Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · Ahaṅkāra Is the Cause of Unrest
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రబోధ-2
అహంకారమే
అశాంతికి
కారణము
మానవుడు
పలు
విధములైన
అహంకారముతో
అశాంతిని
తనకు
తాను
అభివృద్ధి
చేసుకొనుచున్నాడు.
దీనికి
కారణము
అస్థిరమయిన
అధికార
వ్యామోహములే.
న్యాయంగా
యోచించిన
ఏ
విషయమందూ
మానవునకు
శాశ్వత,
సంపూర్ణ
అధికారము
లేదు.
ఎందుకన
ప్రపంచ
అధికారమునకు
ఆది
అంత్యములున్ననూ,
శాశ్వతాధికారికి
ఆది
అంత్యములే
లేవు.
శాశ్వతాధికారి
సర్వేశ్వరుడే.
లోకమున
కొందరు
విద్యాధికారియనియూ
మరికొందరు
ధనాధికారియనియూ,
శాస్త్రాధికారియనియు
తలంచవచ్చు.
అయితే
ఈ
అధికారమునకు
కొంతవరకు
మాత్రమే
హద్దు
కలదు.
పోనీ
కొంతవరకైనా
అధికారమున్నది
కదా
అని
తలంచవచ్చును.ఈ
విద్యలనూ,
ఈ
ధనమునూ
ప్రసాదించు
వారొకరున్నారు
కదా!
అట్లు
ప్రసాదించు
వారికంటే
వీరు
అధికారులు
కారు
కదా!
ఆ
రీతిగా
యోచించి
చూడ
ఒకరి
కొకరు
అధికులై
కడకు
సర్వులనూ
అనుగ్రహించు
సర్వేశ్వరుడే
సర్వాధికారికాని,
క్షణకాలమునకు
సంప్రాప్తమైన
అధికారమునకే
నేనధికారి
అన్న,
అదియే
అహంకారము.
నిజాధికారి
స్వరూపము
సత్యము,
దయ,
ప్రేమ,
సహనము,
కృతజ్ఞతలు
కలిగియుండుట.
ఇవి
కలవారికి
అహంకారమే
రాదు.
అట్టి
వానికి
చోటే
లేదు.
2
▾
Meaning
Keep
అహంకారమే
ఆత్మ
ప్రకాశమును
మరుగు
పరుచుచున్నది.
అహంకారము
నశించిన
అన్ని
బాధలూ
తొలగిపోవును.
ఆనందము
ప్రాప్తించును.
మబ్బు
సూర్యుని
ఆవరించిన
రీతి
అహంకారము
ఆనందమును
ఆవరించినది.
కన్నులు
విప్పి
కన్నులకు
అడ్డుగా
ఒక
గుడ్డను
లేక
అట్టను
పట్టుకొనిన
చెంతనే
యున్న
వస్తువులను
కూడా
చూడలేము.
అట్లే
భగవంతుడు
మానవునకు
అన్నింటికంటే
సన్నిహితుడుగా
ఉన్ననూ
అహంకారపు
తెరవలన
మాధవుని
చూడలేకున్నాడు.
ఎంతోమంది
సాధకులూ,
సన్యాసులు
కూడా
ఇట్టి
అహంకారమునకు
చోటిచ్చి
సాధించిన
సద్భావములను
కూడా
కోల్పోవుచుందురు.
ఒట్టి
పాండిత్యమూలమున
ప్రయోజనము
లేదు.
పేరు
ప్రతిష్ఠలు
పొందవచ్చును.
ఆత్మానందము
లేని
పేరు
ప్రతిష్ఠలు
పునాదిలేని
గోడలు.
శాస్త్రములు,
వేదములు,
ఉపనిషత్తుల
యొక్క
తత్వములు
జీవితమున
ఆచరణలోనికి
రావలెను.
