Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1972 · Bhajan as saadhana
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Bhajan as saadhana
15 January 1972, Sankrānti, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
కాలము
ఎంత
పవిత్రమైననూ,
నివసించే
స్థలము
ఎంతపుణ్యవంతమైననూ
హృదయభావములను
పరిశుద్ధముగా
మార్చినపుడే
సార్థకముగాని,
ఉత్తరాయణము
మంచికాలమని,
ఉత్తమబుద్ధి
లేక,
అధమబుద్ధి
అభివృద్ధి
అయితే
ప్రయోజనము
లేదు.
కల్లుకుండకు
వెలుపల
నిండార
కమ్మని
నెయ్యి
పూసిననూ,
దాని
అంతరములోని
కల్లువాసన
పోదు.
అదేరీతిగనే,
నీచుడున్నత
పదవియందు
నిలచిననూ
దుర్గుణములు
వానినుంచి
తొలగవు.
కనుకనే,
పైతట్టు
మాత్రము
ఉత్తరాయణపు
పండుగ
నాచరించి,
హృదయమును
కల్లుకుండగా
నుంచిన
కమ్మని
నేతివాసన
ఎట్లు
లభించును!
దుర్భావములు
పోకపోతే,
హృదయ
పరిశుద్ధత,
భగవదనుగ్రహము
ఏనాటికీ
లభించవు.
భారతదేశమందు
పల్లెలలోగాని,
పట్టణములలోగాని
పూర్వము
రథోత్సవము
అనే
తిరునాళ్లు
జరిపేవారు.
పెద్ద
రథమును
తయారుచేసి
చక్కగా
అలంకారముచేసి
దాని
మధ్యభాగమున
భగవంతుని
స్థాపించి,
వేలాది
ప్రజలు
చేరి
వీధులద్వారా
ఉత్సవముగా
తీసుకొనిపోయేవారు.
అయితే,
చేరినవారందరూ
రథములోనున్న
దైవమునే
చూచుదురా!
ఎవరెవరు
వచ్చారని
కొంతమంది,
ఎక్కడవారు
వచ్చారని
కొంతమంది,
రథమునందలంకారమును
చూచువారు
కొంతమంది,
ఆడేవాళ్ళను,
పాడేవాళ్ళను
చూచువారు
కొంతమంది
యుందురు.
నిజమైన
భక్తులు
కొద్దిమంది
మాత్రమే,
సర్వమూ
విసర్జించి
దైవాన్ని
మాత్రము
దర్శించుకొని
ఆనందింతురు.
అటులనే
సత్పురుషుల
దగ్గరకు
వెళ్ళునప్పుడు,
వారి
దర్శనస్పర్శనసంభాషణలకై
తహతహలాడక,
వచ్చిన
కారణమేమిటని
గుర్తించి
వర్తించక
తీర్థయాత్రలు,
క్షేత్రయాత్రలు
అని
ఊరక
సంచరించినయెడల
వచ్చిన
లాభమేమిటి?
అందుకోవలసిన
విషయమేమిటని
గమనించక,
కాలమును,
ధనమును
దుర్వినియోగము
చేయుదురు.
కొందరు
మాత్రమే
తద్వారా
గమ్యమును
చేరుదురు.
కాని,
సాధకులు
మాత్రమట్టి
భిన్నమైన
దృష్టితో
మెలగిన,
వారిని
అది
పెడమార్గములో
పడవేయును.
ప్రశాంతినిలయమునకు
ఎందుకొరకై
వచ్చినాము
అని
యోచించి,
ఆ
వచ్చిన
పనికొరకై
పూనుకోవటము
లేదు.
లక్ష్యమును
చేరుచున్నామా,
వచ్చిన
కార్యాన్ని
సాధించే
నిమిత్తమై
కృషి
సలుపుతున్నామా
అని
పరీక్షించుట
లేదు.
అట్లుచేసియున్న,
మన
భారతదేశము
ఇంత
దుస్థితికి
వచ్చియుండెడిది
కాదు.
తండ్రులు,
తాతలు,
ముత్తాతలు
సంపాదించి
ప్రోగుచేసిపెట్టిన
ధనమును
కొడుకులు,
మనుమలు,
మునిమనుమలు
ఏరీతిగా
దుర్వినియోగము
చేయుదురో
అదేరీతిగా
గొప్పగొప్ప
మహర్షులు,
మహనీయులు,
దైవాంశసంభూతులు,
అవతారపురుషులు
మధించి
అందించిన
సుధానిధిని
మనము
దుర్వినియోగము
చేయుచున్నాము.
