Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · The Human Body and the Senses
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మానవ
దేహము
మరియు
ఇంద్రియములు
ప్ర.
ఈ
మానవ
దేహమును
పాంచభౌతికమందురు
కదా,
ఎందువలన?
ఉ.
పంచ
భూతములతో
కూడి
ఉండుటచేత
దీనికి
ఈ
పేరు
వచ్చినది.
ప్ర.
పంచభూతము
లన
నేవి?
ఉ.
ఆకాశము,
వాయువు,
అగ్ని,
జలము,
పృథ్వి.
ప్ర.
ఇవి
యెక్కడి
నుండి
వచ్చినవి?
ఉ.
ఇవి
ఒక్కొక్క
భూతము
నుండి
ఒక్కొక్కటి
వచ్చినవి.
ప్ర.
అన్నింటికిని
మూలాధారమైనది
యేది?
ఉ.
నిర్వికారాచల
పరిపూర్ణ
బ్రహ్మము.
ప్ర.
ఈ
పంచ
భూతములకు,
ఈ
మానవ
శరీరమునకు
గల
సంబంధమేమి?
ఉ.
పరబ్రహ్మము
నుండి
యత్న
మహత్తులు
పుట్టి,
వాటి
నుండి
ఆకాశము,
ఆకాశము
నుండి
వాయువు,
వాయువు
నుండి
అగ్ని,
అగ్ని
నుండి
జలము,
జలము
నుండి
పృథ్వి.
వీటి
చేరిక
వల్లనే
మానవ
శరీరము
కలుగుచున్నది.
ప్ర.
ఈ
పంచ
భూతముల
సంబంధము
మానవ
శరీరమున
యే
రూపమున
నున్నది?
ఉ.
ఒక్కొక్క
భూతమునందును
తిరిగి
అయిదైదు
పంచకములను
పేరున
ఈ
దేహమున
ఇమిడి
ఉండును.
2
▾
Meaning
Keep
ప్ర.
మొదటిదైన
ఆకాశమునన్న
పంచకములు
యేవి?
ఉ.
జ్ఞాత,
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము.
వీటినే
ఆకాశ
పంచకమందురు.
ప్ర.
వీటిని
శరీరమునందేమని
పిలుతురు?
ఉ.
అంతర్
ఇంద్రియములని
పిలుతురు.
ప్ర.
ఇక
వాయు
పంచకములు
యేవి?
ఉ.
సమాన
వాయువు,
వ్యాన
వాయువు,
ఉదాన
వాయువు,
ప్రాణ
వాయువు,
అపాన
వాయువు.
ప్ర.
వీటిని
శరీరమునందేమని
పిలుతురు?
ఉ.
పంచ
ప్రాణములని
పిలుతురు.
ప్ర.
అగ్ని
పంచకములన
నెట్టివి?
ఉ.
శ్రోతము,
త్వక్,
చక్షువు,
జిహ్వా,
ఘ్రాణము.
ప్ర.
వీటిని
దేహమునందేమని
పిలుతురు?
ఉ.
జ్ఞానేంద్రియములని
పిలుతురు.
ప్ర.
జల
పంచకములననేవి?
ఉ.
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధాదులు.
ప్ర.
వీటిని
దేహమునందేమని
పిలుతురు?
ఉ.
పంచ
తన్మాత్రలు
అందురు.
ప్ర.
పృథ్వి
పంచకములననేవి?
ఉ.
వాక్కు,
పాణి,
పాదము,
గుహ్యము,
పాయువు.
ప్ర.
దేహమునందు
వీటినేమని
పిలుతురు?
3
▾
Meaning
Keep
ఉ.
కర్మేంద్రియములందురు.
ప్ర.
ఇట్టి
మానవ
శరీరమును
ఒక్కటిగా
తలంచక,
తిరిగి
దీనికి
అనేక
శరీరములున్నవని
వేదాంతులు
తెలుపుదురే;
అది
నిజమేనా?
ఉ.
అనేక
శరీరములు
లేవుకాని,
మూడు
శరీరములున్నవనుట
సత్యము.
కాని,
మరికొందరు
నాలుగని
కూడ
అందురు.
ప్ర.
అవియేవి?
వాటిని
యేమని
పిలుతురు?
ఉ.
స్థూల
దేహము,
సూక్ష్మ
దేహము,
కారణ
దేహము
అని
అందురు.
మరి
కొందరు
మహాకారణ
దేహము
కూడా
కలదని
అందురు.
ప్ర.
స్థూల
దేహమనగానేమి?
ఉ.
పై
చెప్పిన
ఇరువదియైదు
తత్త్వములు
కలిపిన
దేహమునే
స్థూల
దేహమందురు.
ప్ర.
ఇక
సూక్ష్మ
దేహమన
నేమి?
ఉ.
జ్ఞానేంద్రియములు
అయిదు,
కర్మేంద్రియములు
అయిదు,
ప్రాణాదులు
అయిదు,
మనస్సు,
బుద్ధి
రెండు.
