Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · The Well-Being of Former Days and the Famine of Today Are Both Due to the Conduct of Those We Call Elders
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
నాటి
క్షేమమునకు,
నేటి
క్షామమునకు
పెద్దలనువారి
ప్రవర్తనయే
కారణము.
ప్రతి
మానవుడును
తన
జీవిత
యాత్రలో
ఏ
ఒక్క
ప్రాణికి
క్లేశము
కలుగకుండునట్లు
ప్రవర్తింపవలెను.
అదియే
వాని
పరమ
ధర్మము.
అశాశ్వతమైన
దేహపోషణకు
సమయము
లేర్పరచినట్లు
దైవ
ప్రార్థన,
జపధ్యానములకు,
పరోపకార
సత్కార్యములకు
అనుకూల
సమయం
ఏర్పరచుకొనుట
మానవజన్మ
మెత్తినవారి
కందరి
ముఖ్య
కర్తవ్యము.
సత్య,
ధర్మ,
శాంతులను
జీవనముగా
తలంచవలెను.
నిప్పు
తాకుటకు,
పామును
ముట్టుటకు
ఎంత
భయపడి
దూరము
పారిపోవుదురో,
పాపములను,
పరుల
బాధ
పెట్టునట్టి
కార్యములను
చేయవలెనన్న
అట్టి
భయమే
పుట్టవలెను.
బంగారము,
ధనము,
సౌఖ్యములందు
ఎంత
ప్రీతియో,
భగవంతునియందు,
పరులను
ఆనందపెట్టుట
యందు,
సత్కార్యములు
చేయుటయందును
అంత
ప్రీతి,
శ్రద్ధలుండవలెను.
ఇది
మానవ
సోదరీ
సోదరుల
సహజ
ధర్మము.
ఇట్టి
సాధుత్వమును
బలపరుచుటకే
భగవానుడు
అవతరించుట.
అయితే
లేనివాటిని
అభివృద్ధి
పరచుటెట్లు?
ఇట్టి
గుణము
మానవునిలో
లేకపోలేదు;
ఉన్నది.
ఉన్నవి
క్షీణించిపోవు
సమయమున
వాటిని
బలపరచి,
వాటికి
వ్యతిరిక్తమైన
గుణములను
క్షీణింపచేయుటకే
పరమాత్ముడు
అవతరించుచుండును.
అట్టి
అర్థమును
తెలుపగోరియే,
ద్వాపర
యుగమున
శ్రీకృష్ణుడు
అర్జునునకు:
2
▾
Meaning
Keep
'పరిత్రాణాయ
సాధునాం
వినాశాయ
చ
దుష్కృతాం
ధర్మ
సంస్థాపనార్థాయ
సంభవామి
యుగే
యుగే'
అని
బోధించాడు.
అనగా
భగవదవతారములన్నియూ
సాధు
సంరక్షణార్ధమునకని
భావము.
ఈ
సాధు
శబ్దము
ఒక్క
మతమునకు,
ఒక్క
వర్ణమునకు,
ఒక్క
కులమునకు,
ఒక్క
ఆశ్రమమునకు,
ఒక్క
దేశమునకు,
ఒక్క
మానవునకు
సంబంధించినదిగాని
కాదు.
సర్వ
దేశములకును,
సర్వ
మతములకున్నూ,
సర్వ
ఆశ్రమములకున్నూ,
సర్వ
జనులకున్నూ
మాత్రమేకాక,
సర్వ
ప్రాణికోట్లకూ
సంబంధించినది.
కనుకనే
భగవానుడు
తన
విశాల
భావమును
గీతయందు
కనపరచినాడు.
ఇట్టి
ఆశయము
గీతకు
ఉండుటవల్లనే,
భగవద్గీతకింత
ప్రాశస్త్యము
కలిగినది.
అసలు
కృష్ణుడే
ఎన్నో
పర్యాయములు
నేను
పరమ
భక్తునికి
పెద్ద
సేవకుడనని
తెలియపరచినాడు.
