Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Praśānti Vāhini · Prabodha 11
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
బోధము
రెండు
విధములుగా
ఉన్నవి.
ఒకటి
పరోక్ష
బోధము,
రెండవది
అపరోక్ష
బోధము.
వేదవేదాంగములచే,
యుక్తిప్రయుక్తులచే
ఊహలచే
నిదమిత్థమని
తెలిసికొను
తెలివియంతయు
పరోక్షబోధము.
అట్లు
తెలిసికొనిన
దంతయు
అనుభవసిద్ధమైప్పుడు
అదియే
అపరోక్ష
బోధమని
అందురు.
సత్యజ్ఞానానంద
పరబ్రహ్మము
స్వతస్సిద్ధము
గాన
పరోక్షజ్ఞానమే;
ఒక
విధముగా
తలంచిన
నీ
పావనమైన
బ్రహ్మమునకు
పరోక్షతాపరోక్షతలులేవు.
ఇది
రెండింటికిని
అతీతమైన
విలక్షణ
వస్తువు.
ఇట్టి
బ్రహ్మవిద్యయగు
నపరోక్షజ్ఞానసిద్ధిని
బడయుటకు
మొదటి
సాధన
సద్గురు
శుశ్రూష;
సద్గురువు
నాశ్రయించి
అతనిపై
సంపూర్ణ
విశ్వాసముంచి
అతనిని
నిరంతరము
సేవించుచుండవలెను.
గురుప్రభుడుకూడను,
నిరంతరము
బ్రహ్మనుగూర్చి
సులలితభావముతో
బోధించుచుండవలెను.
అట్టి
బోధనను
నిరంతరము
శిష్యుడు
వినుచుండినయెడల
అది
పరోక్షజ్ఞానమగును.
ఇట్టి
శ్రవణాంగము
సిద్ధించినయెడల
ఈ
పరోక్ష
జ్ఞానమే
ఎల్లపుడూ
మననము
చేసిన,
అపరోక్షజ్ఞానముగా
మారును.
పరోక్షజ్ఞానమన
నీటిపై
వ్రాయు
అక్షరములభంగి
క్షణభంగురమైనది.
కాని,
అపరోక్షజ్ఞానమో
రాతిపై
చెక్కబడిన
అక్షరములరీతి
శాశ్వతముగా
నిలుచును.
ఇట్లు
గురు
ప్రభువును
సంపూర్ణముగా
విశ్వసించి
ఎల్లప్పుడును
బ్రహ్మజ్ఞానశ్రవణము
చేయుచుండిన
అది
మననము
జేయబడినదై
అటుమీదట
అపరోక్ష
జ్ఞాననిధిని
2
▾
Meaning
Keep
యగును.
గుఱ్ఱము
అను
శబ్దమును
విన్నంతమాత్రమున
మనస్సునందు
గుఱ్ఱముయొక్క
స్వరూపమునుగాంచు
భంగి,
బ్రహ్మ
మనిన
వెంటనే,
నా
బ్రహ్మస్వరూపము
హృదయమున
తోచును.
ఇట్టిదానినే
ధ్యాస
అని,
సాధన
చతుష్టయ
సంపత్తి
తెలిసినవారు
చెప్పగలరు.
అట్టి
ధ్యాస
కల్గుటకు
శాంతి,
శమదమాది
గుణసంపన్నుడై
ముముక్షువు
నిరంతరము
నిష్కామబుద్ధిని
దపింపవలయును.
ఇట్లు
శమాది
షట్సంపత్తిని
గుర్తించుకొన్న
అతడు
మాత్రమే,
ఒక్కమారైనా
చాలును,
శ్రవణమొనరించినంతనే
బ్రహ్మమును
మానసంబున
గాంచి
దానితో
నేకీభవించజాలును.
ఇట్టి
శమాది
షట్సంపత్తి
గలిగిన
అతడే
ఇహమున
ఫలభోగ
విరాగి
యగును.
వైరాగ్యము
చక్కగా
సిద్ధించిన
వెంటనే
చిత్తము
నిర్భీకమగును.
అపుడే
ఉపరతి
అను
స్థితి
చేకూరును.
3
▾
Meaning
Keep
యోగము
రెండు
విధములు:-
ఒకటి
రాజయోగము,
రెండవది
జ్ఞానయోగము.
రాజయోగమున
అష్టాంగయోగము
అభ్యసింపబడును.
ఇదియే
ఆర్యము.
యోగమునందు
అంగములు
బాహిరములు,
అంతరములు
అని
రెండువిధములు.
జ్ఞానయోగాంగములయందు,
బాహిరములే
లేవు.
