Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Human Life Is Sacred: Do Not Waste It
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Human Life Is Sacred: Do Not Waste It
25 May 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
His poems 11
నీలో
నాలో
నిజమొక
విష్ణువె
ఓపికలేని
నీ
కోపము
వ్యర్థము
ఎల్లడ
సమమై
ఉల్లంబుంటే
అపుడే
అనుభవమగు
విష్ణుత్వము.
దివ్యాత్మస్వరూపులారా!
శంకర
భగవత్పాదులవారు
అందించిన
భజగోవింద
సంస్కృత
శ్లోకములనుండి
ఇది
ప్రధానమైన
మరొక
శ్లోకమగుటచేత
ఈ
శ్లోకము
యొక్క
అంతరార్థమును
మీ
హృదయస్థానమునందు
చేర్చి,
తద్వారా
మీలో
ప్రవేశించిన
విరుద్ధమైన
భావములను
దూరముచేసే
నిమిత్తమై
ఈనాడు
మరొక
శ్లోకాన్ని
అందుకుందాము.
నీలో
నాలో
ఉండే
భగవంతుడు
ఒక్కడే
అనేటువంటి
తత్వము
గుర్తించుకొని
అట్టి
తత్త్వమే
ఆత్మ
స్వరూపమని
మనము
నిర్ణయము
చేసుకోవటం,
ఆత్మయే
బ్రహ్మ
స్వరూపముగా
ఉండి
అనేక
రూపనామములు
ధరించినప్పటికిని
ఏకత్వమైన
సత్యస్వరూపుడు
ఒక్క
పరమాత్ముడే
అని
గుర్తించినప్పుడు
అజ్ఞానము
దూరమైపోతుంది.
నీవు
వృధాగా
కోపించి
ప్రయోజనము
లేదు.
కారణమేమనగా
నీ
కోపము
నీకే
అపకారమని
యిందులో
బోధించారు.
ఓపిక
లేని
మన
కోపము
మన
తాపమునకు
ఒక
ధూపమని
కూడా
దీని
అర్థము.
కానీ,
మనము
యిట్టి
ఓపిక
లేని
కోపమును
అరికట్టుకునే
విధానము
క్రమక్రమేణా
చిత్తమునందే
ప్రాప్తిస్తుంది.
అట్టి
సమత్వము
ప్రాప్తించే
నిమిత్తము
మనము
విచారణ
అత్యవసరముగా
చేయవలసినటువంటిది.
“భవశమత్వం
సర్వత్ర”
అని
మూడవలైన్లో
చెప్పారు.
దీనినే
ప్రహ్లాదుడు
కూడను
“బలమెవ్వడు
దుర్బలులకు,
నీకు
నాకు
బ్రహ్మాదులకున్”
అట్టి
భగవంతుడైన
విభుడే
సర్వులకు
సముడు
అనేటువంటి
సంగతి
ప్రబోధించాడు.
అనేక
రూపములు
ధరించిన
వ్యక్తిత్వమందు
ఏకతత్వమైన
ఆత్మతత్త్వమును
ప్రబోధించే
నిమిత్తమై
యిట్టి
అద్వైతమును
కూడా
లోకమునకు
చాటాడు.
ఈ
విధమైన
ఏకత్వమును
గుర్తించుకోవటం
ప్రతి
వ్యక్తికి
అత్యవసరము.
2
▾
Meaning
Keep
అప్పుడే
మనలో
నున్న
సమత్వము
దివ్యత్వమైన
ఆత్మస్వరూపాన్ని
అందుకొంటుంది.
ఈ
ఏకత్వము
అనేది
సాధ్యమైనదా
యీ
జగత్తునందు
అని
మనము
సంశయించ
నక్కరలేదు.
మనయొక్క
భ్రాంతులు
గుణ
సంబంధమైన
వికృతులు
ధరించటము
వలన
మనకు
అనేకత్వముపైన
వ్యామోహము
వ్యాపించిపోయింది.
దీనికి
చిన్న
ఉదాహరణము.
సినీమాలో
చిత్రములు
అనేక
విధములుగా
ఆవిర్భవిస్తుంటాయి.
