Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 12
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రాణాయామము :-
శ్వాసప్రశ్వాసముల
రెండింటియొక్క
గతి
విచ్ఛేదనమే
ప్రాణాయామ
మనబడును.
దీనిని
యోగసూత్రమున,
రేచక
పూరక
కుంభకాదుల
శ్వాస
ప్రశ్వాసరతివిచ్ఛేదనము
వివిధముగా
జెప్పి,
దానిని
ప్రాణాయామ
మనును.
అయితే
నేనట్లు
తలంచను.
ఈ
సర్వజగత్తు
మిథ్యమే
అనుభావమే
ప్రాణసంయమము
అని
వివరింతును.
మనము
వివిధరూపములతో
వివిధ
పేర్లతో
ఉండు
బంగారు
సొమ్ములు
చూచుచున్నాము.
ఆ
వస్తువులన్నియూ
బంగారుతో
చేయబడినవే
కదా
అని,
అన్నిటియందు
మనస్సు
సమభావముండదు.
మనమై
మనము
తయారుచేసుకొన్న
వివిధ
రూపములపై,
మన
వినియోగ
సౌకర్యార్థము
మనము
పెట్టుకొన్న
పేర్లపై
ఏదో
వెట్టి
మోజు
మనకు
జనించును.
ఈ
నగలయొక్క
నామరూపములు
పుట్టకముందు,
పుట్టినపుడు,
పెరిగినపుడు
తుదకీ
సొమ్ములరూపములు
కరిగించి
బంగారుముద్దలోనికి
మార్చి
వారివారి
పేర్లను
మార్చినపుడు
ఆ
బంగారముమాత్రము
నిర్వికారముగా
అట్లే
ఉన్నది
కదా?
ఇదే
విధముగానే
నామరూపములెన్నియో
ఈ
జగతియందు
పుట్టి,
పెరిగి,
అణగిపోవుటను
మనము
గాంచుచునే
యున్నాము.
అయిననూ
శాశ్వతమైనదేదో
శాశ్వతముగానే
యున్నది.
అది
నిర్వికారమే.
ఏ
విధముగా
సొమ్ముల
రూపనామములు
అసలు
బంగారుకంటే
వేరుగా
కన్పించుచు
మనలను
మోహ
వశులజేయునో,
అట్లే
నామరూపములు
పరముకంటే
వేరై
చెప్పుటకు,
2
▾
Meaning
Keep
చూచుటకు,
సౌకర్యము
కలిగించుటకు
ఏర్పడినవయ్యును,
అవియే
మన
సమస్త
సుఖము,
శాశ్వతములు
అన్నట్లు
తోచును.
అయితే,
అనంత
అకళంక
అనాద్యమునైన
బ్రహ్మమే
ధ్రువమని
చాటుచున్నవి
శ్రుతులు;
తెలియదా?
కావున
నగలరూపము
లరయక,
సర్వమును
బంగారమేయని
అరయునట్లు,
మనకు
కన్పించునట్టి
ఈ
సమస్తమైన
నామరూపములందు
మతిని
చొనుపక
అంతయును
బ్రహ్మమేయని
తెలుసుకొనవలెను.
ఎట్లున్ననూ
అది
మాయాకల్పితమేనని,
సద్వివేక
బుద్ధితో
నిజముగా
దివ్యత్వమును
తెలిసికొనుటయందు
మిక్కిలి
కాంక్షగలవాడై
రాత్రి
పగలు
సమస్తంబును
బ్రహ్మమే
అను
దృష్టితో
చూడవలెను.
భ్రాంతిదశలో
వ్యక్తమగు
ఈ
జగమే
సత్యమనియు,
బ్రహ్మమే
మిథ్యమనియు
తోచును.
వివేకదశలో
జగమే
మిథ్యయను
భావము
వచ్చును.
మోహదేవత
సౌందర్యముగా
అలంకరించుకొని
నామరూపముల
నాధారముచేసుకొని
మోహనాస్త్రముల
విడచుచున్నది.
