట్టిపాలు
చేతువా?
క్షుద్రమైన
ఆ
మోహ
మలమును
పరత్యజించుకో
బావా!
నా
మాట
విను.
గడచిన
అమరావతి
సంఘటనను
జ్ఞాపకము
చేసుకో.”
6
▾
Meaning
Keep
ఊర్వశి
తనకుతానై
వలచిరాగా
వలదని
తిరస్కరించితివి.
నీ
వలన
నాకు
పుత్రప్రాప్తిని
చేకూర్చమని
అడుగగా,
నన్నే
పుత్రునిగా
భావించమని
కోరితివి.
అట్టి
అనన్య
మహామహిమునివి,
జితేంద్రియునివి.
ఆ
సమయమున
ఊర్వశి
తన
పాచిక
చెల్లక
విఫల
మనోరథురాలై,
నపుంసకునివి
కమ్మనమని
ఇచ్చిన
శాపమే
కదా,
విరాట
నగరమున
తీరినది.
అట్టి
ధీరత్వమెక్కడకు
పోయెను?
ఈ
దీనత్వమెక్కడ
నుండి
వచ్చెను?
ఛా!
ఇట్టి
పిరికిపందవు,
అర్ధరాత్రిలో
పరుగెత్తివచ్చి
నిద్రపోవుచున్న
నన్ను
యుద్ధమున
సహాయమునకు
రమ్మనమని
లేపుకొని
వచ్చినది
ఈ
పిరికి
ప్రతాపమును
చూపుటకా?
చాలు
చాలు.
ఈ
దౌర్భాగ్యపు
మోహమును
నిర్మూలము
చేయి.
దౌర్బల్యమును
మంటకలుపు.
బలమును
వహించుము,”
అనెను.
7
▾
Meaning
Keep
ఈ
సమయమున
కృష్ణపరమాత్మ
నాల్గు
పదములు
ఉపయోగించెను.
1.
కశ్మలమని,
2.
అనార్యజుష్టమని,
3.
అస్వర్గ్యమని,
4.
అకీర్తికరమని.
ఇందులో
“కశ్మలమ”నగా
అజ్ఞానమనియు,
“అనార్యజుష్టమ”నగా
ఈశ్వర
స్వభావ
సుఖహాని
అనియు,
“అస్వర్గ్యమ”నగా
ఆధిదైవిక
సుఖహాని
అనియు,
“అకీర్తికరమ”నగా
ఆధి
భౌతిక
సుఖహాని
అనియు
సూచించినది.
పౌరుషాన్ని
పురికొల్పే
క్షాత్ర
రక్తాన్ని
కదిలించే
శ్రీ
కృష్ణుని
మాటలు
అర్జునునిపై
కొంత
పనిచేసినవి.
ఈ
మాటల
కిరణములతో
అర్జునునిలోని
కరడు
కట్టిన
తమో
గుణము
కొంత
కొంత
కరుగుట
మొదలిడినది,
రజోగుణము
కొంత
పులకరించినది.
ఆ
రాజసిక
తీక్షణతో
అర్జునునికి
తిరిగి
నోట
తడి
యేర్పడి
ప్రసంగమునకు
ప్రయత్నిస్తాడు.
అక్కడ
అర్జునుడు
“కథం?”
అని
కృష్ణుని
ప్రశ్నిస్తాడు.
దీనిని
సూక్ష్మంగా
యోచించిన
ఈ
పదం
యొక్క
లక్ష్యము
చక్కని
గుట్టును
తెలుపుచున్నది.
అదియేమన
ఏమి
చేయవలెనో
అను
విషయమును
కాక,
ఎట్లు
చేయవలెనో
అనునది
తెలుపుచున్నదనియే
మన
భగవత్
గీత.
“కథం”
అనగా
ఏ
విధంగా
అని
తలంచవలెను.
దీనిని
బాగుగా
గ్రహించవలెను.
ముఖ్యముగా
గమనించవలెను.
అంతటితో
ఊరకుండక
అర్జునుడు
తిరిగీ
కృష్ణపరమాత్మను
చూచి
“మధుసూదనా!
నా
మాట
ఆలకింపుము.”
8
▾
Meaning
Keep
“ఈ
యుద్ధ
భూమిలో
విరోధి
పక్షమున
ముందు
భాగమున
నిలిచిన
వారు
అందరూ
నాకు
పరమ
పూజనీయులుగా
యున్నారు.
పెద్దవారయిన
భీష్ముడు
తండ్రిలేని
మమ్ముల
దగ్గరతీసి,
పెంచి,
పెద్దచేసి,
ఇంతటి
వారిగా
తీర్చిద్దిరి.
అతను
తండ్రి
సమానము.
పరమ
పితామహుడు.
ఇక
ద్రోణుడా!
తన
కొమరునికంటెను
ఎక్కువగా
నన్ను
ప్రేమించి
అశ్వత్థామ
కామపుత్రుడనిన్ని,
నన్ను
ప్రేమపుత్రునిగాను
పెంచి,
అభిమానించి,
అస్త్ర
శస్త్ర
విద్యలను
గరిపి,
ప్రవీణునిగా
చేసిన
పూజ్య
గురువులు.
కృష్ణా!
గురు
ప్రసాదమైన
విద్యలతో
గురువునే
ఎదిరించుటా,
చంపుటా,
నా
బోటి
భారత
పుత్రునకు
ధర్మమా?
యుద్ధము
శత్రువులతో
చేయవలెను.
కాని,
పూజనీయులైన
తండ్రులతోనూ,
గురువులతోనూ
చేయమని
చెప్పుట
నీకు
ధర్మమా?
