Contents
Premālaya
The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Letters of Sri Sathya Sai Baba · To the Newly Married Couple
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఓంశ్రీసాయిరాం.
అందుకోండి
ఆశీర్వాదములు!
జడ
చైతన్యముగానుండిన
శివశక్తులు
నేటి
దినము
ఏకమై,
నిత్యమై,
సత్యమై,
సర్వసంతోష,
సౌఖ్యముల
సాన్నిధ్యమున
జేరి,
అన్యోన్య
అనురాగ
ఆనందముల
అలలపై
ఆడిపాడుచూ,
ఉత్సాహ,
ధైర్య,
బలములను
ఊయలలపై
ఊగుచు,
సంసారమను
బోటులో,
అనుగ్రహములను
తెడ్లను
ఆధారముగా
పట్టి,
నామస్మరణను
పీఠమును
భద్రముగా
ఉంచి,
ధర్మకర్మలను
పక్కలను
బోటుకు
అంటగట్టి,
ఆ
బోటున
సిరిసంపదలను
సామానులను
సరిది,
సంతోష
సల్లాపములతో
సర్వేశ్వరుని
సాన్నిధ్యమును
పొందుదురుగాక!
ధర్మమార్గము
సతిది.
బ్రహ్మమార్గము
పతిది.
ఇద్దరికి
సంబంధమయినదే
ధర్మ
బ్రహ్మ
మార్గములు.
వాటియందు
అన్యోన్యమైన
అనురాగములతో
శివశక్తి
ఆత్మక
స్వరూపులను
సార్థకనామమును
సాధించి,
సరి
మానవ
సోదర
సోదరీమణులకు
ఆదర్శప్రాయులై
పుట్టినింటికి,
కాలు
పెట్టినింటికి
సత్కీర్తిని
సంపాదించి,
శక్తిసామర్థ్యముల
పరోపకార
పరమాత్మ
సేవా
కైంకర్యములకు
ప్రయోగించి
పరంజ్యోతికి
ప్రకాశజ్ఞానమును
ప్రజ్ఞా
ద్వారమున
సాధింతురుగాక!
అమ్మా
గృహలక్ష్మీ!
ధర్మపత్ని,
ఇల్లాలను
సార్థకనామములను
సరియైన
మార్గమున
కాపాడుకొమ్ము.
మీకు
పతి
అండనే
ప్రాణకుండ.
తల్లికైవడి
అన్ని
తప్పుల
సైచి
పుణ్యమొసగు,
సతుల
దేవాలయంబు,
వలదన్న
సద్
గ్రంథపఠన
కష్టములేక
పలు
శాస్త్రములు
నేర్పు
పాఠశాల!
శ్రమలేక,
తమయంత,
సర్వంబు
సమకూర్చు
ఆనంద
మొసగు
విహార
భూమి!
అజహరాదులనైన
ఆడింపగల్గు
మహిమచేకూర్చు
సన్మంత్రశాల!
సతుల
అనురాగ
సౌభాగ్య
సంపదంబు
కాంత
కల్యాణ,
సౌభాగ్య
కల్పకంబు
ప్రణయ
త్యాగోపదేశ
వైరాగ్యశాల!
పతి
గృహంబె
సతులకు
పాఠశాల!
గృహలక్ష్మీ!
ఈ
పద్య
ధర్మముల
మనసున
ప్రాకునట్లు
చేయి.
ఇట్లు,
మీ
ఆనందదాయి
శ్రీసత్యసాయి.
Previous
←
Who Am I? Yours
Next
Firm Blessings on Your Birthday
→