Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Service to Man Is Itself Service to Mādhava
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Service to Man Is Itself Service to Mādhava
27 May 1973, Summer Course, Brindavan
Morning
Evening
1
▾
Meaning
Keep
న
తపాంసి
న
తీర్థానాం
న
శాస్త్రాణ
జపానహీ
సంసార
సాగరోత్థారే
సజ్జనం
సేవనం
వినా
పవిత్రాత్మ
స్వరూపులైన
విద్యార్థులారా!
ఈనాడు
భారతదేశమున
కొంగ్రొత్త
ఆధ్యాత్మిక
మార్గము
అవలంబించి,
మానవత్వాన్ని
నూతనపద్ధతి
యందు
అభివృద్ధి
పరచే
నిమిత్తమై
ప్రజలు,
ప్రభుత్వము
అర్థము
కానటువంటి
మార్గములు
అవలంబించి,
వాటినే
ప్రజలకు
అందించటానికి
పూనుకోవటంలో
ఒకవిధమైన
హాస్యాస్పదముగా
కనిపిస్తున్నాది.
భారతీయ
సంస్కృతిని
గర్హించి,
అందమైన
దుస్తులతో
ఆకర్షణీయమైన
మాటలతో
కేవలము
ఆత్మవిశ్వాస
రహితులై,
నాస్తిక
భావముతో
ఉఱ్ఱూతలూగింప
చేయటానికి
పూనుకున్న
నవనాగరికత
ప్రభావాన్ని
వెదజల్లే
వ్యక్తుల
స్వభావములు
అరువు
తెచ్చుకున్న
స్వభావములు,
అద్దెకు
తెచ్చుకున్న
భావములు,
మానసిక
తత్త్వములతో
పోల్చుకొని
కేవలము
ఒక
కృత్రిమమైన
జీవితముగా
తయారుచేసే
పరిస్థితికి
పూనుకోవటంలో
యీనాడు
ఆధునిక
జీవులయొక్క
కళలుగా
బయలుదేరినవి.
అధికార
వాంఛలకే
యీ
వ్యక్తులు
ఉఱ్ఱూతలూగు
చున్నారుగాని
బాధ్యతలు
నిర్వర్తించే
కర్తవ్యమునకు
వారు
ఏమాత్రము
పూనుకోటం
లేదు.
కర్తవ్యమును
అర్థము
చేసుకున్న
వ్యక్తికి
అధికార
స్థానము
సులభంగా
లభిస్తుంది.
కర్తవ్యమును
అర్థము
చేసుకొనక
కేవలము
అధికారమే
తాను
ఆశించే
వ్యక్తికి,
ఏమాత్రము
ప్రకృతి
యొక్క
తత్వము
అర్థము
కాదు.
బాధ్యతాయుతమైన
చిత్తము
మనిషికి
అవసరము.
సమాజ
సేవ
ద్వారా
సార్థకత
వ్యక్తులయొక్క
హృదయమును
సంస్కరింప
చేయటానికి
సేవ,
సద్గుణములు
ప్రధానమైనవి.
ఈ
సేవాభావము,
మానవుని
నుండి
అహంకారము
దూరము
చేసి
ప్రేమతత్త్వాన్ని
అభివృద్ధిపరచి
జీవుని
దేవుని
కడకు
చేర్చే
ప్రయత్నమునకు
పూనుకుంటుంది.
ఈ
సేవాభావము
మానవునికి
ప్రధానమైన
సద్గుణముగా
రూపొందుతుంది.
ఈ
సేవాతత్త్వము
దైవత్వాన్ని
కూడను
అర్థము
చేయిస్తుంది.
సేవ
యావత్
మానవులను
ఏకీభవించే
ఆనందాన్ని
అందిస్తుంది.
2
▾
Meaning
Keep
ఇది
ఆధ్యాత్మికములో
ప్రథమపాదము.
అట్టి
పవిత్రమైన
సేవను
యీనాడు
పవిత్రమైన
మార్గమునందు
ప్రవేశపెట్టక,
సేవాతత్త్వమును
అర్థము
చేసుకొనక
సేవ
సలిపే
వ్యక్తులు
వుండుట
చేత
భారతదేశ
ప్రజలు
వేరేవారి
మీద
ఆధారపడుతున్నారు.
సేవకులకు
దేశమంతయు
వశమైపోతుంది.
నాయకులకు
దేశము
వశము
కాదు.
దేశము
విరుద్ధమైన
రూపము
ధరించి
నాయకత్వాన్ని
దింపే
ప్రయత్నమునకు
పూనుకుంటుంది.
సేవా
విషయము
తెలిసినవాడు
నాయకుడుగా
తయారైనప్పుడు
నాయకత్వము
సేవతత్త్వములోనే
అనుభవించటానికి
పూనుకుంటాడు.
సేవకుడు
కాక
నాయకుడు,
కింకరుడు
కాక
శంకరుడు
కావటానికి
వీలులేదు.
మానవుడు
సమాజములో
పుట్టి,
సమాజములో
పెరిగి
సమాజ
సేవతోనే
తాను
అభివృద్ధి
నొందుతున్నాడు,
అట్టి
స్థితిలో
సమాజము
యొక్క
సేవను
మనము
దూరము
చేసుకున్న
మన
జీవితమునే
దూరము
చేసుకున్నవారమవుతాము.
పుట్టిన
తక్షణమే
తల్లి
పాలనిమిత్తమై
బిడ్డడు
ఏడుస్తుంటాడు.
