Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · The Four Obstacles to Attaining the Paramātma Who Is Jñāna Itself
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
జ్ఞానస్వరూపుడైన
పరమాత్మను
పొందుటకు
గల
నాలుగు
ఆటంకములు
"సూర్యరశ్మిభిః
తుహినపటల
మివజ్ఞానభాభిః
అజ్ఞానం
నశ్యతి॥"
అన్నట్లు,
అనగా,
సూర్యకిరణములచే
మంచు
ఎట్లు
కరుగునో
అట్లే
జ్ఞానకిరణముల
చేత
అజ్ఞానము
కరిగిపోవును.
ఎడతెగని
ఆధ్యాత్మిక
విచారణచేత
జ్ఞానోదయము
చేకూరును.
ఎల్లప్పుడూ
బ్రహ్మమననేమి?
నేను
ఎవరు?
జనన
మరణములననేమి?
అనెడి
విచారణయందు
మునిగియుండవలెను.
ఎట్లు
ధాన్యమును
దంచి
బియ్యమును
చేసి
ఆ
బియ్యమందున్న
పొట్టు
కూడనూ
వేరుచేసెదమో,
అట్లే
మనస్సును
అంటుకొనియున్న
అజ్ఞానమును
ఆత్మవిచారణమనెడి
బూడిదతో
పదేపదే
తోమి
శుభ్రపరచుచుండవలెను.
సంపూర్ణ
జ్ఞానోదయమెప్పుడుదయించునో
అప్పుడే
మోక్షప్రాప్తి
కలుగును.
పై
చెప్పినటుల
ఆత్మజ్ఞానమును
పొందిన
పిమ్మట
బ్రహ్మనిష్ఠను
చేరవలయును.
మనస్సునందలి
సందేహములు,
తెలిసిన
మహనీయులనో
లేక
తను
ఎన్నుకొన్న
సద్గురువునో
ప్రార్థించి
వారి
సహాయముచేత
సందేహనివృత్తి
చేసుకొనవలెను.
గురువో
లేక
శాస్త్రమో
చూపిన
ఆధ్యాత్మిక
పథము
బాగుగా
స్థిరపడువరకూ,
వారి
సన్నిధియందో
లేక
ఆచరణయందో
ఉండవలెను.
ఏలనన,
ఆత్మజ్ఞానము
కలిగిన
సత్పురుషుల
సాంగత్యమువలన
ఉన్నత
స్థాయికి
త్వరలో
చేరగలరు.
స్వచ్ఛంద
వైరాగ్యముతోను,
నిజమైన
2
▾
Meaning
Keep
ఆసక్తితోను
మనఃపూర్వకముగా
గురువు
ఆజ్ఞను
ఆచరణలోపెట్టి,
శాస్త్ర
ప్రమాణముపై
విశ్వాసముంచి
గాఢతపస్సు
చేయవలెను.
ఇట్లు
చేసిన
కొంతకాలమునందే
అత్యున్నత
స్థానమును
పొందవచ్చును.
అజ్ఞానము
తొలగినప్పుడు
ప్రతి
ఆత్మయూ
తన
స్వరూపముతో
ప్రకాశించును.
మనకు
కనపడునవన్నియు
ఎడారిలోని
ఎండమావివంటివే.
వస్తువులకు
ఆద్యంతములు
కలవు.
విశ్వప్రళయ
మగునప్పుడు
ఈ
లోకము
మూలప్రకృతి
లేక
అవ్యక్తమను
కారణమును
కలిగియుండును.
బంగారమును
మూసలో
కరిగించునప్పుడు
పచ్చని
కాంతితో
ప్రకాశించును.
ఆ
ప్రకాశ
మెక్కడిది?
అది
బంగారములోనే
యున్నదా?
లేక
నిప్పువలన
జనించినదా?
కాన
ఈ
పచ్చని
ప్రకాశము
బంగారము
యొక్క
స్వతస్సిద్ధమైన
ప్రకాశమే.
