Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1960 · The Dangers of Doubt
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Dangers of Doubt
28 December 1960, Vaikuṇṭha Ekādaśī, Puttaparthi
1
▾
Meaning
Keep
వైకుంఠ
ఏకాదశి
అంటే
ఏమి,
ఈ
పండుగయొక్క
మహత్వమేమి,
దీన్ని
గురించి
చెప్పుచున్న
పురాణగాథ
ఏమి,
పాలసముద్రమును
ఎందుకు
మథనము
చేసిరి,
పై
విషయములు
మీరు
యిప్పుడు
వింటిరి.
దూర్వాస
మహర్షి
శాపము
వల్ల
దేవతలందరూ
జర
నరలకు
వశులై
నిస్తేజులైనారు.
రాక్షస
బాధలు
ఎక్కువైనవి.
దేవతలందరూ
చేరి
శ్రీమన్నారాయణుని
ప్రార్థించగా,
శ్రీమన్నారాయణుడే
కూర్మావతారమును
దాల్చి
పాలసముద్రమును
మథనము
చేయించి,
ధన్వంతరి
రూపముతో
అమృతకలశమును
దానినుంచి
తెచ్చి,
మోహినీ
రూపము
దాల్చి
ఆ
అమృతము
సురలకు
మాత్రమే
పంచి,
వారికి
ధైర్యోత్సాహబలములను
తద్వారా
ఆశీర్వదించి
రాక్షసులను
వారి
మూలమున
సంహరించిరని
కథ.
నిజముగా
అంతరార్థమును
వెతుకుతూపోతే,
అనృతము
లేనిదే
అమృతము.
దివ్యత్వమనే
సత్యమును
ప్రకాశింపచేసేదే
అమృతము.
ఎప్పుడు
అహంకారము,
గర్వము,
మదము
బయలుదేరినదో
అప్పుడు
దేవతలు
వారిలోనున్న
సర్వశక్తులను,
సర్వ
సద్గుణములను
కోల్పోయినారు.
వారు
వాటిని
తిరిగి
సంపాదించుకొనవలెను
కదా!
దానికి
పరమాత్ముడు
చెప్పిన
ఉపాయమే
సాగర
మథనము.
అంటే
సాధన
మనోనిగ్రహము.
ఏకాగ్రతతో
సర్వకాలములందు
భగవన్నామము
చేయుటయే.
ఇప్పుడుకూడా
అంతియే.
రాక్షస
గుణాలను
అణగద్రొక్కేదానికి
మథనమే
ముఖ్యము.
సాధనే
సర్వోత్తమమైన
మార్గము.
చూస్తున్న
దానినే
లేదనటం,
చేస్తున్న
దానినే
చేయలేదనటం
ఇదే
పెద్ద
రాక్షస
గుణము.
దానము
లేని
జీవితమే
దానవత్వము.
ప్రత్యక్షముపైన
అనుమానమే
రాక్షసత్వము.
ఇప్పుడు
రూపమేమో
అందరిదీ
మానవత్వమే.
ఐననూ,
గుణములు
మాత్రము
రాక్షస
గుణములే.
భగవంతునిపై
నమ్మకమును
స్థిరము
చేసికొని
కాలాన్ని
పవిత్రముగా
వినియోగించండి.
ఇప్పుడు
అనుభవించిన
ఆనందమే
మీ
భాగ్యము.
గడచిన
నిముషము
మరల
రాదు.
వచ్చే
నిముషము
మీది
కాదు.
అస్థిరమైన
జగములో
జీవాత్మ
పరమాత్మ
అనే
రెండు
పక్షులే
స్థిరమైనవి.
ఆ
రెండూ
ఐక్యము
కావలెను.
అదే
మీ
జన్మ
హేతువు.
మీ
కర్తవ్యము,
నిత్యానిత్య
వస్తువివేకమును
అభివృద్ధి
చేసుకొని
శూన్యమైన
ప్రపంచ
చింతలను
వీడి
నిత్యమైన
పరమాత్మ
చింతలోనే
కాలాన్ని
గడపవలెను.
భగవంతుడు
సాకారముగా
వచ్చినప్పుడు
ఎక్కడలేని
సందేహాలన్నీ
వస్తుంటాయి.
వివేక
వైరాగ్య
విచక్షణలతో
నమ్మకమును
దృఢపరచుకొనవలెను.
ఇంకెప్పుడు
మీకు
దీనికి
తగిన
సదుపాయములు
దొరకును?
నడవడికలోనున్న
దుర్గుణాలను
అరికట్టి
మితభాష,
మితాహారము,
శాంతస్వభావము,
ధైర్యోత్సాహములను
అభ్యసించి
ఎల్లప్పుడూ
సంతోషముగా
వుండవలెను.
అప్పుడు
నిరంతరము
భగవదనుగ్రహముచే
అమృతధారను
గ్రోలవచ్చును.
Previous
←
The Click of the Camera
Next
Supreme Power
→