Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Līlā Kaivalya Vāhini · Mental Śānti, the Ideal Life
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మానసిక
శాంతి,
ఆదర్శ
జీవితము
పారమార్థిక
సాధనలు,
భక్తి
ప్రేరిత
కార్యములు
–
అనగా
పూజ,
భజన,
ధ్యానము
మున్నగునవి.
వీనిని
గూర్చి
వాదము
లాడరాదు.
వాటి
యొక్క
లోతుపాతులు
తెలియక
వాదము
లాడుటకంటే
సాధనచేసి
చూచుట
మంచిది.
పారమార్థిక
జీవన
భావము
తాత్వికముగను,
రసానుభూతి
యోగ్యముగను,
సాధకులను
ఆకర్షించును.
కేవలము
ఆకర్షించినంత
మాత్రమున
ఆనందము
చేకూరదు.
సాధనను
ఆరంభించుట
మంచిది.
అయితే
అట్లు
సాధనను
ఆరంభించక
పూర్వమే
తమ
స్థితి
విశదముగా
నిర్వహించవలెను.
ప్రస్తుత
కాలమున
నుండు
మతములన్నియు
నేటి
యువకులకు
అసంతృప్తికరములు.
కొన్ని
కాలానుగుణ్యములుకాక
మిక్కిలి
పాతపడ్డవిగను,
కొన్ని
దేశానుగుణ్యములుకాక
విదేశీయరూపమైనవిగను,
మరికొన్ని
కేవలము
అసభ్యతాదూషితములైనవిగను
వుండుటచేత,
తమ
మిత్రులచే
పరిహసింప
బడుదురేమో
అని,
ఈనాటి
యువకులకు
అమిత
భీతి.
అట్టివారు
కేవలము
మాటలతోనే
కాలయాపన
చేతురు.
వేల
వేల
గ్రంథములు
చదువుచు
సాధనరూపమైనది
యేదియు
చేయక
వూరకుందురు.
అట్టివారే
వాదములాడుటకు
వత్తురు
ముందుకు.
కోటి
గ్రంథ
పఠనములకంటే
ఎక్కువ
విలువగలది,
అదే
యథార్థ
జ్ఞానము.
లేశమైనను
సాధనవలన
సాధించుట,
ప్రత్యక్షానుభూతివలన
మాత్రమే
అట్టిది
ప్రాప్తించును.
ఈ
జ్ఞానము
అభివృద్ధి
అగుకొలదీ
ఇతరులతో
వాదములాడక
తనతో
తాను
వాదములాడి,
వాస్తవ
తత్త్వమును
గుర్తించును.
ఆత్మవిశ్వాసరహితులకు,
కార్యాచరణకు
వెనుతీయుచుండు
వారికి,
ప్రాపంచిక
బాధ్యతలతో,
చింతలతో
క్రుంగిపోవుచుండువారికి,
2
▾
Meaning
Keep
స్వాభావిక
దౌర్బల్యమువలనగానీ,
భగవత్
విశ్వాసము
లేక
ప్రార్థన
చేయజాలనివారికి
ఒక్క
మాట.
ఈ
లౌకిక
ప్రపంచములో
మనమెన్నియో
భోగభాగ్యములననుభవించితిమి,
అనుభవించుచున్నాము.
ఈవిధముగ
అనుభవించిన
వారెందరో
పోయిరి.
మనమూ
అంతే.
వున్నంతలో
మానసిక
శాంతిని,
ఆదర్శ
జీవితాన్ని
అనుభవించాలని
ప్రతివ్యక్తి
అభిలషించవలసిన
విషయము.
మానవుడుగా
పుట్టి,
మానవ
విశిష్టతను
విడువక,
మానవత్వమును
మరువక,
మానవునిగా
జీవించాలి.
కానీ,
తనకంటే
హీనమైన
పశువుగనో,
లేక
అంతకంటే
క్రూరమైన
అసురుడుగనో
జీవించరాదు,
అన్న
దృఢ
సంకల్పము
మానవునిలో
ఆవిర్భవించాలి.
అట్లు
ఆవిర్భవించవలెనన్న,
ఒక్క
ఆధ్యాత్మిక
మార్గముతప్ప
అన్య
మార్గములయందు
అట్టి
పవిత్రభావములు
కలుగనేరవు.
నిత్య
జీవితములో
యెదురయ్యే
అనేక
సమస్యలను
యెదుర్కొనుటకు
నైతిక,
ధార్మిక,
ఆధ్యాత్మికములతోపాటు
లౌకిక
తెలివితేటలు
కూడా
అత్యవసరము.
పక్షికి
రెండు
రెక్కలు,
బండికి
రెండు
చక్రములు
యెంత
అవసరమో
మనిషికి
వ్యావహారిక,
పారమార్థికములు
రెండూ
అంతే
అవసరమే.
పారమార్థికమున
బిగువు
కలుగవలెనన్న
లౌకిక
జీవితాన్ని
అర్థము
చేసుకోవలసి
వుంటుంది.
లౌకికము
మిధ్యము,
అనిత్యము
అను
సత్యమును
గుర్తించిననే
పారమార్థికమునందలి
పవిత్రత
నిత్యసత్యమని
నిరూపించగలరు.
ఇది
ధనకనకాదులతో
కానీ,
పదవీ
ప్రతిష్ఠలతో
కానీ,
విద్యా
పాండిత్యములతో
కానీ
లభించునది
కాదు.
కేవలము
చిత్తశుద్ధితో,
తీవ్ర
ఆకాంక్షతోనే
లభించును.
ఈ
మధ్య
యెన్నియో
అపోహలు,
అనుమానాలు,
అర్థముకాని
ఆవేశాలు
కలుగుతూ
వుంటాయి.
ఉగాదినుండీ
అట్టి
అపోహలను,
అనుమానములనూ
తీర్చి
శాంతిని
చేకూర్చుటకు
"లీలా
కైవల్య
వాహిని"
అను
పేరుతో
మిమ్ములను
ఆనందమున
ముంచెత్తును.
ఆధ్యాత్మికమున
ప్రవేశ
పెట్టును.
వేచియుండుడు.
(లీలా
కైవల్య
వాహిని)
Next
The Study of the Veda Is Only to Carry Life Across
→