Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 1
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
1
భక్తుడు:
స్వామి! ఆధ్యాత్మిక మార్గమున మాకు తెలియనట్టి విషయము లేవైనా ఉండిన తమరిని అడుగవచ్చునా?
2
▾
Meaning
Keep
స్వామి:
అభ్యంతరమేమి?
నేనున్నదెందులకు?
మీకు
తెలియని
విషయములను
విఫులముగా
అందించుటకే
కదా!
ఆనందముగా
అడుగవచ్చును.
శ్రద్ధతో
అడిగి
తెలిసికొనువారుండవలెను
కాని,
చెప్పుటకు
నేనెప్పటికిని
సిద్ధమే.
3
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
కొంతమంది
పెద్దలు
గురువునకు
అడ్డు
ప్రశ్నలు
వేయరాదు
అనుచుందురే!
అది
తప్పా,
సరియా?
4
▾
Meaning
Keep
స్వామి:
అది
పొరపాటు,
శిష్యుడు
గురువుని
తప్ప
మరెవ్వరిని
ఆశ్రయించును?
తన
సర్వస్వమూ
గురుడే
కనుక,
సర్వ
విషయములను
గురునితో
ఆలోచించి
చేయుట
మంచిది.
5
▾
Meaning
Keep
భక్తుడు:
పెద్దలు
చెప్పునవి
శిరసావహించి
చేయవలెనే
కాని,
ప్రశ్నించుట
తప్పని
కొందరు
చెప్పుచుందురే!
ఆ
విషయమున
తమ
అభిప్రాయమేమి?
6
▾
Meaning
Keep
స్వామి:
అట్టి
పెద్దలయందు
సంపూర్ణ
విశ్వాసము,
వారి
వాక్కులందలి
సత్యమును
నీవు
తెలిసికొనువరకూ
ఆజ్ఞను
శిరసావహించి
నడచుట
నీచేతకాని
పని.
అట్టి
తరుణమున
ఆజ్ఞకు
సరియైన
సారమేదని
అడుగుట
తప్పు
కాదు.
7
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
లోకమున
ఎవరిని
నమ్ముట?
ఎవరిని
వదులుట?
అంతా
మోసముగానున్నదే,
ఎవరు
మంచివారని
నమ్ముదుమో
వారే
చెడ్డగానున్న,
నమ్మకమెట్లు
వచ్చును?
8
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
ఈ
లోకమున
కాని
పరలోకమున
కాని
పరులను
నమ్మవలసిన
అవసరమేమి?
మొదట
నిన్ను
నీవు
నమ్ము.
ఈ
రెండు
నమ్మకములు
నిండుగా
నున్న
లోకము
మంచి
చెడ్డలే
నీకు
స్మరణకు
రావలసిన
అవసరము
లేదు.
9
▾
Meaning
Keep
భక్తుడు:
ఒక్కొక్క
సమయమందు
పరమాత్మునియందు
కూడా
నమ్మకము
సన్నగిల్లును.
దీనికి
కారణమేమి?
10
▾
Meaning
Keep
స్వామి:
కేవలము
బాహ్యసంబంధమైన
వ్యామోహములను
కాంక్షించి
అట్టి
వాటిలో
అపజయమైన,
పరమాత్మునిపైన
నమ్మకము
సన్నగిల్లును.
అట్టి
కోర్కెలు
వదలి
ఒక్క
ఆత్మ
సంబంధమునే
ఆశించిన
అట్టి
అవమాన
అవస్థలకు
గురికావు.
పరమాత్ముడన్న
గాఢమైన
విశ్వాసమే
ప్రధానము.
అది
లేకున్న
చీటికి
మాటికి
సందేహమే.
11
▾
Meaning
Keep
భక్తుడు:
అట్టి
పరమాత్మ
నిజమైన
తత్త్వాన్ని
తెలిసికొనునంతవరకు
పెద్దల
సాంగత్యము
ప్రధానమనియూ
దానికే
గురువు
కావలెననియూ
అందురే,
అట్లు
అవసరమా?
12
▾
Meaning
Keep
స్వామి:
పెద్దల
సాంగత్యము
తప్పక
అవసరము.
అట్టి
తత్త్వమును
తెలుపుటకు
గురువుకూడా
ముఖ్యమే.
అయితే
ఈ
విషయమందు
మాత్రము
చాలా
జాగ్రత్తగా
మెలగవలెను.
ఇప్పటి
కాలమున
నిజమైన
గురువులు
అరుదు.
