Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Avatāra's Drama Concludes
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
16
అవతార
నాటక
సమాప్తం
అంతలో
వాల్మీకి
మహర్షి
చింతాక్రాంతుడై
వచ్చెను.
అతడు
జానకికి
జరిగిన
వృత్తాంతమంతయు
విన్నవించెను.
అతడు
హనుమంత,
జాంబవంతుల
బంధనములను
విప్పి
"ఓ
బాలులారా!
ఎంత
పని
జేసితిరి?
రామ
లక్ష్మణ
భరత
శత్రుఘ్నులను
పడత్రోసి
వచ్చితిరి
కదా?"
అని
విచారించెను.
ఆ
మాటలు
విని
"అయ్యో
కుమారులారా,
మీ
వలన
వంశమునకే
మచ్చవచ్చెను.
ఇక
నిదానించక
సహగమనమునకు
సిద్ధము
చేయుడు;
నేనిక
జీవించను"
అని
సీత
మొఱపెట్టెను.
వాల్మీకి
మహర్షి
సీతను
వోదార్చి
ఆమెకు
ధైర్యము
జెప్పిరి;
అతడు
కుశలవులను
తీసుకొనివచ్చి
రణస్థలమును
చూచి
ఆశ్చర్యపడెను.
శ్రీరాముని
రథమును,
గుఱ్ఱములను
గుర్తుపట్టి
అతని
చరణములకు
వాల్మీకి
నమస్కరించెను.
ఆతురతతో
రాముడు
దిగ్గున
లేచి
కూర్చొనెను.
కుశలవులు
అతని
యెదట
నిలువబడియుండిరి.
వాల్మీకి
మహర్షి
శ్రీరామునితో
"ఓ
నాథా!
నా
జన్మము
సఫలమయినది.
నేనెంత
ధన్యుడను!"
అని,
లక్ష్మణుడు
సీతను
వనములో
విడచిపెట్టిన
వృత్తాంతమును,
కుశలవుల
జననమును
శ్రీరామునికి
జెప్పెను.
కుశలవులు
నీ
కుమారులు;
పంచభూతముల
సాక్షి-వీరు
నీ
కుమారులని
విన్నవించెను.
ఈ
మాటలు
విని
శ్రీరాముడు
కుమారులను
కౌగిలించుకొని
శిరస్సులను
ముద్దాడెను.
అంత
మృతవానరులు,
యోధులు
రామునననుగ్రహముచే
లేచిరి.
లక్ష్మణ
భరత
శత్రుఘ్నులు
సహితము
ఆ
బాలురను
ముద్దాడిరి.
లక్ష్మణుడు
జానకి
వద్దకు
వెళ్ళెను.
రాముడు
లక్ష్మణుని
పిలిచి
"ఓ
తమ్ముడా!
నా
మాట
వినుము.
నీవు
జానకిని
సమీపించి
శపథమును
గురించి
ఆమె
ఉద్దేశమును
కనుగొనుము"
అని
చెప్పెను.
2
▾
Meaning
Keep
అతడు
జానకిని
సమీపించి
ఆమె
చరణములకు
నమస్కరించెను.
శ్రీరాముని
యిచ్ఛానుసారము
జానకి
శపథమును
చేయుటకు
సిద్ధపడి
లక్ష్మణునితో
కూడి
రామసన్నిధికి
వచ్చెను.
ఆమె
సభ్యులను
చూచి
సత్యముగా
ఇట్లు
ప్రమాణము
చేసెను:
"ఓ
దేవతలారా!
పంచభూతములారా!
మనోవాక్కాయకర్మలచే
శ్రీరాముని
తప్ప
మరియొక
పురుషుని
స్వప్నమునైననూ
నేను
ధ్యానించి
యుండలేదు.
ఓ
తల్లీ!
భూదేవీ!
నన్ను
నీలో
గలుపుకొమ్ము"
అని
జానకి
ప్రార్థించి
శ్రీరాముని
పాదములకు
నమస్కరించెను.
తత్క్షణమే
ఫటఫటమని
భూదేవి
మూర్తీభవించి
చేతులు
చాచి
జానకి
నెత్తుకొని
దీవించెను.
"జానకీ!
పుట్టినది
మొదలు
నేటివరకు
నీవు
దుఃఖపడని
దినములు
లేవు.
యెల్లప్పుడూ
నీవు
కన్నీరు
కార్చుచుంటివి.
రావమ్మా!
నా
యింటనే
సుఖముగా
నుండుము"
అని
పలికెను.
ఒక
నిమిషములో
వారిరువురూ
తిరోహితులయిరి.
ఆమె
ఖ్యాతి
మూడులోకములకూ
వ్యాపించెను.
లక్ష్మణాది
అనుజులు
కన్నులారా
జూచుచుండిరి.
వారు
కన్నీరు
గార్చిరి.
రాముడు
విచారించునటుల
నటన
సలిపెను.
జానకి
నా
మనోవ్యాపారము
ననుసరించి
వెడలెను.
ఆమె
నా
మనస్సు
గ్రహించి
నంతరించెను.
ఇక
మేము
మా
వైకుంఠ
ధామమునకు
వెడలవలయును,
అని
చింతించి,
కొంత
దుఃఖించినటుల
నటన
సలిపి
తమ్ములతో,
కుమారులతో
కూడి
రాజధానికి
వచ్చి
యజ్ఞము
సమాప్తము
జేసెను.
అతడు
చేసిన
షోడశ
మహాదానములను
యెవరును
వర్ణించలేకపోయిరి.
