Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Gītā Vāhini · The Mansion of the Gītā Is the Palace of Satya and Dharma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
వస్త్రముచే
కప్పబడిన
శరీరమునందలి
సౌకుమార్య
స్వరూపమును
ఎట్లు
చూడలేకపోవుచున్నారో,
అటులనే
అహంకారముచే
కప్పబడిన
‘జీవత్వము’నందలి
పవిత్ర
‘బ్రహ్మత్వము’ను
కూడనూ
గాంచలేకపోవుచున్నారు.
అహంకారమే
సర్వదోషములకు
మూల
కారణము;
దీనికి
కామము
పుట్టినిల్లు.
వాంఛారహితునకు
అహంకారము
చేరవీలుండదు.
వాంఛారాహిత్య
స్థితినే
నిరహంకారమని
అందురు.
నిరహంకారమే
మోక్షమనబడును.
అనగా,
తృష్ణాపాశ
రహితుడే
మోక్షార్థుడు.
2
▾
Meaning
Keep
లోకమున
మానవుడు
ఫలాపేక్ష
ననుసరించే
కర్మలు
చేయుచున్నాడు.
ఫలములేదని
తెలిసిన
అట్టి
కర్మలను
విసర్జించుచున్నాడు.
కానీ,
గీత
ఈ
రెండింటినీ
ఖండించినది.
ఫలము
ఉండిననూ,
లేకపోయిననూ,
మానవుడు
కర్మలను
వదులుటకు
సాధ్యము
కాదు.
కర్మయందలి
దోషములు
మానవుని
అంటకుండుటకై
‘కర్మఫల
త్యాగము’ను
గీత
గొప్ప
సాధనగా
బోధించెను.
మానవుడు
కోరిననూ
కోరకుండిననూ
కర్మల
యొక్క
ఫలము
నేడు
కాకపోయిననూ
రేపైననూ
కలుగక
తప్పదు.
కనుక,
ఫలము
మంచిదైననూ,
చెడ్డదైననూ
భగవదర్పితము
చేయుటలో
ఏ
దోషమునూ
అంటకుండును.
భగవదర్పితము
చేసిన
కర్మ
దివ్యస్వరూపమును
దాల్చును.
అటులకాక,
అహంకారముతో
చేసిన
కర్మ
దోషభూయిష్టమగును.
నిజముగా
పరమేశ్వరుని
చేరుగోరువారు,
పొందగోరువారు
వాంఛా
శూన్యులు
కావలెను;
అట్టి
మమకార
శూన్యునికే
మోక్షప్రాప్తి.
అట్టి
స్థితియే
జీవితము
యొక్క
లక్ష్యము.
అది
సుఖ
దుఃఖములకు
అతీతమైన
స్థితి.
ఇట్టి
స్థితిని
మిత్రుడు,
భక్తుడు
అయిన
అర్జునునకు
అందించు
నిమిత్తమై
కృష్ణ
పరమాత్మ
ఇన్ని
విధముల
శ్రమ
తీసుకొని,
అతనిని
తరింపజేయుటయే
కాక
అతనిని
నిమిత్తమాత్రునిగా
నిలబెట్టి
లోకమునకిట్టి
పవిత్ర
భిక్షపెట్టెను.
3
▾
Meaning
Keep
తన
పవిత్ర
ఉపదేశమును
సమాప్తి
చేయుటకు
పూర్వము
“అర్జునా!
సర్వధర్మములు
వదలి
నన్ను
శరణుజొచ్చుము.
నిన్ను
సమస్త
పాపముల
నుండి
విముక్తుని
చేతును”
అని
పలికెను.
అనగా
మమకార
అభిమానములు
వదలి
దేహమే
నేనను
అహంకారమును
రూపుమాపి,
అంతయూ
పరమాత్మయే
అను
దృఢచిత్తుడై,
పరమాత్మకు
అంకితమగుటే
శరణుజొచ్చుట.
అట్టి
స్థితియందు
సంకల్ప
వికల్పములు
ఏవియూ
లేక
భగవంతుడు
చెప్పినటుల
జేయుటే,
ఉంచినటుల
ఉండుటే,
ఆడించునటుల
ఆడుటే.
