Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · The Eightfold Yoga
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్ర.
జనన
మరణము
లేని
ప్రాప్తులను
సంపాదించవలెనన్న
'యోగము'
ప్రధానమని
పెద్దలందురు
కదా,
ఆ
యోగమంటే
ఏమి?
ఉ.
చిత్త
వృత్తులను
అణచివైచి
చిత్తశుద్ధి
కొరకును,
నిశ్చలత్వము
కొరకున్ను,
జ్ఞానము
కొరకున్ను,
కుండలినీ
ప్రబోధము
కొరకున్ను,
ఆసనములను
సేవించ
వలయుననునదే
'యోగ
శాస్త్రము'
యొక్క
నిశ్చయము.
ప్ర.
అట్టి
యోగములకు
అంగములు
ఎన్ని
కలవు?
అవి
యేవి?
ఉ.
నాయనా!
వాటిని
అష్టాంగములందురు.
అవియే
యమము,
నియమము,
ఆసనము,
ప్రాణాయామము,
ప్రత్యాహారము,
ధారణ,
ధ్యానము,
సమాధి
అను
నామములతో
ఉన్నవి.
ప్ర.
ముక్తి
లభించవలెనన్నపై
"అష్టాంగ
యోగము"లను
సాధించవలెనా?
లేక
వానిలో
ఏదైనా
ఒక
దానిని
మాత్రము
సాధించిన
చాలునా?
ఉ.
నాయనా!
మొదటివైన
యమ,
నియమములను
రెండింటిని
సాధించిన
ముక్తి
లభించును.
అసలు
విశ్వపాలనంతయు
యమ,
నియమములపైనే
జరుగుచున్నది.
ప్ర.
ఎనిమిది
అంగములతో
చేరిన
యోగము
ఒక్కటియేనా
లేక
యోగములు
కూడనూ
అనేకములున్నవా?
ఉ.
యోగము
ఒకటియే
కాదు.
అనేకములు
లేవు,
నాలుగు
మాత్రము
ఉన్నవి.
2
▾
Meaning
Keep
ప్ర.
అవి
యేవి?
వాటి
నామములను
సెలవిండు?
ఉ.
మంత్ర
యోగమనియూ,
రాజ
యోగమనియూ,
లయ
యోగమనియూ,
హఠ
యోగమనియూ
వచించుచున్నారు.
ప్ర.
ఈ
నాలుగు
విధముల
యోగములకూ
ఏ
అంగములు
ప్రధానములు?
ఉ.
పిచ్చివాడా!
ఎన్ని
కోట్లమంది
ప్రజలకైననూ
చూచుటకు
నేత్రములెట్లు
ప్రధానమో,
ఎన్ని
రకముల
యోగములకైననూ
యమ,
నియమములు
అట్లు
ప్రధానము.
అవి
లేక
దేనినీ
దర్శించలేరు.
స్వాత్మశుద్ధి
ప్రతియోగికీ
అవసరము.
అట్టి
స్వాత్మశుద్ధికి
యమ
నియమములు
ఆవశ్యకము.
ప్ర.
యమ,
నియమములకు
తిరిగీ
ఒకదానికొకటి
భేదములేమైననూ
ఉన్నవా?
లేక
రెండునూ
సమాన
భేద
రహితమై
యున్నవా?
ఉ.
ఒక్కొక్క
దానికి
పది
పది
భేదములున్నవి.
అవి
దృఢమైనపుడే
మోక్షము
సిద్ధించును.
ప్ర.
అటులయిన
'యమము'నకుండిన
పది
భేదములేవో
తెలుపుడు?
ఉ.
అహింస,
సత్యము,
అస్తేయము,
బ్రహ్మచర్యము,
దయ,
ఆర్జవము,
క్షమ,
ధృతి,
మితాహారము,
శౌచము,
ఈ
పదియూ
యమము
యొక్క
భేదములు.
ప్ర.
