Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 1
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
అసలు
ప్రశాంతి
అన్న
పద
అర్థము
సహితము
ఏమో
ఎరుగనివారుకూడా
ఉన్నారు.
అది
ప్రతి
మానవునకు
వెన్నెముక
వంటిది.
సాధనకు
శ్వాసవంటిది.
ప్రశాంతి
అన్న
ఒక్కొక్కరు
ఒక్కొక్క
అర్థము
తీసుకొని
లౌకిక
సంబంధమైన
కార్యములు,
అభీష్టములు
నెరవేరిన
అదియే
శాంతి
అని
తలంచుదురు.
అది
నిజశాంతికాదు,
క్షణశాంతి.
ప్రశాంతి
అన,
'ప్ర'
అనగా
వికసింపజేయుట,
'శాంతి'
అనగా
కామక్రోధ
రాహిత్యము.
కామక్రోధ
రాహిత్యమును
వికసింప
చేయుటే
ప్రశాంతి
అని
అర్థము.
శమము
మానవునకు
ముఖ్యాంగముగా
భావించవలెను.
అట్టి
శమమును
అభివృద్ధి
చేయుటే
సాధకుని
కర్మ.
సాధకునకు
సార్థకము
ప్రధానముకదా?
శాంతే
సార్థకము.
అది
మానవునకు
స్వభావసిద్ధముగా
నుండునది.
వివేక,
వైరాగ్య
విచక్షణలు
మానవునకే
ప్రత్యేక
అంగములనియూ,
వాటిని
పెంపొందించు
బలమే
శాంతి
అనియూ,
అది
ఆత్మయొక్క
కళయనియు.
సర్వ
కార్యములందు,
సర్వశక్తులందు,
సర్వానుభవములందు,
శాంతి
ఆత్మను
పోలినదనియు
అందురు.
శాంతికికూడ
ఆది,
అంత్యములు
లేవు.
ఏ
కళంకము
రాదు.
దానికి
అదియే
సాటి.
మరొకదానితో
పోల్చుటకు
వీలులేదు.
అది
మనోవాక్కాయ
కర్మలయందు
సమానముగానే
యుండవలెను.
అదే
నిజశాంతి,
ప్రశాంతి.
ఆ
ప్రశాంతి
లేక
లౌకిక,
ఆముష్మిక,
కైవల్యములందుకూడ
సౌఖ్యము
చేకూరదు.
సర్వ
సౌఖ్యములకు
శాంతియే
పుట్టినిల్లు.
త్యాగరాజు
చెప్పినట్లు
"శాంతము
లేక
2
▾
Meaning
Keep
"సౌఖ్యము
లేదు".
ఇది
ఎట్టివారికైన
కావలెను.
దాంతుని
మొదలు
వేదాంతుని
వరకు
శాంతి
అవసరము.
అది
లేక,
లోకము
నిమిషము
సహితము
నిలువలేదు.
క్రోధము
లేనంత
మాత్రమున
శాంతి
అనకూడదు.
మనోభీష్టము
నెరవేరినంతమాత్రమున
శాంతి
వచ్చినదనకూడదు.
వచ్చిన
శాంతి
ఇంకే
కారణములవల్లనైనా
తిరిగి
మారకూడదు.
అది
ప్రశాంతి.
శాంతికి
మార్పులు
లేవు.
నేడు
ఒక
విధము,
రేపు
మరొక
విధము,
సంతోషమున
ఒక
విధము,
దుఃఖమున
ఇంకొక
విధము
-
ఈరీతిగా
మార్పుచెందుచుండదు.
అట్టి
మార్పును
రానీక
సుఖ
దుఃఖములను,
మంచిచెడ్డలను
సమముగా
ఆనందింపజేయునదే
శాంతి.
దానిని
ఎట్లు
పొందవలెనో,
దాని
ఉపయోగము
లేవో,
దాని
గుణగణములేవో
తెలుపునట్టిదే
ప్రశాంతి
వాహిని.
దీనిని
ప్రతి
సాధకుడు
అనుభవించ
హక్కు
కలదు.
పొందుటకు
మార్గము
కూడా
కలదు.
ఈనాటి
ప్రపంచము
రాజతంత్రాలతో,
అనాత్మ
వాదములతో
పోటాపోటీలలో
ప్రబలమై
యున్నది.
