Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 2
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఇప్పుడు
లోకమున
శాంతిని
మరుగుపరచుటకు
మరొక
నూతన
జబ్బు
ప్రారంభమైనది.
సర్వనీతులు,
సర్వధర్మములు,
సర్వక్రమములు
చిలకపలుకులవలె
ఇతరులకు
చెప్పనేర్తురేకాని,
అందులో
ఏ
ఒక్కటీ
వారు
అనుష్ఠింప
అలవడుటలేదు.
మన
పెద్దలకు
ఇప్పుడు
చెప్పునది
మాత్రము
తెలియును.
కాని,
చేయుట
తెలియదు;
నేర్పుటలేదు.
చేయనేర్చనివానికి
చెప్పుటకెట్లు
తెలియును?
అట్టి
అనుభవములేని
వాక్కులే
ఇప్పటి
నూతన
జబ్బు.
ఈ
రోగము
మొదట
రూపుమాయవలెను.
దీని
మూలమునకూడా,
మానవుడు
యథార్థమైన
శాంతిని
అనుభవించలేకపోవుచున్నాడు.
చెప్పుట
అందరికీ
సులభమే.
చేసి
చెప్పువాడు
యథార్థ
సాధకుడు.
చేయక
చెప్పువాడు
అనర్థ
సాధకుడు.
అట్టి
అనర్థ
సాధకులు,
సాధువులు,
అనేకులు
బయలుదేరి
యథార్థ
సాధనను
ఎఱ్ఱీ
బిఱ్ఱీ
చేయుచున్నారు.
ఇట్టివారిని
ఆశ్రయించి,
పాపము,
అమాయకులైన
భక్తులు
కూడా
మోసపోవుచున్నారు:
దారి
తప్పుచున్నారు.
పాఠకులు,
సాధకులు
మొదట
ఆచరణను
చూచి
ఆలకించండి.
ఆచరణ
లేనివారి
పలుకులు
గ్రామఫోను
ప్లేటు
పలుకులుగా
తలంచి,
మంచిని
స్వీకరించి
వాటిని
అనుష్ఠించుటకు
ప్రయత్నించండి.
ప్లేటుకు
ఇవ్వవలసిన
మర్యాద,
కృతజ్ఞత
ఎంతో
అంతమాత్రమే
ఇవ్వండి.
ప్లేటును
ప్లేటుగానే
భావించండి.
ప్లేటును
పరమాత్మగా
భావించకండి.
"సర్వము
పరమాత్మయే"
అను
యథార్థమును
2
▾
Meaning
Keep
గ్రహించిన
తరువాత
అంతా
పరమాత్మగానే
భావించండి.
కేవలము
మాటలతో,
"అంతా
పరమాత్మ"
అని
తెలిపి,
వినియోగములో
అపవిత్రముగా,
కడు
స్వల్పముగా
భావించిన
మరింత
పాపము.
చాలామంది
చిలుకపలుకులు
ప్రధానంగా
తీసుకొందురు.
మంచిదే.
అయితే,
వినునంతవరకు
మధురంగానే
యుండును.
ఆ
మధురాన్ని
ఎప్పుడు
తలంచినను
మధురంగానే
యుండవలెను.
కొంతకాలమునకు
అవి
చేదుగా
మారకూడదు.
అట్లుండిన
అది
అమృతవాణి
అనబడును.
ఇప్పుడట్టి
మధురము
స్థిరముగా
ఉండుటలేదు.
మార్పువచ్చుచున్నది.
చెప్పువారు
చెప్పు
విషయములు,
చెప్పువారి
నడకలు,
ఒక్కటిగా
ఉండకపోవుటే
దీనికి
కారణము.
ఈ
కారణములవల్ల,
అట్టివి
అమృతత్వమునకు
బదులు
అనృతత్వముగా
చలాయించబడుతున్నవి.
