Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Truth of Śrī Rāma
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
రామనామము
వేదసారము.
రామచరితము
పాలసంద్రము.
నాడు
మొదలు
నేటివరకును
ఏ
ఇతర
దేశములందుకాని,
ఏ
ఇతర
భాషలందు
కానీ,
ఇంతటి
మహాకావ్యము
పుట్టలేదనియే
చెప్పవచ్చును.
అన్ని
దేశములకు,
అన్ని
భాషలకు
అంతర్వాహినిగా
ఆధారమై
నిలచిన
ఈ
ప్రధాన
కావ్యము
భారతీయుల
భాగ్యమా
అన్నట్లు
హిందువుల
ఇలవేల్పుయి,
ఇంటి
పేరనో,
వంటి
పేరనో,
ఈ
రామరసమును
గ్రోలని
భారతీయుడు
లేడనియే
చెప్పవచ్చును.
పండితులు
మొదలు
పామరులవరకును,
కోటీశ్వరుడు
మొదలు
కూటి
పేదవరకును,
రోగులు
మొదలు
యోగులవరకును
రామాయణము
పారాయణ
గ్రంథమై
ప్రకాశించుచున్నది.
సమస్త
దోషములను
హరించి,
పాపములను
రూపుమాపి,
తన
ప్రాపును
రూపముతో
చూపునట్టి
సుందర
నామము
ఈ
రామం.
సమస్త
జలము
సాగరమునుండియే
పుట్టినటుల,
సమస్త
జీవులు
రామం
నుండియే
పుట్టుచున్నవి.
జలములేని
సాగరము,
రామం
లేని
జీవనం
లోకమున
లేదు,
రాదు.
సాగరమునకు,
సర్వేశ్వరునకు
సన్నిహిత
సంబంధము
కలదు.
సాగరమే
సర్వేశ్వరునికి
నివాసము.
'పాలకడలి
శయనుడు'
అను
పదమునకు
ఇది
ప్రధాన
ప్రమాణము.
కనుకనే
ప్రచేతసుని
కుమారుడగు
మహాకవి
వాల్మీకి
రామాయణ
భాగములకు
కాండములని
పేరిడెను.
కాండమన
జలమనియు,
చెరకనియూ
అర్థములు
కలవు.
చెరకు
ఎన్ని
వంకరలు
తిరిగినను
రసమునందలి
తీపికి
యెట్టి
మార్పునూ
లేనటుల
రామకథారస
వాహిని
అనేక
వంకరలు
తిరిగి
ప్రవహించినను
అందులోని
కరుణా
రసమున
కెట్టి
మార్పును
లేదు.
రామకథా
2
▾
Meaning
Keep
ప్రవాహము
విచారము,
విషాదము,
వింత,
హాస్యము,
అద్భుతము,
రౌద్రం,
శృంగారం
ఇత్యాది
వంకరలతో
ప్రవహించినది.
దీని
అంతర్
మర్మము
ధర్మప్రధానమై
యున్నది.
సరయూనది
వంటిది
రామకథారస
ప్రవాహము.
మానస
సరోవరమే
దీని
జన్మస్థానము.
లక్ష్మణుడు
గంగవంటివాడు.
ఇది
చిత్తమను
శిరస్సున
పుట్టినది.
రామవాహిని-
కరుణారసము,
లక్ష్మణ
ప్రేమ-భక్తి
రసము.
సరయూనది
గంగలో
చేరినటుల
కరుణారసము
భక్తిరసమున
లీనమగును,
రాముడు
లక్ష్మణునితో
ఏకత్వమయినాడు.
కరుణా
ప్రేమల
మిళితమే
రామ
అభిమతము.
అదే
భారతీయుల
మతము,
భక్తుల
వ్రతము.
జీవుల
పురుషార్థము
సగము
సత్యము
మాత్రమే;
అందుకు
దైవకరుణా
కటాక్షమను
మరి
సగము
సత్యము
చేరినపుడే
పూర్ణత్వము
కాగలదు.
మానవత్వము
పురుషార్థముతోపాటు
దైవానుగ్రహమునుకూడ
అందుకొనుటకు
తగిన
ప్రయత్నములు
జరుపవలెను.
ఆవలి
గట్టును
చేరుటకు
ఇది
ఆధారమైన
సేతువు.
రామాయణమును
అవతార
లక్ష్యముతో
పారాయణ
చేయవలెనేకాని
సామాన్య
మానవుల
జీవిత
లక్ష్యముగా
చేయరాదు.