ఇది
చాలా
అవమానస్థితి.
మానవుడు
తన
మిక్కిలి
ముఖ్యమైన
దివ్య
స్వభావమును
పూర్తిగా
మరచిపోవుచున్నాడు.
ఇట్టి
తరుణమున
అత్యవసరమైనది
యేది
అన్న
శాంతి,
ప్రేమ.
ఈ
రెండు
సర్వవ్యాప్త
గోచరత్వము.
ఇప్పటి
ప్రపంచస్థితి
దుష్టస్వభావమనే
జబ్బుచే
పీడింపబడుచున్న
రోగిలా
కనిపించుచున్నది.
ఈ
భయంకర
రోగమైన
దుష్టస్వభావమును
కుదర్చగల
ఔషధము
తిన్నని
విద్య,
నీతిశాస్త్ర
సంబంధమైన
తర్ఫీదు.
ఇవి
తప్ప
ఇతరమందులేవియు
పనిచేయవు,
జబ్బును
కుదర్చలేవు.
ఇట్టి
జబ్బుతో
అవస్థపడుచున్న
ప్రపంచమునకు
శాంతిని
చేకూర్చవలెను.
అట్టి
శాంతిని
నిలబెట్టుటకు
ఒక్క
ప్రేమతప్ప
వేరు
ఆయుధములు
పని
చేయవు.
ప్రేమ
అను
కట్టెలలో
నుండి
పుట్టే
దివ్యజ్యోతే
శాంతి.
మానవ
ఐకమత్యము,
ఆధ్యాత్మిక
తెలివి,
ఈ
రెండూ
లోకశాంతికి
ముఖ్యముగా
ఉండవలెను.
జీవితమునకు
ఆత్మసాధన
పునాది
అయి
ఉండవలెను.
అప్పుడే
మానవుడు
శాశ్వతమైన
శాంతిని
3
▾
Meaning
Keep
పొందగలడు.
శాంతములేక,
సౌఖ్యము
అనుభవించలేదు.
శాంతి,
ఇది
ఆత్మయొక్క
స్వభావము.
పేరాశగల
మానవునియందు
శాంతి
ఉండనే
ఉండదు.
శాంతి
పవిత్ర
హృదయములోనే
ఉండును.
శాంతి
యోగీశ్వరులకు,
ఋషులకు,
సత్పురుషులకు
అలంకారము.
వాస్తవమైన
అంతఃశాంతి
బాహ్యస్థితిమీద
ఆధారపడదు.
ఇది
స్వార్థపరుల
దగ్గరనుండి,
కామతృష్ణగలవారినుండి
విడిచి
పారిపోవును.
వారిచెంత
ఉండ
ఇష్టపడదు.
అంతరాత్మయొక్క
అద్భుతకరమైన
అచంచలమే
వాస్తవమైన
శాశ్వత
ప్రశాంతి.
అసమ్మతము
లేనిదానిని
శాంతి
అనుకొందురు.
ఆధ్యాత్మిక
ఔన్నత్యము,
ఆ
ఆనందము
సహజమైన
తెలివి
కూడా
శాంతిలో
ఇమిడియున్నది.
నిజశాంతి
చిత్తవృత్తులను
అరికట్టుటవల్ల
లభించును.
అదే
ప్రశాంతి.
ఆ
ప్రశాంతియొక్క
అనుభవమే
ప్రశాంతి
వాహినిగా
పారుచుండును.
పెద్ద
అలలవలె
పైకి
క్రిందికి
కదలించే
మనోవికారమును
వశపరచుకొంటే,
ఎగిరి
ఎగిరిపడే
ఇష్ట-అయిష్టము,
ప్రేమ-ద్వేషము,
సుఖము-బాధ,
ఉల్లాసము-అధైర్యములను
జయిస్తే
శాంతి
స్థిరముగా
మీ
సొత్తుగనే
నిల్చును.
శాంతి
ఆత్మ
స్వరూపము.
ఆత్మ
ప్రతివస్తువునందు
ఉన్నది.
శరీర
మనసులు
రెండును
చచ్చేవే.
ఈ
రెండును
మిశ్రమ
పదార్థములు.
