Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśnottara Vāhini · Tapas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్ర.
ఇట్టి
'ఆత్మ
జ్ఞానము'ను
తెలిసికొని
'ప్రణవ
స్వరూపము'న
లీనము
కావలెనన్న
ఈ
పాంచ
భౌతిక
శరీరముతో
సాధ్యమగునా?
ఇందులో
ఉన్న
ఆత్మను
వేరుచేయ
వీలగునా?
అట్లు
వీలగునేని
ఈ
శరీరము
నుండి
ఆత్మను
ఎట్లు
వేరుచేయవలెనో,
చెప్పుడు?
ఉ.
పెరుగునందున్న
వెన్నను,
నువ్వులలో
ఉన్న
నూనెను,
భూమిలో
మట్టితో
చేరి
ఉండిన
నీరును,
కఱ్ఱలో
(దానిని
కాల్చక
చేరియున్న)
నిప్పును
ఏ
రీతిగా
మానవుడు
వాటిని
మధించి
వేరు
చేయుచున్నాడో
అటులనే
సాధకుడు,
పాంచ
భౌతికమైన
దేహము
నుండి
ధ్యానాది
అనుష్ఠానములచే,
ప్రణవాది
మంత్రములచే
శరీరము
నుండి
ఆత్మను
వేరు
చేయవలెను.
మధించక
వెన్న,
నూనె
ఏ
రీతిగా
మనకు
లభించవో,
అటులనే
పాంచ
భౌతికమైన
దేహమును
ధ్యానాది
అనుష్ఠానములతో,
ప్రణవ
సహితమైన
మంత్రములతో
సాధన
సలుపకున్న
ఆత్మ,
దేహము
నుండి
వేరు
కాక
దేహమే
ఆత్మయను
అజ్ఞాన
రూపమును
పొందవలసివచ్చును.
ప్ర.
"జీవాత్మను
పరమాత్మ
స్వరూపకంగా
దర్శించండి,
భావించండి"
అని
అనేకమంది
పెద్దలు
చెప్పుదురే,
అదెట్లు
సాధ్యమగును?
ఉ.
ఎందుకు
సాధ్యము
కాదు?
ఉన్నదున్నట్లు
చెప్పుటకు
సాధ్యము
కానప్పుడు,
లేని
దానిని
ఉన్నటుల
చెప్పుటకు
సాధ్యమగునా
పిచ్చివాడా?
పుష్పము
నుండి
గంధమును,
చెఱకు
నుండి
రసమును,
రాయి
నుండి
బంగారును
ప్రయత్నముచే
వేరు
చేసినటుల,
ధ్యానాది
2
▾
Meaning
Keep
సాధనలతో
ఈ
భౌతిక
దేహముకంటే
జీవుడు
వేరని
తెలిసికొని,
నిదిధ్యాసనాదుల
ద్వారా
జీవాత్మను
పరమాత్మ
స్వరూపునిగా
దర్శించవలెను.
ఇట్టి
అభేద
జ్ఞానమే
పరమ
నిర్యాణము,
తపఃశక్తి.
ప్ర.
తపస్సనగా
ఎట్టిదో,
సెలవిందు?
ఉ.
సకలేంద్రియ
వృత్తులను
నశింపజేసి,
జితేంద్రియులై,
కంద
మూలాదులను
భక్షించి,
అనగా
జిహ్వా
చాపల్యమునూ,
గుహ్య
చాపల్యమునూ
వీడి
బ్రహ్మ
ప్రాప్తి
కొఱకు
ప్రయత్నించుట,
పాటుపడుట,
పరితపించుట.
మిత
నిద్ర,
మిత
తిండి
సేవించుచూ,
తత్త్వ
విచారముతో
కూడిన
తాపమే
తపము.
దీనిని
సాత్త్విక
తపస్సందురు.
ప్ర.
ఇక
రాజసిక
తపస్సనగా
ఎట్టిది?
ఉ.