దీనికి
తార్కాణము,
అర్జునునకు
సారథియై
యుండినదే
చాలు.
ఇట్లు
మానవుల
సహజ
సంస్కారమే
ప్రకటించుచుండ,
ఇంతకంటెను
అతీతమైన
సాధనా
బ్రహ్మనిష్ఠులైనవారి
సహజ
లక్షణములు
ఇంకెంతటి
పవిత్రములై
యుండవలెనో
ఎవరికి
వారు
యోచించికొని
తెలియును.
ఈ
ఇద్దరికీ
గుణమే
ప్రధానం.
ఆనాటి
బ్రహ్మనిష్ఠులలో
గల
మహిమ
ఇటువంటిదని
గ్రహించవలెను.
ఆ
పని
నేటి
బ్రహ్మనిష్ఠులు
గమనించకుండుటే
నేటి
క్షామమునకు
కారణం.
గడచిన
యుగములందు
వాటిని
మొదట
గమనించి,
పవిత్ర
భావములను
అనుభవించుచుండిరి.
అట్టి
పవిత్ర
భావములు
ఇప్పుడెందుకు
లేవని
తలంపవచ్చు.
లేక
కాదు,
నిప్పు
ఏ
కాలమైననూ
హెచ్చు
తక్కువ
అగుటకు
కట్టెలే
కారణముకాని,
వేరు
కారణములులేవు.
నిప్పులో
కట్టెలెంత
ఎక్కువగా
వేయుదుమో,
అందులోని
ప్రకాశము
కూడా
అంత
ఎక్కువగా
ప్రకాశించును.
అట్టి
కట్టెలు
వేయుటకు
మానవకోటిలో
ఎవరికైననూ
విరోధము
లేదు.
అగ్ని
నైజముగా
జ్వలనశక్తి
కలిగి
యుండును.
ఆ
విధంగానే
సాధకుని
విజ్ఞాన
జ్యోతియగు
బుద్ధిలోనికి
విషయ
విరక్తి,
శాంతము,
సత్యము,
కరుణ,
సహనము,
పరోపకారము
మొదలైన
గుణములు
ఎంతవరకు
చేరునో
అంతకంత,
సాధన
చేయు
వారెవరైననూ
సరే,
మహిమను
పొందగలుగుదురు.
మంచి
3
▾
Meaning
Keep
సారవంతమైన
భూమిలో
పెరిగిన
వృక్షము
ఎట్లు
ఫలమును
ఇవ్వజాలునో,
అట్లే
అంతఃకరణము
నిర్మలమైన,
హృదయమున
పవిత్ర
భావములు,
మహిమలు,
అనుగ్రహించు
శక్తి
కలుగును.
ఈ
రెండింటికి
హృదయ
నిర్మలత్వమే
ప్రధానం.
పూర్వపు
మహనీయులకున్ను
ఇప్పటి
బ్రహ్మనిష్ఠులకున్నూ
ఉన్న
భేదము
కూడా
ఇట్టిదే.
పూర్వపు
మహాపురుషులు,
బ్రహ్మనిష్ఠులు
ఎట్టి
ధ్యాన,
ప్రణవాది
నిష్ఠలను,
యోగధ్యాన
అనుష్ఠానములను
అనుశీలించిరో
ఇప్పటి
వారు
కూడా
అట్టి
సాధనలే
చేయుచున్నారు.
అయితే,
భేదమునకు
కారణము
క్షేత్రమునకు
సంబంధించిన
(మనః)సంయమనములో
గల
కొఱత.
ఎప్పుడు
లోకమున
ఏకాంత
ప్రదేశమున
బ్రహ్మనిష్ఠ
చేయు
మహాపురుషులు
తగ్గిపోదురో,
అప్పుడు
లోకమునకు
అనేకములైన
బాధలు
కలుగుచుండును.