పై
విధముగ
జ్ఞానదృష్టిగల
వివేకియే
ఆ
అస్త్రముల
బారినుండి
తప్పించుకొనును.
ఈ
నామరూపములందేవి
జూచిననూ
కొలదికాలము
క్రిందట
మాత్రమే
పుట్టి
కొలదికాలము
తర్వాత
అంతరించునవిగా
కన్పించును.
వీటికి
మొదలు,
తుది
లేవు.
మధ్యకాలమున
వ్యక్తమగునవి
కావు.
ఇవి
ఎంతమాత్రమునూ
శాశ్వతములు
కావు.
వివేకముతో
ఆలోచించిన
ఈ
జగత్తులో
మనము
వినునామముగాని,
రూపముగాని
ఇదివరకు
ఉన్నది.
ఇకముందుండ
బోవునదికాదు.
జగత్తు
పరిణామశీలము.
గీతలో
చెప్పలేదా?
"వ్యక్తమధ్యాని
భారత"
అని?
అయితే
ఒక్క
విషయము.
మాయికముగా
కనబడు
ఈ
అఖిల
జగంబపుడు
నశించి
చననక్కరలేదు.
ఈ
జగత్తునందలి
సత్యత్వదృష్టి
ఒక్కటే
మారిన
చాలును.
అంతటిలో
కృతార్థత,
అదియే
జగన్మిథ్యాతీత
రూపమైన
ప్రాణసంయమము.
ఇట్టి
ప్రాణాయామనిద్ధుని
ఈ
రీతిగా
నుండవలెను;
పెక్కేండ్ల
క్రిందట
వ్రాసిన
పెన్సిలువ్రాత
చెడీచెడనట్లు,
కలలోచూచిన
వెన్నియో
వస్తువులు
మతికి
తోచినట్లు,
3
▾
Meaning
Keep
ఏ
వివేకి
బ్రహ్మమే
సత్యము
జగత్తు
మిథ్యమని
భావించునో
అతనికి
చుట్టుప్రక్కలగల
ఏవియును
చూపులోనికి
వచ్చి
లెక్కలోనికి
రాకోరడు.
పుట్టుట,
గిట్టుట,
సమస్త
సంపదలూ
లోకములన్నియు
వట్టివే
అను
భావము
పూని
యుండవలెను.
ఇదియే
ప్రాణాయామము.
4
▾
Meaning
Keep
ప్రత్యాహారము :-
నాలుక
రుచి
చూచుటకునూ,
కన్ను
రూపము
కాంచుటకునూ,
చెవులు
ధ్వనిని
వినుటకున్ను,
చర్మము
స్పర్శ
సుఖమనుభవించుట
కున్ను,
ముక్కు
వాసన
చూచుటకున్నూ
ఈ
విధముగా
ఇంద్రియములు
తమతమ
విషయములందు
సదా
పనిచేయుచున్నవికదా!
అట్టియెడ
ఇంద్రియములను
తమతమ
విషయములనుండి
మరల్చి,
చిత్తస్వరూపమును
అనుకరించునట్లు
చేయవలయును.
ఇది
పతంజలి
నిర్వచనము.
కాని,
నేనట్లుకాక
మరొకవిధమును
కూడ
సూచింతును.
చిత్తముయొక్క
అంతర్ముఖభావము
(అనగా
చిత్తము,
బయట
గన్పించి
మానవులను
మోహింపజేయు
నామరూపాత్మకమగు
మిథ్యాజగద్వస్తువులలో
ఏకీభవించకుండా
సర్వకాల
సర్వావస్థలయందు
లోపలి
వేపునకు
మరలుట)
ప్రత్యాహారమనబడును.
చిత్తము
ఎప్పుడైతే
మాయాయత్తమని
కనునో,
అప్పుడే
తన
ప్రవర్తనమును
మార్చుకొనును.
తన
ప్రాపంచికాహంకారము
వట్టి
బూటకమని
నిస్సందేహముగా
తెలుసుకొనును.
చిత్తము
సహజముగా
మిక్కిలి
చంచలస్వభావము
కలది.