అట్లు
ఆచరణలోనికి
రాని
ఎన్ని
మాటలయిననూ
ఎట్టి
పాండిత్యమైననూ
ప్రయోజనముండదు.
అట్టివి
ఆచరణలోనికి
వచ్చుటకు
నాకు
తెలియును
అన్న
అహంకారమును
వదలి
అందులోని
యథార్థ
సారమును
యోచించవలెను.
పంచాంగమందు
పది
దుక్కుల
వర్షము
కురియునని
వ్రాయబడియుండ
ఆ
పంచాంగమును
పది
మడతలు
పెట్టి
పులిమినను
ఒక
చుక్క
నీరు
వచ్చునా?
రాదు.
ఎందుకు?
వర్షము
వచ్చునట్టి
విషయమును
తెలుపుట
పంచాంగ
లక్షణము
కాని
నీటితో
తడుపుకొని
పంచాంగము
వచ్చుట
లేదు.
ఆ
పది
దుక్కుల
నీరు
పైమేఘముల
యందున్నది.
అట్లే,
సర్వతత్వములు,
నీతి
నియమములు,
సద్
వాక్యములూ,
మన
కర్తవ్య
ధర్మములూ
ఇత్యాది
మార్గములు
విమర్శించి
తెలుపుటే
శాస్త్ర,
వేద,
ఉపనిషత్తుల
మహాలక్షణము.
కాని
ముక్తిని,
శాంతిని,
సాక్షాత్కారమునూ
అందులో
ఇముడ్చుకొని
రావు.
వాటిలో
తెలుపబడిన
మార్గమును,
నియమములను,
నీతులను
అనుసరించిన
ఆ
తత్ఫలమును
పొందవచ్చునేకాని,
ఊరక
చదివి
అన్నియూ
తెలిసికొంటిమన్న
అహంకారము
పడిన
మమకారముతోనే
మరణ
ప్రాప్తి.
అట్టి
నిజము
తెలియని
మరణము
పునర్జన్మమునకు
పునాది.
3
▾
Meaning
Keep
సంతకు
దూరముగా
నున్నంతవరకు
హో,
హో,
అను
పెద్దగోల
వినబడుచుండును.
సంతలో
ప్రవేశించగానే
ఆ
శబ్దము
మాయమై
అచ్చట
జరుగుతున్న
బేరసారములే
తెలియును.
అట్లే
పరమాత్మ
విషయమును
తెలియనంతవరకే
ఈ
అహంకారపు
గందరగోళములు
ఒకే
శబ్దముతో
బాధించును.
పరమాత్మను
సమీపించగానే
అందుకు
తగిన
సాధనలు
(బేరసారాలు)
స్పష్టంగా
గాంచుదురు.
అంతవరకు
అహంకారములు,
ఆర్భాటములూ,
ఆడంబరములూ,
వాగ్వాదములూ
ఇట్టి
శబ్దములతోనే
బాధపడుచుందురు.
భక్తులు
కాగోరు
వారి
లక్ష్యము
ప్రకృతిలో
ఈ
అశాంతి,
అక్రమము,
అసత్యమును
దూరము
చేసికొని
సత్య,
ధర్మ,
ప్రేమ
ప్రశాంతులకు
ప్రయత్నించుటే
సాధన.
దానినే
భక్తి
అందురు.
అట్టి
భక్తులు
కాగోరు
వారు,
పరమాత్ముని
పొందగోరు
వారు,
లోక
కల్యాణమును
జేయగోరు
వారు
లోకుల
దూషణ,
ఆక్షేపణ,
సిగ్గు,
ఎగ్గులను
తృణప్రాయముగా
తలంచి,
ధైర్యముతో
తమ
యథార్థముపై
పూర్ణ
విశ్వాసముంచి
ధీరులై,
తమ
సాధనను
సాగించవలెను.
ఎట్టి
మహాత్ములకైననూ,
కడకు
అవతారములకైననూ
దూషణాక్షేపణలు
తప్పలేదు.
