Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Rāma Kathā Rasa Vāhini · The Abandonment of Sītā
Rāma Kathā Rasa Vāhini
›
Part Two
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
15
సీతా
పరిత్యాగము
దేశములోనూ,
నగరములోనూ
చారులు
గూఢముగా
సంచరించి
ప్రతిదినము
సాయం
సమయమునకు
నగరమునకు
వచ్చి
యావద్వృత్తాంతమును
ప్రభువునకు
విన్నవించు
యాచారము
గలదు.
ఆయా
చారులు
చెప్పిన
వృత్తాంతములను
రాజు
వినుచుండెను.
వారిలోనొక
డొక
విధమున
రాజు
వద్దకు
వచ్చి
నమస్కరించి
నిలువబడియుండెను.
కానీ
యే
సమాచారము
చెప్పక
మౌనము
ధరించెను.
వానిని
రాముడు
తర్కించిననూ
వాడు
పలుకక
యూరకుండెను.
ధైర్యము
నవలంబించి
రామునితో
నిట్లు
చెప్పెను:
"ఓ
మహారాజా!
నా
మాట
మన్నింపుము.
నన్ను
క్షమించుము.
ఒక
చాకలివాడను,
వాని
భార్యయు
కలహించిరి.
'ఓసీ,
నేను
రాముడను
కాను.
ఇంత
కాలము
నీవు
పరుల
గృహములో
నివసించుచుంటివి
కనుక,
నా
గృహము
నుండి
లేచిపొమ్ము'
అని
వాడు
భార్యను
పొమ్మనెను."
ఆ
మాట
బాణము
వలే
రాముని
హృదయమునకు
దగిలెను.
ఆ
రాత్రి
రామునకు
నిద్రలేదు.
ఆ
విషయమే
రామునకు
మనసున
మెదలుచుండెను.
అర్ధరాత్రివేళ
లేచి,
విచారించుచు
"నేను
రాజ్యము
చేయుచుండ
ఒక
యుగము
గతించెను.
ఇంక
కొన్ని
సంవత్సరములు
రాజ్యము
చేయవలెను,"
అని
కృపాసాగరుడు
విచారించుచు,
"ఆహా!
నేను
జానకిని
విడిచిపెట్టవలెను.
వేదమార్గములను
నిలబెట్టవలెను"
అని
నిశ్చయించెను.
అతడు
జానకివద్దకు
వచ్చి
సంతోషముతో
ముచ్చటించెను.
రాముడు
చిరునవ్వులు
నవ్వి,
"ఓ
జానకీ!
ఇంతవరకు
నీవు
నన్నొక
వరము
అడుగలేదు.
అయినను
నీకొక
వరము
నిచ్చెదను.
నీ
పవిత్ర
ధామమునకు
పొమ్ము"
అని
చెప్పెను.
ఆ
క్షణమే
జానకి
శ్రీవారికి
నమస్కరించి
సూక్ష్మరూపమున
వైకుంఠమునకు
పోయెను.
ఆ
వృత్తాంతము
చరాచరజంతుజాలమునకు
తెలియదు.
మాయాసీత
మాత్రము
శ్రీరాముని
యొద్ద
నిలిచి
యుండెను.
2
▾
Meaning
Keep
ఆ
మాయాసీతను
చూచి
"ఓ
సీతా!
నీవు
వరమునడుగుము"
అని
రాముడు
పలికెను.
"ఓ
నాథా!
నాకు
ముని
ఆశ్రమములో
విహరించవలెనని
కోరిక
కలదు"
అని
ఆమె
చెప్పెను.
ముని
కన్నెలకును,
ముని
పత్నులకును
తగిన
వస్త్రాద్యలంకారముల
నామె
మూటకట్టెను.
రాముడు
"తథాస్తు,
రేవు
ప్రాతఃకాలమున
నీవు
ప్రయాణమగుము"
అని
చెప్పెను.
ప్రాతఃకాలముననే
రాముడు
మేల్కాంచెను.
యాజకజనులు
శ్రీరాముని
గుణగణములను
గానము
చేయుచుండిరి.
శ్రీవారి
ముఖకమలము
వికసించెను.
భరతలక్ష్మణశత్రుఘ్నులు
రాముని
వద్దకు
వచ్చి
వారి
చరణములకు
నమస్కరించిరి.
అన్నదమ్ములతో
అతడు
మాటాడక
యూరకుండెను.
శ్రీరాముని
ముఖము
వెలవెలబోవుచుండెను.
అతని
శరీరనవకము
చెడిపోయెను.
అతని
ప్రతి
అవయవము
శంకను
దోపించెను.
అతని
వ్యాకులమునకు
కారణము
తెలియక
వారు
మువ్వరూ
గడగడ
వడకిరి.
అతని
మనోవ్యాపారము
వారికి
నగోచరము.
శ్రీరాముడు
కడకు
విచారమును
ప్రకటించుచూ
నిట్టూర్పులను
విడిచి,
తమ్ములతో
నిట్లు
ప్రసంగించెను
"ఓ
తమ్ములారా,
నా
మాటను
కాదనక
జానకిని
వనములలో
విడిచిపెట్టి
రండు"
ఆ
మాటలు
వినినంతనే
వారు
నిశ్చేష్టులైరి.
వారి
శరీరములు
మండెను.
వారి
హృదయములు
దహించిపోయెను.
ఈ
మాటలు
శ్రీరాముడు
హాస్యమునకు
చెప్పెనో
లేక
నిజముగ
జెప్పెనో
వారికి
సందేహము
కలిగెను.
ఆ
మువ్వరు
తమ్ములు
వ్యాకులము
పొందిరి.
శత్రుఘ్నుడు
వెక్కి
వెక్కి
యేడ్చెను.
లక్ష్మణభరతులు
కంటిధారలు
కార్చుచూ
నిశ్చేష్టులై
నిలచిరి.
నోటిమాట
రాకపోయెను.
పెదవులు
చేతులు
అదిరిపోయెను.
కడకు
చేతులు
జోడించుకొని
శత్రుఘ్నుడు
రామునితో
నిట్లు
విన్నవించెను:
"శ్రీవారి
వచనములు
మా
హృదయములను
ఛేదించెను.
జానకి
లోకమాత.
ఈ
సంగతి
జనులకు
తెలియును.
మీరు
లోకపితలు,
సకలజీవుల
హృదయములలో
నివసించుచుందురు.
సచ్చిదానంద
పురుషులు.
ఏ
కారణముచేత
జానకిని
విడిచిపెట్టుచున్నారు?
త్రికరణశుద్ధిగా
ఆమె
నిత్యానపాయిని
కదా!
ఓ
రాక్షసాంతకా!
మీరు
సర్వజ్ఞులు.
ఆమె
ప్రస్తుతము
గర్భమును
ధరించెను.
ఇట్టి
స్థితియందు
ఆమెను
వంటరిగా
విడచుట
పాడియా?"
అని
పొరలివచ్చు
దుఃఖమును
ఆపుకొనలేక
గోడున
ఏడ్చుచూ
శత్రుఘ్నుడు
విన్నవించెను.
"ఓ
తమ్ముడా!
నీవు
నా
మాట
నుల్లంఘించిన
3
▾
Meaning
Keep
యెడల
నా
ప్రాణములు
ఈ
శరీరము
నిలచియుండవు.
మీకు
మంగళమగుగాక!
ఓ
తమ్ములారా!
నా
మాట
ప్రకారము
ప్రాతఃకాలమున
జానకిని
వనమునకు
దీసుకొనిపొండు"
అని
శ్రీరాముడు
శిరస్సు
వంచుకొనెను.
దుఃఖించుచున్నట్లు
నటన
చేసెను.
కర్ణకఠోరమగు
శ్రీరాముని
వచనములను
విని
భరతుడు
"ఓ
నాథా,
నేను
బుద్ధిహీనుడను,
నా
విన్నపము
ఆలకింపుము.
మన
సూర్యవంశమునకు
లోకములో
పేరు
ప్రతిష్టలు
లోక
ప్రసిద్ధము.
మీ
కీర్తిని
వేదములును,
శేషుడును
గానము
చేయుచుందును.
