Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Lineage of Raghu
Rāma Kathā Rasa Vāhini
›
Part One
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
విశుద్ధమగు
సూర్యవంశమున
పరమ
ప్రతాపుడను,
యశస్వియును,
దీర్ఘబాహుడును,
పుణ్యశ్లోకుడును
అగు
ఖట్వాంగుడను
రాజు
పృథివిని
పాలించుచుండెను.
అతని
పరిపాలన
ప్రజలకానందము
కలిగించుటయేకాక,
ప్రజలు
ప్రభువునే
దైవముగా
భావించి,
విశ్వసించి
గౌరవించుచుండిరి.
మహారాజునకు
ఏకైక
పుత్రుడు
కలడు.
అతడే
దిలీపుడు.
కుమారుడైన
దిలీపుడు
దినదినాభివృద్ధిగాంచుచు,
మహా
తేజోవంతుడై
తండ్రితో
పాలన
విషయాదులందు
పాల్గొనుచు,
దేశమందలి
మంచిచెడ్డలను
గమనించుచు,
విచారించుచు,
అతిశ్రద్ధాళుడై
ప్రజలమధ్య
పెరుగుచుండెను.
కుమారుడు
పెద్దవాడగుట
చూచి
యుక్తవయస్సుననే
వివాహముజేసి
కొంత
పరిపాలనా
బాధ్యత
అతని
తలపై
పెట్టవలెనని
సంకల్పించి,
అన్నింటికీ
సరిపడునట్టి
కోడలు
కావలెనని
విచారించి,
కడకు
మగధ
నందినియగు
సుదక్షిణ
అను
కన్యతో
అత్యంత
వైభవముగా
వివాహము
జరిపించెను.
సుదక్షిణ
మహాగుణవంతురాలు.
సాధ్వియును,
సరళ
హృదయయునై,
పతిననుసరించుచు,
ప్రాణసమముగ
ప్రేమించి
సేవించుచుండెను.
పతియగు
దిలీపుడుకూడను,
మహా
గుణవంతుడగుటచే
ఆమెకెట్టి
లోటునూ
లేక
చూచుకొనుచు,
పరిపాలనా
విషయమున
తండ్రిననుసరించుచు
క్రమక్రమముగా
తండ్రి
బాధ్యతలన్నింటిని
తానే
చూచుకొనుచు
కొంత
విశ్రాంతిని
కలిగించుచుండుట
ఖట్వాంగుడు
గమనించి
తనలో
తాను
కుమారుని
తెలివితేటలకును,
శక్తి
సామర్థ్యములకును
ఎంతో
సంతసించుచుండెడివాడు.
2
▾
Meaning
Keep
ఈవిధముగ
కొంతకాలము
గడచెను.
ఖట్వాంగుడు
సుముహూర్తమును
నిర్ణయించి
దిలీపునకు
రాజ్యపాలనా
పట్టము
గావించెను.
నాటినుండియు
దిలీప
మహారాజను
నామముతో
సప్తద్వీపవతియగు
వసుంధరకు
ప్రభువై
ధర్మపాలన
జరుపుచుండ,
సకాల
వర్షము
కురిసి,
సస్యశ్యామలమై
సమృద్ధిగా
పండి,
పాడిపంటలకెట్టి
కొరతయు
లేక
నిత్యకల్యాణములతో,
వేద
పారాయణములతో,
శాస్త్రసమ్మతమైన
యజ్ఞయాగాది
క్రతువులతో
అన్ని
జాతులవారు
హాయిగా
జీవించుచుండిరి.
కానీ
మహారాజునకు
దినములు
సంవత్సరములు
గడచుకొలది
తనలో
ఏదో
అశాంతి
బాధించుచుండినటుల
అతని
ముఖవర్చస్సు
తెలుపుచుండెడిది.
కొన్ని
సంవత్సరములు
గడచెను.
ఇచ్ఛ
నెరవేరునను
ఆశ
దినదినమునకు
నీరసించెను.
ఒకనాడు
తన
రాణియగు
సుదక్షిణతో
తనలోని
చింతను
ఈరీతిగా
వెలిబుచ్చెను:
"ప్రియా!
మనకింత
వరకును
సంతానము
లేకపోవుటచే
కొడుకులు
లేరను
చింతకంటెను
ఇక్ష్వాకు
వంశ
ప్రసారమెట్లు
కాగలదను
విచారము
నన్ను
మరింత
బాధించుచున్నది.
దీనికి
నేనొనరించిన
ఏ
పాపఫలమో
కారణమై
ఉండ
వచ్చును.
దాని
పరిహారార్థమై
ఏమి
చేయవలెనో
నాకు
తోచుటలేదు.
దైవ
కరుణా
కటాక్షమును
అందుకొనుటకు
తగిన
మార్గ
మేదియో
మన
కులగురువగు
వసిష్ఠులవారిని
అడిగి
తెలిసికొన
వలెనని
ఈనాడు
నా
మనసు
తత్తరపడుచున్నది.
ఇందుకు
నీ
ఉద్దేశ్యమేమి?"
అని
దిలీపుడు
అడుగ
సుదక్షిణ
ఆలస్యము
చేయక,
ఆలోచించక,
"నాధా!
ఇదే
ఆలోచన
నాలోను
చాలా
దినములనుండి
బాధించుచున్నప్పటికిని
పతి
ఆజ్ఞ
లేక
నా
తలంపును
బైటపెట్టుట
తప్పగునేమో
అని
నాలోనే
నేను
అణచుకొంటిని.
తమ
ఇచ్ఛననుసరించుటకు
నేనెల్లప్పుడు
సిద్ధమే
అనునది
తమకు
విదితమే
కదా.
ఇందుకు
ఆలస్యమెందుకు?"
అని
రాణి
తన
అంగీకారమును
తెలుపగనే,
దిలీపుడు
రథమును
సిద్ధము
చేయించి,
"ఈనాడు
నావెంట
పరివారము,
రక్షక
భటు
లెవ్వరును
రానక్కరలేదు
3
▾
Meaning
Keep
ఆజ్ఞాపించి
తానే
రథమును
నడుపుకొని
గురుదేవులగు
వసిష్ఠులవారి
ఆశ్రమము
చేరెను.