మాలిన్యమును
తొలగింపగనే
బంగారు
తన
స్వతస్సిద్ధమైన
ప్రకాశముతో
వెలుగుచున్నది.
నిప్పు
మాలిన్యము
తొలిగించునట్టి
ఉపకరణము,
అనగా
సాధన
మాత్రమే.
బంగారము
తనకు
సహజముగానున్న
తేజస్సుతోనే
ప్రకాశించుచున్నది
కాని,
దానికి
మరేమియు
కలుపబడలేదు.
ఒకవేళ
బంగారమును
నిప్పులో
వేయుటవలన
కాంతి
కలిగెనేమో
అని
అనుకొన్నచో
ఒక
రాతిని
రప్పను
కూడను
నిప్పులో
వేసిన
దానికి
బంగారపుకాంతి
ఎందుకు
రాకూడదు?
కానీ
దానికట్లు
రాదు.
అందు
మూలమున
నిప్పు
వలన
జనించినది
కాదు
కాంతి.
పంచకోశముల
నుండి
వేరై,
స్వప్రకాశముతో
వెలుగునట్టియు,
త్రిగుణములను
సాక్షిభూతముగా
చూచునట్టియు,
చలింపనిదై,
పవిత్రమై,
శాశ్వతమై,
విభాగింప
శక్యముకానిదై,
స్వయంభువై,
శాంత
స్వరూపమై,
అనంతమై,
జ్ఞానమై
యందునట్టి
ప్రత్యగాత్మను
తనలోనే
తాను
గుర్తింపవలెను.
అట్టి
3
▾
Meaning
Keep
జ్ఞానస్వరూపుడైన
పరమాత్మను
పొందుటకు
నాలుగు
ఆటంకములు
కలవు.
లయ,
విక్షేప,
క్షయ,
రసాస్వాదనములనెడివి.
అవి
కేవల
పదార్థములు.
లయము:
లయమనగా
నిద్ర;
బాహ్యావిషయములనుండి
లోనికి
త్రిప్పిన
మనసు
గాఢనిద్ర
అనే
సంసార
ప్రభావము
వలన
గాఢనిద్రలో
ప్రవేశించుచున్నది.
సాధకుడు
మనస్సును
నిద్రలోనికి
పోనివ్వకుండగ
ఆత్మవిచారణయందు
నిలుపవలయును.
అతడు
అతిజాగ్రత్తగా
మెలకువ
కలిగియుండవలెను.
అయిననూ
నిద్రమత్తు
వదలకుండినచో,
అట్టి
మత్తు
కలిగించెడి
కారణమేదో
దానిని
కనిపెట్టి
అట్టి
ఆటంకమును
పోగొట్టుకొనవలెను.
మరల
మరల
ధ్యానమును
ప్రారంభించవలెను.
ధ్యానమున
నిద్రమత్తు
కలిగించునవి
సామాన్యముగా
అజీర్ణము,
అత్యాహారము,
అధికమైన
కాలినడక,
లేక
దేహశ్రమ
లేక
రాత్రివేళల
సరియైన
నిద్రలేకుండుట,
మొదలగునవి.
ఎప్పుడైననూ
రాత్రి
నిద్ర
పట్టనిచో
మరురోజు
మధ్యాహ్నము
కొంచెము
నిద్రించవచ్చు.
అంతేకానీ,
ధ్యాన
అభ్యాసము
చేయువారికి
మధ్యాహ్నము
నిద్ర
మంచిది
కాదు.
సరియైన
ఆకలి
ఏర్పడువరకూ
భోజనము
చేయరాదు.
దీని
మూలమున
అజీర్ణము
నిర్మూలింపవచ్చును.
అతిగా
భోజనము
చేయరాదు.
మితముగా
భుజించుటకు
అభ్యసించవలెను.
మూడు
భాగముల
ఆకలి
తీరగనే
అనగా
ఇంకనూ
కొంత
తినవలెననియెడి
ఆశ
వుండునట్లే
భోజనమును
ముగించవలెను.
ఇట్లు
జఠరమును
కూడనూ
శిక్షణలో
పెట్టవలెను.