కానీ
ఈ
చిత్రములన్నీ
ఒక్క
టేపులో
చేరిపోవటం
చేతనే
ఆ
టేపుపైన
యీ
విద్యుత్‌శక్తి
ప్రాకి
తద్వారా
అనేక
రకములైన
చిత్రవిచిత్రములను
అందులో
ప్రదర్శించటానికి
మూలకారణమైపోతుంది.
అయితే
ఈ
చిత్రవిచిత్రములు
ఆ
కల్పనలైన
మానసికతత్త్వములే
గాని
విద్యుత్‌శక్తి
యొక్క
మార్పులు
కానేరదు.
విద్యుత్‌శక్తి
ఒక్కటే.
టేపు
ఒక్కటే.
విద్యుత్‌శక్తికి
నీడగా
ఆ
టేపు
తిరుగుచుండడం
చేత
చిత్రవిచిత్రమైన
బొమ్మలంతా
మనలను
భ్రమింపజేస్తున్నాయి.
అదే
విధముగానే
మన
ఇంద్రియములనే
చిత్రములన్నీ
మనస్సనే
టేపునందు
చేరిపోవటం
చేత
బుద్ధి
అనే
కరెంటు
ద్వారా
ఈ
జగత్తును
విశాలమైన
కొన్ని
చిత్రములుగా
మనము
భ్రమిస్తున్నాము.
ఈ
ఇంద్రియములు
మనస్సుతో
చేరి
బుద్ధిని
అనుసరించటం
చేతనే
మనకు
చిత్రవిచిత్రములు,
భిన్నమైన
రూపనామములు
ధరిస్తున్నాయి.
అవే
ఇంద్రియములు
మనస్సు
ద్వారా
హృదయమునకు
చేరినప్పుడు
స్వస్వరూపమైన
తన
తత్త్వాన్ని
నిరూపణ
చేసుకుంటున్నాడు.
కానీ,
మనలోనున్న
హృదయతత్త్వము
పరిపరి
రూపములు
ధరించి
నానావిధములైన
అనుభూతులను
అనుభవించి
వ్యక్తిత్వములో
అనేక
రకములైన
భిన్నత్వాన్ని
ప్రపంచానికి
చూపిస్తూ
వస్తున్నాది.
ఆత్మ
స్థానమును
మనము
తెలుసుకోటానికి
ప్రయత్నము
చేసినప్పుడు
యిన్ని
విధములైన
రూప
నామములపై
భ్రమ
అభివృద్ధిగాక
దివ్యత్వమైన
ఏకత్వముపైనే
చిత్తము
హత్తుకు
పోతుంది.
దీనికి
మరొక
ఉదాహరణము.
ఒక
వ్యక్తి
తాను
చిత్రములందు
వివిధ
నామరూపములను
ధరించి
కొన్ని
రకములైన
నాటకములాడుతున్నాడు
లేక
కొన్ని
రంగములందు
ఒకే
వ్యక్తి
వివిధ
నామరూపములు
ధరించి
తనయొక్క
కర్తవ్యాన్ని
నిర్వర్తిస్తున్నాడు.
అయితే
నాలుగు
రంగములయందు
రూపనామములు
ధరించి
నాటకములాడుతున్న
యీ
వ్యక్తి
ఒక్కడా
లేక
నలుగురా
అనే
సత్యమును
వ్యక్తీకరించటానికి
కొన్ని
రకములైన
ప్రయత్నములు
సలపాలి.
3
▾
Meaning
Keep
జాగ్రత్,
స్వప్న,
సుషుప్తి,
తురీయావస్థ.
యీ
నాలుగు
రంగములకు
రూపములు
వేరుగా
లేవు
మనకు.
నాలుగు
రంగములందు
కూడను
ఒకే
వ్యక్తిత్వాన్ని
మనము
ఒక్కొక్క
రంగములో
మలచి
ఒక్కొక్క
రంగములో
ప్రస్తుత
అనుభూతిని
మాత్రమే
మనము
అనుభవిస్తూ
మిగిలిన
మూడు
రంగములు
కూడను
మనము
యేమాత్రము
లక్ష్యము
చేయక
ధరిస్తున్నాము.