ఇక
'నియమము'నకు
గల
పది
భేదము
లేవి?
ఉ.
తపస్సు,
సంతోషము,
ఆస్తిక్యబుద్ధి,
దానము,
ఈశ్వరపూజనము,
వేదాంత
వాక్య
శ్రవణము,
లజ్జ,
మతి,
జపము,
వ్రతము,
ఈ
పదియూ
నియమమనబడుచున్నవి.
కాన,
నాయనా!
ముక్తి
అను
సౌధము
దృఢముగా
నుండవలెనన్నచో
యోగులందరకి
యమ
నియమములను
పునాదులు
భద్రముగా
నుండవలెను.
3
▾
Meaning
Keep
ప్ర.
ఇక
'ఆసనముల'
యొక్క
ప్రయోజనమేమి?
ఉ.
అవి
కూడనూ
ఆత్మజ్ఞానులకు,
యోగులకు
సహాయకారియై
యున్నవి.
ప్ర.
ఆసనములో
కూడనూ
రకములున్నవా?
అవియేవి?
ఉ.
ఆసనములో
కూడనూ
అనేకములున్నవి.
కానీ
సిద్ధాసనము,
బద్ధ
పద్మాసనము,
సర్వాంగాసనము,
పద్మాసనము
ముఖ్యమైనవి.
మిగిలిన
మరికొన్ని
మయూర,
పశ్చిమోత్తాసనాదులు
కూడనూ
కలవు.
ప్ర.
ఈ
ఆసనముల
వలన
కలుగు
ఫలితమేమి,
వాటి
ఉపయోగములేవి?
ఉ.
ఇవి
శరీర
దృఢత్వమునకును,
చిత్తము
చాలా
సేపు
ధ్యానానుకూలమగుటకు
శక్తిని
ప్రసాదించును.
ప్ర.
ఇక
'ప్రాణాయామ'
మెట్టిది?
అది
యెన్ని
విధములు?
ఉ.
అది
కూడనూ
అనేకములున్నవి.
కానీ,
అవి
ఈ
కలిలో
అసాధ్యమైనందున,
ధ్యాన
యోగమైన
వాటిని
మాత్రమే
తీసుకొనవలెను.
అందు
'లఘు
ప్రాణాయామము'
సర్వోత్తమమైనది.
ప్ర.
ఇది
చేయు
ఉపకారమేమి?
ఉ.
అగ్నిలో
దహింపబడిన
లోహము
శుద్ధమగునటుల
ప్రాణాయామాగ్నిచే
కర్మ
కాష్ఠములన్నియూ
దహించి,
చిత్తమును
శుద్ధిపరచును.
కాయశుద్ధి,
మనోశుద్ధి
మొదలైన
ప్రయోజనములు
దీని
వలన
కలుగును.
ఇది
రెండు
విధములుగా
కూడా
ఉన్నది.
మంత్రముతో
కూడినది,
మంత్ర
రహితమైనది
అని.
మంత్ర
భావముతో
కూడిన
'ప్రాణసంయమము'
పుణ్యమైనది.
పాపారణ్యమును
దహించును.
'ఆత్మశుద్ధి'
కలుగ
జేయును.
భావ
రహితమైన
ప్రాణాయామము
శరీర
సంరక్షణమును
మాత్రము
చేయును.
4
▾
Meaning
Keep
ప్ర.
అదియెట్లు
అభ్యసించవలెనో
సెలవిండు?
ఉ.
రెండు
మాత్రల
కాలము
పూరకము,
నాలుగు
మాత్రల
కాలము
రేచకము,
ఎనిమిది
మాత్రల
కాలము
కుంభకము.
ఈలాగున
ప్రాణాయామమును
మూడు
మాసములు
బహు
జాగ్రత్తగా
అభ్యసించవలయును.
తదుపరి
ప్రాణాయామమును
రెట్టింపు
చేసి
మూడు
మాసములు
అభ్యసించవలయును.