కేవలము
ఇంద్రియ
నిగ్రహమునకు
పాటుపడక
శరీరముల
తపింపజేయుచూ,
ఆత్మ
బోధము
లేక,
రాగ
ద్వేషములతో
కూడుకొని
యుండునట్టిది.
అనగా
వృత్తులను
అణచక
శరీరమును
తపింప
జేయునదని
తెలిసికొనవలెను.
ప్ర.
తామస
తపస్సనగానేమి?
ఉ.
వరముల
కొరకు
తపస్సు
ఆచరించి,
దేవతలను
కూడనూ
వశపరచుకొని,
వరములు
పొంది,
కడకు
లోక
నాశనమును
కోరుదురు.
అనగా
ఆ
శక్తులచే
లోకమును
ధ్వంసము
చేతురు.
అట్టి
దానినే
తామస
తపస్సని
చెప్పవచ్చును.
భగవత్
ప్రాప్తి
కొరకు
గానీ,
బ్రహ్మ
సాక్షాత్కారమునకు
గానీ,
జ్ఞాన
సిద్ధికి
గానీ,
ఇంద్రియ
వశమునకు
గానీ
చేయు
తపస్సు,
శాస్త్ర
సమ్మతమైన
తపస్సనియు,
మిగిలిన
వన్నియూ
సద్గతిని
కలిగించలేని
కల్పనా
తపస్సులనియూ
తెలిసికొనవలెను.
శాస్త్ర
సమ్మతమైన
తపస్సునే
తపస్సందురు
3
▾
Meaning
Keep
కానీ
మిగిలినవన్నియూ
తమస్సులే.
నిజముగా
తపస్సన
సమస్త
పాపములను
దహించి,
సర్వ
కర్మలను
నశింపజేయుటయే!
ప్ర.
ఋష్యాశ్రమములలో
సమస్త
మనోరథముల
నిచ్చు
కామధేనువులు,
కల్పవృక్షములు,
చింతామణులూ
ఉండునని
శాస్త్రములలో
తెలుపబడినవి
కదా?
ఇట్లుండగా
ఇక
ఋషులు
మనోభీష్ట
ప్రాప్తికి
తపస్సెందుకు
చేతురు?
అర్థమగుట
లేదు.
దయచేసి
వివరముగా
తెలుపుడు?
ఉ.
నాయనా!
చక్కగ
విచారించగా
కల్పవృక్షమనునది
ఒక
వృక్షమని
కానీ,
కామధేనువనునది
ఒక
గోవు
కానీ,
చింతామణి
అనునది
ఒక
మణి
కానీ
కాదు.
ఇవియే
తపస్సు
యొక్క
ప్రభావములు.
యోగి
నిర్వికల్ప
స్థితిని
పొందినపుడు
కామములను
సకల
సిద్ధులనొసగును.
దానిని
కల్పవృక్ష
రూప
సిద్ధి
అనియు,
ఎపుడు
జితకాముడగునో
అపుడు
కామధేను
సిద్ధి
అనియూ
కలుగుచున్నది,
పిలువబడుచున్నవి.
బహు
దుఃఖముల
దూరీకరించునట్టి
నిశ్చింత
భావమే,
చింతామణి
అనబడును.
ఎపుడు
చింతలుడిగి
పరమానందము
కలుగుచున్నదో
అపుడే
చింతామణి
సిద్ధించును.
ఇవి
మనోవాక్కాయములను
మూడు
విధములుగా
ఉన్నవి.
ప్ర.
మానసిక
తపస్సనగా
నెట్టిది?
ఉ.
భావశుద్ధి,
మౌనము,
సౌమ్యత్వము,
తత్త్వచింత
ఇత్యాది
వృత్తులు
ఉండిన
మానసిక
తపస్సనబడును.
ప్ర.
వాక్తపస్సనగానేమి?
ఉ.