రథ
శబ్దము
వినగనే
వెలుపలనున్న
ఆశ్రమవాసులు
లోనికి
వెళ్లి
గురువుగారికి
తెలుప,
వసిష్ఠులవారు
ద్వారము
చెంతకు
వచ్చి
దిలీపుని
ఆశీర్వదించి,
కుశల
ప్రశ్నలు
గావించుచుండ,
రాణి
సుదక్షిణ
చెంతనేయున్న
అరుంధతీదేవికి
నమస్కరించెను.
అంత
అరుంధతి
ఆమెను
ఆశీర్వదించి,
ప్రేమతో
కుశల
ప్రశ్నలు
గావించుచు
లోనికి
తీసుకొని
వెళ్లెను.
అంత,
రాజుకూడను
ప్రభుధర్మము
ననుసరించి,
"ఆశ్రమ
జనులకుకానీ,
యజ్ఞ
యాగాది
సత్కర్మలకుకానీ,
లేక
ఆహార
విహారములకుకానీ,
ఎట్టి
ఇబ్బందియు
లేక
అరణ్యమునందు
క్రూర
మృగముల
బాధలులేక,
తమతమ
నిత్యానుష్ఠానములు
సక్రమముగ
జరుగుచున్నవి
కదా?"
అని
గురువైన
వసిష్ఠులవారిని,
ఆశ్రమవాసులను
కుశల
ప్రశ్నలు
గావించుచు,
లోనికి
వెళ్లి
వారివారి
ఆసనములు
వారు
స్వీకరించిరి.
అంత
వసిష్ఠులవారు
అచటున్న
ఆశ్రమవాసులను
తమతమ
వసతులకు
వెళ్ళమని
ఆజ్ఞాపించి,
రాజు
తన
ఆశ్రమమునకు
రాణీ
సమేతుడై
వచ్చిన
కారణమును
తెలుపుమని
అడుగ,
రాజు
తనకుగల
కొరతను,
విచారమును,
వినయముతో
విన్నవించి,
తమ
అనుగ్రహము
తప్ప,
ఇందుకు
అన్యమార్గములేదని
ప్రార్థించెను.
ప్రార్థన
ఒకవైపు
ఆలకించుచు,
వసిష్ఠులవారు
ధ్యానములో
లీనమై
కొంతకాలము
నిశ్శబ్దమును
పూనియుండుటను
చూచి
రాజుకూడ
తన
రాణితో
దైవచింతన
చేయుచు
పద్మాసనాసీనుడై
నేలకూర్చొనెను.
అంత
వసిష్ఠులవారు
కన్నులు
తెరచి,
"రాజా!
దైవేచ్ఛకు
ఎట్టివారికైనను
ఎదురు
తగులుట
వీలుకాదు.
పుత్రునొసంగునట్టి
శక్తి
నాకు
లేదు;
నేనది
చేయజాలను.
నీకొక
శాపము
కలదు.
అది
యేమన;
నీవు
రాజధానికి
వచ్చుచున్న
సమయమున
కామధేనువు
కల్పవృక్షచ్ఛాయలయందు
పరుండి
నెమరువేయుచున్న
సమయమున,
ధేనువును
చూచియు
నీవు
దానిని
లెక్కచేయక
విషయలోలుడవై
అహంకారముతో
4
▾
Meaning
Keep
రాజభవనమును
చేరుకొంటివి.
ఆనాడు
కామధేనువు
తనకు
ప్రభువు
గావించిన
పరాభవమునకు
విచారించి,
రాజే
గోవులను
గౌరవింపకున్న
ప్రజలెట్లు
విశ్వసించి
గౌరవింతురను
ఉద్దేశముతో
వేద
బ్రాహ్మణ
గోవులను
గౌరవింపని
రాజుల
వంశము
అభివృద్ధిగాంచిన,
లోకమే
ధర్మహీనమగునని
తలంచి,
ఆనాడు
కామధేనువు
నీకు
వంశోద్ధారకుడగు
కుమారుడు
కలుగకూడదనియు,
ఏనాడు
నీవు
నీ
పొరపాటును
గమనించి,
లేదా
పరమ
గురువు
ఆజ్ఞను
శిరసావహించి,
తిరిగి
గోపూజ
ప్రారంభింతువో,
గోవులను
గౌరవింతువో
ఆనాడు
తిరిగి
నీ
వంశము
వృద్ధి
గాంచుననియూ
తలంచుటచేత,
నీకీ
అపుత్ర
బాధపీడించుచున్నది.
కాన,
నేటినుండి
నీవు
గోపూజ
సతీసమేతముగ,
సక్రమమైన
మార్గమున
సలిపితివేని
తప్పక
పుత్రప్రాప్తి
కలుగును.
ఆలస్యము
చేయకు.
సాయం
సమయము
కావచ్చినది.
గోవులు
వచ్చు
వేళైనది.
నా
అగ్నిహోత్రముయొక్క
నందినీ
కామధేనువు
వనమునుండి
వచ్చుచున్నది.
వెళ్లి
ఇప్పటినుండియే
గోసేవ
చేయుడు.
నిరంతరం
ధేనువ్రతము
గావింపుడు.
దానికి
తగిన
వేళలలో
తగిన
ఆహార
పానీయములు
అందించుచు,
దానికి
స్నాన
పానాదులకు
సమయమును
కనిపెట్టి
జాగ్రత్తగా
చూచుకొండని
ఆజ్ఞాపించి,
ధేను
వ్రతమునకు
దీక్షనొసంగి,
తీర్థప్రసాదములతో
వారిని
గోసేవకు
పంపి,
అనుష్ఠానమునకై
వసిష్ఠులవారు
నదికి
వెళ్లెను.