కారణమేమి?
సత్యము
దేనికీ
లొంగదు.
సత్యము
తెలియకుండునంతవరకే,
పైచెప్పిన
అహంకార
మావేశమై
ఇట్టి
ఆటలకు
చోటిత్తురు.
వాటి
మూలమున
పడరాని
బాధలనొంది,
తద్వారా
సత్యమును
కనుగొనుటకు
ప్రయత్నించి
క్రమక్రమేణా
భూషణలోనికి
కాలిడుదురు.
ఇందులకు
వివేకము
లేని
దౌర్బల్యమే
కారణం.
కాన
అట్టి
వారల
యోచనలకు
చోటివ్వక,
వారితో
వాదమున
తగులక,
అట్టివారుండు
స్థానమును
వదలి,
దూరముపోయి,
వారల
సాంగత్యమును
మాని
నీ
మనసున
పరమాత్మయందు
సంపూర్ణానందము
చిక్కునంత
వరకు
అందులకు
తోడయినట్టి
భగవద్భక్తుల
సంఘమునే
చేరుచుండుడు.
భగవద్గ్రంథములే
చదువుచుండుడు.
వానివలన
క్రమేణా
నీ
ఆనందము,
ధైర్యము
అధికమై
అనుభవంలోకి
వచ్చును.
అనుభవించిన
తర్వాత
ఎట్టివారితో
చేరిననూ
యథార్థమును
వీడక,
పరులకు
4
▾
Meaning
Keep
చిక్కక,
మూర్ఖులకు,
భగవత్
తత్త్వము
తెలియని
వారికి
సత్యము
చూపుటకు
ప్రయత్నింతువు.
దీనికి
మునుపు
భక్తులయందే
మూడు
విధములైన
విశ్వాసముగల
వారుందురు.
సత్కార్యములు
చేయుటయందు,
భగవదారాధన
చేయుటయందు
విఘ్నములు
కలుగునేమో,
కష్టనష్టములు
సంభవించునేమో
అని
భయపడి
ప్రారంభించని
వారు
మొదటివారు,
వీరు
అధములు.
ప్రారంభించియూ
మధ్యలో
విఘ్నములు,
కష్టనష్టములు
వచ్చినవని
బలహీనులై
భయపడి
మధ్యలో
వదలు
వారు
రెండవ
వారు.
మధ్యలో
ఎన్ని
నష్ట,
కష్టములు
కలిగిననూ,
ఎట్టి
బాధలు
సంభవించినను
పట్టుపట్టి
సాంతమగు
వరకు
సాధించువారు
మూడవ
వారు.
వీరు
ఉత్తములు.
ఇట్టి
పట్టుదలను,
ఇట్టి
శ్రద్ధను
విడువక
సత్యమును
సాధించుటే
నిజభక్తుల
లక్షణం.
ఊరక
ప్రాపంచిక
వ్యామోహములకు
క్షణికమైన
ప్రకృతి
సంతోష
సదుపాయములకు
భ్రమ
చెందక,
శాశ్వత,
సంతోష
సదుపాయముల
పొందగోరు
మార్గమును
వదలుకొనక,
పారమార్థిక
కర్మలను
సంపూర్ణమైన
ప్రేమతో
చేయుము.
శ్రద్ధ,
పట్టుదల
లేని
కర్మలెన్ని
అయినను
పరమార్థ
జ్ఞానమును
కలుగజేయవు.
ప్రేమ
వలననే
శ్రద్ధ,
శ్రద్ధ
వల్లనే
జ్ఞానము,
జ్ఞానము
వలననే
పరమ
భక్తి.
అట్టి
పరమ
భక్తి
కలవారికే
పరమాత్మ
ప్రాప్తి.
మొదట
పై
ప్రేమను
మానవులు
పొందుటకు
ముఖ్యంగా
గమనించవలసిన
విషయాలు
రెండున్నవి.