ఎక్కువగా
నడచుట
కూడనూ
మంచిది
కాదు.
లయమనే
నిద్రమత్తు
వదలు
వరకు
ప్రయాణము
చేయవలెను.
అట్లు
నిద్రనుండి
మరల్చిన
మనస్సు
కూడా
వెంటనే
ధ్యానములో
లగ్నము
కాదు.
4
▾
Meaning
Keep
విక్షేపము:
జాగ్రత
యొక్క
సంస్కారము,
సుకృతము
వలన
వెంటనే
ఆ
మనస్సునూ,
బాహ్యేంద్రియ
విషయముల
మీదికి
పరువులిడుచు,
వానిని
అనుభవించుటకు
ఎన్నియో
కష్టములు
పడుచుండును.
దీనినే
విక్షేపము
లేక
మనశ్చంచలము
అని
కూడనూ
అందురు.
విచారణా
శక్తి
మూలమున
మనస్సును
బాహ్య
విషయముల
నుండి
మరల
మరల
లోనికి
త్రిప్పుకొనుచుండవలెను.
ఈ
లోకము
అనిత్యము,
అసత్యము
అనెడి
మిథ్యాదృష్టి
[ఇది,
ఎన్నడునూ
ఉండలేదు
అనునది
బడాదృష్టి
(గొప్పదృష్టి)],
మానవుల
కష్టసుఖములకు
బాహ్యేంద్రియములే
కారణములనియెడి
దోషదృష్టి
–
ఈ
దృష్టుల
అభ్యాసమువలన
విక్షేపమును
పోగొట్టుకొని
మరల
ధ్యానమును
ప్రారంభించవలెను.
డేగచేత
తరుమబడిన
పక్షి
ఒక
యింటిలో
దూరి
విశ్రాంతి
కొరకు,
మరల
బైటికి
పరుగెత్తునట్లు
మనసు
కూడా
అతి
సూక్ష్మమైన
తన
ఆత్మలో
ఉండజాలక
వెలుపలి
ప్రపంచమున
తిరుగాడుటకై
పరుగెత్తును.
విక్షేపమే
యిట్లు
వెలుపల
తిరుగవలెనని
తోచెడి
మనోవృత్తి.
క్షయము:
లయవిక్షేపముల
నుండి
మరలించిన
మనసు
మరల
ధ్యానమందు
లగ్నము
కాజాలదు.
బలవత్తరమైన
అంతర్గత
రాగద్వేషముల
వాసనలచే
బాహ్యవిషయములలో
కలసిపోవును.
దుఃఖములో
మునిగియుండును.
అప్పుడు
ఏకదృష్టి
కలిగియుండును
కానీ,
ఈ
స్థితిని
సమాధి
అని
తలపరాదు.
ఇదే
క్షయము,
ఇదే
మనోరాజ్యము,
లేక
గాలిలో
మేడలుకట్టు
మనస్సు.
మనస్సే
లోకవాంఛలను
కోరును.
ఇది
బాహ్యానురాగము.
తనలో
తాను
పూర్వస్థితిని
గురించి
చింతించుచూ
ఉత్తర
స్థితికొరకు
ప్రణాళికలు
వేయుచుండును.
ఇది
అంతరంగానురాగము.
దీనిని
కాంక్ష
అని
అందురు.
బాహ్యాకర్షణశక్తియే
విక్షేపము.
అనురాగమనెడి
5
▾
Meaning
Keep
సంస్కారమువలన
లోపలనుండి
సంభవించునదేదియో
అదియే
కాంక్ష
అనబడును.
ఈ
కాంక్షయే
సమాధికి
బలము.
రసాస్వాదనము:
విక్షేపము
తొలగిపోగానే
సవికల్పానందము
సంభవించును.
దీనినే
రసాస్వాదనమనెదరు.
ఇది
నిర్వికల్ప
సమాధి
లేక
బ్రహ్మానందమును
బొందుటకు
ఆటంకము.
