Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Prema Vāhinī · For Man, Good Saṅkalpa Is the Path to God's Presence
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మానవునికి
సత్సంకల్పమే
సాన్నిధ్యమునకు
మార్గము
మాయాపరికల్పిత
జీవుల
మాయాద్వారములు
రెండు
గుహ్యేంద్రియ
చాపల్యము,
జిహ్వేంద్రియ
చాపల్యము.
ఇట్టివి
ప్రతి
మానవుడూ
జయించి
తీరవలెను.
ఇవి
రెండును
ఉన్నంతవరకు
మానవుడు
దుఃఖభాజనుడు.
ఇట్టి
రెంటిని
జయించినవాడే
లోకాతీతుడు.
లోక
వాంఛలన్నియూ
ఈ
రెండింటియందే
ఇమిడి
యున్నవి.
పాపములకు
సహితము
ఈ
రెండే
కారణభూత
మగుచున్నవి.
పాపము
మాయయొక్క
యెరువువంటిది.
అసలు
మాయా
ప్రపంచము
మనుష్య
శరీరపోషణార్థము
మాత్రమే.
జీవన్ముక్తిని
కోరువారు
జితేంద్రియుడుగా
నుండవలెను.
'భిక్షాన్నం
దేహరక్షార్థం,
వస్త్రం
శీతనివారణం.'
(ఉత్తర
గీత).
దేహ
పోషణార్థము,
దేహము
నిలుపుదలకు
మాత్రము
అన్నపానాదులు
అవసరము;
చలిబాధ
నివారణార్థము
వస్త్రము.
అయితే
మానవుడు
ఈ
రెండు
విధములైన
చాపల్యములందే
మునిగి
తేలుచుండిన,
వాని
రాక
దేనికొఱకు?
వాడు
చేయు
పవిత్రత
దేనికి!
ఆ
విషయము
మరచియుందురు.
అట్లుకాక,
ఎన్ని
కార్యములు
మానవుడు
చేయుచున్ననూ,
అప్రయత్నముగా
తన
శ్వాస
తనను
యెట్లు
వదలకయుండి
క్రమమును
తప్పక
తనపని
తాను
2
▾
Meaning
Keep
చేయునో,
అట్లనే
లోకమునందు
శరీర
కార్యములు
ఎన్ని
సల్పుచుండిననూ
తన
మనోభావము
ఈ
క్రింది
రీతిని
చింతించుచుండవలెను.
నేను
పుట్టినది
దేవుని
భజించి
తన
యథార్థ
స్వరూపమును
తెలిసికొనుటకేయని
మనోనిశ్చయము
చేసుకొని,
ధరించునది,
భుజించునది,
చరించునది,
పఠించునది,
సేవించునది,
నడచునది
మొదలుగాగల
పనులు
ఆచరించునది
అంతయూ
దేవుని
సన్నిధి
చేరగోరి
చేయునదే
కాని
వేరు
కాదని
దృఢ
విశ్వాసముతో
నుండి
చేయవలెను.
సమస్తమున్ను
దైవార్పిత
హృదయముతో
చేయవలెను.
ఒక
రైతు
పొలము
బాగుచేసుకొని,
అందులో
రాళ్ళను
ముండ్లను
ఏరి,
దానిని
దున్ని
దుక్కి
చేసి,
యెరువు
వేసి,
యెడ్లుకొని,
అరకను
కట్టి,
త్రాళ్ళను
కట్టి,
నీరును
కట్టి
పూర్తిగా
మెత్తపరచి,
గింజలు
తెచ్చి
అందులో
చల్లి,
దానికి
కలుపులు
తీసి
కంచెను
కట్టి,
పంటను
కోసి,
కుప్పలు
వేసి
గింజలు
కొట్టును.
ఇన్ని
కార్యములు
ఏ
నిమిత్తము
కొఱకు?
పొట్ట
కొఱకనునదియెట్లో,
అట్లే
ఈ
జీవితమున
ఆకలి,
దప్పి,
ఇష్ట,
అయిష్ట,
కష్ట,
నష్ట
కోపతాప,
పోషణ,
చాపల్యములన్నియునూ
పరమాత్మను
చెందగోరి
వచ్చిన
దేహబుద్ధులని
తలంచి,
సర్వకార్యములు
పరమాత్మ
కార్యములే
అనునది
స్థిరము
చేసుకొన్న,
పాపములు
అందులో
చేరవు.
చాపల్యములకు
రూప
నామములే
ఉండవు.
అట్లుకాక,
కేవల
చాపల్యమునే
ప్రధానముగా
తీసుకొని
వెళ్లినవానికి
దుఃఖప్రాప్తి
తప్ప
సంతోషము
సాధ్యము
కాదు.