అవియేవన
ఒకటి:
ఇతరులు
చేయునట్టి
పెద్ద
తప్పయినను
దానిని
చిన్నదిగా
భావించవలెను.
వారికి
వారు
చేయు
చిన్న
తప్పైనను
పెద్ద
తప్పుగా
భావించవలెను.
ఇందుమూలమున
మనం
పెద్ద
తప్పులు
చేయకుండుటకు
అడ్డుగా
నుండును.
ఇతరుల
తప్పులను
పాటించక
వారితో
సమరసత్వము
ఏర్పడును.
మన
సాధనకు
కావలసిన
ఓర్పు,
ప్రేమ
ప్రాప్తించును.
రెండవది
చాటున
కాని,
బహిరంగముగా
కానీ
నీవేమి
చేసినను
పరమాత్ముడు
చూచుచున్నాడని
తలంచుచూ,
నీవేది
మాట్లాడినా
పరమాత్ముడు
వింటున్నాడని
జాగరూకుడవై,
సత్యాసత్యములు
గమనించి,
సత్యమునే
పలుకుటకు,
న్యాయాన్యాయములు
గమనించి
న్యాయమే
చేయుటకు
5
▾
Meaning
Keep
ప్రయత్నించవలెను.
ఎట్లన
దేహము
జీవునకెట్లు
దేవాలయమో
ఆ
దేహమను
దేవాలయమున
ఏ
భాగమున
ఏమి
జరుగుచున్నను
ఎట్లు
జీవుడు
దాని
మంచి
చెడ్డలను
గమనించుచున్నాడో
అదే
రీతిగా
లోకమే
లోకేశుని
శరీరము.
ఆ
లోకమను
శరీరమున
ఏ
భాగమున
ఎట్టి
మంచి
చెడ్డలు
జరుగుచుండిననూ
లోకేశునికి
తెలియును.
ఇట్టి
స్థూల
భావములను
ఆధారంగా
తీసుకొన్ననే
సూక్ష్మ
భావములు
సూటిగా
నాటును.
ఇట్టి
పరమార్థ
సంబంధమును
కల్పించుకొనుటకు,
అట్టి
పరమాత్మ
ఆరాధనకు
ఉపయోగకరమైన
ప్రధాన
పరికరాలు
మూడున్నవి.
ఆ
పరికరాలను
భక్తుడు
ముఖ్యంగా
సాధించవలెను.
(1)
రాగ
ద్వేషముతో
దూషితము
కానట్టి
చిత్తము
(2)
అసత్యాదులతో
దూషితముగానట్టి
వాక్కు
(3)
హింసాదులతో
దూషితముగానట్టి
కాయము
సుఖమనునది,
శాంతి
అనునది
బాహ్య
వస్తువులందు
ఎచ్చటనూ
లేదు
అది
నీలోనే
ఉన్నది.
శాంతికొరకు
ప్రపంచ
విషయములందు
వెదకుట
పిచ్చి.
తన
అంతఃకరణయందూ,
ఆనందమైన
స్మరణయందూ
లభించును.
మానవుడు
ప్రపంచమును
ఈ
వేళ
కాకున్నా
రేపటికైనా
విడచి
పోవలసినదే.
కనుక,
తెలివి
కలిగి
అన్నిటిలోని
సారమును
తెలిసికొని
స్థిరమైన
సత్యమునూ,
ప్రియమైన
పరమాత్మను
పొందుటకు
ఏవి
ఆటంకాలుగా
వచ్చునో
అట్టి
వాటిని
విమర్శించి
అందులోని
సత్యమును
తీసుకొని
మిగిలినవి
వదలిపెట్టుడు.
మానవునకు
ప్రపంచ
ఆశలున్నంత
వరకూ
దుఃఖము
తప్పదు.
