Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · Saṃskāra Is the Very Means of Every Jīva's Journey
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రతి
జీవికి
ప్రయాణ
సాధన
సంస్కారమే
మానవులు
లోకమున
అనేక
సంస్కారములతో
నిండియుండుట
సర్వసాధారణంగా
అందరికీ
తెలిసిన
విషయమే.
మానవుల
వలన
అనేక
కార్యములు
జరుగుచున్నవి.
అట్టివి
లెక్కింపబోయిన
ఒక
దినమునకు
నియమితకాలమైన
ఇరువదినాల్గు
గంటలకూ
మించిపోవుచున్నది.
త్రాగుట,
తినుట,
వ్రాయుట,
చదువుట,
నడచుట,
కూర్చొనుట
ఇవియే
కాక
నానా
విధాలైన
స్వప్నములూ,
రాగద్వేషములు,
మానాభిమానములు,
సుఖదుఃఖములు
ఇవ్విధముగా
అంతులేక
మానవునియందు
కనుపించుచున్నవి.
వీటన్నిటి
సంస్కారములూ
మనస్సునంటియేయున్నవి.
అందువలన
జీవితమనగా
సంస్కార
సంచయమే.
ఇట్టి
సంస్కారములు
మంచివనియూ,
చెడ్డవనియూ
రెండు
విధములు.
ఈ
రెంటి
యొక్క
పరిణామములు
మానవుని
జీవితములో
కనబడుచునే
యున్నవి.
పలకమీద
వ్రాత
చెరిగిపోయినట్లు
బాల్యపు
పనులూ,
బాల్యావస్థ
అంతయూ
మరుపున
పడిపోవును.
ఈ
జన్మమందు
అనుభవించిన
బాల్యావస్థయే
మరపున
బడినప్పుడు
పూర్వజన్మ
సంగతి
గుర్తుండుట
ఎట్లు
సాధ్యము?
అది
అట్లుంచి
ఈ
జన్మమున
మానవునకెన్ని
జ్ఞాపకమందున్నవో
అన్నియే
జరిగినవని
చెప్పలేరు.
జరిగిన
క్రియలు,
వాటివల్ల
కలిగిన
2
▾
Meaning
Keep
అనుభవములూ
అనేకం
ఉన్నవి.
అయితే
ఆ
క్రియలూ,
వాని
అనుభవములూ
హరించిపోయి
కడకు
కొన్ని
సంస్కారములు
మాత్రము
ఉండును.
రాత్రి
నిద్రించు
సమయమున
పగటి
పనులు
జ్ఞప్తికి
తెప్పించుకొనవలెననిన
అన్నియూ
జ్ఞప్తికి
రావు.
బహు
స్పష్టమైనవి,
లోపల
బాగుగా
నాటుకొనిపోయినవి,
ఇవి
మాత్రమే
ప్రధానంగా
జ్ఞాపకమునకు
వచ్చును
కాని
చిన్నవి
మొదలు
పెద్ద
వాటి
వరకు
జరిగిన
పనులు,
మాటలు
అన్నియూ
జ్ఞాపకమునకు
రావు.
ఈ
విధముగా
దినచర్య
తెలుపుటకే
చాలావరకు
మరుగుపరచి
ముఖ్యంగా
మనసునకు
బాధ
కలిగించినవో,
లేక
సంతోషం
కలిగించినవో
రెండు
మూడు
మాత్రమే
తెలుపుదురే!
ఇక
వారం
విషయాలు
మరింత
మరుపు
ఇక
నెలకూ,
వర్షమునకూ
తెలుపవలెనన్న
ఆయా
కాలములందు
ముఖ్యంగా
జరిగినవే
మనసున
స్పష్టమయి
మిగిలినవి
అస్పష్టమైపోవును.
ఇవియే
సంస్కారములు.
అనేక
క్రియలు
చేసి,
అనంతమైన
జ్ఞానానుభవమును
పొంది,
చివరకు
మనస్సునందుండు
సంస్కారాలు
ఎన్నియో
యుండవు.