దివ్య
మంత్ర
జపము,
వేదాంత
తత్త్వాధ్యయనము,
ప్రియముగను,
సత్యముగను,
హితముగను,
మితముగను
సంభాషించుటయూ
ఇత్యాది
వృత్తులు
గలవాటిని
వాక్తపస్సు
అనబడును.
4
▾
Meaning
Keep
ప్ర.
కాయ
తపస్సనగా
నెట్టిది?
ఉ.
పెద్దలను,
గురువును,
దైవమును,
మహనీయులను
పూజించుచూ
బ్రహ్మచర్య,
అహింస,
ఋజుత్త్వము
మొదలగు
శరీర
వృత్తులను
కలిగియుండుట
కాయ
తపస్సందురు.
శరీర
తపస్సుచే
"కాయశుద్ధి,"
మానసిక
తపస్సుచే
"మనశ్శుద్ధి,"
వాక్తపస్సుచే
"వాక్శుద్ధి"
కలుగును.
ఈ
మూడింటి
వలననే
మూడు
అభీష్ట
రూపములైన
కల్పవృక్ష,
కామధేను,
చింతామణులు
ప్రాప్తించును
కానీ
అవి
బాహ్యమైన
వృక్షములు,
గోవులు,
మణులు
కావు.
ప్ర.
తపో
మహిమ
చేత
బ్రహ్మ
తత్త్వమును,
ధర్మ
తత్త్వమును
పొందిన
మహనీయులెవరైనా
కలరా?
వారెవరో
సెలవిందు?
ఉ.
కపిల
మహాముని
బ్రహ్మ
తత్త్వమును
పొందినది,
జైమిని
మహాముని
ధర్మ
శాస్త్రమును
చేసినదీ,
నారదముని
బ్రహ్మర్షియైనది,
భగీరథుడు
గంగానదిని,
గౌతముడు
గోదావరీ
నదిని
ప్రవహింప
జేసినది,
వాల్మీకి
రామ
మంత్ర
ప్రభావమును,
రామాయణమునూ
వ్రాయగలిగినదీ,
గార్గి
బ్రహ్మచర్య
వ్రతమును,
సులభ
బ్రహ్మ
తత్త్వమును
సాధించినదియూ
తపోమహిమ
వలన
కాక
మరేమి?
వేయేల?
తపో
మహిమచే
బ్రహ్మ
రుద్రాదులను
కూడనూ
పసిపాపలుగా
చేయ
వీలగును.
ప్ర.
ఇట్టి
పవిత్ర
స్థానమును
పొందుటకు,
ఉత్తమ
జాతి
అవసరమా?
లేక
ఉత్తమ
సాధన
అవసరమా?
ఉ.
నాయనా!
నీతి
లేని
జాతి
నిష్ప్రయోజనము.
గుణము
లేని
సాధన
గుడ్డి
ప్రయాణము.
కాన
నీతి,
గుణము
ప్రధానములు.
వాటిపై
ఆయా
మార్గముల
క్రమములు
పాటించి
సాధన
సల్పిన,
ఎట్టి
వారైననూ
పునీతులు
కాగలరు.
అయితే
ఇక్కడ
కొంత
యోచించవలెను.
ఏమన,
5
▾
Meaning
Keep
'జాతి
అవసరము
లేదు
కదా?'
అని
ఉదాసీనత
చూపకూడదు.
నీతి
జాతిని
పట్టి
కూడా
వచ్చును
కాన,
ఆ
నీతిని
పోషించుకొనుటకు
జాతి
కూడా
అవసరము.
కానీ,
వారి
వారి
జన్మాంతర
పుణ్య
విశేషమున,
నీతి,
ఉత్తమ
గుణములతో
చేరియుండిన
జాతి
పాటించ
నక్కర
లేదు.
ఇది
జన్మాంతరమున
యోగ
భ్రష్టులైన
వారల
జన్మములు
అటులుండును.
అందరికీ
ఈ
రీతిగా
ప్రాప్తించదు.
