Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1972 · Śivarātri at Brindavan
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Śivarātri at Brindavan
13 February 1972, Mahāśivarātri, Brindavan, Whitefield
1
▾
Meaning
Keep
భారతీయులు
అనుష్ఠానప్రియులు;
ఆచరణశీలురు,
కాబట్టి
శివరాత్రి
మొదలైన
పవిత్ర
పర్వదినములను
వాటి
అంతరార్థముననుసరించి
అనుభవించి
ఆనందించేందుకు,
స్వస్వరూపమును
గుర్తించి
దానిని
సాక్షాత్కరించేందుకు
కావలసిన
సాధనలకు
పూనుకొనేదే
పర్వదినముల
పరమోద్దేశము:
ఆహారవిహారములను
ఆరగించే
కొరకు
కాదు
నిజతత్వమును
గుర్తించక
జీవితమును
అంధకారములోనే
గడుపుట
అజ్ఞానుల
రీతియేకానీ
వివేక
విచక్షణ
వైరాగ్యముల
గుణములను
వరప్రసాదముగా
పొందియున్న
మానవుల
లక్షణము
కాదు:
2
▾
Meaning
Keep
మానవ
జీవితములో
ఈశ్వరత్వమును
ప్రకటించవలెను.
మానవ
సమాజమునకు
ఈశ్వరత్వమే
పునాది,
ఈశ్వరత్వమే
ప్రధానము.
అది
అహంకార
పూరితమైయుండిన
వికారమగును:
దుఃఖమయమగును.
భారతీయ
సంస్కృతియందు
కూడ
ఇట్టి
వికారమూ
వికృతి
భావములూ,
నవనాగరికతయొక్క
ప్రభావము
వలన,
పెరుగుచున్నవి.
భగవంతుడు
లేడని
బల్లగొట్టి
చెప్పేవాళ్ళు
భారతీయులలోనే
యున్నారు.
తీర్థయాత్రలు,
క్షేత్రదర్శనములు
మూర్ఖత్వమని
హేళనము
చేయువారు
మిక్కిలిగా
కలరు.
అయితే,
దివ్యత్వము
యెంత
లేదన్న
పోయేది
కాదు!
తనకు
అయిష్టమనిపించునదంతా
వ్యర్థమని
చెప్పేదికూడ
మూర్ఖత్వమే.
ఆధ్యాత్మికము
వ్యక్తిగతము
కాదు;
సమష్టిస్వరూపముగా
సాక్షాత్కరించే
స్వస్వరూపమే,
దాని
ఫలితము.
ఆధ్యాత్మిక
జీవితాన్ని
ఒంటరితనముగాకానీ
ఏకాకి
జీవితముగా
కానీ
యెంచరాదు.
మానసిక
రాగద్వేషములతో
నిమిత్తము
లేకుండ,
మానవకోటి
యావత్తుతో
ఏకమై,
పరిపూర్ణమై
ఉండగలిగిన
స్థాయి,
ఆధ్యాత్మికస్థాయి!
ఈ
సత్యమును
గుర్తించుటకు
బుద్ధి,
ప్రధానమైన
ఆధారము
బుద్ధి
ద్వారా
స్వరూపమును
వెతకవలెను:
దానిని
గుర్తించి,
దివ్యత్వమును
తెలిసికొని
ఆనందించవలెను.
కానీ,
ఇప్పుడు,
ఇట్టి
మార్గమునకు
విరుద్ధముగా
ప్రవర్తించి
భిన్నమార్గమందు
బయలుదేరి,
అయోమయ
జీవితమునపడి
బాధపడుదురు,
తెల్లవారుజామునుండి
రాత్రి
వరకూ
బయటనుండి
దొరకే
సుఖముల
కొరకే
ప్రాకులాడుట
అలవాటయినది.
3
▾
Meaning
Keep
బుద్ధిని
అంతర్ముఖముగా
ప్రవేశపెట్టి,
తద్వారా
ఆత్మను
గుర్తించేందుకు
ప్రయత్నము
చేయుటలేదు.
పశువులకు
బయటదృష్టి
సహజము:
మానవుల
ప్రత్యేకత
ఈ
లోదృష్టి.
