Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1961 · Supreme Power
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Supreme Power
14 February 1961, The day after Mahāśivarātri, Puttaparthi
1
▾
Meaning
Keep
మన
వెంకటేశ్వర్లు
తాను
ఇప్పుడు
అర్పణముచేసి
చదివిన
గ్రంథములో
మాయానాటక
సూత్రధారి
అని
సంబోధించిరి.
అయితే
భగవంతుడు
మాయాస్వరూపుడు
కాదు.
వారిది
మహాశక్తియేగని
మాయాశక్తి
కాదు.
మాయలుండేది
మీలో,
వారిలో
మాయ
అనేదే
లేదు.
వారి
మహాశక్తిని
కనుగొనలేక,
దానిని
తెలుసుకొనే
శక్తి
చాలక
ఆ
మహాశక్తిని
చూచిననూ
నమ్మక,
మాయ
కప్పుకొని
సందేహపడుదురేకాక,
భగవంతునిలో
మాయ
అనేదే
లేదు.
మాయాస్వరూపము
ప్రధానము
కాదు.
మహాస్వరూపాన్నే
దర్శించవలయును.
మరొక
విషయము.
నన్ను
ఆంధ్రప్రదేశములో
జన్మించినారు,
అది
దాక్షిణాత్యుల
అదృష్టము,
నాడు
దండకాటవిగా
పరిగణింపబడిన
ఈ
దక్షిణదేశముననే,
అందునూ
ఆంధ్రప్రదేశమందు
అవతరించినారు,
అని
పొగడిరి.
అయితే
తెలివిస్వరూపుడైన
దక్షిణామూర్తికి,
దక్షిణోత్తర
భావమే
లేదు,
రాదు.
భూలోకమే
నా
జన్మస్థానము.
కానీ,
ఆ
ప్రదేశము,
ఈ
ప్రదేశము
కాదు.
వెంకటేశ్వర్లు
చదివిన
గ్రంథములో
నాపైన
విశ్వాసము
లేనివారు
నన్ను
దర్శించి
అనుభవము
పొందనివారు,
నాతో
సంభాషించేమునుపు
వారికి
వచ్చిన
దూషణ
మనోభావాలు
ఇవన్నియును
వ్రాసారు.
ఇదికూడా
అనవసరమే.
ఉపయోగములేని,
గుణాన్ని
చెడిపే
మాటలన్నీ
మీకెందుకు?
శిల్పికి
తన్నెదుట
తాను
వేసుకొనిన
రాయి
రాయిగా
కనబడదు.
దీనిలో
నివసించే
దేవతా
రూపమే
ఎల్లప్పుడూ
వారి
కంటితో....
ఆ
రూపాన్ని
విడదీసేదే
వారి
ప్రయత్న
ఫలితము.
అట్లనే
ఈ
సాయి
ఆ
సాయినా,
ఆ
సాయి
ఈ
సాయినా
అనే
విమర్శకూడా
భక్తులకు
అనవసరము.
ఈ
సాయి
తెలియదు,
ఆ
సాయి
తెలియదు,
ఈ
సాయి
స్వరూపము
విమర్శ
ఎట్లా?
అదే
ఇది
అని
నిర్ధారణ
చేసేదెవరు?
చక్కెరపాకుతో
రకరకాలు
మిఠాయి
తయారుచేస్తారు.
దానికి
ప్రింటుకొట్టి
పిల్లి,
పక్షి,
ఏనుగు
అని
ప్రత్యేకముగా
అమ్ముతారు.
నామరూపములు
వేరే
అయిననూ
అవన్నియూ
చక్కెరనే.
రుచి
ఒకటే.
ఇది
తెలియక,
ఊరక
వాదాలు
పెట్టుకొని
ద్వేషవిద్వేషములను
పెంచితే
ఏమి
లాభము?
ఏమి
సుఖము?
రాముడే
సాయి,
సాయిరాముడే
సత్యసాయి
అన్నియూ
ఒక్కటే
చక్కెరపాకు.
వశిష్ఠుడు
రామ
అని
పేరు
పెట్టిరి,
గర్గుడు
కృష్ణ
అనిరి,
మహల్స్పతి
సాయి
అని
పిలిచిరి.
ఏనామము
పలికినా
తన
నామమేకదా!
నన్ను
దూషణచేసే
వారిని
దూరముగా
పెట్టండి.
వారి
సహవాసమే
మీకు
వద్దు.
దూషణ
విషయమే
మీ
మనస్సుకు
రాకూడదు.
ఒకటి
మాత్రము
నిజము,
నావారుకానివారు
లోకములో
లేరు.
నేనెప్పుడూ
సాయి
అనే
పేరునే
పెట్టండి
అని
చెప్పను.
సాయి
ప్రచారము
చేయను.
పేరులలో
ఏముంది?
మీకు
ఏది
ఇష్టమో,
ఏనామముపైన
ప్రీతియో
దానినే
స్మరించండి.
ఇక్కడ
ప్రచారానికి
అవసరమే
లేదు.
ఖర్చుకాని
పదార్థానికి
మాత్రమే
ప్రచారము
అవసరముకదా!
మీరు
సంపూర్ణశాంతిని,
సంపూర్ణసంతోషాన్ని,
సంపూర్ణఆనందాన్ని.
జన్మరాహిత్యాన్ని
అడిగేదికూడ
అనవసరము.
విషయవాసన
ఒక్కటి
తొలగితే
ఇవన్నియూ
చేకూరును.
ఆధ్యాత్మిక
విషయములో
మీ
సందేహాలన్నియును
నన్ను
అడగండి.
నేను
ఆనందముతో
మీకు
సమాధానమిస్తాను.
ఇంక
రెండుమూడు
సంవత్సరములలోపల
మీకు
ఇంతమాత్రముకూడా
అవకాశము
దొరకదు.
భక్తులసమూహము
దినదినానికి
ఎక్కువౌతుంది.
కాబట్టి,
త్వరత్వరగా
వచ్చి
అనుభవించి
ఆనందించవలయును.
ఇంక
రెండుమూడు
సంవత్సరములలో
లోకమే
పుట్టపర్తి
వచ్చి,
ఒంటికాలిపై
నిలుస్తుంది.
చూడండి.
నేనెప్పుడూ
పుట్టపర్తిలో
సంభాషించేటప్పుడు
భక్తుల
నడతను
గురించి,
వారు
అభ్యసించవలసిన
క్రమశిక్షణలను
చెప్పుదును.
బైట
ఊరువాళ్ళకు
ముందు
టానిక్.
ఎందుకంటే
నా
సైన్యానికి
ఇదియే
హెడ్‌క్వార్టర్స్.
మితాహారము,
మితభాష,
సంతోషము,
క్రమక్రమముగా
జపము,
ధ్యానము,
ఇవన్నియూ
నేర్చుకొని
ఉత్తమ
సాధకులు
కావలయును.
భగవంతునిపై
మీకు
నమ్మకము
లేకపోతేపోనీ,
సత్యాన్ని
ఆచరించండి.
ప్రేమను
అభివృద్ధిచేయండి.
సత్యము,
ప్రేమ
లేని
మనుష్యుడే
లేడు.
అదే
దేవుని
లక్షణము.
భగవంతుని
గురుతు.
సత్యమే
భగవంతుడు.
ప్రేమయే
పరమాత్మ.
Previous
←
The Dangers of Doubt
Next
Sai As Inner Resident
→