నాటినుండి
నందినిని
వారు
ప్రాణసమముగా
ప్రేమించి
పూజించుచు
సేవించుచుండిరి.
ఒకనాడు
నందిని
మేయుచు
అరణ్యమున
సంచరించు
సమయమున
ఒక
సింహము
నందిని
పైబడి
భుజింప
జూచెను.
అది
దిలీపుడు
గమనించి
నందినిని
రక్షించుటకు
తన
సర్వశక్తులూ
ఉపయోగించి
కడకు
తన
ప్రాణమునైనా
వీడి
దేహమును
సింహమున
కప్పజెప్ప
పూనుకొనెను.
క్రూర
మృగమైనప్పటికిని
సింహము
పరమ
ధర్మనిష్ఠగలది.
నందినీ
కామధేనువును
రక్షించుటకు
రాజు
తన
కాయమునైనను
వీడుటకు
పూనుకొనుటచే
దయతలచి
నందినీ
ధేనువును,
రాజును
ఎట్టి
బాధలూ
పెట్టక
విడిచిపోయెను.
ఈ
సమయమున
తన
ప్రాణమును
కాపాడిన
దిలీపునిపై
నందిని
అమోఘమైన
కృతజ్ఞతా
పూర్వకమైన
ఆనందమును
5
▾
Meaning
Keep
తెలుపుచూ,
"రాజా!
నేటికి
నీ
శాపము
విమోచనమైనది.
నీకు
విశ్వవిజయుడును,
ధర్మాత్ముడును,
త్రిలోక
విఖ్యాతిని
బొందువాడును,
కులకీర్తిని
నిలబెట్టువాడును
కలుగును.
అంతేకాక,
అతని
వంశమందు
శ్రీమన్నారాయణుడే
అవతరించును.
అట్టి
సుపుత్రుడు
అతిశీఘ్రముగా
ప్రాప్తించునుగాక!"
అని
ఆశీర్వదించి,
రాజుతోకూడి
ఆశ్రమమునకు
వచ్చెను.
గురువు
సర్వజ్ఞుడగుటచే
వారల
మోముచూచిన
వెంటనే
మీ
అభీష్టము
నెరవేరినదనియు,
ఇక
మీరు
మీ
రాజ్యమునకు
వెళ్ళవచ్చుననియూ
ఆశీర్వదించెను.
అంత
దిలీప
మహారాజు
రాణితో
గురువునకు
నమస్కరించి,
ఆశ్రమవాసుల
దగ్గర
సెలవు
తీసుకొని,
నందినికి
ప్రదక్షిణ,
నమస్కారములు
గావించి,
రాజధానికి
చేరెను.
నాటి
నుండియే
రాణిగర్భమున
కుమారుడు
పెరుగ
మొదలిడెను.
పదవ
మాసము
నిండి,
ఒక
సుముహూర్తమున,
పుత్రరత్నము
కలిగెను.
ఈ
వార్త
పురజనులకు
తెలియగనే,
వీధులకు
తోరణముల
నలంకరించువారును,
నాట్యములు
సలుపువారును,
హారతులెత్తువారును
జయజయ
ధ్వనులతో
వారల
సంతోషములు
వర్ణనాతీతమై
రాజభవనమునకు
సమీపములో
బారులు
దీరి
వేల
జనులు
చేరుటచేత,
దిలీప
మహారాజు
మంత్రితో
ప్రజలకు
ఈ
శుభవార్త
నందింపుమని
ఆజ్ఞాపించెను.
మంత్రి
రాజ
భవనమునకు
ముందు
విశాలప్రదేశమున
చేరిన
వేలాది
ప్రజలకు,
'మనకు
కుమార
రాజా
పుట్టెన'ను
శుభవార్త
తెలుపగనే
కరతాళములచే,
జేజేలు
చేసి
అందరూ
వారివారి
గృహములకు
వెళ్లిరి.
పదవ
దినమున
గురువును
పిలిపించి,
నామకరణ
మహోత్సవము
గావించిరి.
ఆ
బాలునకు
నక్షత్రము
ననుసరించి,
రఘువను
పేరు
పెట్టిరి.
రఘువు
దినదినమునకు
పెరుగుతూ
పెద్దవాడయ్యెను.
ఒకనాటి
రాత్రి
దిలీపున
కేమి
తోచినదోకాని,
రాణితో
మాటలాడుచూ,
"సుదక్షిణా!
నేను
అనేక
ఘనకార్యములను
సాధించితిని.
యజ్ఞయాగాది
సత్కర్మలు
జరిపితిని.
రాజులతో
భయంకర
యుద్ధములు
చేసితిని.
రాక్షసులను
దునుమాడితిని,
కడకు
భగవత్కటాక్షమును
పుత్ర
రత్న
రూపమున
పొందితిని.
ఇక
మనకు
కావలసినది
6
▾
Meaning
Keep
వేరులేదు.
శేషకాలమును
దైవారాధనలతో
పూర్తిగావింతము.
రఘువు
మహాగుణవంతుడు,
యోగ్యుడు;
పరిపాలనా
బాధ్యత
అతని
కప్పజెప్పి
మనము
అరణ్యమున
కందమూలాదులు
భక్షించుచూ,
మహానీయుల
సేవలు
సలుపుచూ
శ్రవణ,
మనన,
నిదిధ్యాసాది
కర్మలయందు
కాలమును
పవిత్రము
గావింతము.
అది
యెప్పుడనను
తామసమునకు
స్థానమివ్వక
తెల్లవారగనే
మంత్రులను
పిలిపించి,
రఘు
పట్టాభిషేకమునకును,
వివాహమునకును
తగిన
ఏర్పాట్లు
గావింతును.
ఇందుకు
నీ
ఉద్దేశమేమి?"
అని
తీవ్ర
వైరాగ్యమున
రాణిని
ప్రశ్నింప,
సుదక్షిణ
ఆనంద
బాష్పములు
రాల్చుచు,
"నాథా!
అంతకంటే
ఈ
దాసికి
కావలసినది
వేరేమున్నది!