జాతిని
నీతితో
పోషించిన,
ఉత్తమ
స్థానము
కూడా
లభించును.
కొంత
దూరము
వరకూ
జాతి,
నీతి
ఆధారముగా
ఉండక
తప్పదు.
వీటి
వలన
గుణములు
పరిశుద్ధమగును.
ప్ర.
అట్లయిన
జన్మాంతర
సుకృతముచే
అధమ
జాతులందు
కూడా
జన్మించి
భగవతత్త్వమును
తెలుసుకున్నవారిలో
కొందరిని
తెలుపుడు?
ఉ.
నాయనా!
నది
మూలము,
ఋషి
మూలము
వెతుకరాదు.
కావలసినది
వాటి
సారము.
అనుభవము
ప్రధానము.
వాటి
ఫలముననుభవించిన
ధన్యులగుదురు.
మూలము
వెతుకుటలో
సారము
అనుభవించలేరు
కానీ
నీవు
అడుగుచున్నావు
కనుక
తెలుపుచున్నాను.
వినుము!
వ్యాసమహర్షి
జాలరి
కులమున
పుట్టెను.
వశిష్ట
మహర్షి
వేశ్యయగు
ఊర్వశికి
జన్మించెను.
శౌనక
మహాముని
శునక
వంశమున
పుట్టెను.
అగస్త్యుడు
ఘటమున
జన్మించెను.
విశ్వామిత్రుడు
క్షత్రియ
కులమున
పుట్టెను.
ఖగోళ
మహాముని
వైశ్య
వంశమున
జన్మించెను.
సూత
మహాముని
చతుర్థ
వంశమున
(శూద్ర)
జన్మించెను.
ఇక
సహజులుగా
జన్మించి,
సద్గుణములతో
జాతి
ధర్మమును
దేహ
ధర్మములను
కొంత
కాలము
పాటించి,
సత్యము
నెఱింగి,
తదుపరి
సర్వమునూ
దూరీకరించి,
సర్వదా
ముక్తిని
స్వవశము
చేసుకొన్న
6
▾
Meaning
Keep
విదురుడు,
సంజయుడు,
సత్యకాముడు
మొదలగు
వారలు
కూడా
అనేకమంది
ఉన్నారు.
నాయనా!
పురుష
ప్రయత్నము,
వివేకము,
తపస్సు
వీని
వలన
కలుగు
గుణములే
మహోన్నత
స్థితికి
కారణములు.
మానవ
జాతికి
ఆత్మశుద్ధిలేక,
యే
జాతియందు
జన్మించిననూ
ముక్తిని
పొందలేరు.
మలినమైన
రాగితో
కూడిన
బంగారము
వెల
తగ్గినదగుచున్నది.
అలాగుననే
తాను
శుద్ధ
విరాడ్రూపుడైనను,
సంసార
సంసర్గములచే
అహంకారముతో
కూడిన
జీవుడగును.
జీవుడును
తపోవ్రత
సంస్కృతుడై
శుద్ధ
బుద్ధియుతుడై
నిజ
స్థానమగు
పరమాత్మ
స్వరూపమును
పొందును.
కాలని
కుండ
జల
స్పర్శముచే
కరిగి
మట్టి
యగునటుల
తపస్సుచే
పరిపక్వము
కాని
వారి
మనస్సు
విషయ
దోషముల
సంబంధముచే
విషయములో
ప్రవేశించుచున్నది.
తపోగ్నిచే
దహించబడిన
కుండను,
సముద్రమున
పడవేసిననూ
కరుగకయుండును.
తీవ్ర
తపోవహ్నిచే
నిశ్శేషముగా
దహింపబడిన
కర్మ
బీజములు
కలవారు
గనుకనే
జ్ఞానసంపత్తి
గలవారై,
నిర్మల
తత్త్వముచే
ముక్తులై
జనన
మరణముల
జెందని
వారగుచున్నారు.
Previous
←
Mantra and Japa
Next
The Eightfold Yoga
→