ఈ
నాలుగు
రంగములందు
ఉన్నటువంటి
ఏకత్వము
అనే
సత్యాన్ని
మనము
గుర్తించటానికి
కొన్ని
రకములైన
యోగతత్త్వాన్ని
మనము
పూనాలి.
“సమత్వం
యోగముచ్యతే”,
యోగమువలన
సమత్వము,
జన్మ
సార్థకమువల్ల
విష్ణుత్వము
మనకు
ప్రాప్తిస్తుంటుంది.
ఇట్టి
రెండు
తత్త్వములు
మనకు
లభ్యమయ్యే
నిమిత్తమై
మనము
కొన్ని
రకములైన
వేదవిహితమైన
కర్మలు
ఆచరించి
శాస్త్ర
సమ్మతమైన
నడకలు
అనుభవించి
పెద్దలయొక్క
అనుభూతిని
కూడా
ఆధారముగా
తీసుకొని
తద్వారా
మన
జీవితమును
అట్టి
పవిత్రమైన
స్థితికి
తెప్పించుకొనుటకు
పూనుకోవాలి.
భౌతికదృష్టినే
మనము
అభివృద్ధి
గావించుకోటం
చేత
అంతర్ధృష్టి
యొక్క
యదార్థమును
మనము
కొంత
అర్ధము
చేసుకోలేని
వ్యర్థజీవులైపోతున్నాము.
కోరిన
కోరికలు
అందించిన
స్వరూపము
నకు,
మనము
ఆశించిన
కోరికలు
అందించే
వృక్షము
కల్పవృక్షముగా
మారింది.
వృక్షమును
కల్పమంటున్నాము.
వృక్షము
నాశనమయ్యేది
కల్పము
స్థిరమైనది.
స్థిరమైన
కల్పము
నాశనము,
వికారము
అయ్యేటువంటి
వృక్షస్వరూపము
ఎంత
విచిత్రమో
యోచించుకోవచ్చును.
రత్నములకు
ముత్యములకు
నిలయమైన
రత్నాకరుడు,
అంతేకాక
భగవంతుని
సున్నితమైన
తత్వాన్ని
నిరూపణ
చేసే
సాగర
రూపము
ధరించిన
దీనిని
మనము
లవణ
స్వరూపములో
అనుభవిస్తున్నాము.
మానవునికి
చల్లదనము,
హాయిని
అందించే
చంద్రుడు
నెల
రోజులలో
క్షీణిస్తూ
వస్తున్నాడు.
లోకమునకు
ఉత్తమమైన
ఫలితములను
అందించే
వ్యక్తులకు
యిట్టి
అలభ్యమైన
పరిస్థితులు
యేర్పడటము,
కొన్ని
అసభ్యమైన
వృత్తులు
వారికి
కల్పించటము,
కొన్ని
అసహజమైన
పేర్లు
వాటికి
నియమించటం
జరగటములోనున్నది
ప్రకృతిలోని
గుణమార్పులే.
మితమైనటువంటి
ఈ
యొక్క
కాయమునందు
అమృతస్వరూపుడు
నివసించటము
కూడను
ప్రకృతి
గుణదోషమే.
అయితే
దేహమును
పురస్కరించుకొని
యింద్రియములు,
యింద్రియములను
పురస్కరించుకొని
మనస్సు,
మనస్సును
పురస్కరించుకొన్న
బుద్ధి
జన్మ
జన్మలకు
వెంటాడుతూ
రావటం
చేత
దాని
శేషము
మన
భావములలో
కొంత
మార్పు
తెప్పిస్తున్నది.
4
▾
Meaning
Keep
కాకి
చేదునిమ్మను
ఆనందిస్తున్న
సమయములో
కోకిల
తీయని
మామిడి
పుష్పములలోనున్న
మధుర
మకరందమును
గ్రోలి
ఆనందిస్తుంది.
అనిత్యము,
అశాశ్వతము,
భ్రమలను
కల్పించే
ప్రకృతి
తత్త్వాన్ని
అనుభవిస్తూ
పామరులు
ఆనందిస్తుంటారు.
