Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Līlā Kaivalya Vāhini · The Study of the Veda Is Only to Carry Life Across
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
(సాయి
సాధకుల
సంభాషణ)
2.
వేదాధ్యయనము
జీవితము
తరింపజేయుటకే
సాధక:
భారతీయులు
అన్నింటికీ
వేదమునే
ప్రమాణముగా
స్వీకరింతురు.
భారతీయ
సంస్కృతికి
వేదమే
మూలమని
అందురు.
అసలు
వేదమంటే
ఏమి?
ఇది
యింత
ఘనతను
సంపాదించుటకు
కారణమేమి?
సాయి:
నాయనా!
భారతదేశమునందు
జన్మించి
భారతీయుడను
అనిపించుకొని
వేదమంటే
యేమో
యెరుగకున్నావు.
వేదము
దివ్యమైన
జ్ఞానరాశి.
భూత
భవిషత్తు
వర్తమాన
కాలాల్లో
తిరుగులేని
సత్యాన్ని
బోధించేది
వేదం.
ముల్లోకాలకు
యోగక్షేమాన్ని
కలిగించేది
వేదం.
సమాజానికి
శాంతి
భద్రతలనందించేది
వేదం.
మంత్రద్రష్టలైన
మహర్షుల
ద్వారా
ఆవిష్కరించిన
సత్యవాక్
సమూహమే
వేదం.
ఇది
సాక్షాత్
పరమ
పురుషుని
నిశ్వాసమే.
అందువలన
దీనికింత
ఘనత
చేకూరినది.
సాధక:
అయితే
లౌకిక
జీవితములో,
వ్యావహారిక
రంగములో
దీనివలన
కలుగు
ఫలమేమి?
సాయి:
లోకములో
ప్రతిజీవి
తన
యిష్టాన్ని
పొందటానికి,
అనిష్టాన్ని
పోగొట్టుకోవటానికి
ఉపాయాన్ని
తెలిపేది
ఈ
వేదమే.
అనగా
యేది
చేయతగినది,
యేది
చేయతగనిది
అని
నిర్ణయించుటచేత
యిష్టప్రాప్తి,
అనిష్ట
పరిహారమును
అందుకొనవచ్చు.
ఈ
వేదము
2
▾
Meaning
Keep
వ్యావహారిక,
పారమార్థికములు
రెండింటికీ
సంబంధించినది.
యథార్థంగా
చెప్పవలెనన్న
జీవితమే
వేదమయం.
కనుక
దీనిని
ఆశ్రయించక
తప్పదు.
విద్
అనగా
తెలుసుకొనుట.
దానినే
జ్ఞానమని
అందురు.
జ్ఞానమయుడే
మానవుడు.
అది
లేనిది
పశువు.
సాధక:
వేదము
అనంతము
అందురే
ఇవన్నీ
పూర్తి
జ్ఞానమయములేనా?
సాయి:
"అనంతోవై
వేదః"
అని
అందురు.
అయితే
వేదము
మొదటిలో
ఒక్కటే.
తదుపరి
మూడుగా,
ఆ
తరువాత
నాలుగుగా
విభజింపబడెను.
సాధక:
ఒక్కటిగా
వున్న
దీనిని
విభజించుటలో
వున్న
విశేషమేమి?
యెందుకు
విభజించవలసివచ్చెను?
సాయి:
ఇది
అనంతమైనది
కనుక
అధ్యయనము
చేయుట
సామాన్య
మానవులకు
కష్టమయ్యేడిది.
అంతేకాదు
ఈ
వేదమును
నేర్చుకొనుటకు
యెంతో
కాలము
పట్టెడిది.
కనుక
నేర్చుకొనగోరువారిలో
దిగులొంది,
వేదాధ్యయనము
చేయుటకు
అంత
అభిరుచితో
ముందుకు
వచ్చెడివారు
కాదు.