“ఇది
నేను
చేయతగినది;
ఇది
చేయతగనిది”
అను
ధర్మాధర్మ
విచారణకు
దూరమై
ఫలాపేక్ష
లేక
కర్మలనాచరించుటే,
అట్టివాని
కర్తవ్యము.
4
▾
Meaning
Keep
కృష్ణుడు
చెప్పిన
ఈ
సూత్రమును
ఆధారము
చేసుకొని
కొందరు
శుష్క
వేదాంతులు,
సోమరి
భక్తులు
కాళ్ళు
చాచుకొని
కన్నులు
మూసుకొని,
కంఠమాలలు
వేసుకొని,
చేయవలసిన
సత్కర్మలు
చేయక
వేళవేళకు
తినటము,
నిద్రించటము,
తిరగటము,
ఇది
మంచీ
ఇది
చెడ్డా
అని
విచారించక
ప్రవర్తించటము;
“ఏమిరా,
నాయనా!
నీ
ధర్మమును
నీవు
ఆచరించక
ఈ
రీతిగా
ప్రవర్తించుచున్నావే!”
అని
ఇంటిలో
పెద్దలో
లేక
అనుభవజ్ఞులైన
మహనీయులో
ప్రశ్నించిన
“ఏమండీ,
మీరు
కూడ
ఇట్లు
పొరబడుచున్నారు.
గీతలో
పరమాత్ముడు
చెప్పినది
మీకు
తెలియదా?
‘సర్వధర్మాన్
పరిత్యజ్య’
అని
భగవంతుని
మాటలను
నేను
ఆధారము
చేసుకొందును
కానీ
అన్యుల
మాటలు
నాకక్కరలేదు,”
అని
పరమ
భక్తుని
వలే
పరమాత్మ
ఆజ్ఞలను
శిరసావహించు
వానివలే
ప్రగల్భములు
పలుకుచుందురు!
ఇట్టివారు
అవసరమైన
పదములనే
గట్టిగా
పట్టుకొని
వాదింతురు
కానీ
ఆ
పదములకు
అటు
ఇటు
ఉన్న
పదములు
పరమాత్ముడు
చెప్పినవి
కాదా,
వాటిని
మాత్రమెందుకు
అంగీకరించరు,
ఆచరణ
యందు
పాటించరు!
పోనీ
సర్వధర్మములు
వదలినవాడు,
పరమాత్మునికి
శరణు
జొచ్చినాడా?
లేదు;
ఉండిన
కర్తవ్య
కర్మలు
మానియుండడు
కదా!
తిండి
నిద్రాపేక్షలు
చేరియుండవు
కదా!
ఇట్టివారు
మాటలకు
మహనీయులు;
ఆటలలో
ఆడంబరులు;
ఆచరణయందు
అణు
మాత్రమైననూ
గోచరించదు
ఆధ్యాత్మిక
ప్రవృత్తి.
5
▾
Meaning
Keep
పరమాత్ముడు
పలికిన
పవిత్ర
పదములయందు
నిజభక్తులు
కూడనూ
కొంత
యోచించవలసిన
సత్యము
లేక
పోలేదు.
ఏమన,
6
▾
Meaning
Keep
శ్లో
॥
సర్వధర్మాన్
పరిత్యజ్య
మామేకం
శరణం
వ్రజ
అహం
త్వా
సర్వ
పాపేభ్యో
మోక్ష
యిష్యామి
మాశుచః
॥
7
▾
Meaning
Keep
అను
వాక్యములను
పట్టి
పరమాత్ముడు
“సర్వధర్మాన్
పరిత్యజ్య”
అని
మాత్రమే
అన్నాడు;
కానీ
“సర్వ
కర్మాన్”
అని
అనలేదు.
అనగా,
ధర్మవిచారణ
చేయక,
భగవత్ప్రీతిగా
ఆజ్ఞరూప
ధర్మకర్మలను
చేయవలెననియే
దీని
భావము.
అనన్యగతికులై
సర్వభారమును
పరమాత్మ
పైననే
వైచి,
జనకాదులవలె,
తాము
పొందవలసినదేదియు
లేకయున్నను
లోకసంగ్రహ
కర్మ
నాచరించలెను.