ఇది
సుఖమును,
శాంతిని
కోరుచు,
ఒకదానిని
విడిచి
మరొకదానిపై
పరుగులిడుచుండును.
ఇట్టి
చిత్తము,
సకల
వస్తువులను
కలలో
కనిపించిన
వస్తువులను
మాయికములని
తెలిసికొనినవెంటనే,
స్థిరముకాని
వానిపై
అనవసరముగా
తనకు
కలిగిన
మిక్కిలి
మోహమునకు
ఇంత
కాలము
ఇట్టి
మోహముచే
అవివేకముగా
కాలముబుచ్చుటకు
ఆశ్చర్యము,
భయము,
సిగ్గును
బొందుచు
బయట
కనిపించు
సర్వపదార్థములను
విడచుచు
లోపలిమొగంబగును.
తదుపరి
ముందటిదారికి
పోవ
భయపడును.
బైట
వస్తువులన్నియు
భ్రాంతి
అని
తక్షణము
వాటిపై
భ్రాంతి
5
▾
Meaning
Keep
విడిచి,
చిత్తమంతర్ముఖమైన
తరువాత,
ఆ
చిత్తము
మునుపటివలె
మూల
ముసుగిడును.
అప్పటి
సాధకుని
మనస్థితిని
వినోదలీలల
జూపుచు
దారిని
తప్పించును.
చిత్త
మంతర్ముఖమైన
వెంటనే
శాంతము,
సౌఖ్యము,
జ్ఞానమును
గూర్చి
పెట్టునవి
ఇవియేయను
ఆశచే
వట్టి
అభూతవస్తువులపై
మోహంబుచేరేయింపగలు
కష్టించి
వృథా
కాలయాపన
చేసితినని
సాధకుడు
పశ్చాత్తాపము
చెందును.
వెట్టి
పట్టుదలతో
బయటి
మాయావస్తువుల
గూర్చికొనుటకై
అచ్చటి
కచ్చటికేగుచు,
సదా
అనర్థముల
బొందితిని;
వ్యర్థపరిశ్రమమున
శాంతిని
కాంచనైతిని;
అను
విచారమున
మునుగును.
అది
సిద్ధించిన,
పై
విధమైన
పరితాపముచే
బయటి
వస్తువులకై
చేయిని
చాపక
మిక్కిలి
విశదమయిన
వివేకమున
తాను
వెలసియుండును.
రానున్న
కోటివస్తువులవంక
చూడక
చిత్తము
సూటిమీర
అంతర్ముఖమైయుండుటయే
వారి
లక్షణములుగా
ఉండును.
6
▾
Meaning
Keep
ధారణ :-
చిత్తము
ఒకచోట
అవలంబనమున
నిల్పుట
ధారణయని
పతంజలి
నిర్వచించెను.
నా
భావము,
చిత్తముయొక్క
నిశ్చలమైన
భావమే
ధారణయని
చెప్పుదురు.
ఎప్పుడు
చిత్తము
బైట
వస్తు
సమూహమునందలి
స్నేహమువిడిచి
పశ్చాత్తాపము,
వైరాగ్యము,
విజ్ఞానమునందభిలాష
అను
సద్గుణముల
ప్రోత్సాహమున
లోముఖ
మగునో
అపుడే
తన
ధ్యేయ
స్వరూపముతో
గూడుకొని
మాటిమాటికి
ఉబ్బుచుండును.
ఇట్ట
నిల్కడనే
ధారణయందును.
కాన,
చిత్తమెచ్చట
కేగునో
అచ్చటచ్చట
బ్రహ్మమునే
భావించుకొనచు,
చిత్తమెట్టి
కల్పనలు
చేసిననూ
అవి
అన్నియూ
బ్రహ్మమే
అనుచు,
చిత్తమునొక
బాలునిగా
తలంచి,
ఆ
చిత్తబాలునకు
జ్ఞానబలముచే,
నయమగు
లాలనచే
బయట
కన్పించు
వస్తువులన్నియును
బ్రహ్మయందు
నిశ్చయముగ
కల్పితములనిజెప్పి
అతనిని
పరితృప్తునిజేసి
నిర్భయునిగాజేసి
పట్టుదలతో
నిశ్చలత్వమును
సాధించ
వలయును.