ఆత్మ
చిరంజీవి;
సర్వత్రా
వ్యాపించినది.
అతి
సూక్ష్మమైనది
కాబట్టి
ఆత్మ,
తెలివిద్వారా
తెలిసికొనే
వస్తువుకాదు.
ఆత్మ
తెలివికి
ఉత్పత్తి
స్థానము.
పరిపక్వము,
స్వేచ్ఛ,
చిరంజీవత్వము,
శాశ్వత
పరమానందము,
శాశ్వత
శాంతి
వీటిని
పొందుటకు
ఏదైతే
దారి
చూపుచున్నదో,
అదియే
జ్ఞానము.
ఇంద్రియ
లోలత్వము
కలవాడు
ఆత్మను
పొందలేడు.
మార్పుగల
వస్తువులలో
శాశ్వతమైనదేదో
అదే
బ్రహ్మము.
బయట
సంభవించే
మార్పువల్ల
ఆత్మయొక్క
తేజస్సు
మలినముకాదు.
శరీరము
ఆత్మకాదు.
ఆత్మ
ఏదియూకాదు.
ఆత్మ-ఆత్మనే.
బ్రహ్మమే
-
సత్య
ప్రేమ,
వెలుతురు;
మూర్తీభవించిన
శాంతి
జ్ఞానము,
పరమానందము
అయిఉన్నది.
పై
మార్గాలలో
ఏ
ఒక్కటి
మీరు
సాధించిననూ
బ్రహ్మను
పొందవచ్చును,
సత్యము.
4
▾
Meaning
Keep
మనము
అనుభవించు
పంచేంద్రియములుకానీ,
మనస్సుకానీ,
బుద్ధికానీ,
జీవశక్తికానీ
లేక
ప్రాణముకానీ
ఇవి
ఏవియూ
ఆత్మకావు.
ఆత్మయొక్క
స్వభావమును
అది
యేదికాదో
చెప్పుచూ
వర్ణించగలరేకాని,
ఆత్మ
ఫలానిది
అని,
అది
ఇది
అని
వర్ణింప
నెవరితరమూకాదు.
అట్లు
తెలుపుదురా
వారికి
ఆత్మ
విషయమే
తెలియదన్నమాట.
తెలియనివాటికి
ఏపేరైనా
పెట్టుకొనవచ్చు,
ఏమైనా
చెప్పవచ్చు.
మొత్తముపై
అది
ఇట్టిదని
తెలుప
సాధ్యముకాదు,
యెట్టివారికైనాసరే.
బ్రహ్మముయొక్క
సహజ
నైజము
ఏమంటే
అదియే
మట్టముకాని
సర్వోత్కృష్టమైన
శాంతి.
భ్రమ,
అనుమానము,
తొందరలు,
బాధలు
వీటిని
ఆత్మజ్ఞానము
నిర్మలము
చేస్తుంది.
ఆత్మజ్ఞానమన్న
శాశ్వతమైన
శాంతి.
అదే
పవిత్రత,
సుఖము
కలిగిస్తుంది.
మానవుని
సహజ
స్వభావము
ఆనందమే.
అయితే
మానవుడు
ఎల్లప్పుడు
ఆనందమున్న
చోటులో
తప్ప
ఇతర
చోటులన్నియు
ఆనందముకొరకు
వెతుక
ప్రయత్నిస్తాడు.
ఆనందము
అచేతనమైన
జీవితముకాదు.
అది
చైతన్యముగల
జీవితము.
ఈ
యావత్తు
ప్రపంచము
పాలించు
చట్టమే
ఆనందము.
అట్టి
ఆనంద
చట్టమును
అమలులో
పెట్టునట్టి
అధికారే
శాంతి.
శాంతి
అన్నింటికి
చాటుననుండి
వాటిని
భరించే
ప్రతినిధి.
ఘడియ
ఘడియకు
మార్పుచెందే
మనస్సు,
ఇంద్రియములు
మొదలగు
కర్తృత్వములద్వారా
మార్పులేని
శాంతి
తెలిసికొనబడదు.
శాంతిని
సహజ
జ్ఞానముద్వారా
సాక్షాత్తుగా
అనుభవించవలెను.
శాంతజ్ఞానమే
ఉత్తమోత్తమ
సంపద.