మూర్తి
పూజ
ఎక్కువ
మంది
మూర్తి
పూజపై
దాడి
వెడలుదురు
(చేయుదురు).
మూర్తి
పూజ
అనగా
ఒక
చిన్న
వస్తువులో
బ్రహ్మాండమును
దర్శించు
శక్తియే.
ఇది
ఊహా
కాదు,
అనుభవ
సిద్ధమే.
విరాట్
స్వరూపములో
ఏమున్నదో
అది
అంతయూ
ఒక
చిన్న
స్వరూపమందు
కూడా
వున్నది.
కావ్యములలో
ఉపమానములు,
దృష్టాంతములూ
మొదలైన
వానికున్న
ఆధారాలే
మూర్తి
పూజకున్నవి.
6
▾
Meaning
Keep
(మానవునకు
ఆనందం,
ఆకారమును
చూచినంత
కలుగుటలేదు.
కొంత
సన్నిహిత
సంబంధముండుట
వల్లనే
బిడ్డను
చూచిన
తక్షణం
తల్లికి
ఆనందం
కలుగుతుంది.
అటువంటి
సంబంధం
భగవంతునితో
పెట్టుకొన్న
ఎంత
మనోహరముగా
ఉండునో
అనుభవించిననేగాని
అర్థమగును.)
పఠించుట
వేదములు,
పురాణములు
పఠించదగినవి,
వినతగినవి.
హరినామము
నోరారా
పలుకవలెను,
చెవులారా
వినవలెను.
కొన్ని
రోగాల
నివారణకై
పైకి
మందు
రాయుదురు,
లోపలకూ
మందు
పుచ్చుకొందురు.
అట్లే
భవ
రోగ
నివారణకు
శ్రవణము,
కీర్తనము
రెండును
చేయవలెను.
అట్టి
భక్తునకు
భగవంతుని
యొక్కయూ,
గురువుల
యొక్కయూ,
సద్భక్తుల
యొక్క
అనుగ్రహం
లభించినను
ఒక్క
దాని
అనుగ్రహం
లభించకపోయిననూ
నరుడు
నశించును.
ఈ
మూడు
విధాలైన
అనుగ్రహం
అదృష్టవశమున
లభించినను
'అంతఃకరణ'
అనుగ్రహం
లేనియెడల
అన్నియూ
నిష్ప్రయోజనం.
భగవత్
అనుగ్రహం
సులభంగా
చిక్కునది
కాదు.
హృదయం
నుండి
'నేను'
కర్తను
అను
అహంకారమును
నిర్మూలము
చేయవలెను.
పండితుడు
గానీ,
పామరుడుగానీ,
తన్ను
తెలిసికొనుటకు
పరితపించు
తన
బిడ్డలందరియందు
సమానంగా
భగవంతుడు
ప్రేమానురాగం
చూపును.
వెలుగు
నొసగుట
దీపం
యొక్క
స్వభావం.
ఆ
వెలుగులో
కొందరు
చదువుదురు,
వ్రాయుదురు,
వారి
వారి
గృహ
కార్యములు
చేసుకొందురు.
ఇంకా
కొందరు
ఆ
వెలుగును
దుర్వృత్తికి
వినియోగింతురు.
అట్లే
భగవత్
నామముచే,
కీర్తనచే
కొందరు
ముక్తిబడయజూతురు.
కొందరు
ఆ
నామ
సంకీర్తనలతో
ఉదర
పోషణకై
పాటుపడుదురు.
మరి
కొందరు
వారి
హృదయానందమును
పైకుబుకునట్లు
చేసుకొందురు.
ఇంకా
కొందరు
దుర్వినియోగంగా
చీట్లాడుదురు.
ఎవరెట్లు
చేసిననూ
భగవత్
నామము
మాత్రము
నిష్కళంకముగానే
ఉండును.
Previous
←
Saṃskāra Is the Very Means of Every Jīva's Journey
Next
The Need for Sanātana Learning
→