వారి
వారి
సాధనానుష్ఠానములకు
ఆటంకములగు
సర్వ
సంబంధములేర్పరచుకొని,
కీర్తనలగు,
తుచ్చ
వర్ణనలకు
దాసులై,
వ్యామోహ
సహితులై,
పేరు
ప్రతిష్ఠలకు
ఆశ్రమ
అభివృద్ధులకు
ప్రాకులాడుటవల్లనే
వారి
బ్రహ్మ
నిష్ఠ
భ్రష్టుపట్టిపోవుచున్నది.
అట్టి
బ్రహ్మనిష్ఠను
సాధించుగోరువారు
ఏకాంతములో
ఆయా
సమయములందు
ధ్యాన
జపముల
నాచరించుచూ,
ఏకాగ్రతను
ఏర్పఱచుకొని
సర్వభూతహితాసక్తులై,
నిష్కామకర్మపరులై
యుండవలెను.
అట్టి
వారు
లోకమున
ఎప్పుడు
అవతరింతురో,
అప్పుడే
దుఃఖములన్నియు,
శమించిపోవును.
ఇది
కృతయుగ
చిహ్నము.
ప్రపంచమున
ప్రజాసేవా
తత్పరులైన
వైద్యులు
అచ్చటచ్చట
వైద్యాలయముల
నేర్పరచి,
జనులకు
ఏ
విధంగా
రోగములు
నివారణ
చేయుచుందురో,
అదేవిధంగా
భవరోగ
వైద్యులగు
మహాత్ముల
పుణ్యాశ్రమములు
అచ్చటచ్చట
ఉండినచో
జనులు
అజ్ఞాన,
అసత్య,
అనాచార,
అహంకారములను
రోగములకు
గురికాకుందురు
కదా!
ఆ
విధంగానే
బ్రహ్మజ్ఞానౌషధమున్ను,
శాంతశమదమాది
సత్యగుణములనెడు
పథ్యమును
కలిగియుండిన,
ఈ
అజ్ఞాన
ప్రవర్తన
రోగము
నాశనమగును.
అట్లుకాక,
ఇప్పటి
మహనీయులు
చెంతచేరు
రోగులకు
ఇష్టమొచ్చినట్లు
మందులిచ్చుచూ,
వారికి
ఇష్టమైన
వస్తువులను
ఆరగించు
పథ్యము
పెట్టుచూ,
వారి
చేతులలో
బానిసలై,
అట్లు
కాకున్న
తమకు
4
▾
Meaning
Keep
పేరు
ప్రతిష్ఠలు
రావని
తలంచి,
రోగులకు
వశమైన
డాక్టర్లు
కావటం
వలన
ఈనాడీ
బాధలకు
గురికావలసి
వచ్చినది.
ఎక్కడైననూ
రోగియొక్క
రోగమును
తెలిసికొని,
ఆ
రోగమును
నయము
చేసి,
వాని
ఆనందమునకు,
ప్రేమకు,
కృతజ్ఞతకు
అర్హుడు
కావలెను
కాని,
తన
వర్ణనలకు,
తన
పోషణకు
తాను
ప్రాకులాడి
రోగిని
ఇష్టము
వచ్చినట్లు
పోనిచ్చి,
నాశనము
చేయుటవల్ల
తన
పని
మాత్రం
ఎంతకాలం
నడువగలదు?
ఇప్పటి
వాతావరణం
ఈ
రీతిగానే
నడచుచున్నది.
ఆధ్యాత్మిక
పెద్దలైననేమి,
అధికారమునందున్న
పెద్దలైననేమి,
పెద్దలందరు
ఈ
బుద్ధులలోనే
నడుచుచున్నారు.
వీరి
ప్రవర్తనలు
సరిచేసుకొన్నప్పుడే
లోకమునకు
మంచి
కలుగును.
కాని,
ఆడంబరములతో
ఎన్ని
ప్రచారములు,
ప్రసంగములు
జరిపినను
ప్రయోజనము
లేదు.
కార్యరూపమున
చూపవలెను.
డాక్టర్లు
రోగుల
సేవ
నిమిత్తమై
ఏర్పడినవారలే
కాని
తమను
తాము
కోసుకొనుటకు,
గుచ్చుకొనుటకు
కాదు.