మానవుని
బయటదృష్టి
హానికరముగానుండును
అన్నమునకు
ప్రాకులాడక,
ఆత్మను
వెతికే
బుద్ధిని
అభివృద్ధి
చేయుటయే
మానవుని
జీవిత
లక్ష్యము.
విద్యలను
ఎంత
సంపాదించినను,
బలమెంతయుండినను,
అధికారములెన్ని
పొందినను,
ప్రవర్తన
ద్వారా
విజ్ఞాన,
ప్రజ్ఞాన
సుజ్ఞానముల
కొరకై
ప్రాకులాడవలెను.
ఇవి
లేకుండుట,
వ్యక్తిత్వమునకే
అవమానము.
ఆహార
విహారముల
నిమిత్తమే
జీవితమనుకొన్నచో,
మనిషిగా
పుట్టనక్కరలేదు.
కుక్కలు,
నక్కలు
ఆ
ఉద్దేశ్యమును
నిర్వహించును!
అన్నము
వెదకేవాడు
పాపి,
ఆత్మను
వెదకేవాడు
గోపి,
అని
గోపికల
విషయమై
భాగవతములో
పేర్కొన్నారు
కూడ,
చిత్తవృత్తులను
కామక్రోధములను
చిమ్మచీకటినుంచి
విడుదల
చేసేదే
ఆధ్యాత్మిక
క్రమశిక్షణయొక్క
పరమోద్దేశము.
మానవులు,
కామము
వలన,
రాముని
మరచిపోదురు.
క్రోధమే,
కామమునకు
వెంట
జంట!
ఇవి
రెండు
మానవుని
దానవునిగా
తయారుచేయును.
పొగ
కప్పిన
నిప్పువలె,
కామము
చిత్తములో
అణగియుండును.
కామతృష్ణకు
అంతులేదు.
4
▾
Meaning
Keep
వీటినుంచి
విడుదల
పొందవలెనన్న,
వాటి
మూలస్థానమేదో
కనుగొనుటకు
ప్రయత్నించవలెను.
అప్పుడు
ఇంద్రియములు,
ఇంద్రియములననుసరించే
మనస్సూ,
కామ
క్రోధముల
కాధారమని
తెలియును.
దీనికే
పెద్దలు
ఇంద్రియనిగ్రహము
నుపదేశింతురు.
క్షణభంగురమైన
విషయవాసనలకు
మనోబుద్ధులనంకితముచేసి,
వాటిని
ఇంద్రియముల
మూలకముగా
బాహ్యప్రపంచమున
విహరింపజేసి,
మానవులు
అశాంతిలోపడి,
పవిత్రమైన
ప్రశాంతికి
దూరమై
పోవుచున్నారు.
జీవిత
సైకతముపై
పెనుగాలి
మేడ
నిర్మించి
అదే
శాశ్వతమని
మానవుడు
విశ్వసించి
అజ్ఞానిగా
తయారైపోవుచున్నాడు.
జగత్తులోని
ప్రతి
పదార్థము
స్థిరము
కాదు:
ఏ
ఒక్కటికూడ
మానవునకు
దక్కేది
కాదు!
అవన్నీ
యెండమావులు
మానవుని
బుద్ధిని
మోసగించి
భ్రమింపజేసి
నిరాశలో
ముంచివేయునని
తెలిసికొనేదే,
ఆధ్యాత్మికముయొక్క
ప్రథమ
సోపానము.
ప్రతియొక్కరికి
మానసికశాంతి
అత్యవసరము;
ధనము,
మదము,
అధికారము,
దేహబలము
వీటివలన
లభించేది
అశాంతికాని,
శాంతికాదు!
శాంతి
దొరకవలెనన్న,
ఒక
దైవభావమే
దానికి
తగిన
ఉపాయము.
కొంతమంది
“సత్యాన్వేషణ”
కు
పూనుకోవలెనని,
ఉపదేశింతురు,
సత్యమే
తన
స్వరూపము,
కాబట్టి,
దానిని
అన్వేషించ
నక్కరలేదు,
దానిని
గుర్తించితే
చాలు;
సత్యమే
తానని
తేలును.