సమచిత్తులైనవారు
ఇటువంటి
దానికి
గురికాక
భగవంతుని
పాద
పద్మములవద్ద
మకరందమును
గ్రోలి
సంతసిస్తారు.
జాగ్రత్తలో
మానవుడు
అనుభవించే
అనుభవములకు,
స్వప్నములో
మానవుడు
అనుభవించే
అనుభవములకు
అతి
వ్యత్యాసము
ఉంటుంది.
అనగా
స్వప్నముయందు
అనుభవించటానికి
ఆధారము
ఏమిటి?
స్వప్నములు
రావటానికి
కారణము
ఏమిటి
అని
మనము
విచారించినప్పుడు
నిద్రయే
స్వప్నమునకు
కారణముగా
ఉంటుంది.
నిద్రయే
లేకుండిన
స్వప్నము
రావటానికి
వీలులేదు.
కనుక,
మోహనిద్రలో
మునిగినవానికి
యీ
భ్రమలయొక్క
స్వప్నములు
అతనిని
వెంటాడు
తుంటాయి.
సమచిత్తములోనున్న
వారికి,
మోహమనేటువంటిది
లేదు
కనుక
వారికి
ఏకత్వమనే
అద్వైతము
ప్రాప్తిస్తుంది.
మంచి
చెడ్డలుగాని,
సుఖదుఃఖములు
గాని
రెండుగా
కనిపించేవన్నీ
ఒక్కదాన్ని
యొక్క
ప్రతిబింబములే.
ఏకమేవ
అద్వితీయం
బ్రహ్మ
అన్నారు
మన
వేదాంతులు.
అయితే,
ఇట్టి
ఏకత్వమైన
బ్రహ్మ
తత్త్వాన్ని
అనేకత్వముగా
అనుభవించుకోటానికిగల
కారణము
యేమిటని
మనము
విచారించాలి.
“నేను”
అనే
పవిత్ర
శబ్దము
ఒక్క
ఆత్మకు
మాత్రమే
చెందుతుంది.
ఉదయము
వేదమును
గురించి
చెప్పిన
పండితులు
కొన్ని
ఉదాహరణములు
కూడా
మీకు
అందించినారు.
అందులో
చెట్టు
ఉన్నది,
గుట్ట
ఉన్నది,
పిట్ట
ఉన్నది,
రాయి
ఉన్నది,
రప్ప
ఉన్నది
అని
ఉచ్ఛరిస్తూ
వస్తుంటాము.
అయితే,
గుట్ట,
చెట్టు,
పిట్ట
అన్నింటియందు
రూపనామములు
వేరైనప్పటికిని
‘ఉన్నది’
అనేది
అన్నింటియందు
ఏకత్వముగానే
యున్నది.
అదేవిధముగానే
నేను
ఒక
ప్రశ్న
వేస్తాను.
ఎల్లయ్య
ఎవరు?
నేను
అని
లేస్తున్నాడు,
గోపాలుడు
ఎవరు?
నేను
అని
లేస్తున్నాడు.
రాముడు
ఎవరు?
నేను
అని
లేస్తున్నాడు.
నేను
అడిగినటు
వంటి
ఎల్లయ్య,
గోపాలుడు,
రాముడు
ఈ
రూపనామములందు
వేరుగా
ఉంటున్నారు.
కాని
నేను
అడిగిన
ప్రశ్నకు
‘నేను
నేను
నేను’
అనే
పదము
అందరి
యందు
ఏకత్వముగనే
ఉన్నది.
5
▾
Meaning
Keep
కనుక
‘నేను’
ఎవరు
అనే
తత్త్వాన్ని
గుర్తించిన
వ్యక్తికి
అన్నింటియందు
‘నేను’
ఉన్నాను
అనే
ఏకత్వము
సులభంగా
మనకు
అర్ధమవుతుంది.
కనుక,
‘నేను’
అనే
పవిత్రశబ్దము
ఒక్క
ఆత్మకు
మాత్రమే
చెల్లుతుంది.