సంతోషశాంతులను
పొందలేడు.
దేహ
పోషణార్థము
క్రమశిక్షణ
అవసరమేకాని
చాపల్య
శిక్షణ
పాటించరాదు.
పుణ్యకార్యములే
పురుషార్థము
దేహమున
జ్వరమున్నప్పుడును,
మనసు
వేరు
విషయములపై
యోచించుచున్నప్పుడున్ను
మానవులు
భుజించు
ఆహార
పదార్థముల
రుచి
తెలియదు.
ఈ
విధముగనే
భగవన్నామ
స్మరణ,
భజన,
జపధ్యానములు
చేయునపుడు
హృదయము
తమో
గుణములతో
నున్ననూ,
చంచలముగా
3
▾
Meaning
Keep
నున్ననూ
ఆనందము
అనుభవింప
సాధ్యము
కాదు,
అది
కలుగదు.
నాలుకపై
బెల్లమున్నంతవరకూ
జిహ్వా
మధురముగా
నుండును.
ఇట్లే
హృదయ
వీధిలో
దైవ
భక్తి
అను
జ్యోతి
స్తంభము
ఉన్నంతవరకూ
ఆ
హృదయవీధి
అంధకారమునకు
గురికాదు.
ఆనందమైన
ప్రకాశముతో
హృదయము
వెలసియుండును.
చేదువస్తువులు
నాలుకపై
నున్నంతవరకు
నోరు
పూర్తిగా
చేదుగానే
యుండును.
అట్లే
హృదయమున
కామ,
క్రోధాది
దుర్గుణములు
చేర్చినచో
అంధకారము
ప్రవేశించి,
ప్రకాశమును
పాడుచేసుకొని
యెన్ని
కష్టనష్ట
దుఃఖములకో
గురియగును.
కావున
మానవులు,
పవిత్రమైన
పరమాత్ముని
సన్నిధిని
చేరగోరు
కొన్ని
అభ్యాసములు,
క్రమపద్ధతులు
సద్గుణములు
సంపాదించవలెను
లోకమున
ప్రవర్తించునట్టి
ప్రవర్తనలతోనే
పరమాత్మను
చేరలేరు,
వాటిని
కొన్ని
మార్పులు
చేసి
సాధనను
చేయవలెను.
కొంగను
చూడుడు.
నీటిలో
గబ
గబ
నడచును.
అయితే,
అదే
నడకతో
చేపలను
పట్టజాలదు.
బహునెమ్మదిగా
నడుచుచుగాని
నిలబడిగానియున్న
మాత్రమున
చేపలు
తనకు
దొరకగలవు.
అదే
రీతిగనే
హృదయమున
కామక్రోధాది
గుణములతో
నెగురుచు
దుముకుచు
వాంఛలతో
పోయిన,
అహంకారమే
వారికి
ఆసన్నమవును
కాని
సత్యధర్మ
శాంత్యాది
సద్గుణములనే
మత్స్యములు
వారికి
లభించవు.
ఏ
సాధనలు
లేకున్నను
భగవన్నామ
స్మరణను
ఎల్లప్పుడు
మరువక
చేయుచుండుట
అనునొక్క
సాధనమున్నచో,
కామక్రోధాదిప్రకృతి
గుణములను
జయించవచ్చును.
పరమాత్ముడే
సర్వుల
గమ్యమనియూ,
దాని
కొఱకే
ఈ
ప్రయాణపు
ఒడుదుడుకులనియూ
గ్రహించి,
పరమాత్మ
యందే
దృష్టియుంచి
మనస్సును
నిగ్రహించుటే
సర్వశాస్త్రముల
సారము.
మిత
సంభాషణ,
దైవచింతనయున్న
మానవుని
చెంతకే
సమస్త
సద్గుణములును
అప్రయత్నముగా
వచ్చి
చేరును.
చూడుడు!
ద్వాపరయుగమందు
కౌరవులు
పుణ్యకర్మ
ఫలమగు
భోగములను
అనుభవించుచు
ఆనందించుచూ
పాపకార్యములను
చేయుచుండిరి.
పాండవులు
పాపకర్మ
ఫలమగు
కష్టములను
భవించుచు,
పుణ్యకార్యములే
తలంచుచూ
చరించుచుండిరి.
ఇదియే
వివేకులకు
అవివేకులకు
గల
భేదము.
ఇట్టిదే
4
▾
Meaning
Keep
గుహ్యేంద్రియ
చాపల్య
సహితులైన
కౌరవులకు,
అట్టి
చాపల్యరహితులై,
సత్య
ధర్మముల
సారథిగా
గైకొని,
భగవద్వినియోగ
నిమిత్తమై
సర్వకర్మలూ
చేసిన
పాండవులకూ
గల
భేదము.