ఏ
తల్లిపాలు
లేకపోయినప్పుడు
బిడ్డ
నశించగలడో
అట్టి
తన
జీవితమునకు
ఆధారమైన
తల్లిని
సేవించి
తండ్రిని
పూజించి
లోకమును
విశ్వసించటము
చేతనే
తనయొక్క
జీవితము
ఒక
నాయకత్వమును
వహిస్తున్నది.
ఒక్కొక్క
వ్యక్తి
ఒక్కొక్క
తల్లి
ఉండినప్పుడు
భారతీయులంతా
దైవత్వమైన
మాతృదేవిని
పూజించి,
దేశమాతను
మనము
గౌరవించి
కొన్ని
రకములైన
సేవలను
గావించి
తద్వారా
మన
జీవితమును
సార్థకము
గావించుకోటానికి
ప్రయత్నం
సల్పాలి.
పవిత్రమైన
భారతదేశమందు
అనాదికాలమునుంచి
కూడను
ఋషికుల
ఆశ్రమమునందు,
గురుకుల
ఆశ్రమమునందు
ఇట్టి
సేవా
భావములను
అందించి
మహనీయులు
అనేకరకములుగా
దేశము
సంస్కరింపచేయటానికి
పూనుకున్నారు.
గురుకుల
ఆశ్రమములన్నియు
కూడను
కేవలము
హితోపదేశము
జరిపి
మానవులయందు
ఉత్తమమైన
భావములు
అభివృద్దిపరచి
ఒక
పవిత్రమైన
మానవునిగా
తీర్చిదిద్దారు.
గురుకుల
ఆశ్రమములు
హితోపదేశమును
మాత్రమే
సల్పినారు.
కాని
ఋషికుల
ఆశ్రమములంతా
ఈ
హితమును
బోధించిన
వానిని
లోకహితమైన
కర్మలు
ఆచరించే
మార్గములు
చూపించారు.
ఒకటి
ప్రబోద,
రెండవది
ఆచరణ.
అయితే
ఈనాడు
అట్టి
గురుకుల
ఆశ్రమములుగాని,
ఋషికుల
ఆశ్రమములుగాని
ఉన్నవాయని
మనము
విచారణ
చేస్తే
కనిపించటం
లేదు.
గురుకులములో
ఉన్న
పేరుకు
మొదటి
అక్షరము
గుకారము.
ఋషికులములో
నున్న
పేరుకు
మొదటి
అక్షరము
ఋ.
ఈ
రెండు
కూడను
గురుత్వాన్ని
అందించినటువంటివే.
3
▾
Meaning
Keep
ఋషులనగా
తమ
దేహమునందు
ఏమాత్రము
భ్రాంతులు
లేక
సహజమైన
ఆత్మభావమును
తాము
ప్రదర్శించి
త్యాగమును,
సౌశీల్యమును,
సౌజన్యమును
ప్రశాంతమైన
భావముతో
ప్రజలకు
ఒక
ఆదర్శప్రాయులుగా
నిలిచారు.
అందువలననే
వారు
నివసించే
ఆశ్రమములకు
ఋషికుల్
అన్నారు.
ఈనాడు
అట్టి
పవిత్రమైన
గుణములు
మానవునియందు
ఏమాత్రము
కనిపించక
అహంకారము,
ఆడంబరము,
అవినయము,
అసత్యము
యిలాంటి
అపవిత్రమైన
గుణములు
ప్రవేశించటంచేత
గుకారము
అనేది
వెనుకకు
వెళ్లింది.
ఋషికుల్లో
ఋకారము
పోయినప్పుడు
షికుల్గా
తయారయింది.
షికుల్
అనేదే
ఇస్కూలు,
స్కూలు
అనే
రీతిగా
అయింది.
అనగా
ఈనాడు
స్కూల్సు
అపవిత్రమైన
గుణములతో
చేరటంచేత
ఋకారము
అంతర్థానమై
కేవలము
షికుల్
అనేది
మాత్రమే
నిల్చిపోయింది.
కనుక,
మనము
ఈనాడు
ఆ
ఋకారమును
ఏరీతిగానైనా
సంపాదించి
మనము
ఆ
ప్రథమమైన
అక్షరమును
ప్రణవ
స్వరూపకంగా
భావించి,
దానిని
సంపాదించి
తిరిగి
భారతదేశమునకు
అట్టి
పవిత్రమైన
గుణములను
ప్రకటింప
చేయటానికి
పూనుకోటం
మీ
యొక్క
కర్తవ్యముగా
ఉంటున్నది.
మనము
సేవ
అనుకున్నప్పుడు
చిన్నతనంగాను,
సర్వెంటుగాను
హీనమైన
పని
మనం
చేస్తున్నట్లుగా
భావించుకొని
మనము
అభిమానముతో
వెనుకంజ
వేస్తున్నాము.
ఈవిధమైన
భావములు
ఈ
సేవాతత్త్వములో
రావటానికి
ఏమాత్రము
వీలుండదు.
ఇది
కేవలము
స్వల్పమైనదిగను,
అల్పమైనదిగను
మనము
భావించుకున్నట్లయితే,
భగవంతుడే
లోకమునకు
సేవచేయు
నిమిత్తమై
తాను
నరాకారమును
ధరించి
లోకమున
ధర్మ
స్థాపన
నిమిత్తమై
సమాజము
యొక్క
సేవను
చేయుటకు
కంకణము
కట్టుకొన్న
అవతారతత్త్వమును
మన
భారతదేశమందు
స్పష్టమవుతున్నది.