అట్టి
ఆత్మ
సర్వులయందు
కూడ
ఉండటంచేత
సమత్వమనేది
సులభంగా
ప్రాప్తిస్తుంది.
భేదములు
పదార్ధములందు
యేమాత్రము
లేదు.
మన
వాంఛలలోనున్న
భేదము,
విచారములుగాని
పదార్ధము
ఎప్పుడు
ఒక
విధమైన
గుణము,
ఒకవిధమైన
రసముతోనే
కూడి
ఉంటుంది.
నిజముగా
పదార్ధములయందే
యిట్టి
విచారణ
ఉండిన
అందరికి
అట్టి
భావములే
రావాలి
గాని
ఒక్కొక్కరికి
ఆ
పదార్దములందు
యిచ్ఛగాని,
ఒకరికి
అయిచ్ఛగాని
రావటం
యే
మాత్రం
వీలుండదు.
మంచి
చెడ్డల
నిర్ణయించటానికి
ఎవ్వరికీ
అధికారము
లేదు.
ఈనాడు
మంచి
చెడ్డలు
నిర్ణయించటము
లోపల
ఒక
అధికార
స్థానము
అనుభవించినట్లుగా
భావిస్తున్నారు.
కేవలము
అజ్ఞానము
యొక్క
మొదటి
లక్షణము.
ఒకరికి
ఒక
పదార్ధము
చాలా
యిష్టముగా
ఉండినప్పుడు,
అదే
పదార్ధము
మరొకరికి
అయిష్టముగా
ఉంటుంది.
నిజముగా
ఆ
పదార్ధములోనే
అట్టి
భేదములుండిన
యిష్ట
అయిష్టములు
రావటానికి
వీలులేదు
కదా!
ఈ
ఇష్టాయిష్టములు
ఎక్కడనుండి
వచ్చినాయి
అనగా
వారిలోనున్నటువంటి
అభిరుచులే
దీనికి
మూలకారణము.
దీనికి
చిన్న
ఉదాహరణము.
తీయగా,
చల్లగా,
అతిరుచిగానున్న
శుద్ధమైన
నీరు
త్రాగుతున్నాము.
తీయగా,
చక్కగా,
మంచి
ఆకర్షణీయముగా
వుండేటువంటి
ఫలము
మనము
భుజిస్తున్నాము.
ఇట్టి
జలమును,
ఫలమును
పవిత్రమైనటువంటివిగను,
అతి
యిష్టమైనటువంటివిగను
మనము
భావించటమే
కాకుండా,
విశ్వసించి
మనము
త్రాగుతున్నాము,
భుజిస్తున్నాము.
కాని,
ఇది
కొన్ని
క్షణములలో
ఫలము
మలముగాను,
జలము
మూత్రముగాను
మారిపోతున్నవి.
ఈ
మలమూత్రములు
చెడ్డవిగను,
ఫలములు
జలము
మంచివిగను
భావిస్తున్నాము,
ఈ
నిర్ణయము
సరియైనటువంటిదేనా?
ఏది
మంచిది
అని
మనము
విశ్వసించినామో,
ఏది
మంచిది
అని
మనము
ఉచ్ఛరించినామో
అది
కొద్ది
క్షణములలో
చెడ్డదిగా
మన
నోటినుండి
ఉచ్చరిస్తున్నాము.
కనులతోనే
దానిని
చూస్తున్నాము.
అయితే,
మంచిది
అని
ఉచ్చరించినప్పుడు
అది
సత్యమా?
చెడ్డది
అని
ఉచ్చరించినపుడు
అది
సత్యమా?
మంచి
చెడ్డలు
మన
దృష్టి
కల్పితములేగాని
పదార్థములో
మంచి
చెడ్డలు
కల్పించటానికి
యేమాత్రము
అధికారము
లేదు.
6
▾
Meaning
Keep
అయితే
ప్రాకృతములైన
పదార్ధములన్నీ
కూడను
మంచి
చెడ్డలు
ఎందుకు
జరుగుతున్నాయి
అని
నిర్ణయించినపుడు,
తిరిగి
కొన్ని
ప్రాకృతమైన
పదార్థములు
పోల్చుకున్నప్పుడు
దీనికి
విరుద్ధముగా
కనిపిస్తున్నాది.