అట్లనే
మహాత్ములగు
జ్ఞానులు,
అజ్ఞాన
నిద్రలో
నిద్రించు
వారిని,
అహంకారపు
సుడిగుండంలో
మునిగిపోవువారిని
తరింపచేయు
వారే
కాని,
అజ్ఞానంతో,
సర్వవ్యామోహ
బద్ధులై,
సత్యమునే
మరచి,
అధికారం,
పేరు
ప్రఖ్యాతులకై,
శరీర
భోగములకై
ప్రాకులాడు
వారికి
ఇంకనూ
ఆశలు
కలిగించి,
వారలను
వ్యామోహములందు
మరింత
లోతులకు
త్రోసి
భ్రష్ఠులను
చేయుటకు
కాదు.
నేను
పెద్ద,
నీవు
చిన్న
అనుచు
లేనిపోని
ద్వేషములను
రెచ్చగొట్టుచూ,
లేని
అశాంతికి
అజ్ఞానమునకు
దారి
చూపుటకు
కాదు.
పెద్ద
తనము
భేదములను
అణగద్రొక్కి
సర్వజన
సమాన
ప్రేమకు
పునాదివేయుట
పెద్ద
కానీ,
అట్లు
కాని
వాడు
పెద్ద
(మట్టి
ముద్ద).
మంచి
వైద్యము
తెలిసిన
డాక్టర్లు,
ఆసుపత్రులు
లేని
దేశమునందలి
ప్రజలెంత
రోగపీడితులై
ఎంత
బాధపడుదురో,
సుజ్ఞానమును
బోధించి
పరమార్థమార్గమును
చూపునట్టి
మహనీయులు,
పుణ్యక్షేత్రములు,
ఆశ్రమములు
లేని
ప్రదేశములందు
కూడ,
అదేవిధంగా
క్రూర
గుణములు
పెరిగి,
మహాదారుణ
రోగములచే
బాధపడుదురు.
అయితే
యథార్థమును
తెలిసికొని,
సర్వశాస్త్ర
రహస్యముల
సారమును
తెలిసిన,
అనుష్ఠాన
పరాయణులైన
మహనీయులుండిన,
5
▾
Meaning
Keep
ఇట్టి
దారుణ
గుణములు
కలుగవు!
కలిగిననూ
అణగిపోవుచుండును.
అసలు
లోకమున
అట్టి
మహనీయుల
మహాతపశ్శక్తి,
సాధనా
బలమువల్లనే
లోకమింతవరకైనా
శాంతించి
సుఖపడుతున్నది.
మహనీయులు
వారికి
వారు
ఆనందమును
అనుభవించుటేకాక
అనుభవించిన
ఆనందమును
అందరికీ
పంచి
పెట్టవలెను.
అయితే
తనకు
తాను
అనుభవించక
మునుపే,
రుచి
తెలియక
మునుపే,
తన
బుద్ధి
బలహీనత
చేత,
పేరు
ప్రతిష్ఠలకు
ఆశపడి
అధోగతి
పాలగుచున్నారు.
ఇదే
ఇప్పటి
పెద్దల
దౌర్బల్యము.
ఇప్పటి
సాధువులు,
పెద్దలు
ఆ
యథార్థమును
తెలుసుకొని
మెలగకుండుటే
నేటి
క్షామమునకు
కారణం.
అట్టి
పవిత్ర
సారమును
అనుభవించవలెను.
తన
స్వార్థత్వమును
త్యజించవలెను.
పరోపకారమునకు
పాటుపడవలెను.
లోక
క్షేమమును
ఆశించవలెను.
ఇన్ని
భావములు
హృదయమున
నింపుకొని
పరమాత్ముని
ధ్యానించవలెను.
ఇది
సరైన
దారి.