కృష్ణుడి
సేవ
అందరికీ
ఆదర్శం
సర్వవ్యాపకుడు,
సర్వజ్ఞుడు,
సర్వశక్తిమయుడైన
కృష్ణుడు
కూడను
తన
స్నేహితుడైన
అర్జునకు
డ్రైవరుగా
నిల్చి
సేవ
చేశాడు.
ఇంతేకాదు,
యుద్ధమైన
తదుపరి
సాయంకాల
సమయములో
గుఱ్ఱములను
కాలువకు
తీసుకువెళ్లి
వాటికి
తగిలిన
దెబ్బలను
చక్కగా
కడిగి
వాటికి
తగినమందులు
వేసి
ఆ
గుఱ్ఱములయొక్క
బాధను
నివారణ
చేయుటకు
పూనుకున్న
క్లీనరుగా
తాను
తయారయ్యాడు.
ఆ
సమయమునందు
వ్యాసులవారు
దర్శించి
ఆహా
సనక
సనత్కుమారులకు
కూడా
అబ్బనటువంటి
ప్రాప్తి,
ఈ
గుఱ్ఱములకు
అబ్బినదికదాయని
ఆనందభాష్పములు
రాల్చినాడు.
4
▾
Meaning
Keep
ఇంతేకాదు
రాజసూయయాగము
జరిగే
సమయములో
హస్తినాపురములో
ప్రవేశించి
ధర్మజుని
దగ్గరకు
వెళ్లి
‘ధర్మజా!
ఈ
మహాయాగమందు
నాకేమైనా
సేవ
అందించమని’
అడిగాడు
కృష్ణుడు.
అప్పుడు
ధర్మజుడు,
‘తమరు
చేయునట్టి
పని
యిక్కడ
యేమాత్రము
లేదే.
తమరు
ఏమి
చేయగలరో
చెప్పితే
తప్పక
దానిని
అందిస్తాను’
అన్నాడు.
కృష్ణుడు
అప్పుడు
దగ్గరకు
వెళ్లి
ధర్మజుని
వీపు
నిమిరి
‘బావా!
నా
డిగ్రీ
నీకేమి
తెలియదా!
నేను
ఎం.ఏ
ప్యాస్
చేశాను.
కనుక
దీనికి
తగిన
పని
యిచ్చిన
తప్పక
చేస్తాను’
అన్నాడు.
ఆనాడు
ఎం.ఏ
అనేది
ధర్మజునికి
యేమాత్రము
తెలియదు.
ఆనాడు
యిట్టి
కళాశాలలు
లేవు.
ధర్మజుడు
ఉబ్బితబ్బిబై
‘స్వామీ!
ఎం.ఏ
అంటే
దాని
విలువ
యేమిటో
చెప్పగలరా!
అప్పుడు
దానికి
తగినది
అందిస్తాను.
నాకు
అర్ధము
కావటము
లేదు’
అన్నాడు.
ఎం-ఎంగిలి
ఆకులు,
ఎ-ఎత్తివేయటము.
ఎంగిలాకులు
ఎత్తివేయటమే
నా
ఎం.ఎ.
డిగ్రీ
విలువ
అన్నాడు.
అనగా
తనకు
భుజించిన
ఆకులను,
అక్కడ
ఒకవిధంగా
అసహ్యంగా
కనిపించటం
చేత
మానవులకు
కొంత
ఉల్లాసము
తగ్గిపోతుంది
కనుక
వారికి
ఉల్లాసమందించే
నిమిత్తమై
నిరుపయోగమైనటువంటివాటిని
తీసి,
వారి
చిత్తమును
ఆనందము
లోపల
ఓలలాడించే
నిమిత్తమై
ఇట్టి
ప్రయత్నమునకు
పూనుకున్నాడు
కృష్ణుడు.
కనుక
మానవునికి
పరిశుద్ధమైన
ప్రదేశము
ఒక
ఆకర్షణీయముగా
ఉంటుంటాది.
మానవునియందు
పరిశుద్ధమైన
చిత్తము,
భగవంతునికి
ఆకర్షణీయంగా
ఉంటుంది.
బహిర్
శౌచము,
అంతర్
శౌచము,
ఈ
బహిర్
శౌచము
అనేది
మనము
అలవర్చుకున్నప్పుడు,
అంతర్శౌచము
అభివృద్ధి
పరచుకోటానికి
పూనుకుంటాము.
ఇంతేకాదు,
మన
పరిసర
ప్రాంతములను
పరిశుద్ధ
పరచుకోటమే
కాకుండా
పరిసరములందున్న
వ్యక్తుల
చిత్తములు
కూడను
ఆనంద
వంతమైన
పరిస్థితికి
చేరుకొనటానికి
మనము
కొంతసేవలు
సలపాలి.
ఇతరులకు
ఏదైనా
బాధలు
కలిగినప్పుడు,
అనారోగ్యము
కల్గినప్పుడు,
అనానుకూలములు
సంభవించినప్పుడు
వాటిని
సాధ్యమైనంతవరకు
కూడను
మనసేవతో
చల్లార్చటానికి
పూనుకోవాలి.
ఇది
కేవలం
ఒక
పని
వలననే
కాదు,
పలుకు
వల్లను
సేవను
సలపటానికి
వీలవుతుంది.
మంచి
మాటచేత
వారి
హృదయాన్ని
శాంతపరచవచ్చును.
మంచి
పలుకుచేత
సంతోషపరచవచ్చును.