రామ
ఆదర్శములను
మాత్రము
ఆచరణ
యందుంచుటకు
తగిన
కృషి
సలుపవలెను.
భగవంతుడు
సర్వజ్ఞుడు,
సర్వవ్యాపకుడు,
సర్వసంపన్నుడు.
అట్టివారి
ఆటలుకానీ,
మాటలుకానీ,
సామాన్యములు
కావు.
జీవితోద్ధారమునకు
తగిన
బాటయే
అతని
వాక్ఊట,
రాముడు
ఒక
సూర్య
వంశోద్ధారకుడని
కానీ,
లేక
అయోధ్యా
పరిపాలకుడగు
దశరథ
చక్రవర్తి
కుమారుడని
కానీ
చూడరాదు.
అట్టి
సంబంధములు
నిమిత్త
మాత్రములు.
నేటి
పాఠకులు,
పవిత్ర
చరిత్రలను
పఠించువేళ,
వ్యక్తియొక్క
సంబంధములను
మాత్రమే
లక్ష్యమునకు
చేర్చుచుండుట
పరిపాటయిన
ఒక
పెద్ద
పొరపాటు.
ఎట్లన
రాముల
తండ్రికి
ముగ్గురు
భార్యలు,
మొదటి
భార్య
యిట్టిది,
రెండవ
భార్య
యిట్టిది,
ఆమె
చెలికత్తెలు
ఇట్టి
వికారులు,
ఇట్టి
ఆకారులు,
దశరథుడు
చేసిన
యుద్ధములిట్టివి,
అట్టివి
అని
3
▾
Meaning
Keep
లోకాభిరామాయణమునే
లోనికి
చేర్చుచుండుటచే,
పాఠకులకు
ప్రధాన
అంశము
పట్టుపడుట
లేదు.
వ్యర్థపు
విషయములను
వీడి
సార్థక
మార్గమును
వెదకుటే
చరిత్రలయొక్క
పవిత్ర
లక్ష్యమని
తెలుసుకొనవలెను.
పావిత్ర్యము
చరిత్రలోని
అంతర్
ప్రవాహము.
అది
వెదకిన
చిక్కును;
కానీ,
పైపై
చూపులకు
కనిపించదు.
భక్తిశ్రద్ధలను
అద్దములను
మనో
నేత్రములకు
ధరించి,
పరిశీలించిన
శుద్ధమైన
జ్ఞానము
సిద్ధించును.
పిప్పిని
త్రిప్పికొట్టి
చెరకునందలి
రసమును
మానవులు
జుఱ్ఱుకొనునటుల,
పుష్పముయొక్క
అందచందములు
చూడక,
తుమ్మెద
అందలి
మధువునే
గ్రోలినటుల,
అగ్నిప్రమాదమును
యోచించక
ప్రకాశముచే
ఆకర్షితమై
మిడుత
దీపమును
చేరునటుల,
సాధకులు
కావ్యమునందలి
కరుణారసమునే
లక్ష్యమందుంచుకొని
మిగిలిన
విషయములను
విసర్జించవలెను.
ఫలమునందలి
విత్తనములు,
తోలు,
పిప్పి
వేరుచేసి
రసమునే
అందుకొనుట
లోకసామాన్యము.
తోలు,
పిప్పి,
విత్తనములు
లేక
ఫలముండజాలదు.
ఫలమునకు
పైకమిచ్చితిమి
కదాయని
పైతోలు
ఎట్టివారునూ
భుజింపరు.
విత్తనములు
మ్రింగి
జీర్ణించుకోలేరు.
అటులనే
రామఫలమునందు
రాక్షస
చరిత్రలు
అను
తోలును,
దానవ
ప్రవర్తనలు
అను
విత్తనములును,
లౌకిక
విషయములను
పిప్పి
పొరలు,
తెరలు,
అరలుగా
అందులో
కూడి
ఉండును.
కరుణా
రసమునే
ఆశించువారు
పై
వ్యర్థపు
విషయ
రసములను
మనసున
చేర్చక
చరిత్రను
పఠించుట
ఉత్తమము.
ఒకానొక
సమయమున
పరీక్షిత్
మహారాజు
శుకునకు
నమస్కరించి,
"స్వామీ!
చాలాకాలమునుండియు
నన్నొక
సంశయము
పీడించుచున్నది.
దానిని
తమరు
తప్ప
అన్యులు
తీర్చలేరనియును
నాకు
తెలియును.