మహాత్ములు
గాని,
అధికారులు
కాని,
లోకక్షేమ,
లోక
సేవానిరతులై
యుండిన,
జనుల
అంతఃకరణములలో
గల
రాగ,
ద్వేష,
మద,
ఈర్ష్య,
అసూయ,
అహంకారములను
దుష్టగుణములచే
జనులు
దూషితులు
కారు.
మానవుల
యొక్క
ధర్మ,
దయ,
సత్య,
ప్రేమ,
జ్ఞాన,
విజ్ఞానములను
దైవ
ధనమునకున్న
హాని
కలుగదు.
బాహ్య
శత్రువులను
మాత్రమే
పోలీసులు,
ప్రభుత్వము
నివారింతురే
కాని
అంతఃశత్రువులను
అణచు
శక్తి
ఈ
ఇద్దరికీ
లేదు.
సాధ్యము
కాదు.
వీరు
వానికి
అధిపతులు
కారు.
మహనీయుల
సద్బోధనలచే,
భగవద్భక్తి,
జ్ఞానములచే
సాధు
సాంగత్య
సహవాసములచే
జనుల
అంతరంగ
అరిషడ్వర్గములను
పారద్రోలవచ్చును.
అయితే
దొంగలను
పట్టు
పోలీసులు,
అధికారులు
దుష్టులకు
లోబడిన,
దుర్జనుల
వలన
లోకమునకు
ఎంత
హాని
కలుగునో,
బ్రహ్మనిష్ఠులు
పెద్దలును
సాధువులు
లోకోద్ధరణకు
పూనుకొనక,
ఇంద్రియ
సుఖములకు,
పేరు
ప్రతిష్ఠలకు
వశులయినచో
లోకము
మరింత
అజ్ఞానము
ప్రబలి
ధర్మ
నాశనమగును.
ఇప్పటి
పరిస్థితిపై,
రెండువిషయములు
తెలిపిన
రీతిగానే
యున్నది.
అందువలననే
నేటి
బాధలు
కూడా
దినదినమునకు
పెరుగుచున్నవి.
ఈ
రెండు
సమాజములందును
6
▾
Meaning
Keep
ఏనాడు
సరైన
భావములు
నెలకొని,
లోకక్షేమమును
దృష్టియందుంచుకొని,
భగవత్శక్తిని
మననము
చేయుదురో
ఆనాడే
లోకమంతయూ
శాంతి
సంతోషములతో
తులతూగును.
అయితే
మానవునకు
ఈ
రెండూ
రెండు
ప్రభుత్వములే.
అంతర్
రాజ్యమునకు
అధికారులు
ఆధ్యాత్మిక
పెద్దలు,
బహిర్
రాజ్యమునకు
ప్రభుత్వాధికారులు.
ఈ
ఇద్దరు
పెద్దలు,
సక్రమమున
నడచి,
నడిపించిన
రెండు
రాజ్యములు
ఆనందముగా
సాగును.
ఇప్పుడు
ఆనందము
లేకుండుటకు
కారణం
ఈ
ఇద్దరు
అధికారులు
సరిలేకుండుటే.
అట్టి
తరుణముననే
సర్వాధికారియైన
సర్వేశుడు,
సర్వరాజ్యములకు
సంతోషమును
ప్రసాదింప
తలంచియే,
అజ్ఞాన,
అన్యాయములను
అడవులకు
పంపి,
న్యాయ,
జ్ఞానములను
ఊళ్ళ
నింపును.
ఆ
అర్థమును
తెలుపగోరియే:
'యదా
యదా
హి
ధర్మస్య
గ్లానిర్భవతి
భారత
అభ్యుత్థాన
మధర్మస్య
తదాత్మానం
సృజామ్యహం
॥
'
అన్నాడు.
అసలు
ఆ
భగవానుడు
వచ్చుటకు
సయితము
మహనీయుల
ప్రార్థనలే
కారణము.