సంపూర్ణ
దుఃఖమున
మునిగినవారికి
విందులుగాని,
కయ్యముగాని
రుచింపనట్లు,
భగవత్
చింతనలో
మునిగిన
నిజమైన
ముముక్షువునకు
ప్రపంచ
విషయ
భోగములు
రుచింపవు,
యోచించరు.
మానవ
జన్మమునకు
మంచి
గుణమే
మాణిక్యము
ఈ
శరీరమందే,
(మరణించకమునుపే)
నిత్యసత్యమైన
పదార్థమేమిటి?
అట్టి
సత్యపదార్థమునకు
మానవులకు
గల
సంబంధమెట్టిది?
అని
తెలిసికొనవలెను.
కఠోపనిషత్
'ఉత్తిష్ఠత!
జాగ్రత!!
ప్రాప్యవరాన్నిబోధిత!!!'
'లెమ్ము!
జాగరూకుడవై
పెద్దలైనవారిచే
ఉపదేశమును
గైకొనుము',
అని
బోధించుచున్నది.
లోకమున
అనేక
సందేహములతో
డోలాయమాన
మనోవృత్తిలో
నున్నవారు,
ఏది
స్వీకరించదగినదో,
ఏది
వర్జ్యమో
ఎఱుగలేక
సమ్మూఢవృత్తి
గమించెడు
వారంత
గ్రుడ్డివారు.
ఏది
తమస్సు,
ఏది
జ్యోతిస్సు,
ఏది
మృత్యువు,
ఏది
అమృతము
తెలియక
మోహబద్ధులై
చరించుచున్న
మానవులు,
నిత్యసత్యమైన
సర్వజగత్తుకు
ఆధారమయి
వెలుగు
ఆ
స్వయంప్రకాశ
స్వరూపమును
తెలిసికొనుటకు
దారిచూపించు
పెద్దలను
ఆశ్రయించవలెను.
అప్పుడు,
ఈ
లోకమైన,
స్వర్లోకమైన
అంతా
ఒక్కటై
వెలుగొందును.
అందుకై
తీవ్రమైన
ఆవేదనతో,
ఆచరణకు
త్వరపడవలెను.
ఏ
సుకృతమువల్లనో
లభ్యమైన
ఈ
మానవజన్మను
సదుపయోగ
పరుచుకొనుట
మానవ
ధర్మమే
కాదు,
విధికూడా.
అట్టి
జన్మము
కలుగుటకూడా
ఎన్నో
సత్కర్మల
ఫలితముగనే.
కేనోపనిషత్తులో
చెప్పినట్లు
'న
చేదిహావేదీ
జమహితా
వినష్టిః',
చేతికిచ్చిన
అమూల్య
రత్నమును
జారవిడచిన
విధముగా,
అన్ని
విధముల
తరించుటకు
అవకాశము,
సదుపాయములున్నను
తరణోపాయము
ఆలోచించకపోవుట
గొప్ప
నష్టము
కదా!
5
▾
Meaning
Keep
మానుష
వేషమున
దురభిమాన
పూరితులై,
పశువృత్తినికొని
చెడిపోవు
వారలకు,
సమయం
మించిన
లాభం
లేదు.
ఎట్టి
ప్రయోజనముండదు.
ముందే
యోచించుకొనవలెను.
ఇల్లు
కాలునప్పుడు
బావిని
త్రవ్వుటకు
ప్రారంభించునట్లుండును.
అందువలన
వివేకియగు
మానవుడు
తత్త్వజ్ఞానమును
గ్రహించి,
మరియు
పెద్దలు,
అనుభవజ్ఞులు
చెప్పిన
విషయాలను
సర్వస్వముగా
నెంచి,
ఆచరణలోనికి
సాధ్యమైనంత
త్వరలో
తీసుకొని
వచ్చుటకు
సర్వశక్తులా
ప్రయత్నించవలెను.
కాని
తిరస్కరించుట,
కాలమును
వ్యర్థపరుచుట,
మానవ
నామధేయమునకే
లోటు.
అనిత్య,
అసత్యమైన
ప్రకృతి
చాపల్యములకు
లోనై
పవిత్ర
కాలమును
పాడు
చేసుకొనక,
సత్య
నిత్యమున
సర్వేశ్వర
చింతనకు
సత్యాన్వేషణ
కొఱకు
సర్వకాలమును
వినియోగింపుడు.
అట్టిదే
ఆత్మ
సంబంధం
కాని
కాలమును
వ్యామోహకరమైన
చాపల్యమునకు
ధారబోసిన
లోక
వ్యాపార
బంధము
ఏర్పడును.