జానకి
సకలశోభాన్వితురాలు.
అమంగళమును
నశింపజేయును.
సకల
శుభమంగళముల
నిచ్చును.
ఆమె
మహో
పతివ్రత.
ఆమె
ఛాయను
గ్రహించిన
మాత్రమున
స్త్రీలు
సద్గతిం
బొందగలరు.
అట్టి
జానకి
మిమ్ములను
విడిచి
వనములో
విహరింపగలుగునా?
ఒక
నిమిషము
మిమ్ములను
విడిచి
జీవించియుండగలదా?
నీరు
లేకుండా
మత్స్యములు
జీవింపగలవా?
సకలగుణ
సంపన్నురాలు,
జ్ఞానస్వరూపిణి
జానకి
వంటరిగా
జీవించుట
దుర్లభము"
అనెను.
ఈ
ప్రకారము
భరతుడు
చెప్పిన
మాటలను
విని
శ్రీరాముడు
తమ్మునితో
"ఓయి
భరతా!
నీవు
నీతియుక్తమగు
మాటలు
పలికితివి.
రాజు
రాజనీతి
ప్రకారము
ధనమును,
ధర్మమును
కాపాడవలెను.
ప్రజల
బాలించుటలో
వారిని
క్షోభపెట్టకూడదు.
అత్యానురాగముతో
వారిని
రక్షింపవలెను"
అని,
దూత
చెప్పిన
మాటలనతడు
తమ్ములకు
వ్యక్తపరచెను.
"ఓ
తమ్ములారా!
మన
వంశమునకు
గొప్ప
కళంకము
వచ్చెను.
మన
వంశములో
అనేక
రాజులు
గతించిరి.
ఒకరికంటే
ఒకరు
సుప్రసిద్ధులు.
వారి
కీర్తిప్రతిష్టలు
లోక
విదితము.
భూలోకములో
వారలను
యెరుగనివారు
లేరు.
వారు
ప్రాణములైననూ
విడిచిపెట్టిరి
కానీ
ఆడినమాట
తప్పలేదు.
మన
వంశమునకు
మచ్చలేదు.
ఒకవేళ
మచ్చవచ్చినప్పుడు
ప్రాణమును
విడిచిపెట్టక
యుండిననాడు
నీచుడని
తెలుసుకొనుడు"
అని
చెప్పగా
తమ్ముడు
"నాథా!
మన
జానకికి
లేశమైననూ
కళంకము
లేదు.
అగ్నిహోత్రము
నుండి
జానకి
వెడలివచ్చెను.
జానకికి
మచ్చగలదని
దేవతలుగాని,
మునులుగానీ
స్వప్నమందైనను
చెప్పరు.
ఈ
విషయమును
తెలియక
జానకి
పాపాత్మురాలని
తలంచినవారు
రౌరవాదినరకములలో
కోట్లకొలదీ
కల్పాంతముల
వరకు
బాధల
ననుభవింతురు"
అని
భరతుడు
కొంత
ఆవేశపూరితములైన
4
▾
Meaning
Keep
మాటలు
ఆడినంతనే
శ్రీరాముని
రౌద్రరూపమును
కోపారుణ
నేత్రాంతములను
లక్ష్మణుడు
చూచి
భయపడి
భరతుని
వెనుకకు
దూరెను.
"ఓ
లక్ష్మణా!
విచారమును,
మూర్ఖత్వమును
విడిచిపెట్టి
లోకులు
పలికిన
మంచిచెడులను
గ్రహింపుము.
నా
ఆజ్ఞనుల్లంఘించి
ప్రత్యుత్తరము
నిచ్చినయెడల
ఆజన్మాంతము
విచారింపవలసి
యుందును.
జానకిని
రథముపై
గూర్చుండబెట్టుకొని
గంగానదీతీరమున
విడిచిపెట్టి
రమ్ము.
సాంద్రారణ్యములో
నిర్జన
ప్రదేశములో
ఆమెను
దిగబెట్టుము."
శ్రీవారి
మాటలు
విని
లక్ష్మణుడు
నిరాశ
చేసుకొని
మృత్యువునకు
సిద్ధపడి
ప్రయాణమయ్యెను.
భోజనపదార్థములను,
వస్త్రములను
తీసికొని
రథముపై
జానకిని
కూర్చుండబెట్టి
లక్ష్మణుడు
వెడలెను.
శ్రీరాముని
ధర్మపత్ని
అత్యుత్సాహముతో
ప్రయాణమయ్యెను.
లక్ష్మణమూర్తి
ముఖము
చిన్నబోయి
ఉండుట
చూచి
సీత
మనసు
వ్యాకులమయ్యెను.
ఆమె
ముఖమునుండి
వోక
మాటైననూ
వెడలలేదు.
మణిని
నష్టపడిన
సర్పమువలె
ఆమె
లోలోన
అణచుకొనెను.
వారు
గంగాతీరమునకు
వచ్చిరి.
ఆ
కారడవిని
చూచి
వారు
భయపడిరి.
లక్ష్మణుడు
భయపడుట
చూచి
సీత
వెలవెలబోయెను.
సీతకు
తాను
మాయసీతనని
తెలిసియూ
లోకమునకై
ఆమె
నటనచేయ
మొదలు
పెట్టెను.
"ఓ
లక్ష్మణా!
ఇచ్చటముని
యాశ్రమము
లేవియూ
కనపడకున్నవే?
ఎచ్చటికి
నన్ను
తీసుకొనిపోయెదవు?
ఈ
అడవిలో
నానావిధ
క్రూరమృగములు,
సర్పములు
మొదలగునవి
విచ్చలవిడిగా
సంచరించుచున్నవికదా!
ఈ
ప్రదేశములో
జనసంచారమయిననూ
కనుపించుటలేదు.
లక్ష్మణా!
నాకు
భయమగుచున్న"దనెను.
ఈ
ప్రకారము
సీత
విలపించెను.
లక్ష్మణుని
మనసు
జాలిపడెను.
"ఓ
రామచంద్రా!
ఎంత
పనిచేసితివి?"
అని
లోలోన
స్మరించి
సీతను
జూచి
ధైర్యము
నవలంబించి,
దాహముచే
నా
ప్రాణములు
వెడలుచున్నవి
అని
ఎంతో
బాధపడెను.
అతని
మనస్సంకటమును
చూచి
సీత
చాలా
కంగారుపడెను.
లక్ష్మణుని
నిశ్చయమున
తెలిసికొని
ఆకాశవాణి
"లక్ష్మణా!
జానకిని
విడిచి
నీవు
అయోధ్యకు
పొమ్ము.
సౌభాగ్యవతియగు
సీత
జీవించును"
అని
పలికెను.
ఆ
మాటలు
వినినందున
అతనికి
5
▾
Meaning
Keep
ధైర్యము
వచ్చెను.
అతడు
చేతులు
జోడించుకొని
సీతకు
నమస్కరించి
దుఃఖపడి
"తల్లీ,
నేనేమీ
చేతు?
శ్రీరాముని
ఆజ్ఞ
జవదాటలేక
పోవుచున్నాను.
నేను
మహాకిరాతకుణ్ణి.
నిన్ను
ఈ
కారడవిలో
విడిచిరమ్మని
అన్నగారి
ఆజ్ఞ"
అని,
ఉన్నది
ఉన్నట్లు
చెప్పి
రథమును
వెనుకకు
త్రిప్పెను.
లక్ష్మణుని
చూపులు
వెనుకకే
తిరిగిపోయెను.
సీత,
"లక్ష్మణా!
నన్నీ
అరణ్యములో
విడిచిపోవుచున్నావా?
నాకెవరు
దిక్కు?"
అని
సామాన్య
స్త్రీలవలె
విలపించెను.
చేయునది
లేక
ఆమె
మాటలు
శూలములవలె
లక్ష్మణుని
కర్ణరంధ్రముల
పొడుచుకొని
పోవుచున్ననూ
రామాజ్ఞను
నెరవేర్చక
తప్పదని
మనసును
పాషాణముగా
చేసుకొని
లక్ష్మణుడు
నగరమునకు
చేరెను.