ఈ
బాహ్య
లోకమున
ఏ
విషయమునందైనను,
ప్రజలకు
సదుపాయములు,
అనుకూలములు
కావలెనన్న,
ప్రజలు
ప్రభుత్వమునకు
ఏ
విధంగా
తెలుపుకొందురో,
అదేవిధంగా
అంతర్విషయములందు,
భక్తి,
కరుణ,
శాంతి,
సత్యముల
సాధింప,
అనుకూలములు
లేని
సమయమున
అంతరాత్మయైన
పరమాత్మకు
పై
భక్తి,
కరుణ,
శాంతి,
సత్యముల
కోరు
మహనీయులు
తెలుపుకొందురు.
అప్పుడు
వారి
ప్రార్థనల
ఆలకించి
లోకములకు
భగవంతుడే
వచ్చి
ప్రసాదించుచుండును.
ఈ
విషయము
సర్వులకూ
తెలిసియే
యుండును.
అసలు
రామకృష్ణాది
అవతారములు
ఇట్టి
ప్రార్థనల
వినియే
అవతరించిరి
కదా!
రామాయణ,
భాగవతముల
నుండి
చాలా
మంది
ఈ
విషయమును
తెలుసుకొనేయుందురు.
అసలు,
రామకృష్ణ
పరమహంస,
తాను
దైవాంశ
సంభూతుడైనను,
తనకు
మించిన
పనియైనందు
వల్ల,
అట్టి
అన్యాయ
అహంకారములను
నిర్మూలము
చేయ,
ధర్మమును
బోధింప
ఎవరినైనా
ఒకరిని
7
▾
Meaning
Keep
ఈ
లోకమునకు
పంపు
తల్లీ!
అని
కాళిని
ప్రార్థించేవాడు.
ఈ
విషయం
ఆయన
చరిత్ర
చదివినవారికి
బాగా
తెలియును.
అట్లనే
ఒకతూరి
కాకున్న
మరొకతూరి,
మరొకతూరి
కాకున్న
ఇంకొకతూరి
కార్యసిద్ధికై
ప్రార్థించవలెను.
ఒకతూరి
ప్రార్థించి
రాలేదే
అని
ఊరకుండరాదు.
ఏదో
బాహ్య
ప్రపంచమునందే
ప్రభుత్వమును
ఎన్నో
పర్యాయాలు
ప్రజలు
కార్యనిమిత్తము
వ్రాసి
తిరిగిననూ
ఎంతో
కష్టముగా
గాని
ఆ
పని
ఫలించదు.
ఇంక
గోచరము
కాని
ఆత్మ
మొరలతో
యథార్థము
ఎట్లు
తెలియును?
తెలియదు.
కావున
వచ్చు
వరకు,
దేశ
క్షేమము
ఏర్పడు
వరకు
ప్రార్థించవలెను.
దేశ
క్షేమమే
తన
రాక
చిహ్నంగా
భావించిన
తత్క్షణము
తన
యొక్క
అవతారము
తెలియగలదు.
అప్పుడే,
సత్యమతము,
దయామతము,
జ్ఞానమతము,
ప్రేమ
మతము
వృద్ధి
పొందును.
అవి
ప్రతిష్ఠించువరకు
ప్రజలైనా
ప్రార్థనలను
చేయుచుండవలెను.
ఈ
బాధ్యత
ప్రజలపై
ఉన్నది.
పుణ్యపురుషులు
ఏర్పరచిన
రాజబాటను
అప్పుడప్పుడు
ఆ
మార్గమున
ప్రయాణము
సల్పువారైనా,
లేదా
దానికి
అధిపతులైనా
అప్పుడప్పుడు
రిపేరులు
చేయించుచుండవలెను.
అదే
బోధ
అనునది.
ఆ
రిపేరుల
నిమిత్తము
అప్పుడప్పుడు
భగవంతుడు
కొందరు
అధిపతులను,
మహనీయులను,
దైవాంశములను
పంపుచుండును.
వచ్చిన
వారి
సద్బోధనలే
ఆ
పూర్వపు
పుణ్యపురుషులచే
స్థాపనైన
మార్గమును
తిరిగి
సరిచేయించును.