మీ
ఆజ్ఞకు
బద్ధురాలను.
తగిన
ఏర్పాట్లు
గావింపుడు"
అని
అరణ్యవాసమునకు
ఉవ్విళ్లూరుచున్నట్లు
ఆమె
ప్రదర్శించిన
దృశ్యము
రాజునకు
మరింత
ఉత్సాహమును
కలిగించెను.
దిలీప
మహారాజు
మంత్రులను,
పండితులను,
ఋషులను
పిలిపించి
తమ
ఉద్దేశమును
వారలకు
తెలిపి,
రఘువునకు
పట్టాభిషేకమును,
తగిన
రాజకన్యను
చూచి
వివాహమును
జరిపించి,
రఘువునకు
చెప్పవలసిన
రాజనీతులను,
వేద
పోషణను,
ప్రజాక్షేమమునకు
తగిన
శాసనములను
అత్యంత
ప్రధానముగా
తెలిపి,
భగవత్కటాక్షమునకై
రాణీసమేతుడై
అరణ్యమున
కేగెను.
రఘువు
నాటినుండి
తండ్రి
ఆనతి
ప్రకారము
పండితుల
ఆదేశానుసారము,
ప్రజాసౌకర్యమును
ధర్మ
సంరక్షణను
తన
ఉచ్ఛ్వాస,
నిశ్వాసములుగా
భావించి,
తన
కర్తవ్యమును
మంత్రులతో
చేరి
జరుపుచుండెను.
చిన్నవాడయినప్పటికిని
మహాగుణశాలి.
ఎట్టి
కఠిన
సమస్యలనైననూ
అవలీలగా
గ్రహించి,
వాటికి
తగిన
మార్గమును
కనిపెట్టి
పరిష్కారము
చేయుటయేకాక,
ప్రజా
రంజకముగా
ప్రవర్తించెడివాడు.
దుర్మార్గులైన
రాజులకు
చక్కని
గుణపాఠములు
నేర్పి
వారలను
సామ,
దాన,
భేద,
దండోపాయములతో
శిక్షించి,
ప్రజానుకూలములను
ధర్మరక్షణకు
తగిన
కర్మలను
కలిగించుచుండెడివాడు.
ఈవిధముగా
రఘు
మహారాజు
పరిపాలన
ఆబాల
గోపాలము
కొనియాడదొడగిరి.
తండ్రిని
మించిన
బలశాలి,
ధైర్యశాలి,
గుణశాలి
అను
సార్థక
7
▾
Meaning
Keep
నామమును
సంపాదించెను.
అరణ్యమున
తపస్సాచరించు
మునులకు,
సాధువులకు
తగిన
భద్రతలు
కలిగించుచు,
వారికి
తగిన
వసతులను
ప్రత్యేకముగా
తానే
చూచుకొనుచు,
ఋషుల
ఆశీర్వాదములకు,
కృపకు
పాత్రుడగుచుండెను.
వరతంతువను
మహర్షికి
కౌత్సుడను
గుణవంతుడైన
శిష్యుడుండెడివాడు.
అతను
విద్యాభ్యాసము
పూర్తి
అయిన
తరువాత
గురుదక్షిణకై
రఘువును
ఆశ్రయించి
అతనినుండి
ధర్మరీతిగా
పొందిన
ధనమును
గురుదక్షిణగా
వరతంతువునకు
చెల్లించి,
రఘుమహారాజు
తనకు
ఎట్టి
నీతి
మార్గమున
ధనమును
అందించెనో
విచారించి,
ప్రజలకు
బాధ
కలుగక,
కావలసినదానికంటె
ఒక్క
కాసైననూ
అధికముగా
ప్రజలనుండి
ఆశించక,
దైవ
కటాక్షమునే
ప్రధాన
లక్ష్యమందుంచుకొని
పాలన
సాగించుచున్న
రఘు
మహారాజుపై
కౌత్సునకు
అమిత
వాత్సల్యము
కలిగి
నిండు
హృదయమున,
"రాజా!
త్వరలో
నీకు
లోక
ప్రఖ్యాతి
నొందునట్టి
సద్గుణవంతుడగు
కుమార
రత్నము
ప్రాప్తించుగాక"
అని
ఆశీర్వదించి
వెళ్లిపోయెను.
ఆ
ఆశీర్వాద
ఫలమో
అన్నట్లు
పదినెలలు
దాటగనే
రఘువునకు
వజ్రమువంటి
కాంతిగల
కుమారుడు
కలిగెను.
అతనికి
పండిత,
పురోహితుల
సలహా
ననుసరించి,
జాతకము
ననుసరించి
"అజుడ"ను
పేరును
పెట్టిరి.
అజుడు
అతి
సుందరుడు.
దినదిన
ప్రవర్ధమానుడై
పెరుగజొచ్చెను.
అతను
విద్యా
బుద్ధులు
ప్రత్యేక
శిక్షణతో
నేర్చుచుండెను.
అన్ని
విద్యలయందూ
చక్కని
తరిబీదును
గాంచెను.
తండ్రికంటెను
మహావిద్యావంతుడను
పేరును
గాంచెను.
ఈరీతి
గడుచుచుండ
రఘుమహారాజు
అతని
తండ్రి
దిలీపునివలెనే,
కొమారునకు
వివాహాది
మంగళ
కార్యములను
జరిపి,
రాజ్యభారమును
అజునకు
అందించవలెనను
సంకల్పముచే
మంత్రులను
పిలిపించి,
తగిన
ఏర్పాట్లు
గావించి,
విదర్భదేశాధీశుడైన
భోజరాజు
సోదరి
ఇందుమతిని,
తన
కుమారుడగు
అజునకు
వివాహముచేసి,
రాజ్యబాధ్యతలను
అజున
కప్పజెప్పి
రాణీసమేతుడై
తపస్సునకై
అరణ్యమున
కేగెను.