మంచి
విషయాలచేత
వారి
బాధలను
మరపింప
చేయవచ్చును.
మంచి
మాటలు
కూడా
ఒక
సేవవంటిది.
నాయకులైన
వారు
నేడు
పూనుకోకపోవటంచేత
మన
ప్రపంచము
కొన్ని
అవస్థలచేత
అయోమయం
పాలైపోతున్నది.
5
▾
Meaning
Keep
ఇందులో
ఒక
సన్నివేశము
కృష్ణావతారమందు
తెలుపుతాను.
ఒకానొక
దినము
కృష్ణుడు
యశోద
చెంతకు
వచ్చి
‘అమ్మా!
నేను
ఈనాడు
గోవులు
వెంట
పోతున్నాను.
నా
స్నేహితులంతా
అతి
ఉల్లాసముగా
నన్ను
రమ్మని
పిలుస్తున్నారు.
నేను
కూడా
నా
స్నేహితులతో
చేరి
గోవుల
కావలికి
పోతున్నాను’
అని
ప్రార్థించాడు.
తల్లి
కుమారుని
దగ్గరకు
చేర్చుకుని
‘నాయనా!
అడవులంటే
ముండ్లతో,
పాములతో,
పురుగులతో,
పొదలతో
కూడి
వుంటుది
నాన్నా.
అలాంటి
అడవిలో
నీవు
ప్రవేశించాలంటే
నీవు
చెప్పులు
వేసుకోవాలి.
ఈనాడు
నేను
చెప్పులు
కుట్టించటానికి
పూనుకోలేదు.
ఇంకా
రెండు
మూడు
దినములైన
తరువాత
చక్కని
చెప్పులు
నీ
పాదములకు
తొడిగి
గోవుల
వెంట
పంపిస్తాను
గోపాలా!
ఈనాడు
నీవు
మానుకో
అమ్మా!’
అని
అడిగింది.
తక్షణమే
కృష్ణుడు
‘నా
పేరు
ఏమన్నావు’
అడిగాడు.
యశోద
‘నాయనా!
నీ
పేరు
గోపాల
కదా’
అనింది.
గోవులను
పాలించేవాడను
కనుకనే
నన్ను
గోపాలుడు
అన్నారు.
పాలించేవాడు
లీడరుకదా!
నేను
పాలించే
గోవులు
నన్ను
అనుసరిస్తున్నాయి.
కనుక,
లీడరుగా
వున్న
నేను
ఏమార్గము
అవలంబిస్తానో
నన్ను
అనుసరించే
వారు
అదే
మార్గమును
అనుసరిస్తారు.
కనుక
నన్ను
అనుసరించే
గోవుల
పాదములకు
రక్షలు
లేవు
కనుక
నేను
కూడను
రక్షలు
లేకుండా
వెళ్లాలి,
అమ్మా!
అన్నాడు.
నేను
చెప్పులు
వేసుకొని
ముందు
నడుస్తే
గోవులు
కూడను
చెప్పులు
వేసుకోటానికి
కాలయాపన
చేస్తాయి.
కనుక
అట్టి
leadership
లో
యేమాత్రము
ప్రవేశించను.
నాకు
చెప్పులు
అక్కర
లేదు.
నేను
ఇదేరీతిగా
నా
పరిపాలనలో
గోవులు
జీవించినట్లుగా
కూడను
నేను
జీవించితే
నా
leadership
కి
తగిన
గౌరవము
సంపాయించుకోగలను’
అని
తల్లి
దగ్గర
వాదించాడు.
అనగా
దైవము
మానవులను
అనుసరించి
చేయటానికై
తాను
కూడను
మానవస్థాయిలో
దిగి
ఆ
మార్గమునే
అవలంబించటం
చేత
మానవులు
ఆ
దైవత్వాన్ని
కొంతవరకు
పొంది
ఆనాటి
గోపికలు,
గోపాలురు
వారి
జన్మలు
సార్థకము
చేసుకున్నారు.
ఈనాడు
కూడను
దైవ
నిర్ణయములను,
చిత్తములో
హత్తుకున్నట్లుగా
చేసుకొని,
ఆ
దైవ
నిర్ణయములనే
మనము
అనుసరించటానికి
పూనుకున్నప్పుడు
మనయొక్క
అనుచరులకు
భవిష్యత్తులో
నాయకత్వమును
పొందటానికి
అవకాశము
కల్గిస్తుంది.
మనయొక్క
గృహములో
కొన్ని
మొక్కలను
నాటి,
వాటికి
నీరుపోసి
చక్కగా
పోషించుకునే
నిమిత్తమే
మనము
పరిశుద్ధము
చేయటానికి
పూనుకున్నప్పుడు,
ఎవరో
ఒకరు
వచ్చి
చిన్న
సర్వెంటు
చేసేపని
చేస్తున్నాడేయని
భావించుకోవచ్చునోయేమోనని
అభిమానముతో
మన
యింటి
పనులు
కూడను
ఈనాడు
మానుకుంటున్నాము.
6
▾
Meaning
Keep
కీర్తి,
అపకీర్తులకు
మన
జీవితము
నాశనము
చేసుకోకూడదు.
మనయొక్క
ఆనందము
నిమిత్తమై,
మన
గృహమును
నిలబెట్టుకునే
నిమిత్తమై,
మన
గృహమును
పరిశుద్ధపరచుకునే
నిమిత్తమై
మనము
నడుముకట్టుకొని
పనిలో
దిగటములో
యేమాత్రము
కూడను
అభిమానమునకు
లొంగకూడదు.
