Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1970 · Whom to serve?
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Whom to serve?
16 August 1970, Rotary Club, Anantapur
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
కాలము
క్షణక్షణమూ
కదలిపోవుచున్నది.
కాయము
క్షణక్షణమూ
క్షీణించుచున్నది.
మనస్సు
క్షణక్షణమూ
చంచలమగుచున్నది.
అక్రమ
అనాచార
అన్యాయములు
అభివృద్ధి
అగుచున్నవి.
నేడు
దేశమున
శాస్త్రవేత్తలు
విహంగములవలె
ఆకాశములోనూ,
చేపలవలె
నీటిలోనూ
ప్రయాణము
చేయుచూ
విహరించుచున్నారు.
మరొకవైపు,
నేలపై
సుఖశాంతులతో
నివసించు
మార్గము
వదలి,
పిడికెడు
మెతుకులకై
దయాదాక్షిణ్యములు
లేక
తోటి
మానవులను
హింసించుచున్నారు.
తన
కర్తవ్యమును
గుర్తించక,
అతీతమైన
దానికి,
అపాయ
హేతువులకై
ప్రాకులాడుచున్నారు.
ప్రపంచములోని
అన్ని
దేశములలోనూ
రోటరీ
క్లబ్బులని,
లయన్స్
క్లబ్బులని
అనేక
పేర్లతో
ఇలాంటి
సంస్థలు
స్థాపింపబడినాయి.
కంపాలా,
నైరోబి,
జాంనగర్,
బొంబాయి
నగరములలోకూడా
ఈ
సంస్థలలో
పరోపకార
కార్యములను
నేను
గమనించితిని.
అయితే,
ఆ
సేవయొక్క
నిజస్వరూపమును
చక్కగా
అర్థముచేసుకొనిన,
అది
పరోపకారము
కాదు.
తనకు
తాను
చేయు
ఉపకారమే
అని
బోధపడును.
ఆ
సేవయొక్క
ఫలితములో
తానూ
భాగస్తుడు
అనేది
తేలును.
తాను
వేరు,
ఇతరులు
వేరు
అనే
భేదభావము
ఉండకూడదు.
ఉండిన,
సేవ
సార్థకముకాదు.
తాను
సేవచేయువాడు,
అతను
సేవ
చేయించుకొనువాడు
అనే
భావము
అంకురించిన,
అహంకారము,
అభిమానము
పెరిగిపోవును.
చేయువాని
గర్వము,
చేయించుకొనేవాని
దీనత
రెండూ
అభివృద్ధి
అగును.
ఇది
సేవాతత్త్వమునకే
ముప్పు
తెచ్చును.
ఇట్టి
భేదభావములవలననే
ఈనాడు
దేశము
ఇన్ని
చింతలకు
గురియైనది.
ఆత్మానుభవము,
ఆత్మవిశ్వాసము
ఉండిన
భేదభావముండదు.
అన్ని
క్షేత్రములలోనూ
మానవుని
కార్యకలాపములు
సక్రమ
మార్గము
ననుసరించిన,
అక్రమ
అసత్యములు
విజృంభించవు.
పునాదులు
లేని
భవనములలో
నివసించునట్లు,
అనుక్షణమూ
భయభ్రాంతులతో
మానవుడు
ఈనాడు
జీవనయాత్ర
సాగించుచున్నాడు.
కోట్లకొలది
ప్రజలలో
ఏ
కొద్దిమంది
మాత్రము
ఆధ్యాత్మిక
పునాదిగల
భద్రజీవనములను
గడుపుచున్నారు.
సర్వులయందున్నది
ఒక్క
వ్యక్తిత్వమేయని
గుర్తించిన,
భిన్నత్వమంతయూ
ఏకత్వముగా
మారి,
ద్వేషము
అసూయ
క్రోధము,
లోభము
అన్నియూ
అంతమవును.
ఇదే
అనుభవ
జ్ఞానము.
ఆ
జ్ఞానము
భావములను
పవిత్రముచేయును.
పవిత్ర
ఫలములనిచ్చును.
అభేద
దర్శనమే
జ్ఞానము.
వేదాంతములో
దీనినే
మహర్షులు
బోధించుచున్నారు.
దానిని
పఠించి
సభలలో
ప్రదర్శించుచున్నారేగాని
ఆచరించువారు
తక్కువైనారు.
సత్యమని
దేనిని
నమ్మిన,
దానిని
ఆచరణలో
పెట్టవలెను.
ఆచరణయే
పెద్ద
ఆరాధన.
భారతదేశములో
ఈనాడు
ఆర్థిక
దుస్థితి,
ఆహార
దుస్థితి
ఏర్పడినదని
విచారించుచున్నాము.
కానీ,
విచారణచే
ఈ
అశాంతిని
పోగొట్టుకొనవలెను.
అయితే,
ప్రజలు
అనేక
అనవసర
విషయములను
బుఱ్ఱలో
చేర్చుకొని
అశాంతికి
పాలైనారు.
శాంతి
సంపాదనకు
కావలసిన
సామగ్రీలు
వారిలోనే
ఉండిననూ,
వాటిని
గమనించరు.