ఈ
రెంటికి
గమ్యము
వృత్తివిలయ
మొక్కటియే.
నిరోధిత
చిత్తవృత్తులు
గలవారికి
బయలెల్ల
బ్రహ్మమయమే
యగును.
ఇందు
మొదటిదగు
రాజయోగముకన్న
జ్ఞానయోగమే,
వేద్యమును,
గమ్యమును
అని
బ్రహ్మవిదుల
భావము.
కాన,
ఉపనిషత్
జ్ఞానము
ననుసరించి
పరబ్రహ్మ
విషయకమగు
అపరోక్షజ్ఞానమును
రాజయోగానుసారము
యమనియమాసన
ప్రాణాయామ
ప్రత్యాహారధారణ
ధ్యాన
సమాధులను
అష్టాంగయోగములం
దిమిడ్చి
చెప్పబడినవి.
1.
యమము
:-
అహింసా
సత్యాస్తేయ
బ్రహ్మచర్యా
పరిగ్రహా
యమాః.
అహింస,
సత్యము,
దొంగిలింపకుండుట,
బ్రహ్మచర్య
మవలంబించుట.
దానమును
పట్టుకుండుట
అని
అయిదు
అంగములతో
కూడుకొన్నది
యమము;
అయితే
నేను
అట్లుకాక,
దేహమునందు,
ఇంద్రియ
ములందు
కలుగు
విరక్తియే
4
▾
Meaning
Keep
యమమని
తెలుపుదును.
నామరూపరహితమై
నిర్గుణమై
అనంతమై
సంతాపదుఃఖశూన్యమై,
భావవర్జితమై,
శాశ్వతమై
సచ్చిదానందస్వరూపమై
వెలుగు
బ్రహ్మపదార్థమొండు
కలదు.
అదియే
భ్రాంతిదశలో
ఈ
సమస్త
విశ్వముగాను,
వర్యుక్త
గుణములకు
వ్యతిరేకమైన
గుణములతో
కూడబడినట్లు,
అనగా
నామరూపసహితమై,
సంతాప
దుఃఖ
భావయుతమై,
వివిధ
వివృతగుణములు
కలదై,
అశాశ్వతమై,
పరిమితమై,
జ్ఞానశూన్యమైయుండు
సంసారమువలె
కన్పించుచున్నది.
ఇట్లు
పరబ్రహ్మ
వస్తువు
మహామహా
పండితులనుకూడా
భ్రాంతిజెందింప
జేయునట్లు
వ్యష్టి,
సమిష్టిరూపముగా
కనిపించుచుండును.
ఒకే
చైతన్యము
భిన్నభిన్నముగా
వివిధరీతుల
వ్యక్తమగుటచే
వ్యష్టిగాను,
వ్యష్టులసమూహమే
సమిష్టిగాను
ఎన్నబడును.
బ్రహ్మచైతన్యము
నందే
వ్యష్టి
కల్పనమగుటచే
ఆ
బ్రహ్మచైతన్యమే,
త్రాటియందు
పాము
తోచురీతి,
ఎండమావులయందు
నీరు
తోచురీతి,
దేహత్రయయుతముగా
తోచునుగాని,
ఆ
దేహత్రయభావము
బ్రహ్మవిదునకు
మిధ్యయే.
అజ్ఞాని,
ఈ
భ్రాంతిదశలో
కన్పట్టు
సంసారమే
శాశ్వతమైనట్లును,
సుఖప్రదమైనట్లును
మోహము
చెందును.
దీని
కాధారభూతమైన
బ్రహ్మమునే
మిధ్య
అగును.
దేహభ్రాంతులందు
జిక్కి
తల్లి,
తండ్రి,
ఆలు,
పిల్లలు,
సంసారమని,
బంధు
బలగములని,
నానావిధబంధముల
జిక్కి
దుఃఖించుచుండును.
కాన,
సచ్చిదానందరూపుడైన
పరబ్రహ్మమును
చింతించి,
నిత్యానిత్యవస్తు
వివేకమువలన,
సత్సంగమువలన,
పెద్దల
సేవలవలన,
నిర్మలబుద్ధివలన
దేహేంద్రియములు
నాకులేవు;
వ్యష్టి
సమిష్టి
దేహత్రయమంతటికిని
అధిష్ఠానమై
అలరు
బ్రహ్మమును
నేనే
అనెడి
భావము
పూనియుండుటయే
దేహేంద్రియములందు
వైరాగ్యము.
జ్ఞానయోగమునందు
దీనినే
"యమ"
అని
పిలుతురు.