బాధగురువులు
అధికమై
బోధగురువులు
ఏకాంతవాసులై
వారివారి
సార్థకతకు
వారు
ప్రయత్నించుచున్నారు.
లోకమున
సరియైన
గురువులుకూడా
అనేకులున్నారు.
అయితే
వారు
సులభముగా
దొరుకువారు
కారు.
దొరికినను
వారివారి
ప్రాప్తికొలది
ఏదో
ఒక
ముక్క
సద్వాక్యము
తెలుపుదురే
కాని
లేనిపోని
కథలు
చెప్పుతూ
కాలహరణము
చేయరు.
కాన
గురువును
వెదుకుటలో
తొందరపడకూడదు.
13
▾
Meaning
Keep
భక్తుడు:
అట్లయిన
లోకమున
మార్గమెట్లు?
14
▾
Meaning
Keep
స్వామి:
దానికొరకే
వేదశాస్త్రపురాణేతిహాసముల
పఠించుచు
అనుభవజ్ఞానుల
మార్గమును
అవలంబించుచు,
వాటి
అర్థభావములు
పండితుల
చెంత
తెలిసికొని
వాటిని
ఆచరణలో
పెట్టి
పరమాత్ముడే
గురువు
దైవమని
ధ్యానించుచుండిన
ఆ
గ్రంథములే
నీకు
గురువుగా
తోడ్పడును.
దేని
ఆధారమున
మనస్సు
భగవంతునిపై
లగ్నమగునో
అదే
నీ
గురువు.
గురువుగా
భావించి
పరమాత్మయందు
గాఢమైన
ప్రేమను
ఉంచి
నీకు
సాధన
సల్పుచుండిన
పరమాత్మయే
సద్గురువుగా
నీకు
సాక్షాత్కరించి
ఉపదేశించును.
లేక
నీ
సాధనా
తత్ఫలమువల్ల
సద్గురువే
నీకు
తటస్థించునట్లు
అనుగ్రహించును.
15
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఇప్పుడు
కొంతమంది
గొప్ప
గొప్ప
మహనీయులు
అడిగిన
వారికందరికి
ఉపదేశము
ప్రసాదించుచున్నారే!
వారు
సద్గురువులు
కారా?
16
▾
Meaning
Keep
స్వామి:
వారు
అవునూ
కాదూ
అని
మాత్రము
నేను
చెప్పను.
అంత
సులభముగా
ముందు
వెనుకలు
యోచించక
శిష్యునియొక్క
యోగ్యతలను
గుర్తించక
ఇందుకు
అర్హుడా
కాదాయని
పరీక్షించక
మూడునాళ్ళ
ముచ్చటకై
గురువా
అని
వచ్చిన
తక్షణమే
మురిసి
ఉపదేశించుట
సద్గురువు
లక్షణము
కాదని
మాత్రము
గట్టిగా
తెలుపుదును.
17
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
స్వామి!
నేనొక
పొరబాటు
చేసితిని,
ఎవరో
ఒక
మహనీయుడు
మా
గ్రామమునకు
రాగా
అందరూ
ఉపదేశము
తీసుకొనుచుండగా
నేను
కూడా
పోయి
నమస్కరించి
నాకేమైనా
ఉపదేశము
చేయమని
అడిగితిని.
అపుడు
ఆ
మహనీయుడు
నాకు
ఒక
మంచి
ఉపదేశముచేసెను.
దానిని
నేను
స్మరించుచుంటిని.
కొంత
కాలమునకు
అతని
మహత్మ్యము
బూటకమని
తెలిసెను.
ఆనాటినుంచీ
నాకా
నామముపై
విశ్వాసముపోయి,
మంత్రమును
వదలితిని.
అది
తప్పా?
సరియా?
18
▾
Meaning
Keep
స్వామి:
తప్పా
అని
యోచింతువా?
ముమ్మాటికీ
తప్పు.
నీవు
ఉపదేశము
తీసికొనుటకు
మునుపు,
పైన
చెప్పిన
రీతిగా
గురుడు
శిష్యుని
యోగ్యతలు
అర్హతలు
ఎంత
యోచించవలెనో
శిష్యుడు
కూడా
మొదట
గురువు
యొక్క
యోగ్యతలను
ప్రవర్తనలను
ఘనతను
విచారించవలెను.
అట్లు
యోచించక
తొందరపడి
ఉపదేశములను
తీసికొనుట
మొదటి
తప్పు.