లోకమున
భోగ
పదార్థములను
చూచియు,
విషతుల్యులును,
సౌందర్య
లాలిత్యముల
ద్వారా
వలలో
వేసుకొన
చూచు
ముగ్ధలను
చూచి
ముగ్ధులై
అధఃపతనము
పొందబోకుడు.
స్వప్న
కథవలే
ఒకనాడు,
ఈ
ప్రాపంచిక
దృశ్యములు
మానవునకు
దూరమై
హుళక్కిగా
మారిపోవును.
మానవుడు
విద్యకాని
మరేదైననూ,
ఒక్కటేమి
పుట్టినప్పటి
నుండి
ఏయే
సంబంధములతో
పెరిగి
పెద్దవాడైనాడో
ఆయా
సంబంధములు
వాని
ఆత్మోద్ధరణకు
ఉపయోగపడునని
కావు.
అవి
అధఃపతనమునకు
మాత్రమే
ఉపయోగపడును.
అందువల్లనే
ఇది
మాయా
ప్రపంచమనుట
సంభవించినది.
సత్యమును
ఎన్ని
మాయలలో
త్రోసినను
అది
నిత్యసత్యమై
మరింత
దేదీప్యమానముగా
వెలుగును.
అట్టిదే
సత్యము.
నిమిష
నిమిషమునకు
మార్పు
చెందుచూ,
క్షీణించుచూ,
కృశించుచూ
అదృశ్యమగు
చాపల్యముతో
నిండిన
పదార్థ
ప్రపంచం
ఎట్లు
నిత్యసత్యమగునని
చెప్పగలరు?
కాన
నిత్యం
కాని
ఈ
లోకమున
మిథ్యను
వెతుకుటకన్నా,
సత్యమును
సాధించుటే
సాధకుని
లక్షణము.
మిథ్యా
లోకమున
మిథ్యాచారములే
కానీ
సత్యాచారములు
లేవు.
సత్యాచారములు
సర్వేశ్వర
సాక్షాత్కారమందే
ఉన్నవి.
ఈ
విషయాలను
మాత్రం
సర్వవేళలందు
ప్రతి
మానవుడు
జ్ఞప్తియందుంచుకొనవలెను.
6
▾
Meaning
Keep
సహజ
మార్గము
-
సాధన
మార్గము
ఒక్కది
కాదు
సహజ
మానవుని
వృత్తికి,
సాధకుని
వృత్తికి
భేదములు:
ముఖ్యంగా
సాధకులు
గమనించవలెను.
1.
సహనము
లేక,
నేనను
అహంకారముతో,
జగతి
వాంఛలతో
జన్మమును
సంతృప్తి
పరుచువాడు,
స,
హ,
జ,
మానవుడు.
2.
సాగరపు
తరంగములవలే
ఎడతెరపి
లేక
సర్వేశ్వర
చింతనతో
సహజ
భావన,
సమాన
ప్రేమ,
అను
ధనమును
ప్రోగుచేసుకొని
నాదేమీ
లేదు,
సర్వమూ
సర్వేశ్వరాభీష్టమే
అను
భావనలతో
జీవితమున
తృప్తిపడువాడు
సా,
ధ,
న,
మానవుడు.
కాన
ఈ
రెండవ
వాడైన
సాధన
మానవుడు,
లోక
సహజమనబడు
కష్ట,
నష్ట,
నిష్ఠూరములకు
కాని,
కోప,
తాప,
అహంకారములకు
కాని,
ఆకలి,
దప్పి,
ఆరాటములకు
కాని
అంత
సులభముగా
లొంగరాదు.
పై
వాటిని
సాధ్యమయినంతవరకూ
సాధించి,
ఓపిక,
ధైర్యము,
సంతోషము,
శాంతము,
దయ,
నిరహంకారములతో
సంచరించి,
శరీర
పోషణమే
ప్రధానమని
తలంచక,
ఆకలి
దప్పులకు
కూడనూ
ఓర్చుకొని
భగవత్
చింతన
ఎడబాటులేక
ఏకధారగా
చేయుచుండవలెను
కాని,
అట్లుకాక
సహజ
మానవుల
చీటికి
మాటికి
పేచీలు,
కోపములు,
దుఃఖములు,
నిందలకు
తత్క్షణము
నిష్ఠూరములాడుటకు,
ఆకలి,
దప్పిక,
నిద్రను
ఆపలేకుండుట
సాధకుని
లక్షణములనబడవు.
సహజమైన
బియ్యము
నములుట
పక్వమైన
బియ్యము
నములుటలు
రెండూ
సమమెట్లుగును!
పక్వమైన
బియ్యమునకు
కఠినత్వము
మాయమైపోవును
కదా!