ఈ
కారణమును
పురస్కరించుకొని,
అందరికీ
అనుకూలముగా
వుండునట్లు,
ఈ
వేదములో
వున్న
ఋక్కులన్నింటినీ
వేరు
చేసి
ఋగ్
సంహితములని,
యజుస్సులను
కూర్చి
యజుస్సంహితములని,
సాములన్నింటిని
కూర్చి
సామసంహితములని,
అధర్వ
మంత్రాలను
వేరు
చేర్చి
అధర్వసంహితములని
విభజించిరి.
సాధక:
ఈ
విధముగ
విభజించిన
వారెవ్వరు?
సాయి:
ఇతను
నారాయణాంశ
సంభూతుడగు
వ్యాసుడు.
ఇతను
పరాశర
మహర్షి
కుమారుడు,
సమస్త
విద్యల
మూట.
ఆ
మూటకు
మారుపేరు
'వ్యాస'
అని.
ఇతను
మహర్షి.
సమస్త
వేదశాస్త్రముల
3
▾
Meaning
Keep
పారంగతుడు,
సమన్వితుడు,
సమర్థుడు.
లోక
కళ్యాణార్థమై
అతను
వేదములను
విభజించి
ధర్మమును
ఆచరించుటకు
అనుకూలపరచెను.
వేదములను
నాలుగుగా
విభజించి
ఐదు
సంహితలుగా
యేర్పరచెను.
సాధక:
నాలుగు
వేదములకు
నాలుగు
సంహితలే
వుండవలెను
కదా.
ఐదుగా
విభజించుటలోని
అర్థమేమి?
ఆ
ఐదు
సంహితలు
యేమిటి?
సాయి:
కృష్ణ
యజుర్వేద
సంహిత,
శుక్ల
యజుర్వేద
సంహిత
అని
యజుర్వేదమును
రెండుగాను,
మిగిలిన
మూడు
వేదములను
ఒక్కొక్కటిగనే
విభజించుటచేత
ఐదు
అయినవి.
అంతేకాదు,
ఒక్కొక్క
సంహితను
తిరిగి
మూడు
భాగములుగా
విభజించెను.
ఇవన్నియూ
వారివారి
స్థితి,
గతులకు
తగిన
రీతిగా
అందరినీ
తరింపజేయగోరి
చేసినవే
కానీ
వారివారి
యోగ్యతలను
పురస్కరించుకొని,
సంఘ
శ్రేయస్సుకోసం
చేసినవేగానీ
వీటిలో
యేమాత్రము
భేదములు
లేవు.
సాధక:
ఆ
సంహిత
భాగములు
యేమి?
సాయి:
బ్రాహ్మణాలు,
ఆరణ్యకాలు,
ఉపనిషత్తులు
అని
మూడు.
సాధక:
బ్రాహ్మణాలు
అనగా
యేమి?
సాయి:
ఇవి
మంత్రభాగ
వ్యాపక
రూపాలు.
ఆయా
యాగములను,
వాటి
స్వరూపాలను
చక్కగా
వివరిస్తాయి.
ఇవి
ఐతరేయ
బ్రాహ్మణమని,
తైత్తిరీయ
బ్రాహ్మణమని,
శతపథ
బ్రాహ్మణమని,
గోపథ
బ్రాహ్మణమని
అనేక
విధముల
కలవు.
సాధక:
ఆరణ్యకాలనగా
యేమి?
4
▾
Meaning
Keep
సాయి:
ఇవి
పద్యగద్యమయమైనవి.
వానప్రస్త
ఆశ్రమము
స్వీకరించినవారు
అరణ్యములలో
జీవించుచు
అధ్యయనము
చేయుటవలన
వీటికి
ఆరణ్యకాలని
పేరు
వచ్చినది.
అనగా
వంటరిగా,
ప్రశాంతంగా
కాలము
గడుపువారు
ఈ
సంహితను
అధ్యయనము
చేయుటచేత
ఆరణ్యకమైనది.
జనసమూహములో
కాక,
వంటరి
జీవితము
గడుపువారు
అధ్యయనము
చేయునవి
ఆరణ్యకాలు.
వీటిలో
కర్మకాండయొక్క
చరమదశ,
బ్రహ్మకాండ
ప్రారంభమవుతుంది.
Previous
←
Mental Śānti, the Ideal Life
Next
The Veda Has So Many Names
→