8
▾
Meaning
Keep
ఇందుమతీ దేవితో
అజ మహారాజు
రాజ్య పాలన
చేయుచు
ప్రజల
మన్ననల
నందుకొనుచు,
తండ్రి
ఆజ్ఞను
జవదాటక,
పృథివిని
పాలించుచుండెను.
ఇందుమతిని
బింబముగను
ప్రకృతిని
ప్రతిబింబముగను
భావించి,
అజుడు
అత్యంత
ఆనందముతో
కాలము గడుపుచు,
ఇరువురు
వనమునకు
వెళ్లి
సహజ సుందరమైన
ప్రకృతిని
చూచుచు
దినములు, వారములు
వనములందే
గడిపెడివారు.
ఇట్లుండ
ఇందుమతీ దేవికి
నవమాసములు
నిండి
పుత్రుని
గనెను.
పుట్టిన
పుత్రుని
చూచి
తల్లిదండ్రులు
ఆనందముతో
వసిష్ఠులవారికి
ఈ వార్తను
తెలిపి,
జాతకము
వ్రాయించి,
నామకరణమునకు
తగిన
ఏర్పాట్లు
గావించి,
పదవ దినము
పండితులను
పిలిపించి
దశరథుడను
పేరుపెట్టిరి.
దశరథుడు
అల్లారు ముద్దుబిడ్డడై
దాసదాసీలు
ఆడించుచుండ,
కేకలు వేయుచు,
కాళ్ళుచేతులు
ఆడించుచూ,
ఆనందమే
తన జీవితమా
అన్నట్లు
దినదినాభివృద్ధి
గాంచుచుండ,
ఒకనాడు
అజుడు, ఇందుమతీదేవి
వాడుకననుసరించి,
ఉద్యానవనమునకు
విహారార్థమై
వెళ్లిరి.
ఆనాడు
మరింత
ఉత్సాహముతో
ప్రకృతి దృశ్యములను
తిలకించుచూ,
అతిదూరము
వెళ్లి
ఒక చల్లని ఛాయలో
ఇరువురూ
కూర్చొని
కబురులు
చెప్పుకొనుచుండ
పెద్దగాలి
వీచెను.
అందులోని
పరిమళము
వర్ణనాతీతము.
ఇంతలో
అతి మధురగానము
వినిపించెను.
ఇరువురు లేచి,
అటూ ఇటూ
పరికించుచుండ
వాయు మేఘములమధ్య
బ్రహ్మమానస పుత్రుడగు
నారదుడు
అతివేగముగ
ఎచటికో
వెళ్లుచుండెను.
ఇంతలో
అతని శిఖకు
చుట్టుకొన్న
సుగంధ పుష్పము
గాలికి
ఊడి
కొట్టుకొనివచ్చి
ఇందుమతి శిరమున
వ్రాలెను.
అజ మహారాజు
ఈ ఆశ్చర్యము
చూచుచుండగనే
ఇందుమతీదేవి
నేలవ్రాలి
శాశ్వతముగా
కన్నుమూసెను.
ప్రాణసమానముగా
ప్రేమించి జీవించుచున్న
అజుడు
ఈ దృశ్యమును
చూడలేక పోయెను.
అతని రోదనముతో
అరణ్యమంతయు
దద్దరిల్లెను.
భూమి కంపించెను.
వృక్షములు సహితము
చైతన్యరహితమై
ఆశ్చర్యపడునట్లు
కనిపించెను.
ఇందుమతీదేవి దేహముపై
బడి
అజుడు
కన్నీరు కాలువలగునట్లు
విలపించుచుండుట
నారదుడు
విని
క్రిందికి దిగివచ్చి
అజుని ఓదార్చి,
"రాజా!
9
▾
Meaning
Keep
మృత్యువున
కాశ్చర్య మెందుకు?
శోకము
పనికిరాదు.
కాయమునకు
జనన మరణములు
సామాన్యములు.
జననమునకు
ఏమి కారణమో,
మరణమునకూ
అదే కారణము.
వీటికి
కారణము
వెదకుట
వెఱ్ఱితనము.
దైవ నిర్ణయమునకు
కారణములుండవు.
వాటిని
అర్థము చేసుకొనుట
సామాన్య మానవులకు
అసాధ్యము.
వారివారి
బుద్ధి శక్తులననుసరించి
కొంతవరకు
ఊహింతురేకాని,
బుద్ధి కతీతమైన
తత్త్వమును
ఎట్లు
తెలుసుకొనగలరు?!
మరణము
ప్రతి కాయమునకును
తప్పునది కాదు.
అయితే
ఈనాటి ఇందుమతీ దేవి మరణము
కొంత చరిత్రతో
కూడినదగుటచే
తెలుపవలసివచ్చినది"
అని
అజ మహారాజును
దగ్గర చేర్చి,
"రాజా!
పూర్వము
తృణ బిందుడను ఋషి
ఘోరతప మాచరించుచుండ,
అతని తపోశక్తిని
పరీక్షింపగోరి
ఇంద్రుడు
హరిణి అను
ఒక దేవకన్యకను
పంపెను.
ఆమె
తపోభంగమును
గావింప
అనేక ప్రయత్నములు
చేసెను.
అందులకు
ఋషి
ఏమాత్రమును
చలించక,
కన్నులు తెరచి,
"పరమ పవిత్రమైన
తపస్సును
భంగపరచుటకు
పూనుకొన్న
నీవు
సామాన్య వ్యక్తివి కావు,
బహుశః
దేవకన్యవై యుందువు.
ఎవరివైననేమి,
పాపకార్యమునకు
పూనుకొంటివి
కనుక
నీవు
దేవలోకమును
వీడి
మానవ లోకమున
జన్మించి,
మానవత్వమును
అర్థము చేసుకొని
మెలగుదువుగాక"
అని శపించి
కన్నులు మూసి
తిరిగి తపము ప్రారంభించెను.
అంత
హరిణి
దిగులొంది
కన్నీరు కార్చుచూ
చేతులు జోడించుకొని
అతి దీనయై
తన తప్పును
క్షమించుమని
ప్రార్థించుచూ
స్వర్గభ్రష్టురాలిని
గావింపక
అనుగ్రహించు మని
పరిపరి విధముల
వేడుకొనెను.
