Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 2
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
2
భక్తుడు:
నమస్తే స్వామి
2
▾
Meaning
Keep
స్వామి:
శుభమస్తు
నాయనా!
3
▾
Meaning
Keep
భక్తుడు:
మీ
దయ
ఉన్న
అన్నియు
శుభమే.
అది
లేకున్న
అశుభమే.
4
▾
Meaning
Keep
స్వామి:
భేష్,
శుభాశుభములు
రెండూ
ఒక్క
దయయందు
ఎట్లు
ఇమిడి
యున్నవో
తెలయునా?
అట్లే
ప్రతి
విషయము
నందునూ
రెండు
రెండు
ఇమిడియున్నవి.
పోనీ,
ఆ
విషయము
నిలిపి
గడచిన
సారథి
బుఱ్ఱకథ
తెచ్చి
నీబుఱ్ఱకు
కదలించెనే,
ఆ
కదలికకు
నీ
బుఱ్ఱ
ఏ
స్థితిలో
ఉన్నది
ఇప్పుడు?
5
▾
Meaning
Keep
భక్తుడు:
అబ్బా!
అబ్బా!
ప్రతివిషయము
పూసగ్రుచ్చినట్లు
అంతా
వట్టి
తోలుబొమ్మ
ఆటగనే
తోచినది.
అంతా
యథార్థమే,
అన్నీ
తెలిసియూ,
అనుభవించియూ
తిరిగి
ఈ
మనసు
మరచి
వానికై
భ్రమించుచుండును
ఇది
యేమి
విచిత్రము
స్వామి!
6
▾
Meaning
Keep
స్వామి:
నాయనా!
మనస్సు
అనేకమైన
వృత్తులతో
కూడినది.
అది
ఎల్లప్పుడూ
వాసనలబట్టి
పోవుచుండును.
అది
దాని
నైజము.
7
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
దానిని
తప్పించ
వీలే
కాదన్నమాట.
అట్లయిన
ఇంక
మార్గము?
కడకు
దీని
వాసనలలోనే
మునిగి
క్రుంగవలసినదేనా
స్వామి?
8
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా,
మార్గము
లేకేమి?
అందులోనే
మునిగి
క్రుంగవలసిన
అవసరములేదు.
దానికి
నైజగుణమున్ననూ
దానిని
మార్చు
కొనవచ్చును.
బొగ్గుకు
దాని
నైజగుణము
దానిలో
చేరిన
నలుపే.
అయితే
అంతేయని
తలంచరాదు.
అందులో
అగ్ని
ప్రవేశింపగనే
ఎఱ్ఱగా
మారును.
అట్లే
మనసు
ఎల్లప్పుడూ
అంధకారమైన
వ్యామోహములలో
సంచరించుచున్నను,
దానిలో
భగవదనుగ్రహముచే
జ్ఞానాగ్ని
చేరిన,
దాని
నైజగుణము
మారి
భగవత్సంబంధమైన
సాత్త్విక
గుణము
వచ్చును.
9
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
అంతఃకరణమని
అందురే,
అది
ఏమి?
10
▾
Meaning
Keep
స్వామి:
మనసును
కూడా
అట్లు
పిలుతురు.
అసలు
అర్థము
కరణములనగా
ఇంద్రియములు,
అంతఃకరణములు
అనగా
లోపలి
ఇంద్రియములు.
11
▾
Meaning
Keep
భక్తుడు:
లోపలి
ఇంద్రియములు,
బాహ్య
ఇంద్రియములు
అని
రెండా?
12
▾
Meaning
Keep
స్వామి:
అవును
మరి,
బాహ్యేంద్రియములనే
కర్మేంద్రియములనియు,
లోపలి
ఇంద్రియములనే
జ్ఞానేంద్రియములనియు
అంటారు.
13
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి,
కర్మేంద్రియములేవో,
జ్ఞానేంద్రియములేవో
సెలవియ్యండి.
14
▾
Meaning
Keep
స్వామి:
నాయనా!
శారీరకంగా
చేయు
ప్రతికార్యమూ
కర్మేంద్రియ
సంబంధమే.
ఇట్టి
కర్మేంద్రియములైదు.
అంతర్ముఖముగా
జ్ఞానము
స్వీకరించు
వానికి
జ్ఞానేంద్రియములనిపేరు.
అవియే
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధములని
ఐదు.
ఈ
రెండిటినీ
చేర్చి
దశేంద్రియములని
పిలుతురు.
15
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఇవి
రెండూ
చేరి
చేయు
పనేమి?
ఇవి
చేయు
పనికీ,
మనసుకూ
సంబంధమేమి?
16
▾
Meaning
Keep
స్వామి:
నాయనా!
అసలు
ఇవి
ఏ
కార్యము
చేసినను,
మనస్సంబంధము
లేక
ఏమీ
చేయలేవు.
కర్మేంద్రియములు
ప్రపంచమందలి
కర్మల
నాచరించి,
వాని
మూలమున
జ్ఞానమును
స్వీకరించును,
జ్ఞానేంద్రియములు
మంచి
చెడ్డల
వివేకమును
వేర్పరచి,
మనసు
ద్వారా
ఆ
ఆత్మకు
అందించుచున్నవి.
అసలు
మనస్సేలేకున్న
ఆత్మకు
ఇవి
అందుటెట్లు?