పక్వమైన
బియ్యము
సాధు,
మృదు,
మాధుర్య
సహితమయి
ఉండును.
అసలు
ఇద్దరును
జీవులైననూ,
బహిర్
వ్యామోహ
సహితమయినచో
మానవుడు:
అంతర్
వ్యామోహ
సహితుడు
సాధకుడు,
అంతర్
బాహ్య
వ్యామోహ
రహితుడైన
వాడే
దేవుడు.
బహిర్
వ్యామోహ
రహితుడు
కాగానే
సాధకుడుగా
అంతర్
వ్యామోహ
సహితుడగును.
అంతర్
వ్యామోహము
కూడా
లేనివాడే
దేవుడనబడును.
అట్టి
వారి
హృదయములన్నియూ
దేవుని
పీఠములు.
అందుమూలముననే
సర్వము
పరమాత్మమయమని
7
▾
Meaning
Keep
నిరూపించవచ్చును.
పరమాత్ముడు
సర్వుల
హృదయ
స్థాయి
అయివున్ననూ
దానిని
నిరూపించునట్టి
సాధన
పరికరములు
అవసరము
కదా!
మన
ముఖమును
మనము
చూడవలెనన్నను
సాధ్యము
కాదే.
దానికి
ఏదైనా
ప్రతిబింబమును
చూపునట్టి
అద్దమెట్లు
అవసరమో,
గుణ
రహితుడు
అగుటకు
ఒక
ఆధారము
మార్గము
సాధన.
ఓర్పును
మించిన
తపస్సు,
సంతృప్తిని
మించిన
సుఖం,
కనికరాన్ని
మించిన
పుణ్యం,
క్షమను
మించిన
శక్తివంతమైన
ఆయుధము
లోకమున
వేరు
లేదు.
ఇదే
సాధకుడు
పండించవలసిన
పంట.
భక్తుడు,
దేహమును
క్షేత్రముగాను,
సత్కార్యములను
విత్తనములుగాను,
భగవన్నామమనే
సాగును,
హృదయమునే
రైత
చేసిన,
భగవంతుడనే
పంట
నీకు
చిక్కుతుంది
కాని,
సాగు
అనునదే
లేక
సరుకు
రావాలన్న
ఎట్లు
వచ్చును?
పాలలో
మీగడ,
కొయ్యలో
అగ్ని
ఉన్నట్లు
అల్పము,
అధికములైన
ప్రతి
దానియందు
పరమాత్ముడున్నాడను
విశ్వాసము
ఉండవలెను.
పాలకు
తగిన
మీగడ,
కట్టెకు
తగిన
అగ్ని,
అట్లే
మన
సాధనకు
తగిన
సాక్షాత్కారము
కదా!
భగవన్నామము
వల్ల
ముక్తి
ప్రాప్తి
ప్రత్యక్షముగా
అనుభవమునకు
గోచరము
కానప్పటికినీ,
నాలుగు
ఫలములు
లోకమున
అనుభవైక
వేద్యములు.
(1)
మహనీయుల
సాంగత్యం,
(2)
సత్యం,
(3)
సంతృప్తి,
(4)
ఇంద్రియ
నిగ్రహం.
ఈ
నాలుగు
మార్గములలో
ఏ
మార్గమున
ప్రవేశించినను,
అతడు
గృహస్థుడు
కావచ్చు,
సన్యాసి
కావచ్చు,
మరే
తెగవాడైన
కావచ్చు.
ఎవరైననూ
తప్పక
భగవంతుని
చేరగలరు;
ఇది
నిశ్చయము.
మానవులు
ప్రపంచ
సుఖములు
కోరుచుందురు.
న్యాయముగా
యోచించిన
అదియే
రోగము.
బాధలే
మందులు.
ఈ
సుఖములున్న
చోట
భగవంతుడు
కావాలన్న
కోరికే
చాలా
అరుదు.
ఇదియేకాక
మానవుని
ప్రతి
ప్రవర్తననూ
యోచించవలసిన
అగత్యమున్నది.
అందుమూలముననే
వైరాగ్యము
ప్రాప్తించునుకాని,
లేకపోయిన
సాధ్యము
కాదు.
లోభాన్ని
రూపుమాపవలెను.
అది
కుక్క
వంటిది.
ఇంక
అసత్యము;
అది
మరింత
అసహ్యమయినది.
దాని
8
▾
Meaning
Keep
మూలమున
సర్వ
ప్రాణేంద్రియములు
చంపుకున్నట్లగును.
అది
కేవలం
పాకివాని
వంటిది.
దొంగతనము
జీవితమునే
నాశనము
చేయును.