ఇంతటితో
పోక
యుద్ధము
చేయకున్న
“అస్వర్గ్యమ”ని
ఛీ
కొడుతున్నావే!
గురువులను
చంపుటలో
స్వర్గమేర్పడునని
చెప్పుటలో
నాకేమి
బోధపడకున్నది.
ఈ
పద్ధతినే
లోకము
అవలంబించిన,
మచ్చునకైననూ
గురువులు
చిక్కుదురా?
కృష్ణా!
నీవేమైననూ
చెప్పు,
ఇట్టి
మహానుభావులను
చంపి,
సుఖభోగాలూ,
అర్థకామాలు
అనుభవించుటకంటే,
నాలుగిండ్లు
భిక్షమెత్తుట
హాయి
కదా,
మేలు
కదా!
గురువుల
రక్తముతో
కలిపి
తిను
అన్నము
కంటే,
భిక్షమెత్తిన
అంబలి
గంజే
బలము
కదా!
పోనీ
అన్నింటినీ
త్యజించి
యుద్ధము
చేసిననూ
మనమే
జయింతుమని
నమ్మకమేమి?
ఇట్టి
సందిగ్ధ
ఫలాన్ని
నమ్మి
సర్వులనూ
సంహారము
చేసి
రెండింటికీ
చెడ్డ
కావలసివచ్చును.
ఒక
వేళ
గెలుపు
వారికే
అయిన
ఆనాడైననూ
భిక్షమెత్తి
తిన
వలసి
వచ్చును
కదా?
ఒక
వేళ
మనకే
జయమైన
అది
ఓడిన
దానికే
లెక్కకొచ్చును.
ఎటులైన
ఇందరి
బంధు
మిత్రులను
సంహరించుటకంటే
పీడాకరమైన
హృదయ
వ్యధను
యావజ్జీవితము
అనుభవించ
వలెను
కదా?
కృష్ణా!
నా
బుద్ధి
ఏ
మాత్రము
పని
చేయుట
లేదు.
ఈ
కార్పణ్య
దోషంతో
నా
బుద్ధే,
నా
స్వభావమే
మార్పయినది.
ధర్మమేదో,
అధర్మమేదో
ఏమియు
తెలియని
స్థితిలో
ఉన్నాను.”
9
▾
Meaning
Keep
“బావా!
ఈ
క్షత్రియ
రక్తము,
నీ
తీక్షణమైన
మాటలు
నన్ను
ముందుకు
నెట్టుచున్నవి.
పూజనీయుల
హత్యాదోషపు
భీతిచే
వెనుకంజవేయుచున్నది.
ఏమి
చేయవలెనో
దిక్కు
తోచుట
లేదు.
ఈ
రథమును
ఏ
రీతిగా
నీవు
నడుపుచున్నావో
అటులనే
నన్నునూ
రథముగా
భావించి
నాలో
చేరి
నీవే
నడుపవలెను”
అని
అర్జునుడు
కోరినాడు.
అంతియే
కాక,
“నాకు
ప్రేయః
పదార్థముతో
పని
లేదు.
శ్రేయః
పదార్థము
కావలెను”
అని
అర్జునుడు
కోరినాడు.
నాటి
నుండి
కృష్ణ
పరమాత్మ
గురుస్థానముననూ
తాను
శిష్యస్థానముననూ
మెలగవలెనని
అర్జునుడు
ఆశించినాడు.
10
▾
Meaning
Keep
అర్జునుడు
యుద్ధభూమికి
వచ్చే
అంతవరకూ
అంతఃకరణములో
ద్వేషబుద్ధి
నిండి
పొంగుచుండెను.
రెండు
సేనల
మధ్య
నిలచి
అటు
ఇటు
పరికించి,
వైర
పక్షమున
ముందుగా
నిలచి
యుండిన
భీష్మ
ద్రోణాదులను
చూచి,
వారలు
యుద్ధమునకు
సంసిద్ధులయి
యున్నారని
తలంచి
ధీరవీరుడైన
అర్జునుడు
దీనహితుడై
నిలువబడెను.
కృష్ణార్జునుల
వృత్తులు
ఒకదానికొకటి
విరుద్ధములాయెను.
కృష్ణపరమాత్మ
యేది
ధర్మమని
చెప్పునో
దానిని
అర్జునుడు
అధర్మమని
వాదించుటకు
దిగెను.
దీనికి
కారణము
వెతికిన
మమకార,
అభిమానములే.
అందుకే
ఒకరిది
ప్రమా
దృష్టి,
మరొకరిది
భ్రమా
దృష్టి.
అర్జునుడు
పూర్తి
భ్రమా
దృష్టిలో
పడి,
అజ్ఞానముచే
భ్రాంతితో
తపించవలసి
వచ్చెను.
కొంత
తడవునకు
యోచించి,
చివరకు
“స్వామీ!
మమకార
వృత్తి,
ద్వేష
వృత్తి
జ్ఞానమునకు
అనుకూలము
కావు”
అని
తలంచి
తనలో
తాను
తన
తప్పును
తెలిసికొని,
“మాధవా,
నాకేమీ
తోచదనీ,
సర్వమూ
నీ
ఇష్టాను
సారము
చేతు”ననీ
శరణాగతి
వృత్తిని
కలిగించుకొన్నాడు.
తన
తప్పును
తాను
తెలిసికొనుటే,
శిష్యునికి
ప్రథమ
సుగుణము.
మానవుని
మూఢత్వము,
‘అన్నియూ
నాకు
తెలుసు’నను
అహంకారమును
పెంచును.
Previous
←
The Essence of the Gītā
Next
Ordinary Moha and Extraordinary Moha
→