Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Imitations
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Imitations
14 January 1973, Sankranthi, Brindavan
First talk
Second talk
1
▾
Meaning
Keep
బుద్ధగయలో
బోధివృక్షముక్రింద
కూర్చొని
తపధ్యానముల
నాచరించి
సిద్ధార్థుడు
పరిపక్వస్థితిని
పొందినపుడు,
కొంతమంది
అక్కడచేరి
చాలానీచముగా
బుద్ధుణ్ణి
దూషించినారు.
దాన్ని…ని
కోపోద్రిక్తులైన
అనుచరులు
శిష్యులూ;
“స్వామి!
మాకు
శెలవీయండి
వీరికి
చక్కని
గుణపాఠము
చెప్పుతాము.
దండం
దశగుణం
భవేత్.
వీళ్లవీపులు
పగిలితేగాని
వీళ్లకు
బుద్ధిరాదు”
అని
అడుగగా,
బుద్ధుడు
“నాయనా!
నన్ను
దూషించి
వారు
యెంత
ఆనందపడుచున్నారు?
చూడండి!
మీరు
భూషించి
ఆనందము
పొందితే,
వారు
దూషించి
సంతృప్తిని
సంపాదించుచున్నారు.
వారివలన
నాకేమీబాధలేదు;
మీరు
మీ
కోపమును
అరికట్టుకొని
శాంతముగా
మెలగవలెను.
అద్వేష్టా
సర్వ
భూతానాం
—
ఇదే
మానవుని
సహజ
చర్యగానుండవలెను.
ఇదే
భారతీయ
మహనీయుల
ఆదర్శము”
అన్నాడు.
ఓర్వలేనివాళ్ళు
అసూయవలన;
తనకంటేగొప్ప
అనే
కక్షపట్టి
ద్వేషమును
పెంచటమువలన,
రాక్షసహృదయులు
దూషించవచ్చును.
లేక;
కోరినది
ఫలించక
ఆత్మపరీక్షసలుపక
నిరాశతో
సహనమును
పోగొట్టుకొని
దూషించవచ్చును.
ఇట్టి
వాళ్ళు
అల్ప
బుద్ధులు;
హీనమార్గముల
నవలంబించువాళ్ళు
వాళ్లతో
వ్యవహరించి
సంబంధము
కల్పించుకొన్న
మీకే
చాలా
మాలిన్యము
కలుగును.
2
▾
Meaning
Keep
నిజముగా
సామాన్య
మానవులు
అపవిత్ర
మార్గమందు
అడుగుపెట్టరు;
కాబట్టి
దూషణ
మార్గములో
…గే
ఈ
అల్పబుద్ధులు
సామాన్య
మానవులకంటే
హీనులనే
చెప్పవలసియున్నది.
మీరు
అనవచ్చును;
స్వామి!
మేము
సామాన్యులు;
మేము
పూజించేరూపములను
దూషించిన,
దాన్ని
యెట్లు
సహించేది?
—
దీనికి
ఒక
చిన్నఉదాహరణ:
మీకు
ఒక
రిజిష్టర్డ్
లెటర్
వచ్చిన
దానిని
మీరు
సిగ్నేచర్చేసి
తీసికొన్న
దానిలో
విషయములు
మీకు
చెందును,
వాటివలన
మీ
మనస్సుకు
ఆందోళన
కలుగును:
అయితే;
దానిని
మీరు
తీసుకొనకపోతే
అది
రి-డైరెక్ట్
పంపిన
వాళ్ళకే
వాపస్
పోవును.
దూషణకూడ
అంతే.
నన్ను
తిట్టాడే
అని
మీరు
దానిని
స్వీకరించిన
ఆ
తిట్టంతా
మీపైనే
వచ్చిపడును!
నాకు
కాదు
నాకేమీ
సంబంధము?
అని
మీరు
వదలిపెట్టితే
యెవరు
ఆ
రాక్షసబుద్ధులో
వారికే
పోయి
వారినే
చేరును.
యెవరికి
యేరకమైన
బాధకలిగించాలి
అని
ఆశపడుదురో
యేరకమైన
బాధ
నందించాలి
అని
పన్నాగముచేయుదురో
అవన్నీ
వారికే
రిసౌండ్
రియాక్షన్
రిఫ్లెక్షన్
రీతిగా
వారిపైనేపడి
వారికే
కీడుచేయును;
బాధనీయును.