అంత ఋషి
"అబలా!
నా వచనములు
తిరిగి తీసుకొనుటకు
వీలుకాదు.
నీ తలపై
ఎపుడు
స్వర్గలోక పుష్పము
వచ్చి పడునో
అపుడు
నీవు మానవ దేహమును వీడి
స్వస్థానమును చేరగలవు"
అని తెలిపెను.
"ఆనాటి దేవకన్యయే
ఈనాటి ఇందుమతీ దేవి.
ఈనాడు నా శిరమందలి
స్వర్గలోక పుష్పము
గాలికి వ్రాలగనే
ఆమె శాపము
విమోచనమైనది.
ఇందుకు నీవు
విచారించి
ప్రయోజనము లేద"ని
రాజనీతులు, దేహనీతులు
బోధించి
నారదుడు
తన మార్గమును
తా ననుసరించెను.
10
▾
Meaning
Keep
అజ మహారాజు చేయునది లేక కాయమున కంత్యక్రియలొనర్చి రాజ్యముచేరి
కాలము అతిభారముగా గడుపుచు,
దశరథుని చూచుకొని కొంత ధైర్యముచే జీవితమును సాగించుచు
దశరథుడు కొంత పెద్దవాడగుటచే రాజ్యభారమును అతనికి అప్పజెప్పి
సరయూ తీరమున అనశనవ్రతమను ఒక వ్రతమును జరుపుచూ,
తిరిగి భవనమునకు చేరక సరయూతీరముననే కాయము వీడెను.
ఈ విషయము దశరథునకు తెలియగనే అతివేగముగ సరయూ తీరము చేరి
తండ్రి కళేబరము చూచి దుఃఖించి,
కాయమునకు తగిన దహన కార్యములను అతిత్వరగా గావించి,
తన తండ్రి వ్రతనిష్ఠుడై గతించెనను పవిత్ర భావమును స్మరించి
ధైర్యముతో తన కర్తవ్యములను తాను పూర్తిగా వశమందుంచుకొని పాలన సాగించుచుండెను.
ఇట్లు కొంతకాలములోనే దశరథుని కీర్తి సూర్య కిరణములవలె వ్యాపించెను.
దశ రథకుల బలము తన కొక్కనికే కలిగియుండుటచేత అతని దశరథుడను పేరుకూడను సార్ధకమాయెను.
తన రథమునకు ఎదురు లేదు. సమస్త రాజులు దశరథునికి భయపడి వశమగుచుండిరి.
దశరథుడన్న అంతకు మించిన గుణవంతుడు, బలవంతుడు, శక్తియుక్తులు కల మహారాజు మరొకడు లేడనునది ప్రపంచవ్యాప్తి ఆయెను.
ఈ విషయము ఎటులనో రావణునికికూడ తెలిసెను.
ఆనాటినుండి ఎటులైనా ఈ దశరథుని అంతమొందించ వలెనను దుర్బుద్ధి అతనిలో దినదినాభివృద్ధి గాంచెను.
దశరథునితో పోరాడుటకు ఏదియో యొక కారణ ముండవలెను కదా అని రావణుడు ఆలోచించి,
ఒకనాడు తన రాక్షసదూతలద్వారా దశరథునకు కబురంపెను.
అది ఏమన, దశరథుడు తన శుల్కమును దూతలద్వారా పంపుమనియు,
అది చెల్లించకున్న యుద్ధము తప్పదనియూ రాజనీతికి విరుద్ధమైన వార్తను తెలిపెను.
అది విని దశరథుడు పక్కున నవ్వి, వచ్చిన దూతలు చూచుచుండగనే
తీక్షణమైన బాణములను లంకాపట్టణముపై విడచెను. అవి పోయి లంకాపట్టణపు ద్వారములను బంధించెను.
అంత వచ్చిన దూతలతో "రాక్షస దూతరాలా! నేనిపుడు మీ నగర ద్వారములు బంధించితిని.
దానిని మీ రాజైన రావణుడు తెరచిన నేను యుద్ధము
11
▾
Meaning
Keep
చేయకయే
మీ రాజునకు
శుల్కము నిత్తున"ని
చెప్పి పంపెను.
రాక్షసదూతలు
రావణునికి తెలుపుటకై
వెళ్లిరి.
అన్ని ద్వారములు
బంధింపబడినవి.
రావణుడు, తన పరివారము
ద్వారములు తెరచుటకై
ఎన్నియో శక్తియుక్తుల నుపయోగించి
చూచిరి.
సాధ్యము కాకపోవుటచే
రావణుడు తనకు జరిగిన పరాభవమునకు
తలవంచి,
ఓడిపోతినను భావము
హృదయమున తలంచగానే
బాణములు తిరిగి
అయోధ్యా నగరమునకు చేరెను.
ద్వారములు తెరచుకొనెను.
నాటి నుండియు
రావణుడు, సమస్త రాజులను జయించునట్టి శక్తిని
సంపాదించుకొనవలెనని తలంచి,
తపస్సు చేయుటకై వనమునకు బయలుదేరెను.
తగిన స్థానమును ఏర్పరచుకొని
ఘోర తపమాచరించెను.
ఆ తపము
అతి తీవ్రమైనదగుటచే
బ్రహ్మ ప్రత్యక్షమై,
"రావణా!
నీకేమి కావలయునో
కోరుకొమ్ము!
తప్పక ఇచ్చెదన"నెను.
అంత దశరథుడు చేసిన పరాభవమును
మనసున తలంచి,
దశరథునకే ఇంత బలమున్న
అతనికి పుట్టునట్టి పిల్లలు
ఇంకెంతటివారు కాగలరో
అను భావమును, భయమున తలంచి,
"స్వామీ!
దశరథుని రక్తమునకు
పిల్లలు కలుగకుండునట్లు
వరమనుగ్రహింపు మ"ని
ప్రార్థించెను.