అనగా
పదునేడు
తత్త్వములు
కలిపిన
దానినే
సూక్ష్మ
దేహమందురు.
ప్ర.
దీనికి
పేరేమైన
ఉన్నదా?
లేక
ఊరక
సూక్ష్మ
దేహమందురా?
ఉ.
పేరు
లేకేమి?
దీనినే
తైజసుడని
పిలుతురు.
ప్ర.
దీనికి
అవస్థలేమైనను
కలవా?
ఉ.
దీనికి
అవస్థ
కలదు.
ప్ర.
ఆ
అవస్థకు
పేరేమి?
ఉ.
స్వప్నావస్థ
అందురు.
4
▾
Meaning
Keep
ప్ర.
పై
చెప్పిన
స్థూల
దేహమునకు
మాత్రము
అవస్థలు
లేవా?
ఉ.
లేకేమి?
దానికి
కూడను
అవస్థలు
కలవు.
ప్ర.
ఆ
అవస్థను
యేమని
పిలుతురు?
ఉ.
దీనికి
జాగ్రదవస్థ
అందురు.
ప్ర.
కారణ
దేహమననేమి?
ఉ.
చిత్తము
జ్ఞాతతో
కూడుకున్నది.
ప్ర.
దీని
పేరేమి?
ఉ.
ప్రాజ్ఞుడని
అందురు.
ప్ర.
దీనికి
అవస్థ
యేది?
ఉ.
గాఢ
నిద్రావస్థ
(సుషుప్తి)
ప్ర.
ఇక
మహా
కారణమననేమి?
ఉ.
ఏ
తత్త్వము
లేక
స్వయం
జ్యోతియై,
సర్వ
సాక్షి
అయిన
'శుద్ధ
చైతన్యము'నే
మహా
కారణమందురు.
ప్ర.
దీనికి
నామము
కలదా?
ఉ.
'హిరణ్యగర్భుడని'
అందురు.
ప్ర.
దీనికి
అవస్థలేమైనను
కలవా?
ఉ.
అవస్థ
లేదు.
కనుకనే
అక్షర
పురుషుడని
పిలుతురు.
ప్ర.
ఈ
స్థూల
దేహమున
ఏ
ఏ
భూతము
వలన
ఏ
ఏ
పదార్థములు
పుట్టుచున్నవో
సెలవిండు.
5
▾
Meaning
Keep
ఉ.
పృథ్వి
వలన
అస్థి,
చర్మము,
మాంసము,
నరములు,
వెంట్రుకలు
పుట్టుచున్నవి.
ప్ర.
జలము
వలన
ఏమి
పుట్టుచున్నవి?
ఉ.
రక్తము,
మూత్రము,
శుక్లము,
జొల్లు,
శ్లేష్మము,
స్వేదము
పుట్టుచున్నవి.
ప్ర.
అగ్ని
వలన
పుట్టుచున్నవేవి?
ఉ.
ఆకలి,
దాహము,
నిద్ర,
సంగమము,
నిదానము
కలుగుచున్నవి.
ప్ర.
వాయువు
వలన
పుట్టునవేవి?
ఉ.
చలనము,
గమనము,
తీవ్రము,
లజ్జ,
భయము
కలుగుచున్నవి.
ప్ర.
ఆకాశము
వలన
పుట్టునవేవి?
ఉ.
కామ,
క్రోధ,
లోభ,
మద,
మాత్సర్యములు.
ప్ర.
మానవున
కనేకమైన
వ్యసనములున్నవి
కదా,
ఆ
వ్యసనములకు
పై
చెప్పిన
గుణములేమైన
కారణములగుచున్నవా?
ఉ.
ఏమైన
అని
సందేహింతువెందుకు?
అసలు
కారణమే
ఈ
గుణములు.
వ్యసనములు
కూడను
అనేకములు
లేవు.
అవి
నాలుగు
విధములు.
ప్ర.
అవియేవో
సెలవిండు?
ఉ.
తను
వ్యసనము,
మనో
వ్యసనము,
ధన
వ్యసనము,
స్త్రీ
వ్యసనము.
మిగిలినవి
యెన్ని
వ్యసనములైననూ
ఈ
నాల్గింటిపైననే
కలుగుచున్నవి.
ప్ర.
మానవుడు
మదముతో
కన్ను
మిన్ను
ఎరుగక
ప్రవర్తించుచుండునే,
ఈ
అహంకారమునకు
ఆధారమేమి?
అవి
ఎన్ని
విధములు?
6
▾
Meaning
Keep
ఉ.
ఇవి
నాలుగు
విధములయినటువంటివి
మదము
వలన
మానవుడు
కన్ను
మిన్ను
ఎరుగక
ప్రవర్తించుచుండును.
కుల
మదము,
ధన
మదము,
యవ్వన
మదము,
విద్యా
మదము,
ఇంకను
అనేక
విధముల
మదములు
కలవు.
కాని
అవి
అన్నియునూ
ఈ
నాల్గింటి
పైననే
ఆధారపడి
ఉన్నవి.
Next
The Fourteen Worlds
→