మేను
మరచి
నిదురపోవువారిని
మేలుకొలుప
సాధ్యమగును.
అయితే
నిదురపోయినటుల
నటించే
వానిని
మేలుకొలుప
తరమా!
వ్యక్తిలోనున్న
దురాశయే
కులమత
భేదములకు
మూలకారణము.
వ్యక్తి
తన
సుగుణములను
అభివృద్ధి
చేసుకొని
సేవాబుద్ధితో
సమాజములో
కలసిమెలసియుండిన
అందరూ
శాంతిగా
జీవించ
వీలగును.
కులమత
ద్వేషములను
పోగొట్టవలెనుగాని
కులమతములను
పోగొట్ట
ప్రయత్నించిన,
ఆకాశమును
విరగగొట్టుటకు
పూనుకొన్నట్లే!
అవి
బాహ్య
రూపములను
ధరించి
తమ
అస్తిత్వమును
దృఢపరచును.
ఇంద్రియములకు
అందుబాటులోనున్న
దానిని
సైంటిస్టు
కనుగొనును.
అయితే,
సెయింట్
ఇంద్రియాతీతమైన
సత్యమునే
అన్వేషించును.
రోటరీక్లబ్బు
సభ్యులు,
ఈ
పర,
అపరా
రెండు
విద్యల
మహత్వమును
బాగా
తెలుసుకొనవలెను.
ఆధ్యాత్మికమునకు
ఎక్కువ
ఆదరణనూ,
ఆచరణనూ
ఈయవలెను.
మీరు
పట్టణములలో
మాత్రము
సేవాకార్యములను
చేయుచున్నారు.
కానీ,
పల్లెలలో
కూడ
మీ
కార్యక్షేత్రమును
విస్తరించిన,
ఆదర్శనీయముగా
ఉండును.
మరొక
విషయము.
తలుపు
చిన్నదని
తలను
కొట్టకుండ,
వంచుకొని
పోవలెనుకదా!
అట్లులేక,
జనాభా
పెరిగిపోతున్నదని
ఫ్యామిలీ
ప్లానింగు
ప్రచారము
చేయుచున్నారు.
ఆ
ధనమును
అక్షరాభివృద్ధికి
వినియోగించిన,
ప్రజలు
పరిస్థితిని
తామే
తెలుసుకొని,
ఇంద్రియనిగ్రహమును
స్వతః
సాధింతురు.
‘యోగః
చిత్తవృత్తి
నిరోధః’
యోగ
ప్రచారమువలన
శీలదూషణము
లేకనే
రాష్ట్రము
బాగుపడును.
అనుభవముచే
ఆధ్యాత్మిక
దివ్యత్వమును
తెలుసుకొనుటకు
ప్రయత్నించవలెను.
దిగిచూచి
నీటిలోతును
తెలుసుకొనగలము.
చక్కెర
రుచి
చూచిన
తీపు
తెలియును.
భోజనమున
లడ్డు
వడ్డించినప్పుడు
డయబటీస్
పేషెంటు
తనకు
లడ్డు
వద్దన్నాడే
అని
అందరూ
వద్దంటారా!
ఏ
కొందరో
దేశమున
నాస్తికులున్నారని
అందరూ
నాస్తికులగుదురా!
తండ్రి
బిడ్డకు
ఉన్న
సన్నిహిత
సంబంధమే,
మానవునికీ
భగవంతునికీ
ఉండవలయును.
భగవంతుడు
నావాడు,
నేను
అతనివాడను
అనే
సంబంధమును
పెట్టుకోవలెను.
సుఖదుఃఖములు
కలసియుండును.
కాబట్టి,
కార్యము
కాకున్న
ఆరాధించు
దైవపటమును
త్రిప్పివేయుట,
కోరిక
నెరవేరిన
అదే
ఆరాధనా
దైవముయొక్క
పటములను
అనేకము
పెట్టుట,
ఇవి
తప్పు.
దృఢభక్తి,
శరణాగతి
వీటిని
మనస్సులో
దృఢపరచుకొనవలెను.
దీనికి
మన
ఇతిహాసపురాణములే
సాక్షి.
2
▾
Meaning
Keep
అవే
ప్రోద్బలమునీయును.
కాన,
రామాయణ,
భారత,
భాగవత
కథలనూ,
సూక్తులనూ
పిల్లలకు
బోధించవలెను.
చిన్న
వయస్సులోనే
వారికి
భారత
సంస్కృతియొక్క
మూలతత్త్వములను
ఈరీతి
తెలుపవలయును.
రాష్ట్రముయొక్క
భవిష్యత్తు
వారిపైననే
ఆధారపడియున్నది.
పిల్లలలో
మంచిభావనలు
అభివృద్ధియగుటకు
‘బాలవిహార’ములను
స్థాపించండి.
అదికూడా
మీ
సేవాకార్యక్రమములలో
ముఖ్యమైనది.
Previous
←
Yaaga is Thyaaga
Next
Make every day Kṛṣṇa's birthday
→