తమరు
వేరుగా
తలంచక,
ఈ
దాసుని
సంశయమును
నిర్మూలము
గావించుడు.
అది
యేమన,
నేను
మా
వంశీయులలో
ప్రప్రథమ
నాయకుడైన
మనువు
మొదలు
నేటి
మా
తాత
తండ్రుల
చరిత్రల
వరకునూ
వింటిని,
పఠించితిని.
ఎవరి
చరిత్రలయందు
చూచినను
ఏదో
ఒక
మహర్షి
రాజుల
నాశ్రయించి
యుండుటయును,
4
▾
Meaning
Keep
మహాజ్ఞానవృద్ధులైన
పండితులు
రాజాజ్ఞలలో
వారల
దర్బారులలో
కూడి
యుండుటయును
చేరియుండును.
సర్వసంగపరిత్యాగులైన
ఋషులును,
లోకము
మిధ్యము,
బ్రహ్మసత్యమని
గుర్తించిన
పండితులును,
రాజుల
నాశ్రయించియుండుటలోగల
అంతరార్థమేమియో!
కారణము
లేని
కార్యము
పెద్దలు
తలంచరు,
చరించరు.
కాన,
ఈ
సంశయమును
తీర్చి
నన్ను
ధన్యుని
గావింపుమ"నగా,
శుకులు
నవ్వి,
"రాజా!
సరియైన
ప్రశ్న
గావించితివి.
వినుము.
మహనీయులైన
ఋషులు,
పవిత్రులైన
పండితులు,
నిజమైన
లోకపాలకులు
తాము
గ్రహించిన
సత్యములను,
ఆచరించిన
పవిత్ర
కర్మలను,
అందుకొన్న
దైవానుగ్రహమును
తోటి
మానవుల
కందించి
లోక
సుఖశాంతులు
చేకూర్చవలెనను
వాంఛతో
పరిపాలనా
దక్షులగు
రాజులచెంత
చేరి
రాజుల
కిట్టి
ఉత్తమ
మార్గముల
చిత్తములందు
చేర్చి
శాసనరీతిగా
జనరంజక
మగు
ధర్మకర్మలను
నియమించుచుండిరి.
ఆనాటి
రాజులే
మహాఋషులను
ఆహ్వానించి,
పండితులను
పిలిపించి,
రాజనీతిని
తెలుసుకొని
దానికి
తగినట్లు
శాసనములు
నియమించెడివారు.
ప్రజలకు
ప్రభువే
ప్రధాన
రక్షకు
దగుటచే
ప్రభువు
సర్వసుగుణ
సంపన్నుడై
సర్వధర్మ
పరాయణుడై,
సమస్త
విద్యా
పారంగతుడై
యుండిన
ప్రజలయొక్క
యోగక్షేమములను,
పరిపాలనా
విధానమును
సక్రమమైన
మార్గమున
సలుపగలరనియును
లోక
సుఖ
శాంతులనాశించి,
"లోకాః
సమస్తాః
సుఖినో
భవంతు"
అను
లక్ష్యముతో
రాజులను
చేరెడివారు.
ఇంతియేకాదు.
జనసుఖదాయకుడు,
గోలోకవాసుడు
అగు
శ్రీమన్నారాయణుడు
రాజవంశములందు
జన్మించుననువార్త
వేదశాస్త్రములందు
సూచించుటచే,
భగవద్దర్శనార్థమై
అప్పటికప్పుడు
రాజులను
చేరుటకు
వీలుగా
నుండదనియును,
చేరిననూ
దైవానందమును
మనసారా
అనుభవించ
సాధ్యముకాదనియును
ఆలోచించి,
కొందరు
దివ్యదృష్టిగల
మహనీయులు
ముందుగానే
ఆయా
రాజుల
కొలువు
కూటములచేరి
దైవరాకకై
తపించుచుందురు.
అట్టివారే
వసిష్ఠ,
విశ్వామిత్ర,
గౌతమ,
గర్గ,
అగస్త్య
ఇత్యాది
మహర్షులు.
వీరలకేమి
కొదువ?!
త్యాగులు,
విరాగులు
అయిన
ఈ
ఋషులు
రాజులచెంత
చేరి
వ్యర్థ
ప్రసంగములు
5
▾
Meaning
Keep
గావించుటకై
వారి
కొలువుకూటముల
చేరలేదు.
