Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Līlā Kaivalya Vāhini · The Special Significance of the Mantras Svāhā and Svadhā
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
స్వాహా,
స్వధా
మంత్రముల
యొక్క
విశిష్టత
సాధక:
స్వామీ!
వేదమంత్రములందు
తరచుగా
'స్వాహా'
అను
పదము
వుపయోగింతురు
కదా!
స్వాహా
అనగా
యేమి?
సాయి:
నాయనా!
స్వాహా
అను
పదము
వేదవాచకము
కాదనియు,
ఇది
సామాన్యముగా
హోమార్థమైన
మంత్రమనియు,
ఇది
హోమసూచకమైన
సాంకేతికపదమనియూ
తలంతురు.
ఈ
పదమునకు
స్వాహాదేవి
అనియు,
హవిష్ప్రధానమనియు
రెండు
అర్థములున్నవి.
దేవతలను
వుద్దేశించి
స్వాహా
అనియు,
పితరులను
ఉద్దేశించి
స్వధా
అని
హవిస్సు
లేయబడుచుండును.
స్వాహా
అను
పదము
వేదములో
వాగ్
దేవత
అని
అర్థము
నిచ్చుచున్నది.
నిత్యనైమిత్తిక
కర్మలు,
యాగాది
క్రియలు
అన్నియూ
స్వాహాకార
పూర్వకమగు
నాచమనక్రియలతో
ఆరంభమగుచున్నవి.
స్వాహా,
స్వధాకార
వర్జితములైన
హోమములు
సామాన్యముగా
వుండవు.
సాధక:
వేదమంత్రములందు
చివర
స్వాహా,
స్వధా
అను
మంత్ర
ద్వయమును
చేర్చుట
వలన
ఫలమేమి?
సాయి:
స్వాహా,
స్వధా
మంత్రములు
చేర్చి
హవిర్దానముల
గావించుటచేత
దేవతలు,
పితరులు
తృప్తి
పడుదురు.
స్వాహా
అను
నామమును
ఉచ్చరించక
వేదవిదులు
యజ్ఞములందు
హోమమొనర్చినచో,
దేవతలు
ఆ
యజ్ఞ
భాగములను
పొందలేరు.
స్వాహా,
స్వధా
అను
రెండు
శబ్దములు
దేవతా
ప్రీతికరములు,
దేవతా
జీవన
హేతువును
అగు
మంత్రములు.
2
▾
Meaning
Keep
"స్వాహా
స్తోమస్య
వర్చసా"
ఋగ్వేదము.
స్వాహా
పదమునకు
(1)
స్వాహాకారపూరకమైన
హవిర్దానము
(2)
స్తుతి
లక్షణమగు
వేదవాక్కు
అని
రెండు
అర్థములు
ప్రసిద్ధము.
యే
అర్థమును
చెప్పినను
లేక
రెండు
అర్థములు
చెప్పినను
స్వాహా
పదోచ్చారణముచే
దేవతలు
ప్రీతినొందుటయు,
అట్లు
ప్రీతినొందిన
దేవతలు
స్తోత్రముచేయు
స్తోతను
వర్థిల్ల
చేయుటయు
జరుగును.
సాధక:
ఇచట
స్తోతను
వర్థిల్లజేయుట
అనగా
యేమి?
సాయి:
స్తోత
యొక్క
వేదమంత్రరూపమైన
వాక్కులో
నొక
విధమగు
ప్రభావమును
చేకూర్చి
వుచ్చరించుట
అని
అర్థము.
సాధక:
శ్రుతిలో
స్వాహాశబ్దమునకు
గల
సాంప్రదాయాను
గతములయిన
అర్థములను
కొన్ని
ఉదాహరణంగా
చూపగలరా?
సాయి:
కేశవాయస్వాహా,
ప్రాణాయస్వాహా,
ఇంద్రాయస్వాహా
–
ఇత్యాది
స్థలములందు
స్వాహా
పదమునకు
స్వాహుతమస్తు,
సుహుతమస్తు
అనగా
సుహుతమగుగాక,
స్వాహుతమగుగాక
అని
యర్థము.
సాధక:
సుహుతము,
స్వాహుతము
అనగా
యేమి?
