Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Līlā Kaivalya Vāhini · The Forms of Parameśvara and of Prakṛti
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
పరమేశ్వరునికి
మరియు
ప్రకృతికి
గల
రూపములు
సాధక:
అథర్వవేదము
యేది?
దీనికి
కూడా
అనేక
పేర్లున్నవా?
సాయి:
అవును.
బ్రహ్మ
వేదము,
అంగిరో
వేదము,
అథర్వాంగిరో
వేదము,
భృగ్వంగిరో
వేదము,
క్షత్రవేదము,
భైషజ్యవేదము
అని
ప్రసిద్ధం.
కాళిదాసు
వశిష్ఠులవారిని
అథర్వనిధి
అని
కీర్తించినాడు.
అట్లు
కీర్తించుటచే
ఋగ్వేద,
యజుః,
సామవిదుడే
కాక
అథర్వ
వేదాభిజ్ఞుడని
కూడానగువాడే
పౌరోహిత్య
కుశలుడు,
కర్మ
నిర్వహణ
సమర్థుడు,
రాజగురు
పదమునకు
అర్హుడని
తెలియజెప్పెను.
సాధక:
అథర్వ
మంత్రములకు
పేర్లేమైన
వున్నవా?
సాయి:
సిద్ధమంత్రములని
ప్రసిద్ధి.
గాయత్రీదేవికి
ఋగ్యజుః
సామలు
పాదములు,
మీమాంసాశాస్త్రము
తటస్థ
లక్షణము
అథర్వ
వేదము
చేష్ట
అని
అర్థము.
సాధక:
దీనికి
అర్థమగునట్లు
మరొక
లౌకిక
ప్రపంచమునకు
తెలియునట్టి
ఉపమానము
లేమైనా
వున్నవా?
సాయి:
అథర్వము
వక
వృక్షము
వంటిది.
ఋగ్వేద,
యజుర్వేద,
సామవేదాలు
స్కందశాఖలు.
స్మృతి
పురాణములు
వర్ణములు.
ఒకే
ఆదిత్యుడు
యజుర్వేదములచే
యజుః
అనియు,
సామవేదమున
2
▾
Meaning
Keep
సామ
అనియు,
ఋగ్వేదమున
ఊర్ధ్వ
మనియు,
అథర్వవేదమున
యాతుః
అనియు
వుపాసింపబడుచున్నాడు.
సాధక:
అథర్వుడనగా
నేమి?
సాయి:
నిశ్చలుడు
లేక
స్థిర
ప్రకృతి
కలవాడు
అని
అర్థము.
అథర్వమునకు
ప్రాణాత్మ
లేక
ప్రజాపతి
అని
వేదప్రసిద్ధము.
ప్రాణాత్మ
అగు
ప్రజాపతి
అథర్వుడని
కీర్తింపబడినాడు.
ఈ
ప్రజాపతియే
మొదట
అగ్నిని
మథించెను.
ప్రతి
వేద
మంత్రములకు
ఆదియందును,
అంత్యమందును
ఉచ్చరింపబడెడి
ప్రణవము
అభివ్యక్తము
చేయునది
అథర్వవేదమే.
సాధక:
ఈ
వేదమున
పరమేశ్వరునికి
యెన్ని
రూపములని
తెలిపినది?
సాయి:
"యాతే
రుద్ర
శివా
తనూర
ఘోరా
పాప
కాశిని"
అని
పరమేశ్వరునకు
శాంతము,
ఘోరము
అని
రెండు
రూపములున్నట్లు
తెలిపెను.
సాధక:
దీనికేదైన
ఉదాహరణమును
తెలుప
ప్రార్థన.
సాయి:
స్తంభము
వెడలి
ప్రత్యక్షమైన
నరసింహుని
రూపము
భక్తాగ్రేసరుడగు
ప్రహ్లాదునకు
శాంతరూపమున,
అఘోర
రూపమున
సాక్షాత్కరించెను.
ప్రబల
ద్వేషియైన
హిరణ్యకశిపునకు
ఘోరరూపమున
గన్పట్టినట్లు
ప్రసిద్ధమే
కదా!
పరమేశ్వరుని
శక్తిరూపమగు
ప్రకృతియు
శాంత,
ఘోర
రూపము.
జీవులకు
ఉపభోగ్యమయిన
వస్తుజాలము
జీవనహేతు
వగునపుడు
భేషజమగును.
అదియే
మృత్యు
హేతువగునపుడు
ఘోరము
అగును.
సాధక:
దీనికి,
అర్థమగునట్లు
ఉదాహరణము
అనుగ్రహించండి.
3
▾
Meaning
Keep
సాయి:
సర్వ
ప్రాణులకు
జీవనహేతువు
అన్నము.
అది
శాస్త్రము
ఉపదేశించినటుల
సాత్విక,
రాజసిక,
తామసికాద్యఘోర
భేదములను
గుర్తించి
పరిమితిగ
సేవించినచో
అది
జీవనహేతువు,
సుఖప్రదమునగు
భేషజమగును.
అట్లుగాక,
అధికంగా
సేవించినపుడు
వ్యాధిహేతువై
అది
దుఃఖ
ప్రదమగుమ
-
ఘోరరూపమగును.
దీనినే
అన్న
శబ్ద
నిర్వచనము
ద్వారా
శ్రుతి
వివరించినది.
అద్
(తినుట)
అను
ధాతువునుండి
అన్న
శబ్దము
నిష్పన్నమయినది.
తినబడునది
(అద్యతే)
కావున
అన్నము.
తినునది
(అత్తి)
కావున
అన్నము
అని
అర్థము.
అన్నమునకుగల
శాంత,
ఘోరరూపములను
సంలక్షింపజేయుట,
శాంత,
ఘోరరూపములన
అథర్వాంగిరో
మంత్రముల
దర్శించిన
ఋషులే
అధర్వాంగీరసులు.
దృష్టి
భేదము
లేక
అధికార
భేదము
ననుసరించి
శాంత,
ఘోరరూపములుగా,
భిన్నముగా
కన్పట్టినను
మొత్తముమీద
పరమార్థమున
ఈ
మంత్రములన్నియు
ఆత్మచికిత్స
కొరకే,
లోక
కళ్యాణమునకే
యేర్పడినవి.
Previous
←
The Special Significance of the Mantras Svāhā and Svadhā