భిన్నభిన్నములైన
కర్మలు
భిన్నభిన్నములైన
అనుభవములను
కలిగించిపోవును.
దృఢమైన
ఏ
నాలుగైదు
సంస్కారములు
మాత్రమే
మిగిలియుండును.
అవియే
మానవుని
మూలధనము.
మానవుడు
జీవితమను
వ్యాపారమును
జరుపుతూ
సంస్కారములను,
సంపదను
మాత్రము
కూడబెట్టును.
ఒక
వ్యాపారస్థుడు
రోజు,
వారము,
నెల,
సంవత్సరము
వీటి
ననుసరించి
జమా,
ఖర్చులు
వ్రాసి
చివరకు
లాభమో,
నష్టమో
ఒక్క
అంకెతో
తేల్చినట్టే,
జీవిత
వ్యాపారమునూ
తేల్చుకొనవలెను.
అనేక
సంస్కారముల
జమ
పట్టి
పెరిగి
పెరిగి
కడకు
మిగులు
ఫలము
అతి
స్వల్పమే.
జీవితపు
తుది
ఘడియలో
ఆ
స్వల్పమునే
జ్ఞప్తియందుంచుకొనును.
జన్మ
పొడవుననూ
చేసిన
పనులను
స్మరణకు
తెచ్చుకొన్న,
ముఖ్యమైన
ఏ
రెండు
మూడు
విషయములో
కనబడును.
ఇవియే
జీవితమున
కంతకూ
ఆధారం.
అయితే
తానాచరించిన
కర్మలు,
పొందిన
జ్ఞానానుభవములు
అన్నియూ
వ్యర్థమైనవని
దీని
అర్థం
కాదు.
వాటి
పని
పూర్తి
అయినది.
3
▾
Meaning
Keep
వేలకొలదీ
రూపాయలు
వ్యాపారమున
పెట్టిన
అందులో
కొన్ని
వేలు
నష్టమే
వచ్చిన
వాని
గుండె
ఝల్లుమనును.
కొన్ని
వేల
రూపాయలు
ఆదాయమే
ప్రాప్తించిన
హృదయము
చిందులు
త్రొక్కును.
జీవిత
విషయము
కూడా
ఇట్టిదే.
మరణ
సమయమున
జిహ్వేంద్రియ
వాసన
జీవితమంతయూ
రుచులు
గుడుచు
అభ్యాసములోనే
గడిచినట్లు
ఋజువగును.
మరణమాసన్నమైన
తల్లికి
బిడ్డలు
జ్ఞప్తికి
వచ్చిన
పుత్ర
సంబంధమైన
సంస్కారమే
ఆమెలో
బలిష్టముగా
నుండెనని
తలంపవలెను.
తానాచరించిన
అసంఖ్యాకములైన
ఇతర
కర్మలు
అన్నియూ
మరుగుపడినట్లు
ఋజువు.
ఈ
విధముగానే
జీవితములో
అనేక
సంస్కారములు
అంతరించి
చివరకు
బలమైన
ఏ
ఒక్క
సంస్కారమో
నిలిచియుండును.
జీవితము
ఇట్టిదని
తలంచక
తప్పదు.
అంత్య
సమయమున
స్మరణకు
వచ్చినదే
జీవితమునకంతకునూ
ఫలము.
కనుక,
చనిపోవు
వేళ
ఏ
సంస్కారము
దృఢముగానుండవలెనను
కోరిక
యుండునో
దాని
కనుగుణంగా
జీవిత
ప్రవాహమును
త్రిప్పుకొనవలెను.
అహోరాత్రులూ
దానివైపే
దృష్టి
యుండవలెను.
మరణ
సమయమున
బలిష్టముగా
మనస్సునందుండు
భావనయే
రానున్న
జన్మలో
బలిష్టముగా
పనిచేయును.
ఈ
సత్యమునే
మానవుడు
తన
జన్మసార్థక
మార్గమునకు
దారిబత్తెముగా
భావించి
జీవిత
యాత్రకు
బయలుదేరవలెను.