సత్యప్రకటనమును
చేయుటకు
పూనుకొనవలెను
కాని,
అన్వేషణము
అనవసరము.
5
▾
Meaning
Keep
మానవుని
సత్యత్వము,
దివ్యత్వమే.
దీనిని
ప్రకటించు
నిమిత్తము
మహర్షులు,
మహనీయులు
పర్వదినములను
యేర్పరచినారు;
మహాశివరాత్రియొక్క
ఉద్దేశముకూడను
ఇదియే.
ప్రొఫెసర్
గోకాక్
ఇపుడు
మీకు
మహాశివరాత్రియొక్క
విశిష్టతను
గురించి
తెలిపిరి,
కదా?
శివుడు,
హాలాహలమును
మ్రింగి
జగత్తును
రక్షించిన
దినము,
తాండవనృత్యము
సలిపిన
దినము,
ప్రథమముగా
లింగాకారమును
దాల్చిన
దినము
అని
పురాణములు
ఈ
పవిత్ర
దినమును
కొనియాడుచున్నవి.
ఇవన్ని
కథలమూలకముగా
ఆదర్శములనందించి,
మానవునికి
తన
నిజస్థానమును
గుర్తింపజేసే
కొరకేగాని,
వేరు
కాదు.
అందని
చందమామను
వ్రేలతో
చూపినట్లు,
అనుభవములను
ఆశయములద్వారా
ఆదర్శములను
హృదయమున
నాటుటకు
చేసే
ప్రయత్నములు.
ఉదాహరణమునకు
శివరాత్రినాడు
జాగరణ,
ఉపవాస
వ్రతములు
అంటున్నాము.
నవనాగరికతలో
పడినవారు
ఈ
రాత్రి
మూడు
లేక
నాలుగు
సినిమాలకు
వెళ్ళి
కూర్చుని
లేదా
పేకాట్లను
తెల్లవారేవరకు
ఆడి,
జాగరణ
నిర్వహింతురు.
చేపలపైనే
దృష్టినుంచి
యేకాగ్రతతో
ఒంటికాలుపై
నిలుచు
కొంగకు
మోక్షమగునా?
కల్లు
సారాయి
త్రాగి
మతి
చెడిన
అది
తన్మయత్వమనిపించునా?
భార్యపై
క్రోధించి
భోజనము
మాని
పస్తుపరుండిన
అది
ఉపవాసమగునా?
6
▾
Meaning
Keep
ఒక్కొక్క
నియమనిష్ఠకు
అంతరార్థమేది
అని
విచారించి,
తెలిసికొని
ఆచరించిన,
దాని
ఫలితము
దొరకును,
కాని,
ఆడంబరము
కొరకు,
పేరుప్రతిష్ఠల
కొరకు,
ధనార్జన
కొరకు,
పటములను
పూజించటము,
విగ్రహములను
ప్రతిష్ఠ
చేయటము,
మందిరములను
నిర్మించటము
వ్రతములనాచరించటము.
ఇవన్నీ
నిరర్థకములే.
వీరందరు
భగవంతుణ్ణి
సరిగా
నర్థముచేసికొన్నవారు
కాదు,
7
▾
Meaning
Keep
Also in his talks
(2)
9 January 1988
God in the heart, work in the hands
20 March 1988
Bhārat is the home of Satya and Dharma
అందరిలోను
తన
ఆరాధన
దైవమున్నాడనే
విశ్వాసమును
అతి
పెద్దగా
నభివృద్ధి
పరచ
వలెను.
తనలోనూ
అంతర్యామిగా
ఆ
దైవమే
యున్నాడు.
తన
కర్మలన్నీ
అతనికే
అర్పితము,
అదే
అతని
పూజ,
అను
భావము
ధృఢముగావలెను.
అపుడు
సదా
జాగరణగా
సదా
ఉపవాసముగా
జీవితము
జరుగును.
కష్టము,
నష్టము,
విచారణ,
విషాదము
అన్నీ
మరుగైపోవును.
నమ్మి
చెడినవారు
లోకములో
లేరు,
భగవత్ప్రేమను
హృదయక్షేత్రమందు
నాటి
పెంచితే,
ఆనందమనే
పంట
దొరకును.