సీత
మూర్ఛిల్లినట్లు
నటన
చేసెను.
అంతలో
లేచి,
"ఓ
రామచంద్రా,
పుట్టినదాది
నా
జీవితము
దుఃఖముల
పాలబడెను.
ఎన్ని
దుఃఖములు
వచ్చిననూ
నా
ప్రాణములు
బొందిని
విడిచిపెట్టవు
కదా"
అని
విలపించెను.
ఆ
సమయమున
గంగానదిలో
స్నానము
చేసి
వాల్మీకి
మహర్షి
ఆ
మార్గమున
ఆశ్రమమునకు
బోవుచుండెను.
ఆ
మాటలు
అతని
చెవిలో
పడి,
ఈ
భయంకరారణ్యమున
స్త్రీ
కంఠము
వినిపించుచున్నదే
అని
అటు
ఇటూ
వెతకుచూ
ఆమెయున్న
ప్రదేశమునకు
వచ్చెను.
ఆమె
వాల్మీకి
మహామునిని
గుర్తుపట్టి
స్వవృత్తాంతమును
అతనితో
నిట్లు
చెప్పెను.
"ఓ
మునిరాజా!
నేను
జనకచక్రవర్తి
కుమార్తెను.
శ్రీరామచంద్రుని
భార్యను,
ఈ
విషయము
లోకప్రసిద్ధము.
వారు
నన్ను
విడనాడుటకు
కారణము
తెలియదు.
విధికృతము
తప్పించుకొన
శక్యమా?
ఓ
మునివరా!
లక్ష్మణుడు
నన్ను
తీసుకొనివచ్చి
విడిచిపెట్టెను.
ఇందుకు
కారణము
నాతో
చెప్పలేదు."
ఆ
ప్రకారము
సీత
చెప్పిన
వృత్తాంతమును
వాల్మీకి
మహాముని
విని
ఆమెనోదార్చి,
"ఓ
కుమారీ!
నీ
తండ్రి
మిథిలాపతియగు
జనకుడు
నా
మిత్రుడు,
శిష్యుడు,
నాయందు
భక్తి
విశ్వాసములు
కలవాడు.
ఓ
సుకుమారీ,
నీవేమీ
చింతించకుము.
ఇది
నీ
తండ్రి
గృహముగా
భావించుము.
నీకు
శుభము
కలుగును.
పునః
నీకు
రాముని
సంయోగము
కలుగును"
అని
చెప్పెను.
జానకిని
తన
బిడ్డగా
భావించి
ఆమెను
గంగానదిలో
స్నానము
చేసి
రమ్మని
ఆజ్ఞాపించెను.
ఆమె
స్నానమాడి
శుచి
అయి
వాల్మీకికి
నమస్కరించెను.
అంత
ఆమెను
ఆశ్రమమునకు
తీసుకొనిపోయి
అనేక
విధముల
ధైర్యము
గలిగించెను.
ఆమెకు
6
▾
Meaning
Keep
కందమూలాదులు
సమర్పించెను.
ఆమె
మహర్షి
బలవంతముతో
కొంత
భుజించెను.
అప్పటినుండి
శ్రీరాముని
ధ్యానము
చేయుచూ
ఆశ్రమ
కార్యక్రమములలో
ఆశ్రమవాసులతో
శాంతముగా
కాలము
గడుపుచుండెను.
వారు
ఆమెకు
చిత్ర
విచిత్రకథలు
చెప్పుచూ
వినోదములు
చూపించుచూ
ఆమె
దుఃఖమును
మరిపించుచూ
ఉండిరి.
లక్ష్మణుడు
సీత
చింతతోనే
విలపించుచూ
నగరముచేరి
ఈ
విషాదగాధను
మువ్వరు
తల్లులకు
తెలుపగా
వారు
గొల్లుమని
యేడ్చి
జానకికి
గొప్ప
ఆపద
వచ్చెనని
ఆమె
గుణగణములను
పొగడుచూ
అట్టి
మహాసాధ్వీమణి
కెంతటి
గతి
పట్టెనని
కుమారుని
ఒకవైపు
నిందించుచూ
ఉండిరి.
రాజనగరమునందు
కానీ,
అంతఃపురమునందుకానీ
ఎచ్చట
చూచిననూ
రోదనయే
వినబడుచుండెను.
స్త్రీ
బాలవృద్ధులు
అందరూ
శ్రీరాముని
నిందించుచూ,
అట్టి
తల్లికి
ఇట్టి
శిక్షయా
అని
విచారించనివారు
లేరు.
ఆ
కోలాహలము
రాముడు
విని
లక్ష్మణునితోకూడి
మందిరములో
ప్రవేశించి
బైట
ప్రజలకు
కనుపించకయుండెను.
తరువాత
అంతఃపురమునకు
పోయి
వారల
నోదార్చి
వారలకు
జ్ఞానమును
ఉపదేశించెను.
ప్రజలకు
రాజనీతి
గురించి
తెలియదు.
ప్రజలే
ప్రధానముగానీ
బంధుమిత్రులుకారు.
ప్రజలే
బంధువులు,
ప్రజలే
నా
మిత్రులు
అని,
అట్టి
గుణము
కలవారే
పరిపాలకుడని
వారికి
అనేక
విధముల
నచ్చచెప్పెను.
సీతావియోగముతో
మువ్వరు
తల్లులు
విలపించి
కృశించిరి.
కడకు
ప్రాణములు
వీడిరి.
ఆ
మువ్వరు
తల్లులు
యోగాగ్నిచే
శరీరములను
దహించుకొని
పరమపదమునకు
వెళ్ళిరి.
ఆ
నల్వురన్నదమ్ములు
వారల
మరణములకు
దుఃఖించి
వేదోక్త
ప్రకారము
వారికి
తగిన
యుత్తరక్రియలను
నిర్వర్తించిరి.
తల్లుల
పేర్లు
చెప్పి
షోడశ
మహాదానములు
ఇచ్చిరి.
అనంతరం
శ్రీరామలక్ష్మణ
భరతశత్రుఘ్నులు
వారివారి
పరిపాలనా
విధానమును
ప్రజల
తృప్తిని
అనుసరించి
చూచుకొనుచుండిరి.
శ్రీరాముడు
అశ్వమేధయాగము
చేయవలయునని
కోరిక
కలవాడై
దానివలన
సకల
దుఃఖములును
నశించునని
తలంచి
అంగదాదులకు
వర్తమానము
పంపెను.
తమ్ములతో,
మంత్రులతో
కూడి
గురువుగారి
గృహమునకు
వెడలెను.
వారు
గురువు
చరణములకు
నమస్కరించిరి.
గురువు
వారల
నాదరించెను;
మృదువచనములతో
7
▾
Meaning
Keep
వారి
యోగక్షేమముల
విచారించెను.
పురాణకథలను
ఇతిహాసములను
గురువుగారు
ఉపదేశించెను.
అంత
శ్రీరాముడు
ఓ
నాథా,
నా
మనోరథమొకటి
కలదు.
దానిని
మీరు
పూర్తి
చేయవలెను
అని
నమస్కరించి
విన్నవించెను.
అది
యేమని
వసిష్ఠుల
వారు
ప్రశ్నించగా,
నేనొక
యజ్ఞమును
సంకల్పించితిని.
దాని
వలన
పురజనులు
సంతసింతురు.
నేటి
విచారము
బాపి
నగరమును
శాంతపరచును
అది
అశ్వమేధ
యాగము.
దానిని
ప్రజలు
కూడ
చూడగోరుచున్నారు.
మీకు
భయపడి,
భరతుడా
విషయమును
మీతో
చెప్పుటకు
శంకించెను.
సమయమును
జూచి
నేనే
స్వయముగా
చెప్పతలంచితిని.
మీ
ఆజ్ఞను
శిరసావహించి
ఆ
ప్రకారము
సంచరించెదము.
ఈ
ప్రకారము
రాముడు
వినయవిధేయతలతో
విన్నవించిన
వాక్యములను
గురువు
విని
సంతోషించెను.
"ఓ
రామా!
