Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1970 · Make every day Kṛṣṇa's birthday
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Make every day Kṛṣṇa's birthday
24 August 1970, Kṛṣṇāṣṭamī
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
లోకము
విశాలమైనటువంటిది.
కాలము
అమోఘమైనటువంటిది.
ఆయువు
అత్యల్ప
ప్రమాణమైనది.
మానవుడు
నిస్సారమైన
దేహమును
ఆశ్రయించుట
హాస్యాస్పదము.
అదియునుగాక
రూపము
లేని
భగవంతునికి,
రూపము
నిర్మించుట,
కాలాతీతుడైన
భగవంతునికి
కాలమును
అడ్డుపెట్టుట
మానవునియొక్క
భ్రాంతి.
భగవంతునికి
జననమరణములుండునా!
ఆయనకు
జన్మదినోత్సవమేమిటి?
కృష్ణానందమును
అనుభవించిన
దినమే
మీకు
జన్మాష్టమి.
భగవంతుని
జన్మదినమని
చెప్పుకొనే
దినమును
సాధనలతో
సార్థకము
చేసుకోవలెను.
ఆ
సాధనలను
ఫలింపచేసుకొని
ఆత్మానందమును
అనుభవించవలెను.
భారతదేశము
కర్మభూమి,
వేదభూమి,
ధర్మభూమి,
భక్తిసంపన్నమైన
జ్ఞానభూమి.
అయిననూ,
భారతీయులు
అనేది
పేరులో
మాత్రము
నిలిచిపోయినది.
వారు
ఆత్మవిశ్వాసమును
కోల్పోయినారు.
దానివలన
మృగత్వము
ప్రాప్తించినది.
పాపచింతన
కొంచమైననూ
కన్పించుటలేదు.
అది
దురదృష్టకరము.
కాబట్టి,
ధర్మసంస్థాపనజేసి
లోకశాంతిని
నెలకొల్పుట
ఈ
అవతారలక్ష్యము.
పంచభూతములయొక్క
వికారమే
ఈ
లోకముయొక్క
నిజస్వరూపము.
వాటి
సమ్మేళనమువలన
కలిగిన
పదార్థములన్నియూ
తత్వతః
సమానమైనప్పటికీ
కొన్ని
పదార్థములు
ఎక్కువగా
లభించకపోవటం
వలన
వాటికి
ఎక్కువ
విలువను
కల్పించక
తప్పదు.
మట్టి
ఎక్కువగా
కన్పించుటచేత
దానికి
మానవులు
అంత
విలువ
యివ్వటంలేదు.
బంగారు
కొన్ని
ప్రదేశములందే
దొరకుటవలన
దానికి
ఎక్కువ
విలువ
యివ్వవలసివచ్చినది.
ఈ
భేదభావములు
మనస్సుయొక్క
వికారమని
చెప్పక
తప్పదు.
ప్రకృతి
అంతయూ
మనస్సుయొక్క
వికారములే.
దానికి
ఏవిధమైన
అస్తిత్వమూ
లేదు.
సత్యధర్మశాంతిప్రేమలు
పంచభూత
సమ్మేళనమువలన
ఉద్భవించినవికావు.
అవి
బాహ్యము
కాదు.
భావసంబంధము.
శ్రీకృష్ణుడు
ప్రేమస్వరూపుడు.
దైవము
వేరు
ప్రేమ
వేరు
కాదు.
ప్రేమే
దైవము,
దైవమే
ప్రేమ.
భక్తికి
ప్రేమయే
గుర్తు.
ఫొటోలను
పెట్టి
పూలమాలలను
వేసి,
కేవలము
భజనలు
చేసినంతమాత్రమున
అది
భక్తి
కానేరదు.
ప్రేమతో
దేవుని
సేవించి,
ప్రేమద్వారా
ప్రేమనందుకొని,
ప్రేమస్వరూపుని
దర్శించి
ప్రేమను
పొందే
మార్గమే
భక్తి.
నిజభక్తునకు
శరణాగతి
తప్ప
ఏ
వాంఛయూ
ఉండదు.
విద్యావాంఛ,
ఉద్యోగవాంఛ,
అర్థవాంఛ
యిత్యాది
వాంఛలతో
భగవంతుని
సేవించ
పూనుకొనటం
కాలాన్ని
వ్యర్థముచేసుకొనటమే.
సర్వవాంఛలకు
మనస్సుయొక్క
చంచలస్వభావమే
మూలకారణము.
మనస్సు
మదగజంలాంటిది.
దానిని
భగవన్నామమనే
అంకుశముతో
వశం
చేసుకొనవలెను.
