Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · The Fourteen Worlds
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్ర.
అన్ని
లోకములు
మానవునియందే
ఉన్నవని
అనుభవజ్ఞులు,
శాస్త్రములు
తెలుపుచున్నవి
కదా!
ఆ
లోకములు
యేవి?
అవి
ఉండు
స్థానములేవి?
ఉ.
భూ
లోకము
(అది
మానవుని
పాదములయందును);
భువర్లోకము
(ఇది
గుహ్యమందును);
సువర్లోకము
(ఇది
నాభియందును);
మహర్లోకము
(ఇది
హృదయమందును);
జన
లోకము
(ఇది
కంఠమునందును);
తపో
లోకము
(ఇది
భ్రూమధ్యమందును);
సత్య
లోకము
(ఇది
లలాటమందును)
కలవు.
ఈ
సప్త
లోకములు
మానవుని
అంగములందే
ఉన్నవి.
వీటిని
ఊర్ధ్వలోకములని
అందురు.
ఇంకను
అధో
లోకములు
కూడా
కలవు.
ప్ర.
అవియేవి?
వాటి
నిలయము
ఎక్కడ?
ఉ.
అతలము
(ఇది
అరికాళ్ళయందును);
వితలము
(గోళ్ళయందును);
సుతలము
(మడిమలయందును);
తలాతలము
(పిక్కలయందును);
రసాతలము
(మోకాళ్ళయందును);
మహాతలము
(తొడలయందును);
పాతాళము
(పాయువునందును)
ఉండును.
ప్ర.
సర్వ
లోకములు
పంచ
భూతముల
చేరికయైన,
ఈ
స్థూల
దేహమందే
యుండిన,
ఇందులో
సప్త
సముద్రములని
అందురు
కదా,
అవి
కూడా
ఈ
దేహములో
చేరియున్నవా
లేక
మనస్సులో
చేరియున్నవా?
ఉ.
లోకములన్నింటికి
దేహమే
నిలయమైనప్పుడు
సముద్రములు
లోకములతోటివి
కాక
ప్రత్యేకించి
యెటులుండును?
అవియును
2
▾
Meaning
Keep
ఈ
దేహముతోటి
మిళితమై
ఉన్నవి.
1.
లవణ
సముద్రము.
2.
ఇక్షు
సముద్రము.
3.
సురా
సముద్రము.
4.
సర్పి
సముద్రము.
5.
దధి
సముద్రము.
6.
క్షీర
సముద్రము.
7.
శుద్ధోదక
సముద్రము
అని
యేడు
సముద్రములు
కలవు.
అవి
లవణ
సముద్రము
మూత్రముగాను,
ఇక్షు
చెమటగాను,
సుర
ఇంద్రియముగాను,
సర్పి
దోషితముగాను,
దధి
శ్లేష్మముగాను,
క్షీరము
జొల్లుగాను,
శుద్ధోదకము
కన్నీరుగాను
ఉన్నవి.
ప్ర.
అగ్నులని
యందురే,
అవి
యెన్ని
విధములు?
వాటి
పేర్లేమి?
ఉ.
పంచాగ్నులు:
కాలాగ్ని,
క్షుధాగ్ని,
శీతాగ్ని,
కోపాగ్ని,
జ్ఞానాగ్ని.
ప్ర.
ఇవి
మానవుని
దేహమందు
ఏ
ఏ
స్థానమందు
ఉన్నవి?
ఉ.
కాలాగ్ని
పాదములందును,
క్షుధాగ్ని
నాభియందును,
శీతాగ్ని
హృదయమందును,
కోపాగ్ని
నేత్రమందును,
జ్ఞానాగ్ని
ఆత్మయందు
ఉండును.
ప్ర.
నాదములని
యందురే,
అవియు
ఈ
స్థూల
దేహమందే
ఉన్నవా?
ఉండిన
అవి
యెన్ని
విధములు?
వాటి
పేర్లేమి?
ఉ.
ఇవియునూ
స్థూలదేహమందే
ఉన్నవి.
అవి
దశ
విధములు.
లలాది
ఘోషము,
భేరీ
నాదము,
చణీ
నాదము,
మృదంగ
నాదము,
ఘంటా
నాదము,
కళా
నాదము,
కింకిణీ
నాదము,
వేణు
నాదము,
భ్రమర
నాదము,
ప్రణవ
నాదములు.
ప్ర.
సమస్త
సృష్టి
ఈ
పాంచభౌతిక
దేహమందే
యిమిడియుండిన,
ఇక
అండాండ,
పిండాండ,
బ్రహ్మాండములున్నవని
అందురే,
అవి
యేవి?
ఉ.
అండాండమనగా,
స్థావరములు
మొదలయిన
చరాచర
ఋత
మిశ్రమైన
ప్రకృతిగా
తోచు
క్షరములు.
పిండాండమనగా
3
▾
Meaning
Keep
సమస్త
ద్వంద్వములకు
హేతువగు
అంతర్గతాక్షరుడు.
ఈ
రెంటిని
ఒక్క
స్వరూపముగా
యోచించిన
యెడల,
పైన
చెప్పిన
సర్వ
ద్వంద్వములతో
కూడుకొని,
జన్మ
జన్మల
కర్మచే
జన్మ
హేతువగుచున్నది.
బ్రహ్మాండమనగా
ఆకాశాది
పంచ
భూతములవలనైన
వ్యష్టి,
మహా
భూతముల
సముదాయము.
ఆకాశ
సంబంధమైన
ఆత్మయు,
వాయు
సంబంధమైన
జీవాత్మయు,
అగ్ని
సంబంధమైన
ప్రత్యగాత్మయు,
జల
సంబంధమైన
చైతన్య
బ్రహ్మము,
ధరణి
సంబంధమైన
పరమాత్మయు
ఈ
అయిదు
పంచ
మహా
భూతములవలనైన
వ్యష్టీ
సముదాయము.
వీని
వలనే
సర్వ
ద్వంద్వ
స్వరూపముల
మిశ్ర
ప్రవర్తనలకాధారము
కలుగుచున్నది.
ఈ
పంచ
భూతములకు
అతీతమైనదే
అవ్యక్త
బ్రహ్మము.
అదే
బ్రహ్మాండము.
ప్ర.
స్వామీ!
ఈ
విషయము
సులభముగా
అర్థమగుటలేదు.
దయ
యుంచి
అనుభవ
రూపములైన
ఉపమానములతో
సెలవిందు?
ఉ.
'అండాండమ'నగా
'కను
గ్రుడ్డు',
'పిండాండమ'నగా
'బిందు'వనే
'కనుపాప'.
'బ్రహ్మాండమ'నగా
పాప
మధ్యన
వెలుగు
'కళ'.
ఆ
కళలోని
'నిష్కళ'యే
"బ్రహ్మము".
దీనిని
విశదీకరించి
చెప్పవలయుననన్న
యెంతైనను
కలదు.
సూక్ష్మబుద్ధి
కలవారికి
ఇంత
మాత్రము
చాలు.
Previous
←
The Human Body and the Senses
Next
The Four Āśramas
→