మన
గుణసహితమైన
స్వభావమును
మనము
ప్రకటించడానికిగాని,
ప్రచరించడానికిగాని,
ప్రబోధించడానికి
గాని
సంసిద్ధులమై
ఉండాలి.
గౌరవములు,
అగౌరవములు
అర్థము
లేని
పదములు.
ఒక
చిన్న
కథ.
ఒక
గ్రామములోపల
యిద్దరు
వ్యక్తులుండేవారు.
ఒక
వ్యక్తి
ఎక్కడ
ప్రయాణము
చేసినప్పటికిని
తాను
ఒక
గుఱ్ఱమునెక్కి
బయలుదేరేవాడు.
మరొకవ్యక్తి
ఏ
గ్రామమునకు
బయలుదేరినాగానీ
ఒక
పిల్లోను
దగ్గర
పెట్టుకొని
వెళ్ళేవాడు.
ఒక
దినము
ఇరువురు
ఒకే
గ్రామము
వెళ్లవలసివచ్చింది.
అప్పుడు
పిల్లోను
తీసుకుని
బయలుదేరేవాడు
నడుస్తూ
వెళ్లాడు.
వెనుక
గుఱ్ఱమునెక్కి
మరొక
వ్యక్తి
అదే
గ్రామమునకు
బయలుదేరి
వెళ్లాడు.
మార్గమధ్యములో
ఒక
పల్లె
వచ్చింది.
ఆ
పల్లె
ప్రజలు
భావించారుట,
ఈ
పిల్లో
తీసుకొని
పోయే
వ్యక్తి
చేతిలో
ఒక
రికార్డ్
bag
గా
వుంటుంటాది
కనుక
ఇతను
ఫ్యూన్,
గుఱ్ఱము
ఎక్కి
వెళ్లేవారు
తహసీల్దారు
అనుకున్నారుట.
పాతకాలములో
కార్లు,
బస్సులు,
మోటారుసైకిళ్లు
లేవు
కనుక
గుఱ్ఱముపైనే
ప్రయాణము
సల్పేవారు
కలక్టర్లు,
తహసీల్దార్లు.
అందువల్ల
ఆ
గ్రామమువారు
ఈవిధంగా
భావించుకున్నారు.
తిరిగి
తాము
చేరవలసిన
గ్రామము
చేరిన
తరువాత
ఈ
పిల్లో
తీసుకొని
పోయిన
వ్యక్తి
ఒక
సత్రములో
స్థంభమునకు
పిల్లో
వేసుకుని
జంభంగా
కూర్చున్నాడు.
గుఱ్ఱమును
ఎక్కి
వెళ్లినవాడు
గుఱ్ఱమును
ఎక్కడ
కట్టాలి
అని
వెతుకుతూ
వస్తున్నాడు.
ఆ
గ్రామస్తులు
‘ఈ
గుఱ్ఱమును
కట్టటానికి
వెతికేవాడు
ప్యూన్,
పిల్లో
వేసుకొని
కూర్చున్నవాడు
తహసీల్దారుగా
ఉండవచ్చును’
అనుకున్నారు.
ప్రపంచము
యొక్క
గౌరవ
అగౌరవములు
ఈ
రీతిగా
ఉంటాయి.
ప్యూన్
అనుకున్నవాడిని
తహసీల్దారు
అనుకున్నారు.
ఒక
గ్రామములో
తహసీల్దారు
ఆఫీసరు
అనుకున్నవారిని
మరొక
గ్రామములో
ప్యూన్
అనుకున్నారు.
ఇది
కేవలము
దృశ్య
కల్పితములైన
గౌరవములేగాని
దానివల్ల
యితనికి
గౌరవము
పోలేదు,
ఈ
పలుకువల్ల
యితనికి
గౌరవము
రాలేదు.
ఒక
చక్రవర్తికి
స్వప్నమునందు
బిక్షగాడైనట్టు
కల
రావచ్చు.
7
▾
Meaning
Keep
కాని
ఇంకొక
భిక్షగానికి
తాను
చక్రవర్తి
అయినట్టుగా
తనకు
స్వప్నములో
అనుభవము
కలుగవచ్చును.
కాని
లేచిన
తక్షణమే
ఎవరి
స్థితి
వారికున్నది
గాని
చక్రవర్తి
స్థితి
బెగ్గరుకు
లేదు.
చక్రవర్తికి
బెగ్గరు
స్థానము
లేదు.
కనుక,
యధాస్థితిలోపల
ఇరువురికి
వున్న
గౌరవములు
వున్నవి
గాని
ఈ
స్వప్న
దృశ్యముల
గౌరవ
అగౌరవములు
కేవలము
passing
clouds
గా
వుంటాయి.
అట్టివాటికి
మనము
యేమాత్రము
హృదయమునందించక,
మన
స్వగృహమునందు
ఆత్మతృప్తి
నిమిత్తమై
మన
స్వజనులకు
మనము
సేవ
చేసే
పరిస్థితిలోపల
దేనినైనా
త్యాగము
చేయటానికి
మనము
సంసిద్ధులుగా
వుంటుండాలి.
ప్రతిచర్య,
ప్రతిధ్వని,
ప్రతిబింబము
దివ్యాత్మస్వరూపులైన
విద్యార్థులారా!
మీరు
సేవలు
చేయుటకై
సిద్ధపడాలి
గాని
సేవలు
చేయించుకోటానికై
మీరు
పూనుకోకూడదు.