లేదా,
వారి
కానుకలందుకొనుటకుకానీ,
వారందించు
తలభారపు
బిరుదులను
తగిలించుకొనుటకుకానీ,
ప్రభువులను
చేరలేదు.
విశ్వనాథుని
దర్శనమునకును,
ధర్మరక్షణ
దీక్షకును
లోకపాలురను
చేరిరి.
వేరు
కారణము
లేవియును
లేవు.
ఆనాటి
రాజులుకూడను
దైవచింతనాతత్పరులై,
ప్రజాపరిపాలనకు
తగిన
మార్గములను
పండితులవలననను,
ఋషులవలననను
తెలిసికొని
తమకు
తామే
ఆశ్రమములకు
వెళ్లుటయో,
లేదా
వారలను
రాజభవనములకు
రప్పించుటయో
జరిపించి,
ఆలోచించెడివారు.
ఆనాడు
స్వార్థరహితులగు
ఋషులు,
అధికార
వాంఛారహితులగు
పండితులు
రాజులకు
సలహాదారులుగా
నుండుటచే
ఆనాడు
తిండి
గుడ్డలకుకానీ,
తీర్థ
గృహములకుకానీ,
ఎట్టి
కొరతయూ
లేక,
నిత్య
కల్యాణము
పచ్చతోరణములతో
ప్రజాక్షేమమే
ప్రభువు
దేహముగను,
ప్రభువే
ప్రజల
గుండెగను
తలంచి,
స్మరించి,
వరించి,
తరించిరి"
అని
శుకులు
మహర్షుల
చర్యలను,
వాంఛలను
నిర్ద్వంద్వముగ
నిండుసభలో
గంటవలె
మ్రోయించెను.
చూచితిరా!
మహనీయులు
ఏ
పని
చేసినను,
ఎవరితో
చేరినను
లక్ష్యము
దైవతత్త్వముపై
నుండుటచే
సర్వకర్మలు,
ధర్మరూపమును
ధరించి,
లోకమును
ఉద్ధరించెను;
పారాయణములు
సలుపువేళ,
పఠనము
గావించువేళ,
లక్ష్యమును
దైవభావమున
చేర్చి,
కథలోని
వంకరలను
వంటిలోనికి
చేర్చక,
నిశ్చల
నిష్ఠతో,
నీతి
నిజాయతీలను
మదియందుంచి
కర్తవ్యమును
నిర్వర్తించవలెను.
ధర్మసంరక్షణార్థమై
అవతరించు
దైవము,
సమస్త
ప్రాకృత
లీలలను
సాధారణ
మానవునివలె
చేయుచుండును,
చేయవలెను.
కారణము
-
లోకులకు
ఆదర్శము
నందించుటకు,
అనుభూతులు
కలిగించుటకు.
లీలలు
చూచుటకు
సామాన్యమైనటువంటివిగా
కంటికి
కనిపించినను
అందులోని
రసము,
సరసము,
సౌందర్యము,
పుష్టి
విశ్వమును
మోహింపజేయును.
హృదయముల
పరిశుద్ధపరచును.
మనసుల
మరపించును,
మాయను
వదలించును,
మధురత్వమును
అందించును.
ప్రాకృతములుగా
కనిపించు
తన
లీలలన్నియును
6
▾
Meaning
Keep
అప్రాకృతములే,
మాననీయములే,
దివ్యములే,
రామచరిత్ర
వ్యక్తిచరిత్ర
కాదు,
విశ్వచరిత్రమనియే
చెప్పవచ్చును.
రాముడు
సమష్టిస్వరూపుడు,
సర్వవ్యాపకుడు.
రామచరిత్ర
కొంతకాలము
మాత్రమే
జరిగెనని
తలంచరాదు.
ఇది
ఆద్యంతరహితమయిన
చరిత్ర.
రామేచ్ఛ
లేక
చీమైనను
కుట్టదు,
ఆకైనను
రాలదు.
ప్రకృతియందలి
పంచ
భూతములు
రామేచ్ఛవలననే,
తమతమ
కర్తవ్యములను
నిర్వర్తించుచున్నవి.
దృక్
గోచరమగు
సమస్త
వస్తు
జాలములందు
గల
ఆకర్షణ
శక్తియే
ఆ
రామచంద్రుడు.
ప్రకృతి
ఆకర్షణచేతనే
లోకము
జరుగుచున్నది.
ఆకర్షణే
లేకున్న
ప్రకృతే
లేదు.
అనగా
రాముడు
లేకున్న
లోకమే
లేదు.
Next
The Lineage of Raghu
→