విషయసారముతోపాటు
భాషాసారము,
భాషాసారముతోపాటు
భావసారము,
భావసారముతోపాటు
అనుభవ
సారాన్ని
గ్రహించిన,
ఎంతకాలమైనా
చలనమురాక
స్థిరముగ
నుండును.
ఇప్పుడు
సాధకులు
చేయవలసినదేమన,
మొదటిది
వివేకమును
పెంపొందించుకొనవలెను.
అనగా,
నిత్య
అనిత్య
విషయమును
పరిశీలించుట,
అందులో,
ఏది
యోగ్యమైన
దానిని
అనుభవింప
ప్రయత్నించుట.
రెండవది
యోగ్యమైన,
సత్యమైనదానిని
అనుభవింప
ప్రయత్నించుట;
మూడవది
అట్టి
ప్రయత్నములలో
ఎన్ని
అవాంతరములు
వచ్చినా
చలించక,
యోగ్యమైనదని
తెలిసికొన్నదానిని
వదలకుండుట.
ఈ
మూడు
విషయములనే
నిజతపస్సు
అనికూడ
అందురు.
ఆ
తపస్సులోనే
నిజశాంతి,
సంతోషము
ఉద్భవించును.
ఇప్పుడు
లోకమున,
పిపీలికాది
బ్రహ్మపర్యంతము
నిమిష
నిమిషమునకు
ఏదో
ఒకవిధమైన
మార్పు
చెందుతూనే
యున్నవి.
మార్పు
చెందని
వస్తువుకానీ,
మార్పు
చెందని
జీవికాని
లేనేలేదు.
సృష్టి
యావత్తూ
మార్పుచెందునదే.
అయితే
అట్టి
మార్పులో
రెండు
విధములైన
మార్పులు
కలవు.
బహిర్ముఖమైన
మార్పులు
ప్రతిజీవికి
తెలియును;
తెలిసికొనుటకు
వీలగును.
అయితే
అంతర్ముఖ
మార్పు
3
▾
Meaning
Keep
తెలియదు;
తెలిసికొనుట
సులభముకాదు.
అందుకనే
తెలిసికొన
సాధ్యమైన
బహిర్ముఖ
కర్మలలో
మొదట
క్రమశిక్షణలను
ప్రారంభించి
క్రమక్రమముగా
అంతర్ముఖముగా
ఆచరించవలెను.
ఇందులో
ఏదైనను
మనస్ఫూర్తిగా
ఎవరికి
వారు
సాక్షిగా
చేయవలెను.
కాని
ఇతరుల
మెప్పుకొరకు,
ఇతరులను
మోసపుచ్చుటకొరకు,
"ఇతను
చాలా
గొప్పభక్తుడు"
అని
అనుకొనవలెనను
ఉద్దేశ్యముతో
చేయకూడదు.
అది
ఆత్మద్రోహముగా
మారును.
భగవంతుడు
భావప్రియుడేకాని
బాహ్యప్రియుడుకాడు.
అయితే
బాహ్యమును
మానరాదు.
బాహ్యములోకూడా
భావమును
చేర్చిననే
శాంతి
అనుభవమునకు
అవకాశము
చిక్కును.
మనోవాక్కాయకర్మలందుకూడా
శాంతిని
చవిచూడవలెను.
ఈ
నాల్గింటియందు
ఏకముగా
అనుభవించినపుడే,
పరిపూర్ణశాంతి,
అనగా
మనోలయము;
మనోలయమునే
శాంతి
అనియు,
యోగమనియూ
అందురు.
ఇప్పటి
వాతావరణములో
అర్థముకాని
వేదాంతములు,
ఆచరించని
శాస్త్రములు
చెప్పి
ప్రయోజనములేదు.
అందరికీ
అందుబాటులో
ఉండి
ఆచరణకు
అనువుగా
ఉండి,
అర్థము
అవలీలగా
అయి
అడుగడుగునకూ
అనుభవించు
నిత్యకృత్య
కర్మములందే
నిజమైన
మార్పులు
తేవలెను.