ఎప్పుడు
కూడ
చిత్తమును
బలత్కారముగా
బట్టరాదు.
దాని
చాంచల్యమును
విరక్తిబుద్ధిచేత,
దాని
అజ్ఞానమును
ఆత్మ
బోధనవశమున
చక్కగా
బోవునట్లు
నచ్చుజెప్పుము.
7
▾
Meaning
Keep
బ్రహ్మమునం
దనురాగమును
ప్రబలజేయుట,
లోని
కల్పనా
రణమును
మానచేయుట,
చిత్తమును
బాహ్యసంచారవిముఖ
మొనర్చుట
ఈ
మూడు
విషయములచే
మనస్సును
ధారణాయోగమున
నిల్పవలెను.
చిత్తము
జాగ్రత
స్వప్నావస్థలయందు
ఎన్నేనియు
చిత్రకల్పనలు
చేయును.
అట్టి
ధారణసిద్ధికి
చిహ్నమేమన,
సకల
లౌకికవిషయ
సంచారము
విడిచి,
గండిలో
పోవు
నీటిధారవలె
గట్టి
పట్టుపట్టి
చిత్తమును
బ్రహ్మమునందు
నిల్పుటే.
కనుబొమల
నడుమ
అంటింప
బడిన
చిల్లిగింజవలె
చిత్తము
ప్రాణముతో
కూడి
బ్రహ్మాత్మకముగ
నిల్చును.
ఉన్నదగ్గరే
తిరుగు
బొంగరము
రీతి
మనస్సు
ద్విదళ
పంకజమున
ప్రాణముతోకూడి
బ్రహ్మచింతనలో
నుండుట,
బ్రహ్మముదక్క
ఇతరమేమియూ
రవంతైన
విచారింపకుండుట
ఇవియే
ధారణ
సారము.
8
▾
Meaning
Keep
ధ్యానము :-
ఒకచోట
ఏకభావప్రవాహరూపమైన
జ్ఞానమే
ధ్యానము.
కాని,
నేను
ఎన్ని
విధములుగనో
దీనినిగూర్చి
చెప్పితిని.
నేను
కేవల
జ్ఞానస్వరూపుడనను
చింతనే
ధ్యానము.
ఈ
సమస్తము
బ్రహ్మము.
అమృతసాగర
మంతయు
అమృతమే.
అందలి
ఒక
బిందువుకూడ
అమృతమే.
సర్వము
బ్రహ్మము,
బ్రహ్మయే
సర్వము
అనినపుడు
సరోవరములందు;
కుంటలయందు,
సముద్రమునందు,
బావులయందు,
వాగులయందు,
కాల్వలయందు,
చెరువులయందు
ఎచ్చటనున్ననూ
నీరు
నీరే
అయినట్లు,
పలు
నామరూపములతో
కూడుకొని
విశ్వవ్యాప్తమై
నానారీతుల
వ్యక్తమగు
సర్వమును
బ్రహ్మస్వరూపమైన
ఏకపదార్థమే.
ఘటములోపల
ఆకాశము,
ఘటము
ఇవతల
ఆకాశము,
రెండు
వేరుగా
తోచుచున్ననూ
నిజమునకు
ఆకాశము
ఒక్కటేకదా!
అటులే
ఈ
వ్యవహారికుడు
ఎన్ని
దేహములందున్ననూ
జీవసంపదయొక్క
ప్రభావము,
విశిష్టత,
విమలత్వము
ఒక్కటే.
సారమైనట్టి
ఆ
బ్రహ్మమే.
బైట
లోపల
ఒక్కడే.
అట్టి
"సర్వం
బ్రహ్మమయమ"ను
అనుభవమును
గుర్తించి
భేదభావములులేక
చరించుటే
ధ్యానలక్షణము.