సంస్కారము
వలననే
విలువ
మరొక
ఉదాహరణ.
ప్రాకృతంగా,
సహజముగా
భూమినుండి
బంగారము
తీస్తున్నాము.
భూమినుండి
తీసిన
తక్షణమే
అది
విలువలేని
స్వరూపాన్ని
ధరించి
ఉంటుంది.
దీనిని
అనేక
రకములుగా
సంస్కరించటం
చేత
పరిశుద్ధమైన
స్వరూపము
ధరించి
విలువైన
స్థానము
పొందుతుంది.
శాశ్వతముగా
యిది
సత్యము
అని
నిర్ణయించినప్పుడు
శాశ్వతముగా
మనము
చూచిన
యీ
సంస్కారములేని
బంగారుకు
విలువలేక
తిరిగి
యీ
సంస్కారము
జరిపిన
తరువాత
దీనికి
అతి
విలువ
రావటానికి
కారణము
ఏమిటి?
ప్రాకృత
గుణదోషములతో
కూడిన
పదార్థము
సంస్కారము
చేత
పరిశుద్ధము
కావటము
ఒక
ప్రాకృత
లక్షణము.
అదేవిధముగా
వ్యక్తులను
మనము
పోల్చుకున్నప్పుడు
పుట్టటం,
తినటం,
త్రాగటం,
సంచరించటం
యివన్నీ
ప్రాకృతమైన
లక్షణాలుగానే
మనం
గుర్తించుకోవచ్చు.
అయితే,
ఈ
ప్రాకృతమైన
గుణ
దోషములతో
ఉద్భవించిన
వ్యక్తిత్వాన్ని
కొన్ని
సంస్కారములచేత
పవిత్రమైన
దివ్య
స్థానానికి
అందించటానికి
తగిన
ఆధారము
లేకపోలేదు.
కనుక,
సమత్వము
ప్రాప్తించటానికి
యిట్టి
సంస్కారములు
మనకు
తోడుగా
ఉంటాయి.
దీనికి
మీరు
నిత్యజీవితములో
ధరించే
గడియారము
ఆదర్శము.
నీచేతికి
200
రూపాయల
విలువైన
వాచి
ఉంది.
అయితే
ఈ
రెండు
వందల
రూపాయలు
దేనికి
యిచ్చారు?
దీని
బోల్టులు,
నట్స్,
స్క్రూలు
వాటికోసము
యిచ్చారా
లేక
యినుము
కోసము
యిచ్చారా?
ఈ
రెండు
వందల
విలువైన
వాచి
అగ్నిలో
వేసినప్పుడు
రెండు
అణాల
విలువరాదు.
కాని
రెండు
అణాలు
విలువచేసే
యినుమునుండి
చక్కగా
పని
తనము
తెలిసినవారు,
వాచ్
యొక్క
విషయము
పూర్తి
గుర్తించినవారు
చక్కగా
దానిని
సంస్కరించి
కాలానుగుణముగా
పరుగెత్తే
శక్తిని
దానికి
అందించి
నిర్మించిన
స్థితికి
సంస్కారము
అని
చెబుతున్నారు.
కాలానుగుణముగా,
కాలమును
నిర్ణయము
చేసే
స్థితిని
అందించే
సంస్కారమునకు
వెచ్చించటంచేతనే
ఆ
వ్యక్తికి,
ఆ
సంస్కారమునకు
రెండువందలిచ్చి
మనము
అందుకుంటున్నాం.
అదేవిధముగా
పామరుడై
జన్మించి
కొన్ని
సంస్కారములచేత,
పెద్దలయొక్క
దర్శన,
స్పర్శన,
సంభాషణలచేత
పరిశుద్ధాత్ముడై,
సమచిత్తుడై
నీవు
నిల్చినప్పుడు
నీవే
పరమహంస
అనే
సార్థక
నామము
విలువ
అందుకోటానికి
అవకాశము
ఉంటుంది.