“ఈశ్వర
స్సర్వ
భూతానాం
హృద్దేశేర్జున
తిష్టతి”
జడమైన
విగ్రహములను
పూజించేదాని
కన్న,
సజీవ
దేవతా
విగ్రహములైన
మానవులను
సేవించటముచేత
నిత్యసత్యమైన
ఆత్మానుభూతి
లభించి
అమితానందము
చేకూరును.
ఉత్తరప్రదేశమున
పరమ
భక్తుడొకడు
శ్రీకృష్ణుని
సాక్షాత్కరించే
కొరకు
యెవరిని
ఆరాధించాలి
అని
తర్కించి,
భక్తపరాధీనుడైన
కృష్ణుడు
రాధా
హృదయమున
బంధింపబడి
యున్నాడని
తెలిసికొని
రాధనే
ప్రార్థించి
శ్రీకృష్ణుని
ఆమె
దయవలన
వీక్షించి
తరించవలెననే
యుద్దేశముతో
రాధా
రాధా
రాధా
అంటూ
నామస్మరణలో
మునిగినాడు.
అతని
జీవితము
ఆవేదనా
పూరితమై
భరించుకోలేని
తృష్ణతో
నిండిపోయినది.
అతడు
నివసించు
గ్రామము
సమీపములోనే
సరస్వతీ
నది
ప్రవహించుచున్నది.
ఒకదినము
ప్రభాతమున,
ఆ
నదీ
తీరమునందున్న
రోడ్డుపై
ఒక
గాజులవాడు
పల్లెలగుండ
వచ్చుచూ
తన
గాజుల
విక్రయానికి
ఆ
గ్రామమునకు
వచ్చెను.
8
▾
Meaning
Keep
ఆ
నది
మధ్యన
ఒక
పల్లెపడుచు
బట్టలుతుకుచు
ఆయనను
పిలిచినది.
ఒక
హస్తమునకు
గాజులు
తొడిగి
ముందుకు
వెళ్ళు
అన్నది.
ఆమెయొక్క
దివ్యతేజస్సు,
కన్నుల
ప్రకాశము,
మాటల
మాధుర్యము
వీటిని
గమనించి,
గాజులవాడు
అచ్చటనే
తన
గంటును
దింపి,
ఒక
హస్తమునకంతా
పూర్తిగా
గాజులు
తొడిగినాడు.
నా
కింక
చాలు,
గ్రామములో
ఫలాని
వీధిలో
నా
తండ్రిగారిని
అడిగి
నీ
డబ్బు
తీసుకో,
అని
ఆమె
అన్నదాన్ని
అతడు
నమ్మినాడు
ఒకవేళ
నా
తండ్రిగారు
నా
దగ్గర
డబ్బు
లేదంటే
ఆయనకు
చెప్పు.
పూజాగదిలో
ఆయన
పూజించే
పటమునకు
వెనుక
గోడకు
గూడున్నది.
దానిలో
నాకియ్యవలసిన
డబ్బున్నది
అని.
ఆమె
మాటలపై
సంపూర్ణవిశ్వాసముతో
అతడు
ఆయింటికి
పోతే,
ఆ
రాధారాధకుడు,
కృష్ణభక్తుడు
“ఇదేమి
ఆశ్చర్యము!
వింతగా
నున్నదే?
నాకు
పెండ్లి
కాలేదు.
మరి
కూతురెక్కడిది?
గోడకు
గూడు
లేదు,
ఎక్కడి
గాజులు
ఎక్కడి
డబ్బు?”
అని
కంగారు
పడితే
గాజులవాడన్నాడు.
“స్వామీ!
మీరు
పొరపడుతున్నారు.
తప్పక
వెళ్ళి
చూడండి
అని,
ఆయన
పరుగు
పరుగునపోయి
పటము
వెనుక
చూచితే
గూడున్నది.
డబ్బుకూడ
అతనికివ్వవలసినదెంతో
అంతమాత్రమున్నది
ఆయన
పరమానంద
భరితుడై
“ఆహా;
నా
రాధాదేవి
నీకు
ప్రత్యక్షమై
నీచేత
గాజులు
తొడిగించుకొన్నదా!