అంత బ్రహ్మ, "సరి!
ఇచ్చితిన"ని తెలిపి,
అచటనే యుండిన రావణుడు
మరేమైననూ కోరవచ్చునని తలంచి,
మరుక్షణమే అంతర్ధానమాయెను.
రావణుడు నిర్భయుడై
తన శక్తి సామర్ధ్యములను స్మరించుచు గర్వించుచుండ
మరొక తలపు వానిలో మెరసెను.
దశరథుడు ఇప్పుడు యుక్తవయస్కుడు!
అతనికి వివాహమే కాకుండునట్లు
తగిన ప్రయత్నము జరిపిన,
మరింత మంచిదగునని భావించి,
తన రాక్షసశక్తితో తేరిపారచూచి
బహుశః కోసల దేశపురాజు పుత్రికను
ఇతనికిచ్చి వివాహము జరుపవచ్చును కనుక,
ఆ పుత్రికనే లేకుండ చేయవలెనని
(వినాశకాలే విపరీత బుద్ధిః అన్నట్లు)
విపరీత బుద్ధిపుట్టి,
కోసల దేశమునకు మారువేషముతో వెళ్లి
ఆ రాజు కొమార్తెయగు కౌసల్యను
దొంగిలించి,
ఆ బాలికను ఒక పెట్టెలో పెట్టి
సముద్రములో పారవేసెను.
12
▾
Meaning
Keep
దైవాజ్ఞలేక ఏమియూ జరుగదను విషయము రావణుడు తెలిసికొనలేకపోయెను.
ఆ వదలిన పెట్టెను బ్రహ్మ తన సంకల్పముచే ఒక గట్టునకు వచ్చి చేరునట్లు చేసెను.
ఆ గట్టు మంచి విహారస్థానమైనది.
రెండవ దినము దశరథునికి ప్రధానమంత్రి అయిన సుమంతుడు ఆ వనము గట్టునకు వచ్చి రాజ్యతంత్రములను ఆలోచించుచుండ,
అక్కడ ఒక అందమైన పెట్టె కంటికగుపించెను.
అంత చెంతకు వెళ్లి తెరచిచూడ అందులో ఒక ఆడబిడ్డ అందమైన కన్నులతో దైవీ తేజస్సుతో మెరయుచుండెను.
సుమంతుడు జాలి హృదయుడై తీయని మాటలతో, "అమ్మా! నీవెవరు, ఈ పెట్టెలో నుండుటకు గల కారణమేమి?" అని ప్రశ్నించగా –
"అయ్యా! నేను కోసలదేశపు రాజపుత్రికను, నా పేరు కౌసల్య.
నేను పెట్టెలో ఎందుకున్నానో, యెవరు పెట్టిరో, నాకేమీ తెలియదు.
నేను ఉద్యానవనములో మా చెలికత్తెలతో ఆడుకొనుచుంటిని; తదుపరి ఏమి జరిగినది తెలియదు"
అనిన సరళమైన, సున్నితమైన ఆ రాజకుమార్తె మాటలు అతని మనసును కదలించెను.
"తల్లీ! ఇట్టి కిరాతబుద్ధి రాక్షసులకు తప్ప మానవమాత్రులకు సాధ్యము కాదు.
నేను నిన్ను తీసుకొనిపోయి మీ తండ్రిగారి కప్పగింతును! రమ్ము నావెంట"
అని సుమంతుడు రథమందుంచుకొని కోసల దేశమునకు తీసుకొనిపోయి రాజునకు అప్పజెప్పి జరిగిన వృత్తాంతమును తెలిపెను.
అంత కోసలదేశపురాజు సుమంతుని అనేక విధముల ప్రశ్నించెను.
అతడు దశరథ మహారాజునకు మంత్రి అనియూ, దశరథునకు ఇంకనూ వివాహము కాలేదనియును తెలిసికొని, సంతసించి,
"మంత్రీ! మీ రక్షణచే లభించిన కన్యను మీ రాజునకే ఇచ్చి వివాహము చేయ తలంచితిని;
నీవు సత్వరమే వెళ్లి అభిప్రాయమును రాజునకెరిగింపుమ"ని
పసుపు కుంకుమలతో తమ పురోహితుని వెంటబెట్టి సుమంతుని తగిన రీతిగా గౌరవించి పంపెను.
13
▾
Meaning
Keep
సుమంతుడు వెళ్లి జరిగిన వృత్తాంతమును దశరథున కెరిగించెను.
ఇందులకు సమ్మతించినటుల దశరథుడు కూడను కొన్ని కానుకలనిచ్చి తమ పురోహితుని వెంటబెట్టి,
కోసలదేశమున కంపెను. ముహూర్తము నిర్ణయించిరి.
దశరథుడు చతురంగబల సమేతుడై మంగళవాద్యముల ధ్వనులు మిన్నుముట్ట, అత్యంత వైభవముగా కోసల దేశమునకు తరలిపోయిరి.
కౌసల్యా దశరథుల వివాహము అతిసుందరముగా, వైభవముగా జరిగెను.
అంత కోసల దేశపురాజు సుమంతుని చేరపిలిచి
ఈ మంగళ కార్యమునకు నీవే కర్తవు.
దైవము సృష్టికర్త అయినప్పటికిని ప్రాకృత లోకమున నా కుమార్తెను కాపాడి,
ఈ కార్యమును జరుగునట్లు చేసినది నీవే.
కనుక, నీకు నేనేమి కృతజ్ఞతావందనము లర్పింతును?
నా మాట విందువేని, నేనే ఆ మంగళ కార్యమును కూడా అత్యంత వైభవముగా జరిపింతునని తెలిపెను.
అందుకు దశరథుడూ, సుమంతుడూ అంగీకరించగనే,
గర్గకుల సంభూతుడైన వీరదాసుని కొమార్తెను సుమంతునికిచ్చి వివాహము జరిపెను.