7
▾
Meaning
Keep
మనము
విలువైన
వాటిని
దగ్గర
పెట్టుకున్నప్పుడు
దానిని
సక్రమమైన
మార్గములో
ఉపయోగించుకోటానికి
పూనుకుంటామో
అదేవిధముగా
అతి
విలువైన
మానవత్వము
సంప్రాప్తమైనప్పుడు
పవిత్రమైన
మానవత్వము
వినియోగించుకునే
విధానముకూడను
గుర్తించాలి.
అనేక
జన్మల
పుణ్యధనము
అనేది
ప్రోగుచేసి
అందుకున్నటువంటిది
ఈ
మానవత్వము.
పుణ్యధనము
ఏమిటో
మీకు
తెలియక
పోవటంచేత,
పుణ్యధనము
విలువ
మీరు
గుర్తించలేకపోవటంచేత
ఈ
అందుకున్న
మానవత్వానికి
మీరు
అంత
ప్రాధాన్యత
ఇవ్వడం
లేదు.
మనము
నిజముగా
పుణ్యధనమును
చక్కగా
గుర్తించుకోటానికి
ప్రయత్నం
చేస్తే
ఈ
మానవత్వమును
యింత
వ్యర్థపరచడానికి
మనము
పూనుకోము.
దీనికి
ఒక
చిన్న
తమాషా
ఉదాహరణ.
ఒక
వ్యక్తి
ఒక
చెడిపోయిన
వాచ్‌ని
తీసుకువెళ్లి
రిపేరు
చేసే
వ్యక్తిని
సరిచేయమన్నాడు.
అప్పుడు
ఆ
వాచ్
రిపేరు
చేసే
వ్యక్తి
యిది
చాలా
చెడిపోయింది,
చాలా
రిపేరు
చేయవలసి
వస్తుంది.
రిపేరు
చేసే
ఖర్చుకు
రెండు
వాచీలు
తీసుకోవచ్చును.
వాచీ
తీసుకున్న
విలువ
దీని
రిపేరుకే
అయిపోతుంది.
కొన్న
దానికంటె
రెండింతలు
అవుతుంది
రిపేరు
ఛార్జి
అన్నాడు.
అప్పుడు
యీ
వాచి
యిచ్చిన
వ్యక్తి
“రెండింతలు
అయినా
ఫర్వాలేదు
నేను
యిస్తాను”
అన్నాడు.
వాచి
రిపేరు
చేసేవాడు
అనుకున్నాడు
‘యిదేమో
లక్కీ
వాచ్
ఏమిటో
పాపం’
అని
కొత్త
కొత్త
భాగములు
వేసి
దానిని
చక్కగా
తయారుచేశాడు.
వాచ్
యజమాని
రెండవ
వారము
వెళ్లి
‘నా
వాచి
రెడీ
అయిందా,
యివ్వు’
అని
అడిగాడు.
‘నీవు
కొన్న
దానికంటే
రెండింతలు
ఎక్కువ
ఛార్జి
అయింది
దానిని
యిచ్చి
మీరు
తీసుకోండి’
అన్నాడు
రిపేరు
చేసిన
వ్యక్తి.
అప్పుడు
వాచ్
ఓనరు
రిపేరుచేసిన
వ్యక్తికి
రెండు
చెంపదెబ్బలు
యిచ్చాడు.
ఈరీతిగా
యిస్తున్నాడేయని
అక్కడున్న
వారంతా
అతనిని
పట్టుకొని
పోలీసులకు
అప్పచెప్పారు.
పోలీసు
వచ్చి
‘ఎందుకయ్యా!
ఈ
రీతిగా
చేశావు’
అంటే,
‘ఈ
వాచికి
రెండింతలు
రిపేరు
ఛార్జి
అన్నాడు.
అసలు
నేను
ఈ
వాచి
కొనలేదు,
వేరేవ్యక్తిని
ఒకచెంపదెబ్బ
కొట్టి
తీసుకున్నాను.
కాబట్టి
యితనికి
రిపేరు
ఛార్జీ
రెండింతలు
అనగానే
రెండు
చెంపదెబ్బలుకొట్టి
తీసుకున్నాను’
అన్నాడు.