సుఖమునకై
మోదము,
దుఃఖమునకై
ఖేదము
చెందకుండుట
దేహేంద్రియములయొక్క
బాధను
తనబాధయని
గలంగకుండుట
మొదలుగాగల
5
▾
Meaning
Keep
ద్వంద్వాతీతస్థితి
లభించవలయును.
క్రమక్రమముగా
దేహేంద్రియములను
మరచి
మెలగవలయును.
ఇవియే
యమాంగము
సిద్ధించినదనుటకు
లక్షణములు.
పై
లక్షణము,
క్రమశిక్షణలు
ఉన్ననే
యమమని
పిలువబడును.
అయితే
ఈ
యమాంగము
జ్ఞానయోగ
భావమునకు
పునాది.
యమాంగము
సిద్ధించనిదే,
సాధన
అటులనే
కొనసాగుతూ
పోయినవారికి
చాలా
ప్రమాదము
కాన,
సాధకులు
పై
విషయమున
కడు
జాగ్రత్తతో
మెలగవలెను.
6
▾
Meaning
Keep
నియమము
:-
అనగా
పరిశుద్ధుడై
యుండుట.
సదా
సంతోషముగా
నుండుట,
తపస్సు
చేయుట,
మంత్రజపము
చేయుట
నియమమని
రాజయోగము
తెలుపును.
దానినే
రాజయోగమున
"శౌచ
సంతోషతపః
స్వాధ్యాయేశ్వర
ప్రణిధానాని
నియమాః"
అని
తెలిపినారు.
అయితే,
దానిని
నేను
ఈ
క్రిందిరీతిగా
తెలుపుచున్నాను.
సర్వకాల
సర్వావస్థలయందును
శ్రేష్ఠమైన
సత్యమునందు,
అనగా
పరమాత్మ
తత్త్వమునందు
మిక్కిలి
ప్రేమ
కలిగియుండుటయే
నియమమని
అందును.
"సా
పరమ
ప్రేమరూపా"
అని
నారద
భక్తి
సూత్రమున
చెప్పినటుల,
భక్తి
అనగా
పరమాత్మునియందు
మిక్కిలి
అనురాగము
కలిగియుండుట.
ఇట్టి
పరతత్త్వానురక్తి
కలిగినంతనే,
రాజయోగమున
తెలిపిన
శౌచ,
సంతోష,
తపస్స్వాధ్యాయేశ్వర
ప్రణిధానాదు
లవంతటవియే
కలుగును.
పైన
చెప్పినరీతి
యమాంగము
సిద్ధించిన
తదుపరి
సచ్చిదానంద
పరబ్రహ్మ
వస్తువులవలననే
నిజముగా
ఈ
ప్రపంచమున
మన
మనుకొను
ఆనందము,
శాంతము,
సుఖము
కొలదియైనను
మానవ
అర్హతల
ననుసరించి,
మానవులకు
లభించుచున్నది.
కాని,
సాధకులు
భావించునట్లు
శాంతి
ఆనందములకు
నిజమైన
కారణము
మిథ్యాభూత
శుష్క,
భౌతికవస్తు
సమూహము
కాదు.
"రసోవైసః"
"ఆనందోవై
బ్రహ్మా"
అను
ఉపనిషత్
శాసనము
ననుసరించి
ఆ
పరబ్రహ్మము
వలననే
ఈ
విశ్వమునందు,
సంసారము
రసభరితమనిపించును.
ఆ
పూర్ణ
రసస్వరూపుడే
లేకున్న
ఈ
సంసారము
7
▾
Meaning
Keep
మానవులకింత
మధురంగా
కన్పించదు.
కడు
చేదయియుండును.
ఈ
మధురమునకు
ఆ
అమృతరూపుడే
కారణము.
బ్రహ్మజ్ఞులచేరి
వేదాంతవాక్యార్థములను
వినయ
విధేయతలతో
వినుచుండుట,
అపరవస్తువులను
పొందుటకై
మిక్కిలి
జ్ఞానపిపాసుడై
పరితపించుట,
ఇట్టి
నిర్హేతుకమైన
ప్రేమ
బ్రహ్మయందెల్లప్పుడును
కలిగి
యుండుటయే
నియమసిద్ధి
లక్షణములు.
అది
సిద్ధించినవాడు,
లోకుల
నిందలు
నిష్ఠూరములు,
వాన,
గాలి,
ఎండ,
సిగ్గు
యెగ్గులను
పాటించక,
ఆత్మవల్లభుని
చేరుటకు,
మిక్కిలి
లోకవాసనా
విపత్తుల
బాటింపక
ముముక్షువు
అసంగబద్ధమై
బ్రహ్మమునందు
ప్రేమతో
చరించును.