రాజు, మంత్రుల వివాహములు ఒక విచిత్రమైన చరిత్రగా పురమంతయూ ప్రాకెను.
పురమేకాదు, దేశమంతయూ తెలిసి ఆశ్చర్య ఆనందముల నొందిరి.
వివిధ వేడుకలతో మూడు దినములు కోసల పురమున రాత్రి పగలను భేదమే తెలియక వివాహ కార్యక్రమములు జరిగెను.
నాలుగవ దినమున దశరథుడు తన రాణియైన కౌసల్యతోను, పరివారముతోను సుమంతుడు తన ధర్మపత్నితోను, పరివారముతోనూ బయలుదేరి,
వీధులందు అనేక నృత్య గాన వైభవములు జరుపుచుండ అయోధ్యానగరమున ప్రవేశించిరి.
అయోధ్యావాసులు తమ మహారాజునకును, మంత్రిగారికిని వివాహము జరిగిన ఆనందమును పట్టలేక,
మైమరచి జేజేలు సలుపుచు మహారాణిగారిని చూచుటకు వీధులలో స్త్రీ పురుషులు బారులుతీరి,
సుగంధ పరిమళములతో పన్నీరు చల్లుచూ, మంగళహారతు లెత్తిరి.
రాజు పురమున ప్రవేశించి, తన కార్యక్రమములు తాను యథావిధిగా ఆచరించుచు,
రాణితోకూడి అప్పుడప్పుడు వనవిహారము సలుపుచూ ఈరీతిగా
14
▾
Meaning
Keep
కాలము గడుపుచుండెను.
దినములు, నెలలు, సంవత్సరములు,
గడచినవి.
రాజునకు కొంత నిరాశ
ప్రారంభమాయెను.
పుత్రులు లేరను కొరత
పీడింపదొడగెను.
పండితుల సలహాలను,
మంత్రుల అభీష్టములను,
పట్టపురాణియైన కౌసల్యాదేవి
సంతృప్తిని పురస్కరించుకొని
సుమిత్రను వివాహమాడెను.
ఆమె పేరుకు తగిన గుణవతి.
కౌసల్యా సుమిత్రలు
ఒకే తల్లి బిడ్డలకంటే
అధిక ప్రేమతో
ఒకరినొకరు అనుసరించి,
సహన, త్యాగ, కరుణలతో
మెలగుచుండిరి.
ఎంతకాల మయినను
రాణులిరువురికీ
ఎట్టి శుభ సూచనలూ
కనిపించకుండుటచే
ఇక తమకు పుత్రులు పుట్టరను
నిరాశచే వారిరువురి సలహా ననుసరించి
దశరథుడు కాశ్మీరదేశపు కేకయ రాజు కూతురు
కైక అను సౌందర్యరాశిని
పెండ్లాడెను.
ఈ కైకను పెండ్లాడుటకు పూర్వము
కేకయరాజు కొన్ని నిబంధనలను పెట్టెను.
ఒకటి తన కొమార్తెయగు కైకకు పుట్టిన పుత్రునకే రాజ్యాధికారము ఇవ్వవలెననియు,
అట్లు ఒప్పని పక్షమున, తన కొమార్తెను దశరథునకు ఇచ్చుటకు వీలు కాదనియూ
గర్గునితో కబురంపగా
కైకేయియొక్క రూపురేఖలను విచిత్రముగా వినియుండుటచేతను,
అట్టి ఇల్లాలు తనకు దక్కవలెననియూ
నిండు హృదయముతో ఉవ్విళ్ళూరుచున్న దశరథుని మనోభావములను
కౌసల్యా సుమిత్రలు గమనించి,
పతి ఆనందముకంటే మాకు వేరేమి కావలెను,
అతని అభీష్టమును తీర్చుటే మా విధి అనియును
అయోధ్యా చక్రవర్తులకు ధర్మవిరుద్ధమైన పుత్రులు పుట్టరనియును,
ఈనాడు దశరథుడు మాటిచ్చినను కైకకు పుట్టునట్టి పుత్రుడు మహాధర్మపరుడగుననియు తలంచి,
ఇరువురూ చేతులు జోడించి,
రాజును ప్రార్థించిరి.
"స్వామీ!
మీ సుఖసంతోషములకంటే
మాకు వేరు ఆనందమేమున్నది!
కేకయరాజు కోరినటులనే
మీరు అంగీకరించి కైకను వివాహమాడి
రఘువంశమును నిలబెట్టుడు.
ఇందుకు మీరేమాత్రమును యోచించనక్కర లేదు"
15
▾
Meaning
Keep
అని వారు ఉత్సాహమును చూపి,
మరింత ప్రోత్సహించుటచేత,
కేకయరాజు పెట్టిన హద్దులను
తప్పక ఒప్పుకొందుననియు,
వివాహమునకు తరలి వచ్చుచున్నామనియు
కట్నములతో పురోహితులను గర్గుని వెంట పంప,
కేకయరాజు అత్యంత ఆనందముతో
వివాహమునకు తగిన ఏర్పాట్లు
అతి వైభవముగా గావించెను.
ఇరువురు రాణులతో దశరథుడు పరివారముతో
కేకయరాజు రాజ్యము చేరి
కైకను వివాహమాడి
మూవురు రాణులతో
చుక్కల నడుమ చంద్రునివలె
అయోధ్యా నగరమున ప్రకాశించుచుండెను.
దశరథుడు మూవురు రాణులను,
సమానమైన ప్రేమతో చూచుకొనుచుండెను.
రాణులుకూడను ఎట్టి భేదములు లేక
భయభక్తులతో, ధర్మకర్మలతో,
పతియే దైవమను భావముతో,
పతి ఇష్టములకు అడ్డుచెప్పక
అతని ఆనందమునకు అంతరాయము కలిగించక
దేహములు వేరైనను
ప్రాణములు ఒక్కటా అన్నట్లు
మూవురు అన్యోన్యముగా మెలగుచుండిరి.
Previous
←
The Truth of Śrī Rāma
Next
The Birth of Śrī Rāma
→