కనుక,
రేపటినుండియే
నిరంతరము
మరణమును
జ్ఞప్తియందుంచుకొని
జీవితయాత్ర
సద్భావములతో,
సత్యవాక్కులతో,
సర్వేశ్వర
స్మరణతో,
సాధు
సంఘ
సంబంధాలతో
పాపపు
పనులకు
కాని,
ద్రోహ
చింతనకుగాని,
ప్రాపంచిక
వ్యామోహములకు
కాని
చోటివ్వక,
అంత్యక్షణము
పుణ్యమయము,
పవిత్రము,
మధురము
కావలెను.
ఇట్టి
క్రమముతో
బ్రతికినన్నాళ్ళు
సాధన
చేయుచూనే
యుండవలెను.
మంచి
సంస్కారమువైపు
మనసు
మరల్చవలెను.
వారి
వారి
దోషములను
వారు
గుర్తించినంతనే
దిద్దుకొనుటకు
ప్రయత్నించవలెను.
తన
తప్పు
తనకు
తెలియగానే
పునర్జన్మ
కలిగినట్లే.
అది
మానవుని
జీవితమునకు
నూతన
బాల్యావస్థ.
ఇదియే
మానవునకు
నిజమైన
మేలుకొల్పు.
4
▾
Meaning
Keep
మృత్యువు
ఎల్లప్పుడూ
జీవిని
అంటియే
యున్నది.
మృత్యువు
అను
శబ్దమును
వినగానే
మానవుడు
సహించడు.
ఎంత
వెఱ్ఱి!
ఎట్టివైనా
శుభ
కార్యములు
జరుగుచున్నప్పుడు
మృత్యువు
అన్న
శబ్దము
విన్న
అశుభమని
అనుచున్నారు.
కానీ,
ఎంత
అశుభమనుకొన్ననూ
జీవి
వేయు
ప్రతి
అడుగునూ
మృత్యువు
వైపునకే
పడుచున్నది
కదా!
మానవుడు
ఏ
ఊరైనా
ప్రయాణమై
టిక్కెట్టు
కొని
ఆ
రైలులో
ఊరక
కూర్చున్ననూ,
పడుకొన్నను,
ఆ
రైలు
ఎట్లు
తాను
చేరవలసిన
ప్రదేశమునకు
చేర్చునో,
అట్లే
జీవుడు
పుట్టుకతోనే
మృత్యువను
ఊరికి
టిక్కెట్టు
తీసుకున్నాడు.
మీరెన్ని
ప్రయత్నాలు
చేసిననూ,
ఎంత
జాగరూకతతో
నుండిననూ
ఏ
నాటికైనా
రాక
తప్పదు
కదా!
ఏది
నిశ్చయము
కాకపోయినా
మృత్యువు
మాత్రం
నిశ్చయం.
దానిని
మరచుటకు
ప్రయత్నింప
వీలేలేదు.
జిహ్వాకూ,
కంటికీ,
చెవికీ
మానవుడు
చపలత్వమును
నేర్పుచున్నాడు.
దీనికి
విరుద్ధమైన
అభ్యాసమునందు
చిత్తము
లగ్నము
చేయవలెను.
మంచి
విషయములవైపు
మనస్సును
మరల్చవలెను.
బాల్యం
నుండియూ
ఏకాగ్రతతో
మంచి
సంస్కారములు
చేయుచుండవలెను.
అనుక్షణము
కలుగు
సంస్కారములు
మంచివి
ఔనాకాదా
అని
పరిశీలించుకొనవలెను.
మానవుడు
చేయు
ప్రతిపనియూ
ఉలియై
మానవ
జీవితమను
శిలకు
ఆకృతిని
దిద్దును.
ఆ
ఉలిని
దారితప్పి
ప్రయోగింతుమా,
హానికరమే
కాక
జీవిత
శిలయూ
చెడిపోవును.
అందువలన
స్వల్పాతిస్వల్ప
విషయమందు
సైతం
మెలకువతో
సంచరించవలెను.