అప్పుడే
గూఢమైన,
సారమైన
అంతరాత్మయొక్క
విషయములు
అర్థము
కాగలవు.
అప్పుడు
ఎవరికి
వారే
ఆశించి,
ఆచరింతురు,
ఆనందమొందుదురు.
మానవుడు
చేయు
ప్రతి
చిన్నపని
యందు,
మాటయందు,
ఆటలందు,
పాటలందు
సైతము
మంచి
యోచించి
ఉత్తమమార్గము
అవలంబింపవలెను.
అదే
నిజసాధకుల
లక్షణము.
శాంతికాని,
దానిని
పొందు
భక్తికాని
ఒకరివల్ల
వచ్చునది
కాదు.
ఎవరికి
వారిలోనే
పుట్టి
వృద్ధి
పొందవలసినదే.
అయితే
అన్నింటికి
ఆధారమైన
భగవత్కటాక్షము
ఉండవలెను.
అదిలేక
ఏదియూ
కలుగదు.
ఉపనిషత్తులో
ఉన్నట్లు,
"యమేవ
వృణుతే
తేన
లభ్యః"
అనగా
ఇది
భగవంతుడు
ఏర్పాటు
చేసినవారికే
లభ్యమగును.
దీనిలో
సాధకులకు
సంశయము
కలుగవచ్చును.
భగవంతుడు
ఏర్పాటు
చేసినవారలకే
4
▾
Meaning
Keep
కలుగునట్లయిన
మీరుచేయు
సాధనయొక్క
ఉపయోగమేమి?
అని.
అయితే
ఇందులో
ఒక
స్వతంత్రత
ఉండును.
భక్తితో
పరమాత్ముని
తలంచువాడు
ఎట్టి
ప్రారబ్ధ
సంచితములనైనా
దాటగలడు.
తన
అనుగ్రహమునకు
పాత్రుడై
పొందలేని
ఆనందమునుగూడ
పొందవచ్చును.
సాధనవల్ల
ప్రయోజనమేమి?
అను
అనుమానమే
అనవసరము.
సాధన
నిష్ప్రయోజన
మేనాటికీ
కాదు,
ఎవ్వరికీకాదు.
దానిని
దృధము
చేసికొనవలెను.
నిశ్చల
భక్తిగల
మనుజునకు
దైవానుగ్రహము
కలుగుటలో
ఆశ్చర్యమేమీలేదు.
దీనికి
గజేంద్రుని
కథయే
ఆధారము.
ప్రతి
మానవుడు
ఒకపని
నిమిత్తము
జన్మించుచున్నాడు.
అయితే
అందరికీ
కావలసిన
ముఖ్యమైన
స్నానము,
పానము,
శాంతి
ఇవి
సర్వులకు
సమానముగానే
కావలెను.
ఇవిలేక
ఏ
మానవుడూ
ఆనందమును
పొందలేదు.
శాంతి
సకల
కర్మలకు
మనోహరము
కలిగించును.
శాంతి
మానవుని
యందుండు
కఠినత్వమును
మెత్తపరచును.
అంతియేకాక
దేవుని
చెంతకు
తీసుకొనిపోయి
సాక్షాత్కార
ప్రాప్తి
గావించును.
శాంతికి
భేదమనునదే
లేదు.
అది
సమత్వమును
కలిగించు
గొప్పశక్తి,
జీవితము
ఒక
మనోహరము
కలిగించు
పుష్పము.
అందులోని
మకరంద
ప్రేమయే
శాంతి.
యోగికిగాని,
సాధకునకుగాని
ఉండవలసిన
యోగ్యత,
గుణము
లన్నిటిలో
ప్రధానమైన
గుణము
ఏదంటే,
శాంతి
తప్ప
మరేమీలేదు.
దానిమూలమున
నేడు
కాకున్ననూ
రేపటికైనా
వాడు
యథార్థమును
చేరగలడు.