నువ్వెంత
ధన్యుడవు!
రా!
నదీ
తీరమున
నాకు
ఆమె
దర్శనభాగ్యము,
తలవ్రాతలో
నున్నదేమో”
అని
పరుగెత్తినాడు.
9
▾
Meaning
Keep
సరస్వతీ
నదీతీరమున
నిలిచికొని
ఆరాటపడుచూ,
స్తోత్రము
చేయుచూ,
ప్రార్థించినపుడు
నీటిపై
నిండుగా
గాజులు
తొడిగిన
ఆమె
హస్తము
మాత్రము
దర్శనమిచ్చినది.
నీ
ముఖపద్మమును
ఒక
నిమిషము
దర్శించే
భాగ్యము
నాకు
లేదా,
అంటే,
అశరీరవాణి
పలికినది.
శ్రీకృష్ణునకు
తప్ప
అన్యులకు
నా
ముఖము
చూపను.
అందరిలోను
రాధాతత్త్వము
అందరిలోను
కృష్ణతత్త్వము
ఉన్నది.
దానిని
ఆరాధించితే
ఫలితము
లభించును.
జడమైన
విగ్రహములు
పటములు
వీటికంటె
సజీవ
మానవులనే
దైవముగా
భావించి
ఆరాధించండి.
ద్వేషాసూయలు
లేక
సర్వులను
ప్రేమించి
సేవించండి.
అందరిలోను
శివుడున్నాడు.
శివుడు
లేనివాడు
శవమైపోతాడు
కదా?
కాబట్టి,
దేవుడు
ఏ
అమరనాధములోనో,
కాశీలోనో,
భద్రాచలములోనో,
తిరుపతిలోనో
మాత్రమున్నాడనే
భావమును
పూర్తిగా
తీసివేసి,
అతడు
సర్వవ్యాపి,
సర్వాంతర్యామి,
సర్వభూతాంతరాత్మ
అని
విశ్వసించి
అందరినీ
దైవభావముతోనే
ఆదరించవలెను
శివుడు
సర్వవ్యాపకుడు
అనే
విశ్వాసము
మీ
శ్వాసగా
మారిపోవలెను
ఆ
శ్వాసనే
స్వస్వరూపముగా
సందర్శించుకొనవలెను
రాత్రి
అంటే
చీకటితో
చేరినది,
అయితే
అజ్ఞానాంధకారమును
దూరముచేసితే
ఆ
చీకటిలోనే
ఆనందముననుభవించ
వచ్చును.
దానిని
బోధించేదే
శివరాత్రియొక్క
ఉద్దేశము,
10
▾
Meaning
Keep
మంగళకరమైన
తన
శివతత్త్వమును
ప్రకటించుకొరకు
ఒక
సంవత్సరమంతా
కాచుకొన
నక్కరలేదు.
చిత్తములోని
వాంఛలను
తీసివేసి,
హృదయములోని
ఆశలను
అజ్ఞానమును
పారద్రోలి
దృష్టినుంచి
కామ
క్రోధాదులను
నిర్మూలము
చేసిన
అదే
శివరాత్రి.
ప్రేమకు
మించిన
పరికరము
లేదు.
నిత్యజీవితములోని
ప్రతి
పనినికూడ
ప్రేమతో
ఆచరించండి.
భగవద్విశ్వాసమును
పెంచుకొని
అన్ని
పనులను
భగవదర్పితముగా,
శక్తివంచనలేక
భక్తివంచన
కాకుండ
సలుపండి.
జపముకాని,
తపముకాని,
యోగయాగములుకాని
మీరు
చేయనక్కరలేదు.
నిరంతరము
అందరిలోను
మంచిమాటలు,
మితభాష,
మధురభాష,
భగవన్నామస్మరణ
యుండిన
చాలు.
పిల్లలు
మొదలు
పెద్దల
వరకు
ఈ
మార్గముననుసరించిన
జీవిత
గమ్యమనే
దైవానుగ్రహమునకు
అందరునూ
పాత్రులగుదురు.
Previous
←
Bhajan as saadhana
Next
The toughest armour
→