అట్లనే,
భగవంతుని
స్వాధీనము
చేసుకొనుటకు
ప్రేమయే
ప్రధానము.
పాలు,
పెరుగు
అమ్ముకొనుటకు
వెళ్ళి,
‘పాలు,
పెరుగు’
అని
యెలుగెత్తి
పిలిచి
అమ్ముకొనుట
మరచి
‘గోవిందా,
మాధవా,
దామోదరా’
అంటూ
పరవశత్వమునొందెడివారు.
నిర్మల
నిశ్చల
ప్రేమతో
పదిలపరచుకొనిన
వారికి
మరేవిధమైన
భయభ్రాంతులు
కలుగలేదు.
కృష్ణవియోగమును
వారు
ప్రాణము
పోయినట్లుగా
భావించెడివారు.
ఈనాటి
భక్తులకూ
ఆనాటి
ఆ
గోపికలకు
ఎంత
వ్యత్యాసమో
యోచించండి.
బాహ్యాడంబరముల
కంటె
హృదయములను
సద్భావములతో
నింపి
సత్ప్రవర్తనలతో
జీవితములను
పవిత్రముచేసిన
కృష్ణుడు
వచ్చి
చేరుకొంటాడు.
లేకపోతే,
ఎన్ని
సంవత్సరాలు
జపంచేసినా,
పూజలుసలిపినా
లాభములేదు.
మధుసూదనుడు
అంటే
బాహ్యార్థము
మధువనే
రాక్షసుని
వధించినవాడు.
దీనికి
అంతరార్థము
వేరే
ఉన్నది.
‘మధు’వనగా
‘తీపి’.
మానవునికి
అహంకారమే
అన్నిటికంటే
తీపి.
కాబట్టి,
అటువంటి
అహంకారమును
ధ్వంసము
చేయువాడే
శ్రీకృష్ణుడు.
ఈ
భావార్థమును
చక్కగా
మనము
చెబుతే
తరింప
వీలగును.
భగవంతునికి
నమస్కారమనగా
ఏమిటి?
మమకారములేని
ఆస్కారమే
నమస్కారము.
అనగా
పూర్తి
శరణాగతి.
పాదనమస్కారము
చేయవలసినదేగాని,
అది
దైహికముగా
కాక
హృదయసంబంధముగా
ఉండవలెను.
ఎన్ని
కష్టములు
వచ్చినా
మీ
ఆరాధనా
దైవరూప
నామముల్లో
మార్పు
ఉండకూడదు.
మంచి
మనసునకే
కష్టములు
రావచ్చు.
నిందనిష్టూరములు
రావచ్చును.
కాని,
వాటికి
భయపడకూడదు.
తుకారాం,
కబీరు,
నరేంద్రుడు,
రామకృష్ణపరమహంస
వీరందరూ
అనేక
కష్టజీవితములకు
గురియైరి.
నరేంద్రుడు
అన్నవస్త్రములకు
కూడను
బాధపడుచున్నప్పుడు
రామకృష్ణుని
ఆదేశముతో
అంబను
ప్రార్థించి
చివరికి
ఆమె
పవిత్ర
దర్శనముతో
సంతృప్తిపడి,
స్వార్థాన్ని
మరచినాడు.
తనను
తాను
పూర్తిగా
అర్పించుకొన్నవాడు
అడిగేది
దేనిని?
వాంఛించేది
దేనిని?
తనను
తండ్రి
ఎన్నివిధములహింసించినా
ప్రహ్లాదుడు,
‘నారాయణా!
హేపన్నగశాయి,
నారాయణా!’
అంటూ
సంపూర్ణ
శరణాగతుడై
నామస్మరణతోనే
ధన్యుడైనాడు.
సర్పమువంటి
వక్రగతిగల
ఈ
మనస్సును
నాదస్వరమువంటి
భగవన్నామస్మరణతో
వశముచేసుకోవలెను.
కృష్ణతృష్ణను
పెంచితే,
సంసారతృష్ణ
త్వరలోనే
నాశనమగును.
కాన,
ఈరోజు
కృష్ణజన్మాష్టమిగా
ముగించి
కృష్ణుని
మరచిపోకుండా,
ప్రతిరోజూ
శ్రీకృష్ణజన్మదినముగా
చేసుకొంటూ
మీమీ
జీవితములను
సార్థకముజేసుకొని
ధన్యతగాంచిన,
అప్పుడే
శ్రీకృష్ణుడు
మీ
అంతఃకరణములో
సారథిగా
నిలచి
మీకు
గీతను
బోధించును.
Previous
←
Whom to serve?
Next
Light, love, joy
→