భాగవతములోచూడండి;
జరాసంధుడు
కంసుడు,
శిశుపాలుడు
వీరందరికీ
యేగతి
దొరికినది!
శిశుపాలుని
తిరస్కారబుద్ధి
ఆయనకే
ముప్పుతెచ్చినది
భగవంతుడు
గుణాతీతుడు;
మీమంచియే
మీకు
రక్షనిచ్చును:
మీ
చెడ్డనేమీకు
శిక్షనిచ్చును.
3
▾
Meaning
Keep
భగవంతునిలో
ఆగ్రహములేదు,
అనుగ్రహములేదు.
ఆగ్రహ
అనుగ్రహములు
మీ
మంచి
చెడ్డయొక్క
ప్రతిబింబములే!
భాగవతమున.
పౌండ్రికుడు
అనే
ఒకాయన
కృష్ణుని
ఇమిటేట్
చేయుటకు
తయారైనాడు.
వాసుదేవుడు
అని
కృష్ణుని
పేరును
తన
పేరుతో
తగులించుకొని
తన్నుపౌండ్రిక
-
వాసుదేవుడు
అని
ప్రచురించుకొన్నాడు!
కృష్ణునికి
సహజమైన
శంఖ
చక్రాలుంటే
తానుచెక్కతోచేయించి
ధరించినాడు!
కృష్ణుడు
యేరీతిగా
పీతాంబరమును
ధరించునో
తెలుసుకొని
అట్లనే
తానూకట్టుకొన్నాడు
కృష్ణుడుయే
హోదాతో
యెట్లునడుచునో
దానినే
ఇమిటేట్
చేయుచూ
వెళ్ళాడు?
ఓహో!
ఇతనే
మేము
వెతికే
దేవుడని
ఆ
పిచ్చివానిని
అనుసరించి
వానివెనుక
వెళ్లినమొఖాలుకూడ
కొన్నిలేక
పోలేదు,
చివరకు
ఆఇమిటేషన్
వాసుదేవునికి
తన
ఉన్మత్త
చర్యనే
అధఃపతనమునకు
అంత్యమునకు
సర్వనాశనమునకూ
మూల
కారణమయినది.
ఈ
కలియుగములోకూడ
ఇమిటేషన్లు
అధికమైపోతున్నాయి!
పౌండ్రికుడు
వాసుదేవుడుగా
మారినట్టుగా,
ఇపుడు
యిమిటేషన్
సత్యసాయిబాబాకూడా
తయారైనాడు!
నా
గౌన్చూచి
అదే
నమూనాగౌను
వేసుకొనేది,
నాతలచూచి
ఇట్లనే
తనవెంట్రుకలనూ
యెంతో
కష్టపడి
మార్చుకొనే
ప్రయత్నమునకు
పూనుకొనేది;
నాఫొటోలుచూచి,
అదేరీతిగా
చెయ్
చూపించేది
చేతులు
పెట్టుకొనేది,
యెంతనీచమైన
ప్రవర్తనలుచూడండి!
4
▾
Meaning
Keep
అయితే,
CREATION
IS
DIVINE;
…
IMITATION
IS
HUMAN.
ఇట్టి
ఇమిటేషన్లకూ
ఇదేపేరు
పెట్టుకొని
సత్యసాయిబాబాలుగా
తయారౌదామన్న
వ్యక్తులు
పరమాత్మునిపై
విశ్వాసమునే
మారణముచేసే
చీడపురుగులు!
వీళ్లకు
కొందరు
భక్తులుకూడా
గంతకుతగిన
బొంతలుగా
తయారై
తమజీవితములను
పాడుచేసుకొంటున్నారు.
ఈ
ఇమిటేషన్లు
తానూచెడి
వనమునూ
చెడుపు
కోతులవలె
అని
చెప్పటానికి
యెంతైనా
అవకాశమున్నది.
దైవము
దైవము
అని
మీరు
అటు
ఇటు
వారివెంట
వీరివెంట
తిరుగనక్కరలేదు.
దయగలహృదయమే
దైవమందిరము
గురువులకొరకు
ప్రాకులాడనవసరములేదు.
జగతిస్వరూపుడే
ఆ
సుందరస్వరూపుడు.
Nature
is
the
best
preacher;
Life
is
the
best
teacher.
జగత్తే
మీకు
మంచి
మార్గదర్శకుడు;
జీవితమే
మీకు
ఉత్తమగురువు.
Previous
←
Dedicated for defence
Next
The Gītā's Teaching
→