Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1972 · Give and gain
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Give and gain
2 January 1972, The opening of the Kamani factory, Bangalore
1
▾
Meaning
Keep
మానవుడు
కర్మక్షేత్రయాత్రికుడు.
కర్మలద్వారా
కర్మజన్యమైన
జననమరణ
బాధనుండి
తరించేకొరకు
ఈ
ఉపాధితో
వచ్చినవాడు.
జగత్తు
ఒక
కర్మాగారము.
దానిలో
మీమీ
భాగములకు
నియమించిన
కర్తవ్యకర్మలను
భగవదర్పితముగా,
భగవత్ప్రీత్యర్థముగా
కర్మఫలమునాశించక
మీ
శక్తిసామర్థ్యములను
వంచనలేక
వినియోగించి
కృతకృత్యులు
కావలెను.
కూటి
పేదనుండి
కోటీశ్వరుని
వరకు,
మానవులందరూ
ఆనందముకొరకే
ఆరాటపడుతున్నారు.
అయితే
మానవుడు
సంఘజీవి.
సంఘములోనే
పుట్టిసంఘములోనే
పెరిగి
సంఘముయొక్క
ఆదర్శములనే
ఆశ్రయించి
వాటికొరకు
పరిశ్రమించుచున్నాడు.
సంఘమువలన
సంపాదించవలసినవి
సౌభాగ్యము
పేరు
ప్రతిష్టలుకావు,
వస్తువాహనములుకావు,
నిత్యసత్యమైన
ఆత్మానందమునే
ఆశించి
అందుకొనవలెను.
ఆహారవిహార
నిమిత్తము
పశుపక్ష్యాదులుకూడా
జీవితయాత్రలను
సాగించుచునే
వున్నవి.
అయితే
మనిషికి
వివేకము,
విచక్షణ,
విజ్ఞానము,
వైరాగ్యము
మొదలైన
మహాప్రసాదములందించిననూ
వాటిని
సద్వినియోగము
చేయక
ఇంద్రియముల
వెంబడి
భౌతిక
సుఖసంతోషసంతృప్తులకోసము
కాలమును
వ్యర్థముచేసికొంటాడు.
సంఘము,
సమాజము
వాటివిలువ,
వాటివలన
లభించే
మంచిని
మానవుడు
అర్థము
చేసుకొనుట
లేదు.
సమాజమన
కొందరు
వ్యక్తుల
సమూహము
కాదు.
దానివలన
సాధించవలసినది
భౌతికానందము
కాదు.
ఆధ్యాత్మికమే
సమాజముయొక్క
మూలధనము.
ఆధ్యాత్మిక
అభివృద్ధి,
దానిమూలముగా
అనుసరించవలసిన
సాధన,
తన
మంచి
సమాజముయొక్క
మంచికేగాని
వేరుకాదు,
భిన్నం
కాదు.
సర్వజీవులయందు
తనను
ప్రత్యక్షీకరించుకొనవలయును.
అనేకత్వములోనుండి
ఏకత్వమును
సాక్షాత్కరించుకోవలెను.
‘సహస్ర
శీర్షా
పురుషః’
అనేదాన్ని
అనుభవించి
ఆనందించవలెను.
విశ్వశ్రేయస్సులో
మీ
శ్రేయస్సును
లీనము
చేసుకోవలెను.
దానికొరకు
మన
కర్తవ్యకర్మలను
అనుభవించినప్పుడే
జీవనము
సార్థకమగును.
తనకు
ముందు
వెనుకను
తన
యిరుప్రక్కలలోను
తాను
గుర్తించిన
గమ్యమునకు
ప్రయాణము
సలుపువారు
బహుమంది
వున్నారనే
సత్యాన్ని
వ్యక్తి
గమనించుట
లేదు.
ఒంటరిగానే
తాను
పయనించుచున్నట్లు
తలంచుచున్నాడు.
ఇది
పొరపాటు,
అసహజము.
స్వార్థమునకు
జీవితమును
అంకితముచేసితే
గురిని
చేరేది
సాధ్యముకాదు.
లోకశ్రేయస్సే
తన
శ్రేయస్సు.
దానికి
పాటుపడితే
అదే
తనకు
సార్థకమార్గము.
అట్టి
తెలివి
అభివృద్ధి
కావలెను.
‘లోకాస్సమస్తా
సుఖినో
భవంతు’
అనే
వేదవిహిత
ప్రార్థనయొక్క
ఉద్దేశ్యముకూడ
ఇదే.
ఆ
సమస్త
స్వరూపమును
దర్శించుకొనేదే
జీవితముయొక్క
పరమోద్ధేశ్యము.
దేహములోని
సర్వాంగములు
పటుత్వముతో,
ఆరోగ్యముతో
కర్తవ్యకర్మలను
నిర్వహించినప్పుడే
మనిషికి
ఉత్సాహము,
తుష్టి,
పుష్టి.
అట్లనే
సంఘముయొక్క
ఉపాంగములైన
వ్యక్తులు
తమ
కర్తవ్యాన్ని
గుర్తించి
స్వస్వరూపమును
సత్యాన్వేషణ
ద్వారా
తెలుసుకొనిన
గుణములభివృద్ధియగును.
ధనము
సద్వినియోగము
చేయబడును.
వాక్కులు
పవిత్రమగును.
దృష్టి
జ్ఞానమయమై
సృష్టి
బ్రహ్మమయ
మగును.