పెద్ద
బరువును
మోయుచున్న
వ్యక్తి
బరువును
క్రిందికి
దింపి,
ఎట్టి
ఆనందమును
అనుభవించునో,
ఒక
ధనరాశి
నాశించువాడు
దాని
చుట్టును
తిరుగుచున్న
సర్పమును
చంపిన
ఎట్టి
ఆనందమును
పొందునో,
అట్టి
ఆనందమును
రసాస్వాదనము
వలన
పొందుచున్నాము.
అయితే
సర్పమును
చంపినంతనే
మనస్సు
తృప్తిజెందునా?
లేదు.
ఆ
ధనమును
స్వీకరింప
కలిగినగానీ
మనస్సు
నిజమైన
ఆనందమును
అనుభవింపజాలదు.
కానీ
ఈ
నిర్వికల్ప
సమాధిని
రుచి
చూచినపుడు
మానవుడు
పైమెట్టు
ఎక్కినట్లు
లెక్క.
సర్పమును
చంపుటే
విక్షేపమును
రూపు
మాపుట.
సూర్యోదయముతో
చీకటియు,
దానివలన
కలుగు
కష్టములు
కూడా
నశించును.
ఆ
విధముగనే
ఆత్మను
కనుగొనగలుగుచున్నవారికి
బంధము
లేదు,
దుఃఖము
కూడా
లేదు.
తన
స్థితిని
మరచినవానికే
భ్రమ,
మాయలు
ఉత్పన్నమగును.
ఈ
భ్రమవలననే
అహంకారము
కలుగును.
ఒక
లక్ష్యము
నుండి
మనసు
కొంచెము
క్రిందికి
దిగినచో
మేడమెట్లనుండి
జారిన
బంతి
ఎట్లు
మధ్యలో
నిలువక
క్రిందిమెట్టువరకు
పోవునో,
అట్లే
మనస్సు
కూడా
అధఃపాతాళమునకు
దొర్లిపోవును.
అవివేకమువలన
వ్యత్యాసములు,
అహంకారములు,
అభిమానములు
ఉదయించును.
అహంకారము
వలన
ప్రేమ,
అసహ్యము
కలుగును.
అనురాగద్వేషముల
వలన
కర్మలు,
వ్యవహారములు
పుట్టుచున్నవి.
ఈ
కర్మల
ఫలితముగా
6
▾
Meaning
Keep
స్థూలదేహములు
కలిగి
దానియందు
అభిమానములు
జనించుచున్నవి.
శరీరాకారము
వలన
సుఖదుఃఖములు
కలుగును.
సుఖదుఃఖముల
నుండి
విముక్తి
కలుగవలెనన్నచో
శరీర
జ్ఞానమును
పోగొట్టుకొనవలెను.
అట్టి
శరీర
జ్ఞానమును
పోగొట్టుకొనవలెనన్నచో
స్వార్థపూర్ణములైన
కార్యములను
చేయరాదు.
అట్లు
స్వార్థమును
విడనాడుటకు
రాగద్వేషములు
విడనాడవలెను.
ఇట్టి
కోర్కె
మోక్షమునకు
పరమశత్రువు.
ఈ
కోర్కెలే
జననమరణములను
చక్రమునకు
మానవుని
బంధించుచున్నవి.
మానవుల
బాధలకు
ఇవియే
మూలకారణము.
ఇట్టి
విచారణ
వలన
జ్ఞానమును
ప్రకాశింపజేసినప్పుడు
మోక్షము
సిద్ధించును.
మోక్షమనునది
స్వతంత్రము.
అట్టి
బాధలనుండి
దూరమై
ఏ
దుఃఖ
సంతోషములకూ
చేరక
స్వతంత్రమైన
ఆనందమును
అనుభవించునదే
మోక్షమని
అందురు.
బాగుగా
అదుపులో
పెట్టిన
మనస్సే
ఉత్కృష్టమైన
మోక్షమార్గమును
పొందగలదు.
దానిని
గాఢమైన
పరమేశ్వర
భావములతో
నింపి
పులకరింపజేయవలెను.