పవిత్రమైన
మానవత్వమును
కాసుకు
కూడ
కొఱగాని
వానినిగా
చేయును.
అది
కేవలము
కుళ్ళి
కంపుకొట్టు
మాంసము
వంటిది.
మితమైన
తిండి,
మితనిద్ర,
ప్రేమ,
సహనము-ఇవి
శరీర,
మానసిక
ఆరోగ్యముల
నభివృద్ధి
పరచును.
అధైర్యమునకు
చోటివ్వక,
భయమనునదిలేక
భగవంతుని
నిశ్చల
చిత్తుడై,
వాంఛారహితుడై
స్మరించువాని
సమస్త
బాధలు,
దుఃఖములు
విడిచిపోవును.
భగవంతుడు
ఎప్పటికిని,
ఏనాటికిని,
నీవే
జాతికి
చెందిన
వాడవని
కాని,
ఏ
ఆచారమునకు
చెందిన
వాడవని
కాని
అడుగడు.
ఎన్ని
మంచి
కార్యములను
చేసినావనియూ,
ఏ
హృదయమున
చేసితివనియు
మాత్రము
చూచును.
భక్తి
అనగా
కాషాయాంబరాన్ని
వేయుట,
ఉత్సవములు
చేయించుట,
యజ్ఞములు
చేయుట,
గుండ్లు
కొట్టించుట
(తలలు
బోడి
చేయుట),
దండకమండలములు
ధరించుట,
వెంట్రుకలు
జడలు
కట్టించుకోటము
ఇవన్నియు
కాదు.
అంతఃకరణ
శుద్ధిగా
నుంచుకొని,
ఎడతెరిపిలేక
ఏ
కార్యమాచరించిననూ
భగవత్
చింతననే
చేయుచూ,
సర్వమూ
పరమాత్మయొక్క
సృష్టిలో
ఒకటిగా
భావించుకుంటూ,
విషయ
రహితుడై
సర్వజన
సమాన
ప్రేమతో,
సత్యవాక్కుతో
మెలగటమే
భక్తి.
నవవిధ
భక్తిమార్గములలో,
నామస్మరణ
శ్రేష్ఠమయినది.
అట్టి
నామమే
కలిలో
కడతేర్చునట్టి
మార్గము.
జయదేవ,
గౌరాంగ,
త్యాగయ్య,
తుకారాం,
కబీర్,
రామదాసు
ఇట్టి
పరమ
భక్తులందరునూ
ఒక్క
నామమువల్లనే
పరమాత్ముని
పొందిరి.
వేయేల,
ప్రహ్లాద,
ధ్రువులు
సహితము
ప్రత్యక్ష
దర్శన,
స్పర్శన,
సంభాషణలను
పొందగలిగినది
భగవన్నామమువల్లనే
కదా!
కాన
ప్రతి
సాధకుడు,
భగవన్నామమును
శ్వాసవలె
భావించుకొని
పరోపకారదీక్ష,
సర్వజన
సమాన
ప్రేమను
అభివృద్ధి
చేసుకున్నచో,
దానికి
మించిన
ముక్తి
మార్గమేదీ
లేదు.
అట్లుకాక,
ఎక్కడో
ఏకాంతములో
ముక్కుమూసుకొని
కూర్చున్న
గుణముల
జయించుటెట్లు
వీలగును?
జయించితినని
తెలియుట
ఎట్లు?
చేయునది
అంబరీష
భక్తి,
చేతలు
దూర్వాసనములైన
దూర్వాస
గతే
ప్రాప్తించును.
కడకు,
అంబరీషుని
9
▾
Meaning
Keep
పాదాక్రాంతుడు
కాక
మానదు.
అట్లు
త్రిశంకులుకాక
నిజమైన
స్థానమును
పొంది
నిత్య
సత్యమును
అనుభవింతురు
గాక.
సాధకుడు
సర్దుకోవలసిన
సామాను
ప్రతి
మానవునియందును
తప్పొప్పులు
తలంచకనే
జరుగుట
సహజము.
ఎంత
ప్రకాశవంతమైన
అగ్ని,
దీపమునందైనను
కొంతైనా
మసిరాక
మానదు.
మానవులు
చేయునట్టి
ఎట్టి
సత్కార్యములందైననూ
ఎంతో
కొంత
చెడ్డలేక
ఉండదు.
అయితే
ఆ
చెడ్డను
అధికము
కానీయక,
దానిని
మొగ్గలోనే
తుంచుటకు
ప్రయత్నించవలెను,
చెడ్డ
అధికముగను,
మంచి
అల్పము
కానీయక,
మంచి
అధికముగను,
చెడ్డ
అల్పముగను
ఉండునట్లుగా
ప్రయత్నించవలెను.