ఈ
రీతిగా
దైవ
సంకల్పము,
సాధువుల
ప్రవర్తనలు,
మహనీయుల
సద్బోధనలు
కాలక్రమముల
తప్పక
పనిచేసిన,
దేశ
క్షేమమునకు
కొదువే
లేదు.
కాన,
లోకపు
ప్రజలందరూ
ఒక్క
తూరి
ఇట్టి
అశాంతి,
అన్యాయ,
అక్రమములను,
అసత్యములను
రూపుమాపి
ప్రశాంతి,
సత్య,
ప్రేమ,
అన్యోన్య
ధర్మముల
స్థాపించుమని
ప్రార్థించిన,
తప్పక
బాగుపడగలరు.
ఇంక
వేరు
తరణోపాయము
లేదు.
బాధపడి
ప్రయోజనం
లేదు.
నిరుత్సాహమునకు
సమయం
కాదు.
బలము
లేదనుట
మానవ
ధర్మము
కాదు.
కావున
వేరు
మార్గము
వెతుకక,
భగవత్
ప్రార్థనలకు,
పరోపకారములకు
అన్యోన్యతతో
ప్రయత్నించుడు.
నిదానించుడు;
త్వరలో
సంతోషమును
ఆరగింతురు.
8
▾
Meaning
Keep
లోకమున
మానవసేవే
మాధవసేవ
అనుచుందురు.
అది
నిజమే.
ప్రజాసేవ
పవిత్రమైన
కార్యమైనను,
సత్
వస్తువగు
దైవములో
కలియువరకు,
గొప్ప
సేవచే
జనులకు
శక్తి
కలుగజాలదు.
ఏ
కార్యము
చేసిననూ
దైవచింతనను
తోడు
గైకొని,
మానవునియందు
మాధవత్వమున్నదని
గ్రహించి,
మానవసేవే
మాధవసేవ
అన్నచో
సత్యమగునుకాని,
కేవలం
అట్టి
భావము,
విశ్వాసమే
లేక,
వారి
వారి
పేరు
ప్రతిష్ఠలకు,
సంఘ
గౌరవములకు
తత్ఫలితమును
కోరి,
మానవసేవ
చేస్తూ,
మానవ
సేవే
మాధవ
సేవ
అన్నచో
ఎట్లు
అగును?
మాధవ
చింతనే
లేక
మాధవసేవ
ఎక్కడ
ఉట్టిపడును?
అవి
బూటకపు
మాటలు.
అది
నేనొప్పను.
దైవచింతనతో,
సత్యమార్గముతో,
ధర్మ
గుణముతో
ఏ
కార్యము
చేసినను
భగవత్సేవగా
భావించవలెను.
పేరు,
గౌరవము
తత్ఫలితము
ఆశకొరకు
చేయు
సేవ
మాధవసేవ
అనబడదు.
అట్టి
నిరంతర
దైవధ్యానపరులైనవారు
ఇతరమైన
కార్యము
ఏమియున్నూ
చేయనక్కరలేదు.
వారి
ప్రార్థనా
ఫలమే
లోకమును
పావనము
చేయును.
అయితే,
నిరంతరం
ధ్యేయాకారమగు
ధ్యానములో
నిలుచుటకు
అందరికీ
సాధ్యమైన
పనికాదు
కనుక,
అట్టి
స్థితిని
పొందుటకు
విశుద్ధాంతఃకరణము
కలిగి,
సర్వ
సంకల్పమును
నశింపచేసుకొనవలెను.
అట్టి
మనోధర్మము
కలిగిన
సాధువులు
స్వయంగా
కనుగొనగలరు.
అంతియే
కాని,
అందరికీ
సాధ్యము
కాదు.
కాదని
ఊరక
ఉండకూడదు.
అది
మీమీ
ప్రాప్తానుసారం,
సాధనానుసారం
లభించును.
అంతవరకు
ఆత్మవంచన
లేక,
ఎంతవరకు
మనస్సు,
వృత్తి
రహితమై
దైవాకారమగు
స్థితిలో
నిలుచునో
అంతవరకు
ధ్యాన
జపములు
చేయుచూ,
పరోపకారము
చేస్తూ
తత్ఫలితమును
ఆశించక,
లోకసేవలో
కాలమును
వినియోగించిన,
ధన్యాత్ములు
కాగలరు.
