Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Letters of Sri Sathya Sai Baba · Who Am I? Yours
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఓంశ్రీసాయిరాం
మదరాసు,
15-11-54.
నాయనా!
అందుకో
ఆశీర్వచనములు!
అంపుచున్నాను
ఆనందములు,
అందమైన
ఈ
అలలలో
ఆటలాడుకో,
ఆత్మను
తెలుసుకో,
సూత్రము
పట్టుకో,
క్షేత్రము
చేరుకో.
నాయనా!
నీవు
ఈలోపల
వచ్చి,
నీ
తల్లిని
దర్శింప
నెంతయో
ప్రయత్నించి
విఫలమైన
మనస్సుతో
రాత్రి
నా
సన్నిధిలో
చేరి,
చాలా
నిరుత్సాహముగా
నిల్చుకొనుటవల్ల,
నేనీకమ్మను,
దాని
ఎదుటనే,
తన
నివాసమైన
నీ
కాయమునకు
వ్రాయుచున్నాను.
ఇది,
అనగా
ఈ
జాబు,
అచ్చటికి
వచ్చి
చేరునప్పటికి,
ఈ
మొరపెట్టిన
మనస్సుకూడ
నీ
చెంత
జేరవచ్చును.
నాయనా!
నేను
ఏ
అశాంతియు
లేక
ఆనందముగా
ఆటంకము
లేక
ఆకాశము
వలె
నున్నప్పటికిని,
అందులో
సూర్యచంద్రులను
భక్తి
ప్రేమలు
లేకున్న
ఆకాశమునకు
అందమా?
చందమా?
రెండును
రావు,
లేవు.
అందులో
ఏ
ఒక్కటి
వుండిననూ
పరవాలేదు.
మీలోని
ప్రేమయో
భక్తియో
ఈ
ఆకాశరాయనిపై
నిల్పకున్న,
కళ
లేదు.
ఆ
కళనే
నేను
ఆశించి
ఆనందించు
వస్తువు.
దానికిని
తల్లి
అనుగ్రహము
ఉండవలెనుగదా
అందువేమో?
నిజమే,
చంద్రుడు
పుట్టినను,
ఆ
చంద్రుని
కిరణముల
వెలుతురు
ఆధారముతోనే
అదే
చంద్రుని
చూడవలెనుగాని,
వేరు
వెల్తురు
అందుకు
ఆధారము
కాదు.
అట్లే,
స్వామి
అనుగ్రహము
నందవలెనన్న,
అనుగ్రహ
కిరణములతోనే
అనుగ్రహము
పొందవలెను.
నాయనా!
ఎల్లప్పుడు
నీటిలోని
బుడగవలె,
నీలోనుండి
సాయిరాం,
సాయి,
తాయి
అను
శబ్దములతో
బుడకలిడుచున్న
నేను,
మీకెంత
దూరములోనున్నానో
తెలిసికో.
నా
జాబు
రాలేదని
తలచితివా?
జాలి
ఎవరిది?
అది
లేని
జాబులెందుకు?
అన్నింటికి
మించిన
జాలి
మీ
పాలనే
యుండ,
జాబుల
ఆలస్యమునకు
జంకకు.
నేనెవరు?
నీవాడ.
నాది
ఏది?
మీరే!
నా
నివాసమెక్కడ?
మీ
హృదయ
పీఠము!
నా
చూపెక్కడ?
అన్ని
వైపులను!
నా
పని
ఏమి?
భక్తుల
భుక్తిముక్తులయందు
సాయపడి
సాక్షాత్కారము
నొసగుట!
సన్నిధిని
జూపుట!
మీ
జన్మము
సార్థకము
సేయుటకే!
బంగారూ!
మీరే
బంగారమైనప్పుడు
నేనేమైయుందునో
మీకే
ఎఱుక!
ఈ
సాకారపు
సాయిబాబా,
రేపటి
సాయంత్రము
బయలుదేరి
బెంగుళూరు
పోయి,
అటనుండి
పర్తికి
తే18కి
చేరును.
తే
23
దీ
మీ
బుట్టతల
బూచియైన
చిట్టిసాయి
చిలిపిది
పుట్టిన
పండుగ.
గట్టి
మణులను
పట్టుకో,
పుట్టుచున్నది
నీ
హృదయ
భూమిపై!
బాబా.
Next
To the Newly Married Couple
→