నీట
మునిగిపోవు
వానికి
ఏ
చిన్న
పుల్ల
అయిననూ
ఆధారమగును.
అట్లే
సంసార
సాగరమున
మునిగిన
వారికి
ఏ
కొంచము
మంచిగా
మాట్లాడిననూ
అదే
జీవితమునకు
ఆధారం
కావచ్చును.
చేసిన
మేలు
వ్యర్థము
కాదు.
చేసిన
కీడు
కూడా
వృథా
పోదు.
కనుక
లేశమాత్రము
కూడ
చెడ్డ
సంస్కారము
కలుగనీయక
కనులు
పవిత్రములై
యుండునట్లు,
చెవులు
నిందా
వాక్యములను
వినక
సాధ్యమైనంతవరకూ
భగవద్వాక్యములు,
సద్విషయాలు
వినుచుండునట్లు,
నోరు
మంచి
మాటలనే,
భగవత్
స్మరణనే,
సత్యవాక్కునే
పలుకుచుండునట్లు
సదా
ప్రయత్నించవలెను.
ఇట్టి
జాగరూకతతో
నుండిన
చివరకు
విజయము
కలిగి
5
▾
Meaning
Keep
తీరును.
ఇట్టి
పవిత్ర
సంస్కారములు
కలుగవలెననిన
మనసున
ఉత్కృష్ట
భావనా
సంచలనము
తీవ్రంగా
జరుగుచుండవలెను.
చేతులు
పవిత్ర
కర్మలయందు
నియుక్తములు
కావలెను.
లోపల
ఈశ్వర
స్మరణ,
బయట
స్వధర్మాచరణ,
చేతితో
సేవాకర్మ,
మనసున
వికర్మ
-
ఇవి
నిత్య
కార్యక్రమములు
కావలెను.
సంస్కారముల
ప్రవాహము
ఒక
దిశలోనే
పారుచుండవలెను.
పర్వతములపై
పడిన
వర్షము
అన్ని
దిశలకునూ
ప్రవహించిన
దానివలన
నది
ఏర్పడదు.
అట్లుకాక
నీరంతయూ
ఒక
దిశకే
ప్రవహించినచో
దాని
వలన
సెలయేరుగా,
తరువాత
ప్రవాహముగా,
ప్రవాహము
నదిగా,
నది
మహానదిగా,
విస్తరిల్లుచూ
వెళ్ళి
వెళ్ళి
సముద్రమును
చేరును.
ఒకవైపుననే
ప్రవహించు
నీరు
సముద్రము
చేరును.
నలువైపులకూ
ప్రవహించు
నీరు
ఏ
కొంత
దూరమో
పోయి
ఇంకిపోవును.
సంస్కారము
కూడా
ఇట్టిదే.
సంస్కారములు
ఇటు
వచ్చుచు,
అటు
పోవుచున్నచో
ప్రయోజనమేమి?
సంస్కారముల
పవిత్ర
వాహిని
జీవితములో
నిరంతరము
పవిత్ర
భావములతోనే
ప్రవహించుచున్నచో
చివరకు
మరణము
మహానందమునకు
నిలయమనిపించును.
ఎవడు
ఇట్టి
గమ్యమును
చేరునో
వాడు
ధన్యుడు.
రాతిమీద
ఇరువది
సుత్తిదెబ్బలు
కొట్టిననూ
అది
పగులక
ఉండును.
ఇరువది
ఒకటవ
దెబ్బకు
అది
పగిలిపోవును.
ముందు
కొట్టిన
ఇరువది
దెబ్బలూ
నిరర్థకమైనట్లా?
కాదు.
చివరి
దెబ్బ
యొక్క
సఫలతకు
వెనుకటి
దెబ్బలన్నియు
తోడ్పడినవి.
ఇట్లే
నిరంతరమూ,
లోపలా
బయటా
అనంత
సృష్టి
వ్యాపించియున్నది.ఈ
సృష్టిలో
మనసు
ఈ
పోరాటము
జరుపుచునే
యున్నది.