అందుకై
సాధకుడు
పట్టినపట్టు
విడువక
ఎన్ని
కష్టములైనను,
ఎన్ని
బాధలనైనను
సహించుకొని
సర్వోత్కృష్టమైన
బ్రహ్మమును
దర్శించవలెను.
అట్టి
కష్టములను,
బాధలను
భరించుకొను
శక్తిని
ప్రసాదించునదే
శాంతిసూత్రము.
శాంతి
మూలముననే
భక్తి
వికసించును.
భక్తివలన
జ్ఞానము
బలపడును.
శాంతి,
జ్ఞానమే
మనిషికి
అలంకారము.
అదే
యథార్థమునుచూపు
ఏకైక
మార్గము,
సంపూర్ణత.
సంపూర్ణత
అనగా
చావులేని
జీవితము,
లేక
పావన
జీవితము
సంపాదించుటే.
"నేను
ఎవడిని?"
అను
విచారణ
ఆత్మ
సాక్షాత్కారమునకు
లేక
బ్రహ్మజ్ఞానమునకు
దారితీయును.
కాన
మానవుడైనవాడు
5
▾
Meaning
Keep
అట్టి
ప్రాప్తిని
పొందగోరువాడు
భగవంతుని
ప్రేమను,
భగవత్
జ్ఞానమును
నమ్మి,
శాంతితో
భయము,
ఆత్రముల
నిర్బంధన
లేకుండా
ఉండవలెను.
ఇట్టి
విచక్షణగల
మనిషి
ఎల్లప్పుడు
శ్రద్ధ
కలిగి
ఉంటాడు.
చేసిన
తప్పిదములకు
పశ్చాత్తాపపడుతాడు.
తనను
క్షమించమని
దేవుణ్ణి
వేడుకొంటాడు.
ఇట్టి
గుణముల
ప్రసాదించునట్టిదే
పవిత్రశాంతి.
అంతియేగాక
భగవంతుడు
ఎక్కడపడితే
అక్కడే
ఉన్నాడను
భావము
మూలముగా
మానవుడు
భయము
లేనివాడుగా
ఉండగలుగు
శక్తిని
ప్రసాదించి,
శాంతి
సుఖములను
అనుభవింపజేయును.
ఇట్టి
పవిత్ర
శాంతికి
పరమ
శత్రువైన
కోపమును
జయించవలెను.
కోపము
చిత్తవికారముయొక్క
పంటఫలము.
కోపము
మనస్సును
తన
బానిసగా
చేస్తుంది.
దేనినీ
అర్థము
చేసుకొనకుండచేయును.
సర్వవిషయములు
అర్థము
చేసుకొనవలెనన్నను,
సర్వేశ్వర
భక్తి
బలపరచుకొనవలెనన్నను,
నీవు
శాశ్వత
పరమానందమును
అనుభవించ
వలెనన్నను,
శాంతి
భక్తియే
సర్వోత్కృష్టము.
ఆద్యంతములులేని
శాంతియొక్క
దూతలు
కావలెను.
దానిమూలమున
ప్రపంచమందుండు
ప్రాణులకు
శాంతి
వెలుగును
చూపండి.
అట్టి
ఉత్తమోత్తమమైన
ఆదర్శ
జీవితమును
గడపండి.
ఎవడు
ఎల్లవేళలా
తృప్తిగా,
ఆనందముగా
ఉండునో
వాడు
శాంతిని
పొందగలడు.
పూర్వపు
సాధకులు,
భక్తులు
శాంతి
ఆధారముననే
వారు
పొందవలసిన
స్థానమును
పొందగలిగిరి.
రామదాసు,
తుకారాము,
కబీరు,
త్యాగరాజు,
నందనారు
ఇట్టి
భక్తులందరూ
ఎన్నో
బాధలకు,
నిందలకు,
హింసలకు
భరించుకొనునట్లు
చేసినదే
శాంతి.
దానిమూలమునకదా
కడకు
యథార్థమైన
స్థానమును
పొందగలిగిరి.