శారీరక,
మానసిక,
ఆధ్యాత్మిక
బలములు
మూడు
మీ
యందు
అతి
తృప్తిగా
ఉండటం
చేత
మీరు
ఇతరులకు
సేవచేయటానికి
తగిన
వయస్సులో
ఉంటున్నారు.
కనుక,
మీరు
ఇతరులకు,
వయస్సు
అయినవారికి,
బలహీనులకు,
దుర్బలులకు,
దీనులకు,
ఇలాంటి
వారికి
మీరు
సేవచేయటంలోపల
మీ
జీవితాన్ని
భగవత్సేవగా
మీరు
విశ్వసించి
మీరు
అట్టి
సేవలో
పాల్గొనుటకు
సంసిద్ధులు
కావాలి.
మీరు
యితరుల
దగ్గర
సేవ
చేయించుకొంటిరా
మీరు
కేవలము
ఒక
విధమైన
జీవితమును
అంధకారమైన
మార్గములో
ప్రవేశింప
చేసుకున్నవారైపోతారు.
అనేకమంది
ధనవంతులయొక్క
గృహముల
లోపల
ఇతరులతో
సేవలు
చేయించుకోటానికి
ప్రయత్నం
చేస్తుంటారు.
ఇది
సరియైనది
కాదు.
ఏదో
ఈనాడు,
ఈ
యొక్క
స్థితిలో
ఇతరులతో
సేవలు
చేయించు
కోవటము,
అధికార
స్థానముగా
మనము
భావించినప్పటికిని
తిరిగి
తత్ఫలితము
అనే
దీనిలోపల
మనము
ఇతరులకు
సేవలు
చేయవలసిన
పరిస్థితి
ఏర్పడుతుంది.
కనుక
మనము
ఏమిచేసినా,
ఏమి
చూచినా,
ఏమి
చెప్పినా
reaction,
resound
and
reflection
అది
రాక
తప్పదు.
కనుక
మన
పనిని
మనము
చేసుకునే
దీనిలోపల
మొట్టమొదట
సరైన
తర్ఫీదు
జరగాలి.
తదుపరి
మన
గృహములో
తల్లిదండ్రులకు
సేవచేయటానికి
పూనుకోవాలి.
తదుపరి
మనము
ఈ
సమాజములో
ప్రవేశించి,
సమాజమునకు
సేవ
చేయుటకు
సంసిద్ధులు
కావాలి.
ఇది
కేవలము
హృదయ
పూర్వకమైన
భావముతో
త్యాగబుద్ధితో,
ప్రేమభావములో
మనము
ఈ
సేవలో
పాల్గొనాలి.
8
▾
Meaning
Keep
ఫలనిమిత్తమై
మనము
సేవచేయటానికి
పూనుకోకూడదు.
ప్రేమ
నిమిత్తమై,
సర్వులయొక్క
ఏకత్వము
అనుభవించే
నిమిత్తమై
మనము
సేవ
చేయటానికి
పూనుకోవాలి.
ఒక
చిన్న
ఉదాహరణ.
ఒక
ఆసుపత్రిలో,
ఎవ్వరూ
దిక్కులేని
వాడుగా
వుంటున్నప్పుడు
అతనిని
ఆసుపత్రిలో
వేసి
ఉంటారు.
అనేక
రకములైన
బాధలతో
తాను
కుములుతుంటాడు.
మీరు
ఆసుపత్రికి
వెళ్లి
అతని
దగ్గర
చక్కనిమాటలు
మాట్లాడి
‘అయ్యా!
నీవు
ఏడవవద్దు.
నీకు
ఏమి
కావాలి?
అని
మంచి
మాటలతో
అతనికి
సేవ
చేయటానికి
పూనుకున్నావంటే
అతనికి
నీకు
ఎంత
సన్నిహితమైన
సంబంధము
ఏర్పడిపోయింది.
బంధువులనుకూడ
మరచి,
‘అయ్యో
ఎవరో
ఇతను,
ఒక
విద్యార్థి,
సమ్మర్క్లాసుకు
వచ్చాడట.
ఆసుపత్రికి
వచ్చి
నాకు
సేవ
చేశాడు’
అని
నీవు
వెళ్లే
సమయంలో
‘నాయనా!
నీ
అడ్రస్సు
ఏమిటి?’
అని
అడ్రస్సు
తీసుకొని
తిరిగి
నీకు
లెటర్సు
వ్రాసి
మీ
ఇరువురికి
సంబంధము
ఏర్పరచుకోటానికి
తగిన
ప్రయత్నము
చేస్తాడు.
ఈ
సంబంధము
ఏ
రీతిగా
ఏర్పడింది?
ఒక
సేవ
ద్వారా
ఏర్పడింది.
మానవులయొక్క
హృదయ
సంబంధ
మనేది
సేవాభావముతో
ఏర్పడుతుంది
గాని
నాయక
భావముతో
ఏర్పడదు.
ఈనాడు
ఎవరో
ఒకరు
ప్రైమినిస్టరుగా
వుంటున్నారంటే,
ప్రైమినిష్టరు
ఒక
గ్రామానికి
వస్తే
స్టేషనుకు
వెడతారు,
నూరు
దండలు
వేస్తారు.
నూరు
కార్లు
తీసుకువెళ్లి
మా
కారులో
కూర్చోండి,
మా
కారులో
కూర్చోండని
అంటారు.