ఈ
పోరాటము
అన్ని
సమయములందు
జయమే
కలుగునని
చెప్పుటకు
వీలులేదు.
కాని
నిరంతర
సత్కర్మల
నాచరించుచూ,
సదా
ఈశ్వరప్రేమతో
నిండి;
ఆ
ప్రేమ
జీవితమందెల్ల
వ్యాపించినపుడు
మానవుడు
కార్యాచరణయందు
నిత్యానందమును
పొందుచుండును.
అప్పుడు
చెడు
వృత్తులు
ఎదుట
నిలువలేవు.
ఈశ్వర
స్మరణవలన
సత్కర్మలు
సహజరీతిగా,
అప్రయత్నముగా
జరుగు
చుండును.
అట్టి
6
▾
Meaning
Keep
తరుణమున
ఎదోవొక
సత్కర్మ
అను
దెబ్బతోనే
మనోనాశన
మగును.
అట్టి
మనోనాశనమునకు
నిరంతరము
ఇట్టి
సత్కర్మలనే
దెబ్బలు
వేయుచుండిన
చివరి
దెబ్బకు
ఈ
కర్మలన్నియు
తోడ్పడి
ముందు
ఫలితమును
ప్రసాదించును.
ముందు
చేసిన
సత్కర్మ
లేవియూ
నిరర్థకము
కావు.
దీనికి
పరమేశ్వరుడే
మన
రక్షకుడని
నమ్మవలెను.
బిడ్డలో
ధైర్యమును
పెంచుటకు
తల్లి
బిడ్డను
అటునిటు
తిరగనిచ్చును.
కాని
బిడ్డను
క్రింద
పడనీయదు.
పడబోయిన
వెంటనే
వచ్చి
వానిని
ఎత్తుకొనును.
ఈశ్వరుడు
కూడా
నిరంతరము
జీవుని
మీదనే
దృష్టి
పెట్టుకొని
యుండును.
మానవ
జీవితమను
గాలిపడగకు
కట్టిన
దారము
తన
చేతిలోనున్నది.
ఆ
దారమును
ఈశ్వరుడు
ఒక
తూరి
లాగును.
ఒకతూరి
వదలును.
ఎట్టు
చేసిననూ
దారము
తన
చేతియందే
వున్నదను
విశ్వాసమును
ముఖ్యంగా
నుంచుకొనవలెను.
ఆ
నిరంతర
చింతనే
మానవుని
ఎడబాయక,
ఆ
సంస్కారమునే
మానవుడు
జ్ఞాపకముంచుకొనిన,
తన
చేతియందున్న
ప్రేమ
పాశమను
ఆ
త్రాటికి
జీవికి
ఎడబాటు
కలిగించక
తనచెంతకే
లాగుకొనును.
అదియే
గమ్యమును
చేరుట
అని
అర్థము
కాని,
ప్రేమపాశమను
త్రాటిని
జన్మజన్మాంతర
సంస్కారములచే
భద్రమైనదిగా
సంపాదించుటకు
సత్సంస్కారములు
చేసియుండవలెను.
కనుక,
జీవిగా
తయారు
అగుటకు
సంస్కారమే
కారణము.
అట్టి
జీవిని
గమ్యము
చేర్చుటకు
సంస్కారమే
ఆధారం.
అనేక
సంస్కారములతో
బయలుదేరిన
జీవి
కష్టములూ,
నష్టములూ
పడి,
చివరకు
సంస్కారములతోనే
సర్వేశ్వరుని
చేరును.
ఇట్టి
గమ్యమును
చేరుటకు
ప్రతి
జీవియూ
సత్కర్మల
నాచరించవలెను.
ఆ
సత్కర్మలే
పూజలు,
స్మరణలు,
భజనలు,
సర్వజన
సమాన
ప్రేమ,
పరోపకారదీక్ష.
ఇట్టి
కర్మల
నాచరించుచూ,
ఈశ్వర
చింతన
నెడబాయకుండుటే
గమ్యమునకు
రమ్యమైన
రాజబాట.
Next
Ahaṅkāra Is the Cause of Unrest
→