నీ
అభీష్టము
సిద్ధించును.
ఓ
భరతా!
లెమ్ము.
అందుకు
తగిన
యేర్పాట్లు
గావింపుము"
అని
వసిష్ఠులవారు
పలికిన
పలుకుల
వలన
అన్నదమ్ములును,
మంత్రులు
మొదలగు
వారును
సంతోషించిరి.
వారనేక
విధముల
గురువును
స్తుతించిరి.
వారి
చరణములకు
నమస్కరించి
బ్రాహ్మణులు
అనేకులు
భరతుని
వెంట
నడచిరి.
సుమంతుడు
పురజనులను
సేవకులను
బిలిచి
నగరమును,
రాజమార్గమును,
అంగడి
వీధులను
సింగారింపుమని
ఆజ్ఞాపించెను.
అచ్చటచ్చట
మంటపములు
నిర్మింపుడనియు
జెప్పెను.
మంత్రి
ఆజ్ఞానుసారము
వారు
వారి
వారి
పనులు
అతిశీఘ్రముగా
నెరవేర్చిరి.
ఆ
నగరము
కళ
కళ
మనుచుండెను.
సేవకులు,
మంత్రులు
రాముని
దగ్గరకు
వచ్చి,
మీ
ఆజ్ఞ
ప్రకారము,
మునీశ్వరులకు
వర్తమానము
పంపితిమి
అనిరి.
అతడు
వార్తను
గురువుగారికి
తెలిపెను.
ఓ
రామా!
జనకచక్రవర్తికి
వర్తమానము
పంపుము.
వారు
నీ
యజ్ఞమునకు
కుటుంబసమేతముగా
దయ
చేయగలరు
అని
మృదుమధురముగా
వసిష్ఠుడు
తెలిపెను.
ఓ
రామా!
మునీశ్వరులకు,
బ్రాహ్మణులకు,
మహర్షులకు,
శుభలేఖలు
వ్రాయుము
అని
పలికెను.
శ్రీరాముడు
గురువుగారితో
కూడ
అయోధ్యానగరమును
చూచుటకు
బయలుదేరెను.
ఆ
ఇరువురు
అయోధ్యానగర
శృంగారమును
చూచి
సంతోషించిరి.
అంతలో
సేవకులు
దేశదేశములు
పోయి
ఆయా
దేశాధిపతులకు
శ్రీవారి
శుభలేఖల
నందజేసిరి.
ఒక
సేవకుడు
మిథిలాపురమునకు
వెళ్ళెను.
జాంబవంతుడు,
అంగదుడు,
8
▾
Meaning
Keep
సుగ్రీవుడు,
విభీషణుడు,
నలుడు,
నీలుడు
మొదలగు
వానరపుంగవులు
విజయము
చేసిరి.
మునీశ్వరపుంగవులు
గుంపులు
గుంపులుగా
నగరమునకు
వచ్చిరి.
వారలను
యథాన్యాయముగా
సత్కరించి
ఆదరించిరి.
వారికి
తగిన
బసలు
యేర్పాటు
చేసిరి.
విశ్వామిత్రుడు
వచ్చెను.
రాముడు
వారిని
ఆదరించి
సత్కరించెను.
ఆగస్త్యుడు
కూడ
వచ్చెను;
వారలకు
తగిన
వసతులు
యేర్పరచి
యుంచిరి.
దేదీప్యమానముగ
వెలుగుచుండిన
యజ్ఞశాలను
వారు
చూచి
ప్రసన్నులయిరి.
మిథిలాపురమునకు
పోయి
వుండిన
సేవకుని
చూచి
ఆ
నగరవాసులు
సంతసించిరి.
జనక
చక్రవర్తితో
సేవకుడు
విన్నవించెను.
వర్తమానము
జనకుడు
విని
దిగ్గున
లేచి
కూర్చొనెను.
అతని
శరీరము
పులకించెను.
అతని
నేత్రములవెంట
ఆనందబాష్పములు
కారెను.
జనకుడు
ఆ
సేవకుని,
శ్రీవారు
తమ్ములతో
గూడ
క్షేమమా
అని
అడిగెను.
ఓ
నాథా!
ఈ
లేఖ
వలన
సర్వమూ
విశదమగును
అని
వాడు
నమస్కారము
చేసెను.
లేఖను
చక్రవర్తికి
అందించెను.
వాని
కంఠము
గగ్గుటుపోయెను.
మాట
చెప్పలేక
పోయెను.
చక్రవర్తి
యవస్థ
నెవరు
చెప్పగలరు?
రాజనగరులో
జయజయ
శబ్దములు
పుట్టెను.
రాజబంధువులందరూ
ప్రసన్నులైరి.
ఆ
శుభలేఖ
చక్రవర్తి
పలుమారు
చదివెను.
అతడు
సంతోషించి
సేవకుని
పిలిచి
"ఓయీ,
ఈ
శుభ
వర్తమానము
నగరములోనూ,
పురజనులలోనూ,
గ్రామములలోనూ
చాటింపుము.
దశవిధ
వాయిద్యముల
మ్రోయింపుము"
అని
ఆజ్ఞాపించెను.
అంత
మంత్రిని
పిలిచి
అతనికి
శుభలేఖను
ఇచ్చెను.
అతడు
దానిని
గైకొని
నేత్రముల
కద్దుకొని,
వినయ
పూర్వకముగా
దానిని
చదివి
సంతోషించెను.
అతడు
శ్రీరామచంద్రుని
స్మరించి
భక్తి
శ్రద్ధలతో
ఆనందబాష్పములు
రాల్చెను.
నగరములో
ప్రతిగృహమునందును
మంగళకలశములను
నిలబెట్టిరి.
రాజు
అనేక
దానముల
నిచ్చెను.
ఆ
జనకమహారాజు
పట్టణము
సకల
సంతోషములతో
తులతూగుచుండెను.
దేవతలు
జనకచక్రవర్తిని
చూడవచ్చిరా
అన్నట్లు
తోచెను.
జనకుడు
అయోధ్యానగరమునకు
పయనమై
వచ్చెను.
దారిలో
శతానందుని
గృహమును
దర్శించెను.
ఈ
శుభవార్త
తన
గురువునకు
విన్నవించెను.
అతను
కూడా
పరమానందమునొంది,
చతురంగబలసమేతుడవై
శీఘ్రముగా
అయోధ్యను
చేరుకొమ్ము
అని
దీవించెను.
నగరమును
కాపాడుటకై
యోధులను
నియమించి,
ఒక
పల్లకిలో
9
▾
Meaning
Keep
గురువగు
శతానందుడును,
మరొక
పల్లకిలో
జనకచక్రవర్తియు
కూర్చొని
దండుతో
వెడలునపుడు
భూమి
కంపించెను.
ఆ
మహాయోధుల,
అతిరథుల,
మహారథ
శ్రేష్ఠులను
ఎవరు
లెక్కపెట్టగలరు?
ఆది
కూర్మముతో
ఆదిశేషుడు
క్రుంగెను.
ఈ
ప్రకారము
జనకచక్రవర్తి
మునులతో
ప్రయాణము
సాగించి
రెండు
దినములలో
అయోధ్యానగరమును
సమీపించెను.
శ్రీవారు
చక్రవర్తి
ఆగమనమును
విని
వారికి
ఎదురుగా
వెళ్లిరి.
వారు
పరస్పరానురాగములతో
కలిసిరి.
విశాలస్థలములో
వారికొక
కుటీరమును
ఏర్పాటు
గావించి
యుండిరి.
అది
అతిసుందరముగ,
సరయూతీరమున
చక్కని
వనములో
స్వర్గభవనమా
అన్నట్లుండెను.
ఇతర
దేశాధీశులను
సత్కరించుటకు
మువ్వరు
తమ్ములనూ
నియోగించెను.
శ్రీవారు
జనకునివద్దకు
వచ్చిరి.
శ్రీవారు
చక్రవర్తికి
నమస్కరించి
అతని
వద్ద
కూర్చొనిరి.
జనకుడు
పరమానందభరితుడయ్యెను.