శ్రీరాముడు
జనక
చక్రవర్తిని
సత్కరించి
కుమారులను
పరిచయము
చేసెను.
జనకుడు
మనుమలను
చూచి
పరమానందపడెను.
అతడు
మహాజ్ఞాని
కనుక,
దివ్యదృష్టితో
సీత
యొక్క
దివ్యత్వమును
గుర్తించినవారు
కనుక,
జరిగిన
దానికే
మాత్రమూ
చిత్తవిచిత్తమునూ
లేక
ఆశ్చర్యాద్భుతములనూ
వెలిబుచ్చక,
జరుగవలసిన
రీతిలో
జరిగినదని
చలించని
మనస్సుతో,
భ్రమించని
దృష్టితో
తనకిట్టి
భాగ్యము
లభించెను
కదా
అని
ఆనందించెను.
అతడు
అమితానందముతో
మిథిలాపురమునకు
వెడలెను.
గురువులూ,
బ్రాహ్మణులూ
రాముని
వర్తమానము
ప్రకారము
రాముని
సన్నిధికి
వచ్చిరి.
ఈ
ప్రకారము
యజ్ఞము
జూడవచ్చినవారు
స్వగృహములకు
సంతోషించుచూ
నిష్క్రమించిరి.
3
▾
Meaning
Keep
తరువాత
రాముడు
అయోధ్యానగరమునకు
కుమారులను
బిలిచి,
వారలకు
రాజధర్మముల
నుపదేశించి
వారలకు
రాజ్యపట్టము
గట్టెను.
భరతుని
కుమారుడు
తక్షునకు
దక్షిణ
రాజ్యమునిచ్చెను.
భరతుని
రెండవ
కుమారుడు
పుష్కరునకు
పుష్కరనగర
రాజ్యము
నిచ్చెను.
రాక్షసులను
సంహరించి
వారు
నగరములను
స్థాపించిరి.
లక్ష్మణుని
కుమారులు
చిత్రకేతుడు,
చిత్రాంగదుడు,
మహాబలవంతులు.
వీరు
రణధీరులు.
పశ్చిమ
రాజ్యమున
రాక్షసులను
సంహరించి,
నగరములను
స్థాపించిరి.
వేరు
వేరు
పేర్లు
గల
రెండు
నగరములను
రాముడు,
లక్ష్మణుని
కుమారులకు
పట్టము
గట్టెను.
అందరికీ
రాజధర్మముల
నుపదేశించెను.
అయోధ్యా
నగరమును
కుశునకిచ్చి
పట్టము
గట్టెను.
ఉత్తర
ఖండ
భూములు
సకలసంపదలకు
నిధానము.
అచ్చట
లవపురమును
రాజధానిగా
చేసి
(అనగా
లాహోర్)
దానిని
లవునకు
పట్టము
కట్టెను.
గోవులు,
భూములు,
వస్త్రములు,
ధనము,
గృహములు
ఈ
విధముగా
శ్రీరాముడు
వారివారికి
చాలినంత
ఇచ్చెను.
శ్రీరాముడు
స్వధామమునకు
బోవుచున్నాడన్న
వార్త
పురజనులు
విని
శ్రీరాముని
దగ్గరకు
వచ్చి
మా
విన్నపములు
ఆలకింపుమని
ప్రార్థించిరి.
మమ్ములను
కూడా
తమతో
మీ
లోకమునకు
తీసుకొని
పొండని
ప్రార్థించిరి.
శ్రీవారు
అందులకు
సమ్మతించి
వారి
అనురాగమునకు,
ప్రభుభక్తికి
సంతసించిరి.
కిష్కింధా
రాజ్యమును
అంగదున
కిప్పించిరి.
సుగ్రీవుడు,
జాంబవంతుడు,
విభీషణుడు,
నలుడు
ఈ
మొదలగు
దేవతాంశ
సంభూతులు,
కోట్లకొలది
వానరులు,
ఆ
సమయమునకు
శ్రీరాముని
దగ్గరకు
వచ్చిరి.
వారందరినీ
పిలిచి
"విభీషణా!
నీవు
లంకా
రాజ్యమును
పరిపాలింపుము.
అంతమున
నీకు
నా
సన్నిధి
లభించును"
అని
దీవించెను.
"జాంబవంతా!
ద్వాపరయుగాంతము
వరకు
నీవు
భూలోకములో
నుండుము.
అప్పుడు
నేను
కృష్ణావతారుడనై
నీతో
పోరాడగలను.
అప్పుడు
నీవు
నన్ను
గుర్తింతువు"
అని
దీవించెను.
తరువాత
లక్ష్మణుడు
పురజనులతో
స్వయముగా
సరయూ
తీరమునకు
వచ్చి
చేరెను.
రాముని
దక్షిణము
వైపున
భరతుడును,
వామమున
శత్రుఘ్నుడును,
వారి
వెనుక
మంత్రులు,
పురజనులు
క్రమముగా
నడచిరి.
భరతుడు
శ్రీవారిలో
లీనమయ్యెను.
శత్రుఘ్నుడు
జలములను
స్పర్శించి
పద్మములో
ప్రకాశించుచు
లీనమయ్యెను.
శ్రీరాముడు
ఈ
పుణ్యభూమికి
వచ్చినవారునూ,
పవిత్రమగు
సరయూనదిలో
స్నానము
చేసినవారునూ
నన్ను
చేరగలరని
ఆశీర్వదించెను.
Previous
←
The Abandonment of Sītā