పోనీ
గురువునకు
అంతటి
యోగ్యత
లేక
ఇచ్చిననూ
నా
యోగ్యతవల్లనైనా
పరమాత్మ
నామమును
తీసుకొన్నందుకు
నా
ప్రమాణమైనా
నేను
వదలకూడదను
దీక్షను
కూడా
పాడుచేసుకొని
పరుల
తప్పును
పవిత్ర
నామముపై
మోపి
పరమాత్మ
నామము
వదలుట
రెండవ
తప్పు.
ఉపదేశమును
పొందుటకు
ముందు
నీకు
కావలసినంత
కాలము
తీసికొని
వారియందు
సత్యము,
సరియైన
నమ్మకము
కుదిరిన
తరువాత,
నీ
మనస్సుకు
ఇష్టపడిన
తీసుకోవలెను.
ఒక్కతూరి
తీసుకొంటివా
దానివలన
ఎట్టి
అవాంతరములు
వచ్చినను
విడువక
స్మరించుము.
అందులోని
దోషములు,
పాపములు
నీ
కంటవు.
అట్లు
కాక,
తొందరపడి
తీసుకొని
వదలిన
తప్పు
నీ
మూపున
నుంచుకొనుటే
కాక
నీవుమాత్రము
ఉత్తముడవని
నేనెట్లందును?
ఇష్టము
లేకున్ననూ,
లేక
ఏ
ఇతర
అనుమానములు
నీ
మనసున
ఉన్ననూ
నీకు
ఇష్టములేని
నామము
తీసుకొనరాదు.
తీసుకొన్న
తరువాత
విడువరాదు.
19
▾
Meaning
Keep
భక్తుడు:
అట్లు
వదలిన
ఏమగును?
20
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
గురుద్రోహమువల్ల,
“భగవన్నామ
విసర్జనవల్ల
ఏమగును?”
అన్న,
“మొదలు
చెడిన
ఊడ
మొదలు
బట్టనిచ్చునా”
అన్నట్లు,
నీ
ఏకాగ్రత
అనే
అంకురము
ఎట్లు
అభివృద్ధి
అవును?
21
▾
Meaning
Keep
భక్తుడు:
అట్టి
యోగ్యత
మాకు
లేకున్నను
గురువే
ప్రసాదించిన?
22
▾
Meaning
Keep
స్వామి:
అట్టి
గురువు
గురువు
కాదు.
ఆ
తప్పిదము,
ఫలము
నీపై
రాదు.
వాటికి
సంబంధించిన
దోషములు
గురువునకే
చేరియుండును.
23
▾
Meaning
Keep
భక్తుడు:
శిష్యుడు
గురువునకు
ఇచ్చిన
మాట
ప్రకారము
నడచుకొంటూ,
గురువు
ఎట్టివాడైనా
శిష్యుని
భావము
మారక,
గురుని
యథా
రీతిగా
గౌరవించుచున్న
శిష్యుడు
ధన్యుడు
కాగలడా?
24
▾
Meaning
Keep
స్వామి:
తప్పక.
దానికి
సందేహమేమి?
ఏకలవ్యుని
కథ
తెలియునా?
ద్రోణాచార్యులు
శిష్యునిగా
స్వీకరించకుండిననూ,
అతడు
గురు
భావముతో
గురువు
ప్రతిమనే
సాకారముగా
భావించి
సర్వ
విద్యలు
సాధించెను.
కడకు
గురువు
అన్యాయమునకు
పాల్పడి,
గురుదక్షిణగా
కుడిచేతి
బొటనవ్రేలడిగిననూ
మారుపల్కక
తత్క్షణమే
గురుదక్షిణగా
నొసంగెను.
గురువుయొక్క
ద్రోహమును
ఏకలవ్యుడు
తలంచెనా?
25
▾
Meaning
Keep
భక్తుడు:
ఇచ్చి
ఏమి
ప్రయోజనము?
తాను
విద్యాభంగుడయ్యె
కదా?
ఎంత
సాధించి
ఏమి
ఫలము?
26
▾
Meaning
Keep
స్వామి:
విద్యను
ప్రయోగించ
వీలులేకపోయెనేకాని,
విద్యను
గ్రహించునట్టి
సద్గుణము
ఏనాటికీ
భంగము
కాలేదు,
అట్టి
ఉత్తమ
సుగుణము
యొక్క
ప్రఖ్యాతియే
తన
దీక్షకు
సాక్షి.
చాలదా?
27
▾
Meaning
Keep
భక్తుడు:
ఐతే
గడచినది
గడచిపోయినది.
