Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · The Gītā's Teaching
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Gītā's Teaching
14 January 1973
First talk
Second talk
1
▾
Meaning
Keep
కస్త్వం,
కోహం,
కుత
ఆయాతః
—
అనే
మూడు
ప్రశ్నలకు
సమాధానము
తెలియకుండా
జీవన
యాత్రను
సాగించేటి
మానవునికి
అవమానకరము
.
నువ్వు
యెవరు,
యెక్కడనుంచి
వచ్చావు,
యెందుకువచ్చావు.
అని
అడిగిన,
జవాబు
ఇచ్చే
స్థితిలో
మానవుడు
లేడు.
ఒక
వ్యక్తి
బదరి
యాత్రకొరకు
బెంగుళూరినుంచి
బయలుదేరి
డెల్లిలోని
ఒక
ఛత్రములో
నిలిచిపోయి
నాడనుకొండి;
అక్కడివాళ్ళు
అతనిని
మీరెవరు,
ఎందుకు
డెల్లి
వచ్చిరి
ఎక్కడికి
ప్రయాణము.
ఏ
పని
మీద
వచ్చిరి
అని
ప్రశ్నింతురు,
కదా
?
2
▾
Meaning
Keep
అట్లనే
ఈ
కర్మక్షేత్ర
యాత్రలో
అక్కడక్కడ
యెదురయ్యే
జనులు
వేసే
ప్రశ్నలకు
జవాబు
తెలియని
మూర్ఖులుగా
మానవులు
తయారైపోవుచున్నారు.
దీనికి
భగవద్గీతలో
(11:
54)
మూడు
ముఖ్యమైన
వుపదేశములను
మూడు
పదములలో
కృష్ణపరమాత్ముడు
అందించినాడు.
(1)
జ్ఞాతుం:
తానువేరు,
జగత్తువేరు,
బ్రహ్మమువేరు
;
తాను
దేహముకాదు.
ఇంద్రియములు
కావు,
మనోబుద్ధులుకావు
:
అన్నిటియందూ
నిండియున్న
ఆత్మనే
తాను,
అని
గురుముఖేన
కానీ
వివేక
వైరాగ్య
విచక్షణలవలనకానీ,
శుద్ధ
చిత్తములో
ప్రతిబింబితమైన
సుజ్ఞానమువలన
కానీ
తెలుసుకోవలెను.
(2)
ద్రష్టుం
:
మంచి
మామిడి
పండ్లు
మార్కెట్లో
దొరకును.
అనితెలుసుకొన్న,
వచ్చే
ఫలితమేమి
?
దాన్నిదక్కించుకోవటానికి
ప్రయత్నించి,
వశము
చేసుకోవలెను
కదా
?
(3)
తరువాత,
తత్త్వేన
ప్రవేష్టుం
:
దాని
ఆనంద
రసముననుభవించి
దానితో
యేకమై
దానిలో
లీనమైన,
పూర్ణత్వమును
పొందటము.
అపుడు
ఆ
బ్రహ్మవిత్,
బ్రహ్మగా
మారిపోతాడు
.
ఇదే
ఆత్మసాక్షాత్కారము
;
ప్రశాంతినుండి
ప్రకాంతిని
ప్రకాంతి
నుంచి
పరం
జ్యోతిని
పొందటము;
మోక్షప్రాప్తి.
Previous
←
Imitations
Next
The fruit and the tree
→