ఎందుకన,
సర్వభూతాంతరాత్మ
తన
ఆత్మకన్ననూ
వేరు
కాదు
కనుక,
సర్వభూతహితానురక్తుడై
నిష్కామబుద్ధితో,
విధివిహిత
కర్మలను
ఆచరించునట్టి
దానినే
“నిష్కామకర్మ”
యనబడును.
కాన,
గీతను
అవగాహన
చేసుకొని
తదాదేశానుగుణంగా
నిష్కామకర్మ
నిష్ఠులై
స్వధర్మమును
చక్కగా
నెరింగి
సర్వమును
హరి
ప్రసాదముగా
భావించి
కర్మలు
చేయుట
మాత్రమే
కర్తవ్యము.
ఫలాపేక్ష
లేక
సాత్విక
ప్రవర్తన
కలిగి
హరి
కృపాకటాక్షములకు
పాత్రులైన
వారి
జీవితములే
ధన్యములు.
8
▾
Meaning
Keep
ధర్మము
నాశ్రయించిన
వారికి
ఐహికమున
దుర్భరమైన
కష్టములు
ఎదురైననూ
చివరకు
వారికే
సంపూర్ణ
విజయము
చేకూరును.
అధర్మపరులు
ఐహికమున
సర్వసంపదలతో
తులతూగినప్పటికినీ
తుదకు
వారికి
సర్వనాశనము
సంభవించక
తప్పదు.
ఈ
విషయమున
పాండవ,
కౌరవుల
పరిస్థితి
మానవ
లోకమునకు
ప్రత్యక్ష
సాక్షి.
అధర్మమూర్తులైన
కౌరవులు
ధూర్తులై
ధర్మమూర్తులగు
పాండవులను
నానా
బాధలకు
గురిచేసిననూ
కడకు
ధర్మమూర్తులకే
విజయము.
అధర్మమూర్తులకు
సర్వనాశనము
సంభవించును.
అధర్మ్లకు
ఎన్ని
విధములైన
బలములు
అండదండలుగా
ఉండిననూ,
అనుగ్రహబలము
లేనిదే
అన్నియూ
వ్యర్థములేయని
భారతము
భారతీయులకు
గొప్ప
సత్యమును
అందించెను.
పవిత్ర
ధర్మమును
నిరూపించెను.
సత్య
ధర్మముల
సౌధమే
భారతమునందలి
గీతా
భవనము.
భక్తి
శ్రద్ధలతో
పవిత్రగీతను
పఠించి
అందలి
నిబంధనలను
అనుష్ఠాన
రూపమున
ఆచరించిన,
అట్టి
వారికి
ఆత్మారాముడు
అరచేతియందే
కనుపించును;
అరనిమిషమునందే
కరుణించును.
బ్రహ్మాండమంతయు
బొజ్జలో
నుంచుకొన్న
పరమాత్మను
కోరిన
అష్ట
ఐశ్వర్య
సంపదలతో
ఐహికమును
అనుభవించుటే
కాక,
సత్యానంద
నిలయమైన
సత్యజ్ఞానమును,
కైవల్యమును
కూడనూ
పొందవచ్చును.
వెన్న
చిక్కిన
నేతి
కొరకు
యోచించనక్కరలేదు
కదా!
అందువలననే,
పరమాత్ముని
శరణుజొచ్చి
పరమాత్మ
ఆజ్ఞకర్మల
ననుసరించిన
మోక్షాపేక్ష
కూడనూ
అక్కరలేదు.
తనకు
కావలసినదేదియో
యోగ్యమయిన
యేదియో
తానే
అందించును.
తన
కొరకు
తపించవలెను
కానీ
మోక్షము
కొరకు
కాదనియు,
తనను
శరణుజొచ్చి
మోక్షమును
కూడనూ
త్యజించిన,
అట్టి
వాని
సర్వపాపములను
నాశనము
చేతుననియూ,
పరమాత్ముడు
గట్టి
మాటనిచ్చి
అర్జునునకు
తిరిగి
పుట్టులేక
చేసెను.
కాన,
పుట్టు
కోరని
వారందరునూ
ఇట్టి
గట్టి
చట్టము
ననుసరించి
పరమాత్మను
పట్టిన,
అతనిని
శరణు
జొచ్చిన
సర్వసిద్ధినీ
సాధించవచ్చును.
Previous
←
Sāttvika, Rājasika and Tāmasika Tendencies