అదే
ప్రైమినిష్టరు
పదవి
వదలిపెడితే
రిక్షావాడు
కూడా
ఛార్జీ
అడుగుతాడు.
అధికారము
యొక్క
గౌరవము
అప్పటికప్పుడే
ఉంటుంది.
హృదయ
ప్రేమయొక్క
గౌరవము
జీవిత
పర్యంతము
సన్నిహితమైన
సంబంధమును
చేరుస్తున్నాది.
కనుక,
మనము
అధికార
సంబంధమైన
దాంట్లో
relationship
పెంచుకోటానికి
పూనుకోవటం
కేవలము
ఒక్క
మూఢత్వమే.
ఆత్మ
సంబంధమైన
ప్రేమతత్త్వముతో
మనయొక్క
సంబంధం
పెంచుకోవాలనుకున్నప్పుడు
మనము
సేవావృత్తియందే
సరియైన
భద్రత
కుదురుతుంది.
అదియే
సరియైన
భక్తిగా
రూపొందుతుంది.
పవిత్రమైన
భావములతో
మనము
సేవలుచేసి
మనయొక్క
గౌరవము,
అగౌరవములందు
ఏమాత్రము
అభిమానమును
ఉంచుకొనక,
హృదయపూర్వకమైన
భావముతో
నా
యీ
సేవవల్ల
ఈ
వ్యక్తికి
యీ
ఫలితము
లభిస్తుంది
అనే
భావము
నీలో
చేరినప్పుడు
తప్పక
నీవు
ఎవరిని
లెక్కచేయకుండా
నీ
ఇంటిదగ్గర
పెద్దలు
వలదన్నప్పటికిని
నీవు
ఆ
సేవలో
పాల్గొని
తప్పక
వారిని
ఆనందపెట్టటానికి
ఆ
సేవలో
పాల్గొంటావు.
9
▾
Meaning
Keep
కానీ
ఈనాడు
దురదృష్టవశాత్తు
అన్ని
దేశములందు
social
work,
social
work
అంటున్నారు
గాని
ఇది
కేవలము
show
work
గా
ఉంటున్నాది.
ఏదో
ఒక
పెద్ద
పెద్ద
leaders
అంతా
ఈనాడు
బజార్లు
ఊడ్చినారు,
సోషల్వర్కులో
పాల్గొన్నారు
అని
ఒక
పరక
పట్టుకొని
బజార్లో
ఫొటోగ్రాఫర్
తీసుకో
అని
పట్టుకోటం,
ఈ
పట్టుకొన్న
ఫొటోని
పేపర్లో
వేసుకోవటం
ఆవిధమైన
దీనిలో
మనము
పోకూడదు.
ఒకరి
ఫొటోగా
పేపర్లో
పడాలనే
దురభిమానం
మనలో
యేమాత్రము
ఉండకూడదు.
హృదయ
పూర్వకమైన
తృప్తితో
మనము
చేయటానికి
పూనుకోవాలి.
ఒకరి
తృప్తినిమిత్తమై
మనము
సేవ
సల్పకూడదు.
మన
ఆత్మ
తృప్తినిమిత్తమై
మనము
సేవసల్పాలి.
పది
రూపాయలు
ఖర్చు
పెట్టి
పదిమందికి
అన్నము
పెట్టినప్పుడు
ఆ
అన్నము
పెట్టినటువంటి
దృశ్యము
ఫొటోగా
తీసుకొని
పేపరువారికిచ్చిన
20
రూపాయలతో
తిరిగి
20
మందికి
అన్నంపెడితే
ఎంతో
హాయిగా
ఉంటుంది.
10
రూపాయలతో
అన్నం
పెట్టి
20
రూపాయలతో
అడ్వర్టైజ్
చేయించుకుంటారు.
ఇంతేకాదు.
చాలామంది
రోటరీక్లబ్,
లయన్స్‌క్లబ్,
ఇతర
క్లబ్‌ల
వారంత
సేవలు
చేస్తుంటారు.
సేవ
చేస్తున్నారో
డబ్బు
shave
చేస్తున్నారో
అర్థం
కావటం
లేదు.
వీరు
ధనమున్న
వారే
కదా!
ఈ
ధనమున్నవారు
ధనమును
ప్రోగుచేసి
మాసమునకు
ఒక
పర్యాయమో,
వారమునకు
ఒక
పర్యాయమో
దిక్కు
లేనివారికి,
తిండిలేనివారికి
తిండి
పెట్టటానికి
పూనుకోవచ్చు.
అట్లుకాకుండా
ఈ
క్లబ్బులవారంతా
చేరి,
weekly
once
dinner,
ఒకటన్నారు
ఒక్కొక్క
head
కు
20
రూపాయలవుతుంది.
ఎట్లంటే
5
rupees
meal,
5
rupees
mutton,
10
rupees
bottle.
ఈ
Rs.
20
వీరి
పొట్టలో
పోసుకునే
బదులు,
ఈ
20
రూపాయలతో
బీదలకి
అన్నం
పెట్టటానికి
పూనుకుంటే
ఎంత
బాగుంటుంది.
ఇది
సోషల్వర్క్గా
ఈనాడు
తయారైంది.
మీరు
భవిష్యత్తులో
ఇలాంటి
క్లబ్బులలో
మెంబర్సు
అయ్యేటువంటి
వారు
కనుక
మీరు
ఈ
విషయాన్ని
మనసులో
పెట్టుకొని
భవిష్యత్తులో
అయినా
సేవాభావమును
దుర్వినియోగపరచకుండా
సద్వినియోగ
పరచటానికి
మీరు
పూనుకుంటారని
నేను
ఆశిస్తున్నాను.