సర్వశాస్త్రసారము,
సర్వమార్గములయొక్క
మూలము,
సర్వుల
గమ్యము
ఆధ్యాత్మికతత్త్వము.
దీనిని
గుర్తించక,
లౌకికమైన
అపవిత్రభోగములకు
కాలము,
కాయము,
కర్మలను
దుర్వినియోగము
చేయుచున్నాము.
కాలముతో
బంధింపబడిన
కాయము,
ఆ
కాయముతో
సల్పు
కర్మము,
పరమాత్ముని
అంగములైన
పంచభూతములు,
వాటిని
గ్రహించే
ఇంద్రియములు
వీటిని
దుర్వినియోగము
చేసిన
ఆ
పరమాత్ముడు
అగమ్యముగను,
అగోచరముగను
వుంటాడు.
అయితే,
శబ్దస్పర్శరూపరసగంధాదులను
భగవదర్పితముగా,
భగవద్దృష్టితో,
ఆదరణపూర్వకముగా
సద్వినియోగము
చేసిన,
పరమాత్ముడు
సమీపములోనే
నిలబడును.
కర్ణములు
భగవద్విషయములనే
వినగోరుచు,
నేత్రములు
దివ్యస్వరూపమునే
దర్శింపగోరుచు
జీవితమే
ఒక
భగవదారాధనగా
మారవలెను.
ఎవరికివారు
తన
సత్యమును
తెలుసుకొనవలెనని
మన
హిస్లాప్కూడ
యిపుడు
సూచించాడు.
నేనెవరు
అనే
ప్రశ్నకు
‘నేను
నేనే’
అనేది
జవాబు.
నేను
దేవుడు
అనేదానికంటే,
నేను
నేనే
అనే
సత్యమును
జీవితములో
నిరూపణము
చేయటమే
పరమ
లక్ష్యము.
నేను
ఈ
దేహము
కాదు.
ఇంద్రియములు
కాదు.
మనస్సు
కాదు.
బుద్ధి
కాదు.
చిత్తము
కాదు.
వీటన్నిటినీ
తెలుసుకొని
వాటితో
పనిచేయించుకొంటున్న
‘నేనే’
నేను.
ఈ
యదార్థమును
భారతీయులేకాదు,
యావత్ప్రపంచములోని
తత్త్వవేత్తలందరూ
పరిశోధనలు
సల్పి,
ప్రమాణములను,
ఆధారములను
పరిశీలించి
దీనినే
సత్యమని
తెలిసికొంటున్నారు.
పూర్వము
గ్రీకుదేశస్థుడు
సోక్రటీస్
అనువాడు
వుండేవాడు.
ఆయనను
అక్కడి
ప్రజలు
అనేకరీతులుగా
హింసలు
పెట్టిరి.
మంచివారికి
యిది
యేనాడూ
తప్పినదికాదు.
జీసస్సును
యేరీతిగా
బాధలు
పెట్టారో
ఈ
సోక్రటీసునుకూడా
అదేరీతిగా
బాధలు
పెట్టిరి.
ఒకనాడు
శిష్యులందరిని
దగ్గర
కూర్చుండపెట్టుకొని,
‘నాయనా!
నాకింత
విషము
యీయండి.
నేను
ఈ
జన్మమును
చాలించుటకు
నిర్ణయించినాను.
నేను
యిక
నిశ్చింతగా
వుంటాను’
అన్నాడు.
అప్పుడు
ఒక
శిష్యుడు
ప్రశ్నించాడు,
‘స్వామీ!
మీరు
మరణించిన
తరువాత
మేము
యేరీతిగా
సంస్కరింపవలెను?’
అని.
దానికి
సోక్రటీస్,
‘మీరెవరో
తెలుసుకొన్నప్పుడు
నన్ను
యేరీతిగా
సంస్కరింపవలెను
అనేది
మీకు
గోచరమగును.
నేను
మరణించే
వస్తువు
కాదు.
ఇక
ఈ
దేహమా?
