Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Jñāna Vāhini · Whoever Can Check the Onrush of the Citta and Fully Subdue It, to Them Comes the Vision of the Ātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
2.
ఎవరు
చిత్తధాటిని
అరికట్టి,
పూర్తిగ
అణచగలరో,
వారికి
ఆత్మ
సందర్శనము
కల్గును
జీవబ్రహ్మము
యొక్క
ఏకత్వమును
దృఢముగా
గుర్తెరిగి,
అసంభావన
–
విపరీతభావముల
నుండి
సంశయ
నివృత్తిగాంచుటయే
దృఢ
అపరోక్ష
బ్రహ్మజ్ఞానమనబడును.
అట్టి
దివ్యమయిన
జ్ఞానోదయము
వలన
ఆభాస
ఆవరణము
తొలగిపోవును.
బ్రహ్మజ్యోతి
నా
యందు
వెలుగుట
లేదు,
అనెడి
తప్పభిప్రాయమునే
ఆభాస
ఆవరణమని
అందురు.
ప్రతి
జీవి
హృదయమందు
పరమాత్మ
సూక్ష్మమున
అతి
సూక్ష్మముగాను,
గొప్పలో
అతి
గొప్పగాను
ఉన్నాడు.
కావున,
అంతరంగమందున్న
ఆత్మసందర్శనము
చేయగలిగిన
జ్ఞాని
ఎన్నడును
దుఃఖింపడు.
ఆత్మ,
సర్వత్రా
సర్వభూతములందూ
చీమ
మొదలు
ఏనుగు
వరకూ
ఉన్నది;
ప్రపంచము
అతిసూక్ష్మమగు
ఆత్మచేత
వ్యాపింపబడినది.
సాధకుడు
ప్రపంచధోరణిని
త్యజించి,
అంతర్ముఖుడై,
ఆత్మయందు
దృష్టి
మరలింపవలెను.
మనోవృత్తులన్నియు
ఎచ్చటినుండి
ఉత్పన్నమగుచున్నవో
గ్రహింపనగును.
అట్లు
గ్రహించినచో
సంకల్పములన్నియు
నాశనమగును.
అటుతరువాత,
బ్రహ్మాకారవృత్తి
నిరంతరాయముగ
గల్గును.
దానివలన
సాధకుడు
సచ్చిదానంద
స్వరూపస్థితి
యందు
స్థిరపడును.
అట్టి
జ్ఞానిని
ఎట్టి
2
▾
Meaning
Keep
సుఖదుఃఖములును
అంటజాలవు.
తాను
ఆత్మానంద
సాగరమున
పూర్తిగా
మునిగి
ప్రపంచమున
కతీతుడైయుండును.
ఆత్మచింతన
అనెడి
పదమునే
బ్రహ్మాభ్యాసమనియు,
జ్ఞానాభ్యాసమనియు
కూడా
వాడుదురు.
మనస్సు
విషయాసక్తి
వలననూ,
విక్షేపశక్తి
వలననూ,
బహిర్
విషయముల
మీదికి
పరుగెత్తుచుండును.
కానీ,
మరల
మరల
దానిని
లక్ష్యముపైకి
తెచ్చుచుండవలెను.
ప్రథమములో
అది
కష్టముగానున్ననూ,
మన
శిక్షణద్వారా
మనస్సును
అణచగరుప
గలిగినపుడు,
"ఓం"
అను
శబ్దముమీద
నిలువగలదు.
ఈ
శిక్షణ
శమ,
దమ,
ఉపరతి,
తితీక్ష,
శ్రద్ధ,
సమాధానములనెడి
ఉపాయములచే
మనసును
కట్టవలెను.
మనస్సును
ఉపనిషత్తులు,
ప్రార్ధనలు,
భజనలు,
సత్వగుణము
మొదలైన
వాటిచేత
నింపి,
క్రమీణ
బ్రహ్మధ్యానములోనికి
దింపవలెను.
చిత్తమందు
ధ్యానము
సాగింపగా
సాగింపగా,
మనసునందు
క్రొత్త
ఆసక్తులు
బయలుదేరును.
అట్టి
శిక్షణచేత
మనస్సును,
ఇతర
చింతల
పైకి
ఉరకకుండా,
హృదయగుహ
యందు
బంధింపవచ్చును.
అట్టి
సాధక
ఫలమునే
"నిర్వికల్ప
సమాధి"
అందురు.
నిర్వికల్ప
సమాధి
ఫలితము
"బ్రహ్మజ్ఞాన"మనబడును.
బ్రహ్మజ్ఞాన
ఫలమునే
"మోక్ష"
మనిగానీ,
"జననమరణ
బారినుండి
విముక్తి"
అనిగానీ
తెలియబడుచున్నది.
బ్రహ్మ
పారాయణమందే
మనసు
నిల్పవలయును.
ఇట్లు,
బ్రహ్మనిష్ఠయందుండి,
బ్రహ్మ
నివాసముకొరకు
ప్రయత్నించవలెను.