నిజముగా
యీ
వాచి
విలువ
తెలుస్తే
యీ
వాచిని
రిపేరుకి
తాను
అందించటానికి
పూనుకోడు.
ఆవిధంగా
మనము
మనదేహము
యొక్క
విలువ
తెలుసుకోవటం
లేదు.
8
▾
Meaning
Keep
His poems 7
Also in his talks
(1)
23 May 1973
The Wheel of Birth and Death, and Vimukti
దానిని
వ్యర్థమైన
పనులకు
వాడుతున్నాము.
నిజముగా
యీనాడు
మానవత్వము
యొక్క
విలువ
తెలియని
వారుగా
ఉండటం
వలన
ఈ
రకమైన
నిరుపయోగంగా
జీవితము
గడుపుతూ
వస్తున్నాము.
ఏదో
మనకు
లభించిన
యీ
మానవజన్మము,
ప్రకృతితో
సహజముగ
వచ్చినది
యీ
దేహము
కనుక
ఈ
దేహముతో
మనము
తిని,
త్రాగి,
విలాసవంతముగా
యిష్టము
వచ్చినట్లుగా
సంచరించి
జీవితమును
యేదో
ఆనందముగా
గడుపుకొని
తరువాత
కన్నులు
మూసుకుందామని
అలక్ష్యము
చేస్తున్నాము.
యిది
మానవత్వానికి
సరియైన
లక్షణము
కాదు.
జంతూనాం
నరజన్మ
దుర్లభం.
ఇట్టి
పవిత్రమైన
మానవజన్మము
ఎంత
పవిత్రమైన
ఫలితముగా
మనకు
లభిస్తున్నాది.
అట్టి
పవిత్రమైన
ఈ
జన్మమును
మనము
అర్ధము
చేసుకొనక
కేవలము
పశు
పక్షి
మృగాదులవలె
వ్యర్థము
గావించు
కోటానికి
మనము
యేమాత్రము
అంగీకరించకూడదు.
కనుక
దివ్యత్వమైన
ఆత్మ
ప్రతి
వ్యక్తియందు
కూడను
ఆధారభూతమై,
ఏకస్వరూపమై
తాను
సంచరిస్తున్నాదనే
సత్యాన్ని
మనము
గుర్తించుకున్నప్పుడు
మానవజన్మ
యొక్క
విలువ
యీ
అజ్ఞానము
యొక్క
అలక్ష్యము
మనము
కొంతవరకు
అనుభవించి
మనము
దివ్యమార్గములో
ప్రవేశించటానికి
కొంత
ఉత్సాహమునందిస్తుంది.
ఇది
అవును
అని
నిర్ణయించటముగాని
యిది
కాదు
అని
తేల్చటం
గాని
యిది
ద్వైతము
యొక్క
లక్షణాలే,
అద్వైతములో
యిట్టివి
చేరటానికి
యేమాత్రము
వీలుండదు.
కానిదిదియని
చెప్పంగ
గలరు
గాని
బ్రహ్మమిదియని
చెప్పంగ
వశము
కాదు
నిత్యసత్యమనంతంబు
జ్ఞానమొకటె
అదియె
బ్రహ్మంబు
వాక్కునకలవి
కాదు.
అన్నారు.
ఒక్క
బ్రహ్మయే
సర్వస్వరూపములందు
ఒక్క
ఆత్మ
స్వరూపములో
ప్రకాశిస్తున్నాడనే
సత్యాన్ని
మనము
యీనాడు
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
అట్టి
సత్యాన్ని
గుర్తించినప్పుడే
విష్ణుత్వాన్ని
కూడను
మనము
పొందగలము.
కనుక,
ఇట్టి
విష్ణుత్వము
మనకు
ప్రాప్తించాలంటే
సమత్వమును
అర్థము
చేసుకోవాలనే
యీ
భజగోవిందము
యొక్క
శ్లోకములో
శంకర
భగవత్పాదుల
వారు
చక్కని
ఉదాహరణముగా
లోకానికి
అందించారు.
Previous
←
Satsaṅga
Next
The Ātma Is True, the Body Is Transient
→