దీనిని
ఈ
ప్రాంతీయులు
యేరీతిగా
సంస్కారము
చేయుదురో
అట్లు
చేయండి.
నా
యిష్టములేవీ
లేవు’
అన్నాడు.
నేనెవరు
అనేదానిని
తెలుసుకొనుటయే
సాధనల
గురి.
ఆ
గురిని
సాధించితే
దేవుడంటే
ఏమిటి
అని
తెలుసుకొనవచ్చు.
ఈనాడు
పాతకాలపు
ఆధ్యాత్మికమార్గము
బలహీనమని,
మూఢమార్గమని
వాదోపవాదములు
పెరిగి
ప్రజలు
ఇతరదేశీయుల
పద్ధతులను
అనుసరించుచున్నారు.
2
▾
Meaning
Keep
గడచినదంతయూ
గర్హింపబడవలసినది
కాదు.
నవ్యమంతయును
భవ్యము
కాదు.
మానవ
జీవితములోని
నిత్యసత్యమైన
ఆనందమును,
సుఖశాంతులందించే
మన
సంస్కృతిని,
ఆచారసాంప్రదాయములను
సంరక్షించి,
సమన్వయము
చేసుకోటమే
భారతీయ
సమస్యలకు
సమంజస
మార్గము.
ఇతర
దేశీయుల
పద్దతులను
అనుసరించి
పెడమార్గము
పడితే
కృత్రిమ
జీవితమును
తయారు
చేసుకొనవచ్చును.
వేష
భాష
భూషణాదులవల్ల
వారిని
పోలగలరేగాని
వారి
చిత్తము
కలిగిన
వ్యక్తులుగా
మాత్రము
తయారు
కాలేరు.
సాధకులు
మొట్టమొదట
ప్రమాణముగా,
తమ
గురిగా,
గుర్తుగా
ఒక
రూపమును
ఒక
నామమును
నిర్ణయము
చేసుకొని
ప్రయాణము
సలుపవలెను.
దానినుంచి
కదలకూడదు.
ఏకాగ్రతతో
దానిని
సాధించవలెను.
ఆ
స్థానము
చేరిన
తరువాత,
వారికి
దానికన్న
ఉత్తమ
స్థానము
అచ్చటనే
గోచరమగును.
అంతవరకు
ధృడత్వముతో,
ధీరత్వముతో
సాధన
బలము
వలన
పయనించేది
తప్పదు.
ప్రయాణము
ఎక్కడికి
అని
తెలియకపోతే,
అది
అవివేకానికి
గుర్తు.
దైవత్వమును
పొందాలి,
ఆనందమును
అనుభవించాలి,
అమృతత్త్వములో
లీనముకావాలి.
ఈశ్వరుని
సాక్షాత్కరింపచేసుకోవాలి.
ఏదో
ఒక్కటి
నిర్ణయించుకొని
బయలుదేరాలి.
అర్థంకాని
పదములతో
అంతులేని
ఆశలతో
సాధనలు
మొదలుపెడితే,
అంధకారమే
ఫలితమగును.
రాముడు,
కృష్ణుడు,
శివుడు,
విష్ణువు,
దుర్గ
అనే
ఏదో
ఒక
సాకార
రూపమునో
లేక
ఆత్మానందము,
అమృతత్త్వము,
అభయమనే
నిరాకారమునో
లక్ష్యమందుంచుకొని
దానిని
సాధించేకొరకు
నియమితమైన
క్రమశిక్షణలను
తూ.చ.
తప్పక
పాటించవలెను.
ఒక
మహారాజు
తన
రాజ్యమును
పరిపాలించుచూ,
సుక్షేమముగా
కాలమును
గడుపుచున్నాడు.
వాని
ఆస్థానమున
పురోహితులు,
పండితులు,
మంత్రులు,
గాయకులు
కలరు.
వీరిమధ్య
ఎప్పుడూ
తమాషాలాడుచూ
ప్రశ్నలకు
మారు
ప్రశ్నలు,
కొంటె
ప్రశ్నలు
వేసి
జవాబిచ్చే
దురలవాటుగల
ఒక
విదూషకుడుండేవాడు.
వానికి
రాజుగారు
అవివేకశిఖామణి
అని
పేరును
పెట్టి
ఒక
టోపీపై
పెయింట్
వేయించి,
ఆయన
శిరస్సుపై
పెట్టి
ఎల్లప్పుడూ
ఆస్థానములో
దానిని
ధరించే
తీరాలి
అని
ఆజ్ఞాపించినారట.