వాసనలను
విసర్జించుట,
మనస్సును
నిర్మూలించుట,
తత్త్వజ్ఞానము,
ఈ
మూడునూ
కలిపి
సాధన
చేయవలెను.
అప్పుడే
ఆత్మజ్ఞానము
పొంద
వీలగును.
3
▾
Meaning
Keep
వాసనాక్షయమనగా
కోరికలను
నిర్మూలించుట.
మనోనాశనమనగా
మనస్సును
నిర్మూలించుట.
తత్త్వజ్ఞానమనగా
సత్యాన్వేషణము.
ఈ
మూడింటిని
సమానముగా
ఆచరణయందుంచని
యెడల
ఆత్మజ్ఞానము
పొంద
వీలుకాదు.
ఈ
మూడింటిలో
ఏ
ఒక్కటినైనా
చాలా
కాలము
ఆచరణలో
పెట్టిననూ
కూడా,
మనస్సును
నిర్మూలింపగల
వాసనలను
పొందజాలరు.
ఏలననగా,
వాసనల
ఫలితముగనే
ఇంద్రియ
భోగములందు
ఆసక్తి,
బంధన
కలుగుచున్నది.
కనుక,
వివేకము,
ఆత్మచింతన,
విచారణ,
శమము,
దమము,
వైరాగ్యము,
త్యాగము
మొదలగు
వాటివలననే
వాసనలు
నశింప
చేయనగును.
మనస్సు
అనేకమైన
వాసనల
మూట.
అసలు
మనస్సే,
జగత్తు!
గాఢనిద్రయందు
పనిచేయదు
కనుక
జగత్తు
యొక్క
ప్రభావము
మనకేమియూ
తెలియదు.
జగత్తు
యొక్క
ఆది
అంత్యములు,
మనస్సంకల్పముల
ఉత్పత్తి
లయములననుసరించి
యుండును.
సంకల్పముల
అంత్యమొందించిన
వెంటనే
మోక్షముత్పన్నమగును.
ఎవరు
చిత్తధాటిని
అరికట్టి,
పూర్తిగ
అణచగలరో,
వారికి
ఆత్మ
సందర్శనము
గల్గును.
చిత్తసంకల్పము
"నేను"
అనెడి
బీజమునుండి
కల్గినది.
"నేను"
అనే
విత్తును
పారవేయగల్గినప్పుడు
చిత్తమునందుండు
వాంఛ
దానంతటదే
మాయమగును.
సాధకుడు
కడు
జాగ్రత్తగా
ఉండవలెను.
ఇంద్రియముల
తిరుగుబాటు
ఎప్పుడైనను
రావచ్చును.
ముముక్షుత్వముగానీ,
యోగముగానీ,
వచ్చిననూ
మరలిపోవుచుండును.
అందుకనే
ప్రపంచధోరణి
యందుండు
వారితో,
ఆ
సంబంధమైన
వస్తువులతో
కలియుట
ఎక్కువ
పారపాటు.
4
▾
Meaning
Keep
ఎల్లప్పుడూ
సత్యాన్వేషణయందే
మునిగియుండవలెను.
కోరికలను
వృద్ధిపొందించుకొనుట,
కాలమును
వృధాపుచ్చుట
చేయరాదు.
ఒక
సుఖము
మరొక
సుఖమును
కోరును;
అట్లు
కోరుట
వలన
మనస్సు
విడచిన
వాంఛలను
మరల
పొందుటకు
సమయమునకు
వేచియుండును.
సాధకుడు
మనస్సును
నిగ్రహమందుంచుకొనుటకు
పట్టుదలతో
యుండవలెను.
ఇంద్రియ
భోగముల
నుండి
మనస్సును
పట్టుపట్టి
త్రిప్పవలెను.
ప్రార్థనలు
కూడ
తిరుగుచూ
ప్రార్థించరాదు.
ఒకే
స్థలమందు
కూర్చొని
ప్రార్థించవలెను.
అట్టి
వానికి
ఆత్మయే
బలము.
ఆత్మయే
ధనము.
అట్టి
జ్ఞాని
స్థితి
ఈ
క్రిందిరీతిగా
కనపడును:
సుఖదుఃఖములు
మనస్సుయొక్క
ధర్మములు.
అవి
మానసిక
సవరణలు.
మనస్సు
నశింపగనే
దాని
చిహ్నములగు
సుఖదుఃఖములు
జ్ఞానినెట్లు
అంటగలవు?
ఎప్పుడు
జ్ఞాని
మనస్సు
దేహముతో
కలియునో,
అప్పుడే
బాధననుభవింపగలడు.
మత్తుమందు
తీసుకొన్నప్పుడు
బాధ
తెలియదు
కదా?
ఎందువలన?
మనస్సు
దేహమునుండి
వేరగును.
అట్లే
జ్ఞాని
కూడా
తన
మనస్సును
ఆత్మయందు
ఇమిడ్చియుండును.