అసలే
చెడ్డలేక
చేసుకొనుట
మరింత
ఉత్తమోత్తమము.
కాని
ఇదంతా
ఒకేతూరి
సాధ్యము
కానేరదు.
మనము
చేయు
పనులనుకాని,
ఆడు
పలుకులనుగాని,
అనుసరించు
నడకలుగాని
జాగ్రత్తగా
యోచించవలెను.
లోకమున
తనను
ఇతరులేరీతిగా
గౌరవించవలెనని
కోరుకొనునో,
ఏ
రీతిగా
ప్రేమించవలెనని
కోరుకొనునో,
ఎట్లు
తనచెంత
మెలంగవలెనని
కోరుకొనునో,
అట్లు
మొదలు
తాను
ఇతరులచెంత
మెలంగి,
ప్రేమించిన
అందరు
నిన్ను
గౌరవింతురు.
కాని
తాను
మాత్రం
ఇతరులను
గౌరవించక,
ప్రేమించక,
ఇతరులు
తనను
ఆయారీతుల
చూడలేదన్న
ఇది
సరైన
భావన
కాదు.
అంతియేకాక
ఇతరులకు
ఏ
నీతులు
సరియైనవని,
సత్యమని,
మంచివని,
ఆ
రీతిగా
నడచుటే
ఉత్తమ
మార్గమని
తెలుపెడివారు
మొదలు
వారు
నడుచుకొన్న,
ఇతరులకు
చెప్పనవసరమే
ఉండదు.
తన
నడతను
చూచే
ఎదుటివారు
నేర్చుకొందురు.
అట్లుకాక
ఇతరులకు
వేదాంత
వాక్యములు,
చిలుక
పలుకులవలె
చెప్పటం,
వాటిని
తానుమాత్రం
ఆచరించకున్న
ఇట్టిది
ఇతరులను
మోసపుచ్చుటేకాక
తనను
తాను
ద్రోహం
చేసుకొన్నవాడగును.
కాన
ఇతరులును
ఏ
రీతిగా
ఉత్తమ
మార్గమున
ఉండవలెనని
కోరుదురో
ఆ
రీతిగా
తానుండవలెను.
ఇతరుల
తప్పొప్పుల
వెదకుట;
తన
తప్పులను
మూసిపెట్టుకొనుట
సాధకునకు
లక్షణము
కాదు.
తన
తప్పెవరైనా
చూపించిన,
దానిని
సమర్థించుకొని
వాదించుటకాని,
ఇట్లన్నారు
కదా
అని
వారిపై
కినుక
10
▾
Meaning
Keep
చెందుట
కాని
మంచిది
కాదు.
ఆ
తప్పును
యోచించి
సరిచేసుకొనవలెను
కానీ,
తనకు
సరిపడు
రీతిగా
సమర్థించుకొనుట,
మనసునందుంచుకొని
కసి
సాధించుట
అజ్ఞాన
అహంకార
లక్షణములు
కాని
సాధకుని,
భక్తుని
లక్షణములు
కావు.
సర్వ
విధాలా
సత్య
విషయమునే,
సంతోష
విషయమునే,
సాధకుడు
విచారించవలెను
కాని,
అసత్యమైన,
దుఃఖ
విషయములు
కాని,
నిరుత్సాహపడు
భావములను
కాని
యోచించరాదు.
నిరుత్సాహము,
సందేహము,
అహంకారములు
సాధకులకు
రాహుకేతువులవంటివి.
అట్టి
వాటిని
భద్రమైన
భక్తిభావములుండిన
దరి
చేరనీయవు.
అవి
చేర్చుట
వలన
తన
సాధనకు
భంగము
తప్ప
వేరు
ప్రయోజనముండదు.
ముఖ్యముగా
మానవుడు
ఎట్టి
సమయమందును
ఆనందముగను,
చిరునగవుతో
ఉత్సాహవంతుడై
ఉండుట
ఉత్తమోత్తమమైనది.
భక్తిజ్ఞానము
కన్నను
ఈ
నిర్మల
భావము
ఉత్తమమైనది.
వాడే
మొదట
గమ్యమునకు
అర్హుడగును.
అట్టి
సర్వవేళలందు
ఆనందించునట్టి
గుణము
కూడా
జన్మాంతర
సుకృత
ఫలమే
కాని
వేరు
కాదు.
అట్లు
కాక
ఎల్లప్పుడు
యోచనతోను,
నిరుత్సాహముతోను,
సందేహముతోను
ఉన్న,
ఎన్ని
సాధనలు
చేసినను,
ఆనందమును
పొందలేరు.
ఉత్సాహమును
పెంచుకొనుటే
సాధకుని
మొదటి
పని.