అట్లు
కానిచో,
దేహముతో
ప్రపంచ
కర్మలు
చేయకపోయినను,
మనస్సు
లోకమున
పోయి
అనేక
కర్మలు
చేయుచుండును.
ఇట్టి
వారు
కర్మలు
చేయకనే,
కర్మమునకు
కట్టుబడుదురు.
దైవ
ధ్యానము,
సత్యమార్గములో
నుండి
మనస్సు
బహిర్గతమగునప్పుడు,
ప్రాణికోట్లకు
ఉపకారమగు
పనులు
దేహేంద్రియములు
చేసినను,
మనస్సు
దానిపై
ఏకాగ్రతతో
9
▾
Meaning
Keep
పడియుండుట
చేత
కర్మము
చేసినను,
కర్మము
చేయని
వాడగును.
భగవద్గీత
భావమంతయూ
దీనిపై
ఆధారపడినది.
మనస్సున
పవిత్ర
విషయిక
పరిశ్రమ
చేయని
హృదయమే,
దుర్గుణములకు
విశ్రాంతి
భవనముగా
నుండును.
ఈ
విషయమును
మోక్షమును
కోరువారు,
ఏకాగ్రతను
పొందగోరు
వారు,
పెద్దలు
కాగోరు
వారు
ముఖ్యముగా,
గ్రహించవలసియున్నది.
ఇట్టి
ఆత్మ
జ్ఞానము
పొందుటకు
(బ్రాహ్మణులు,
ఆశ్రమవాసులగు
సన్యాసులు
అర్హులంటారు
కాని).
బ్రహ్మనిష్ఠ
కలిగిన
వారెవరైన
ఆత్మజ్ఞానమును
పొందవచ్చును.
అందుకనే
ఉపనిషత్
వచనము
కూడా
ఇట్లే
నుడివినది.
'నాశ్రమం
కారణం
ముక్తేః
దర్శనాని
న
కారణమ్
తథైవ
సర్వకర్మాణి
జ్ఞానమేవ
హి
కారణమ్
॥
'
అట్టి
పరబ్రహ్మమగు
పరమాత్మ
చింతనకు
కాలనియమము
లేదు;
పుణ్యదేశమనియు,
ప్రత్యేక
స్థలమనియు
లేదు.
ఏ
కాలమైనను,
ఏ
స్థలమునైనను,
ఏ
సమయమున
చిత్తము
పరమాత్మయందు
రమించునో,
అదే
పుణ్య
స్థలము,
పుణ్యకాలము
అగుచుండును.
ఎచ్చటనున్న
అచ్చటనే
చింతన
చేయుచుండవచ్చును.
అందుకనే
మునుపీ
రీతిగా
తెలియపర్చటము:
న
కాలనియమో
యత్ర
న
దేశస్య
స్థలస్య
చ
యత్రాస్య
రమతే
చిత్తం
తత్ర
ధ్యానేన
కేవలమ్
॥
ఇట్టి
సర్వనిష్ఠా
గరిష్ఠులై,
సర్వసారసహితులై,
అంతఃకరణ
శుద్ధి
కలిగిన
వారల
వల్ల
లోకము
క్షేమము
కలుగగలదు.
అట్టివారి
అనుగ్రహమునకు
పాత్రులై,
వారి
ప్రార్థనల
వలన
దేశ
క్షేమమును
కోరి,
ఉన్న
బాధలను
పోగొట్ట
ప్రయత్నించుటకు
సర్వులూ
ఈ
నిమిషము
నుండియే
పరమాత్ముని
ప్రార్థనలు
సల్పుదురుగాక!
లోక
క్షేమమును
పొందుదురు
గాక!
-సమాప్తం-
Previous
←
For Man, Good Saṅkalpa Is the Path to God's Presence