ధ్యానానుభవములు
అనేకము,
అవే
వారివారి
ఇచ్చాశక్తిని
అనుసరించి
ఉండును.
కాన,
దానికి
సారము
అంతా
బ్రహ్మమయము.
9
▾
Meaning
Keep
సమాధి :-
రూపమును
విడిచి
అర్థమును
మాత్రమే
భాషింపజేయుచుండినపుడు
అది
'సమాధి'
అని
పతంజలి;
దానికి
మరొక
విధానము
తెలుపుదును.
ధ్యానము
చేయువాడు
తనను,
తన
ధ్యానమును
మరచి
పోవుటయే
(ధ్యేయవస్తువునందు
లీనమగుటయే)
'సమాధి'
అని.
ధ్యానమునందు
పరిపూర్ణత
ఏర్పడి
మరచుటయే
సమాధి.
ఈ
ధ్యానము
ప్రయత్నముచేయగా
లభించునది.
సమాధి,
ప్రయత్నము
లేకనే
లభించునది.
అదియే
అష్టాంగములందు
శ్రేష్ఠమయినది,
చివరిది.
జీవాత్మల
కావంతయూ
భేదములేదని
మిక్కిలి
అనుభవమునకు
వచ్చు
దశయే
చక్కని
సమాధి.
ఇదియే
చక్కని
ధ్యానసిద్ధికి
ఫలితము,
యోగీంద్రులకు
ప్రియము,
అజ్ఞానధ్వంసిని.
ఈశ్వరుని
పరమ
కృపాఫలము.
దృఢముగా
ఆత్మను
తెలిసికొనుటకు
ఆలవాలము,
ఆదరించదగినది,
సర్వ
సంశయ
విచ్ఛేదిని.
ఇట్టి
సమాధి
సవికల్పసమాధి
నిర్వికల్పసమాధి
అని
రెండుకలవు.
బాగుగా
ముదిరిన
ధ్యానమే
సవికల్పము.
ఇందు
జ్ఞాత,
జ్ఞానము,
జ్ఞేయము
అను
త్రిపుటిభావము
వదలదు.
నిరంతర
మదియే
భాసించును.
ఈ
త్రిపుటిభావముతోనే
నిరంతరము
చిత్తము
బ్రహ్మమందు
నెలకొని
యుండును.
ఇదియే
సవికల్పము.
జ్ఞాతనగు
నేను
బ్రహ్మమునే,
జ్ఞానము
బ్రహ్మమే,
జ్ఞేయము
బ్రహ్మమే,
అని
త్రిపుటియందు
సమాధారణయుండును.
సమాధి
అన్నింటి
సాధనసారమును
చేర్చుకొన్న
సాగరము
వంటిది.
సప్త
అంగములైన
యమ,
నియమ,
ఆసన,
ప్రాణాయామ,
ప్రత్యాహార,
ధారణ,
ధ్యానములను
సముద్రములను
రూపనామములు
లేక
లీనముచేయు
నట్టి
అష్టాంగసారమే
సమాధి.
సముద్రమున
చేరిన
పుణ్యనదుల
రూపనామ
రుచులు
ఎట్లు
తెలియవో
సమాధిలో
చేరిన,
ఏ
అంగసాధనకూడ
రూప,
నామ,
సారములు
తెలియకుండును.
అదియే
సమాధి.
సేవకుని
సేవగాని,
ధ్యానపరుని
ధ్యానము
కానీ
రెండును
తెలియకుండును.
'తను'
అను
భావమే,
'చేయుట'
అను
భావమే
యుండదు.
సేవ్యుడొక్కడే,
ఆ
భావమొక్కటియే.
అంత
తప్ప
అన్యము
10
▾
Meaning
Keep
గోచరించదు.
అట్లు
అన్యము
గోచరించుచున్న
అది
సమాధి
అనబడదు.
స్వప్నమనబడును.
బ్రహ్మముతప్ప
అన్యములేనిదే
సమాధి.
అందులోని
లీనభావము
సమాధి.
Previous
←
Prabodha 11