కాన,
సాధకుడైన
ప్రతిమానవుడును
ఇట్టివారి
బాధలను,
గుణములను
ఆధారముగా
తీసుకొన్న
ఎట్టి
విసుగు,
విరక్తి,
కోపము
రానేరదు.
భక్తులు
భగవత్
శక్తిని,
గుణములను
స్మరించుటకంటె
ఇట్టి
సాధకుల
గుణములను,
శాంతి
మార్గములను
తలంచిన
ఎంతయో
చిత్తశుద్ధి
ఏర్పడును.
భగవత్
శక్తి
సామర్థ్యములు
సహజములు.
అవి
వర్ణించినను,
పరిహసించినను
6
▾
Meaning
Keep
మారునవి
కావు.
సాధకుని
భావములు
సాధనమువలన
సాధించునవి.
అట్టివాటికి
అప్పుడప్పుడు
మార్పులు
కలుగుచుండును.
కనుక,
అట్టిమార్పు
కలుగునపుడెల్లను
పై
సాధక
భక్తులు
ఎన్ని
ఇక్కట్లకు
గురియగుచుండినదియు,
వాటిని
ఏ
మూలమున
జయించుచుండినదియు
స్వానుభవ
మూలమున
తెలిసికొని
నడచుకొన
వీలగునట్లు
చేయును.
కాన,
అప్పుడప్పుడు
పై
సాధకులు
ఎట్టి
బాధలనైనను
జయించి
యెట్టకేలకు
గట్టుచేరిన
మార్గమును
స్మరణకు
తెచ్చుకొనిన,
శాంతి
అభివృద్ధి
కాగలదు.
అట్టి
శాంతియే
వారల
తరింపజేసిన
ముఖ్య
ఆయుధము.
ఆ
ఆయుధముల
మూలముననే
కోప,
తాప,
అసూయ,
అహంకార,
విసుగు,
విరక్తి
ఇట్టి
దుర్మార్గులను
జయించిరి,
వారి
బారినుండి
తప్పించుకొనిరి.
కాన
సాధకులైన
మానవులారా!
శాంతి
ఆయుధమును
సర్వేశ్వర
అనుగ్రహములో
సాధించండి.
అందుకై
సాధన
సల్పండి.
ఎన్ని
కష్టములైనను,
ఎంతటి
బాధలైనను
స్మరణ
మూలమున
సాధించండి.
పవిత్రతను
ప్రధానముగా
కోరండి.
భీష్ముడు
చూడు,
అంపశయ్యపై
యుండియు,
శారీరమానసిక
బాధలు
భరింపరానివైనప్పటికిని
ఉత్తమ
కాలము
వచ్చునంతవరకు
ఓపికతో
కాచుకొనెనేకాని,
"బాధలు
భరింపలేను,
ఏకాలమైనను
సరే!
త్వరలో
నన్ను
తీసికొనిపొమ్మ"ని
పరమాత్మను
కోరెనా?
లేదు.
"ఎంతటి
బాధలకైన,
ఎన్నిదినములైనను
భరింతును.
ఉత్తమకాలము
వచ్చువరకు
ఉంచుము.
ఉత్తమకాలము
రాగానే
నీలో
చేర్చుకొమ్మ"ని
ప్రార్థించెను.
అందుకనే
భీష్మునకు
శాంతభక్తులలో
అగ్రగణ్యుడను
సార్థకనామము
స్థిరముగా
నిలిచెను.
ఎట్టివారికైనను
శాంతి
అవసరము.
అది
ఉన్నప్పుడే
అన్నియూ
ఉండును.
అది
లేదా,
ఏదియూ
లేదు.
ఇది
మానవుని
స్వభావమైనప్పటికిని
కామక్రోధములే
దీనిని
కప్పిపుచ్చునవి.
వాటిని
తీసివేసిన,
ఇది
తనంతట
తానే
ప్రకాశించును.
Previous
←
Prabodha 1
Next
Prabodha 3
→