అందు
నుండి
తత్త్వవిచారణ
పెరుగగలదు.
అట్టి
ఆకర్షణముల
నణచి
నిర్మలముగా
నుండినపుడు
"నేను"
అను
జ్ఞానముండదు.
అహంకార
భావనలుకల
విషయములు
కూడా
నశించి
ప్రపంచమందలి
ఏ
విషయములందును
సంతసించలేకుండా
వుండే
స్థితినే
మోక్షమార్గమని
తెలిసికొనవలెను.
మోక్షమనునది
ప్రత్యేక
స్థళము
కాదు.
స్వర్గలోకములోకానీ,
లేక
కైలాసపర్వతములందుకానీ,
ఎక్కడో
దూరములో
లేదు.
రాగద్వేషములు
దానికనుగుణమగు
కోరికలను
నశింపజేసినప్పుడు
మనస్సుయొక్క
చిలిపితనము
అణగిపోయి
అదే
మోక్షమును
సృష్టించును.
కోరికలన్నియు
నశింపగనే
ఆత్మజ్ఞానము
కలుగును.
మనస్సును
అరికట్టనిదే
కోరికలు
అణగవు.
కోరికలు
అణగనిదే
మనస్సు
అరికట్టుట
7
▾
Meaning
Keep
సాధ్యముకాదు.
మనసు,
కోరికలు
–
విత్తనము,
చెట్టు
వంటివి.
ఆత్మజ్ఞానము
కలుగకుండునంతవరకు
మనస్సు,
దాని
చంచలత్వము
నశింపవు.
కాన
ఈ
మూడునూ,
అనగా
కోరిక,
మనస్సు,
ఆత్మజ్ఞానము
ఒకదానిపై
ఒకటి
ఆధారపడియున్నవి.
జీవన్ముక్తుడు
పరమాత్మజ్ఞానములో
నుండును.
పరమాత్మ
జ్ఞానములో
అద్భుతతేజమును
పూర్తిగా
తెలుసుకొని
మిధ్యాదృష్టిని
దోషదృష్టిని
వృద్ధిచేయుటవలననూ,
తద్వారా
ప్రాపంచిక
సుఖదుఃఖములను
లక్ష్యము
చేయడు.
ఈ
ప్రపంచమందలి
ధనము,
సౌఖ్యము,
ఆనందము,
మున్నగునవన్నియు
ఎందుకూ
పనికిరానివనియు,
అవన్నియు
విషతుల్యములనియు,
చెత్తవంటివని
ఊహించి,
వాటికి
గౌరవము
ఇవ్వడు.
తనను
గౌరవించిననూ,
అమర్యాద
చేసిననూ,
తిట్టిననూ,
కొట్టిననూ,
సమానముగా
గ్రహించి
యూరకుండును.
వాటికి
సంతోషించటముకానీ,
దుఃఖించటముకానీ,
రెండునూ
ఉండవు.
అట్టి
జీవన్ముక్తుడు
కూడా
మొదలు
అనేకమార్లు
మనసును
క్రమశిక్షణలో
పెట్టుటయందు
విఫలుడైనను
పట్టుదలచే
అభ్యసించుటచేతను,
తన
లక్ష్యమును
ఎల్లప్పుడు
ఎదురుగానుండుటవలనను
ఉత్కృష్టస్థితికి
మెల్లమెల్లగా
ఎక్కగలిగినాడు.
అపజయము
కలిగినప్పుడు
చలించక
కఠినముగా
శిక్షణ
నేర్చుకొనుచు,
ఒక
దృఢ
పథమునకు
రావలెను.
ఇట్టివాడు
అనగా
జ్ఞాని
శాశ్వతముగా
ఈ
లోకముననే
యుండుటకు
ఆశించడు.
ఈ
భౌతిక
శరీరమును
విడుచుటకు
సిద్ధముగా
నుండును.
Next
Whoever Can Check the Onrush of the Citta and Fully Subdue It, to Them Comes the Vision of the Ātma
→