ఇంకనైనా
పట్టువిడువక
సాధింతును.
తమరేదైనా
ఒకటి
ఉపదేశించండి.
28
▾
Meaning
Keep
స్వామి:
రాత్రి
అంతా
రామాయణముచూచి
తెల్లవారగనే
సీతమ్మవారు
రాములకు
ఏమవుదురు
అన్నట్లున్నది
నీ
ధోరణి.
నీ
ప్రాప్తి,
నీ
యోగ్యత
పరిపక్వదశకు
వచ్చినపుడు
ఉపదేశములు
తమంతట
తామే
ప్రాప్తించును.
నీవు
అడుగనవసరము
లేదు,
న్యాయముగా
యోచించిన
శిష్యుడు
తనకు
తాను
ఉపదేశించమని
కోరరాదు.
ఎందుకన,
తన
యోగ్యతయూ,
తన
నిగ్రతయూ
తనకు
తెలియవు.
అది
గమనించి
నీముందు
జీవితపు
భద్రతను,
మనస్థైర్యమును
యోచించి
గురువే
ప్రసాదించును.
రెండు
మూడు
పర్యాయములు
ఉపదేశించుకొనరాదు.
ఉపదేశము
ఒక్కటే
కాని
రెండు
కావు.
అట్లుకాక
ఇష్టమొచ్చినపుడంతయూ
ఒకటి
వదలి
మరొక
నామము
ఉపదేశము
చేయించుకొనుచుండిన
అట్టి
వారి
స్థితి
దారి
తప్పిన
గృహస్థురాలిని
పోలియుండును.
29
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఇపుడు
నాగతి
ఏమి?
ఇంక
విమోచనమే
లేదా?
30
▾
Meaning
Keep
స్వామి:
చేసిన
తప్పిదములకు
పశ్చాత్తాపము
పడి,
భక్తి
శ్రద్ధలతో
మొదట
ఉపదేశించిన
నామముననే
ధ్యానించు.
స్మరణకు
ఎన్ని
నామములు
రుచి
అగునో
అన్ని
నామములు
స్మరించు.
ధ్యానమునందు
ఉపదేశ
నామము
మాత్రమే
ధ్యానించవలెను.
ఎట్టి
సమయమందైనా
ఆ
పవిత్రనామమును
మార్చరాదు.
ఈ
రీతిగా
హృదయపూర్వకమైన
ఆవేదనతో
పట్టు
విడువక
సాధించు.
ధన్యుడవు
కాగలవు.
31
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
నేడు
చాలా
సుదినము,
నాలోఉన్న
సందేహములన్నియు
పారిపోవునట్లు
చేసినది
తామిచ్చిన
సందేశమే.
అదియే
నాకుపదేశము.
ఇంతకంటే
వేరు
ఉపదేశమెందుకు?
తాము
చెప్పినట్లుగా
ఉపదేశము
వల్లనే
సందేహనాశనము.
నమస్కారము.
సెలవిచ్చిన
ఊరికిపోయి
తిరిగి
మరేమైనా
కొన్ని
కొన్ని
క్రొత్త
సందేహములు
వెంటబెట్టుకొని
వచ్చెదను.
వాటిని
తమచెంత
వదలి,
సంతోషమును
నావెంట
తీసుకొని
వెళ్ళుదును.
ఆజ్ఞ
అయిన
తిరిగి
వచ్చే
నెలలో
వచ్చెదను.
32
▾
Meaning
Keep
స్వామి:
మంచిది
నాయనా!
మీబోటివారు
ఇట్టి
సందేహములు
పొట్టలో
పెట్టుకొని
బాధపడక
వాని
యథార్థమును
తెలిసికొని
సత్యానికి
చోటిచ్చు
సందేశముల
నందుకొని,
సంతోషముగా
సర్వేశ్వరుని,
స్మరణ
చేయుచుండిన
అంతకంటే
నాకు
వేరేమి
కావలయును?
సందేహములు
ఎప్పుడు
వచ్చినా,
ఎట్టివి
వచ్చినా
తప్పక
వచ్చి
బాధనుండి
తప్పించుకొను
ఉపాయమును
తెలిసికొని
పొమ్ము.
నీలో
నీవు
బాధ
పడవద్దు,
అట్టి
బాధతో
ఎంత
సాధన
చేసిననూ
అది
బూడిదలో
పోసిన
పన్నీరువలె
నిస్సారమైపోవును.
మంచిది.
వెళ్ళిరా!
Next
Prabodha 2
→