అతడు
శ్రీవారి
శిరస్సును
ముద్దాడి
మృదుమధురముగా
ప్రసంగించెను.
శ్రీరాముడు
తగిన
విధముగా
సమాధాన
మొసగెను.
వారి
పరిచర్యలకు
సేనలను
నియమించెను.
తదుపరి
మంత్రిని
భరతుని
పిలిచి
చక్రవర్తిని
సేవించుటకు
భరతుని
నియమించెను.
అంత
పదివేల
శిష్యులతో
కూడి
వసిష్ఠులవారు
రామునివద్దకు
వచ్చెను.
ఓ
రామచంద్రా!
నా
మాట
వినుము.
వేద
పురాణములు,
సకల
శాస్త్రములు
ఘోషించుచున్నవి.
మహాపురుషులు
సహితము
చెప్పుచున్నారు.
ధర్మపత్ని
వినాగా
యజ్ఞము
చేసిననూ
సిద్ధిలేదు.
కనుక
జానకిని
రప్పించుము.
ఆమె
యజ్ఞమున
కావశ్యకము.
ఈ
ప్రకారముగా
మునిరాజు
చెప్పిన
మాటలకు
రాముడు
ఆశ్చర్యపడి
సత్యాసత్యములు
చెప్పక
మౌనము
ధరించి
యూరకుండెను.
"ఓ
మునిరాజా!
నా
ప్రతిజ్ఞకు
భంగము
కలుగకుండా
నా
కులమునకు
అప్రతిష్ట
రాకుండా
మీరు
కార్యమును
నిర్వహింపవలెను.
నేను
రెండవ
వివాహము
చేసుకొనను.
జానకిని
రప్పించుటవలన
అప్రతిష్ట
వచ్చును."
ఆ
ప్రకారము
శ్రీరాముడు
విన్నవించెను.
అపుడు
వసిష్ఠుడు
గొప్ప
గొప్ప
ఋషులను
పరికించి
సంప్రదించెను.
జానకిని
రప్పించక
తప్పదని
అందరునూ
పట్టుపట్టిరి.
అయితే,
సర్వధర్మ
పరాయణుడు,
సర్వదేవతా
స్వరూపుడు,
సర్వశాస్త్రపారంగతుడైన
శ్రీరాముడు
కొంత
యోచించి
రత్నస్థగితమగు
బంగారు
సీతను
నిర్మించవచ్చును.
సర్వ
శాస్త్రములు
దీనిని
10
▾
Meaning
Keep
అంగీకరించును.
ఇందుకు
ఎట్టి
అభ్యంతరము
వుండదని
గట్టిగా
చెప్పెను.
అందుకు
మునులు,
గురువులు,
సర్వజ్ఞులైనవారందరూ
కాదనలేకపోయిరి.
రాముడు
సకలధర్మ
సారస్వరూపుడు.
అతనిని
వంచించగలమా
అని
వారిలో
వారు
ఆశ్చర్యపడి
అందుకు
సమ్మతించిరి.
ఒక
దినములో
సువర్ణసీతను
చేయించి
సర్వాభరణములతో
అలంకరించిరి.
ఆ
రూపమును
చూచి
వచ్చినవారందరు
నిజమగు
సీతయని
భ్రమించిరి.
జానకియే
ఆ
ప్రతిమను
చూచిన
ఆశ్చర్యపడెడిది
అని
వేనొళ్ళ
కొనియాడిరి.
సువర్ణ
సింహాసనముపై
వ్యాఘ్రాజినము
వేసుకొని
శ్రీరాముడు
దానిపై
కూర్చొనెను.
పక్కనే
బంగారు
సీతను
ఉంచుకొనెను
అందరూ
ఆ
దృశ్యముచూచి
సాక్షాత్
సీతయే
వచ్చినదని
ఆశ్చర్యపడిరి.
సభ
అంతయూ
నమస్కరించెను.
వసిష్ఠులవారు
జనబాహుళ్యమునుచూచి
సేవకులను
పిలిచి,
ఓయీ!
సేవకులారా
మీరీ
జనులను
యథావిధముగా
సత్కరింపుడు.
వారు
కోరిన
పదార్థములను
వారికిచ్చి
వారిని
తృప్తిపరచుడని
ఆజ్ఞాపించెను.
గురువాజ్ఞ
ప్రకారము
సేవకులు
శ్రీరామాజ్ఞగైకొని
అనేక
వసతి
గృహములు
నిర్మించి
వారి
వారి
మర్యాదల
ప్రకారము
సభికుల
నుచితాసనములపై
భరతుడు
కూర్చుండ
బెట్టెను.
వారి
వారి
భాగ్యమును,
వారి
వారి
అదృష్టమును
వారే
కొనియాడిరి
ఐదువేల
మహోయోధులు,
ఐదువేల
వేదాధ్యయన
సంపన్నులును
యజ్ఞమును
రక్షించుచుండిరి.
మాఘశుద్ధవిదియనాడు
శ్రీరాముడు
యజ్ఞము
చేయనారంభించెను.
ఆ
దినమున
అతడు
యజ్ఞదీక్షలో
ప్రవేశించెను.
ఓ
రాజా!
యజ్ఞ
పశువు
దెప్పింపుము.
వేదములో
చెప్పబడిన
లక్షణములు
దానికి
కలవో
లేవో
చూడవలయును
అని
వసిష్ఠులవారు
పలికిరి.
గురువుగారి
ఆజ్ఞ
పొంది,
లక్ష్మణుడు
సంతోషించి
వారి
చరణములకు
నమస్కరించి
అత్యుత్సాహముతో
అశ్వశాలలకు
వెళ్లి
యజ్ఞ
పశువును
సింగారించెను.
దాని
వీపునకు
రత్నస్థగితమగు
జీనును
కట్టెను.
నల్లని
చెవులను
శ్వేతవర్ణమును
గల
ఆ
గుర్రమును
చూచి
సూర్యుని
గుర్రము
సహితము
సిగ్గుపడెను.
ఆ
గుర్రమును
స్వయముగా
మన్మథుడు
సింగారించినట్లు
కనబడెను.
దాని
శోభను
వర్ణించుటకు
శక్యముకాదు.
సాక్షాత్
సూర్యనారాయణమూర్తి
రూపమును
ధరించి
వచ్చినట్లు
అశ్వము
ప్రకాశించెను.
నీలమాణిక్యములతో
కూడిన
నెమలి
పింఛమును
దాని
శిరస్సునకు
కట్టిరి.
అంతరిక్షమున
నక్షత్రములవలె
ఆ
పింఛము
తళతళ
11
▾
Meaning
Keep
మెరిసెను.
చతురులగు
సేవకులు
దాని
వెంట
నడిచిరి.
మెరుపువలె
ప్రకాశించుచుండిన
పట్టుత్రాడును
దాని
మెడకు
తగిలించిరి.
ఏడువేల
మహోయోధులు
రణధీరులు,
శూరులు,
అశ్వములపై
నెక్కి
లక్ష్మణునితో
కూడి
శ్రీరాముని
వద్దకు
వచ్చిరి.
దిగ్విజయము
నిమిత్తము
విశ్వామిత్రుడు
చెప్పిన
ప్రకారము
శ్రీరాముడు
దానిని
పూజించెను.
షోడశ
మహాదానముల
నిప్పించెను.
అభిషేకము
చేసి
సువర్ణపట్టమును
వ్రాసెను.
అందులో
ఈ
విధముగా
నుండెను:
"అయోధ్యానగరమున
ఒక
వీరుడు
కలడు.
అతడు
శత్రుసంహారకుడు.
అతనిని
జూచి
దేవేంద్రుడు
సహితము
భయపడెను.
ఈ
గుర్రము
అతని
యజ్ఞ
పశువు.
బలవంతులు
దానిని
పట్టుకొనుదురు
లేక
ఆ
వీరునకు
మీరు
పన్ను
చెల్లింపుడు.
కాదేని
వనమునకు
పొందు"
ఈ
ప్రకారము
శ్రీరాముడు
పట్టమును
వ్రాసి
దాని
ముఖమునకు
కట్టెను!