దాని
వలన
ఎన్నో
విధాలైన
ఆనందములను
అనుభవించవచ్చును.
వర్ణనలకు
పొంగక,
దూషణములకు
క్రుంగక
ఆధ్యాత్మికసింహమై
ప్రవర్తించ
వలెను.
తన
తప్పులు
తనలో
తాను
యోచించి
దిద్దుకొనవలెను.
అది
అతి
ముఖ్యము.
ఇక
భగవత్
విషయములందు
కూడా
అతి
జాగ్రత్తగా
మెలగవలెను.
ఎన్ని
అననుకూలములు
వచ్చినను
సాధనను
మాత్రము
క్రమము
తప్పక
ఆచరించుటకు
ప్రయత్నించవలెను.
తాను
ఇష్టపడి
స్మరించుచుండిన
నామమును
సయితం
మారకూడదు.
ఆ
రీతిగా
కొన్ని
దినములు
ఒక
నామమును,
కొన్ని
దినములు
మరొక
నామమును
మార్చుచుండిన
ఏకాగ్రత
కుదరదు.
మనసు
స్థిరత్వమును
పొందదు.
ఏకాగ్రత
కొఱకే
ఇన్ని
సాధనలు
ఆచరించుట.
కాన
నామమునుకాని
రూపమును
కాని
మాటిమాటికీ
మార్చక,
ఎల్లప్పుడు
ఒకే
నామమును,
ఒకే
రూపమును
ధ్యాన
జపముల
కుపయోగించవలెను.
సర్వనామములు,
11
▾
Meaning
Keep
సర్వరూపములు
భగవత్
స్వరూపములే
అని,
తాను
ధ్యానించి,
జపించు
రూపనామములే
అని
స్థిరము
చేసుకొనవలెను.
ఆ
రూప
నామములపై
ఎట్టి
బాధ,
విసుగు
చూపకూడదు.
ప్రాపంచిక
విషయములందు
ఎన్ని
కష్టనష్ట
అశాంతులు
వాటిల్లిననూ
అవి
కేవలం
ఈ
లోక
సంబంధమైనవిగా,
క్షుద్రమైనవిగా
భావించి,
అట్టి
వాటి
నివారణార్థము
ఈ
జపధ్యానములని
తలంచి,
వాటిని
వీటియందు,
వీటిని
వాటియందు
చేర్చక,
జపధ్యానములు
భావసంబంధమైనవనియు,
లోకోపకారార్థమనియూ
భావించవలెను.
దీనినే
పతివ్రతా
భక్తి
అని
అందురు.
కొన్ని
దినములు
ఒక
రూప
నామములు,
మరికొన్ని
దినములు
మరొక
రూపనామములు
ఇట్లు
సారెసారెకూ
మార్పు
చేయు
దానినే
వ్యభిచార
భక్తి
అందురు.
తెలియనంత
కాలము
చేసిన
వాటికి
తప్పులేదు.
ఇది
తెలిసిన
తరువాత
ఆ
రూపనామములపై
విశ్వాసముతో
ధ్యాన
జపములు
సల్పిన
పిమ్మట
మార్చుచుండ
కూడదు.
ఇట్లు
చేసిన,
దీనికి
మించిన
దీక్ష,
తపము
వేరుండదు.
పెద్దలు
చెప్పినను,
నీ
మనోధర్మమును
నీవు
విడువకుము.
భగవన్నామమును
మార్చుచుండుమనియు,
నీ
ఇష్టనామమును
వదలుమనియూ
ఏ
పెద్దలు
తెలుపుదురు?
అట్లు
తెలుపు
వారిని
పెద్దలుగా
భావించక,
మొద్దులుగా
భావించుము.
ధ్యాన
జపసమయములు,
స్థలములు,
సయితం
మార్చకుండునట్లు
కూడా
సాధ్యమైనంత
వరకు
చూడుడు.
ఒక్కొక్క
వేళ
ప్రయాణ
సమయములందు
స్థలములో
మార్పు
వచ్చినను,
కాలమునైనను
మారకుండా
చూడుడు.
అట్టి
కాలములోన
ఏ
రైలునందో,
బస్సునందో
మరే
ఇతర
అననుకూలమైన
స్థలమందున్నను,
ఆసమయమునకు
మనసునందైనను
గడచిన
ధ్యాన,
జపములను
మనము
చేయవలెను.
ఈ
రీతిగా
ఆధ్యాత్మిక
ధనమును
ప్రోగుచేసుకొని,
అధిపతులై,
ఆత్మలో
చేరగలరు.
Previous
←
Vānaprastha
Next
The Well-Being of Former Days and the Famine of Today Are Both Due to the Conduct of Those We Call Elders
→