మనము,
ఒక
ప్రవాహమును
ఇవతలి
ఒడ్డు
నుంచి
అవలి
యొడ్డుకు
దాటవలెనన్న
పడవ,
తెప్ప
నెట్లు
ఆధారముగా
తీసికొనిపోదుమో
అట్లే
ప్రకృతి
సంబంధమైన
కర్మ
జ్ఞానేంద్రియములు,
అవలి
ఒడ్డు
అయిన
ఆత్మను
చేరవలెనన్న
మనస్సుకు
బోటును
తోడుపాటుగా
స్వీకరించవలెను.
లేకున్న
చేర
వీలుకాదు.
17
▾
Meaning
Keep
భక్తుడు:
అట్లయిన
ఇంక
బుద్ధి,
చిత్తము
అందురే,
అవి
ఎక్కడ
ఉండును.
18
▾
Meaning
Keep
స్వామి:
అవీ
ఇందులోనే
ఉన్నవి.
జ్ఞానేంద్రియ
కర్మేంద్రియములు
రెండు
చేరిన
వానిని
దశేంద్రియములని
అందురు.
ఆ
దశేంద్రియములలో
నాలుగు
వేరు
చేసి
అంతశ్చతుష్టయ
ఇంద్రియములని
పిలుతురు.
ఆ
నాలుగే
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము.
19
▾
Meaning
Keep
భక్తుడు:
బాగుంది.
అన్ని
అందులోనే
ఉన్నాయన్నమాట.
జీవితము
తమాషాగా
ఉందే,
అయితే
స్వామి!
ఇవి
చేసే
పనులేమి?
20
▾
Meaning
Keep
స్వామి:
మనసు
వస్తువును
గ్రహించును.
బుద్ధి,
సంకల్ప
వికల్పములను
పరిశీలించును.
చిత్తము
వాని
మూలమున
తన
యథార్థమును
తెలిసికొనును.
అహంకారము
సంకల్ప
వికల్పముల
మార్చుచు
జ్ఞానమును
జారవిడచుకొనుచుండును.
ఇవే
వీని
పనులు.
21
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
స్వామి,
తెలియక
అడుగుదును.
ఇవి
దేహములో
ఎక్కడెక్కడ
నివాసము
చేయును?
22
▾
Meaning
Keep
స్వామి:
సరి.
సంతోషము,
మనసు
కోటరములో,
బుద్ధి
వాక్కులో,
చిత్తము
నాభిలో,
అహంకారము
హృదయములో
నివాసము
చేయును.
23
▾
Meaning
Keep
భక్తుడు:
భలే!
బాగుంది.
అయితే
ముఖ్యముగా
బుద్ధి.
అహంకారము
సరియైన
స్థలములో
ఉన్నవి.
ఇవే
ఈ
లోకమున
కష్టనష్టములకు
కారణమగుచున్నవి.
కాన
తమ
మాటను
పట్టి
చూస్తే
ఈ
రెండు
స్థలములు
చక్కచేసికొన్న,
కష్టనష్టములుండవన్నమాట.
24
▾
Meaning
Keep
స్వామి:
చక్కగ
గమనించావు.
అదే
సరియైనది.
మొదట
వాక్కును
సరిగా
ఉపయోగించిన,
నీ
బుద్ధి
సరియైన
మార్గమున
నడచుచున్నదని
గుర్తు.
అహంకారమును
అణగద్రొక్కి
దానిని
నీలో
చేర్చుకొన్న,
హృదయము
బాగున్నదని
గుర్తు.
కాన
ఈ
రెండింటియందు
జాగ్రత్త
వహించితినేని
మనశ్చిత్తములు
మంచి
వృత్తులలో
ఉండును.
అప్పుడు
ఏ
బాధలు,
కష్టములు
కలుగవు.
రావు.
25
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఇందు
“నేను”
అనునది
ఎవరు?
వీనిని
అనుభవించునది
ఎవరు?
26
▾
Meaning
Keep
స్వామి:
సరియైన
స్థానానికి
వస్తివి.
ఇందులో
ఏవియూ
నీవు
కాదు
ఇవి
అన్నియూ
శరీరము
నాది
అని
ఉన్నంతవరకు
ఉండునవే;
కొన్ని
వృత్తులలో
చేరినవి.
వీనినన్నింటిని
ఆలకించుచున్న,
ఆత్మవే
నీవు.
ఈ
వృత్తుల
సుఖదుఃఖములు,
పాపపుణ్యములు,
కష్టనష్టములు
కేవలము
దేహ
సంబంధ
మాత్రమేకాని
నీకు
లేవు;
రావు.
నీవు
ఆత్మవు,
ఈ
యథార్థమును
తెలియనంతవరకు
నాది,
నేను
అను
వ్యామోహమున
నిద్రించుచుందురు.
ఆ
నిద్రలో
కష్టము,
నష్టము,
దుఃఖము
నీవు
తలంచవు;
అనుభవించవు.
అట్లే
వ్యామోహమును
వదలుకొని,
జ్ఞానమున
మేల్కొనగానే
ఇవి
అన్నియు
నేను
కాదు:
ఆత్మనే
నేనని
దృఢముగా
తెలియును.
27
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
స్వామి,
ఈ
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము,
ఎవరి
నిమిత్తమై
ఇన్ని
కార్యములు
చేయుచున్నవి?
28
▾
Meaning
Keep
స్వామి:
ఒకరి
నిమిత్తమేమి
కాదు.
వాని
నిమిత్తమవి
చేయుచున్నవి.
అన్ని
ఆలకించునట్టి
ఆత్మయొక్క
నీడ
అయిన
జీవి,
వీని
అన్నిటి
కార్యములు
నావే
అని
ధరించిన
శరీరబంధముతో
వ్యామోహించి
ఇన్ని
నాటకము
లాడును.
Previous
←
Prabodha 1
Next
Prabodha 3
→