ఇనవంశోత్తముడగు
శ్రీరాముని
వద్దకు
భార్గవాది
మునులు
వచ్చిరి.
లవణాసురుని
వృత్తాంతమును
వారు
చెప్పిరి.
మహామునులు
ఆ
వృత్తాంతమును
విని
దుఃఖించిరి.
శ్రీరాముడు
వారి
మాటలకు
చింతించెను.
తత్క్షణము
అతడు
తన
తూణీరమును
తెప్పించెను.
అందులో
అమోఘమైన
బాణమును
తీసి
శ్రీరాముడు
శత్రుఘ్నున
కిచ్చెను.
ఓయీ
తమ్ముడా!
నా
మంత్రమును
జదివి.
నీవీ
బాణమును
వానిపై
ప్రయోగింపుము.
సకల
దేశాధిపతులను
జయించి
రమ్ము
అని
ఆశీర్వదించి
పంపెను.
పిమ్మట
శ్రీరాముడు
విభీషణుని
పిలిపించెను.
అతడు
శ్రీహరి
చరణములకు
నమస్కరించెను.
ఓ
విభీషణా!
లవణాసురుని
వృత్తాంతమును
వివరముగా
తెలుపుమని
కోరెను.
అతడు
చేతులు
జోడించుకొని
వివరములు
ఉన్నదున్నట్లు
తెలిపెను.
విభీషణునకు
మారుతల్లి
కలదనియు,
ఆమెకు
ఒక
కుమార్తె
కలదనియును,
ఆమె
పేరు
కుంభీనసయనియూ
ఆమెను
రావణుడు
మధుదానవునకిచ్చి
వివాహము
చేసెననియు,
వాడు
దానిని
పరిగ్రహించె
ననియు
ఆయన
చెప్పెను.
కాలాంతరమున
దాని
గర్భమున
లవణాసురుడు
పుట్టెను.
వాడు
శివునుద్దేశించి
ఘోరమగు
తపము
నాచరించెను.
ఓ
నాథా!
శివుడు
వాని
తపమునకు
మెచ్చి,
వానికొక
త్రిశూలమును
యిచ్చెను.
'ఓయీ,
లవణా
సురుడా!
ఈ
త్రిశూలము
ధరించినవానిని
యుద్ధములో
నోడించుట
దుర్లభము'
అని
శివుడు
దాని
ప్రభావమును
వానితో
చెప్పెను.
వాడు
నాటినుండి
దాని
బలము
వలన
సురాసురులను,
నరనాగులను
లక్ష్యము
చేయక
12
▾
Meaning
Keep
విచ్చలవిడిగా
సంచరించుచున్నాడు.
వాడు
సకల
జీవులను
వెన్నంటి
తరుముచుండెను.
వానిచే
జయింపబడని
జీవులు
లోకములో
గనబడరు.
అని
ఈ
ప్రకారము
విభీషణుడు
చెప్పిన
వృత్తాంతమును
శ్రీరాముడు
విని
నవ్వెను.
రామునకు
తెలియని
దేదియును
లేదు.
అయితే
మాయామానుష
వేషధారియై
ఆ
త్రిశూలమును
తానే
శివరూపములో
అనుగ్రహించినట్టిదని
తనలోతాను
నవ్వుకొని
శత్రుఘ్నుని
ఆదరించి
తన
దివ్యాంశము
అతనిలో
ప్రవేశపెట్టెను.
శ్రీరాముని
ఆజ్ఞ
ప్రకారము
మూడువేల
రణభేరులు
ధణధణమని
మ్రోగెను.
ఆ
శబ్దమును
విని
భూమి
కంపించెను.
గజతురంగములు
ధ్వని
చేసెను.
సైన్యము
శంఖములు
పూరించి
శత్రుఘ్నుని
వెంట
నడిచిరి.
లవణాసురుని
పట్టణమును
ముట్టడించిరి.
సైన్యము
యొక్క
శబ్దములు
విని
లవణాసురుడు
కోపముచే
మండిపడి,
అరువది
వేల
మంది
రాక్షసయోధులతో
గర్జించుచూ
కలియపడెను.
వాడు
అనేక
మాయలను
పన్నిననూ
వాని
సైన్యము
కకావికలమయ్యెను.
కడకు
లవణాసురుని
కొడుకులు
కలియబడిరి.
శత్రుఘ్నుని
కుమారుడైన
సుభాషుడు
యెదుర్కొని
లవణాసురుని
కుమారుల
నిద్దరిని
వీరస్వర్గమున
కంపెను.
కడకు
శత్రుఘ్నుడు
రామనామమును
స్మరించి
రామబాణమును
సంధించి
ప్రయోగించెను.
దానితో
వాడు
వ్యాకులపడి
ప్రాణములను
విడిచిపెట్టెను.
దేవతలు
జయజయధ్వనులు
చేసి
శత్రుఘ్నుని
దీవించిరి.
అంత
శత్రుఘ్నుడు
యమునానదికి
నమస్కరించి,
చతురంగ
సైన్యంతో
ఉత్సాహముగా
వెడలెను.
ఈ
ప్రకారముగా
వారు
నలుదిశలు
గ్రమ్మరిరి.
వాల్మీకి
మహర్షి
నివసించు
ఆశ్రమమున
బొడగాంచిరి.
ఆ
ఆశ్రమములో
జానకి
పుత్రులిరువురూ
సూర్యుని
వంటి
ప్రచండ
పరాక్రమవంతులు
కలరు.
ఆ
పుత్రులు
గుఱ్ఱమును
జూచి
దాని
లలాటమున
నుంచిన
పత్రమును
చదివి
దానిని
బంధించిరి.
తరకసమును
నడుమునకు
కట్టుకొని
ధనుర్బాణములను
ధరించి
వారు
యుద్ధమునకు
సిద్ధముగా
నుండిరి.
ఆ
గుఱ్ఱమును
సంరక్షించుచుండిన
సహస్రవీరులు
కుమారులవద్దకు
వచ్చిరి.
వృక్షముకు
బంధింపబడిన
గుఱ్ఱమును
చూచి
వారా
కుమారులు
బాలకులని
తెలిసికొని
శాంతించిరి.
"ఓ
కుమారులారా!
మీ
తల్లిదండ్రులు
ధన్యులు.
మీరా
గుఱ్ఱమును
విడిచి
మీ
గృహమునకు
పొందు"
అనిరి.
13
▾
Meaning
Keep
"ఓయా
వీరులారా!
యుద్ధమునకు
వచ్చి
భిక్షము
నడుగుట
యుచితమా?
అట్లు
యాచించుటవలన
క్షత్రియ
కులమునకు
మచ్చ
వచ్చును
కదా?"
అని
పిల్లలు
హీనముగా
మాట్లాడుట
చూచి
రక్షకభటులు
"ఓ
శూరులారా!
క్షత్రియ
కులమునకు
మచ్చ
తీసికొనివచ్చుట
మంచిది
కాదు.
జాగ్రత్తగా
చూచి,
మాట్లాడుడు"
అని
వీరవచనములు
పలికిరి.
అందులకు
పిల్లలు
ఫక్కున
నవ్వి
"అయ్యా,
మీ
వంటి
బలహీనులను
గుఱ్ఱమును
సంరక్షించుటకు
పంపినవారెంత
వీరులోకదా!
మీకు
బలము
లేని
యెడల
మీ
గృహములకు
పొందు"
అని
కుశలవులు
పలికిన
కర్ణకఠోరమగు
పలుకులు
యోధులు
విని
వారు
బాలురని
తెలిసియు
వారిని
యెదుర్కొనిరి.
లవుడు
ధనుస్సును
ధరించి
ఆడుచూ
పాడుచూ
బాణపరంపరను
ప్రయోగించి
ఆ
వీరుల
శరీరమును
చిల్లులు
పొడిచెను.
ఆ
శూరులు
నేలపడి
మూర్ఛిల్లిరి.
కొందరు
పరుగున
శత్రుఘ్నుని
కడకు
వచ్చి
"ఓ
మహారాజా!