సేవ
ద్వారా
ఉత్తమ
భవిష్యత్తు
నీకు
నిజమైన
మిత్రులు
ఎవరు
అని
అనుకున్నప్పుడు,
బాధలు
పడేవారు,
నిరాశలో
ఏవిధమైన
ఆధారము
లేని
నిరాధారులు,
యిలాంటి
వారినే
నిజమైన
మిత్రులుగా
భావించి
వారికి
తగిన
help
ను
మీరు
అందించటానికి
పూనుకోటంలో
మీరు
అతిశ్రద్ధను
వహించాలి.
10
▾
Meaning
Keep
ధనమున్న
వారితో
మనం
friendship
చేసుకోవటంవల్ల
మనకు
వచ్చేది
ఏమీ
పెద్దగా
లేదు,
అందరియందు
friendship
ఉండవలసిందే
కాని
ధనము
వున్న
వానితో
నీవు
friendship
చేసుకున్నప్పుడు
ఏదో
ఒక
సమయంలో
నీవు
పదిరూపాయలు
అడగవలసి
వస్తుంది.
అడిగినప్పుడు
నీ
friendship
cut
అయిపోతుంది.
నీకు
ముఖము
చూపించడు.
చూస్తే
అడుగుతాడోయోమోనని
తాను
వేరైపోతాడు.
ఎవ్వరితోనైనా
మనం
మిత్రులు
కావలసిందే
కాని
నిజమైన
మిత్రులు
ఎవరంటే
నీ
సేవను
అందుకోటానికి
ఎవరు
పూనుకుంటారో
వారే
నీ
మిత్రులుగా
భావించుకోవాలి.
నీ
సేవ
నీ
భవిష్యత్తుకు
ఒక
ఉత్తమమైన
స్థితిని
అందిస్తుంది.
నేను
సేవ
చేస్తున్నాను
అనే
అహంకారముతో
కాకుండా,
భగవంతుడు
ఇట్టి
పవిత్రమైన
సేవా
కార్యము
నాకు
అనుగ్రహించాడని
ఆనందముతో
నీవు
సేవ
చేయటానికి
పూనుకో.
ఏది
చేసినా
తనకు
తాను
చేసుకున్నట్లుగా
భావించుకొని
సేవలోపల
మనం
పూనుకోవాలి.
నిజముగా
నీవు
చేసే
సేవంతా
నీ
నిమిత్తమై
నీవు
చేసుకుంటున్నావు
గాని
పరుల
నిమిత్తము
కాదు.
ఒక
చిన్న
ఉదాహరణము.
నీ
ఇంటికి
ఒక
మిత్రుడు
వచ్చాడు.
వచ్చిన
తక్షణమే
‘హలో!
come
on,
come
on
అని
చెప్పి
డ్రాయింగురూములోకి
తీసుకువెళ్లి
ఒక
కప్పుకాఫీ
యిచ్చావు.
కాని
యీ
దృశ్యము
ఆ
వచ్చిన
మిత్రుని
చిత్తములో
హత్తుకుపోతుంది.
తదుపరి
నీవు
అతని
గృహమునకు
ఎప్పుడైనా
వెళ్లినప్పుడు
అతనుకూడా
come
on
అని
పిలిచి
ఆ
కప్పుకాఫీ
నీకు
ఇస్తాడు.
ఆనాడు
నీవు
ఇచ్చిన
కాఫీ
help
కోసం
కాదు.
భవిష్యత్తులో
రిటర్న్
అవుతుంది.
అట్లుకాకుండా
ఎవరైనా
మిత్రుడు
ఏవిధమైన
ఆధారములేక,
ఎవరి
సహాయములేని
స్థితిలోపల
ఆసుపత్రిలో
ప్రవేశించాడనుకో
అప్పుడు
నీవు
వెళ్లి
అనేక
రకములైన
సేవలు
చేసినావంటే
ఏనాడైనా
మనకు
అట్టి
పరిస్థితి
ఏర్పడినప్పుడు
తిరిగి
ఆ
మిత్రుడు
వచ్చి
తప్పక
ఆ
సేవను
అందిస్తుంటాడు.
ఆనాడు
చేసిన
సేవ
మన
నిమిత్తమై
మనము
ఏమాత్రము
ఆశించరాదు.
కనుక,
మనము
ఏమి
చేసినా
మంచి
చేసినా
చెడ్డ
చేసినా
తనకు
తాను
చేసుకున్నట్టుగా
భావించిన
తనకు
తాను
చెడ్డ
చేయటానికి
యేమాత్రము
పూనుకోడు.
ఈనాడు
మన
సమ్మర్క్లాసులో
ప్రతి
ఆదివారము
ఈ
సమాజసేవ
చేయటానికి
మనము
నిర్ణయించుకున్నాం.
ఈ
సమాజసేవ
కేవలము
ఇక్కడున్నంత
కాలము
మాత్రమే
కాకుండా
ఎక్కడికి
వెళ్లినా,
ఏవిధమైన
పరిస్థితులు
వచ్చినా
ఈ
సమాజసేవను
మనము
హృదయపూర్వకంగా
స్వాగతం
చేసి
దానిలో
ప్రవేశించి
సమాజసేవలో
మనయొక్క
కాయమును
పవిత్ర
పరచుకోవాలని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
The Doing of Karma, and Discipline
Next
Mastering the Senses, the End of Sorrow
→