ఈలాగున
మొత్తము
ఆరు
మాసములు
ప్రాణ
సంయమమొనరించు
వాడు
సకలేంద్రియ
వృత్తులు
శమించును.
భావ
రహితమైన
ఈ
త్రివిధ
ప్రాణాయామము
స్థూల
దేహ
శుద్ధిని
మాత్రము
కలిగించును.
భావ
సహితమైన,
చిత్తవృత్తులు
శమించును.
వీటికి
శుద్ధాహారము,
బ్రహ్మచర్యము,
ఏకాంతవాసము,
మితభాషణము,
ఇవి
ముఖ్య
నియమములుగా
పాటించవలయును.
ప్ర.
ఇక
'ప్రత్యాహార'మన
నేమి?
అవి
ఎన్ని
విధములు?
ఉ.
ఇది
ఆత్మ
భావన
అయి
శ్రేష్ఠమైనదై
యున్నది.
సాకారము,
నిరాకారము,
ఆత్మ
భావన
అని
మూడు
విధములుగానున్నది.
సగుణత్వరూప
ధ్యానమునే
'సాకార'మనియూ,
కరుణామయ
సత్య
శాన్త్యాది
విశిష్ట
పరమాత్మ
భావనను
'నిరాకార'మనియు,
"సత్యంజ్ఞానమనంతం
బ్రహ్మ"
అను
పరబ్రహ్మయే
ఆత్మయని
భావించుటనే
'ఆత్మ
భావన'మనియూ
అందురు.
ప్ర.
'ధారణ'
అనగా
నేమి?
అది
యెన్ని
విధములు?
ఉ.
నాయనా!
ఇది
ఏక
రూపమును
మాత్రము
పొందియున్నది.
భూమి
పర్వతమును
ధరించు
విధమున
నిశ్చల
చిత్తముతో
బ్రహ్మ
భావమును
కానీ
లేక
ఇష్ట
దైవమును
కానీ
ఏ
ధీమంతుడు
ధరించునో
ఆ
ధరించుటనే
ధారణయని
అందురు.
5
▾
Meaning
Keep
ప్ర.
ధ్యానమనగా
నేమి?
ఇది
యెన్ని
విధములు?
ఉ.
ఇదియునూ
ఒకే
రూపమును
పొందినది.
సాకారమైననూ,
నిరాకారమైననూ
ఇతర
భావములు
లేక
తదేక
భావనతో
కూడినదైనచో
దానిని
ధ్యానమని
అందురు.
ప్ర.
సమాధి
అనగా
నేమి?
ఉ.
వృత్తులను
నిగ్రహించి,
మనస్సును
పరమాత్మయందు
లెస్సగా
యుంచుట
అని
అర్థము.
స్వస్వరూప
స్థితినే
సమాధి
అందురు.
ద్వైత
రహితమై
యుండునదే
సమాధి.
గాలిలేని
చోట
దీపమెట్లు
నిశ్చలముగా
ఉండునో
ఆ
విధముగా
చిత్తము
నిశ్చలముగా
నుండుట
సమాధి
అందురు.
ప్ర.
నిశ్చల
చిత్తమనగా
ఎట్టిది?
అర్థమగు
ఉపమానములతో
తెలుపుడు?
ఉ.
నాయనా!
మిగుల
సూక్ష్మమగు
సూది
యొక్క
రంధ్రములో
దారము
ఎక్కింపవలెనన్న
హస్తముల
యొక్క
నిశ్చలత్వము,
దారము
కొన
యొక్క
ఏకత్వము
ఎట్లు
అవసరమో,
అటులనే,
అతి
సూక్ష్మాతి
సూక్ష్మమయిన
పరమాత్మ
అనుగ్రహమను
రంధ్రమును
చేరవలెనన్న
చిత్తమను
హస్తము
యొక్క
నిశ్చలత్వము,
సర్వేంద్రియముల
యొక్క
ఏకత్వము
అత్యవసరము.
Previous
←
Tapas