ఇరువురు
కుమరులు
ముని
బాలకులు
మన
గుఱ్ఱమును
బంధించి
మన
యోధుల
ననేకుల
సంహరించిరి"
అని
మొఱపెట్టుకొనిరి.
ఆ
మాటలకు
శత్రుఘ్నుడు
కోపించి
చతురంగ
బలమును
మోహరించి
కుశలవులపైకి
నడచెను.
అతిరథ
శ్రేష్ఠులగు
కుమారుల
నతడు
చూచి
సిగ్గుపడెను.
ఈ
ఇరువురూ
బాలురు
కదా!
వీరితో
నెట్టు
యుద్ధము
చేయగలను?
అని
చింతించెను.
"ఓ
మునిబాలులారా!
మీరు
గుఱ్ఱమును
విడిచి
గృహములకు
పొందు.
మీరు
పూజనీయులు
కనుక
మీతో
యుద్ధము
చేయరాదు"
అని
శత్రుఘ్నుడు
వారికి
బోధించెను.
"ఓరాజా!
మీ
పేరేమి?
మీ
నగరమేమి!
మీరు
సైన్యముతో
వనమున
నేల
సంచరించుచున్నారు;
యే
కారణము
చేత
మీరీ
గుఱ్ఱమును
విడిచిపెట్టితిరి?
యెందుచేత
దాని
లలాటమునకు
పట్టము
కట్టితిరి?
ఓ
రాజా!
మీకు
బలపౌరుషములు
లేనియెడల
పట్టమును
దీసి
గుఱ్ఱమును
విడిచి
గృహమునకు
పొందు"
అని
ఈ
ప్రకారము
కుశలవులు
పలికిన
సూటిమాటలకు
శత్రుఘ్నుడు
తల
వంచుకొనెను.
శస్త్రాస్త్రముల
కట్టుమని
వీరుల
కాజ్ఞాపించి
అతడు
ముసిముసి
నవ్వులు
నవ్వెను.
"ఆహా!
యెంత
బలవంతుడీ
రాజు!
చప్పట్లకు
సింగము
భయపడునా?"
అని
కుశలవులు
ఫక్కున
నవ్విరి.
గురువగు
వాల్మీకిని
స్మరించి
ధనుర్బాణములను
ధరించిరి.
14
▾
Meaning
Keep
కుశలవులు
శరపరంపరలు
అతని
రథముపై
వర్షించి
అతని
శరీరమునందు
చిల్లులు
పొడిచిరి.
అతని
యోధులు
నేలబడిరి.
మూర్ఛిల్లిరి.
ఆ
కుమారులు
ఒక్కొక్కవీరుని
పిలిచి
వారిని
సంహరించిరి.
కొందరు
పిరికిపందలు
పరుగెత్తుక
శ్రీరాముని
వద్దకు
వెళ్లిరి.
ఆ
వృత్తాంతమును
శ్రీవారికి
విన్నవించిరి.
ఆ
బాలకుల
గుణగణములను
శౌర్యపరాక్రమములను
వర్ణించి
చెప్పిరి.
యుద్ధము
చేయువారు
మునికుమారులు
కారని
శ్రీరామునికి
తెలిసియూ,
గుట్టును
బైటపెట్టక
మునికుమారులనే
భావమును
పైన
ప్రకటించుచూ
ఆ
మునికుమారులతో
యుద్ధము
చేయుట
యెట్లు
అని
చింతించి
"ఓ
వీరులారా!
అయిననూ
చేయక
తప్పదు.
మీరు
లక్ష్మణునితో
యుద్ధమునకు
వెడలుడు"
అని
బలాత్కారముగా
వారలను
పంపెను.
అంతేకాక
ఆ
బాలురను
బంధించి
తీసుకొని
రండు
అనియు
వారు
ముని
కుమారులు
కనుక
యే
విధముగను
వారిని
చంపకూడదనియు
చెప్పెను.
లక్ష్మణుడు
చతురంగ
బలములతో
దండెత్తెను.
అతడు
యుద్ధభూమికి
వచ్చెను.
మూర్ఛపడి
యుండిన
ఆ
యోధులను
చూచెను.
విస్మయపడి
ముని
కుమారులతో
ఇట్లనెను:
"ఓ
బాలులారా!
గృహములకు
పారిపోవుడు.
సూర్యవంశపు
రాజులు
దేవబ్రాహ్మణుల
రక్షించెదరు.
మీరు
బ్రాహ్మణ
కుమారులు,
మీతో
పోరాడుట
మాకు
శ్రేయస్సు
కాదు.
మీరు
నా
కన్నులయెదటనుండి
వెళ్లిపొండు!
మిమ్ములను
చూచిన
నా
శరీరము
క్రోధముచే
మండుచున్నది"
అని
లక్ష్మణుడు
చెప్పిన
మాటలను
కుశలవులు
విని
ఫక్కున
నవ్విరి.
"ఓ
రణధీరుడా!
నీ
తమ్ముని
దురవస్థ
చూచి
నీవు
గృహమునకు
వెడలిపొమ్ము"
అని
పలికిరి.
ఆ
మాటలు
లక్ష్మణుడు
విని
మూర్ఛిల్లి
యుండిన
తమ్ముని
జూచి
ధనుస్సును
సంధించెను.
ఆ
మునికుమారులతో
పోరాడుట
సూర్యకులాచారమునకు
విరుద్ధమని
లక్ష్మణుడు
విచారించి
సంకోచించెను.
"ఓ
బాలులారా!
మీకు
బుద్ధి
లేదు.
మీరు
కేవలము
బాలురు;
మీతో
పోరాటము
వలన
లాభము
లేదు;
కనుక
మీకు
తోడుపడువారిని
తీసికొని
రండు"
అని
లక్ష్మణుడు
చెప్పుచుండిననూ
అతని
మాటలను
లక్ష్యము
చేయక
కుశుడు
తీవ్రబాణమును
ప్రయోగించెను.
ఆ
బాణమునకు
భూమి
కంపించెను.
ఆ
బాణము
అంతరిక్షమున
వ్యాపించెను.
సూర్యబింబము
వెలవెల
15
▾
Meaning
Keep
పోయెను.
కుశలవుల
ప్రతాపమును
సహించలేక
లక్ష్మణుడు
కోపించి
వారినెదుర్కొనెను.
అతడు
రథమును
నిలువబెట్టి,
నిశ్చింతగా
యుద్ధము
చేయనారంభించెను.
కుశలవులు
అతని
బాణములను
ఖండించిరి.
అన్నదమ్ములిరువురూ
అతి
చమత్కారముగా
యుద్ధము
చేయుచుండిరి.
లక్ష్మణుడు
ఒక
గదను
మహావేగముతో
ప్రయోగించెను.
ఆ
గద
తగిలినందున
కుశుడు
వ్యాకులపడెను.
అందుచేత
అతడు
మూర్ఛిల్లెను.
లవుడు
కోపించి,
వచ్చుచుండిన
లక్ష్మణుని
వక్షస్థలముపై
ఒక
బాణమును
ప్రయోగించెను.
ఆ
బాణము
తగిలిననూ
లక్ష్మణుడూ
బలవంతుడు
కనుక
నేలమీద
పడలేదు.
అనంతరము
లవ-లక్ష్మణులు
మల్లయుద్ధముచేసిరి.
వారు
పట్టును
విడువక
సమానముగా
పోరాడిరి.
అనేక
మాయోపాయములచే
ఒకరినొకరు
గ్రుద్దుకొనిరి.
పూర్ణబలమును
చూపించి
వారు
పోరాడిరి.
లవుడు
లక్ష్మణుని
పిడుగువంటి
గ్రుద్దు
గ్రుద్దెను.
లక్ష్మణుడు
శ్రీరాముని
స్మరించి
లవునిపై
ఒక
బాణము
విడచెను.
ఆ
బాణము
తగిలి
లవుడు
మూర్ఛిల్లెను.
కుశుడు
వాల్మీకిని
సీతను
స్మరించి
మూర్ఛనుండి
లేచి
యుద్ధమునకు
వెడలెను.
అతడు
ధనుర్బాణములను
ధరించి
ముందుకు
వచ్చి
లక్ష్మణుని
చూచి
మండిపడెను.