నియమాంగము
సిద్ధించిననాడు
జ్ఞానార్జనకై
తన
సర్వస్వమును
ధారబోయుటకు
సిద్ధపడును.
ఎంతదూరమైనను
శ్రమయని
తలంచక
బ్రహ్మ
వార్తలు
వినుటకు
పరుగిడిపోవును.
విజ్ఞానుల
ఆజ్ఞలన్నియు
శిరసావహించును.
తన
కపూర్వమగు
చిన్మయతత్త్వములు
చెప్పువారే
పరమాప్తులని,
వారి
కోరికల,
ఎన్ని
కష్టములకైనను
ఓర్చి,
తీర్ప
ప్రయత్నించును.
ఇవియే
నియమసిద్ధికి
లక్షణములు.
8
▾
Meaning
Keep
ఆసనము :-
మనము
కూర్చొనుస్థితి
స్థిరముగా
నుండవలెను:
అనగా,
కదలక
మెదలక
యుండవలెను.
అయితే
కదలక
మెదలక
అనగా
కూర్చొన్న
తరువాత
కీళ్ళు,
తొడలు
తిమ్మిర్లుపట్టి
పక్షవాతము
వంటి
రోగరూపముగా
పరిణమించి,
స్వతస్సిద్ధముగా
కదలలేనివాడై
మనస్సులో
బాధపడుచు,
కదలక
కూర్చున్న,
ఆసనమనరు.
అది
ఆసనలక్షణము
కాదు.
దేహస్థిరత్వముతోపాటు
హృదయమునకు
ప్రసన్నత్వమును
ప్రసాదించు
సుఖముకూడా
ఆసనమందుండవలెను.
కాన,
యోగాభ్యాసకారుడు
కూర్చొనుస్థితి
ఏదైనను
మిక్కిలి
స్థిరముగా
సుఖముగా
నుండవలెను.
అందుకని
పతంజలి
"స్థిరసుఖ
మాసనమ్"
అన్నాడు.
అయితే,
దీనినే
మరొక
మార్గమున
తెలుపుచున్నాను.
"అన్ని
వస్తువుల"
యందూ
ఉదాసీనమైన
భావము
కలిగియుండుటయే
ఉత్తమోత్తమమైన
9
▾
Meaning
Keep
ఆసనము
అని.
లౌకిక
వైదిక
విషయములకు
అనుకూలమైన
ఆచరణ
కలిగియుండుటయే
పరమాత్మేతర
విషయములందు
ఉదాసీనత.
మనకు
సరిపడనివాడు
మనదగ్గర
వచ్చెననుకో,
అట్టి
సమయమున
అతనిని
మనము
దూషించ
అవసరములేదు;
పరిహసించ
నవసరములేదు;
చులకనగా
భావించనవసరము
లేదు.
మన
పనులలో
మనము
నిమగ్నులమై
యుండిన
చాలును.
మనకు
సరిపడనివాడు,
అతని
త్రోవ
నతడు
చూచుకొనును.
ఇదియే
ఉదాసీనభావమందురు.
పరానురక్తి
కలిగిన
తరువాత
పరబ్రహ్మ
మందలి
మధురప్రేమ,
ఇతర
ప్రాపంచిక
సంఘమునందు
ముముక్షువు
నుదాసీనునిగా
జేయును.
నిజముగా
"బ్రహ్మసత్యం,
జగన్మిథ్య"
అను
భావము
సదా
మననము
చేయుచుండవలెను.
మంచివానితోగాని,
చెడ్డవానితోగాని
పొత్తే
అంత
గాఢముగా
పెట్టుకొనరాదు.
ఇట్టి
స్నేహమువలన
ముముక్షువు
నివృత్తి
పథమునుండి
ప్రకృతికి
మరలును.
కావున
ఈ
క్షణిక
వస్తువులందు
మోజు
విడిచి
నామరూపాత్మకమైన
ఈ
మహా
జగంబుతోడ
నిస్సంగత
మెలగుటయే
ఉదాసీనత.
ఈ
విషయమున
సిద్ధించినవాడు
జగముయొక్కయు,
శరీరముయొక్కయు,
ఇంద్రియములయొక్కయు,
మంచి
చెడ్డలనుగూర్చి
చింతించకుండుట
శాంతుడై,
దాంతుడై,
నిర్మలుడై
చరించుట.
ఇట్లుండిన,
ఇవి
ఆసనము
సిద్ధించినవారి
లక్షణములనబడును.
Previous
←
Prabodha 10
Next
Prabodha 12
→