మరణము
లేనిదానిని,
నాశనము
లేనిదానిని,
మార్పు
లేనిదానిని
ఎవడైతే
తెలుసుకొంటాడో
వాడు
శాంతుడు.
వాడు
ఎన్నటికీ
చావడు.
శాంతి
ఒక
తీరము,
ఉపరిభాగములేని
సముద్రము.
ఇది
శుద్ధజీవితము.
శాంతియే
ఈ
ప్రపంచముయొక్క
వెలుతురు.
శాంతి
ఉన్ననే
సమస్తము
ఉండును.
శాంతి
ప్రకాశించుచున్నది,
కనుకనే
సమస్తమూ
ప్రకాశించుచున్నది.
శాంతము
రెండింటిని
తెలియజేయదు.
అది
ఒక్క
బ్రహ్మను
మాత్రమే
తెలియజేయును.
అట్టి
బ్రహ్మను
విధిగా
తెలిసికొనవలెను.
5
▾
Meaning
Keep
సాక్షాత్కారము
పొందవలెను.
అదియే
మానవ
జన్మముయొక్క
నిజసారము.
వేదాంతము
సర్వవ్యాపకమైన
ఆత్మను
బోధించును.
పుష్కలముగానుండు
ప్రేమను
సూచించుటకు
శాంతియే
సరియైన
మూలాధారము.
శాంతియొక్క
ఆలోచనే
క్రమపద్ధతి
అని
తలంచరాదు.
అది
క్రమజీవితమునకే
క్రమపద్ధతి.
మానవుడు
పుట్టినప్పుడు
మానవ
మనస్సు
ఏమీ
వ్రాయని
తెల్ల
కాగితమువలె
నిర్మలముగా
నుండును.
తెలివి
ఉదయించగానే
నీతిచే
తొలిసూత్రాలు
ప్రవేశిస్తాయి.
వానిలో
ప్రాణముచేయు
పనిమీద
శరీరస్థితి
ఆధారపడుతుంది.
మనస్సు
చేస్తున్న
పనిమీద,
మనస్సుకుగల
కోరికపైన,
ప్రాణముయొక్క
స్థితి
ఆధారపడుతుంది.
వీటి
మూలమున
నడత,
విధానము,
మర్యాద
నిజమైన
వాటిని
మరగుపరచి
ఏకాగ్రతను
భంగపరచును.
కనుకనే
మనస్సు
మొదట
శాంతమైనదిగా
చేసుకొనవలెను.
అప్పుడే
దేహబుద్ధులు
ఆరోగ్యవంతమైనవిగాను,
ఆనందమైనవిగాను
ప్రకాశించును.
మనస్సు
ఒక్కొక్క
సమయమున
ఒక్కొక్క
వస్తువును
మాత్రము
ఆక్రమించును.
ఒక్కవస్తువును
మించి
ఒక్కవేళలో
అనేక
వస్తువుల
ఆక్రమించదు.
ఆలోచనలు,
కోరికలు,
లోలత్వములు
అభిప్రాయములు
కల
మూటయే
మనస్సు.
సృష్టియొక్క
యావత్తు
చరిత్రయూ
మనస్సులో
చెక్కబడియుండును.
మనస్సు
మానవుని
పోతబోసి
తయారుచేసే
శక్తి
కలిగినది.
అదియే
మాయ.
మంచి,
చెడ్డ
శక్తులు
ఒకటితో
ఒకటి
పోరాడిన
ఆ
కురుక్షేత్ర
యుద్ధభూమియే
మనస్సు.
ఇనుము
ఇనుమువల్లనే
తెగగొట్టబడుతుంది.
అలాగే
నీచమైన
మనస్సు
శ్రేష్ఠమైన
మనస్సువల్లనే
వధించబడుతుంది.
అట్టి
నీచమనస్సును
శ్రేష్ఠమైనదిగా
చేయునదే
శాంతి
స్వభావము,
ప్రశాంతి
వాహిని.
ఈ
వాహినిలో
మునిగి
అందులోని
క్రమశిక్షణ
అను
జలమును
గ్రోలి,
మలినమును
శుభ్రపరచి,
తాపమును,
పాపమును
చల్లార్చుకొందురని
ఆశింతును.
Next
Prabodha 2
→