అతడొక
తీవ్రబాణమును
సంధించి
లక్ష్మణునిపై
ప్రయోగించెను.
మేఘనాధునిపై
ప్రయోగించిన
బాణములను
లక్ష్మణుడు
ప్రయోగించిననూ
అవి
కుశలవులకు
తాడు
మాదిరిగా
తోచినవి.
అంత
లక్ష్మణుడు
ఆహా!
ఈ
ఉపద్రవము
సీతా
వియోగము
వలన
సంభవించెను.
నా
శరీరమును
విడిచిపెట్టినగానీ
ఈ
దుఃఖము
పోదు
అని
దుఃఖించెను.
ఆ
సమయమున
వాల్మీకి
ఉపదేశించిన
బ్రహ్మాస్త్రమును
కుశుడు
సంధించెను.
మూడు
లోకములు
గడ
గడ
వణకెను.
దానిని
లక్ష్మణుని
హృదయమునకు
తగులునట్లు
సంధించి
విడచెను.
ఆ
బాణముతో
లక్ష్మణుడు
మూర్ఛిల్లెను.
అంత
దూత
శ్రీరాముని
సమీపించి,
ఈఘోరమైన
వార్తను
తెలిపెను.
భరతుడు
చింతాక్రాంతుడై
చేతులు
జోడించుకొని
"ఓ
నాథా!
సీతను
విడిచిపెట్టినందున
మనము
తగిన
ఫలమును
అనుభవించుచున్నాము"
అని
విచారించెను.
శ్రీరాముడు
తమ్మునితో
"యేమీ?
నీకు
16
▾
Meaning
Keep
యుద్ధము
చేయుట
భయమువేసి
ఈ
విధమైన
నెపమును
పూనితివా?
మంచిది.
అట్లయిన
నేనే
స్వయముగా
యుద్ధమునకు
పోగలను.
నా
రథమును
సిద్ధము
చేయుము.
ఇంతటితో
యజ్ఞము
చాలింపుము!
నేను
వెళ్ళి
ఆ
బాలుర
పూర్వోత్తరమును
విచారింతును.
తమ్ముడా!
నా
పూర్వపు
మిత్రులకును,
సఖులకును
వర్తమానము
పంపుము.
హనుమంతుని
యుద్ధమునకు
తీసుకొని
రమ్ము"
అని
చెప్పి
శ్రీరాముడు
యుద్ధభూమికి
వచ్చెను.
అక్కడ
రక్తపుకాలువను
చూచి
ఆశ్చర్యపడెను.
ఆ
సమయమున
కుశలవులు
మహావీరులు
రణస్థలమునకు
వచ్చిరి.
వారిరువురనూ
చూచి
వానరయోధులు
భయపడిరి.
అప్పుడు
హనుమంతుడు
ధైర్యముతో
"ఓ
బాలులారా!
మీవంటి
బలవంతులగు
కుమారుల
గనిన
తల్లిదండ్రులెవరు?
వారు
ధన్యులు".
ఈ
మాటలకు
కుశలవులు
మండిపడి
అతనితో
"ఓయీ
వానరుడా!
నీకు
శక్తి
లేని
యెడల
వెనుకకు
పొమ్ము,
అధికమాటలు
ఆడకుము"
అనిరి.
ఆ
మాటలకు
భరతుడు
పౌరుషము
తెచ్చుకొని,
"ఓ
వీరులారా!
శస్త్రాస్త్రములు
ప్రయోగింపుడు"
అని
ఆజ్ఞాపించెను.
అంత
వానరులు
వృక్షములు,
పర్వతములు
పట్టుకొని
రువ్విరి.
లవుడొక
బాణమును
ప్రయోగించి
వానిని
చూర్ణము
చేసెను.
కొంతకాలములోనే
రాముని
చతురంగ
బలము
విరిగిపడెను.
రక్తము
ప్రవహించెను.
మహోయోధు
లందరూ
ప్రాణములు
విడచిరి.
కడకు
భరతుని
కూడా
మూర్ఛిల్ల
చేసిరి.
అంత
రాముడు
చతురంగబల
సమేతుడై
రౌద్రాకారుడై
రణరంగమునకు
వచ్చి
కుమారుల
నిరువురనూ
చూచి
బాణములను
ప్రయోగించలేక,
వారిని
రప్పించి
వారితో
"ఓ
బాలులారా!
మీ
తల్లిదండ్రులెవరు?
ఎచ్చట
నివసించెదరు?
మీ
దేశము
పేరేమి?"
అని
అడిగెను.
అప్పుడు
"ఓ
రాజా!
ఈ
మాటలకు
ప్రయోజనమేమి?
మీ
అన్నదమ్ములకు
నలుగురికీ
ఒకే
సంప్రదాయ
మన్నమాట!
ధనుర్బాణములు
సంధించి
యుద్ధము
చేయుము!
వావివరుసలాడుటకు
పెండ్లింటి
విందు
కాదు
కదా
ఇది"
అని
పలికెను.
అప్పుడు
రాముడు,
"బాలకులారా
మీ
దేహములు
అతి
కోమలములు.
మీ
నామములు
వంశములు
తెలుసుకొనినగానీ
నేను
మీతో
పోరాడను"
అని
పలికెను.
"ఓ
రాజా!
మా
తల్లి
జనక
చక్రవర్తి
కూతురు
జానకి,
వాల్మీకి
ముని
మా
పోషకుడు.
17
▾
Meaning
Keep
మా
తండ్రి
పేరునూ,
మా
వంశము
పేరునూ
మాకు
తెలియదు.
మేము
కుశలవులము.
మేము
వనవాసులము"
అని
వారిరువురు
చెప్పిరి.
వారు
తన
కుమారులని
తనకు
మొదలే
తెలిసియుండినప్పటికినీ
ప్రాపంచికముగా
ఇప్పుడు
తెలుసుకొనినటుల
నటించి
"ఓయీ
కుమారులారా!
వెనుకనుండి
నా
సైన్యము
వచ్చును.
వారితో
యుద్ధము
చేయుడు"
అని
వెనుకకు
తిరిగి
మూర్ఛిల్లిన
అంగద,
జాంబవంత,
హనుమంతులను
మూర్ఛనుండి
లేపెను.
ముందుకు
నడవబోవు
దానిని
చాటించుటకై
మూర్ఛిల్లిన
లక్ష్మణ,
భరత,
శత్రుఘ్నులను
మూర్ఛనుండి
లేవదీసెను.
వచ్చిన
సైన్యముతో
"ఓ
సేనలారా!
కీర్తి
మర్యాదల
నిలబెట్టుటకై
యుద్ధము
చేయుడు"
అనెను.
అంత
వెనుకనుండి
ధనుర్బాణములను
పట్టి
సేనలతో
యుద్ధము
చేయుచుండిన
ఆ
బాలురను
జూచి
రాముడు
తనలో
తాను
ఆనందించెను.
ఒకవైపున
వానరవీరులు
యేమియు
చేయజాలక,
వీరలను
జయించువారు
పదునాలుగు
భువనములందునూ
లేరని
వారిలో
వారు
తలంచుచూ
వూరకుండిరి.
ఇంతలో
కుశుడు
రాముని
మీదకు
వెడలెను.
రథములోని
రాముడు
మూర్ఛిల్లెను.
కుశుడు
రథములపై
అశ్వములపై
యున్న
అలంకారములను
తీసికొనెను.
కుశలవులు
హనుమంతుని
బంధించి
వెంటబెట్టుకొని
గృహమునకు
వెడలిరి.
చక్కని
వస్త్రములను,
భూషణములను
ధరించి
వానరభల్లూకములను
వెంటబెట్టుకుని
గుఱ్ఱముతో
కూడి
కుశలవులు
జానకిని
సమీపించి
ఆమెకు
నమస్కరించిరి.
తెచ్చినవాటిని
కానుకగా
సమర్పించిరి.
వానరులను
భూషణములను
జానకి
చూసి
దిగ్భ్రాంతి
జెందెను.
Previous
←
The Coronation of Śrī Rāma
Next
The Avatāra's Drama Concludes
→