అట్టి
స్థితిగలవారు
మానసిక
శిక్షణవలన
మనస్సును
ప్రశాంతింపజేసుకొనును.
కాన
జ్ఞాని
తన
ఆత్మయందే
ఆనందింపగలిగి,
బయటనుండి
ఎట్టి
ఆనందమునూ
కోరకుండును.
తాను
అనుభవించవలసిన
కోరికలన్నియు
ఆత్మయందే
అనుభవించుచుండుట
వలన
బయట
తాననుభవింపవలసిన
కోరిక
లేవీ
ఉండవు.
కాన,
జ్ఞానియొక్క
ఘనత
వర్ణించుటకు
కానిది!
కేవలము
ఊహించుటకు
కూడా
కానిది!
"బ్రహ్మవిత్
బ్రహ్మైవ
భవతి,
బ్రహ్మవిత్
ఆప్నోతి
పరం,"
అని
శ్రుతులు
ఘోషించెను;
అనగా,
బ్రహ్మను
5
▾
Meaning
Keep
తెలిసికొనువాడు
బ్రహ్మ
అగుచున్నాడు,
బ్రహ్మతత్త్వమును
పొందినవాడు
ఉత్కృష్టుడగుచున్నాడు
అని
అర్థము.
ఎట్లు
అన్నిరకములైన
బుడగలు
నీరుతప్ప
మరేమీ
కాదో,
అట్లే
అన్ని
విధములైన
నామరూపములుగల
ఈ
ప్రపంచము
బ్రహ్మము
తప్ప
మరేదియును
కానేరదు.
ఇదే
జ్ఞానియొక్క
విశ్వాసము.
అతని
అనుభవము
కూడా
ఇదియే.
నదులన్నియు
సముద్రమున
కలియునట్లు,
అన్ని
కోరికలు
జీవన్ముక్తుని
ప్రశాంతమందు
లయమగుచున్నవి.
అదియే
ఆత్మ
సాక్షాత్కారము.
ఆత్మకు
మృత్యువు
అనునది
లేదు,
కదా?
జననమొందని
ఆత్మకు
షడ్వికారములెక్కడి
నుండి
వచ్చును?
రాను
వీలే
కాదు!
అందుకనే,
శ్రుతులు
ఆత్మను
"అజ"
(అనగా,
జననము
లేనిది),
"అజరా"
(వార్ధక్యము
లేనిది),
"అమర"
(మృత్యువు
లేనిది),
"అవినాశి"
(నాశము
లేనిది)
అని
ఘోషించినవి.
కావున,
షడ్వికారములన్నియు
నశించు
దేహమునకే
కానీ
ఆత్మకు
ఉండవు.
వాటికి
షడ్భావ
వికారములు
అనిపేరు.
అనగా,
ఉండుట,
జన్మించుట,
పెరుగుట,
మార్పుచెందుట,
క్షీణించుట,
చివరకు
మరణించుట.
ఆత్మకిట్టి
షడ్భావ
వికారములుండవు.
అతడు
కూటస్థుడు;
కాలపరిస్థితుల
వలన
కలుగు
మార్పులన్నిటినీ
సాక్షీభూతునిగా
గమనించుచూ,
తామరాకుపై
నున్న
నీరువలే,
గాలిలోని
ప్రాణవాయువువలే,
అంటకుండ
ఆత్మ
నిస్సంగుడుగా
నుండును.
మనస్సు
యొక్క
పోకడల
నుండి
విముక్తి
బ్రహ్మజ్ఞానము
వలన
సంభవించును.
అట్టి
విముక్తియే,
నిజమైన
స్వరాజ్యము
లేక
మోక్షమని
పేరు.
ఎవరు
ఈ
లోకమున
యధార్థమును
గ్రహించి
అసత్యమనెడి
6
▾
Meaning
Keep
దృష్టితో
చూచెదరో
వారికి
వాసనలన్నియు
మాయమగును.
అజ్ఞానము
పటాపంచలగును.
ఆధ్యాత్మిక
రత్నమును
దొంగిలించినది
మనస్సే!
కాన,
మనస్సనెడి
దొంగను
శిక్షించినచో
ఆ
రత్నము
దొరకును,
వెంటనే
బ్రహ్మస్థానమలంకరింపవచ్చును.
అట్టి
ఆత్మజ్ఞానమునొందిన
మహాత్ములను
పూజించి,
అనుభవముల
తెలిసికొని
ఆనందించుటే
సాధకుల
లక్ష్యము;
అట్టి
సాధకులు
పరమ
పవిత్రులు.
అందరునూ
ధ్యాన
సాధనల
వలన
పొందవలసిన
స్వరాజ్యము
ఇదియే!
ఇదియే
బ్రహ్మ
రహస్యము,
ఆత్మజ్ఞానము.
Previous
←
The Four Obstacles to Attaining the Paramātma Who Is Jñāna Itself
Next
The Four Kinds of Jñānis
→