ఇట్లుండగా,
మహారాజుకు
ఒక
భయంకర
వ్యాధి
సంభవించినది.
అంత్యసమయముకూడా
ఆసన్నమైనది.
కాబట్టి,
మంత్రులు,
రాణులు,
బంధువులు,
సామంతులు
అందరినీ
తన
దగ్గరకు
పిలిపించి
వారలకంతా
చెప్పవలసినవన్నీ
చెప్పి
వెళ్ళుచున్నానన్నాడు.
అందరితోబాటు
అవివేకశిఖామణినికూడా
రప్పించినాడు.
‘అందరితో
మంచిగా,
నిదానముగా,
తుంటరిమాటలు
మాని
సమరసముగా
మెలుగుము,
నాయనా!
నేను
వెడుతున్నాను’
అన్నాడు
రాజు.
అప్పుడు,
వాడు
‘కొంచెము
ఆగండి
ప్రభో!
మీ
సుఖ
ప్రయాణము
కొరకు
ఒక
గుఱ్ఱమును
తెచ్చెదను’
అన్నాడు.
గుఱ్ఱము
పనికిరాదన్నాడు
రాజు.
పోనీ
‘ఏనుగును
తెచ్చెద’నన్నాడు.
అచ్చటికి
ఏనుగు
పోదన్నాడు
రాజు.
అట్లయితే
‘పల్లకి
తెచ్చెదను,
దానిలో
హాయిగా
పయనించవచ్చును.
నేనుకూడా
మోయుదును,
ఇంక
ముగ్గురుని
తీసుకొని
వచ్చెదను’
అన్నాడు
ఆ
అవివేకి.
‘కాదురా!
పల్లకి
ప్రయోజనము
లేదు.
నువ్వు
రావటానికి
వీలులేదు.
నేనొక్కడినే
పోవలెను’
అన్నాడు
రాజు.
‘అరే!
అది
ఎక్కడ?
ఏ
స్థలము?
గుఱ్ఱము
ప్రవేశించనిది,
ఏనుగుకు
అసాధ్యమైనది,
పల్లకిలో
ప్రయాణము
చేసి
చేరుటకు
వీలుకానిది,
తోడునీడగా
ఎవరూ
రాకూడదనే
స్థలము
ఎక్కడున్నది
ప్రభూ?’
అని
ప్రశ్నించాడు.
దానికి
రాజు,
‘అదెట్టిదో,
ఎక్కడిదో
నాకే
తెలియదురా’
అని
జవాబిచ్చాడు.
‘వెడతానంటారు,
ప్రయాణమంటారు.
ఏదీ
వద్దంటారు.
ఎక్కడికో,
ఏమిటో
తెలియదంటారు,
ఈ
అవివేకశిఖామణి
టోపీ
యికపై
మీకే
సరి’
అని
చెబుతూ
అతడు
దానిని
తన
తలపైనుంచి
తీసి
ఆసన్న
మరణుడైన
మహారాజు
శిరస్సుపైనుంచాడు.
గమ్యమేది,
ఎక్కడికి
అని
తెలియక
సాధనలు
సలుపువారుకూడా
అవివేకశిఖామణులే!
సాధనలో
ముఖ్యమైనది,
త్వరత్వరగా
ఫలితమునందించేది
ప్రార్థన,
భజన,
నామసంకీర్తనములే.
శరీరమునకు,
మనస్సుకు
వీటివలన
మంచి
పరిశుద్ధి
కలుగును.
డా
॥
థామస్
హిస్లప్
అనే
ఒకాయన
ప్రార్థన
వలన
దేహము,
మనస్సు,
బుద్ధి
వీటిలో
మార్పులను
గురించి
పరిశీలన
సలిపి,
ఆరోగ్యము,
సుఖనిద్ర,
మనశ్శాంతి,
హృదయము
చక్కనిరీతిగా
పనిచేయటము,
రక్తచలనము
సమవేగముతో
జరగటము
మొదలగునవి
శాస్త్రీయముగా
నుండునని
కనిపెట్టినాడు.
ప్రార్థన
వలన
మనస్సు
మధురమగును.