సాయి:
అర్పిత
ద్రవ్యములు
దగ్ధమౌను
గాక
అని
అనగా
జీర్ణమగును
గాక
అని
కూడా
అర్థము.
సాధక:
ఇచట
ఒక
సందేహము.
సామాన్యముగా
యెట్టి
పదార్థములైనను,
యే
మంత్రము
చెప్పకపోయినను
అగ్నిలో
వేసినపుడు
దగ్ధము
కావటము,
జీర్ణమయిపోవటము
జరుగుచునేయున్నది
కదా!
ఇక
స్వాహాకారముతో
కలిగే
ప్రత్యేక
విశేషమేమి?
సాయి:
స్వాహుతి
అనగా
వస్తువులను
అగ్నిలో
చక్కగ
దగ్ధము
చేయుట
లేక
జీర్ణము
చేయుట
అని
మాత్రమే
కాదు.
లౌకికముగా
అగ్నిలో
వస్తువులు
దగ్ధమైపోవుట
మాత్రమే
చూతురు
కాని
అగ్నికి
3
▾
Meaning
Keep
దేవతాస్వరూపములు,
భౌతిక
స్వరూపములు
రెండునూ
కలవని
శ్రుతి
సమ్మతము.
దేవతా
శరీరము
అతీంద్రియమగుటచే
కర్మానుష్ఠాన
సమయమున
ఆయా
దివ్యరూపముల
ఆరాధించుట
శ్రుతి
సమ్మతము.
"అగ్నిర్వై
దేవ
యోనిః"
అనేది
శ్రుతి
ననుసరించి
అగ్నియొక్క
దేవతాత్మత్వమును,
అటులనే
యజమానికి
కలుగు
దివ్యత్వమును
యెవరు
తెలిసికొనగలరో,
అట్టివారికే
అమృతత్వము
సిద్ధించును.
భోక్త,
భోగ్యము
అని
జగత్తు
ద్వివిధము.
భోక్త,
భోగ్య
రూపమగు
ఈ
జగత్తు
యేకీభూతమగునపుడు,
ఈ
రెండింటినీ
కలిపి
అత్తా
అనియో
లేక
భోక్త
అనియో
వ్యవహారము.
భోగ్యము
అను
వ్యవహారము
లేదు.
భోక్త
యెవరు?
అగ్నియే
హవిస్సుల
గ్రహించేది.
ఆధిదైవికము
ఆదిత్యుడు.
ఆధ్యాత్మికముగ
ప్రాణము.
ప్రాణాగ్ని
యిట్టి
అగ్నియందు
ఆజ్య.
సోమ
ఆది
హవిస్సులకు
"అహితయః"
అని
పేరు.
పరోక్షముగా
ఆహుతులు
అని
చెప్పుబడినవి.
దేవతలు
పరోక్షప్రియులు.
సాధక:
అగ్నికి
ప్రత్యక్ష
నామమేది?
సాయి:
అగ్రిః.
సర్వమునకు
అగ్రమున
అనగా
పూర్వమున
సృజింపబడినవాడు
అని
అర్థము.
అగ్నిః
పరోక్షనామము.
సాధక:
ఆహుతి
అనగా
యేమి?
సాయి:
దేవతలనుద్దేశించి
హోమము
చేయబడునది.
అంతమాత్రమే
కాక
దేవతా
ఆహ్వానరూపమని
విశేషార్థము.
స్వాహాకార,
వషట్కారపూర్వకము
కాని
ఆహుతులు
దేవతలకు
చెందనే
చెందవు.
సరస్వతి
నామము
వాక్
దేవికిని,
వేదవాక్కునకును
ప్రసిద్ధము.
అంతేకాదు,
ఆత్మను
గురించి
చెప్పునది
కనుక
స్వాహా
4
▾
Meaning
Keep
అని
అర్థము.
దేవీ
భాగవతమునందు
పరాదేవతయే
గాయత్రి
అనియు,
స్వాహా
అనియు
చెప్పుబడినది.
లలితా
సహస్రనామములో
పరాదేవత
స్వాహా,
స్వధా
అను
శబ్దములతో
పేర్కొనబడినది.
స్వాహా
అను
శబ్దము
హవిర్దానవాచకము.
Previous
←
The Method of Attaining the Vedic Jñāna That Bestows All Sovereignty
Next
The Forms of Parameśvara and of Prakṛti
→