ఇప్పుడు
ఎయిర్కండిషన్
అని
అన్నివిధములైన
కండిషన్లు
వచ్చినవేగాని,
మైండ్కండిషన్
రాలేదు.
అన్నింటికీ
కంట్రోలు
వచ్చినదిగాని
మైండ్కంట్రోలు
ఏమాత్రమూ
రాలేదు.
వేగముగా
పరుగిడు
రైలును
లక్షలాదిమంది
పట్టి
లాగినా
దానిని
ఆపలేరు.
అయితే
ఇంజనులోని
ఒక
చిన్న
బటన్,
దాన్ని
ఆ
డ్రైవరు
మెత్తగా
నొక్కితేచాలు
అది
ఆగిపోతుంది.
అట్లనే
మనస్సుయొక్క
పరుగును
సాధనవలన
ఆపి
చిత్తశాంతిని
పొందవచ్చును.
తనకు
యితరులకు
అపాయము
కలుగక
జీవితమును
సాగించుకొనవచ్చును.
అప్రధానమైన
విజయములకు
యిప్పుడు
మీరు
సంతోషించి
పెద్ద
తృప్తిని
పొందుచున్నారు.
అయితే
పదార్థముకాదు
కావలసిన
సొమ్ము,
పరార్థము.
అర్థించవలసినది
ప్రశాంతి.
అదే
ప్రధానమైన
పెన్నిధి.
ఈనాడు
నూతన
జబ్బు
ఒకటి
బయలుదేరి
అన్ని
క్షేత్రములలోనూ
ప్రవేశించి
పెరుగుచున్నది.
పెద్ద
ఆందోళనగా
మారినది.
అదియే
స్ట్రైకులు,
సమ్మెలు.
ఏ
కారణములతో
ఎవరు
ఏ
అవసరమును
బట్టి
ఎందుకు
చేయుచున్నారనేదేమీలేదు.
చీటికిమాటికి
స్ట్రైకు.
ఇంటిలో
వంటవాడు
స్ట్రైకే.
ఫ్యాక్టరీలో
పనిచేసేవారు
స్ట్రైకే.
నగరములలో
పెద్దపెద్ద
ఉద్యోగస్తులు
సహితము
స్ట్రైకే.
దీనివలన
ద్వేషము,
అశాంతి,
కష్టనష్టములు
పెరుగునేగాని
సమస్యలు
శాంతసంతోష
వాతావరణమున
పరిహారమగుటలేదు.
వ్యక్తికి
సంస్థలకు
మధ్య
సమస్యలు
సహజమే.
అయితే
యజమానులు
వారి
సంస్థలో
పనిచేయు
యితరులు
వివేకవిచక్షణలతో
స్నేహసౌహార్దములతో
సమస్యలను
పరిష్కరించుకోవచ్చును.
గుండెకు
శరీరాంగములకు
అవినాభావ
సంబంధము
ఎట్లో,
అట్లే
యజమానుల
శ్రేయస్సు,
వర్కర్ల
శ్రేయస్సు
పరస్పరము
ఆశ్రయించియే
వుండును.
అధికారమునకు
ఆతురతపడక
కర్తవ్యనిర్వహణకు
సంస్థయొక్క
కల్యాణమునకు
పాటుపడే
ఉత్సాహము,
శ్రద్ధ
వుండినచో
వ్యక్తికి
క్షేమము,
ప్రజలకు
కల్యాణము.
వ్యక్తిపై
వ్యక్తికి
ద్వేషము,
అసూయ.
ఒక
సమాజముపై
మరొ
సమాజమునకు
ద్వేషము.
రాష్ట్రమునకు
రాష్ట్రమునకు
మధ్య
ద్వేషము.
2
▾
Meaning
Keep
దీనివలన
పెద్ద
భూకంపముగా
లోకమంతా
అశాంతికి
కారణమగుచున్నది.
విశ్వాసము,
ప్రేమ,
సౌహార్దము,
స్నేహము,
వివేకపూరితమైన
శాంతము
వీటిని
చేపట్టితే
క్షేమము
చేకూరును.
ఒకరికొకరు
విశ్వాసమును
స్థిరపరచుకొనవలెను.
తనపైకూడ
విశ్వాసమును
అభివృద్ధి
చేసుకొనవలెను.
అపోహలను,
భయభ్రాంతులను
నెట్టివేయవలెను.
వ్యక్తికి
శాంతిలేక
కుటుంబములో
శాంతి
వుండదు.
కుటుంబములో
శాంతిలేక
గ్రామాలలో
శాంతి
వుండదు.
గ్రామములలో
శాంతిలేక
రాష్ట్రమునకెట్లు
శాంతి
కలుగును?
రాష్ట్రములు
అశాంతితో
అల్లాడుచుండిన
లోకశాంతి
వట్టి
కల్ల.
కాబట్టి,
వ్యక్తి
తనపై
తనలోని
ఆత్మశక్తిపై,
అందరిలోనూ
వెలుగుచున్న
పరమాత్మపై
దృఢవిశ్వాసము
కలిగి
వుండవలెను.
అప్పుడు
అచంచలమైన
శాంతి
హృదయమున
స్థిరపడును.
అదే
పెద్ద
సాధన.
యంత్ర
మధ్యమున
మీరు
పనిచేయుచున్ననూ
మీ
జీవితము
మంత్రమయముగా
మారును.
Previous
←
The Royal Road
Next
Bhajan as saadhana
→