భిన్నత్వములో
ఏకత్వము
గోచరించును.
తన్మయత్వము
వలన
ఆనందము
స్థిరమగును.
ఇంత
అభివృద్ధి
మరొకరీతిలో
లభించదు.
ఈ
కారణము
చేతనే
సత్యసాయి
సంస్థలు
అన్ని
గ్రామములలోనూ
బ్రహ్మముహూర్తములో
ప్రతి
దినము
నగరసంకీర్తనము,
ఉదయము,
సాయంత్రము
భజనలను
ఆనందముగా
చేయవలసినదిగా
ఆదేశించినాము.
ఈ
పద్దతులను
అనుసరించుటవలన
వాతావరణము
పవిత్రమగును.
ఆ
పవిత్ర
వాయుమండలములో
లీనమై,
ఎవరెవరు
ఆ
గాలిని
పీల్చుకొందురో
వారి
హృదయములు
దివ్యత్వముతో
నిండియుండును.
అయితే,
స్వామి
భజనలు
చేయమన్నారని,
ఆ
ఆజ్ఞను
పాలించేకొరకు
ఇతరుల
హృదయములను
చలింపచేసే
భజనలు
మాత్రము
చేయకూడదు.
ఇతరుల
హృదయములను
శాంతపరచి,
వారికి
శ్రద్ధోత్సాహములను
ప్రబోధించి,
వారిని
ఆనందమున
ముంచి,
మంచి
భావములను
ప్రబోధించే
గానముగా
నుండవలయును.
రాగ,
తాళ,
స్వరములు
మధురముగా
నుండవలయును.
కాని,
కొన్ని
ప్రదేశములలో
అట్లు
జరుగుట
లేదు.
ఏదోరీతిగా,
అక్కడనే
ఒక
రిహార్సిల్
చేసినట్టు,
క్రొత్తక్రొత్త
పాటలను
పాడుదురు.
3
▾
Meaning
Keep
వినేవారి
హృదయములు
దానివలన
ఏకత్వముననుభవించి
ఆనందమును
ఆస్వాదించవు.
అందరూ
చేరి
ఏకముగా
పాడి
ఆనందించే
అవకాశము
లేదు.
అపస్వరముగా,
మధురముగాని
గొంతుతో
పాడిన
అది
హృదయములను
చలింపచేయును.
పాడే
ఆయనకేమో
అది
రాగముగా
తోచవచ్చును.
అయితే
వినేవారికి
అది
రోగముగనే
తోచును.
దీనికన్న,
వారు
ఊరుకుంటే
అదే
పెద్ద
ఉపకారము.
హృదయమును
ఉప్పొంగురీతిగా
పాడవలెను.
డల్‌గా,
రసహీనముగా,
వికారభావములతో
వాళ్ళకు
నచ్చిన
పాటలనందుకొని
పాడి
ముగించిన
అదెట్లు
భజన
అగును?
యువకులు
ఆధ్యాత్మిక
భావమును
విరుద్ధముగా
చూచుదురని
అందురేగాని,
వారికి
దానిపై
విశ్వాసము
కలిగితే,
వారూ
అమితానందమును
అనుభవింతురు.
సమాజమునకు
సుఖశాంతులు
దొరకును.
అయితే,
ఆచరణ
లేకుండా
ప్రబోధలు
సలిపితే
యువకులు
దానిపై
నమ్మకమును
పోగొట్టుకొందురు.
కృతయుగమున
యోగము,
జపము,
తపములు
ముఖ్య
సాధనలు.
ద్వాపరయుగమున
సాక్షాత్కార
మార్గములు,
కలియొక్క
యుగధర్మము
నామస్మరణ.
వాడవాడలో
సంకీర్తనలు
జరుగవలెను.
పాశ్చాత్య
నాగరికతయొక్క
ప్రభావము
వలన
దేవాలయములను,
పుణ్యతీర్థములను
హేళనము
చేసే
మనోభావములు
పెరిగిపోవుచున్నవి.
అయితే,
ఆస్తికులు
దూషణభూషణలకు
క్రుంగక,
లొంగక,
పొంగక
స్వామికి
యిష్టమైన
ఈ
కార్యమును,
ఈ
సాధనను
పురస్కరించుకొని
ఆచరింపవలెను.
Previous
←
Give and gain
Next
Śivarātri at Brindavan
→